• TFIDB EN
  • యూఐ
    రేటింగ్ లేదు
    No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
    ఆసక్తి ఉంది
    UATelugu
    కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యూఐ'. రీష్మా, సన్నీలియోన్‌, నిధి సుబ్బయ్య, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండస్ట్రియల్‌ లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ క్రియేషన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సినిమాలో 80 శాతం వరకూ గ్రాఫిక్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    తారాగణం
    ఉపేంద్ర
    సన్నీ లియోన్
    మురళీ శర్మ
    చిక్కన్న
    అభిమన్యు సింగ్
    సాధు కోకిల
    ఓం సాయి ప్రకాష్
    అచ్యుత్ కుమార్
    ప్రశాంత్ సంబర్గి
    భీమా
    కాక్రోయిక్ సూది
    గురుప్రసాద్
    పవన్ ఆచార్య
    నీతూ వనజాక్షి
    మురళీ కృష్ణ
    సిబ్బంది
    ఉపేంద్ర
    దర్శకుడు
    జి. మనోహరన్నిర్మాత
    శ్రీకాంత్ కె. పి.నిర్మాత
    బి. అజనీష్ లోక్‌నాథ్
    సంగీతకారుడు
    హెచ్ సి వేణుగోపాల్
    సినిమాటోగ్రాఫర్
    విజయ్ రాజ్ బి. జి.ఎడిటర్ర్
    కథనాలు
    <strong>OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!</strong>
    OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!
    క్రిస్మస్‌ (Christmas 2025)ను పురస్కరించుకొని ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్‌ మూడో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు.. బచ్చల మల్లి (Bachchala Malli) అల్లరి నరేశ్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20న (Bachhala Malli Movie Release Date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. విడుదల పార్ట్‌ 2 (Vidudala Part 2) గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి ఈ వారం థియేటర్లలో సీక్వెల్‌ రాబోతోంది. సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల పార్ట్‌ 2’ (Viduthalai Part 2) డిసెంబర్‌ 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.  సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) కమెడియన్‌ ప్రియదర్శి (Priyadarsi) కథానాయకుడిగా చేసిన ‘సారంగపాణి జాతకం’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్‌ 20 నుంచి థియేటర్లలో ఈ సినిమాను వీక్షింవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూప కొడువాయూర్‌ (Roopa Koduvayur) హీరోయిన్‌గా చేసింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్‌, టీజర్‌ను బట్టి చూస్తే ఫన్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  యూఐ (UI) కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్‌ కేపీ శ్రీకాంత్‌ నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా, సంగీతం పరంగా కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఓటీటీలో విడుదల్లే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు లీలా వినోదం (Leela Vinodam) ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'లీలా వినోదం'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో ఈ వీక్‌ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. డిసెంబర్‌ 19 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనుంది. జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ హీరోలుగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ హీరోయిన్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్‌ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.  Telugu Movies OTT Release Dates 2024 TitleCategoryLanguagePlatformRelease DateZebraMovieTelugu&nbsp;AhaDec 20Leela VinodamSeriesTelugu&nbsp;ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu&nbsp;AmazonDec 13HarikathaSeriesTelugu&nbsp;Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu&nbsp;ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu&nbsp;AhaDec 12Thangalaan&nbsp;MovieTelugu&nbsp;NetflixDec 10 OTT Releases This Week 2024 TitleCategoryLanguagePlatformRelease DateInigmaMovieEnglishNetflixDec 17Love to hate it juliasMovieEnglishNetflixDec 17Stepping StonesDocumentaryEnglishNetflixDec 18The Dragan PrinceSeriesEnglishNetflixDec 18Virgin River 6SeriesEnglishNetflixDec 19The Six Triple EightMovieEnglishNetflixDec 20Yo Yo HoneysinghDocumentaryHindiNetflixDec 21Girls Will Be GirlsMovieHindiAmazonDec 18Beast GamesMovieEnglishAmazonDec 18TwistersMovieEnglishJio CinemaDec 18Moon WalkMovieHindiJio CinemaDec 20TelmaMovieEnglishSonyLIVDec 21
    డిసెంబర్ 16 , 2024
    <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
    టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024
    Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
    Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు డైరెక్టర్: సాయి రాజేశ్ నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) మ్యూజిక్: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటంటే? ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు.&nbsp; తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది.&nbsp; లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; టెక్నికల్‌గా.. తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్ కథనం, డైలాగ్స్ నిర్మాణ విలువలు యూత్ ఎలిమెంట్స్ సంగీతం మైనస్ పాయింట్స్ సాగతీత సన్నివేశాలు క్లైమాక్స్ చివరగా.. యూత్‌ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’ రేటింగ్: 3/5 https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
    జూలై 14 , 2023
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్‌ పరుశురామ్, జెర్సీ డైరెక్టర్‌ గౌతం తిన్ననూరితోనూ విజయ్‌ సినిమాలు చేయనున్నాడు. గౌతం డైరెక్షన్‌లో విజయ్‌ VD12 సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపిస్తాడని టాక్‌. ఇప్పటికీ సినిమా కథను గౌతం తిన్ననూరి&nbsp; చెప్పగా అది రౌడీబాయ్‌కు విపరీతంగా నచ్చేసిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. తమ హీరోను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; 2. నాని హిట్ -3 సినిమాతో నాని (NANI) కూడా మొద‌టిసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో అర్జున్ స‌ర్కార్ అనే పోలీస్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు. హిట్ -2 క్లైమాక్స్‌లో పోలీస్‌గా నాని లుక్ ఎలా ఉండ‌బోతుందో రివీల్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచేశారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. 3. నాగ చైతన్య నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. చై తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఇప్పటినుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.&nbsp; 4. అల్లరి నరేష్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) లేటెస్ట్‌ మూవీ ‘ఉగ్రం’.. ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో నరేష్‌ సీఐగా కనిపించి మెప్పించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా నరేష్‌ కనిపించాడు. యాక్షన్‌ సీన్లలోనూ ఇరగదీయగలనని నిరూపించుకున్నాడు. ఉగ్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం నరేష్ అందుకున్నాడు.&nbsp; 5. కిరణ్‌ అబ్బవరం యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. ఎప్పుడూ ప్రేమికుడిగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే కిరణ్‌ అబ్బవరం మీటర్‌ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఎస్సైగా మెప్పించాడు. ఇందులో కిరణ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మీటర్ స్ట్రీమింగ్ అవుతోంది.&nbsp; 6. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ పోతినేని (Ram pothineni) - కృతి శెట్టి (Krithi Shetty)&nbsp; జంటగా చేసిన చేసిన సినిమా వారియర్‌. ఈ సినిమాలో రామ్‌ తొలిసారి పోలీసు గెటప్‌లో కనిపించాడు. మామూలుగానే యాక్షన్‌ సీన్లలో అదరగొట్టే రామ్‌.. ఒంటిపైన ఖాకీ దుస్తులతో ఈ సినిమాలో మరింత ఇరగతీశాడు. అయితే ఆశించిన రేంజ్‌లో వారియర్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. పోలీసు పాత్రలోనూ మెప్పించగలనని రామ్‌ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.&nbsp; 7. సుధీర్‌ బాబు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన చేసిన రీసెంట్‌ మూవీ ‘హంట్‌’ మిశ్రమ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో సుధీర్‌బాబు కూడా పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. గతంలో ‘V’ సినిమాలోనూ సుధీర్ బాబు పోలీసాఫీసర్‌గా చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ అదరగొట్టాడు. ఇందులో సుధీర్‌బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
    మే 08 , 2023
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?
    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది. &nbsp; ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక.&nbsp; ఓ తెలుపు రంగు డ్రెస్‌లో దానిపై అదే కలర్ జాకెట్‌ వేసుకొని ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ పెట్టి సూపర్‌హాట్‌గా కనిపించింది. పులి చారలుండే బెల్ట్‌ను కూడా పెట్టింది సుందరి.&nbsp; ఏదో సరాదాగా యూట్యూబ్‌లో వీడియో తీసింది నిహారిక. చదువులో ఒత్తిడి నుంచి బయటపడేందుకు 2016లో పుట్టినరోజు వేడుకల్లో ఎలా ఉంటారని తీసి పోస్ట్ చేసింది.&nbsp; వరుసగా అలాంటి కంటెంట్‌ పెడుతూ ఫేమస్ అయ్యింది. తర్వాత ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ ప్రారంభం కావటంతో వాటిపై ఫోకస్‌ పెట్టింది.&nbsp; ఇన్‌స్టా చాలా హిట్‌ రీల్స్‌ చేసింది నిహారిక. వన్‌ వే స్ట్రీట్‌ అనే రీల్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; సామాజిక మాధ్యమాల్లో త్వరగా పేరు సంపాదించుకుంది ఈ యూట్యూబర్‌. కేవలం 2 నెలల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు 3.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కంటెంట్‌తోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్‌ లుక్స్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు.&nbsp; తెలుగు స్టార్స్‌తోనే ప్రమోషనల్‌ రీల్స్ చేసింది నిహారిక NM. సర్కారు వారి పాట , మేజర్‌ కోసం మహేశ్‌బాబు, లైగర్‌ విజయ్ దేవరకొండ, కేజీఎఫ్‌ 2 యశ్‌తో చేసిన రీల్స్‌ చాలా ఫేమస్.&nbsp; నిహారిక ఫ్యాషన్ ఫ్రీక్‌. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా డ్రెస్సింగ్‌ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.&nbsp; బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి లాస్‌ ఏంజెల్స్‌లో MBA చేసింది. కాస్త బ్రేక్‌ తీసుకోవటానికి వీడియోలు చేయడం ప్రారంభించింది.&nbsp; కామెడీలో నిహారిక టైమింగ్ వేరే లెవల్. హాలీవుడ్‌ నటులు జిమ్ క్యారీ, రోవన్‌ అట్కిన్సన్, బ్రహ్మనందం, వడివేలు, వెన్నెల కిషోర్ స్ఫూర్తి అని చెప్పింది.
    ఏప్రిల్ 27 , 2023
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో&nbsp; యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)&nbsp; అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.&nbsp; https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.&nbsp;&nbsp; https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.&nbsp; https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.&nbsp; https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.&nbsp; https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.&nbsp; https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.&nbsp; https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    ‘లవ్‌ టుడే’ రివ్యూ యూత్ తప్పక చూడాల్సిన సినిమానా?
    ‘లవ్‌ టుడే’ రివ్యూ యూత్ తప్పక చూడాల్సిన సినిమానా?
    ]కొత్త కథ, నేటి యువతకు తప్పకుండా నచ్చే సినిమా. ఈ వీకెండ్‌లో ప్రెండ్స్‌తో ప్లాన్‌ చేసుకోండి. తప్పక ఎంజాయ్ చేస్తారుDownload Our App
    ఫిబ్రవరి 14 , 2023
    ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్‌ ఎందుకు చూడాలి
    ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్‌ ఎందుకు చూడాలి
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 14 , 2023
    తెలుగుతెరపై సినిమాటిక్‌ యూనివర్స్‌లు!
    తెలుగుతెరపై సినిమాటిక్‌ యూనివర్స్‌లు!
    ]మూసధోరణి సినిమాలకు ఇప్పుడు జనాలు జై కొట్టడం లేదు. ట్రెండ్‌ మారింది. సినీ ప్రేమికులతో పాటు చాలామంది కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా దర్శకుల సినిమాటిక్ యూనివర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.White LightningWhite Lightningజనాలు ఒప్పుకుంటారా?
    ఫిబ్రవరి 13 , 2023
    2022లో యూట్యూబ్‌ను షేక్‌ చేసిన పాటలు ఇవే!
    2022లో యూట్యూబ్‌ను షేక్‌ చేసిన పాటలు ఇవే!
    ]సంగీతం: క్రిష్ణ బేదర్దీ&nbsp; సింగర్స్: కేసరి లాల్‌ యాదవ్‌, ప్రియాంకా సింగ్Listen now
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Roti Kapda Romance Review: యూత్‌ను ఆకర్షించే ఎంగేజింగ్‌ లవ్‌ స్టోరీలు.. ‘రోటి కపడా రొమాన్స్‌’ ఎలా ఉందంటే!</strong>
    Roti Kapda Romance Review: యూత్‌ను ఆకర్షించే ఎంగేజింగ్‌ లవ్‌ స్టోరీలు.. ‘రోటి కపడా రొమాన్స్‌’ ఎలా ఉందంటే!
    నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు దర్శకత్వం: విక్రమ్‌ రెడ్డి సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి ఎడిటర్: విజయ్ వర్థన్ సినిమాటోగ్రఫీ : సంతోష్ రెడ్డి నిర్మాతలు:&nbsp; బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం నిర్మాణ సంస్థ : లక్కీ మీడియా విడుదల తేదీ: 28-11-2024 హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Roti Kapda Romance Review) కథేంటి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో జీవిస్తుంటారు. వీరిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా స్నేహితుల డబ్బుతో ఎంజాయ్‌ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), హర్షతో సోనియా (కుష్బూ చౌదరి), విక్కీతో శ్వేత (మేఘలేఖ), రాహుల్‌తో ప్రియ (ఠాకూర్‌) ప్రేమలో పడతారు. అమ్మాయిల రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? ప్రేయసితో ఎందుకు విడిపోయారు? బ్రేకప్‌ తర్వాత నలుగురు కుర్రాళ్లలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో చేసినవారంతా దాదాపు కొత్తవాళ్లే (Roti Kapda Romance Review). అయినా తమ తమ పాత్రల్లో వారు చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు కూడా ఎంతగానో అలరించారు. సినిమా మెుత్తం ఈ నాలుగు జంటల చుట్టే తిరిగింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు విక్రమ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఫ్రెండ్‌షిప్‌, లవ్‌, బ్రేకప్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ కొత్తగా ప్రెజెంట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలను ఒకే ఫ్రేమ్‌పై చూపించడం బాగా కలిసొచ్చింది. పరిణితి నిర్ణయాల వల్ల నేటి యూత్‌కు జరుగుతున్న నష్టాలు, ప్రేమలో ఎదురవుతున్న సమస్యలు, పెళ్లి విషయంలో యూత్‌ ఆలోచనలను మేళవిస్తూ కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. అందరూ కొత్తవారైనప్పటికీ వారి నుంచి ఉత్తమ నటన రాబట్టడంలో డైరెక్టర్ సక్సెస్‌ అయ్యాడు. అయితే కొన్ని సీన్లు ఎక్కడో చూసిన ఫీలింగ్‌ రావడం, పెద్దగా స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్‌ కావడం మైనస్‌ చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ విషయాలకు వస్తే (Roti Kapda Romance Review) అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. సందర్భానుసారంగా వచ్చిన పాటలు సైతం వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనయూత్‌ను ఆకర్షించే ఎలిమెంట్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్టార్ క్యాస్ట్‌ లేకపోవడంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>Game Changer: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న ‘రా మచ్చ మచ్చ’ సాంగ్‌.. అది క్లిక్‌ అయితే థియేటర్లలో పూనకాలే!&nbsp;</strong>
    Game Changer: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న ‘రా మచ్చ మచ్చ’ సాంగ్‌.. అది క్లిక్‌ అయితే థియేటర్లలో పూనకాలే!&nbsp;
    'ఆర్ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజైంది. ప్రస్తుతం అది యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రా మచ్చ మచ్చ సాంగ్‌ రిలీజ్ గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ramcharan) హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) తెరకెక్కిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ 'రా మచ్చ మచ్చ' (Ra Macha Macha) సోమవారం విడుదలైంది. ఈ పాటను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ రాశారు. తమన్ సంగీతం అందించారు. సాంగ్‌ను పూర్తిగా ఏపీలోని వైజాగ్ ప్రాంతంలో చిత్రీకరించారు. భారీ సెటప్​తో ఫుల్ కలర్​ఫుల్​గా సాంగ్​ షూట్ చేశారు. ఇందులో రామ్​చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 'వీణ స్టెప్'ను ఈ పాటలో రామ్​చరణ్ చేశారు.&nbsp; దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రిపీట్‌ మోడ్‌లో సాంగ్‌ చూస్తూ మైమరిచిపోతున్నారు. ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=a4HchiJJY6M యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ గేమ్‌ ఛేంజర్‌లోని 'రా మచ్చ మచ్చ' విడుదలైన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సాంగ్‌ను పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. ఫాస్ట్‌ బీట్‌ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 24 గంటలు పూర్తికాకుండానే ఈ సాంగ్‌ 15 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. తొలుత 10 మిలియన్ల వ్యూస్‌ అంటూ నిర్మాణ సంస్థ పోస్టు చేయగా వార్త రాసేలోపు మరో 5 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే 50 మిలియన్ల వ్యూస్‌ పక్కా అంటూ మెగా ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌కు తగ్గ మాస్‌ సాంగ్ ఇచ్చారంటూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ను ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/SVC_official/status/1840806582189507018 వీణ స్టెప్‌ అందుకే దాచారా! ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌లో రామ్‌చరణ్‌ క్లాసిక్‌ లుక్స్‌లో కనిపించినా స్టెప్స్‌ మాత్రం ఊర మాస్‌గా అనిపించాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో మరుపురాని మూమెంట్‌గా నిలిచిన ‘వీణ స్టెప్‌’ను రామ్‌చరణ్‌ ఈ సాంగ్‌లో వేశారు. ఈ స్టెప్పే పాటలో హైలెట్‌గా నిలవనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే నేరుగా థియేటర్లలో చూపించే ఉద్దేశ్యంతో చరణ్ వేసిన వీణ స్టెప్‌ను ప్రస్తుతం రివీల్‌ చేయలేదు. దీంతో చరణ్‌ ఈ స్టెప్‌ను ఎలా వేశారో అని ఫ్యాన్స్‌ తెగ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్‌ గనుక క్లిక్‌ అయితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; రిలీజ్‌ డేట్‌పై సందిగ్దం గేమ్‌ ఛేంజర్‌ చిత్రం రిలీజ్‌పై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన రాని నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రా మచ్చా మచ్చా సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా ఈ మూవీ విడుదలపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ను డిసెంబర్‌ 25న రిలీజ్‌ చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే రిలీజ్‌ తేదీపై దిల్‌రాజు క్లారిటీ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో సందిగ్ధం మాత్రం తొలగలేదు. గతంలో జరిగిన ఓ ఈవెంట్‌లో గేమ్‌ ఛేంజర్‌ను డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేస్తామని దిల్‌రాజు ప్రకటించారు. తాజాగా దాన్ని మరో 5 రోజులుగు పొడిగించారు. ఈ లెక్కన ఆ రెండు తేదీల్లో ఏది నమ్మాలి అని ఫ్యాన్స్ తర్జనభర్జన అవుతున్నారు. చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్‌, సుకుమార్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది.&nbsp;
    అక్టోబర్ 01 , 2024
    Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్‌.. తేల్చేసిన డైరెక్టర్‌!
    Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్‌.. తేల్చేసిన డైరెక్టర్‌!
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్ (Hanuman) యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రంతో పాటు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏర్పడింది. ఇక ‘హనుమాన్‌’కు సీక్వెల్‌ కూడా ఉండనున్నట్లు ప్రశాంత్‌ వర్మ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ‘జై హనుమాన్‌’ రిలీజ్‌, తమ సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; ‘బాధ్యత పెరిగింది’ పాన్‌ ఇండియా స్థాయిలో హనుమాన్‌ సక్సెస్‌ కావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వ్యాఖ్యానించారు. ‘హనుమాన్‌’ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే ఈ పాటికీి సీక్వెల్‌ను ఎప్పుడో రిలీజ్‌ చేసేవాళ్లమని పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. దీంతో 'జై హనుమాన్‌'పై మరింత బాధ్యతగా వర్క్‌ చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'జై హనుమాన్‌' కోసం ఎంతో కష్టపడుతున్నామని ప్రశాంత్‌ వర్మ అన్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సీక్వెల్‌ అందరి అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలైతే చూడాలని భావిస్తున్నారో అవి కచ్చితంగా చూపిస్తామని ప్రశాంత్‌ వర్మ హామి ఇచ్చారు.&nbsp; ‘ముందే వీఎఫ్‌ఎక్స్‌ పనులు’ ‘హనుమాన్‌’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వందల కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ కంటే ‘హనుమాన్‌’ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. దీనిపై కూడా ప్రశాంత్‌ వర్మ తాజాగా స్పందించారు. ‘హనుమాన్‌ సమయంలో మొదట షూటింగ్‌ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ పనులు ప్రారంభించాం. కానీ దీని సీక్వెల్‌ (జై హనుమాన్‌)కు మాత్రం వీఎఫ్‌ఎక్స్‌ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ సమయం పట్టవు. ప్రస్తుతానికైతే షూటింగ్‌ మెుదలవ్వలేదు’ అంటూ జై హనుమాన్‌పై ప్రశాంత్‌ వర్మ కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు.&nbsp; బాలీవుడ్‌ స్టార్స్‌ పక్కా! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌పై ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాల కోసం కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ను కలిసినట్లు చెప్పారు. వారితో తన ఆలోచనలు పంచుకున్నట్లు తెలిపారు. ఇందులో వారు కచ్చితంగా భాగం అవుతారని స్పష్టం చేశారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని తెలిపారు. అటు ‘జై హనుమాన్‌’ పట్టాలెక్కేందుకు కూడా సమయం పట్టనుందని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ స్పష్టం చేశారు. దాని కంటే ముందు ‘అధీరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతర దర్శకులు కూడా వాటి కోసం వర్క్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో మోక్షజ్ఞ ఫిల్మ్‌ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. మోక్షజ్ఞతో మూవీ షురూ నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను ప్రశాంత్‌ వర్మ రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోరానున్న చిత్రానికి 'PVCU 2' అనే వర్కింగ్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.&nbsp; https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    <strong>Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్‌ మల్టీ యూనివర్స్‌ ఫిల్మ్‌.. ‘రహస్యం ఇదం జగత్‌’ మెప్పించిందా?</strong>
    Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్‌ మల్టీ యూనివర్స్‌ ఫిల్మ్‌.. ‘రహస్యం ఇదం జగత్‌’ మెప్పించిందా?
    నటీనటులు: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు డైరెక్టర్‌ : కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ సంగీతం: గ్యానీ సినిమాటోగ్రాఫర్‌ : టేలర్‌ బ్లూమెల్‌ ఎడిటిర్‌: ఛోటా కె. ప్రసాద్‌ నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్‌ సెల్‌ యూనివర్స్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్‌లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్‌లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్‌ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని&nbsp; ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్‌ (విశ్వ, కల్యాణ్‌, అరు)తో ఓ ట్రిప్‌కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్‌ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్‌లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్‌ అరు మల్టీ యూనివర్స్‌పై రీసెర్చ్‌ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్‌ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్‌లోకి తీసుకెళ్లే వామ్‌ హోల్‌ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్‌ హోల్‌ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్‌ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్‌తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాడు. వామ్‌ హోల్‌లోకి ట్రావెల్‌ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్‌ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్‌ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ హాలీవుడ్‌ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్‌స్టెల్లార్‌’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్‌ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్‌కు దారితీసే వామ్‌ హోల్‌తో లింకప్‌ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్‌ హాఫ్ అంతా ఫ్రెండ్స్‌ ట్రిప్‌, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్‌కు ముందు మల్టీయూనివర్స్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో వామ్ హోల్‌ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్‌ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్‌ సీన్‌, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం, డైలాగ్స్‌ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్‌లుగా నిలిచాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్‌ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా చెప్పిస్తే బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ మల్టీ యూనివర్స్‌ కథపురాణాలతో లింకప్‌సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్‌ హాలీవుడ్‌ చిత్రాల ప్రభావంఫస్టాఫ్‌కమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Samantha: నన్ను ‘సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌’ అంటున్నారు!</strong>
    Samantha: నన్ను ‘సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌’ అంటున్నారు!
    ఒకప్పుడు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్ అనగానే ముందుగా నాగ చైతన్య - సమంత జోడీనే గుర్తుకు వచ్చేది. రీల్‌ స్క్రీన్‌తోపాటు నిజ జీవితంలోనూ అప్పట్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించేది. గతంలో సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఆహా షోకు వచ్చిన చైతూ తమ రిలేషన్‌ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. దీంతో ఉంటే సమంత-చైతూలా ఉండాలని అప్పట్లో చాలా జంటలే భావించాయి. అయితే అనూహ్యంగా విడాకులు తీసుకొని ఈ జంట అందర్నీ షాక్‌కు గురిచేసింది. చైతూ డిసెంబర్‌లో రెండో పెళ్లి సైతం చేసుకోబోతున్నాడు. ఇదిలాఉంటే తాజాగా విడాకులపై&nbsp; సమంత (Samantha) చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ‘సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌'.. నటుడు నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అంశంపై స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha)&nbsp; తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు సమాజం కొన్ని ట్యాగ్స్‌ ఇస్తున్నట్లు చెప్పింది. సెకండ్‌ హ్యాండ్‌, ఆమె లైఫ్‌ వృథా, యూజ్డ్‌' అంటూ కొన్ని ట్యాగ్స్‌ తలిగిస్తున్నట్లు పేర్కొంది. అలా ఎందుకు తగిలిస్తారో అర్థం కావడం లేదని తెలిపింది. ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్నిఈ విమర్శలు ఎంతో బాధిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సామ్ థ్యాంక్స్ చెప్పింది. https://twitter.com/prasanna_dbc/status/1861296316782882884 పెళ్లి గౌను రీమోడల్‌ పైనా.. సమంత (Samantha) తన పెళ్లి గౌనును ఇటీవల రీ మోడల్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వెడ్డింగ్‌ గౌను అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిని సామ్‌ రీడిజైన్‌ చేయించినట్లు తెలవడంతో అక్కినేని ఫ్యాన్స్ సమంతపై విమర్శలు చేశారు. చైతూ రెండో పెళ్లి నేపథ్యంలో ప్రతీకారం కోసమే ఆమె ఇలా చేసిందని నెట్టింట ఆరోపించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వెడ్డింగ్‌ గౌను వ్యవహారంపైనా సామ్‌ స్పందించింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. ఆ గౌను రీడిజైన్‌ ద్వారా తాను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. తన జీవితంలో జరిగిన విషయాలను ఎప్పుడూ దాచాలని అనుకోలేదని తెలిపింది. ఎన్నో కష్టాలు దాటుకొని ఈ దశకు వచ్చినట్లు సమంత తెలిపింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.&nbsp; ‘ఇంకా సాగదీయడం తప్పు’ నటుడు నాగచైతన్య సైతం తాజాగా విడాకుల అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. సమంత (Samantha)తో విడాకులు అనుకోకుండా జరిగిందని చైతూ అన్నట్లు సమాచారం. 'ఆ ఫేజ్‌పై తనకు చాలా గౌరముంది. వార్తల్లో హెడ్‌లైన్స్‌ కోసం ఇంకా సాగదీయడం తప్పు. ఇండస్ట్రీకి వచ్చింది ప్రొఫెషనల్‌ లైఫ్‌తో ఎంటర్‌టైన్‌ చేయడానికి, పర్సనల్‌ లైఫ్‌తో కాదు' అని చైతూ అన్నట్లు తెలుస్తోంది. అయితే సమంత వ్యాఖ్యల నేపథ్యంలోనే చైతూ ఈ కామెంట్‌ చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండో పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న ఈ తరుణంలో సామ్‌తో విడాకుల అంశం చర్చకు రావడం నచ్చకే ఈ కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు. పలు సోషల్‌ మీడియా, యూట్యూబ్ హ్యాండిల్స్‌కు సైతం చైతూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1861279225036112156 నెట్‌ఫ్లిక్స్‌లో చైతూ పెళ్లి లైవ్‌! ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 4న బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అయితే పెళ్లిని ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ హక్కులు అందించినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. నయనతార-విఘ్నేశ్‌ జంట కూడా గతంలో తమ పెళ్లిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు ఇచ్చారు. అయితే ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్‌ రూ.25 కోట్లు చెల్లించిందట. అయితే శోభిత-చైతు పెళ్లి కోసం ఏకంగా రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ఓటీటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైతూ రెండో పెళ్లిపై గత కొంతకాలంగే పెద్ద ఎత్తున బజ్ నడుస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్‌ ఆ స్థాయిలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది. https://twitter.com/UrsSureshR9/status/1861313291290607990
    నవంబర్ 26 , 2024
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 24) పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్‌ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. దీనిపై పవన్‌ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్‌ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.&nbsp; పవన్‌ ఏఐ పోస్టు..? తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్‌ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్‌ జీపీటీ లేదా ఏఐ&nbsp; సాయంతో పదాల కూర్పును జనరేట్‌ చేయించి పవన్‌ ఈ ట్వీట్‌ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్‌ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; https://twitter.com/PawanKalyan/status/1838587619745087518 ‘ఏఐ’ వినియోగంలో తప్పుందా! కార్తీపై పవన్‌ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్‌ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్‌ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్‌ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, గ్రమిటికల్‌ తప్పులు లేకుండా ఏఐ&nbsp; సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్‌ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్‌ ఏఐ టూల్‌ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్‌ ఏఐ ట్వీట్‌ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; కార్తీ చేసిన తప్పేంటి? సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్‌ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్‌ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాంకర్‌ లడ్డు టాపిక్‌ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.&nbsp; https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470 పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్‌! కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్‌ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్‌ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్‌ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్‌’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్‌.. దాని వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఉందా?</strong>
    Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్‌.. దాని వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఉందా?
    యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్‌. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్‌, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; కుర్ర హీరోలతో క్లోజ్‌గా.. కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరారు. యువ విష్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్‌ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్‌ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్‌ సక్సెస్‌ మీట్‌కు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్‌ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్‌ ఫొటోలు దిగి హల్‌చల్‌ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్‌ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్‌, బాలయ్య అండగా నిలుస్తున్నారు.&nbsp; మాస్టర్‌ ప్లాన్ ఉందా? ఇండస్ట్రీలో విజయ్‌ దేవరకొండ, అడివి శేష్‌, నవీన్‌ పొలిశెట్టి, నిఖిల్‌, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్‌, సిద్ధులనే బాలకృష్ణ, తారక్‌ ఎంకరేజ్‌ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్‌-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్‌. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్‌ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్‌, సిద్ధులను ఎంకరేజ్‌ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్‌ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్‌ చేసేందుకు తారక్‌, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌కు పోటీగా..! విజయ్‌ దేవరకొండ సోదరులకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్‌ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్‌ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్‌ చాలా ఒత్తిడి ఫేస్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్‌ మద్దతుతో విష్వక్‌ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్‌, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విష్వక్‌, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్‌ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్‌' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యూట్యూబ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు&nbsp; ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది. అషూ రెడ్డి పుట్టిన తేదీ? 15 సెప్టెంబర్‌, 1995 అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది? అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్‌ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది.&nbsp; అషూ రెడ్డి విద్యార్హత ఏంటి? డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.&nbsp; అషూ రెడ్డి ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ) అషూ రెడ్డి బరువు ఎంత? 60 కిలోలు అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా? అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి అషూ రెడ్డి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి? అశ్విని రెడ్డి ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది? హైదరాబాద్‌ అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది? సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు.&nbsp; అషూ రెడ్డి తొలి చిత్రం? ‘ఛల్‌ మోహన్‌ రంగా’ (2018) అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఏది? ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.&nbsp; అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’ అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది? రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి. అషూ రెడ్డి హాబీలు ఏంటి? ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట. అషూ రెడ్డి ఫేవరేట్‌ హీరో? ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది.&nbsp; అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏది? https://www.instagram.com/ashu_uuu/ https://www.youtube.com/watch?v=cmlVZwZOdeg
    ఏప్రిల్ 23 , 2024

    @2021 KTree