• TFIDB EN
  • VD12
    రేటింగ్ లేదు
    U/ATelugu
    గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఏప్రిల్ 28 నుంచి వైజాగ్‌లో సెకండ్ ఫేజ్ జరుపుకోనున్నట్లు సమాచారం.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    2024 Apr 272 months ago
    ఖైదీ సినిమా మాదిరి ఒక్క పాట కూడా లేకుండా తెరకెక్కుతున్న VD12
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విజయ్ దేవరకొండ
    భాగ్యశ్రీ బోర్సే
    కౌశిక్ మహతా
    రుక్మిణి వసంత్
    కేశవ్ దీపక్
    మణికంఠ వారణాసి
    సిబ్బంది
    గౌతమ్ తిన్ననూరి
    దర్శకుడు
    సాయి సౌజన్యనిర్మాత
    సూర్యదేవర నాగ వంశీనిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    కథనాలు
    VD12 : హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ డేరింగ్‌ డెసీషన్‌..? కెరీర్‌లోనే తొలిసారి!
    VD12 : హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ డేరింగ్‌ డెసీషన్‌..? కెరీర్‌లోనే తొలిసారి!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్‌ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. దీంతో రాబోయే చిత్రం విజయ్‌కు చాలా కీలకంగా మారింది. విజయ్‌ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సేషనల్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది విన్న విజయ్‌ ఫ్యాన్స్‌ తమ హీరో డేరింగ్‌ డెసిషన్‌కు ఆశ్చర్యపోతున్నారు.  డేరింగ్‌ డేసిషన్‌ ఏంటంటే? విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబోలో రానున్న 'VD12' చిత్రం.. యాక్షన్‌ డ్రామాగా రూపొందనుంది. విజయ్‌ రీసెంట్‌ చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో.. ప్రస్తుతం అతడి ఫోకస్‌ మెుత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవాలని విజయ్‌ దృఢసంకల్పంతో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘VD12’ సక్సెస్‌ కోసం ఎంతైన కష్టపడాలని అతడు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం విజయ్.. ఈ సినిమా కోసం ఓ డేరింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు అతడు సిద్ధపడ్డాడట. సాంగ్స్ ఎందుకు వద్దంటే? విజయ్‌ దేవరకొండ సినిమాలకు హిట్‌ ఆల్బమ్స్‌గా పేరుంది. అతడి ప్రతీ సినిమాలో కనీసం రెండు, మూడు సాంగ్స్‌ అయినా సూపర్‌ హిట్‌గా నిలుస్తుంటాయి. అటువంటిది ‘VD12’లో సాంగ్స్‌ వద్దని చిత్ర యూనిట్‌ భావిస్తుండటం అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీ నటించిన 'ఖైదీ' చిత్రం కూడా గతంలో ఒక్క పాట లేకుండానే వచ్చి.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే 'VD12' అనుసరించనుండటం గమనార్హం. అనిరుధ్‌ పైనే భారం! ‘VD12’ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. అనిరుధ్‌ పాటలు, నేపథ్య సంగీతానికి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘VD12’ను చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుధ్‌ మ్యూజిక్ ఒక్కటి చాలని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి భావిస్తున్నారట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ నమ్ముతోంది.  మరి ఈ ప్రయోగం విజయ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. హీరోయిన్‌గా కేరళ బ్యూటీ! ప్రేమలు చిత్రంతో యువతరం హృదయాలను దోచుకున్న మలయాళీ బ్యూటీ 'మమితా బైజు' (Mamita Baiju).. 'VD12'లో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల రిత్యా ఆమె స్థానంలో మమితాను తీసుకోవాలని మేకర్స్‌ నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘VD12’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ్‌, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని చేరువ చేసేందుకు మమితా బైజు క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ ఈ అమ్మడికి ఫాలోయింగ్‌ ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 
    ఏప్రిల్ 26 , 2024
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం యంగ్‌ సెన్సేషన్‌ మమితా బైజును హీరోయిన్‌గా లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ! ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్‌ భావించిందట. ఈ ఆఫర్‌ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్‌తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.  ఆ హీరోయిన్ల సరసన చోటు! మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌, నివేదా థామస్‌, మాళవిక మోహనన్‌ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్‌ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్‌ ఆడియన్స్‌.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్‌ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.  View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) మమితాపై ఆసక్తికి కారణమదేనా? 'VD 12' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇటీవల వచ్చిన  ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడం.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్‌ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. 
    ఏప్రిల్ 20 , 2024
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా
    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్‌ పరుశురామ్, జెర్సీ డైరెక్టర్‌ గౌతం తిన్ననూరితోనూ విజయ్‌ సినిమాలు చేయనున్నాడు. గౌతం డైరెక్షన్‌లో విజయ్‌ VD12 సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపిస్తాడని టాక్‌. ఇప్పటికీ సినిమా కథను గౌతం తిన్ననూరి  చెప్పగా అది రౌడీబాయ్‌కు విపరీతంగా నచ్చేసిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. తమ హీరోను ఖాకీ దుస్తుల్లో చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు.  2. నాని హిట్ -3 సినిమాతో నాని (NANI) కూడా మొద‌టిసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో అర్జున్ స‌ర్కార్ అనే పోలీస్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు. హిట్ -2 క్లైమాక్స్‌లో పోలీస్‌గా నాని లుక్ ఎలా ఉండ‌బోతుందో రివీల్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచేశారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. 3. నాగ చైతన్య నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. చై తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఇప్పటినుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.  4. అల్లరి నరేష్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) లేటెస్ట్‌ మూవీ ‘ఉగ్రం’.. ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇందులో నరేష్‌ సీఐగా కనిపించి మెప్పించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా నరేష్‌ కనిపించాడు. యాక్షన్‌ సీన్లలోనూ ఇరగదీయగలనని నిరూపించుకున్నాడు. ఉగ్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం నరేష్ అందుకున్నాడు.  5. కిరణ్‌ అబ్బవరం యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. ఎప్పుడూ ప్రేమికుడిగా, పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే కిరణ్‌ అబ్బవరం మీటర్‌ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఎస్సైగా మెప్పించాడు. ఇందులో కిరణ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మీటర్ స్ట్రీమింగ్ అవుతోంది.  6. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ పోతినేని (Ram pothineni) - కృతి శెట్టి (Krithi Shetty)  జంటగా చేసిన చేసిన సినిమా వారియర్‌. ఈ సినిమాలో రామ్‌ తొలిసారి పోలీసు గెటప్‌లో కనిపించాడు. మామూలుగానే యాక్షన్‌ సీన్లలో అదరగొట్టే రామ్‌.. ఒంటిపైన ఖాకీ దుస్తులతో ఈ సినిమాలో మరింత ఇరగతీశాడు. అయితే ఆశించిన రేంజ్‌లో వారియర్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. పోలీసు పాత్రలోనూ మెప్పించగలనని రామ్‌ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.  7. సుధీర్‌ బాబు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన చేసిన రీసెంట్‌ మూవీ ‘హంట్‌’ మిశ్రమ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో సుధీర్‌బాబు కూడా పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. గతంలో ‘V’ సినిమాలోనూ సుధీర్ బాబు పోలీసాఫీసర్‌గా చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తూ అదరగొట్టాడు. ఇందులో సుధీర్‌బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
    మే 08 , 2023
    <strong>Vijay Deverakonda: </strong><strong>విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్‌ చేసుకొని..!&nbsp;</strong>
    Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్‌ చేసుకొని..!&nbsp;
    టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్‌ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌.. తనకంటూ&nbsp; ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్‌.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్‌ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ఎమోషనల్‌ పోస్టు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్‌ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్‌ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్‌ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్‌.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్‌.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్‌ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్‌ గట్టిగా హగ్‌ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.&nbsp; https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA== అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ కుమారుడు! విజయ్‌ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్‌, ఖుషి, ఫ్యామిలీ స్టార్‌) బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్‌ తన తర్వాతి చిత్రంపై ఫోకస్‌ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్‌ కూడా ఓకే చెప్పడంతో విజయ్‌ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్‌.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్‌ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. సాయిపల్లవితో రొమాన్స్‌ రౌడీ భాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్‌ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్‌ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp;
    జూన్ 19 , 2024
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్‌ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని&nbsp; మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై&nbsp; నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది. డియర్ కామ్రెడ్ రికార్డు.. తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్‌ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది.&nbsp; హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా&nbsp; 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. &nbsp; ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఆ రోజు బాధపడ్డాం.. మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్&nbsp; సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్‌ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది.&nbsp; ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది. విజయ్ బిజీ బిజీ ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్‌ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
    జూన్ 15 , 2024
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  హిస్టారికల్‌ మూవీ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/MythriOfficial/status/1788443050177659232 భారీ అంచనాలు 'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.  ‘VD12’ నుంచి అప్‌డేట్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.  https://twitter.com/SitharaEnts/status/1788428225003278352 విజయ్‌ డేరింగ్ డెసిషన్‌! 'VD12' సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 
    మే 09 , 2024
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్‌ కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్లు అందించిన&nbsp; ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో మెుదలైంది.&nbsp; ఎందుకు కలిశారంటే! హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌.. ప్రశాంత్‌ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్‌ 2’లో విజయ్‌ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్‌ 2' క్లైమాక్స్‌లో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్‌ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్‌. అయితే దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; చిక్కుల్లో విజయ్‌ కెరీర్‌! విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్‌ ఖాతాలో పడితే అతడి కెరీర్‌ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పడేనా? విజయ్‌(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్‌ స్టోరీ కావడం, విజయ్‌ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పెడుతుందో లేదో చూడాలి. https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
    ఏప్రిల్ 24 , 2024
    Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ముగ్గురు స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, విజయ్‌ దేవరకొండ ‘VD 12’, నాని - సుజీత్‌ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్‌ అయ్యింది. దీంతో టాలీవుడ్‌కు మరో కొత్త స్టార్‌ హీరోయిన్‌ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. భాగ్యశ్రీ బోర్సే ఎవరు? బాలీవుడ్‌కు చెందిన యువ నటి. భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర ఔరంగబాద్‌లో భాగ్యశ్రీ జన్మించింది. భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది? ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు. &nbsp; భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు? తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp;&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత? 178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు) భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది? నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి? ఈ భామ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి? హిందూ భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌ను ఎలా ప్రారంభించింది? సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్‌ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్‌ అయ్యింది? క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్‌ వచ్చింది.&nbsp; భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది? 2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'యారియన్‌ 2' ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు? రాజ్యలక్ష్మీ భాగ్యశ్రీ బోర్సే అప్‌కమింగ్‌ తెలుగు చిత్రాలు? ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘VD 12’, ‘Nani 32’ భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్‌ ఫుడ్‌? తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.&nbsp; భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు? ఫేవరేట్‌ యాక్టర్స్‌ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్‌ చేయలేదు.&nbsp; భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌ ఏది? https://www.instagram.com/bhagyashriiborse/?hl=en
    ఏప్రిల్ 12 , 2024

    @2021 KTree