• TFIDB EN
  • V
    UATelugu2h 20m
    క్లిష్టతరమైన కేసులను ఛేదిస్తూ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్‌కు... 'V' అనే సీరియల్ కిల్లర్ చిక్కుముడిగా మారుతాడు. తనను హత్యలు చేయకుండా అడ్డుకోవాలని పోలీస్‌ ఆఫీసర్‌ను 'V' సవాలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాని
    యెండ్లూరి విష్ణు
    సుధీర్ బాబు
    డిసిపి ఎన్. ఆదిత్య
    నివేతా థామస్
    అపూర్వ రామానుజన్
    అదితి రావ్ హైదరీ
    విష్ణు భార్య
    వెన్నెల కిషోర్
    మన్సూర్
    తనికెళ్ల భరణి
    ఐజీ వైవీ నరేంద్ర
    నరేష్
    ఆదిత్య తండ్రి
    రోహిణి
    అపూర్వ తల్లి
    తలైవాసల్ విజయ్
    అపూర్వ తండ్రి
    వినయ్ వర్మ
    సాదిక్ హాసన్
    హరీష్ ఉత్తమన్
    రంజిత్
    ఆదర్శ్ బాలకృష్ణ
    శరత్ చంద్ర
    రవి వర్మ
    కె.కె
    మధుసూధన్ రావు
    మల్లికార్జున్
    రాజా చెంబోలురత్నకుమార్
    శ్రీకాంత్ అయ్యంగార్
    రషీద్
    జయప్రకాష్
    డిజిపి టి. జయరాజ్
    ఆనంద చక్రపాణి
    హోం మంత్రి
    రజిత
    రమణి
    గెటప్ శ్రీను
    వైభవి జోషి రంగ రంగేలిలో ఒక ఐటెమ్ నంబర్
    సత్యసాయి శ్రీనివాస్డిసిపి బి. సత్యకుమార్
    సిబ్బంది
    మోహన కృష్ణ ఇంద్రగంటి
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    శిరీష్నిర్మాత
    లక్ష్మణ్నిర్మాత
    హర్షిత్ రెడ్డినిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    అమిత్ త్రివేది
    సంగీతకారుడు
    పిజి విందా
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  [toc] వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ & హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌  రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ & ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    అక్టోబర్ 25 , 2024
    Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్‌ సేన్‌.. ‘మెకానిక్‌ రాకీ’ నుంచి సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌! 
    Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్‌ సేన్‌.. ‘మెకానిక్‌ రాకీ’ నుంచి సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌! 
    యంగ్ హీరో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్‌, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్‌‌.. ఇటీవలే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్‌ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్‌‌ ‘మెకానిక్‌ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.  ‘ఓ పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky). రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌ బాస్టర్ ఆల్బమ్‌ అందించిన జేక్స్‌ బెజోయ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్‌ అజీజ్‌ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి. https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s సాంగ్ ఎలా ఉందంటే? రాఖీ (విష్వక్‌ సేన్‌), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్‌‌ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్‌ అజీజ్‌ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్‌, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్‌ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్‌ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్‌ ఎప్పటిలాగే తన క్లాసిక్‌ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది.   ‘లైలా’గా విష్వక్‌ విష్వక్‌ మెకానిక్‌ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్‌ చేస్తున్నాడు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్‌ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్‌ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్‌ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్‌‌ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్‌ ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.  https://twitter.com/HanuNews/status/1808353426721407104 పోలీసు ఆఫీసర్‌గా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్‌ చేశాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌ పోస్టర్‌ చూస్తుంటే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.  https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948 హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది. 
    సెప్టెంబర్ 18 , 2024
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    సెప్టెంబర్ 10 , 2024
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    న‌టీన‌టులు: వి.కె.న‌రేశ్‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాగ్ మ‌యూర్‌, శ్రీల‌క్ష్మి, ప్రియ‌ద‌ర్శిని, ర‌వితేజ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు రచన, ద‌ర్శ‌క‌త్వం: అనురాగ్ పాలుట్ల‌ సంగీతం: ఆర్‌.హెచ్‌.విక్ర‌మ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: సి.అంకుర్‌ నిర్మాత‌లు: బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌ విడుద‌ల తేదీ: 14-08-2024 ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్‌ మయూర్‌ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్‌ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.  కథేంటి రైల్వే ఉద్యోగి వీరాంజ‌నేయులు (బ్ర‌హ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజ‌నేయులు మ‌ర‌ణంతో ఇంటి బాధ్య‌త కుమారుడు నాగేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)పై ప‌డుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె స‌రయు (ప్రియా వ‌డ్ల‌మాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వ‌స్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌స్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మ‌రి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వీరు (రాగ్ మ‌యూర్‌)కు, స‌ర‌యు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే నాగేశ్వ‌ర‌రావు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో న‌రేశ్ త‌న‌దైన శైలిలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్‌ నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. యున నటుడు రాగ్‌ మయూర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్‌ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక ర‌వితేజ‌, రాకేశ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్‌ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్ర‌మ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్‌ చేసింది. అటు అంకుర్‌ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్‌ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నరేశ్‌, రాగ్ మ‌యూర్‌ నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకొన్ని సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    ఆగస్టు 14 , 2024
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్‌ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై  నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది. డియర్ కామ్రెడ్ రికార్డు.. తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్‌ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది.  హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా  40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు.   ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఆ రోజు బాధపడ్డాం.. మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్  సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్‌ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది.  ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది. విజయ్ బిజీ బిజీ ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్‌ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
    జూన్ 15 , 2024
    Vijay Deverakonda - Sai Pallavi: విజయ్‌ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్! 
    Vijay Deverakonda - Sai Pallavi: విజయ్‌ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్! 
    నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది.  క్రేజీ లవ్‌స్టోరీ..  రౌడీ భాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్‌ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.  లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌ తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్‌ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్‌’ సహా ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.  ఫుల్‌ స్వింగ్‌లో సాయిపల్లవి ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్‌’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్‌’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా మెుదలైంది.  పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్‌.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్‌ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్‌ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
    జూన్ 06 , 2024
    Vijay- Sukumar Movie: డైరెక్టర్‌ సుకుమార్‌తో విజయ్‌ దేవరకొండ  కొత్త చిత్రం?
    Vijay- Sukumar Movie: డైరెక్టర్‌ సుకుమార్‌తో విజయ్‌ దేవరకొండ  కొత్త చిత్రం?
    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు గత కొన్ని ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఆయన గత మూడు చిత్రాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ హీరో కొత్తగా ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్‌ మాత్రం అతడి ఫ్యూచర్‌ మూవీస్‌పై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల విజయ్‌ ఓ పిరియాడికల్‌ మూవీలో నటిస్తున్న ప్రకటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడు. ఇక లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్‌ ప్రకారం స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో రౌడీ బాయ్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.  ‘విజయ్‌ - సుకుమార్‌ మూవీ పక్కా..’ విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి (Kedar Selagamsetty) చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన 'గం గం గణేశా' చిత్రానికి కేదార్‌ నిర్మాతగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇది విన్న విజయ్ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.  Sukumar : Vijay Deverakonda's film will be there. I thought this year RamCharan and Sukumar film might be in progress but didn't happen, Pushpa2 is in progress. Currently, our project [ VD, Sukumar ] will take more time to go on floors, Sukumar Garu after completing his current… pic.twitter.com/2yNpn4tyhG— RatpacCheck (@RatpacCheck) May 20, 2024 గతంలోనే ప్రకటన విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో కొద్ది సంవత్సరాల క్రితమే ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి నేతృత్వంలోని ఫాల్కన్‌ నిర్మాణ సంస్థ వీరి కాంబోలో సినిమా తీసేందుకు అప్పట్లో ప్రయత్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ‘పుష్ప 2’ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని భావించినా సుకుమార్‌.. రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించడంతో ఇక విజయ్‌తో సినిమా లేనట్లేనని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్‌గా విజయ్‌-సుకుమార్‌ సినిమా ఉంటుందని నిర్మాత ప్రకటించడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.  2026 తర్వాతే..! ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌.. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల తేదీ (ఆగస్టు 15) దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే రామ్‌చరణ్‌తో సినిమా మెుదలవుతుంది. చరణ్‌తో మూవీ కంప్లీట్‌ అయిన తర్వాత విజయ్‌తో సుకుమార్‌ సినిమా చేయనున్నట్లు నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి తెలిపారు. దీని ప్రకారం విజయ్‌ - సుకుమార్‌ మూవీ పట్టాలెక్కడానికి ఎట్టలేదన్న 2026 వరకూ ఆగాల్సిందేనని టాక్‌ వినిపిస్తోంది. పైగా పుష్ప 3 కూడా ఉండొచ్చని గతంలో బన్నీ ప్రకటించిన నేపథ్యంలో విజయ్‌ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) తర్వాత విజయ్‌ దేవరకొండ తన నెక్స్ట్‌ ఫిల్మ్‌ను ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో కలిసి చేస్తున్నాడు. ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు విజయ్‌ ఓకే చెప్పాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌తో కలిసి విజయ్‌ ఓ పిరియాడికల్‌ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ కాగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దిల్‌రాజు నిర్మాతగా రవి కిరణ్‌ కోలాతో కలిసి ఓ యాక్షన్‌ డ్రామా సైతం విజయ్‌ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్‌తో విజయ్‌ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. 
    మే 21 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  హిస్టారికల్‌ మూవీ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/MythriOfficial/status/1788443050177659232 భారీ అంచనాలు 'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.  ‘VD12’ నుంచి అప్‌డేట్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.  https://twitter.com/SitharaEnts/status/1788428225003278352 విజయ్‌ డేరింగ్ డెసిషన్‌! 'VD12' సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 
    మే 09 , 2024
    VD12 : హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ డేరింగ్‌ డెసీషన్‌..? కెరీర్‌లోనే తొలిసారి!
    VD12 : హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ డేరింగ్‌ డెసీషన్‌..? కెరీర్‌లోనే తొలిసారి!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్‌ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. దీంతో రాబోయే చిత్రం విజయ్‌కు చాలా కీలకంగా మారింది. విజయ్‌ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సేషనల్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది విన్న విజయ్‌ ఫ్యాన్స్‌ తమ హీరో డేరింగ్‌ డెసిషన్‌కు ఆశ్చర్యపోతున్నారు.  డేరింగ్‌ డేసిషన్‌ ఏంటంటే? విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబోలో రానున్న 'VD12' చిత్రం.. యాక్షన్‌ డ్రామాగా రూపొందనుంది. విజయ్‌ రీసెంట్‌ చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో.. ప్రస్తుతం అతడి ఫోకస్‌ మెుత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవాలని విజయ్‌ దృఢసంకల్పంతో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘VD12’ సక్సెస్‌ కోసం ఎంతైన కష్టపడాలని అతడు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం విజయ్.. ఈ సినిమా కోసం ఓ డేరింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు అతడు సిద్ధపడ్డాడట. సాంగ్స్ ఎందుకు వద్దంటే? విజయ్‌ దేవరకొండ సినిమాలకు హిట్‌ ఆల్బమ్స్‌గా పేరుంది. అతడి ప్రతీ సినిమాలో కనీసం రెండు, మూడు సాంగ్స్‌ అయినా సూపర్‌ హిట్‌గా నిలుస్తుంటాయి. అటువంటిది ‘VD12’లో సాంగ్స్‌ వద్దని చిత్ర యూనిట్‌ భావిస్తుండటం అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీ నటించిన 'ఖైదీ' చిత్రం కూడా గతంలో ఒక్క పాట లేకుండానే వచ్చి.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే 'VD12' అనుసరించనుండటం గమనార్హం. అనిరుధ్‌ పైనే భారం! ‘VD12’ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. అనిరుధ్‌ పాటలు, నేపథ్య సంగీతానికి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘VD12’ను చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుధ్‌ మ్యూజిక్ ఒక్కటి చాలని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి భావిస్తున్నారట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ నమ్ముతోంది.  మరి ఈ ప్రయోగం విజయ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. హీరోయిన్‌గా కేరళ బ్యూటీ! ప్రేమలు చిత్రంతో యువతరం హృదయాలను దోచుకున్న మలయాళీ బ్యూటీ 'మమితా బైజు' (Mamita Baiju).. 'VD12'లో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల రిత్యా ఆమె స్థానంలో మమితాను తీసుకోవాలని మేకర్స్‌ నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘VD12’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ్‌, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని చేరువ చేసేందుకు మమితా బైజు క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ ఈ అమ్మడికి ఫాలోయింగ్‌ ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 
    ఏప్రిల్ 26 , 2024
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్‌ కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్లు అందించిన  ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో మెుదలైంది.  ఎందుకు కలిశారంటే! హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌.. ప్రశాంత్‌ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్‌ 2’లో విజయ్‌ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్‌ 2' క్లైమాక్స్‌లో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్‌ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్‌. అయితే దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  చిక్కుల్లో విజయ్‌ కెరీర్‌! విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్‌ ఖాతాలో పడితే అతడి కెరీర్‌ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పడేనా? విజయ్‌(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్‌ స్టోరీ కావడం, విజయ్‌ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పెడుతుందో లేదో చూడాలి. https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
    ఏప్రిల్ 24 , 2024
    Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
    Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  విశ్వంభరలో అలనాటి నటి! విశ్వంభరలో చిరుకి జోడీగా నటి త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్‌ విజయశాంతి (Vijayashanti) కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ ప్రకారం సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరును మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ఆమెను ఒప్పించే పనిలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే విశ్వంభరపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి - విజయశాంతి జోడీగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇన్నాళ తర్వాత మళ్లీ వీరిద్దరిని తెరపై చూడటమంటే అది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.  చిరు కెరీర్‌లోనే తొలిసారి! ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ కూడా చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 26 రోజులు షూటింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. షూట్‌లో చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్‌లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నిర్వహించారు. కాగా, ఈ సీక్వెన్స్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, మెగా బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు.. ఈ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్‌ను కలవడం గమనార్హం. మెగాస్టార్‌ స్పెషల్‌ పోస్టు మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు (ఏప్రిల్‌ 23) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరు తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు. దీనికి విశ్వంభ‌ర సెట్స్ నుంచి తీసిన హనుమంతుడి ఫొటోను జత చేయడంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/KChiruTweets/status/1782634604022673632?
    ఏప్రిల్ 23 , 2024
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌! 
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌! 
    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే.  అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.  ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.  సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.  తమిళ స్టార్‌ హీరో కార్తిక్‌.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్‌ - వెంకటేష్‌ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.  గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.  https://twitter.com/yousaytv/status/1717459822881509489 వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.  వెంకటేష్‌.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3)  అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.  ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. 
    మార్చి 16 , 2024
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    దేశంలో భారీ స్థాయిలో మెట్రో సేవలు అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ (Hyderabad Metro) ఒకటి. రోజుకు వేలాది మంది నగర వాసులు మెట్రో ద్వారా ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను తప్పించుకొని మెట్రో ద్వారా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రో తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అది స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు సంబంధించిన డ్యాన్స్‌ వీడియో కావడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ హైదరాబాద్‌ మెట్రో విజయ్‌ వీడియోను ఎందుకు షేర్ చేసింది? ఆ వీడియో కింద ఇచ్చిన క్యాప్షన్ ఎందుకు వైరల్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.  విజయ్‌ల ఎవరూ చేయలేదు: మెట్రో విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) టీజర్‌ తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులో విజయ్‌.. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణిస్తూ స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన హైదరాబాద్‌ మెట్రో.. విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ.. 'మేము ఈ వీడియోను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాం. విజయ్‌ దేవరకొండతో పాటు ఫ్యామిలీ స్టార్‌ చిత్ర యూనిట్‌కు మా ధన్యవాదాలు. ఇంతకన్నా బెటర్‌గా మేము ఏం చెప్పగలము' అంటూ రాసుకొచ్చింది. అటు వీడియోలోనూ టెక్ట్స్‌ రూపంలో విజయ్‌ను ప్రశంసించింది. విజయ్‌లా ఇప్పటివరకూ మెట్రోను ఎవరూ ప్రమోట్‌ చేయలేదని పేర్కొంది.  https://twitter.com/ltmhyd/status/1764660143340286442 మిడ్‌క్లాస్‌ను టచ్‌ చేసిన టీజర్‌! విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. ఇందులో మీడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ను టచ్‌ చేసే సీన్స్‌ను అలా ఒక ఫ్లాష్‌లో చూపించేశారు. ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ బాధ్యతలతో పాటు హీరోయిజంను డైరెక్టర్‌ పరుశురాం ఈ చిన్న టీజర్‌లో చూపించాడు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా గోవిందం తర్వాత విజయ్‌ - పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్‌’ భారీగా అంచనాలు ఉన్నాయి.  https://www.youtube.com/watch?v=9z83t3gB9vE మృణాల్‌ - విజయ్‌ కెమెస్ట్రీ మాముల్గా లేదుగా! విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’లో హీరో విజయ్.. హీరోయిన్‌ రష్మికను ‘మేడం మేడం’ అంటూ వెంట తిరుగుతాడు. ఆ మేడం అనే పిలుపు అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఫ్యామిలీ స్టార్‌లో ‘ఏవండీ’ అనే పిలుపు కూడా ఆ స్థాయిలోనే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ ఈ ‘ఏవండీ’ అనే పిలుపు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. ఇక టీజర్‌లోనూ మళ్లీ అదే పిలుపు మృణాల్‌ నోట వినిపించింది. తాజాగా విజయ్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియోలోను మృణాల్‌ విజయ్‌ను ఏవండి అంటూ ప్రేమగా పిలుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరి కెమెస్ట్రీ తెరపై కనువిందు చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.  https://twitter.com/TheDeverakonda/status/1765018796358775059 సరిగ్గా 30 రోజుల్లో రిలీజ్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో వాసుకి, రోహిణితో పాటు మరికొందరు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గా 30 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది. విజయ్‌ తర్వాతి సినిమా ఫ్యామిలీ స్టార్‌ సినిమా పూర్తిగానే విజయ్ తన పన్నెండో చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ షూట్‌కు కూడా వెళ్లనుంది. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా శ్రీలీల నటించనుంది. 
    మార్చి 06 , 2024
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : అజ్మల్‌ అమీర్‌, మానస రాధాక్రిష్ణన్‌, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్‌ ప్రభూనే, కోటా జయరామ్‌, ఎలెనా టుతేజా తదితరులు దర్శకుడు : రామ్‌గోపాల్‌ వర్మ సంగీతం : బాలాజీ సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్‌ ఎడిటింగ్‌ : మనీష్‌ థాకూర్‌ నిర్మాత : దాసరి కిరణ్‌ కుమార్‌ టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్‌ (ధనుంజయ్‌ ప్రభునే), పవన్‌ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్‌ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే వైఎస్‌ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్‌ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్‌ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్‌ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్‌ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్‌ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్‌ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ పాత్రకు పాత్రకు మైలేజ్‌ ఇస్తూ.. చంద్రబాబు, పవన్‌ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్‌ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది. టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్‌ రాజేంద్రన్‌ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్‌ అజ్మల్‌ అమీర్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంద్వితీయార్థంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 02 , 2024
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
    ఫిబ్రవరి 26 , 2024
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  చిరు - త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్‌ నుంచి బయటకొచ్చి మెగాస్టార్‌ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్‌, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1754373323910533528 18 ఏళ్ల తర్వాత.. చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి  మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.  ఆచార్యకు నో చెప్పిన త్రిష! నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ చిరు లేటెస్ట్‌ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.  సెకండ్‌ హీరోయిన్‌ ఎవరో? ‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికేస్తున్నట్లు టాక్‌. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్‌, హానీ రోజ్‌, సంయుక్త మీనన్‌ పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.  13 భారీ సెట్‌లు..! చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది. 
    ఫిబ్రవరి 05 , 2024
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. కూలీ నంబర్ 1 (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ?????????????????????????????????????????????????????????????? ముద్దుల ప్రియుడు(1994) ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ..  ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోకిరి రాజా(1995) ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు. సూర్య వంశం(1998) ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. జయం మనదేరా(2000) జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవీ పుత్రుడు (2001) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర బోస్ (2005) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.  నాగవల్లి(2010) ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు. ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    నవంబర్ 10 , 2023
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం? సూపర్ పోలీస్ (1994) విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో  వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. పవిత్ర బంధం (1996) వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది. పెళ్లి చేసుకుందాం(1997)   ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది. రాజా (1999) ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. జయం మనదేరా (2000)  ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. దేవీ పుత్రుడు(2001) వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.
    నవంబర్ 10 , 2023
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్‌ట్యాగ్‌తో రిసెప్షన్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్‌ కలర్‌ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. టాలీవుడ్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వరణ్‌-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు. యంగ్‌ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్‌ లుక్‌లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు యంగ్‌ హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్‌లో హల్‌చల్‌ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ దంపతులు సైతం రిసెప్షన్‌కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు దంపతులు కూడా రిసెప్షన్‌ ఈవెంట్‌లో సందడి చేశారు.  యువ హీరో అల్లు శిరీష్‌ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్‌ అండ్‌ బ్లాక్‌ కోటులో వరుణ్‌, లావణ్య జంటతో ఫొటో దిగారు.  టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్‌ నంది కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.  బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, చిన్న కుమారుడు రిసెషన్షన్‌కు వెళ్లారు. యంగ్‌ హీరో కార్తికేయ, నటుడు నవదీప్‌ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.  టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్‌ కిషన్‌ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సీనియర్‌ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు. 
    నవంబర్ 06 , 2023

    @2021 KTree