• TFIDB EN
 • ఉయ్యాల జంపాలా (2013)
  UTelugu2h 4m

  బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
  Watch
  Free
  స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
  Watch
  Free
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  అవికా గోర్ఉమా దేవి
  నిఖిల్ దేవాదులయంగ్ సూరి
  ప్రణవి మానుకొండయంగ్ ఉమా దేవి
  పీలా గంగాధరవాసు
  అల్లూరి హనుమకోదండ
  శశాంక్ శ్రీవత్సవయపార్ధు
  సిబ్బంది
  విరించి వర్మదర్శకుడు
  నాగార్జుననిర్మాత
  రామ్ మోహన్ పినిర్మాత
  సన్నీ MRసంగీతకారుడు
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  <strong>రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్.. తక్కువ టైంలోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ పొందిన రాజ్ తరుణ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ ముద్దు పేరు? రాజ్ రాజ్ తరుణ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రాజ్ తరుణ్ తొలి సినిమా? ఉయ్యాల జంపాల రాజ్ తరుణ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజ్ తరుణ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, మే11 రాజ్ తరుణ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. రాజ్‌ తరుణ్‌కు లవర్ ఉందా? కుమారి21F సినిమా సమయంలో హెబ్బా పటెల్‌తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్లు వచ్చాయి. రాజ్‌ తరుణ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి రాజ్ తరుణ్ తొలి హిట్ సినిమా? కుమారి 21F రాజ్ తరుణ్ ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్, గ్రీన్ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పేరు? తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి? రాజ్ తరుణ్ ఫెవరెట్ హీరోయిన్? సమంత, అనుష్క శెట్టి రాజ్ తరుణ్‌కు ఇష్టమైన ప్రదేశం? లండన్ రాజ్‌ తరుణ్‌కు ఇష్టమైన సినిమాలు? టైటానిక్, జగడం రాజ్ తరుణ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. రాజ్ తరుణ్ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కథలు రాయడం రాజ్ తరుణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.&nbsp; రాజ్ తరుణ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? &nbsp;ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=1nbxCrXjMeY
  మార్చి 21 , 2024
  <strong>అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం. అవికా గోర్ పూర్తి పేరు? అవికా సమీర్ గోర్ అవికా గోర్ ఎందుకు ఫేమస్ అవికా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అవికా గోర్ వయస్సు ఎంత? 1997,&nbsp; జూన్ 30న జన్మించింది అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా? ఉయ్యాల జంపాల(2013) అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా? కేర్‌ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009) అవికా గోర్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు&nbsp; అవికా గోర్ ఎక్కడ పుట్టింది? ముంబై అవికా గోర్ అభిరుచులు? ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్ అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం? పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్ అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా? మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అవికా గోర్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అవికా గోర్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. అవికా గోర్ తల్లిదండ్రుల పేరు? సమీర్ గోర్, చేతన గోర్ అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/avikagor/?hl=en అవికా గోర్ పెట్&nbsp; పేరు? షీరో https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
  ఏప్రిల్ 02 , 2024
  Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
  Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
  సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
  జూన్ 23 , 2023
  Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
  Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
  మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్‌ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.  View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) శ్రీజ కొణిదెల మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్‌ కూడా తన తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్‌ చేసిన కాజల్‌.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.&nbsp; View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) విష్ణు ప్రియ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) రాశి ఖన్నా నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) మమతా మోహన్‌ దాస్‌ నటి మమతా మోహన్‌ దాస్‌ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.  View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) హనీరోజ్‌ గ్లామర్‌ బ్యూటీ హనీరోజ్‌ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.&nbsp; View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) పద్మావతి మహేష్‌బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్‌ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.&nbsp; View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_) నైనికా విద్యాసాగర్ మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్‌ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
  మే 15 , 2023

  @2021 KTree