• TFIDB EN
  • వల్లభ
    UA3h 5m
    వల్లభ తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన స్వప్నను ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని దాచి ఆమెకు దగ్గరవుతాడు. అయితే తనకంటే వయసులో పెద్ద వాడ్నే పెళ్లి చేసుకోవాలని స్వప్న భావిస్తుంటుంది. వల్లభ గురించి నిజం తెలిసిన ఆమె ఏం చేసింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సిలంబరాసన్
    రీమా సేన్
    నయనతార
    సంధ్య
    సంతానం
    సత్యన్
    ప్రేమగీ అమరెన్
    S. Ve. శేఖర్
    జానకి సబేష్
    అంబానీ శంకర్
    కార్తీక్ సబేష్
    గుహన్ షణ్ముగం
    బాలకుమారన్
    T. రాజేందర్
    కనల్ కన్నన్
    మహత్ రాఘవేంద్ర
    జగన్
    తార శ్రీనివాసన్
    సిబ్బంది
    సిలంబరాసన్
    దర్శకుడు
    పిఎల్ తేనప్పన్
    నిర్మాత
    యువన్ శంకర్ రాజా
    సంగీతకారుడు
    కథనాలు
    Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
    Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు.. తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీతో సత్సంబంధాలు లేవని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్‌కు పోటీగా మారతాడన్న ఉద్దేశ్యంతో తారక్‌ను టీడీపీ దూరంగా పెడుతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ వైఖరితో అతడి మనసు నొచ్చుకుందని అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని అప్పటి అధికార వైకాపా వినియోగించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు తారక్‌కు మద్దతు ఇస్తూనే టీడీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. అయితే వీటన్నింటికి తారక్‌ ఒక్క ట్విట్‌తో పటాపంచలు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తనదైన శైలిలో అభినందనలు చెప్పారు.  ‘మామయ్యకు శుభాకాంక్షలు’ ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని అందుకున్న చంద్రబాబు (Chandra Babu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)లకు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్‌ కల్యాణ్‌ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/tarak9999/status/1798287485879140762 https://twitter.com/tarak9999/status/1798287613130150054 కల్యాణ్‌రామ్‌ స్పెషల్‌ విషెస్‌ తారక్‌తో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ కూడా టీడీపీకి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశాడు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్‌, శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.  https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290427482877958 https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290491995541547 కలిసిపోయినట్లేనా? గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఇద్దరూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషి అవుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. తామంతా ఒక్కటే అన్న భావాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తారక్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ను టీడీపీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇకపై టీడీపీకి అన్ని మంచి రోజులేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నాగార్జున, రామ్‌చరణ్‌ ఏమన్నారంటే? తారక్‌, కల్యాణ్‌ రామ్‌తో పాటు స్టార్‌ హీరోలు నాగార్జున, రామ్‌చరణ్‌లు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున అన్నారు. అటు చరణ్‌.. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ అభినందనలు తెలియజేశాడు. 
    జూన్ 05 , 2024
    <strong>LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;</strong>
    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;
    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] సమంత (Samantha) ‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్‌ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మహేష్‌ బాబుతో కాజల్‌ ఓ లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్‌ కిస్‌ చేస్తాడు. ఈ సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్‌ సీన్‌ కాజల్‌ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.&nbsp; https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q నయనతార (Nayanthara) ‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్‌ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.&nbsp; https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW రష్మిక మందన్న (Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రెచ్చిపోయింది.&nbsp; https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj నేహా శెట్టి (Neha Shetty) యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్‌ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్‌ సేన్‌ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది. https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz రుహానీ శర్మ (Ruhani Sharma) 'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్‌’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్‌ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది. https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k కేతిక శర్మ (Ketika Sharma) యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్‌ ఫిల్మ్ ‘రొమాంటిక్‌’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తోనూ లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7 https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri డింపుల్‌ హయాతి (Dimple Hayathi) విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్‌ డింపుల్‌ హయాతి లిప్‌లాక్‌ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్‌ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.&nbsp; https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF మాళవిక మోహన్‌ (Malavika Mohanan) మలయాళ నటి మాళవిక మోహన్‌ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్‌ ఛతుర్వేదితో కలిసి బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.&nbsp; https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1 తృప్తి దిమ్రి (Tripti Dimri) బాలీవుడ్‌ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్‌’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్‌ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్‌ న్యూస్‌’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్‌ సీన్‌ చేసింది.&nbsp; https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్‌’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.&nbsp; https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. అలాగే ఇంటిమేట్‌ సీన్‌లోనూ కనిపించి హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేసింది. https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu కావ్యా థాపర్‌ (Kavya Thapar) గ్లామర్‌ బ్యూటీ కావ్యా థాపర్‌ కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఒకప్పుడు ట్రెడిషనల్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాలంలో రొమాంటిక్‌ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.&nbsp; https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q- షాలిని పాండే (Shalini Pandey) అర్జున్‌ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm- శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రముఖ హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్‌ సీన్లలో నటించింది. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.&nbsp; https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4 https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu మానసా చౌదరి (Maanasa Chowdary) రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్‌ గమ్‌' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌ లాక్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్‌ లాక్స్‌ ఉన్నాయి.&nbsp; https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
    అక్టోబర్ 04 , 2024
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    NBK vs Jr.NTR: బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు తారక్‌ రావట్లేదా? కావాలనే దూరం పెట్టారా?
    నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుత స్టార్‌ హీరోలు అనగానే ముందుగా బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR)లే గుర్తుకువస్తారు. నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బాబాయ్‌, అబ్బాయ్‌ తమకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టినా తారక్‌ స్పందించకపోవడం, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండటం, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌ ప్లెక్సీలను తీసేయాలని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరోమారు నందమూరి కుటుంబానికి - తారక్‌ మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; తారక్‌కు అందని ఆహ్వానం! నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డితో పాటు చిరంజీవి (Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు కూడా ఇన్విటేషన్స్‌ వెళ్లాయి. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూ.ఎన్టీఆర్‌ను మాత్రం ఈవెంట్‌ నిర్వాహకులు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు సైతం ఇన్విటేషన్‌ ఇవ్వలేదని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలకృష్ణ, తారక్‌ మధ్య ఉన్న మనస్పర్థలు మరోమారు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బాలయ్య సూచన మేరకే నిర్వాహకులు వారిద్దరిని ఆహ్వానించలేదని టాక్‌ వినిపిస్తోంది. దీంతో బాలయ్య-తారక్‌ మధ్య రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.&nbsp; విభేదాలకు కారణాలు ఇవేనా..! వై.ఎస్‌. జగన్‌ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలకృష్ణ వియ్యంకుడైన చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఏకంగా 50 రోజుల పాటు జైలులో పెట్టింది. దీనిపై నందమూరి కుటుంబం పెద్ద ఎత్తున చంద్రబాబు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జగన్‌ ప్రతీకార రాజకీయం చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇంత జరుగుతున్నా తారక్‌ మాత్రం అప్పట్లో దీనిపై పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం ట్విటర్‌ వేదికగా ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు పోస్టు సైతం పెట్టలేదు. తారక్‌ మౌనంగా ఉండటం సరికాదంటూ టీడీపీ క్యాడర్‌, తెలుగు దేశం సోషల్‌ మీడియా విభాగం సూచిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో బాలయ్య తీవ్ర అసహనానికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.&nbsp; కంట్రోల్‌ చేయని తారక్‌! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తారక్‌కు అత్యంత సన్నిహితులు. నాని, వంశీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వారు ఇరువురు చంద్రబాబు, అతడి కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాలకృష్ణపై కూడా అవాకులు, చవాకులు పేల్చారు. ఒక దశలో చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు సైతం మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితులైన వంశీ, నానిని తారక్‌ నియంత్రించలేదని విమర్శలు వచ్చాయి. ప్రారంభంలోనే వారిని తారక్ మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.&nbsp; తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో తారక్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    ఆగస్టు 31 , 2024
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు:&nbsp; బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి ఎడిటింగ్‌ : తమ్మిరాజు నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి విడుద‌ల తేదీ: 15-03-2024 తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.&nbsp; సాంకేతికంగా సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ మితిమీరిన హింసతెలిసిన కథ కావడం.. Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 15 , 2024
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి? సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.&nbsp; కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌! రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; కథలు సైతం వెళ్లడం లేదా? ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.&nbsp; నెపోటిజం vs టాలెంట్‌! అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.&nbsp; తప్పు ప్రేక్షకుల్లో ఉంది! గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023
    అనారోగ్యం , యశోద సినిమాపై మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన  సమంత
    అనారోగ్యం , యశోద సినిమాపై మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన సమంత
    ]ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికత వల్ల జరిగిన ఓ విషాదకరమైన అనుభవంDownload Our App
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;</strong>
    Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్‌ చేసేస్తున్నారు. షూటింగ్‌లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్‌ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్‌ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్‌-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.&nbsp; ‘ఆ ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు’ సినిమాలు పోస్టు పోన్‌ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్‌ ఆలస్యం, షూటింగ్‌లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్‌ చేస్తుండటంపై నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్‌ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్‌? నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్‌ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్‌ చేయాలని షూటింగ్‌ ప్రారంభంలోనే మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్‌ చేసుకోవడంతో సరిపోదా టీమ్‌ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్‌ 6 మారుస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్‌ చేసింది. ఆ వెంటనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌’, ‘ఆయ్‌’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్‌ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్‌ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్‌ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని సినిమాకు రన్‌ టైమ్‌ ఫిక్స్‌! నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A స‌ర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంట‌ల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఎస్‌.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp;
    ఆగస్టు 24 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.&nbsp; లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.&nbsp; యాత్ర-2&nbsp; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day&nbsp;MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్‌.. తేల్చేసిన డైరెక్టర్‌!
    Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్‌.. తేల్చేసిన డైరెక్టర్‌!
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్ (Hanuman) యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రంతో పాటు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏర్పడింది. ఇక ‘హనుమాన్‌’కు సీక్వెల్‌ కూడా ఉండనున్నట్లు ప్రశాంత్‌ వర్మ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ‘జై హనుమాన్‌’ రిలీజ్‌, తమ సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; ‘బాధ్యత పెరిగింది’ పాన్‌ ఇండియా స్థాయిలో హనుమాన్‌ సక్సెస్‌ కావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వ్యాఖ్యానించారు. ‘హనుమాన్‌’ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే ఈ పాటికీి సీక్వెల్‌ను ఎప్పుడో రిలీజ్‌ చేసేవాళ్లమని పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. దీంతో 'జై హనుమాన్‌'పై మరింత బాధ్యతగా వర్క్‌ చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'జై హనుమాన్‌' కోసం ఎంతో కష్టపడుతున్నామని ప్రశాంత్‌ వర్మ అన్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సీక్వెల్‌ అందరి అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలైతే చూడాలని భావిస్తున్నారో అవి కచ్చితంగా చూపిస్తామని ప్రశాంత్‌ వర్మ హామి ఇచ్చారు.&nbsp; ‘ముందే వీఎఫ్‌ఎక్స్‌ పనులు’ ‘హనుమాన్‌’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వందల కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ కంటే ‘హనుమాన్‌’ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. దీనిపై కూడా ప్రశాంత్‌ వర్మ తాజాగా స్పందించారు. ‘హనుమాన్‌ సమయంలో మొదట షూటింగ్‌ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ పనులు ప్రారంభించాం. కానీ దీని సీక్వెల్‌ (జై హనుమాన్‌)కు మాత్రం వీఎఫ్‌ఎక్స్‌ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ సమయం పట్టవు. ప్రస్తుతానికైతే షూటింగ్‌ మెుదలవ్వలేదు’ అంటూ జై హనుమాన్‌పై ప్రశాంత్‌ వర్మ కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు.&nbsp; బాలీవుడ్‌ స్టార్స్‌ పక్కా! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌పై ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాల కోసం కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ను కలిసినట్లు చెప్పారు. వారితో తన ఆలోచనలు పంచుకున్నట్లు తెలిపారు. ఇందులో వారు కచ్చితంగా భాగం అవుతారని స్పష్టం చేశారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని తెలిపారు. అటు ‘జై హనుమాన్‌’ పట్టాలెక్కేందుకు కూడా సమయం పట్టనుందని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ స్పష్టం చేశారు. దాని కంటే ముందు ‘అధీరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతర దర్శకులు కూడా వాటి కోసం వర్క్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో మోక్షజ్ఞ ఫిల్మ్‌ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. మోక్షజ్ఞతో మూవీ షురూ నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను ప్రశాంత్‌ వర్మ రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోరానున్న చిత్రానికి 'PVCU 2' అనే వర్కింగ్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    <strong>Prabhas Vs Arshad Warsi: ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలుగు హీరోలు!</strong>
    Prabhas Vs Arshad Warsi: ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలుగు హీరోలు!
    'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంలో ప్రభాస్‌ (Prabhas) లుక్‌&nbsp; జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రభాస్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్‌ ఫెయిలవుతూ వస్తోందని మండిపడుతున్నారు. అటు అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరోలు సైతం మండిపడ్డారు. ప్రభాస్‌కు మద్దతుగా నిలుస్తూ యువ హీరోలు సుధీర్‌ బాబు, ఆది గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అసలేం జరిగిందంటే..! బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘క‌ల్కి’ తాను చూశానని మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అర్షద్‌ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్‌.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్‌ జోకర్‌లా ఉంది. మ్యాడ్‌ మ్యాక్స్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్‌ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/i/status/1825097374680621099 సుధీర్‌ బాబు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌! ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం సుధీర్‌ బాబు వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. సుధీర్‌ బాబు వ్యాఖ్యలను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సమర్థిస్తున్నారు.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1825746561495871657 ‘ప్రభాస్ అంటే అసూయేమో’ బాలీవుడ్‌ నటుడు అర్షద్ వర్సిపై యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ కూడా తనదైన రీతిలో స్పందించాడు. అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. కల్మషం లేని మంచి మనసుకు కలిగిన ప్రభాస్ గురించి ఇలా అనుచితంగా మాట్లాడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360 ‘ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కనిపిస్తోంది’ అర్షద్‌ వర్సీ వ్యవహారంపై తెలుగు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి చేసిన పోస్టు కూడా ఆకట్టుకుంటోంది. ‘సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు ప్రభాస్. ఇండియన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆయన మీద, ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ మీ కంట్లోనే నాకు కనిపిస్తోంది. ప్రతీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. మీ మీ అభిప్రాయాాల్ని చెప్పడానికి ఓ పద్దతి పాడు ఉంటాయ్. మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తోంది’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా, కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దీపిక పదుకొనే కీలక పాత్రలు పోషించారు.&nbsp; https://twitter.com/DirAjayBhupathi/status/1825448573128806545
    ఆగస్టు 20 , 2024
    <strong>Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?</strong>
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    <strong>Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!</strong>
    Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్‌ క్యాస్ట్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘కల్కి 2’ షూట్‌ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.&nbsp; షూటింగ్స్‌కు బ్రేక్‌! 'కల్కి 2' చిత్రం వచ్చే ఏడాది జూన్‌ - జులై కల్లా రిలీజ్‌ అవుతుందని నిర్మాత అశ్వని దత్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2' రీమైనింగ్‌ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్‌. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్‌ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి 'కల్కి 2' షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.&nbsp; దీపికనే కీలకం! ‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్‌ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్‌ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్‌ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్‌ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్‌ సిద్ధం చేసుకున్న డేట్స్‌ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    <strong>Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది రానట్లేనా?&nbsp;</strong>
    Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది రానట్లేనా?&nbsp;
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి బ్లాక్‌ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్‌' (Game Changer). పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్‌ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్‌ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  కారణం ఏంటంటే? మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్‌ రాజు చెప్పినట్లు క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. షూటింగ్‌ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్‌ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్‌ కోసం దర్శకుడు శంకర్‌ వెతుకుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్‌ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్‌ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌, డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసేసరికి డిసెంబర్‌ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలంటే మూవీ యూనిట్‌ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్‌ శంకర్‌ ప్రస్తుత స్పీడ్‌ చూస్తుంటే ఈ ఏడాది చరణ్‌ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.&nbsp; 2024 సమ్మర్‌ కానుకగా! రామ్ చరణ్ - శంకర్‌ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' చిత్రం డిసెంబర్‌ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్‌ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ మిస్‌ అయితే సంక్రాంతికి రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్‌ బరిలో నిలిచాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను బరిలోకి దింపడం కరెక్ట్‌ కాదని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.  గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.  కియారా పోస్టర్ అదుర్స్‌! గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్‌, కియారాలతో పాటు ఎస్‌.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్‌, నాజర్‌, నవీన్‌ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
    ఆగస్టు 06 , 2024
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో రాజ్‌ తరుణ్‌ ఒకరు. తొలి చిత్రం 'ఉయ్యాల జంపాల' (Uyyala Jampala) తో మంచి సక్సెస్‌ అందుకున్న రాజ్‌తరుణ్‌.. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులను చవిచూశాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌తరుణ్‌పై అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా ఘాటుగా స్పందించడంతో.. ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది.&nbsp; ‘ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌’ సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని ఇటీవల ఒక హీరోయిన్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్‌తరణ్‌ ఎఫైర్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నటి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘తిరగబడర సామీ’లో ఈ భామే కథానాయికగా చేస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు.&nbsp; https://twitter.com/galli2delhi/status/1809123625074614310 అది నిజం కాదు: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; https://twitter.com/BunnyJashu3/status/1769400224081219797 ‘మరో అబ్బాయితో నా ఇంట్లోనే ఉంది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 05 , 2024
    <strong>Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్‌’ ప్రయోగం ఫలించిందా?</strong>
    Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్‌’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు :&nbsp; సుమంత్‌ రచన, దర్శకత్వం : ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి సంగీతం : శ్రీరామ్‌ మద్దూరి సినిమాటోగ్రఫీ : వరుణ్‌ అంకర్ల ఎడిటింగ్‌ : మురళి కృష్ణ మన్యం విజువల్‌ ఎఫెక్ట్స్‌ : శశ్వత్‌ కౌరవ్‌ నిర్మాతలు : రఘువీర్‌, సృజన్‌&nbsp; ఓటీటీ వేదిక : ఆహా (Aha OTT) సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’ (Aham Reboot ott). రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీని తొలుత థియేటర్‌లో రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్‌ 30న సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? సుమంత్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ కావాలని కలలు కన్న నిలయ్‌ (సుమంత్‌).. ఓ యాక్సిడెంట్‌ వల్ల రేడియో జాకీగా మారతాడు. స్టూడియోలో ఉండగా ఓ రోజు నిలయ్‌కు.. ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అయి లైవ్‌ పెడతాడు. రేడియోలో వీరి మాటలు విన్న పోలీసులు.. ఆమె కిడ్నాప్‌ అయ్యిందని నమ్మి కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కిడ్నాపైన యువతి వివరాలు సేకరించే బాధ్యతను స్టూడియోలో ఉన్న నిలయ్‌కు అప్పగిస్తారు. ఇంతకీ ఆ యువతి ఎవరు? నిజంగానే ఆమెను కిడ్నాప్‌ చేశారా? పోలీసులు ఆమెను ఎలా కాపాడారు? నిలయ్‌ వల్ల యాక్సిడెంట్‌లో చనిపోయిన యువతి ఎవరు? ఆమెకు కిడ్నాప్‌ అయిన అమ్మాయికి ఏమైన సంబంధం ఉందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే అహం రీబూట్ సినిమాలో (Aham Reboot Movie Review).. సుమంత్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారు. సినిమా మెుత్తం ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. సినిమా మెుత్తం తనపైనే డిపెండ్ అయిన వేళ.. సమంత్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. మ‌న‌సులో అంతులేని బాధ‌ను మోసే ఓ మోడ్ర‌న్ యువ‌కుడిగా, ఓ అమ్మాయి ప్రాణాల‌ను కాపాడేందుకు ఆరాట‌ప‌డే ఆర్జేగా అత‌డి యాక్టింగ్ బాగుంది. ఏమోషన్స్‌ను చక్కగా పండించాడు. కథను తన భుజాలపై మోసుకుంటూ నడిపించాడు. లుక్‌ పరంగా సుమంత్‌ ఈ మూవీలో కొత్తగా కనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ చేయ‌డం అన్న‌ది క‌త్తిమీద సాము లాంటిది (Aham Reboot Movie Review). అందులోనూ ఒకే చోట నుంచి క‌థ‌ను ర‌క్తి క‌ట్టించ‌డం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్ర‌య‌త్నంలో దర్శకుడు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి కొంత మేర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కిడ్నాప్‌కు గురైన అమ్మాయి ఫోన్‌ కాల్‌తో అసలు కథను మెుదలవుతుంది. కిడ్నాప్‌ అయిన అమ్మాయి నుంచి హీరో వివరాలు రాబట్టడం, వాటిని పోలీసులకు అందించడం, పోలీసులు ఆమెను కాపాడేందుకు యత్నించడం చుట్టూ దర్శకుడు కథను తిప్పారు. ఈ క్రమంలో స్టోరీని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఆఖర్లో నిలయ్‌ జీవితానికి, కిడ్నాప్‌ అయిన యువతికి లింక్‌ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్‌ బాగుంది. అయితే సినిమా మెుత్తం సుమంత్ మాత్రమే క‌నిపించ‌డం, కేవ‌లం డైలాగ్స్ ద్వారానే క‌థ‌ను చెప్ప‌డం వ‌ల్ల బోర్‌ కొట్టించిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఓపికగా చూడకలిగితే.. అహాం రీబూట్‌ ఒక మంచి థ్లిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.  టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యింది. శ్రీరామ్‌ మద్దూరి ఇచ్చిన BGM ఆసక్తికర సన్నివేశాలను మరింతగా ఎలివేట్‌ చేసింది. ఒకే పాత్ర ఉండటంతో ఎడిటింగ్‌ క్రిస్పిగా చేయడం కలిసొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సుమంత్‌ నటనప్రయోగాత్మకంగా కథ చెప్పడంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్‌ మూవీ మెుత్తం ఒక పాత్రే ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 01 , 2024
    Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs&nbsp; మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
    Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs&nbsp; మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
    ఈ జనరేషన్‌ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్‌ (Allu Arjun), రామ్‌చరణ్‌ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్‌.. ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్‌ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ‘పుష్ప 2’ వాయిదా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్‌ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. డిసెంబర్‌ 6న వరల్డ్‌ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.&nbsp; రేసులో గేమ్ ఛేంజర్‌! ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ పెండింగ్‌ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ను రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్‌ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్‌ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని దిల్‌రాజు ఫిక్స్‌ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్‌ బరిలో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; అల్లు vs మెగా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్‌ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్‌ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ - అల్లు అర్జున్‌ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.&nbsp; అల్లు ఆర్మీ సవాల్ ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది.&nbsp; ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్‌ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్‌ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది.&nbsp; https://twitter.com/madhavg_Indian/status/1801862004627366096 https://twitter.com/madhavg_Indian/status/1801824969023758738 https://twitter.com/DpAadhf/status/1785639853717082162
    జూన్ 18 , 2024
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    నటీనటులు: నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్‌, భావన సాగి, మిర్చి కిరణ్‌, అక్షయ్‌ డోగ్రా తదితరులు దర్శకుడు: అవ‌నీంద్ర సంగీత దర్శకుడు: గోవింద్‌ వసంత్‌ సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్ ఎడిటింగ్: అవనీంద్ర నిర్మాణ సంస్థ : సి స్పేస్‌ విడుదల తేదీ: జూన్‌ 7, 2024 నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli Review). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. న‌వ‌దీప్ 2.0 అంటూ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. జూన్‌ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ‘లవ్‌ మౌళి’.. నవ్‌దీప్‌కు హిట్‌ తెచ్చిపెట్టిందా? యూత్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్‌) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమ‌పై కూడా న‌మ్మ‌కం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్‌ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్ర‌ష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్‌ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్‌ పట్టి అమ్మాయి పెయింటింగ్‌ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్‌ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మౌళి పాత్రలో నటుడు నవదీప్‌ కొత్త కోణంలో కనిపిస్తాడు. అతడి లుక్‌తో పాటు నటనలోనూ వైవిద్యం కనిపించింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో అతడు చక్కటి నటన కనబరిచాడు. కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఆకట్టుకుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌ పండిస్తూనే నటనలోనూ వేరియేషన్స్‌ చూపించింది. ఇక అఘోరాగా గెస్ట్‌ పాత్రలో కనిపించి రానా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అవనీంద్ర.. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ బోల్డ్‌ లవ్‌స్టోరీగా 'లవ్‌ మౌళి'ని తెరకెక్కించారు. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. లిప్‌లాక్‌లు, బోల్డ్‌ సీన్స్‌తో.. కథను రొమాంటిక్‌గా నడిపించారు డైరెక్టర్‌. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. మౌళి లైఫ్‌లోకి చిత్ర వచ్చినప్పటికీ నుంచి అసలు కథ మెుదలవుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌, ఘర్షణలు రొటిన్‌గా అనిపిస్తాయి. అవసరం లేకున్నా వచ్చే కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్‌ను కూడా చాలా సాధారణంగా ముగించాడు. ఓవరాల్‌గా నవదీప్‌ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్‌, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు డైరెక్టర్‌.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ అందించిన మ్యూజిక్‌ పర్వాలేదు. ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన దర్శకుడు అవనీంద్ర అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరామెన్‌ అజయ్ శివశంకర్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్‌ను చాలా సహజంగా, చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నవదీప్‌, పంకూరి గిద్వానీ నటనఎమోషనల్‌ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిగా సాగని కథనంబోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూన్ 07 , 2024
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు రాజు యాదవ్‌ జబర్దస్త్ ఫేమ్‌ గెటప్‌ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju yadav). అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. లవ్‌ మీ ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్‌ యూ డేర్‌’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే&nbsp; చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని&nbsp; ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; డర్టీ ఫెలో శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్‌ డ్రామా చిత్రమని మూవీ యూనిట్‌ తెలిపింది.&nbsp; ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man&nbsp;MovieEnglishLions Gate PlayMay 24
    మే 20 , 2024

    @2021 KTree