• TFIDB EN
  • వల్లభ
    UA3h 5m
    వల్లభ తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన స్వప్నను ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని దాచి ఆమెకు దగ్గరవుతాడు. అయితే తనకంటే వయసులో పెద్ద వాడ్నే పెళ్లి చేసుకోవాలని స్వప్న భావిస్తుంటుంది. వల్లభ గురించి నిజం తెలిసిన ఆమె ఏం చేసింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సిలంబరాసన్
    రీమా సేన్
    నయనతార
    సంధ్య
    సంతానం
    సత్యన్
    ప్రేమగీ అమరెన్
    S. Ve. శేఖర్
    జానకి సబేష్
    అంబానీ శంకర్
    కార్తీక్ సబేష్
    గుహన్ షణ్ముగం
    బాలకుమారన్
    T. రాజేందర్
    కనల్ కన్నన్
    మహత్ రాఘవేంద్ర
    జగన్
    తార శ్రీనివాసన్
    సిబ్బంది
    సిలంబరాసన్
    దర్శకుడు
    పిఎల్ తేనప్పన్
    నిర్మాత
    యువన్ శంకర్ రాజా
    సంగీతకారుడు
    కథనాలు
    Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
    Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు.. తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీతో సత్సంబంధాలు లేవని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్‌కు పోటీగా మారతాడన్న ఉద్దేశ్యంతో తారక్‌ను టీడీపీ దూరంగా పెడుతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ వైఖరితో అతడి మనసు నొచ్చుకుందని అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని అప్పటి అధికార వైకాపా వినియోగించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు తారక్‌కు మద్దతు ఇస్తూనే టీడీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. అయితే వీటన్నింటికి తారక్‌ ఒక్క ట్విట్‌తో పటాపంచలు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తనదైన శైలిలో అభినందనలు చెప్పారు.  ‘మామయ్యకు శుభాకాంక్షలు’ ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని అందుకున్న చంద్రబాబు (Chandra Babu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)లకు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్‌ కల్యాణ్‌ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/tarak9999/status/1798287485879140762 https://twitter.com/tarak9999/status/1798287613130150054 కల్యాణ్‌రామ్‌ స్పెషల్‌ విషెస్‌ తారక్‌తో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ కూడా టీడీపీకి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశాడు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్‌, శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.  https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290427482877958 https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290491995541547 కలిసిపోయినట్లేనా? గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఇద్దరూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషి అవుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. తామంతా ఒక్కటే అన్న భావాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తారక్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ను టీడీపీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇకపై టీడీపీకి అన్ని మంచి రోజులేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నాగార్జున, రామ్‌చరణ్‌ ఏమన్నారంటే? తారక్‌, కల్యాణ్‌ రామ్‌తో పాటు స్టార్‌ హీరోలు నాగార్జున, రామ్‌చరణ్‌లు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున అన్నారు. అటు చరణ్‌.. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ అభినందనలు తెలియజేశాడు. 
    జూన్ 05 , 2024
    <strong>Nayanthara Documentary Trailer:&nbsp; మాజీ లవర్స్‌ శింబు, ప్రభుదేవాపై నయన తార ఇండైర్ట్ కామెంట్స్.. వైరల్</strong>
    Nayanthara Documentary Trailer:&nbsp; మాజీ లవర్స్‌ శింబు, ప్రభుదేవాపై నయన తార ఇండైర్ట్ కామెంట్స్.. వైరల్
    తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇటీవల ఆమె జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను నయన్‌ పంచుకుంది.&nbsp; నాగార్జున, రానా ప్రశంసలు నయన్&nbsp; వృత్తి, వ్యక్తిగత జీవితంపై&nbsp; ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara: Beyond the Fairy Tale) పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దీనిని రూపొందిస్తున్నారు. నవంబర్‌ 18 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ (Nayanthara Documentary Trailer) ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో ఇండస్ట్రీలోని నటీనటులు నయనతార గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నయనతార తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొందని నాగార్జున చెప్పారు. నయన్ లేడీ సూపర్‌ స్టార్‌ అని రానా పేర్కొన్నాడు. కన్నడ నటుడు ఉపేంద్ర, తమిళ నటి రాధిక, దర్శకుడు అట్లీ నయనతారను ప్రశంసిస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని ట్రైలర్‌లో పంచుకున్నారు. మీరు చూసేయండి.&nbsp; https://twitter.com/NetflixIndia/status/1855121339474120928 కన్నీరు పెట్టిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ లేడీ సూపర్‌స్టార్‌ (Nayanthara Documentary Trailer)తో ప్రేమ ఎప్పుడు మెుదలైందో ట్రైలర్‌లో పంచుకున్నారు. అలాగే నయనతార మాట్లాడుతూ తన లైఫ్‌లోని క్రిటికల్ ఫేజ్‌ గురించి చెప్పుకొచ్చింది. తాను మనుషుల్ని త్వరగా నమ్మేస్తానని చెప్పింది. తెలుగులో వచ్చిన 'శ్రీరామరాజ్యం' ఆమె లాస్ట్‌ఫిల్మ్‌ అంటూ వచ్చిన వార్తలపై కూడా నయనతార మాట్లాడింది. అలాగే తను మరీ లావు అయ్యానంటూ ఓ వార్త సంస్థ రాసిన కథనంపై కూడా రియాక్ట్‌ అయ్యారు. తన గురించి పేపర్‌లో వచ్చేవన్ని చూసి అమ్మ చాలా భయపడేదంటూ నయనతార కంటతడి పెట్టారు. మరోవైపు నయనతార తల్లి మాట్లాడుతూ తన కూతురిపై పూర్తి నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు.&nbsp; https://www.youtube.com/watch?v=w6Bub3nu0vo శింభు, ప్రభుదేవాకు చురకలు! దర్శకుడు విఘ్నేశ్‌తో వివాహానికి ముందు నయనతార శింభు, ప్రభుదేవాలతో ప్రేమయాణం నడిపింది. ముఖ్యంగా వల్లభ సినిమా టైమ్‌లో శింబుతో ఈ అమ్మడు పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఏమైందో ఏమోకానీ వారు విడిపోయారు. ఆ తర్వాత అవార్డ్‌ విన్నింగ్‌ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవతో సైతం కొంత కాలం ప్రేమవ్యవహారం నడిచింది. అప్పట్లో ఎక్కడకైనా వీరిద్దరే జంటగా వెళ్లేవారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే బంధం కూడా ఎంతో కాలం నిలబడింది. ఆ తర్వాత ‘నేనూ రౌడీనే’ షూటింగ్‌ సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడటం ఆ తర్వాత ప్రేమలో పడటం, ఆపై పెళ్లి చకచకా జరిగిపోయింది. అయితే లేటెస్ట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ‘తాను మనుషుల్ని త్వరగా నమ్మేస్తా’ అని నయనతార వ్యాఖ్యానించడం వెనక శింభు, ప్రభుదేవ ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. పూర్తి డాక్యుమెంటరీలో ఈ వ్యవహారం గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో నయనతార ప్రస్తుతం ఫిల్మ్‌ కెరీర్‌ పరంగా నయనతార (Nayanthara Documentary Trailer) దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్‌' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్‌ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్‌', 'మన్నన్‌గట్టి సిన్స్‌ 1960', 'తని ఓరువన్‌ 2', 'ముకుతి అమ్మన్‌ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్‌ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్‌ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.&nbsp;
    నవంబర్ 09 , 2024
    <strong>LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;</strong>
    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;
    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] సమంత (Samantha) ‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్‌ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మహేష్‌ బాబుతో కాజల్‌ ఓ లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్‌ కిస్‌ చేస్తాడు. ఈ సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్‌ సీన్‌ కాజల్‌ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.&nbsp; https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q నయనతార (Nayanthara) ‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్‌ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.&nbsp; https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW రష్మిక మందన్న (Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రెచ్చిపోయింది.&nbsp; https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj నేహా శెట్టి (Neha Shetty) యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్‌ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్‌ సేన్‌ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది. https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz రుహానీ శర్మ (Ruhani Sharma) 'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్‌’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్‌ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది. https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k కేతిక శర్మ (Ketika Sharma) యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్‌ ఫిల్మ్ ‘రొమాంటిక్‌’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తోనూ లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7 https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri డింపుల్‌ హయాతి (Dimple Hayathi) విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్‌ డింపుల్‌ హయాతి లిప్‌లాక్‌ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్‌ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.&nbsp; https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF మాళవిక మోహన్‌ (Malavika Mohanan) మలయాళ నటి మాళవిక మోహన్‌ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్‌ ఛతుర్వేదితో కలిసి బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.&nbsp; https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1 తృప్తి దిమ్రి (Tripti Dimri) బాలీవుడ్‌ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్‌’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్‌ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్‌ న్యూస్‌’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్‌ సీన్‌ చేసింది.&nbsp; https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్‌’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.&nbsp; https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. అలాగే ఇంటిమేట్‌ సీన్‌లోనూ కనిపించి హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేసింది. https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu కావ్యా థాపర్‌ (Kavya Thapar) గ్లామర్‌ బ్యూటీ కావ్యా థాపర్‌ కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఒకప్పుడు ట్రెడిషనల్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాలంలో రొమాంటిక్‌ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.&nbsp; https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q- షాలిని పాండే (Shalini Pandey) అర్జున్‌ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm- శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రముఖ హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్‌ సీన్లలో నటించింది. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.&nbsp; https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4 https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu మానసా చౌదరి (Maanasa Chowdary) రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్‌ గమ్‌' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌ లాక్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్‌ లాక్స్‌ ఉన్నాయి.&nbsp; https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
    అక్టోబర్ 05 , 2024
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్‌ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్‌, అబ్బాయ్‌ తమకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్‌ స్పందించకపోవడం, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరోమారు నందమూరి కుటుంబానికి - తారక్‌ మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; తారక్‌కు అందని ఆహ్వానం! నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డితో పాటు చిరంజీవి (Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు కూడా ఇన్విటేషన్స్‌ వెళ్లాయి. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూ.ఎన్టీఆర్‌ను మాత్రం ఈవెంట్‌ నిర్వాహకులు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు సైతం ఇన్విటేషన్‌ ఇవ్వలేదని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలకృష్ణ, తారక్‌ మధ్య ఉన్న మనస్పర్థలు మరోమారు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బాలయ్య సూచన మేరకే నిర్వాహకులు వారిద్దరిని ఆహ్వానించలేదని టాక్‌ వినిపిస్తోంది. దీంతో బాలయ్య-తారక్‌ మధ్య రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.&nbsp; విభేదాలకు కారణాలు ఇవేనా..! వై.ఎస్‌. జగన్‌ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఏకంగా 50 రోజుల పాటు జైలులో పెట్టింది. దీనిపై నందమూరి కుటుంబం పెద్ద ఎత్తున చంద్రబాబు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జగన్‌ ప్రతీకార రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇంత జరుగుతున్నా తారక్‌ మాత్రం అప్పట్లో దీనిపై పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ట్విటర్‌ వేదికగా ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు పోస్టు సైతం పెట్టలేదు. తారక్‌ మౌనంగా ఉండటం సరికాదంటూ టీడీపీ క్యాడర్‌, తెలుగు దేశం సోషల్‌ మీడియా విభాగం సూచిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో బాలయ్య తీవ్ర అసహనానికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.&nbsp; కంట్రోల్‌ చేయని తారక్‌! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తారక్‌కు అత్యంత సన్నిహితులు. నాని, వంశీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వారు ఇరువురు చంద్రబాబు, అతడి కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాలకృష్ణపై కూడా అవాకులు, చవాకులు పేల్చారు. ఒక దశలో చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు సైతం మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితులైన వంశీ, నానిని తారక్‌ నియంత్రించలేదని విమర్శలు వచ్చాయి. ప్రారంభంలోనే వారిని తారక్ మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.&nbsp; తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    ఆగస్టు 31 , 2024
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు:&nbsp; బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి ఎడిటింగ్‌ : తమ్మిరాజు నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి విడుద‌ల తేదీ: 15-03-2024 తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.&nbsp; సాంకేతికంగా సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ మితిమీరిన హింసతెలిసిన కథ కావడం.. Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 15 , 2024
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి? సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.&nbsp; కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌! రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; కథలు సైతం వెళ్లడం లేదా? ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.&nbsp; నెపోటిజం vs టాలెంట్‌! అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.&nbsp; తప్పు ప్రేక్షకుల్లో ఉంది! గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్‌ సంచలన నిజాలు</strong>
    Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్‌ సంచలన నిజాలు
    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) టాలీవుడ్‌ను టార్గెట్‌ చేశారంటూ విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.&nbsp; ‘అనుమతి లేకున్నా వచ్చారు’ ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఘటన జరిగిన తీరు, హీరో నిర్లక్ష్య ధోరణి గురించి ప్రస్తావించారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌ రెండో తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే మూడో తారీఖు పోలీసులు తిరస్కరించారు. నాలుగో తారీఖున ఎవరూ థియేటర్‌కి రావొద్దు మేము పర్మిషన్ ఇవ్వము అని పోలీసులు తిరస్కరించినా హీరో రాత్రి 9.30కి థియేటర్‌కు వచ్చారు’ అని రేవంత్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/Aale_Baale/status/1870403630509277346 ‘సైలెంట్‌గా వెళ్లలేదు’ అల్లు అర్జున్‌ అనుమతి లేకుండా రావడమే కాకుండా రూఫ్‌ టాప్‌ ఓపెన్‌ చేసి భారీ జన సమీకరణకు కారణమయ్యాడని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘బన్నీ సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేది కాదేమో. క్రాస్‌ రోడ్‌ చౌరస్తా ముందు నుంచే కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్తూ వెళ్లారు. దీనివల్ల చుట్టుపక్కల థియేటర్ల ఆడియన్స్‌ బన్నీని చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. దీంతో రోడ్లపై వేలాది మంది పోగయ్యారు. దీంతో అక్కడ ఒక విధమైన రద్దీ వాతావరణం ఏర్పడింది’ అని రేవంత్‌ అన్నారు.&nbsp; ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’ ర్యాలీగా బన్నీ రావడంతో అతడితో పాటే థియేటర్‌లోకి ఫ్యాన్స్‌ బలంగా తోసుకువచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతని ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు&nbsp; విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసలాట జరిగిందని సీఎం తెలిపారు. చివరికి అక్కడ ఉన్న జనాలను పోలీసులు చెల్లాచెదురు చేయడంతో అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడి కనిపించారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఒకేసారి అంతమంది తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగి ఆమె (రేవతి) చనిపోయిందని అసెంబ్లీలో స్పష్టం చేశారు.&nbsp; ‘బిడ్డను రక్షించేందుకు రేవతి యత్నించింది’ తొక్కిసలాట సమయంలో బిడ్డను కాపాడుకునేందుకు తల్లిగా రేవతి ఎంతో ప్రయత్నించిందని సీఎం రేవంత్‌ తెలిపారు. సొమ్మసిల్లిపడిపోయినా కూడా బిడ్డ చేతిని మాత్రం గట్టిగానే పట్టుకొని ఉండిపోయిందని అన్నారు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని, బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడని సీఎం అన్నారు. అటు థియేటర్లో కూడా హీరోని కలవాలని తొక్కిసలాట జరిగినట్టు తెలిసిందని రేవంత్‌ చెప్పారు.&nbsp; https://twitter.com/CoreenaSuares2/status/1864377538631328021 ‘వెళ్లమని చెప్పినా వినలేదు’ తొక్కిసలాట అనంతరం హీరోను వెళ్లిపోమని పోలీసులు సూచించారని కానీ ఆయన వినలేదని సీఎం రేవంత్ తెలిపారు. సినిమా చూసే వెళ్తానని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘హీరో థియేటర్‌లో ఉండగా బాల్కనీలో కూడా అభిమానులు నిల్చొని ఒకరిపై ఒకరు పడే పరిస్థితి ఏర్పడింది. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో హీరోను వెళ్లిపోమని చెప్పడానికి వెళ్తే ఏసీపి కూడా రావొద్దని థియేటర్ వాళ్లు చెప్పారు. అందరిపై కేసులు నమోదు చేస్తానని హెచ్చరిస్తే అప్పుడు లోపలికి అనుమతించారు’ అని రేవంత్‌ చెప్పారు.&nbsp; ‘రిటర్న్‌లోనూ చేతులు ఊపుకుంటూ వెళ్లాడు’ అల్లు అర్జున్‌ వద్దకు ఏసీపీ వెళ్లి బయట పరిస్థితిని వివరించిన ఆయన పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘బయట ఒకరు చనిపోయారని ఏసీపీ హీరోకి చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు వెళ్ళిపోవాలి అంటే లేదు సినిమా చూసి వెళ్తా అని ఆ హీరో చెప్పినట్టు నాకు సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. దాంతో పై అధికారి రంగంలోకి దిగి హీరోకి చెప్పి ఇక్కడ్నుంచి మీరు వెళ్ళాలి అని అతన్ని తీసుకెళ్లి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ అభిమానులను చూసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కొంతమంది థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి హీరోని మీరు A11 అని చెప్తే అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఆ తర్వాత అరెస్ట్ చేసారు’ అని సీఎం అన్నారు. https://twitter.com/M9News_/status/1870405933672911317 ‘అతడి కాలు, చేతులు పోయాయా’ జైలు నుంచి విడుదలయ్యాక సెలబ్రిటీలు అల్లు అర్జున్‌ ఇంటికి క్యూ కట్టడం పైనా సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ సినీ ప్రముఖులు.. ఒక్క రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఇంటికెళ్లి ప్రభుత్వాన్ని తిడుతండ్రు. నన్ను తిడుతుండ్రు. అతడ్ని పరామర్శిస్తుండ్రు. ఏమైంది అధ్యక్ష.. అతడి కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా. అతడ్ని (బన్నీ) ఇంతమంది సినీ ప్రముఖులు పలకరించారు గానీ, ఆస్పత్రిల్లో ఉన్న పిల్లాడ్ని (శ్రీతేజ్‌) కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాలేదు' అని అన్నారు. https://twitter.com/M9News_/status/1870407972058447983 ఇక పై నో బెనిఫిట్ షోస్ సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఇకపై ఊరుకోనని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకు సీఎం కూర్చీలో కూర్చున్నన్ని రోజులు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి 'తెలంగాణలో ఇకపై బెన్‌ ఫీట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపును రద్దు చేస్తున్నాం' అని ప్రకటించారు. బన్నీపై చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి MIM నేత అక్బరుద్ధీన్‌ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం. https://twitter.com/Trends4TDP/status/1870406612038598805
    డిసెంబర్ 21 , 2024
    <strong>Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;</strong>
    Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్‌ పెట్టకుంటే ముప్పు తప్పదా!&nbsp;
    ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్‌ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్‌ ఇండస్ట్రీ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి టాలీవుడ్‌ (Tollywood), కోలివుడ్‌ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్‌ ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్‌ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్‌ ఇండస్ట్రీస్‌ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్‌ వార్స్‌ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; టాలీవుడ్‌ vs కోలీవుడ్‌ గతంలో ఫ్యాన్‌ వార్‌ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్‌ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్‌ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్‌, కోలివుడ్‌ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్‌ చేసిన చిత్రాలు రిలీజ్‌ అయితే తెలుగు ఆడియన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు. https://twitter.com/iammvengence/status/1758435868799377642 https://twitter.com/RAO_Offl/status/1759121949656318267 నష్టం ఏంటంటే? కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్‌ చేస్తున్న ఈ ట్రోల్స్‌ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్‌ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్‌ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్‌ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్‌ ట్రోల్స్‌ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్‌ కంటే కలెక్షన్స్‌ పరంగా వెనకబడిపోతున్నాయి.&nbsp; ఆ సినిమాలకు దెబ్బ! త్వరలో రిలీజ్‌ అయ్యేందుకు సౌత్‌ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకోగా కోలీవుడ్‌ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్‌ నటించిన ‘అమరన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్‌ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్‌ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్‌ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.&nbsp; టైటిల్స్‌ రచ్చకు చెక్‌ పెట్టాల్సిందే! సౌత్‌లో బిగ్‌ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్‌ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్‌’, ‘రాయన్‌’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.&nbsp; పొలిటికల్‌ టర్న్‌ ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్‌ చేసిన పరోక్ష కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్‌ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్‌ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.&nbsp; https://twitter.com/i/status/1841876236840374698 పవన్‌ కల్యాణ్‌ vs అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్‌ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్‌ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023
    అనారోగ్యం , యశోద సినిమాపై మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన  సమంత
    అనారోగ్యం , యశోద సినిమాపై మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన సమంత
    ]ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికత వల్ల జరిగిన ఓ విషాదకరమైన అనుభవంDownload Our App
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;</strong>
    Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్‌ చేసేస్తున్నారు. షూటింగ్‌లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్‌ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్‌ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్‌-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.&nbsp; ‘ఆ ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు’ సినిమాలు పోస్టు పోన్‌ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్‌ ఆలస్యం, షూటింగ్‌లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్‌ చేస్తుండటంపై నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్‌ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్‌? నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్‌ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్‌ చేయాలని షూటింగ్‌ ప్రారంభంలోనే మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్‌ చేసుకోవడంతో సరిపోదా టీమ్‌ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్‌ 6 మారుస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్‌ చేసింది. ఆ వెంటనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌’, ‘ఆయ్‌’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్‌ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్‌ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్‌ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని సినిమాకు రన్‌ టైమ్‌ ఫిక్స్‌! నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A స‌ర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంట‌ల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఎస్‌.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp;
    ఆగస్టు 24 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.&nbsp; లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.&nbsp; యాత్ర-2&nbsp; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day&nbsp;MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
    విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బిమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతి వాతావరణాన్ని తెచ్చిన బ్లాక్‌బస్టర్ పొంగల్ ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాటలో పండుగ వాతావరణాన్ని పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పక్కా కుటుంబ వినోదాన్ని మేళవించి రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలో వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గ స్టెప్పులతో హోరెత్తించారు. ముఖ్యంగా బ్లాక్‌ బాస్టర్‌ సాంగ్‌కు వెంకటేష్ గాత్రం బాగా సెట్‌ అయిందని చెప్పొచ్చు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. భీమ్స్ సంగీతం పాటకు కొత్త జీవం పోసింది. వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విడుదలైన గంటలోనే 5 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. https://youtu.be/S8NDIJBbd3Q?si=5dVR3Nt755rxX_v9 వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినందున, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాల విజయాలతో అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకా సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పక్కా కుటుంబ కథ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా పండుగ సినిమా. ఈ చిత్రంలోని వినోదం, సంగీతం, కథ అన్నీ కుటుంబ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్ చేస్తున్న పాత్ర, ఆయన అల్లరి ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. పండుగ సీజన్‌లో కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
    డిసెంబర్ 30 , 2024
    <strong>Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;</strong>
    Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ ‘పూరి మ్యూజింగ్స్‌’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్‌ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్‌ మీడియా అనేది జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన సాధనమని, అయితే దానికి దూరంగా ఉంటే కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, విడాకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం పూరి జగన్నాథ్ అభిప్రాయం ప్రకారం.. ‘‘సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ప్రారంభమైన సాధనంగా కనిపించింది. కానీ, ఇప్పుడు మన జీవితాల్లో డిజిటల్‌ దెయ్యంలా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల మనం ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం మొదలుపెట్టాం. కొత్త దుస్తులు కట్టినా, ఇంట్లో సంతోషంగా ఉన్నా, స్నేహితులతో గడిపినా ప్రతి క్షణం ఫొటో తీసి పోస్ట్ చేయడంపై ఆసక్తి పెరిగింది. కానీ దీని వల్ల మానసిక శాంతి పోయి, అసూయ, అసంతృప్తి పెరుగుతున్నాయి.’’ ట్రోలింగ్‌ సమస్య ‘‘మీరు ఏ ఫొటో పోస్ట్ చేసినా అది అందరికి నచ్చదు. మీరు మాల్దీవుల్లో బికినీ ఫొటో పంచుకున్నా ట్రోలింగ్‌ తప్పదు. కొందరు విమర్శిస్తారు, మరికొందరు అసభ్యంగా మాట్లాడతారు. వాటిని చూసి బాధపడుతూ మీ పని మానేసి బాధతో కూర్చుంటారు. ఎందుకంటే, ఆ ఫొటోలు చూసే వాళ్లు కూడా పని లేని వాళ్లే. చివరకు మీరు కూడా అదే స్థితిలో పడిపోతారు.’’ సోషల్ మీడియా కారణంగా విడాకులు ‘‘తాజా సర్వే ప్రకారం, 10 విడాకుల్లో 3 వివాహాలు సోషల్ మీడియా కారణంగా బంధాలు దెబ్బతినడం వల్లే జరుగుతున్నాయి. కుటుంబ సంబంధాల నాశనం ప్రధానంగా డిజిటల్ వేదికల వల్లే జరుగుతోంది. ఇంట్లో గొడవలు, అశాంతికి సోషల్ మీడియా ప్రధాన కారణమని గుర్తించాలి’’ అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలి పూరి ఇంకా మాట్లాడుతూ,‘‘మీ ఇంట్లో జరిగే విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. మీ వ్యక్తిగత జీవితం గురించి బైట చెప్పకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లైన వారైతే ప్రతి ఫొటో, ప్రతి అంశం పంచుకోవడం ఆపేయాలి. మీ జీవితంలోని ఆనందాలు, కష్టాలు మీలోనే ఉంచుకోండి. మీ కుటుంబం మీదే దృష్టి పెట్టండి. దానివల్లనే జీవితానికి స్థిరత్వం వస్తుంది’’ అన్నారు. నెగెటివిటీకి దూరంగా ఉండండి ‘‘మీరు ఏ ఫొటో పెడితే అది నెగెటివిటీని ఆకర్షిస్తుంది. మీ కుక్క ఫొటో పెడితే అది అనారోగ్యానికి గురవుతుంది. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఫోటో పెడితే ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు వస్తాయి. ఈ ప్రవర్తన ద్వారా ఇతరుల అసూయ మీకు సమస్యలను తీసుకురాగలదు’’ అని పూరి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి కొత్త తీర్మానం ‘‘కొత్త సంవత్సరం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కనీసం ఒక్క నెల అయినా డిజిటల్‌ డిటాక్స్‌ చేపట్టండి. మీరు మీ జీవితంలో మానసిక శాంతి అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. మీ బంధాలు బలపడతాయి, విడాకులు తగ్గుతాయి, జీవితంలో సంతోషం పెరుగుతుంది’’ అని పూరి పేర్కొన్నారు. సమాజానికి పూరి సూచనలు పూరి చివరగా చెబుతూ..‘‘మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు మీ కుటుంబసభ్యులు. వాళ్లతో గడపడానికి మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. డిజిటల్ ప్రపంచాన్ని వినియోగించండి కానీ అది మిమ్మల్ని మింగివేయకూడదు.’’ ఈ సందేశం ద్వారా పూరి జగన్నాథ్ నేటి యువతికి మరియు కుటుంబాలకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని అందించారు.
    డిసెంబర్ 30 , 2024
    <strong>Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్‌.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్‌!</strong>
    Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్‌.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్‌!
    తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు నేతృత్వంలో ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎం కలిసి పలు అంశాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. అయితే సీఎంను కలిసిన వారిలో ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడాన్ని ప్రముఖ నటి పూనం కౌర్ ప్రశ్నించింది. మరో నటి మాధవిలత నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమస్యలు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న సమయంలో హీరోయిన్స్‌ చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  రేవంత్‌కు సూటి ప్రశ్నలు.. టాలీవుడ్‌ నటి మాధవిలత (Actress Madhavi Latha).. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టింది. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై సూటిగా ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ‘అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు. ఘటనపై సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది. కొడంగల్లో సీఎం కుటుంబ సభ్యుల వల్ల ఓ రైతు సూసైడ్ చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు కాకపోయినా రూ.25 వేలు అయినా ఇచ్చారా?. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం చేశారా?. జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని భావిస్తున్నారు’ అంటూ నటి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మాధవిలత BJPలో ఉన్నందున ఆ పార్టీ ప్రతినిధిగా తీవ్ర ఆరోపణలు చేశారని పొలిటికల్‌ వర్గాలు చెబుతున్నాయి. https://twitter.com/aadabhyd/status/1872552912662192500 మహిళలకు సమస్యలు లేవా? గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో జరిగిన సినీ పెద్దల భేటిపై నటి పూనం కౌర్‌ (Poonam Kour) తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు’ అంటూ ఎక్స్‌ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.  https://twitter.com/poonamkaurlal/status/1872294426640584857 ‘సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి’ క్యాన్సర్‌ బారిన పడ్డ తన బిడ్డకు తారక్‌ సాయం చేస్తానని మాటిచ్చి చేయలేదని ఓ మహిళ మాట్లాడిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది. దీనిపై స్పందించిన నటి మాధవిలత నెట్టింట ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బులిస్తూ పోతే హీరోలు రోడ్డునపడి అడుక్కుతినాలి. అభిమాని అంటే ఆశించే వాడు కాదు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది.. కానీ, అభిమానం ఎలా అవుద్ధి. ఇంకా రోజుకొకరు మాకు సాయం చేయమని బయటికి వస్తారు. కథలు పట్టుకుని ఫిల్మ్ నగర్‌లో చాలా మంది తిరుగుతుంటారు. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది’ అని మాధవీలత తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు తారక్‌ ఫ్యాన్స్‌ మద్దతిస్తున్నారు.&nbsp;&nbsp;
    డిసెంబర్ 27 , 2024
    <strong>Drinker Sai Movie Review: బాక్సాఫీస్‌ వద్ద తడబడ్డ ‘డ్రింకర్‌ సాయి’.. తేడా ఎక్కడ కొట్టిదంటే?</strong>
    Drinker Sai Movie Review: బాక్సాఫీస్‌ వద్ద తడబడ్డ ‘డ్రింకర్‌ సాయి’.. తేడా ఎక్కడ కొట్టిదంటే?
    నటీనటులు : ధర్మ కాకాని, ఐశ్వర్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పోసాని కృష్ణ మురళి, సమీర్‌, కిర్రాక్‌ సీత తదితరులు దర్శకత్వం : తిరుమలశెట్టి కిరణ్‌ సంగీతం: శ్రీ వసంత్‌ సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్‌, లహరిధర్‌ విడుదల తేదీ: డిసెంబర్‌ 27, 2024 ధర్మ, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'డ్రింకర్‌ సాయి' (Drinker Sai). తిరుమలశెట్టి కిరణ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. మద్యం, ధూమపానం వల్ల లైఫ్‌ను ఎలా తలకిందులు చేస్తాయో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్‌ వినూత్నంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్‌ 27, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? సమాజానికి మంచి సందేశం ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Drinker Sai Movie Review) కథేంటి కోటీశ్వరుడైన సాయి (ధర్మ) నిత్యం తాగుతూ డ్రింకర్ సాయిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ‌అతడికి మంచి, చెడు చెప్పేవారే లేకుండా పోతారు.&nbsp; మరోవైపు బాగీ (ఐశ్వర్య శర్మ) క్రమశిక్షణ కలిగిన యువతిగా జీవిస్తుంటుంది. మంచి ఆరోగ్య అలవాట్లను పాటిస్తుంటుంది. ఓ యాక్సిడెంట్‌ ద్వారా డ్రింకర్‌ సాయి ఆమె లైఫ్‌లోకి వస్తాడు. తొలి చూపుతోనే ఆమెను ప్రేమిస్తాడు. బాగీకి అతడంటే ఇష్టం లేనప్పటికీ వైలెన్స్‌ చేస్తాడన్న భయంతో భరిస్తూ వస్తుంటుంది. ఈ బలవంతపు లవ్‌స్టోరీ ఎక్కడ వరకూ సాగింది? డ్రింకర్ సాయిని బాగీ ప్రేమిస్తుందా ? ఒకవేళ ప్రేమిస్తే దానికి గల కారణాలు ఏంటి? బాగీ ప్రేమతో డ్రింకర్‌ సాయిలో వచ్చిన మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే డ్రింకర్‌ సాయి పాత్ర (Drinker Sai Movie Review)లో యువ నటుడు ధర్మ సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. అతడి రూపంలో ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని చెప్పవచ్చు. భావోద్వేగాలను ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా పలికించాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య శర్మ ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలకిస్తూ మెప్పించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కిర్రాక్‌ సీత, రీతు చౌదరి తమ కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. మంతెన సత్యనారాయణకు స్పూఫ్‌గా చేసిన వంతెన పాత్రతో నటుడు భద్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర పెద్దగా ఫన్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్‌ రొటీన్‌ కథతో సినిమాను తెరకెక్కించారు. తాగుడుకు బానిసైన హీరో.. తనను చూస్తేనే చికాకు పడే హీరోయిన్‌ను ఎలా ప్రేమలో పడేశాడు? అన్న కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. హీరో, హీరోయిన్ల పాత్రలు పరిచయం, ఆపై బాగీ వెంట సాయి పడటం, ఆమె ఛీకొట్టడం వంటి సీన్లతో తొలిభాగాన్ని ఫన్నీగా నడిపించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ వంతెన ఆశ్రమానికి కథ మళ్లడం, ఆశ్రమంలో కనిపించే ప్రతి విషయాన్ని సెటైరికల్‌గా చూపించారు. కొంతవరకూ వంతెన క్యారెక్టర్‌ బాగునప్పటికీ ఆశ్రమం చుట్టూ కథను ఎక్కువగా సాగదీయడం విసుగు తెప్పించింది. ఇక క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. కథ, కథనం విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ విషయాలకు వస్తే శ్రీ వసంత్ సమకూర్చిన పాటలు జస్ట్‌ ఓకే అనేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అక్కడక్కడ ఆకట్టుకుంది. కెమెరామెన్‌ ప్రశాంత్‌ అంకిరెడ్డి మంచి పనితీరు కనబరిచాడు. సినిమాను చూపించిన విధానం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ హీరో, హీరోయిన్‌ నటనభావోద్వేగాలుసందేశం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సన్నివేశాలుసహనానికి పరీక్షించే వంతెన పాత్ర Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    డిసెంబర్ 27 , 2024
    Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
    Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
    సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్‌ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్‌ ఇంటి నుంచి బన్నీ బయలుదేరారు. అతడితో పాటు తండ్రి అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్‌ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉ.11 గంటలకు అల్లు అర్జున్‌ విచారణ మెుదలైంది. ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. అల్లు అర్జున్ ఎమోషనల్‌.. పోలీసుల విచారణ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపించిన వీడియో చూసి ఆయన ఎమోషనల్‌ అయినట్లు సమాచారం. తన వల్ల కొన్ని పొరపాటులు జరిగాయని పోలీసులతో అల్లు అర్జున్‌ అన్నట్లు తెలుస్తోంది. మెుత్తం 3 గంటల 35 నిమిషాల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించగా.. కొన్ని ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని బన్నీ చెప్పారు. మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్‌ చెప్పినట్లు తెలుస్తోంది.  అల్లు విచారణ పూర్తి అంతకుముందు అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. తొక్కిససలాటకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన 10నిమిషాల వీడియోను చూపించి కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బన్నీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అనంతరం అతడ్ని విడిపెట్టినట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్‌ను పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టారు.  https://twitter.com/ANI/status/1871431900340142523 ఆ ప్రశ్నలకు బన్నీ మౌనం..! చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. ‘తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా’ అని పోలీసులు ప్రశ్నించగా అల్లు అర్జున్‌ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించగా ఈ క్వశ్చన్‌కు కూడా బన్నీ సైలెంట్‌గానే ఉన్నారని సమాచారం.  https://twitter.com/TOIHyderabad/status/1871462776591548839 బన్నీ కోసం 50 ప్రశ్నలు! సంధ్యా థియేటర్‌ ఘటనకు సంబంధించి మెుత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్‌ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలను బన్నీకి సంధించినట్లు తెలిసింది. దీనిపై బన్నీ ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్స్‌ ప్రకారం బన్నీ ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  https://twitter.com/timesofindia/status/1871431495480750275 బన్నీని అడిగిన ప్రధాన ప్రశ్నలు ఇవే! తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ కోసం 50 ప్రశ్నలను చిక్కడపల్లి పోలీసులు రెడీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.&nbsp; 1. సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు ఎవరి అనుమతి తీసుకున్నారు? 2. పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు? 3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఉందా? లేదా? 4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా? 5. రేవతి మరణం గురించి ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు? 6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా? 7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? 8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు? 9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? 10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు? 11. అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? 12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా? 13. పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు? 14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?
    డిసెంబర్ 24 , 2024
    <strong>Allu Arjun: సీఎం రేవంత్‌పై బన్నీ ఫ్యాన్స్ వైల్డ్‌ ఫైర్‌.. మీకో రూల్? బన్నీకో రూలా?&nbsp;</strong>
    Allu Arjun: సీఎం రేవంత్‌పై బన్నీ ఫ్యాన్స్ వైల్డ్‌ ఫైర్‌.. మీకో రూల్? బన్నీకో రూలా?&nbsp;
    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా బన్నీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతడు సైతం ప్రెస్‌మీట్‌ పెట్టి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అర్జున్‌ను అధికార కాంగ్రెస్‌ పార్టీ కావాలనే టార్గెట్‌ చేస్తోందంటూ నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. బన్నీపై చీప్‌ పాలిటిక్స్‌ ఆపాలంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ ఇంటిపై సీఎం రేవంత్‌ అనుచరులే దాడి చేశారంటూ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. #StopCheapPoliticsOnALLUARJUN, #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. https://twitter.com/trollkutami/status/1870898470552502399 తెలంగాణలో 50 మందికి పైగా చిన్నారులు ఫుడ్‌ పాయిజన్‌ వల్ల చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన తరహాలో వాటిపైన ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. చిన్నారుల మరణాలపై ఎందుకు మౌనమని నిలదీస్తున్నారు. https://twitter.com/mahi_gaduu/status/1870835814453899703 https://twitter.com/NaseerMsd_07/status/1870895017210052794 https://twitter.com/Shivasandy99/status/1870829459051601982 హైడ్రా కూల్చివేతల కారణంగా వందల కుటుంబాలు హైదరాబాద్‌లో నష్టపోయాయని బన్నీ ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. బాధితులు కన్నీరు పెట్టుకున్న వీడియోలను కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/StateJulayi/status/1871011555334385939 https://twitter.com/saitejAAh/status/1871006525483110738 అదే సమయంలో అల్లు అర్జున్‌ మంచితనానికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక పెద్దావిడన విజయవాడ వెళ్లి మరి బన్నీని కలిసిన వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/rocky_ntr9/status/1871016002361946343 ఆదివారం (డిసెంబర్‌ 22) బన్నీ ఇంటిపై దాడి చేసిన వారిలో ప్రధాన వ్యక్తులైన ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకుంటున్న రెడ్డి శ్రీను ముదిరాజ్‌, బుద్దా ప్రేమ్‌ కుమార్‌ గౌడ్‌లు.. సీఎం రేవంత్‌ రెడ్డికి బాగా సన్నిహితులని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రేవంత్‌ రెడ్డితో వారు దిగిన ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1870831972890624082 https://twitter.com/AlluArjunTFC/status/1870813274352263312 https://twitter.com/JuLaYi____/status/1870866218867212397 అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టేషన్‌లో వారు దర్జాగా కూర్చొని మెుబైల్స్‌ యూజ్‌ చేస్తున్న ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BinodnotVinod/status/1870828944179741082 https://twitter.com/Ashok4Brs/status/1870842824700105094 అల్లు అర్జున్‌ ఇంటిపై జరిగిన దాడి వెనుక ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఉందని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. నిరసనకారులతో కలిసి మెుదట ఆ ఛానెల్‌ ప్రతినిధే వెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/allubabloo/status/1871051199560225275 https://twitter.com/SumanthOffl/status/1870801421282767019 అల్లు అర్జున్‌పై పోలీసులు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును విపక్ష BRS ఎండగడుతున్న వీడియోలను బన్నీ ఫ్యాన్స్‌ వైరల్ చేస్తున్నారు. అంత అత్యవసరంగా సంధ్యా థియేటర్ వీడియోను రిలీజ్‌ చేయాల్సిన అవసరం సీపీకి ఏం వచ్చిందని నిలదీస్తున్నారు. https://twitter.com/RakeeBRS/status/1870900466181423482 సంధ్యా థియేటర్‌ ఘటనపై పబ్లిక్‌ ఓపినియన్ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ పక్షాన కొందరు పౌరులు మాట్లాడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. https://twitter.com/madmaxtweetz/status/1871081568833531993 అల్లు అర్జున్‌ వల్ల ఓ ప్రాణం పోయిందని మాట్లాడుతున్న రాయకీయ నాయకులు.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు, స్టూడెంట్స్‌పై ఎందుకు స్పందిచరని ఓ నెటిజన్‌ ప్రశ్నించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.&nbsp; https://twitter.com/BunnyNikhil214/status/1871048115954073761 గతంలో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన అనంతరం చాలా మంది నేతలు అతడ్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. ఆ వీడియోను తాజాగా పోస్టు చేసిన ఓ ఫ్యాన్‌ 'అతని కాలు పోయిందా, కన్నుపోయిందా, చెయ్యి పోయిందా' అంటూ అసెంబ్లీలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను రిపీట్‌ చేశాడు. https://twitter.com/bunnyvirat831/status/1870885794275299339 సంధ్యా థియేటర్ లోపల నుంచి బన్నీని బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందన్న పోలీసుల వ్యాఖ్యలను ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు. బన్నీ బయటకు వస్తున్న క్రమంలో చుట్టూ అభిమానులు తప్ప పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/AAFanIkkadaa/status/1870850040425783591
    డిసెంబర్ 23 , 2024
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్‌ మీట్స్‌ నిర్వహించిన మంచు మనోజ్‌, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్‌ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.&nbsp; విష్ణు.. మాస్ వార్నింగ్‌ మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.&nbsp; https://twitter.com/Telugu360/status/1866749230423085437 మోహన్‌బాబుకు ఊరట మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. దాడి కేసులో ఒకరి అరెస్టు మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్‌ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ 'పీస్‌' (శాంతి) అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్‌ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్‌ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.&nbsp;
    డిసెంబర్ 11 , 2024
    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
    పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన పుష్ప 2  సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఆసక్తికరంగా మాట్లాడుతూ, “ఈ రోజు ఇక్కడ నేను ఉండగలగడం సుకుమార్ గారి ప్రేమ కారణం. ఇంతకంటే నేను మరేం చెప్పగలను? డార్లింగ్” అంటూ సుకుమార్‌ను ప్రశంసించారు. ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్, “నాకు సినిమా కలెక్షన్ల గురించిపెద్దగా నంబర్లు గుర్తులేవు. కానీ ఈ సినిమా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మామయ్యకు కృతజ్ఞతలు అల్లు అర్జున్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “మా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు,” అని అన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలిపారు. “సినీ పరిశ్రమపై మీ ప్రేమ ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది,” అని కొనియాడారు. ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రస్తావిస్తూ, “ఈ ప్రత్యేక జీవోకి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. పర్సనల్‌గా కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్యూ సో మచ్!” అంటూ చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలతో కొన్ని రోజులుగా అల్లు Vs మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్‌కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇది వివాదం!&nbsp; గత కొంతకాలంగా అల్లు అర్జున్ అభిమానులు – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని కోరగా, “చెప్పను బ్రదర్,” అని చెప్పిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఇక ఇటీవలే ఏపీ  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి పర్సనల్‌గా వెళ్లి అల్లు అర్జున్  మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత పెరిగింది. ఫ్యాన్స్‌కు బన్నీ సందేశం అయితే ఇప్పుడు సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ పేరు స్పెషల్‌గా ప్రస్తావిస్తూ “కళ్యాణ్ బాబాయ్” అని చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలకు తావులేదనే విషయాన్ని అభిమానుల్లోకి స్పష్టంగా తీసుకెళ్తుందని&nbsp; పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని మాటల వలన అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ సక్సెస్ మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసును దోచుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్‌కి, తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్, టికెట్ ధరల పెంపు నిర్ణయంపై కూడా అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వివాదాలకు ఎప్పటికైనా ముగింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బన్నీ చేసిన కామెంట్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీసి వివాదాలు తగ్గుతాయని అంతా ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పుష్ప విజయాన్ని మించిపోయేలా బన్నీ మాటలు అభిమానుల హృదయాలను దోచుకున్నాయి.
    డిసెంబర్ 07 , 2024

    @2021 KTree