• TFIDB EN
  • ఉషా పరిణయం
    UATelugu
    హనీ (శ్రీకమల్‌) పెళ్లి చూపుల్లో ఉషాను రిజెక్ట్‌ చేస్తాడు. అయితే అతడు జాయిన్ అయిన ఫ్యాషన్‌ కంపెనీలోనే ఉషా పనిచేస్తుంటుంది. క్రమంగా ఆమెను ఇష్టపడతాడు. అయితే ఉషాకు వేరొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడు హనీ ఏం చేశాడు? ఉషా ప్రేమను పొందగలిగాడా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీ కమల్
    తన్వి ఆకాంక్ష
    రవి శివతేజ
    సూర్య శ్రీనివాస్
    సీరత్ కపూర్
    అలీ
    వెన్నెల కిషోర్
    శివాజీ రాజా
    ఆమని
    సుధ
    మధుమణి నాయుడు
    సిబ్బంది
    కె. విజయ భాస్కర్
    దర్శకుడు
    కె. విజయ భాస్కర్
    నిర్మాత
    కథనాలు
    <strong>One Hero Two Heroines: </strong><strong>ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌!</strong>
    One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌!
    కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్‌ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; గాయత్రి భరద్వాజ్‌ - ప్రిషా రాజేశ్‌ సింగ్‌ అల్లు శిరీష్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్‌ సింగ్‌ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు.&nbsp; మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్‌. రవి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్‌ హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్‌ తరణ్‌ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.&nbsp; తన్వీ ఆకాంక్ష - సీరత్‌ కపూర్‌ ఒకప్పటి స్టార్‌ డైరెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్‌ భాస్కర్‌ కుమారుడు శ్రీకమల్‌ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్‌ కపూర్‌ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్‌ కపూర్‌ గతంలో రన్‌ రాజా రన్‌, టైగర్‌, కొలంబస్‌, ఒక్క క్షణం, టచ్‌ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది. మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్‌ రాకీ' (Mechanic Rocky). రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్‌ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్‌ కేస్‌’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్‌ సైతం జెర్సీ, సైంధవ్‌ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.&nbsp; తమన్నా -&nbsp; రాశి ఖన్నా అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్‌' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్‌. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్‌ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.&nbsp; తమన్నా - కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్‌’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్‌ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
    జూలై 31 , 2024
    <strong>LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!</strong>
    LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్‌ అయితే లేదు.&nbsp; శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు బడ్డీ చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా&nbsp; థియేటర్లలో విడుదలకానుంది. శివం భజే యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది. ఉషా పరిణయం తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్‌ భాస్కర్‌&nbsp; కుమారుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది. తిరగబడర సామి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్‌ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలనాటి రామచంద్రుడు&nbsp; కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి&nbsp; డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన&nbsp; డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్‌, డ్యూన్ పార్ట్ 2,&nbsp; కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి&nbsp; తెలుగు డబ్బింగ్&nbsp; సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి. PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
    జూలై 29 , 2024
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఛలో సినిమా విజయంతో లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం నాగ శౌర్య అసలు పేరు? నాగశౌర్య ముల్పూరి నాగ శౌర్య ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నాగ శౌర్య తొలి సినిమా? క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నాగశౌర్యకు వివాహం అయిందా? 2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.&nbsp; నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు? ఐశ్వర్య రాయ్ నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా? టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు. నాగ శౌర్య ఇష్టమైన హీరో? తమిళ్ హీరో సూర్య నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్? నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. నాగశౌర్యకు ఇష్టమైన కలర్? నీలం రంగు నాగ శౌర్య పుట్టిన తేదీ? 1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు. నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు? శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ నాగ శౌర్య ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom) https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి? చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు? నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.&nbsp; నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం? పెరుగు వడ నాగశౌర్య ముద్దుపేరు? నాని నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్? అనుష్క శెట్టి
    మార్చి 21 , 2024
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.&nbsp; ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.&nbsp; టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్.. తక్కువ టైంలోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ పొందిన రాజ్ తరుణ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ ముద్దు పేరు? రాజ్ రాజ్ తరుణ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రాజ్ తరుణ్ తొలి సినిమా? ఉయ్యాల జంపాల రాజ్ తరుణ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజ్ తరుణ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, మే11 రాజ్ తరుణ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. రాజ్‌ తరుణ్‌కు లవర్ ఉందా? కుమారి21F సినిమా సమయంలో హెబ్బా పటెల్‌తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్లు వచ్చాయి. రాజ్‌ తరుణ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి రాజ్ తరుణ్ తొలి హిట్ సినిమా? కుమారి 21F రాజ్ తరుణ్ ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్, గ్రీన్ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పేరు? తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి? రాజ్ తరుణ్ ఫెవరెట్ హీరోయిన్? సమంత, అనుష్క శెట్టి రాజ్ తరుణ్‌కు ఇష్టమైన ప్రదేశం? లండన్ రాజ్‌ తరుణ్‌కు ఇష్టమైన సినిమాలు? టైటానిక్, జగడం రాజ్ తరుణ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. రాజ్ తరుణ్ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కథలు రాయడం రాజ్ తరుణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.&nbsp; రాజ్ తరుణ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? &nbsp;ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=1nbxCrXjMeY
    మార్చి 21 , 2024
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం &nbsp;సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.&nbsp; సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
    మార్చి 21 , 2024
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.&nbsp; మార్టిన్ లూథర్&nbsp; కింగ్&nbsp; పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల&nbsp; ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న&nbsp; దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.&nbsp; బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    <strong>Akira Nandan: అకీరా నందన్‌ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌.. అదేంటి అలా అనేసింది!</strong>
    Akira Nandan: అకీరా నందన్‌ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌.. అదేంటి అలా అనేసింది!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఒకరు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ ఫోకస్‌ మెుత్తం రాజకీయాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు అకీరా నందన్‌ (Akira Nandan) సినీ రంగ ప్రవేశం చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో అకీరాకు సంబంధించిన ఏ చిన్న ఫొటో లభించినా దానిని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ చేస్తున్నారు. పవన్‌ లుక్స్‌ను అతడిలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఎప్పటికైనా అకీరా ఇండస్ట్రీలో అడుగుపెడతారని ఫ్యాన్స్‌ ధీమాలో ఉన్నారు. అయితే మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) చేసిన లేటెస్ట్‌ కామెంట్స్‌ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. అకీరా నందన్ ఫిల్మ్‌ ఎంట్రీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘ఆ ఆలోచన ఉందని తెలియదు’ మెగా డాటర్‌, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్లోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ అందుకుంది. ఈ సినిమాపై తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో అకీరా నందన్‌కు సంబంధించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి అకీరా నందన్‌ ఎంట్రీ ఎప్పుడు ఉందని నిహారికను ఓ జర్నలిస్టు అడిగారు. అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సి వస్తే మీ బ్యానర్‌లో ఆయన డెబ్యూ ఉండొచ్చా? అని ప్రశ్నించారు. దీనికి నిహారిక స్పందిస్తూ ‘అకీరా ఇంకా చిన్న కుర్రాడు. అతడికి సినిమాలోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. నేను వాడ్ని ఎప్పుడు అడగలేదు. వస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ నిహారిక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1833762404749996233 నెటిజన్ల మిశ్రమ స్పందన అకీరా ఎంట్రీపై నిహారిక స్పందన చూసి మెగా అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పవన్‌ వారసత్వం గురించి ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తుంటే నిహారిక మాత్రం తెలియదని సింపుల్‌గా చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ అకీరాను అడగలేదని నిహారిక చెప్పడం సమంజసంగా లేదని అంటున్నారు. అకీరా ఎంట్రీపై ఓ క్లారిటీ సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారిక వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. తెలియనప్పుడు తెలీదు అని చెప్పకుండా ఇంకేమి సమాధానం ఇస్తారని అంటున్నారు. అకీరా సినిమాల్లోకి వస్తే కచ్చితంగా మూవీ చేస్తానంటూ ఆమె చెప్పింది కదా అని గుర్తుచేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక లేటేస్ట్‌ కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.&nbsp; హీరోగా చూడాలని ఉంది: రేణూ దేశాయ్‌ అకీరా సినీ రంగ ప్రవేశంపై అతడి తల్లి రేణు దేశాయ్‌ గతంలోనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అకీరాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తిలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నటనకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కూడా అకీరా ఆసక్తి చూపించేవాడు కాదని తేల్చి చెప్పారు. సినిమాల్లోకి రావాలని ఆసక్తి ప్రస్తుతానికి అతడిలో లేదని రేణు దేశాయ్‌ తెలిపారు. అకీరా ఏం కావాలనుకుంటే అతడి ఇష్టమని చెప్పారు. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం దాన్ని బ్యాండ్‌ బాజా భారత్‌ లెవల్లో అనౌన్స్‌ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అదే అవుతుందని చెప్పుకొచ్చారు. అకీరాను హీరోగా చూడాలని తనకూ కోరికగా ఉందని మనసులో మాట చెప్పుకొచ్చారు.&nbsp; అకీరా.. మల్టీ టాలెంటెడ్‌ అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు మల్టీ టాలెంటెడ్‌. ఆటలు, పాటలు, మ్యూజిక్‌ ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. కర్రసాము కూడా అకీరా నేర్చుకున్నాడని సమాచారం. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అటు చదువులో కూడా అకీరా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నట్లు తెలిపారు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో యానిమల్‌ (Animal) సినిమాలోని నాన్న సెంటిమెంట్ ఉన్న సాంగ్‌కు పియానో వాయించాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947
    సెప్టెంబర్ 11 , 2024
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యూట్యూబ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు&nbsp; ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది. అషూ రెడ్డి పుట్టిన తేదీ? 15 సెప్టెంబర్‌, 1995 అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది? అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్‌ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది.&nbsp; అషూ రెడ్డి విద్యార్హత ఏంటి? డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.&nbsp; అషూ రెడ్డి ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ) అషూ రెడ్డి బరువు ఎంత? 60 కిలోలు అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా? అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి అషూ రెడ్డి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి? అశ్విని రెడ్డి ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది? హైదరాబాద్‌ అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది? సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు.&nbsp; అషూ రెడ్డి తొలి చిత్రం? ‘ఛల్‌ మోహన్‌ రంగా’ (2018) అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఏది? ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.&nbsp; అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’ అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది? రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి. అషూ రెడ్డి హాబీలు ఏంటి? ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట. అషూ రెడ్డి ఫేవరేట్‌ హీరో? ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది.&nbsp; అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏది? https://www.instagram.com/ashu_uuu/ https://www.youtube.com/watch?v=cmlVZwZOdeg
    ఏప్రిల్ 23 , 2024
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ కిషన్ మద్దు పేరు? సండీ సందీప్ కిషన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సందీప్ కిషన్ తొలి సినిమా? ప్రస్థానం సినిమాలో నెగిటివ్‌ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు? చెన్నై సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 7 సందీప్ కిషన్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. సందీప్ కిషన్‌కు లవర్ ఉందా? సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్? బ్లూ, వైట్ సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు? RK దుర్గా, P.R.P నాయుడు సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా సందీప్ కిషన్ ఏం చదివాడు? డిగ్రీ సందీప్ కిషన్ అభిరుచులు? ట్రావలింగ్, పార్టింగ్ సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.&nbsp; సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని సందీప్ కిషన్ వ్యాపారాలు? సందీప్‌ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది. సందీప్ కిషన్‌ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
    మార్చి 21 , 2024
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న&nbsp; విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం.. విజయ్ దేవరకొండ అసలు పేరు? దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు విజయ్ దేవరకొండ తొలి సినిమా? నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం&nbsp;అయ్యాడు విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు? ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు VDKకు ఇష్టమైన కలర్? తెలుపు, బ్లాక్, బ్రౌన్ విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ? మే 9, 1989 విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం? విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు లవర్ ఉందా? విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది. విజయ్ దేవరకొండ వ్యాపారాలు? రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా? కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు? విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం? చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ. https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
    మార్చి 19 , 2024
    The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
    The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!&nbsp;
    నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్‌ పచౌరి, ప్రణవ్‌ మిశ్రా, విజయ్‌ కృష్ణ దర్శకత్వం: సుదీప్తోసేన్ సంగీతం: వీరేష్‌ శ్రీవాల్స నిర్మాణ సంస్థ: సన్‌షైన్‌ పిక్చర్స్‌ ‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్‌ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్‌ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్‌ ఉందా? ది కేరళ స్టోరీ హిట్‌ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి: షాలిని ఉన్ని క్రిష్ణన్‌ (ఆదాశర్మ) నర్స్‌ అవ్వాలన్న కోరికతో నర్సింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్‌ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్‌ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్‌ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా&nbsp; చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ&nbsp; ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే: ‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్‌ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.&nbsp; సాంకేతికంగా: దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్‌ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్‌ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, ‌అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్‌ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ఆదాశర్మ నటనడైరక్షన్‌ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ హింసాత్మక సన్నివేశాలుబోల్డ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    మే 05 , 2023
    REVIEW: కోనసీమ థగ్స్‌
    REVIEW: కోనసీమ థగ్స్‌
    దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి&nbsp; ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం. చిత్రబృందం: దర్శకత్వం: బృందా గోపాల్‌ సంగీతం: సామ్‌ CS నటీనటులు: హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌, బాబీ సింహా తదితరులు ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోనీ సినిమాటోగ్రఫీ: ప్రియేష్‌ గురుస్వామి కథ: శేషు( హ్రిదు హరూన్‌) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?.&nbsp; దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ. ఎలా ఉందంటే: దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్‌ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్‌ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ చక్కగా సెట్‌ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.&nbsp; స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్‌ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే. సాంకేతికంగా సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది.&nbsp; ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్‌ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.&nbsp; నటీ,నటుల పెర్ఫార్మెన్స్ హ్రిదు హరూన్‌ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్‌ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. బలాలు: కథ, సెకండాఫ్‌ నటీ నటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాటోగ్రఫీ బీజీఎం బలహీనతలు ఫస్టాఫ్‌ కథనం సమీక్ష: ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్‌’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది. రేటింగ్‌: 2.75
    ఫిబ్రవరి 24 , 2023
    Pawan Kalyan Movies Update: పెండింగ్‌ మూవీస్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌.. ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌!&nbsp;
    Pawan Kalyan Movies Update: పెండింగ్‌ మూవీస్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌.. ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌!&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్ట్రైక్‌ రేట్‌ (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు)తో జనసేన సాధించిన సీట్లు.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే గత పదేళ్లుగా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చిన పవన్‌.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాత్‌ భగత్‌సింగ్‌’ చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఏపీ ఎన్నికలు ముగియడం, పవన్‌ ఉపముఖ్యమంత్రి కూడా కావడంతో.. పెండింగ్‌లో ఉన్న సినిమాలపై పవన్ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; త్వరలోనే షూటింగ్ ప్రారంభం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh), ‘ఓజీ’ (OG), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రాల షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది. ఇక పవన్‌ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాల కోసం పవన్‌.. తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్‌షీట్ల గురించే చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన మూడు చిత్రాల కోసం రెండు నెలల సమయాన్ని కేటాయించి.. ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ‘పవన్‌.. గొడవలు పెట్టేవారు’ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన 'పరువు' (Paruvu) వెబ్‌సిరీస్‌.. జీ5 వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్యూలో సుస్మిత.. తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా చిన్నతనంలో నాకూ చరణ్‌కు గొడవలు వచ్చేవి. అందుకు కారణం మా పవన్‌ బాబాయ్‌. ఆయన ఇద్దరికీ గొడవలు పెట్టి సినిమా చూసినట్లు చూసేవారు. అది చాలా సరదాగా ఉండేది. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్‌ కావడం మాకు సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి.. వారి కోసం ఏదైనా చేస్తారు' అని మెగా డాటర్‌ చెప్పుకొచ్చారు.&nbsp; మామకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు శనివారం (జూన్‌ 15) రోజున తిరుమలకు కాలినడకన వెళ్లిన సాయిధరమ్‌ తేజ్‌.. తన మామయ్య విజయాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. కాగా, మామ - అల్లుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.&nbsp;
    జూన్ 17 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?&nbsp; తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్‌ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్‌ పెళ్లి చేసుకున్నాడు.&nbsp; 2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్‌ మోహన్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్‌ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ కంట్లో పడ్డ దేవ్‌ మోహన్‌ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.&nbsp; ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది? దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్‌ ఫిల్మ్‌ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా. ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్‌ గురించి మీకు అవగాహన ఉందా? దేవ్‌: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్‌ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్‌ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు. ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్‌ ? దేవ్‌: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్‌ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్‌ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.&nbsp; ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు? దేవ్‌: డైలాగ్స్‌ను డైరెక్టర్‌ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్‌ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు&nbsp; ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.&nbsp; పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..              https://youtu.be/TrcHf9vOscM అవార్డులు దాసోహం... అరంగేట్రం సినిమాలతోనే దేవ్‌ మోహన్‌ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్‌ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌లో బెస్ట్‌ డెబ్యూట్‌ మేల్‌ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.&nbsp; దేవ్‌ మోహన్‌, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్‌ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    మే 03 , 2024
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) &nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.&nbsp;&nbsp; టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.&nbsp; https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.&nbsp; ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.&nbsp; స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.&nbsp; ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..&nbsp; ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.&nbsp; ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.&nbsp; ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.&nbsp; కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.&nbsp; సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి&nbsp; సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    మే 24 , 2024
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    The GOAT Review: దళపతి విజయ్‌ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్‌’ గ్రేట్‌గా ఉందా? లేదా?
    నటీనటులు : విజయ్‌, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్‌ త్యాగరాజన్‌, కొకిలా మోహన్‌, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్‌, అరవింద్‌ ఆకాష్‌, వైభవ్ రెడ్డి తదితరులు కథ, దర్శకత్వం : వెంకట్‌ ప్రభు సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని ఎడిటింగ్‌ : వెంకట్‌ రాజన్‌ నిర్మాతలు : కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్‌, కల్పతి ఎస్‌. సురేష్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ&nbsp; (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే దళపతి విజయ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్‌ పాత్రలో యంగ్‌ విజయ్‌ డిజిటలైజ్డ్‌ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో విజయ్‌ మరోమారు తన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్‌ స్క్వాడ్‌ సభ్యులుగా ప్రశాంత్‌, అజ్మల్‌, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్‌ లుక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంప్రథమార్ధం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 05 , 2024
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5’.7” (175 cms) సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. &nbsp;హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా? &nbsp;ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?&nbsp; అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ నిక్‌ నేమ్‌ ఏంటి? స్టార్‌ బాయ్‌ సిద్ధూ సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు. ‌అతని పేరు చైతన్య జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు? సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్‌, సింగర్, లిరికిస్ట్‌, ఎడిటర్‌ కూడా. 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి? గుంటూరు టాకీస్‌ ‘టైటిల్‌ ట్రాక్‌’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్‌-ఈ-ఇష్క్‌’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి? జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్‌) సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌? 2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్‌' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్‌ ఫ్రెండ్ ఉందా? గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్‌ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ బాలీవుడ్‌ హీరో ఎవరు? రణ్‌బీర్‌ కపూర్‌ సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్‌ ఏంటి? నలుపు సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ హెయిర్‌ స్టైల్‌ ఏది? డీజే టిల్లు కోసం అతడు యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవి? 'జాక్‌', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్‌'.. సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది? టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్‌ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ ఏవి? సిద్ధు కెరీర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్‌. ఇందులో యాంకర్‌ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్‌ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్‌ కిస్‌ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?app=desktop&amp;v=mw9Jn_BsPZE&amp;vl=hi https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g సిద్దు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; రాధిక: హేయ్‌.. అక్కడ రాయి ఉంది చూస్కో టిల్లు: ఐ హావ్‌ వన్‌ సజిషన్‌ ఫర్‌ యూ.. పోయి కారులో ఏసీ ఆన్‌ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్‌ వాటర్‌ మిలాన్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.  “మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్‌ లేదు నీది. పైగా ఉప్పర్‌ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్‌” “ ప్లీజ్‌ నువ్వేళ్లి రిలాక్స్‌ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్‌ చేసుకొని వస్తా.&nbsp; కొద్దిసేపటి తర్వాత.. టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా? రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్‌ సీ సక్సెస్‌ బీకాజ్‌ ఆఫ్‌ యూ https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్‌ డైలాగ్స్‌ ఏవి? ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. డైలాగ్‌ టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్‌) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.&nbsp; టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి&nbsp; https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ&nbsp; టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.&nbsp; నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 టాలీవుడ్‌ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్‌ స్టైలిష్‌ ఫొటోలు సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ  కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్‌ రోవర్‌ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.  https://www.youtube.com/watch?v=8CM-HSifLsY https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    ఏప్రిల్ 27 , 2024

    @2021 KTree