• TFIDB EN
  • ఉత్సవం
    UATelugu
    అభిమన్యు నారాయణ (ప్రకాష్‌రాజ్‌) సురభి నాటకాలు వేస్తుంటారు. ఆయన కుమారుడు కృష్ణ (దిలీప్‌ ప్రకాష్‌)కు పెళ్లి ఫిక్స్‌ చేస్తాడు. వివాహానికి అంతా సిద్ధమనుకుంటున్న తరుణంలో కృష్ణతో పాటు పెళ్లి కూతురు మిస్‌ అవుతుంది. వారిద్దరు ఎందుకు పారిపోయారు? ఆ పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    దిలీప్ ప్రకాష్
    రెజీనా కసాండ్రా
    ప్రకాష్ రాజ్
    నాసర్
    బ్రహ్మానందం
    రాజేంద్ర ప్రసాద్
    అలీ
    రఘు బాబు
    ప్రియదర్శి పులికొండ
    సిబ్బంది
    అర్జున్ సాయిదర్శకుడు
    సురేష్ పాటిల్నిర్మాత
    కథనాలు
    <strong>Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి</strong>
    Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
    దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా "తొమ్మిది రాత్రులు" అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది. శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం మరియు ప్రార్థన కాలం. ఈ తొమ్మిది రాత్రుల సమయంలో, దుర్గాదేవి దైవ శక్తి పరాకాష్టకు చేరుకుంటుందని హిందువులు నమ్ముతారు. భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందెందుకు పూజిస్తారు. ఈ క్రమంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు, అవి ఆమె శక్తి,&nbsp; దయ రూపాలను ప్రతిబింబిస్తాయి. శార్దీయ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట రంగు చీరతో అమ్మవారిని అలంకరించి భక్తులు పూజిస్తారు. ఈ రంగులు దేవి గుణాలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. నవరాత్రి రోజుల్లో భక్తులు ఈ రంగుల్లో దుస్తులు లేదా ఆభరణాలు ధరించి దేవిని స్మరించి, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు.&nbsp; మొదటిరోజు- పసుపు&nbsp; నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించే రోజు. ఈ రోజు పసువు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంటుంది.&nbsp; మరి ఈరోజున భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించడంతో పాటు .. కాస్త ట్రెండీగా కనిపించేందుకు ఇక్కడ మన టాలీవుడ్ హీరోయిన్లు ధరించిన పసుపు రంగు డ్రెస్సింగ్ స్టైల్స్‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి. దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ .. ఈ ట్రెడిషనల్ పసుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో చూడండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో ఎంబ్రాయిడరీ లేస్‌తో ప్రీమియం మాస్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై వచ్చిన అందమైన డిజైనర్ చీర ఇది. ఈ చీర మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. కృతి శెట్టి లాగా మీరు కూడా ఎల్లో హాఫ్‌ శారీలో అందరి మనసులు దోచుకోవచ్చు.&nbsp; పసుపు రంగుకు మ్యాచ్‌ అయ్యేలా గ్రీన్ బ్లౌస్ ధరిస్తే.. మీ అందం రెట్టింపు అవడం ఖాయం. &nbsp;లైగర్ బ్యూటీ అనన్య పాండే మాదిరి మీరు కూడా&nbsp; లెహెంగాలో అందంగా కనిపించవచ్చు. ఫ్లోరల్ ముకాయిష్ డిజైన్‌లో మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. పూజా హెగ్డే లా, మీరు పసుపు రంగు లెహెంగాలో మెరసిపోవచ్చు.&nbsp; అందంగా సంప్రదాయ కుందన్ ఆభరణాలతో&nbsp; అలంకరించుకోండి.&nbsp; మీ సొగసు మరింత రెట్టింపు అవుతుంది. View this post on Instagram A post shared by Tree-Shul Media Solutions (@treeshulmediasolutions) ప్రగ్యా జైస్వాల్ సూర్యకాంతి వెలుగులో రెండు రంగుల ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్,&nbsp; ఆకర్షనీయమైన బ్లౌజ్ డిజైన్‌లో మెరిసిపోతుంది. నవరాత్రి వేళ మీరూ ఈవిధంగా కనిపించాలనుకుంటున్నారా. ఇది మంచి ఛాయిస్ రాశీ ఖన్నా లా, మీరు సిల్క్ డ్రెస్‌లో అట్రాక్ట్ లుక్‌ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ టైప్ బెస్ట్ ఛాయిస్.&nbsp; దీనికి మ్యాచింగ్‌గా లాంగ్ ఈయరింగ్స్, బంగారు గాజులు, బర్గండి లిప్ స్టిక్‌తో మీ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. రకుల్ సింగ్ మాదిరి మోడ్రన్ స్టైల్‌లో అనార్కలి, స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్‌తో కనిపించాలనుకుంటున్నారా… ఈ పండుగ వేళ ఈ డ్రెస్‌ను కచ్చితంగా దీనిని ట్రై చేయండి. షెహ్నాజ్ గిల్ పసుపు రంగు డ్రెస్‌లో తన అందాన్ని మరింత వికసింప జేసింది. ఈ డ్రెస్‌తో మీరు కూడా అలా కనిపించవచ్చు.
    అక్టోబర్ 04 , 2024
    <strong>Samantha: సిటాడెల్‌ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్‌.. వీడియోలు వైరల్</strong>
    Samantha: సిటాడెల్‌ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్‌.. వీడియోలు వైరల్
    స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) నటించిన మోస్ట్‌ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌ 'సిటాడెల్‌: హనీ బన్నీ' (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించినప్పటికీ ఈ అమ్మడి పేరే ప్రధానంగా నెట్టింట వినిపిస్తోంది. ఆమె నటన, యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో విరోచిత పోరాటం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రేజ్‌ పరంగా సామ్‌ మరో మెట్టు ఎక్కేసిందంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో సామ్‌ పలు లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. #SamanthaRuthPrabhu హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.&nbsp; ఘాటు లిప్‌లాక్‌ సీన్స్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌లో నటి సమంత (Samantha) యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు రొమాంటిక్‌గాను ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఘాటు ముద్దు సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ (Family Man) సిరీస్‌లో ఓ ఇంటిమేట్‌ సీన్‌లో నటించి సమంత అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇప్పుడు ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లోనూ ఆ స్థాయిలోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి సామ్ లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించింది. వీరిద్దరి మధ్య రెండు ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయి. అంతేకాకుండా సామ్‌ వేసుకున్న డ్రెస్‌ బటన్స్‌ను వరుణ్‌ ధావన్‌ సడెన్‌గా విప్పుతాడు. అలాగే ఓ సీన్‌లో బ్రాలో కనిపించి సామ్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. https://twitter.com/sidhirajpu28377/status/1854445217904029842 https://twitter.com/Film01428/status/1854454250312814703 https://twitter.com/leg_beauties/status/1854439177326068112 https://twitter.com/Actress__Lust/status/1854430203361267967 https://twitter.com/NewtweetXx/status/1854353341373190185 https://twitter.com/ActressLoveeee/status/1852259091944456399 నెటిజన్ల భిన్నభిపాయాలు గతంలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో చేసిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సిరీస్‌లోనూ సమంత (Samantha) ఓ హాట్ సీన్‌ చేసింది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దాని కారణంగానే అప్పట్లో అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని రూమర్లు వచ్చాయి. అది విడాకుల వరకూ దారితీసిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోమారు సామ్‌ ఆ తరహా ఘాటు సీన్స్‌లో నటించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సామ్ ఇలాంటి ముద్దు సీన్లలో నటిస్తూ పోతే తనను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్‌ దూరమవుతారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు సమంతకు గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్లదని గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు.&nbsp; ఆ క్యూట్‌ సమంత మిస్సింగ్‌! ఒకప్పుడు సమంత (Samantha) అనగానే పక్కింటి అమ్మాయిలా, సూపర్‌ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన ట్రెడిషనల్‌ పాత్రలే గుర్తుకు వచ్చేవి. అయితే ఈ మధ్య కాలంలో ఆ సామ్ నుంచి ఆ తరహా ప్రదర్శన కనిపించడం లేదు. తన ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చేసిన జెస్సీ పాత్ర ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎవర్‌గ్రీన్‌ అనిచెప్పవచ్చు. అలాగే పలు చిత్రాల్లో సామ్‌ చేసిన అల్లరి, ఆకతాయి తనం రీసెంట్‌ చిత్రాలు, సిరీస్‌లలో అస్సలు కనిపించడం లేదు. దీనికితోడు గత కొంతకాలంగా లిప్‌లాక్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో సామ్‌ నటిస్తుండటంతో ఒకప్పటి సమంతను మిస్సైన ఫీలింగ్‌ కలుగుతోందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. తిరిగి ఓ క్యూట్‌ లవ్‌స్టోరీతో తమ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.&nbsp; రానాకు సామ్ వార్నింగ్‌! ఇటీవల ‘ఐఫా ఉత్సవం - 2024’ (IIFA Utsavam 2024) గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. నటి సమంత (Samantha) 'ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును సైతం అందుకుంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడగా హోస్ట్‌గా చేసిన రానా, తేజ సజ్జ ఆమెపై కొన్ని జోక్స్‌ వేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రానా-సమంత మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సమంత టాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది. ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది’ అని రానా అంటాడు. దానికి సామ్ గట్టిగా నవ్వి సెల్ఫ్‌ ట్రోలింగ్‌ కూడా చేస్తున్నావా అంటూ స్పందించింది. జోక్స్ వద్దు అంటూ రానాకు స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగచైతన్య రానాకు మేనత్త కొడుకు అవుతాడు. ఈ నేపథ్యంలోనే రానా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. https://twitter.com/HeartNaniSam/status/1853496815389127077
    నవంబర్ 07 , 2024
    <strong>Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్‌.. ఫుల్‌ జోష్‌లో మెగా ఫ్యాన్స్‌!</strong>
    Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్‌.. ఫుల్‌ జోష్‌లో మెగా ఫ్యాన్స్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో గ్లోబల్‌ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్‌ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్‌ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్‌ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్‌ పెట్టే దిశగా రామ్‌చరణ్‌ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్‌ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; సెట్స్‌పైకి రెండు చిత్రాలు! మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్‌ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్‌ పెట్టాలని చరణ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ కాకముందే డైరెక్టర్‌ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంతోషిస్తున్నారు.&nbsp; ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా? ప్రభాస్‌ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ మారుతీతో 'రాజాసాబ్‌' అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్‌ కల్లా సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్‌'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.&nbsp; ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌ దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.&nbsp; ఈ ఏడాది లేనట్లే! ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం రిలీజ్‌ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్‌ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబ‌ర్ 20కి ఇప్ప‌టికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్‌ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్‌ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్‌, అబ్బాయ్‌ తమకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్‌ స్పందించకపోవడం, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరోమారు నందమూరి కుటుంబానికి - తారక్‌ మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; తారక్‌కు అందని ఆహ్వానం! నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డితో పాటు చిరంజీవి (Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు కూడా ఇన్విటేషన్స్‌ వెళ్లాయి. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూ.ఎన్టీఆర్‌ను మాత్రం ఈవెంట్‌ నిర్వాహకులు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు సైతం ఇన్విటేషన్‌ ఇవ్వలేదని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలకృష్ణ, తారక్‌ మధ్య ఉన్న మనస్పర్థలు మరోమారు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బాలయ్య సూచన మేరకే నిర్వాహకులు వారిద్దరిని ఆహ్వానించలేదని టాక్‌ వినిపిస్తోంది. దీంతో బాలయ్య-తారక్‌ మధ్య రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.&nbsp; విభేదాలకు కారణాలు ఇవేనా..! వై.ఎస్‌. జగన్‌ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఏకంగా 50 రోజుల పాటు జైలులో పెట్టింది. దీనిపై నందమూరి కుటుంబం పెద్ద ఎత్తున చంద్రబాబు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జగన్‌ ప్రతీకార రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇంత జరుగుతున్నా తారక్‌ మాత్రం అప్పట్లో దీనిపై పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ట్విటర్‌ వేదికగా ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు పోస్టు సైతం పెట్టలేదు. తారక్‌ మౌనంగా ఉండటం సరికాదంటూ టీడీపీ క్యాడర్‌, తెలుగు దేశం సోషల్‌ మీడియా విభాగం సూచిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో బాలయ్య తీవ్ర అసహనానికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.&nbsp; కంట్రోల్‌ చేయని తారక్‌! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తారక్‌కు అత్యంత సన్నిహితులు. నాని, వంశీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వారు ఇరువురు చంద్రబాబు, అతడి కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాలకృష్ణపై కూడా అవాకులు, చవాకులు పేల్చారు. ఒక దశలో చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు సైతం మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితులైన వంశీ, నానిని తారక్‌ నియంత్రించలేదని విమర్శలు వచ్చాయి. ప్రారంభంలోనే వారిని తారక్ మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.&nbsp; తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    ఆగస్టు 31 , 2024
    <strong>Committee Kurrollu Review: మెగా డాటర్‌ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?</strong>
    Committee Kurrollu Review: మెగా డాటర్‌ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్‌ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్‌, తేజశ్వీరావు, సాయికుమార్‌ దర్శకత్వం: యదు వంశీ సంగీతం : అనుదీప్‌ దేవ్‌ సినిమాటోగ్రాఫర్‌ : రాజు ఎడురోలు ఎడిటర్‌ : అన్వర్‌ అలీ నిర్మాత : నిహారిక కొణిదెల విడుదల: 09-08-2024 మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్‌ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్‌ సరోజ్‌) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్‌ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. శివ‌గా సందీప్ స‌రోజ్, సుబ్బుగా త్రినాథ్ వ‌ర్మ‌, విలియంగా ఈశ్వ‌ర్ ర‌చిరాజు, సూర్య‌గా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవ‌రికి వారే త‌మ‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, కంచర‌పాలెం కిషోర్ వంటి వారి న‌ట‌నానుభ‌వం ఈ క‌థ‌కు అద‌న‌పు బ‌లాన్ని అందించింది. పెద్దోడుగా ప్ర‌సాద్ బెహ‌రా న‌ట‌న అంద‌ర్నీ అల‌రిస్తుంది. వినోద‌భ‌రిత స‌న్నివేశాల్లో ఎంత‌గా న‌వ్వించాడో భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో అంత‌గా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు యదు వంశీ 90'sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్‌ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ‌, కులాల స‌మ‌స్య‌, రాజ‌కీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావ‌రి యాస‌లో రాసుకున్న సంభాష‌ణ‌లు, జాత‌ర స‌న్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆక‌ట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్‌ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాత‌ర నేప‌థ్యంలో వ‌చ్చే నేప‌థ్య సంగీతం క‌ట్టిప‌డేస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ క‌థా నేప‌థ్యంగోదావరి స్టైల్‌ కామెడీజాతర సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనంద్వితియార్థం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 09 , 2024
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    ఎన్టీఆర్(Sr. NTR) వర్ధంతి వేళ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat)లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ అంశంలోకి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కలుగచేసుకోవడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.&nbsp; https://twitter.com/i/status/1747792524042006727 ‘తీయించేయ్‌.. ఇప్పుడే’ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో తన తాతకు నివాళులర్పించారు. ఆ తర్వాత కాసేపటికి నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికెళ్లారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత.. అక్కడ జూ. ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాలయ్య చూపు పడింది. ఆ ప్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ ఆదేశించారు. ఇప్పుడే తీసేయాలి అంటూ కోపంగా బాలయ్య అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/i/status/1747862444142375247 తారక్‌ ఫ్యాన్స్‌ మండిపాటు ఈ ఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తన అల్లుడు నారా లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తారక్‌ రాజకీయాల్లోకి వస్తే లోకేష్‌ భవితవ్యం ప్రశ్నార్థకం అవతుందని పేర్కొంటున్నారు. తారక్‌కు ఉన్న క్రేజ్‌, మాట్లాడే తత్వం, నాయకత్వ లక్షణాలు లోకేష్‌ను పొలిటికల్‌గా ఇరకాటంలో పడేస్తాయని, అందుకే బాలయ్య తారక్‌ను దూరం పెడుతున్నారని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. &nbsp; కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అల్లుడు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారు. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. https://twitter.com/i/status/1747872349519765593 రంగంలోకి వైసీపీ వర్గాలు! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో అధికార వైసీపీ.. ఈ ప్లెక్సీల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌.. తారక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతూ ఎన్టీఆర్‌ అభిమానులను మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోంది. బాలయ్య అన్న మాటలను తమ సోషల్‌ మీడియా వేదికల్లో విపరీతంగా సర్క్యూలేట్‌ చేస్తూ టీడీపీకి చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. మెుత్తంగా తారక్‌ ప్లెక్సీల తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయ రంగును పులుముకోవడం గమనార్హం. https://twitter.com/i/status/1747887445574848809 గతంలోనూ ఇలాగే.. అయితే గతంలోనూ నందమూరి కుటుంబానికి, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తారక్‌ ఒక్క ప్రకటన చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ అంశంపై బాలయ్యను ప్రశ్నించగా ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ అప్పట్లోనే ఆయన బదులిచ్చారు. ఆ అసహనంతోనే ఇప్పుడు ప్లెక్సీలు తీయించమని ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లోనూ తారక్‌ ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్‌ స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేసే కార్యక్రమంలో నందమూరి కుటుంబం మెుత్తం పాల్గొన్నప్పటికీ&nbsp; హరికృష్ణ కుటుంబం దూరంగా ఉంది. తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    జనవరి 18 , 2024
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    ]గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గూఢచారి - Prime VideoDownload Our App
    ఫిబ్రవరి 14 , 2023
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్‌ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్ర. అల్లుఅర్జున్‌ ఇల్లు ఎక్కడ? గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను. ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు? గూ: 8th ఏప్రిల్‌ 1983 ప్ర. అల్లుఅర్జున్ ఫోన్‌ నెంబర్‌? గూ: ... 98480 ..... అర్థమైందా? ప్ర: అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ కజిన్స్‌ అవుతారా? గూ: అవును.. అల్లు అర్జున్‌ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్‌. కాబట్టి అల్లుఅర్జున్‌ రామ్‌చరణ్‌ కజిన్స్ అవుతారు.&nbsp; ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు? గూ. అల్లుఅర్జున్‌ కేరళలో చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు. ప్ర: అల్లుఅర్జున్‌ బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు తీయట్లేదు? గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్‌ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు. ప్ర: నార్త్‌ ఇండియాలో అల్లుఅర్జున్‌ ఎందుకు ఫేమస్‌? గూ: నార్త్‌ ప్రజలు అతని డ్యాన్స్‌, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్‌ నెంబర్‌? గూ. 666 ప్ర: అల్లుఅర్జున్‌ హిందీలో మాట్లాడగలడా? గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.  ఇటీవల ‘4 ఇడియట్స్‌ రియాక్ట్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.&nbsp; ప్ర: మీరు బ్రాహ్మణులా? బన్నీ: నో (నవ్వుతూ) ప్ర: మీరు చిరంజీవికి బంధువా? బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు? బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు ప్ర. మీ ఫేవరేట్‌ రంగు? బన్నీ: బ్లాక్ ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు? బన్నీ: షూటింగ్‌ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా. అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్‌ వీడియోలో చూడండి. https://youtu.be/yoRVoy8hqmI
    ఏప్రిల్ 07 , 2023
    <strong>DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;</strong>
    DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'దేవర'. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్‌ సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్‌ రికార్డును తారక్‌ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్‌ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రాజమౌళి ఫ్లాప్‌ సెంటిమెంట్‌! దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్‌ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్‌ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్‌, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్‌ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.&nbsp; 23 ఏళ్ల రికార్డు బద్దలు రాజమౌళి ఫ్లాప్‌ రికార్డు సెంటిమెంట్‌ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్‌ 27, 2001లో రిలీజైన స్టూడెంట్‌ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్‌ 27న దేవర రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్‌ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్‌ సెంటిమెంట్‌ను తారక్‌ బద్దలు కొట్టాడని సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కార్తికేయ స్పెషల్‌ పోస్టు ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్​గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్​ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్​ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్​నెస్​ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. https://twitter.com/ssk1122/status/1839476779175567669 ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్‌ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌. చిత్రంలోని ఫియర్‌ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు.&nbsp; https://twitter.com/ArtistryBuzz/status/1839517947548794958 https://twitter.com/AnirudhTrend/status/1839516079560802450
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!</strong>
    Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!
    సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 2: ది రూల్‌’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17న&nbsp; విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్‌ ఊచకోత సన్నివేశం యాక్షన్‌ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్‌ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్‌’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌ నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌, తమన్‌ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్‌ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి. https://twitter.com/resulp/status/1858089345464279297 సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’ ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్‌ ఫైర్‌” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు. క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్‌ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్‌ లోనే హింట్స్ ఉన్నాయి.&nbsp; ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది.&nbsp; ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రముఖుల స్పందన ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు: రాజమౌళి: "పుష్పగాడి వైల్డ్‌ ఫైర్‌ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది."అనిల్‌ రావిపూడి: "ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. బిగ్‌ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా."హరీశ్‌ శంకర్‌: "పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్‌."రిషబ్‌ శెట్టి: "ట్రైలర్‌లో మాస్‌ ఎలిమెంట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్‌ సిద్ధమవుతోంది."ప్రశాంత్ వర్మ: "పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు." ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై నటుడు కిరణ్‌ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, "థ్యాంక్యూ మై బ్రదర్‌. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్‌ చేస్తాను" అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 5 - పుష్ప పండుగ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్‌ విజువల్స్‌ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా..?" అంటూ డైరెక్టర్‌ బుచ్చిబాబు చేసిన కామెంట్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంతకు మించి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్‌ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్‌ ఇస్తుందో చూడాలి!
    నవంబర్ 18 , 2024
    Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్‌, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
    Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్‌, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
    మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు. అయితే సెలబ్రిటీల పిల్లలు అనగానే సహజంగానే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ అభిమాన హీరోల వారసులుగా ఆ చిన్నారులను కూడా ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టే కొత్త తరహా పేర్ల విషయంలో ఫ్యాన్స్‌ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటి అర్థం తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లలు (Tollywood Celebrity Baby Names), వారి పేర్లకు అర్థాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగా ఫ్యామిలీలోకి గతేడాది జూన్‌లో బుల్లి ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమకు పుట్టిన గారాల పట్టికి ‘క్లింకారా’ అనే పేరు పెట్టారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అలాగే అమ్మవారి శక్తి రూపానికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు. ఈ గుణాలను పోగుచేసుకొని క్లీంకారా ఎదగాలని మెగా ఫ్యామిలీ ఈ పేరు పెట్టింది. జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూ.ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తారక్‌ - ప్రణీత దంపతులు తమ మెుదటి సంతానానికి అభయ్‌ రామ్‌ అనే పెట్టారు. రెండో కుమారుడికి భార్గవ్ రామ్‌ అని నామకరణం చేశారు. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని చివర్లో రామ్‌ వచ్చేలా పెట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తారక్‌ కూడా కొనసాగించడం విశేషం. అభయ్ అంటే భయం ఎరుగని వాడు అని అర్థం. ఇక భార్గవ్ రామ్‌ అంటే శ్రీరాముడు అనేక నామాల్లో ఇదీ ఒకటి.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. మగబిడ్డకు అల్లు అయాన్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లకు అల్లు అర్హా అని నామకరణం చేశారు. అయాన్ అంటే దివ్యమైనది (సంస్కృతి), దేవుని బహుమతి (అరబిక్‌), గుర్తుపెట్టుకోవాల్సింది (పర్షియన్‌) అని అర్థం. అలాగే అర్హా అంటే 'శివం' అని మీనింగ్ వస్తుంది. ఇస్లామిక్ అర్థాన్ని తీసుకుంటే ప్రశాంతమైన, నిర్మలమైన అని సూచిస్తుందట. నాని (Nani) నేచురల్‌ స్టార్ నాని దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పేరు అర్జున్‌. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటారు. అర్జున్‌ అంటే సంస్కృతం నుంచి వచ్చిన హిందూ పేరు. పాండవుల్లో ఒకరైన అర్జునుడు గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు.&nbsp; నితిన్‌ (Nithiin) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో నితీన్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడి పేరును నితిన్‌ ఎక్కడా రివీల్‌ చేయలేదు. మంచు మనోజ్‌ (Manchu Manoj) నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. దేవసేన అంటే హిందూ దేవత. దేవతల సైన్యాధిపతిగా పురణాల్లో ఆ పేరును ప్రస్తావించారు. కాగా, ఇరుకుటుంబాల అంగీకారంతో గతేడాది మనోజ్‌ - మౌనిక వివాహం జరిగింది. మౌనికకు అప్పటికే మెుదటి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు. నిఖిల్‌ సిద్దార్థ్‌&nbsp; (Nikhil Siddharth) టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ధీరా సిద్ధార్థ్‌ అని పేరు పెట్టారు. ధీర అంటే గొప్ప వీరుడు అని అర్థం. సుహాస్‌ (Suhas) టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన బిడ్డకు తాను పేరు పెట్టనని సుహాస్‌ గతంలో తెలిపారు. తన హీరోగా చేసిన ‘కలర్‌ ఫొటో’ డైరెక్టర్‌కు పేరు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. మరి ఏ పేరు పెట్టారో సుహాస్ అనౌన్స్‌ చేయలేదు.&nbsp; రణ్‌వీర్‌ - దీపికా (Ranveer Singh - Deepika Padukone) బాలీవుడ్ స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సెప్టెంబర్‌లో దీపికా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు దువా పదుకొణే సింగ్‌ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానమే ఈమె అంటూ దీపికా నవంబర్‌ 2న స్పెషల్ పోస్టు పెట్టింది.&nbsp; రణ్‌బీర్‌ - అలియా (Ranbir Kapoor - Alia Bhatt) బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ 2022లో పేరెంట్స్ అయ్యారు. ఓ కూతురుకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు రాహా అనే పేరు పెట్టారు. రాహా అంటే పీస్‌ఫుల్‌, హ్యాపీనెస్‌ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.&nbsp; విరాట్‌ - అనుష్క (Virat Kohli - Anushka Sharma) భార‌త స్టార్ క‌పుల్ విరాట్-అనుష్కలు ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తమ మగ బిడ్డకు ‘అకాయ్‌’ అనే పేరు పెట్టారు. అకాయ్‌ అంటే సంస్కృతంలో నిరాకారమని, రూపం లేనిదని అర్థం. టర్కీ భాషలో మెరుస్తున్న చంద్రుడు అని కూడా అంటారు. ఇక తమ మెుదటి కుమార్తెకు దుర్గాదేవి పేరు వచ్చేలా ‘వామిక’ అని విరుష్క దంపతులు పేరు పెట్టారు.&nbsp; యామి గౌతమ్‌ (Yami Gautam) బాలీవుడ్‌ నటి యామి గౌతమ్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏ డాది మేలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్‌ దంపతులు తమ బిడ్డకు వేదవిద్‌ అని పేరు పెట్టారు. వేదవిద్‌ అంటే వేదాలు బాగా తెలిసినవాడు అని అర్థం. అమలా పాల్‌ (Amala Paul) తమిళ స్టార్ నటి అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమలాపాల్‌ - జగత్‌ దేశాయ్‌ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ఇలాయ్‌ అని పేరు పెట్టారు. తమిళంలో ఇలాయ్‌ అంటే ఆకు (Leaf) అని అర్థం. హీబ్రూలో లాంగ్వేజ్‌లో ఆరోహణ అని కూడా అర్థం వస్తుంది.
    నవంబర్ 12 , 2024
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    Dhop Song Promo: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో రిలీజ్, సూపర్బ్ రెస్పాన్స్
    రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘దోప్’ సాంగ్ విశేషాలు సినిమా టీమ్ ‘దోప్’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఈ సాంగ్, ఆడియన్స్‌ను కట్టిపడేయనుంది. మైక్రో మంత్ర అంటూ సాంగ్ లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి.  కియరా, రామ్‌ చరణ్ కెమిస్ట్రీ కనుల విందుగా ఉంది. మెకోవర్ అట్రాక్టివ్‌గా పదే పదే చూడాలనిపించే విధంగా ఉంది. https://twitter.com/SivaHarsha_23/status/1869361110325018735 కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘దోప్’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. https://twitter.com/BheeshmaTalks/status/1869298339730386976 రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసింది. ఒక పాత్ర పీరియాడిక్ టైమ్‌ లైన్‌కు చెందినదైతే, మరో పాత్ర (DHOP Song Promo)ప్రస్తుత కాలానికి సంబంధించినది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో ఆయన స్వయంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’(Daku Maharaj), జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, జనవరి 10న అజిత్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘విడాముయర్చి’ విడుదల కానున్నాయి. టీజర్‌కు మంచి స్పందన ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం, శంకర్ వినూత్న దర్శకత్వం, రామ్ చరణ్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ, శంకర్ దర్శకత్వ ప్రతిభ, థమన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతాయి. ‘దోప్’ సాంగ్ ప్రోమో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఫుల్ సాంగ్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    డిసెంబర్ 18 , 2024
    <strong>Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్</strong>
    Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్
    ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమాపై ప్రముఖ ఫిల్మ్ క‌్రిటిక్ ఉమెర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా పైసా వసూల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. బన్నీ ఫ్యాన్స్‌ను జోష్‌లో ముంచేసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ సీక్వెల్ లో తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. బన్నీ పుష్పలో తన మేనరిజంతో, మాస్ యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప-2 పై ప్రేక్షకుల అంచనాలు ఫస్ట్ పార్ట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా స్పందించడంతో, సీక్వెల్ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప-2’ కోసం నార్త్ ఆడియన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే పుష్ప హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ సీక్వెల్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్ షోల హైప్– అల్లు అర్జున్ అటెండ్ డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. టిక్కెట్లు ముందుగానే హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని సుదర్శన్ 70MM థియేటర్‌లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని స్వయంగా అభిమానులతో కలిసి చూడనున్నారు. ఉమేర్ సందు ఫస్ట్ రివ్యూ ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకుడు ఉమేర్ సందు ‘పుష్ప-2’ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని “బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్”గా అభివర్ణించాడు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, అల్లు అర్జున్ మళ్లీ నేషనల్ అవార్డు గెలవడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. https://twitter.com/UmairSandu/status/1863865410421960724 అల్లు అర్జున్ మాస్ అవతార్ ఉమేర్ సందు ట్వీట్ చేస్తూ, “అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అతని మాస్ అవతారం ఈ సినిమా కీలక ఆకర్షణ. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు” అని అభినందించారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌&nbsp; సీన్లలో అల్లు అర్జున్‌ అదరగొట్టాడని పేర్కొన్నారు.&nbsp; రష్మిక, ఫహాద్ ఫాజిల్ మెస్మరైజింగ్ రష్మిక మందన్నా సీక్వెల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ, అభిమానుల మన్ననలు పొందిందని ఉమేర్ పేర్కొన్నాడు. రష్మిక- అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు.&nbsp; అలాగే, ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తాడని పేర్కొన్నాడు. తన నటనతో ప్రత్యేకమైన ముద్రవేసాడని అభినందించారు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2 ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను అధిగమించింది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Screengrab Twitter: #pushpa2therule ప్రత్యేకమైన మసాలా మూవీగా గుర్తింపు ‘పుష్ప-2’ ని ఇండియన్ సినిమా చరిత్రలో విభిన్నమైన మసాలా మూవీగా ఉమేర్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు విందుగా ఉంటాయని తెలిపారు. మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ భారీ విజయం సాధించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి. 'పుష్ప-2 ది రూల్'తో అల్లు అర్జున్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. మరి కాసేపట్లో పుష్ప 2 పూర్తి రివ్యూ రానుంది.. అప్‌డేట్స్‌ కోసం YouSay Telugu వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
    డిసెంబర్ 04 , 2024
    <strong>Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;</strong>
    Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్‌ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్‌. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్‌ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్‌ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్‌ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.&nbsp; చిన్న చిత్రాలపై ప్రశంసలు.. చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.‌ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్‌ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్‌ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి. https://twitter.com/GulteOfficial/status/1856370891417932076 యంగ్‌ హీరోలకు భరోసా తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్‌ హీరోలకు మెగాస్టార్‌ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్‌ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్‌ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్‌ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్‌ ఫొటోలో సుహాస్‌ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్‌ రోల్‌ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.&nbsp; జపాన్‌ వెళ్లనున్న మెగాస్టార్‌! మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ&nbsp; మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్‌ వెళ్లనున్నారు.&nbsp; అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం చిరు వెనక్కి తగ్గారు.&nbsp; ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్‌ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.&nbsp;
    నవంబర్ 13 , 2024
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; తండేల్‌ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్‌' (Thandel). ఈ సినిమా టైటిల్‌ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్‌ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్‌' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; డంకీ (DUNKI) బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్‌ 21న విడుదల కానుంది.&nbsp; తంగలాన్‌ చియాన్‌ విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.&nbsp; కంగువ స్టార్‌ హీరో సూర్య అప్‌కమింగ్‌ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.&nbsp; మట్కా వరణ్‌తేజ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.&nbsp; జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్‌ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.&nbsp; అయలాన్‌ శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్‌ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 25 , 2023
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.&nbsp; మార్టిన్ లూథర్&nbsp; కింగ్&nbsp; పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల&nbsp; ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న&nbsp; దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.&nbsp; బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కౌంపౌండ్‌లో సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన సుఖంగా ప్రసవించారు. ఉపాసన డెలివరీ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో జూన్ 23న మధ్యాహ్నం ఉపాసన డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో తొలిసారి బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చారు. ఈ తరుణంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నాడు.&nbsp; పూలతో వెల్‌కం.. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆసుపత్రి నుంచి అడుగు పెట్టిన సమయంలో అభిమానులు వారిపై పూలాభిషేకం కురిపించారు. వెల్ కం టు మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఉత్సాహాన్ని చూపించారు. ఉపాసనకు సాధారణ ప్రసవం చేయడంతో మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. https://twitter.com/HumanTsunaME/status/1672171267259260931 దిష్టి తగలకుండా.. నవజాత శిశువులకు సాధారణంగానే దిష్టి తగులుతుందని అంటుంటారు. మరి, మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు రామ్ చరణ్, ఉపాసన. ఆసుపత్రి నుంచి బయటకు తెస్తుండగా అప్రమత్తంగా ఉన్నారు. బిడ్డకు తెల్లటి వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చారు. బేబీ మొఖం కనిపించకుండా చెర్రీ, ఉప్సి తమ చేతులను అడ్డంగా పెట్టుకున్నారు. మీడియాకు ఏమాత్రం కూడా బేబీ మొఖాన్ని చూపించలేదు. https://twitter.com/captain_india_R/status/1672177223032524800 లిటిల్ ప్రిన్సెస్ పేరు? ఇప్పటికే తమ కూతురి పేరును ఫిక్స్ చేసినట్లు రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను, ఉపాసన ఇప్పటికే ఒకట్రెండు పేర్లు అనుకున్నాం. సరైన సమయంలో మా బిడ్డ పేరుని నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పాడు చెర్రీ. మరి, ఆ పేరు ఏంటా అని అప్పుడే నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. మంగళవారం పుట్టడం, మెగా ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దేవత పేరు కలిసొచ్చేలా నామకరణం చేసే అవకాశం ఉంది.&nbsp; https://twitter.com/telugufilmnagar/status/1672177021508792320 పట్టరాని ఆనందం.. కుమార్తె పుట్టిన విషయం తెలిశాక మీ ఫీలింగ్ ఏంటని ఓ విలేకరి ప్రశ్నించారు. ప్రతి మగవాడు తొలిసారి తండ్రయితే ఎలాంటి అనుభూతి చెందుతాడో తనూ అలాగే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బిడ్డను చూడగానే పట్టరాని సంతోషం వేసిందని చెప్పాడు. 21 రోజుల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వెల్లడించాడు చెర్రీ.&nbsp; https://twitter.com/MilagroMovies/status/1672177857207103488 ఎవరి పోలికంటే? బిడ్డ పుడితే ఎవరి పోలికా? అనే ప్రశ్న ఎదురవడం సర్వ సాధారణం. కొందరు అమ్మ పోలికలతో పుడతారు. మరికొందరికి నాన్న పోలికలు వస్తాయి. ఇంకొందరికి అమ్మమ్మ/నానమ్మ, తాతయ్యల పోలికలు వస్తాయి. ఇదే ప్రశ్న రామ్‌చరణ్‌కు ఎదురైంది. పాప ఎవరి పోలిక అని ఓ విలేకరి అడిగారు. దీంతో ‘కచ్చితంగా నాన్న పోలికే’ అంటూ గర్వంగా చెబుతూ వెంటనే బయలు దేరారు.&nbsp; https://twitter.com/sivacherry9/status/1672174966002049025 బొడ్డు పేగు రక్తం ప్రిజర్వ్.. పాప బొడ్డు పేగు రక్తాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. బిడ్డ జన్మించాక బొడ్డు పేగును కత్తిరించి తల్లి నుంచి వేరు చేస్తారు. ఇలా కత్తిరించిన పేగులో రక్తకణాలు ఉంటాయి. ఇవి చికిత్సకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులపై పోరాడటానికి సహాయపడతాయి. అందుకే ఈ రక్తాన్ని పదిలంగా భద్రపరిచారట. మహేశ్ బాబుకు గౌతమ్ జన్మించిన సమయంలోనూ ఇలాగే చేశారట.&nbsp; https://twitter.com/HoneYNavya_/status/1672182605385531392
    జూన్ 23 , 2023
    Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?
    Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. ఫ్రాన్స్‌లో జరిగే 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననుంది.&nbsp;ఈ మేరకు నిర్వహకుల నుంచి ఆహ్వానం అందినట్లు మృణాల్‌ తెలిపింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023లో తొలిసారి పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు మృణాల్‌ చెప్పింది. గ్లోబల్‌ ఫిల్మ్‌మేకర్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.&nbsp; మృణాల్‌తో పాటు అనుష్క శర్మ, మానుషి చిల్లర్‌, సారా అలీఖాన్‌ కూడా కేన్స్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే అదితిరావు, ఐశ్వర్యరాయ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; తెలుగులో వచ్చిన సీతారామం చిత్రంతో మృణాల్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా ఈ భామకు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనే స్థాయికీ మృణాల్‌ ఎదిగింది.&nbsp; ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో NANI 30 ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.&nbsp; NANI 30 సినిమాతో పాటు హిందీలో పూజా మెరీ జాన్‌, పిప్పా, ఆంఖ్‌ మిచోలి సినిమాల్లో మృణాలు నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది.&nbsp; ఓవైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతూనే సోషల్‌ మీడియాలోనూ మృణాల్ సూపర్‌ యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. మృణాలు ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా ‌అవుతున్నారు. ఆమె అందచందాలకు ముగ్దులవుతున్నారు. నెట్టింట మృణాల్‌ ఇస్తున్న హాట్‌ ట్రీట్‌ను తీసుకునేందుకు నెటిజన్లు ఆమెను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన బోల్డ్‌ ఫొటోలను లైక్, షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.&nbsp; ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోయిన్లలో మృణాల్‌ ఠాకూర్ ఒకరు. ఆమె ఖాతాను 8.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    మే 16 , 2023

    @2021 KTree