• TFIDB EN
  • ఉప్పెన (2021)
    U/ATelugu2h 27m

    మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజాబ్‌ వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    పంజా వైష్ణవ్ తేజ్ఆశీర్వాదం ఆసి
    రాఘవన్ మురుగన్యువ ఆశీర్వాదం ఆసి
    కృతి శెట్టిసంగీత బెబ్బమ్మ
    విజయ్ సేతుపతిసంగీత తండ్రి
    సాయి చంద్ఆసి తండ్రి
    శైలజ ప్రియరాయణం సోదరి
    గాయత్రీ జయరామన్సంగీత తల్లి
    మహదేవన్రాయణం తండ్రి
    రాజీవ్ కనకాలమండల రెవెన్యూ అధికారి
    నాగ మహేష్గోవిందు
    జై కృష్ణతాలింపు
    రాజశేఖర్ అనింగిబస్సు డ్రైవర్
    సిబ్బంది
    బుచ్చి బాబు సానాదర్శకుడు
    నవీన్ యెర్నేనినిర్మాత
    వై. రవిశంకర్నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్సంగీతకారుడు
    కథనాలు
    <strong>కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    కృతి శెట్టి ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించింది. ఉప్పెన చిత్రంలో ఆమె చేసిన బేబమ్మ పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఐడియా యాడ్ షూటింగ్‌లో పాల్గొంది.&nbsp; ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Krithi Shetty) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృతి శెట్టి దేనికి ఫేమస్? కృతి శెట్టి&nbsp; ఉప్పెన చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కృతి శెట్టి వయస్సు ఎంత? 2003, సెప్టెంబర్ 21న జన్మించింది. ఆమె వయస్సు 20 సంవత్సరాలు&nbsp; &nbsp;కృతి శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; కృతి శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;కృతి శెట్టి అభిరుచులు? మోడలింగ్ కృతి శెట్టి ఇష్టమైన ఆహారం? పీతల పులుసు కృతి శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? కృష్ణ శెట్టి(వ్యాపారవేత్త), నీతి శెట్టి( ఫ్యాషన్ డిజైనర్) కృతి శెట్టి ఫెవరెట్ హీరో? రామ్‌ చరణ్&nbsp; కృతి శెట్టికి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్ కృతి శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? ఉప్పెన కృతి శెట్టి ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది కృతి శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, అనేక టీవీ యాడ్స్‌లో నటించింది కృతి శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/krithi.shetty_official/?hl=en https://www.youtube.com/watch?v=WPzI197ph4c కృతి శెట్టి గురించి మరికొన్ని విషయాలు కృతి శెట్టి ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందికృతి శెట్టి ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది( హిందీ, తెలుగు, కన్నడ, తుళు, ఇంగ్లీష్)
    ఏప్రిల్ 13 , 2024
    <strong>వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. వైష్ణవ్ తేజ్ అసలు పేరు? పంజా వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు? హీరో బాబు వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగులు వైష్ణవ్ తేజ్&nbsp; తొలి సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ వైష్ణవ్ తేజ్&nbsp; పుట్టిన తేదీ ఎప్పుడు? 1995, జనవరి 13 వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్? సొనాక్షి సిన్హా వైష్ణవ్ తేజ్&nbsp; ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్&nbsp; తొలి హిట్ సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం? కొండపొలం వైష్ణవ్ తేజ్&nbsp; ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్ వైష్ణవ్ తేజ్&nbsp; తల్లిదండ్రుల పేరు? విజయ దుర్గ, శివప్రసాద్ వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం? తిరుమల వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు? రజనీకాంత్ నటించిన శివాజి సినిమా వైష్ణవ్ తేజ్&nbsp; ఏం చదివాడు? డిగ్రీ వైష్ణవ్ తేజ్&nbsp; అభిరుచులు? సినిమాలు చూడటం, ట్రావలింగ్ వైష్ణవ్ తేజ్&nbsp; ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; వైష్ణవ్ తేజ్&nbsp; సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
    మార్చి 21 , 2024
    <strong>RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?</strong>
    RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
    మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్‌ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్‌ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్‌.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.&nbsp; హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌.. రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్‌ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్‌ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్‌ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1772195858693698029 రంగస్థలం కాంబో రిపీట్‌! సుకుమార్‌ - రామ్‌చరణ్‌ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్‌ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది. రిలీజ్‌ ఎప్పుడంటే? రామ్‍చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని... 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
    మార్చి 25 , 2024
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు&nbsp;&nbsp; రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ&nbsp; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023&nbsp;&nbsp; మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.&nbsp; ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు&nbsp; రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 24 , 2023
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్‌ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.  View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) శ్రీజ కొణిదెల మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్‌ కూడా తన తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్‌ చేసిన కాజల్‌.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.&nbsp; View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) విష్ణు ప్రియ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) రాశి ఖన్నా నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) మమతా మోహన్‌ దాస్‌ నటి మమతా మోహన్‌ దాస్‌ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.  View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) హనీరోజ్‌ గ్లామర్‌ బ్యూటీ హనీరోజ్‌ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.&nbsp; View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) పద్మావతి మహేష్‌బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్‌ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.&nbsp; View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_) నైనికా విద్యాసాగర్ మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్‌ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
    మే 15 , 2023
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    మే 03 , 2024
    <strong>Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!</strong>
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). దిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్‌ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్‌ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ కథను లీక్‌ చేయడం గమనార్హం.&nbsp; కథ ఏంటంటే? మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్‌ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌ను అమెజాన్‌ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) వామ్మో ఏకంగా అన్ని కోట్లా! ‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది.&nbsp; గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్‌ శంకర్‌, హీరోయిన్ జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోని కపూర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/1012_raj/status/1770365882738573469 ఆ రోజున డబుల్‌ ధమాకా! మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్‌’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్‌ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్‌ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్ లభించనుంది.&nbsp;&nbsp;
    మార్చి 20 , 2024
    <strong>Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !</strong>
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో షూటింగ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1768563620739453357 https://twitter.com/n_suren/status/1768531852414079277 https://twitter.com/i/status/1767734419715133518 https://twitter.com/venkysayzzz/status/1768539657896087692 చరణ్‌కు ఘన స్వాగతం వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1768308149847753158 https://twitter.com/i/status/1768557163746656272 https://twitter.com/i/status/1768447264660296074 చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌ రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌! ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ టైటిల్ అదేనా! రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    మార్చి 16 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.&nbsp; ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే జంట చిరంజీవి-శ్రీదేవి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రంలో వీరి కెమెస్ట్రీకి సినీ అభిమానులు దాసోహం అయ్యారు. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటలో చిరు-శ్రీదేవి వేసిన స్టెప్పులను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ ఫిదా అవుతుంటారు. అయితే మూడు దశాబ్దాల తర్వాత వారి వారసులు జత కట్టబోతున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ నటించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ జోడీ ఒకప్పటి చిరు - శ్రీదేవి జంటను గుర్తు చేస్తుందని ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. జత కట్టే సినిమా అదే! రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ను తాజాగా చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల తనయ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor)ను చరణ్‌కు జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ (Boney Kapoor) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1759275401048649821 ‘దేవర’ను ఆస్వాదిస్తోంది’ తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోనూ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా జాన్వీ తండ్రి బోనీకపూర్‌ తాజా ఇంటర్యూలో స్పందించారు. ‘దేవర సెట్‌లో ప్రతి క్షణాన్ని మా అమ్మాయి ఆస్వాదిస్తోంది. తన నటన, భాషను పెంచుకునేందుకు వీలు కుదిరినప్పుడల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తోంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. వారి పక్కన నటించడం జాన్వీకి లభించిన మంచి అవకాశం. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’ అని అన్నారు.&nbsp; https://twitter.com/i/status/1759489211156341061 సౌత్‌ ఇండస్ట్రీపై జాన్వీ కన్ను! బాలీవుడ్‌లో తొమ్మిదికి పైగా చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్‌కు ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ విజయం దక్కలేదు. దీనికి తోడు దీపికా పదుకొనే, అలియా భట్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా వంటి స్టార్‌ హీరోయిన్ల నుంచి జాన్వీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీంతో ఈ భామ దృష్టి దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. టాలీవుడ్‌ సహా పలు దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో వాటిలో నటించడం ద్వారా తన క్రేజ్ పెంచుకోవాలని జాన్వీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తారక్‌ సరసన ‘దేవర’, రామ్‌చరణ్‌ చిత్రాలతో పాటు తమిళ స్టార్‌ సూర్యతో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే ఇక తన కెరీర్‌కు ఢోకా ఉండదని ఈ అమ్మడి ప్లాన్‌. జాన్వీ.. మరో శ్రీలీల కానుందా! టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలు అంతా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్లతో దాదాపుగా నటించారు. దీంతో వారితో సినిమాలు రూపొందిస్తున్న డైరెక్టర్లు కొత్త హీరోయిన్‌ను జోడీగా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల (Sreeleela)కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు ఉప్పెన (Uppena Movie) ఫేమ్‌ కృతి శెట్టి (Krithi Shetty)కి సైతం ఈ కోవలోనే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం కృతి శెట్టికి ఛాన్సెస్‌ లేకపోవడం.. శ్రీలీల నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడకపోవడంతో దర్శక నిర్మాతల దృష్టి ప్రస్తుతం జాన్వీ కపూర్‌పై పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ మరో శ్రీలీలగా మారవచ్చని అంటున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 19 , 2024
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవర 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్‌ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, టామ్‌ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; తండేల్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తండేల్‌’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్‌ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌ ప్రధాన పాత్రుల పోషించనున్నారు. మట్కా వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్‌ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్‌. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. KGF 3 ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్‌ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. RC16 మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్‌. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.&nbsp; వాల్తేరు వీరయ్య గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఉప్పెన సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్‌ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్‌ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఘాజీ 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; మహా సముద్రం&nbsp; అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.&nbsp;
    జనవరి 10 , 2024
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.&nbsp; శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.&nbsp; తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.&nbsp; అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.&nbsp; కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.&nbsp; కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.&nbsp; కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది.&nbsp;
    డిసెంబర్ 14 , 2023
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు. https://twitter.com/i/status/1714234869629558869 జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714263091029107087 పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు. https://twitter.com/bharatidubey/status/1714279017837474231 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714256005079704005 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్నారు. https://twitter.com/i/status/1714253448215228480 ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు. https://twitter.com/i/status/1714255504153993419 టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు. https://twitter.com/i/status/1714253832241422699 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్‌ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం. https://twitter.com/i/status/1714266870713647487 టాలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714230631885062219 జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714224832316080266 ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714218637362659515 జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్‌, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం. https://twitter.com/alluarjun/status/1714300482934751553
    అక్టోబర్ 18 , 2023
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
    తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.&nbsp; తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్‌ రోల్‌లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు. శైలేష్ కొలను హిట్ యూనివర్స్‌తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్‌లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు సానా కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. కేవీ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్‌ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’&nbsp; సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.&nbsp; వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
    జూన్ 14 , 2023
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:&nbsp; అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.&nbsp; ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.&nbsp; విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. శ్రీకాంత్ ఓదెల&nbsp;(srikanth odela) ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్‌.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్‌ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్‌ దగ్గర శ్రీకాంత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.&nbsp; 2. వేణు ఎల్దండి(Venu Yeldandi) బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్‌ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.&nbsp; 3. బుచ్చిబాబు సాన(buchi babu sana) డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్‌ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్‌ హిట్‌ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్‌ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్‌ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం. 4. సందీప్‌ వంగా(sandeep reddy vanga) అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్‌ చేసిన సందీప్‌ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్‌ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్‌ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్‌ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్‌ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. 5. అనిల్‌ రావిపూడి(anil ravipudi) డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్‌’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్‌ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.&nbsp; 6. సుజీత్‌ (sujeeth) డైరెక్టర్‌ సుజీత్‌ కూడా రన్‌ రాజా రన్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్‌ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో సుజీత్‌ ఓ సినిమా చేస్తున్నాడు. 7. తరుణ్‌ భాస్కర్‌(Tharun Bhascker) పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా తరుణ్‌ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్‌ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్‌ భాస్కర్‌ సైమా అవార్డ్స్‌-2016 సైమా అవార్డ్స్‌ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్‌ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్‌ సేన్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.&nbsp; 8. స్వరూప్‌ RSJ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్‌ RSJ&nbsp; టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్‌ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్‌ ఇంపాజిబుల్‌ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. 9. అజయ్ భూపతి(Ajay Bhupathi) అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్‌ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్‌ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.&nbsp; 10. కరుణ కుమార్‌(karuna kumar) డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్‌ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
    ఏప్రిల్ 12 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.&nbsp; రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.&nbsp; అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.&nbsp;సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వరణ్‌ తేజ్‌&nbsp; మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.&nbsp; అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
    ఏప్రిల్ 06 , 2023

    @2021 KTree