• TFIDB EN
  • ఊర్వశివో రాక్షశివో
    UATelugu
    పెళ్లి బంధం ఎర్పరుచుకోవాలనే మనస్తత్వం ఉన్న అబ్బాయి... కేవలం లివ్‌- ఇన్‌- రిలేషన్‌ షిప్‌తోనే జీవితం సాగించాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఆ బంధం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు శిరీష్
    శ్రీ కుమార్
    అను ఇమ్మాన్యుయేల్
    సింధుజ సింధు
    వెన్నెల కిషోర్
    సతీష్
    సునీల్
    శ్రీ మామయ్య
    పోసాని కృష్ణ మురళి
    బ్రోకర్ మూర్తి
    ఆమని
    శ్రీ కుమార్ తల్లి
    కేదార్ శంకర్శ్రీ కుమార్ తండ్రి
    అనీష్ కురువిల్లా
    శ్రీ మరియు సింధుజ బాస్
    పృథివీరాజ్
    సింధుజ తండ్రి
    అనన్య నాగళ్ల
    సింధూజ స్నేహితురాలు (ప్రత్యేక ప్రదర్శన)
    శివన్నారాయణ నారిపెద్ది
    దివ్య తండ్రి
    రజిత
    దివ్య తల్లి
    గాయత్రి భార్గవిచిట్టిబాబు భార్య
    మిర్చి కిరణ్ పోలీస్ SI
    నవీనా రెడ్డిసతీష్ సహోద్యోగి భార్యగా మారింది
    సిబ్బంది
    రాకేష్ శశిదర్శకుడు
    ధీరజ్ మొగిలినేనినిర్మాత
    విజయ్ ఎంనిర్మాత
    అచ్చు రాజమణి
    సంగీతకారుడు
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    కార్తీక శ్రీనివాస్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ స్ఫూర్తితో నటుడిగా మారాలని నిర్ణంచుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. గౌరవం చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రం మంచి బ్రెక్‌ ఇచ్చింది. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన అల్లు శిరీష్‌ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అల్లు శిరీష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు అల్లు శిరీష్ తొలి సినిమా? గౌరవం(2013) అల్లు శిరీష్ ఎక్కడ పుట్టాడు? చెన్నై అల్లు శిరీష్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 30 అల్లు శిరీష్ వివాహం అయిందా? ఇంకా జరగలేదు. అల్లు శిరీష్‌కు లవర్ ఉందా? అను ఇమాన్యూవెల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అల్లు కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ అల్లు శిరీష్ తొలి హిట్ సినిమా? ఊర్వశివో రాక్షసివో చిత్రం శిరీష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.  అల్లు శిరీష్ ఇష్టమైన కలర్? వైట్ అల్లు శిరీష్ తల్లిదండ్రుల పేరు? నిర్మల, అల్లు అరవింద్ అల్లు శిరీష్ ఇష్టమైన ప్రదేశం? కులు మనాలి అల్లు శిరీష్ ఏం చదివాడు? MCJ అల్లు శిరీష్ అభిరుచులు? డ్రైవింగ్, జిమ్మింగ్ అల్లు శిరీష్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  అల్లు శిరీష్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని అల్లు శిరీష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=Wg-K4QjOf_Q
    మార్చి 21 , 2024
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  Ayesha Zeenath స్టార్‌ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్‌ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్‌ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది. సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.  అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది. Raksha Goud కన్నడ నటి రక్ష గౌడ్‌ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.  ఈమె లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.  2017లో కన్నడ సీరియల్‌ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్‌ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.  Jyothi Rai ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్‌ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.  కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్‌.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్‌’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.  Preethi Sharma తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్‌ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్‌ సీరియల్‌ 'ఒరు కాదయి పాడతుమా, సార్‌?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.  తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.  ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ సంపాదించి గృహిణుల ఫేవరేట్‌ నటిగా మారిపోయింది.  Soundarya Reddy ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్‌ చేస్తోంది.  కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది.  ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది. 
    ఫిబ్రవరి 20 , 2024
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.  రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.  అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.  సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  వరణ్‌ తేజ్‌  మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.  పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.  కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 
    ఏప్రిల్ 11 , 2023
     Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
     Failure Hero’s: స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్‌ హీరోలు తెలుసా?
    ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్‌ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం. అక్కినేని అఖిల్‌: అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్‌(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్‌, హలో, మిస్టర్‌ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద  విఫలం  అయ్యాయి.  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హిట్ కొట్టిన అఖిల్..  ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానున్న ఏజెంట్‌ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్‌ ఆధారపడి ఉంది. అల్లు శిరీష్‌: చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్‌ కుమారుడు శిరీష్‌ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్‌ మరింత డల్ అయ్యింది.  అల్లరి నరేష్‌: దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్‌ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్‌’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్‌.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన నరేష్‌.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్. సుశాంత్‌: అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్‌ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో సుశాంత్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్‌ చిత్రాల్లో నటించారు.  ఆది పినిశెట్టి: దిగ్గజ డైరెక్టర్‌ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్‌ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌ చేస్తున్నాడు.  ఆది: నటుడు సాయికుమార్‌ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్‌ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్‌ ద్వారా ఆకట్టుకున్నాడు.  రాజా గౌతం: హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.  అరుణ్‌ దాసరి: టాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్‌ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్‌ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా  ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్‌ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్‌ హీరో కెరీర్‌ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 
    ఏప్రిల్ 03 , 2023
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. రోజుకో అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. హిందీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోవాలని ఉబలాటపడిన అందాల తార ఊర్వశి రౌటేలా.. అక్కడ విఫలమవడంతో తెలుగులో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతోంది. బ్రో, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌ల్లో నర్తించి తెలుగు ఫ్యాన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ కుర్ర అందం.. 2015 మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుంది. అదే ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో కూడ పాల్గొంది సింగ్ సాబ్ ది గ్రేట్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీలో కూడ నటించింది తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడ నటించింది గ్లామరస్ ఫోజులతో కుర్రకారు మనసు దోచుకున్న ఊర్వశికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 69 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా దక్కింది. ఇన్ని ఘనతలు ఉన్నా ఊర్వశికి రౌటేలాకు మాత్రం రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన సరైన హిట్‌ లేక నేల చూపులు చూస్తోంది. సినిమాలు లేకపోతేనేం.. సోషల్ మీడియాలో తన అందాలను దోరగా వడ్డిస్తూ కుర్రకారును పెద్దసంఖ్యలో ఫాలోవర్లుగా మార్చుకుంటోంది.
    డిసెంబర్ 01 , 2023
    <strong>Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!</strong>
    Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!
    "పుష్ప 2"&nbsp; సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ పుష్ప పార్ట్ 1లో "పుష్పరాజ్" పాత్రలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. "తగ్గేదే లే" అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, "పుష్ప 2"లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "పుష్ప-2" పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు. రష్మిక మందన్న క్రేజ్ మొదటి భాగంలో "శ్రీవల్లి" పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. "పుష్ప" సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్‌ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.&nbsp; ఫుల్ జోష్‌లో అభిమానులు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.&nbsp; నాన్‌ థియేట్రికల్‌ రికార్డు పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్. పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్ ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.&nbsp; ఓ&nbsp; సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు. "జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్." ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్‌ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.&nbsp; అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం." అనే డైలాగ్&nbsp; సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. . “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” &nbsp;అనే ఈ&nbsp; డైలాగ్&nbsp; అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
    అక్టోబర్ 26 , 2024
    Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా?&nbsp;
    Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా?&nbsp;
    ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు. కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.&nbsp; మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి అందాలను ఆరబోసింది. బ్యూటీ క్వీన్ ఈషా గుప్త తన అందాలతో వేడుకలకే&nbsp; ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ బ్యూటీ ఎల్లీ ఫ్యానింగ్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అలరించింది. image courtesy: Twitter/@ElliStavroulake హాలీవుడ్‌ పావోలా తురానీ కేన్స్‌ వేడుకల్లో తన సొగసుల పంట పండించింది. image courtesy: Twitter/@itisnicoleeee బ్రెజిల్‌ మోడల్‌ అలెస్సాండ్రా అంబ్రోసియొ తన ఎద అందాలతో మెరిసింది. image courtesy: Twitter/@izz4h_vl చైనా నటి గువాన్‌ షియావోటోంగ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో వేడుకల్లో అదరగొట్టింది. image courtesy: Twitter/@muglare రష్యా నటి విక్టోరియా బొన్యా కాస్ట్యూమ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరించింది. image courtesy: Twitter/@FaashionLooks
    మే 17 , 2023
    <strong>Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్‌ పెంచిన రామ్‌చరణ్!</strong>
    Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్‌ పెంచిన రామ్‌చరణ్!
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్‌ ఛేంజర్ టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; టీజర్‌ గ్రాండ్‌ రిలీజ్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.&nbsp; https://youtu.be/OXe7N7-xMKM?si=BCd-Cbbs34DeiwT2 త్రీ డిఫరెంట్‌ లుక్స్‌లో… కాలేజీ బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అన్న డైలాగ్‌తో టీజర్‌ మెుదలైంది. ఇందులో చరణ్‌ త్రీ డిఫరెంట్‌ డైమన్షన్స్‌లో కనిపించాడు. పాతకాలం వ్యక్తిలా, కాలేజీ కుర్రాడిలా, ప్రభుత్వ ఆఫీసర్‌గా ఇలా మూడు లుక్స్‌ అదరగొట్టాడని చెప్పవచ్చు. టీజర్‌ను ఎక్కువగా యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్‌తో అదిరిపోయే BGMతో పర్ఫెక్ట్‌గా కట్‌ చేశారు. చివర్లో చరణ్ ‘ఐ యాం అన్ ప్రిడిక్టబుల్’ అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని రామ్ చెప్పకనే చెప్పాడు.&nbsp; ఫ్యాన్స్‌.. మాస్‌ సెలబ్రేషన్స్‌ గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్ణాటకలోని 11 నగరాల్లో 11 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రతిభా థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అటు ఏపీలోని వైజాగ్‌ (సంగం-శరత్‌ థియేటర్‌), రాజమండ్రి (శివజ్యోతి థియేటర్‌), విజయవాడ (శైలజా థియేటర్‌), కర్నూల్‌ (వి మెగా థియేటర్‌), నెల్లూర్‌ (S 2 థియేటర్‌), బెంగళూరు (ఊర్వశి థియేటర్), అనంతపూర్‌ (త్రివేణి థియేటర్‌), తిరుపతి (పీజీఆర్‌ థియేటర్) నగరాల్లో టీజర్‌ విడుదలైంది. టీజర్‌ రిలీజ్‌కు ముందే భారీగా అయా థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/censorReport_/status/1855228209064759425 https://twitter.com/Rams41380829/status/1855228328787235323 https://twitter.com/sivacherry9/status/1855214405321101433 https://twitter.com/TweetRamCharan/status/1855215658340065747 https://twitter.com/Rishi_JSP/status/1855228307438190787 https://twitter.com/megafanforever3/status/1855228287502414266 తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్‌ నిర్వహించాలని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్‌ ప్లేసులో ఈవెంట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్‌ చరణ్‌ బాబాయ్ అయిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్‌ ఆహ్వానాన్ని పవన్‌ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.&nbsp; దిల్‌ రాజు 50వ చిత్రంగా.. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఫిల్మ్‌ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్‌ ఛేంజర్‌ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్‌ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్‌ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్‌ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్‌ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్‌ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు 'గేమ్‌ ఛేంజర్‌'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
    నవంబర్ 09 , 2024
    Jr.NTR: తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
    Jr.NTR: తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్‌ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. భీమ్‌ పాత్రలో తారక్‌ నటన చూసి బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్‌ 2’ (War 2)లో తారక్‌ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్‌ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తారక్‌ లుక్‌ పూర్తిగా మారిపోయింది. దీంతో తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? అన్న సందేహాలను సోషల్‌ మీడియాలో వ్యక్తమయ్యాయి. అసలేం జరిగిదంటే? బాలీవుడ్‌ స్టార్స్ హృతిక్‌ రోషన్‌, టైగర్ ష్రాఫ్‌ నటించిన 'వార్‌' చిత్రం.. 2019లో విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్‌ 2’లో తారక్‌ నటిస్తుండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వార్ 2 షూటింగ్‌ కోసం ముంబయి వెళ్లిన తారక్‌తో ఈ బ్యూటీ ఓ సెల్ఫీ దిగింది. వీరిద్దరు జిమ్‌లో ఈ సెల్ఫీ దిగగా.. ఇందులో తారక్‌ చాలా యంగ్‌గా కనిపించాడు. ఈ ఫొటోలో తారక్‌ లుక్‌ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తారక్‌.. ప్లాస్టిక్‌ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఊర్వరి ఈ ఫోటోను ఫిల్టర్‌ చేసి పోస్టు చేసిందని తెలియడంతో అంతా నవ్వుకుని ఊరుకున్నారు. ఫిల్టర్‌ ద్వారా నీ అందం పెంచుకునేందుకు.. మా తారక్‌ అన్నను ఇలా మార్చేశావా? అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) తారక్‌ జోడీగా యానిమల్‌ బ్యూటీ! బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri).. యానిమల్ చిత్రంలో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రే ఈ భామకు పెద్ద ఎత్తున&nbsp; ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారంలో 'వార్‌ 2' కోసం దీప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే త్రిప్తిని తారక్‌కు జోడీగా తీసుకున్నారా? లేదా హృతిక్‌ రోషన్‌కి జంటగానా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైన నేపథ్యంలో త్రిప్తి దిమ్రీ తారక్‌కు జోడీగా నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; పది రోజులు అక్కడే.. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తారక్‌ కాస్త నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఓ ఇండియన్‌ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం తారక్‌ రెండ్రోజుల క్రితం ముంబయిలో అడుగుపెట్టాడు. పది రోజుల పాటు అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. వార్‌ 2 కోసం తారక్‌ 60 రోజుల కాల్షీట్స్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబయిలో తారక్‌ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
    ఏప్రిల్ 15 , 2024
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అయితే ఈ వీక్‌ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్‌ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు అహింస ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ‘అహింస’ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అభిరామ్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. జూన్‌ 2న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలో రజత్‌ బేడి, గీతిక, సదా, రవికాలే, మనోజ్‌ టైగర్‌ తదితరులు నటించారు.&nbsp; ఐక్యూ సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ పేరుతో ఈ సినిమాను శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించాడు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ వంటి దిగ్గజ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా జూన్‌ 2వ తేదీనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రమని, మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది. నేను స్టూడెంట్‌ సార్‌! బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. జూన్‌ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. నేను స్టూడెంట్‌ సార్‌! సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు.&nbsp; పరేషాన్ తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు.&nbsp; జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమా కొత్త రకమైన కామెడీని పరిచయం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. చక్రవ్యూహం విలక్షణ నటుడు అజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా జూన్‌ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మర్డర్‌ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా ఈ సినిమాలో జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateSulaikha ManzilMovieMalayalamDisney+ HotstarMay 30VishwakMovieTeluguZee5June 2Asur season 2SeriesHindiJio CinemaJune 1Fake ProfileSeriesEnglishNetflixMay 31A Beautiful LifeMovieEnglishNetflixJune 1New AmsterdamSeriesEnglishNetflixJune 1Infinity StormMovieEnglishNetflixJune 1ScoopSeriesHindiNetflixJune 2ManifestSeriesEnglishNetflixJune 2
    మే 29 , 2023
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    అక్టోబర్ 22 , 2024

    @2021 KTree