• TFIDB EN
  • వరుణ్ డాక్టర్
    UATelugu2h 31m
    వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతను పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు, కానీ ఆమె అతని ప్రాక్టికల్ స్వభావాన్ని చూసి తిరస్కరిస్తుంది. పద్మిని మేనకోడలు కిడ్నాప్ అయినప్పుడు.. కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శివకార్తికేయన్
    వినయ్ రాయ్
    ప్రియాంక మోహన్
    అర్చన చంధోకే
    మిలింద్ సోమన్
    యోగి బాబు
    అరుణ్ అలెగ్జాండర్
    ఇళవరసు
    రెడిన్ కింగ్స్లీ
    రఘు రామ్
    రాజీవ్ లక్ష్మణ్
    బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్
    దీపా శంకర్
    కరాటే కార్తీ
    శ్రీజ రవి
    సునీల్ రెడ్డి
    శివ అరవింద్
    జోర్న్ సుర్రావ్
    పిల్లార్ రుత్రు
    ఆత్మ పాట్రిక్
    జి. మరిముత్తు
    షాజీ చెన్
    సిబ్బంది
    నెల్సన్ దిలీప్‌కుమార్
    దర్శకుడు
    శివకార్తికేయన్
    నిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    విజయ్ కార్తీక్ కన్నన్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    <strong>Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?</strong>
    Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?
    అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్‌ చేసింది. రవితేజ, రామ్‌, బాలకృష్ణ, నితీన్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, మహేష్‌ బాబు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. రీసెంట్‌గా 'పుష్ప 2' చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఈ యంగ్‌ బ్యూటీ ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. యంగ్‌ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 ద్వారా ఈ విషయం తేటతెల్లమైందని అంటున్నారు. ఆ హీరో ఎవరంటే? ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha)లో అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాల్గవ సీజన్‌లో భాగంగా 6వ ఎపిసోడ్‌ను ఓటీటీ వర్గాలు తాజాగా రిలీజ్‌ చేశాయి. ఇందులో యంగ్ హీరో శ్రీలీల (Sreeleela)తో పాటు యువ కథానాయకుడు నవీన్‌ పోలిశెట్టి పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఎంతో ఫ్రీడమ్‌తో జోకులు వేసుకుంటూ సందడి చేశారు. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ ఇంత క్లోజ్‌గా ఉండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్ర హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అటు నవీన్‌ పొలిశెట్టి సైతం ఈ షోలో శ్రీలీలతో చాలా చనువుగా కనిపించారు. ఆమెపై సెటైర్లు వేస్తూ ఆధ్యంతం షోను రక్తి కట్టించాడు. దీనికి తోడు ఎంతో మంది యువ హీరో, హీరోయిన్లు ఉండగా వీరిద్దరినే షోకు పిలవడం వెనక కారణం ఇదే అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన జీ తెలుగు మహోత్సవం వేడుకల్లో ఈ శ్రీలీల, నవీన్‌ పోలిశెట్టి పాల్గొన్నారు. మనిద్దరం కలవడం ఇదే తొలిసారి కదా అని శ్రీలీల అనగా చివరిసారి మాత్రం కాదులే అంటూ పోలిశెట్టి అంటాడు. ఈ డైలాగ్‌తో ఈవెంట్‌కు వచ్చిన వారంతా బిగ్గరగా కేకలు వేస్తారు.  https://twitter.com/ahavideoIN/status/1863460168291234133 https://www.youtube.com/watch?v=0yXwmYMQfaM చేతికి మూడు ఫ్యాక్చర్స్‌..&nbsp; 'అన్‌స్టాబబుల్‌ సీజన్‌ 4' పాల్గొన్న నవీన్‌ పోలిశెట్టి తనకు జరిగిన యాక్సిడెంట్‌ గురించి బాలయ్యతో మాట్లాడారు. తనకు పెద్ద యాక్సిడెంట్‌ జరిగిందని, చేతికి ఏకంగా మూడు ఫ్యాక్చర్లు అయినట్లు నవీన్ తెలిపాడు. పూర్తిగా రికవరీ కావడానికి కనీసం 8 నెలలు పడుతుందని డాక్టర్‌ చెప్పారన్నారు. దీంతో ఆ గ్యాప్‌లో కథలు వినడం ప్రారంభించానని, త్వరలో 'అనగనగా ఒక రాజు' స్టోరీ రాబోతున్నట్లు చెప్పాడు. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ'లో నటిస్తున్నారన్న రూమర్లపైనా అతడు స్పందించాడు. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయని, నిజమైతే ఇంకా బాగుండు అని వ్యాఖ్యానించాడు. ఇలాంటి రూమర్స్ ఇంకా స్ప్రెడ్ చేస్తేనైనా అలాంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌లో అవకాశం లభిస్తుందేమోనని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కాగా, హిందీ రామయణలో లక్షణుడిగా నవీన్‌ పోలిశెట్టి ఎంపికైనట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.&nbsp; రానాకు శ్రీలీల బంధువా? ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి టాక్‌షో అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల సెకండ్‌ ఎపిసోడ్‌ రిలీజ్‌ కాగా అందులో శ్రీలీల, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో మీరు మాకు బంధువులు అవుతారా? అంటూ శ్రీలీల (Sreeleela)ను రానా అడుగుతాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మీవాళ్లు తగులుతున్నట్లు చెబుతాడు. ఈ క్రమంలో తన అమ్మది ఒంగోలు దగ్గర ఓ విలేజ్ అని శ్రీలీల చెబుతుంది. అప్పుడు రానా కూడా తన తాతది ఒంగోలు జిల్లానే అంటూ బదులిస్తాడు. కాగా, దిగ్గజ నిర్మాత, రానా తాత డి. రామానాయుడుది ప్రకాశం జిల్లాలోని కారంచేడు ప్రాంతం. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో దూరపు చుట్టరికం ఉండి ఉండొచ్చని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.&nbsp; శ్రీలీల మాకు రిలేటివ్స్‌: డైరెక్టర్‌ బాలయ్య హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు శ్రీలీల దగ్గరి బంధువు అవుతుందని సీక్రెట్ రివీల్ చేశారు. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని చెప్పారు. అదే ఊరు తన అమ్మమ్మది కూడా అని అనిల్‌ తెలిపారు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని ఆయన అన్నారు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుందన్నమాట. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందు డైరెక్టర్ గారు అని తనను శ్రీలీల పిలుస్తుందని, ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టిస్తుందని కూడా చెప్పారు. కాగా, శ్రీలీల పుట్టింది తెలుగు నేలపైనే అయినా పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే. ఆమె తన అమ్మమ్మ ఊరు పొంగులూరుకు ప్రతీ ఏటా వస్తుంటుంది.
    డిసెంబర్ 07 , 2024
    <strong>Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?</strong>
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?
    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో&nbsp; ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే&nbsp; నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.&nbsp; సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ నిర్మాత: గౌరీ కృష్ణ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి విడుదల తేదీ : నవంబర్ 03, 2023 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్‌-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్‌ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిదంటే పొలిమేర పార్ట్‌ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్‌ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్‌ 1లో మర్డర్‌ మిస్టరికీ చేతబడిని యాడ్‌ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్‌-1లో లాగే పార్ట్‌-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్‌ 3లో ఉంటుందని ముగించేశారు.&nbsp; ఎవరెలా చేశారంటే? కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్‌ అదరగొట్టాడు. పార్ట్‌ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్‌ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల&nbsp; చక్కగా నటించింది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్‌ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp;&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్‌ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్‌ 1 చూడకపోయినా పార్ట్‌ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనంలాజిక్‌ లేని సీన్స్‌ చివరిగా: థ్రిల్లింగ్‌ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్‌ సీన్స్‌, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.&nbsp; రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    <strong>Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్‌ అనిల్‌ లేలేత అందాలు.. ఓవర్‌ డోస్‌ తట్టుకోగలరా!</strong>
    Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్‌ అనిల్‌ లేలేత అందాలు.. ఓవర్‌ డోస్‌ తట్టుకోగలరా!
    యంగ్‌ బ్యూటీ ఎస్తర్‌ అనిల్‌ (Esther Anil) మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.&nbsp; తాజాగా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్‌.. హాట్‌ అందాలను ఆరబోసింది. యద అందాలు చూపిస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంది.&nbsp; ఎస్తర్ తేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్‌ తలదన్నే గ్లామర్‌ ఆమె సొంతం అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; దృశ్యం (Drushyam) సినిమాలో వెంక‌టేష్ (Venkatesh) చిన్న కూతురిలా న‌టించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌ల‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.&nbsp; బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఎస్తర్‌ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందుకే తన అందాల తెగింపుతో నెటిజన్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.&nbsp; 2001 ఆగస్టు 27న జన్మించిన ఎస్తర్‌, బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో నల్లావన్‌ (Nallavan) సినిమా ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టింది.&nbsp; ఆ తర్వాత ఓరు నాల్‌ వారుమ్‌ (Oru Naal Varum), కాక్‌టైల్‌ (Cocktail), డాక్టర్‌ లవ్‌ (Doctor Love), ది మెట్రో (The Metro) చిత్రాల్లో బాలనటిగా చేసింది.&nbsp; వయోలిన్‌ (Violin), మల్లు సింగ్‌ (Mallu Singh) సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి అందరి దృష్టిని ఎస్తర్‌ ఆకర్షించింది.&nbsp; అయితే 2013లో మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో ఎస్తర్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.&nbsp; అందులో మోహన్‌లాల్‌ (Mohanlal) చిన్నకూతురిలా నటించింది. ఈ సినిమానే తెలుగులో వెంకటేష్‌తో రీమేక్‌ చేయగా తిరిగే అదే పాత్రను ఎస్తర్ పోషించింది.&nbsp; ‘దృశ్యం’ తర్వాత ఎస్తర్‌కు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘దృశ్యం 2’ తెలుగు, మలయాళ వెర్షన్‌లోనూ ఎస్తర్‌ నటించింది.&nbsp; గతేడాది జనవరిలో రిలీజైన 'వింధ్య విక్టిమ్‌ వర్‌డిక్ట్‌' సినిమాలోనూ ఎస్తర్‌ ముఖ్యపాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; ప్రస్తుతం తమిళంలో ‘మిణ్మినీ’ చిత్రంలో ఎస్తర్‌ నటిస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఎస్తర్ ఆశలన్నీ ఈ సినిమాపై ఉన్నాయి.&nbsp; ఇక ఎస్తర్‌ అవార్డుల విషయానికి వస్తే దృశ్యం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ను దక్కించుకుంది. అలాగే ‘పాపనాశనం’ మూవీకి సంబంధించి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.&nbsp; ప్రస్తుతం హీరోయిన్‌గా రాణించాలని చూస్తోన్న ఎస్తర్ సోషల్ మీడియాలో వరుసగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.&nbsp; దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫ్యాన్స్‌ తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఆ ఖాతాను 1.4M మిలయన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!</strong>
    Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!
    నటీనటులు : జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌, వశిష్ట ఎన్‌. సింహ, దివి వడ్త్యా, కబిర్‌ దుహన్‌ సింగ్‌, శ్రీనాథ్‌ మాగంటి డైరెక్టర్‌ : మురళి మనోహార్‌ సంగీతం : కృష్ణ సౌరభ్‌ నిర్మాత : సంపత్ నంది, డి. రాజేందర్‌ రెడ్డి విడుదల: 09-08-2024 జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి హైదరాబాద్‌లో పార్థ గ్రూప్‌కి చెందిన కీలక వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అదే గ్రూప్‌నకు చెందిన మరో వ్యక్తిని కూడా చంపేస్తారు. అయితే ఈ హత్యల వెనక స్కూల్‌ టీచర్ అక్షిక (అనసూయ), ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు ఫాజిల్‌ (మాగంటి శ్రీనాథ్‌) ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వస్తారు. వాళ్లని అరెస్టు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఈసారి అందరు చూస్తుండగానే మరో హత్య జరుగుతుంది. ఆ హత్యలో ప్రముఖ డాక్టర్‌ పాలుపంచుకోవడంతో కథ పోలుసులు అయోమయంలో పడతారు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ (క‌బీర్‌సింగ్‌) మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? ఈ మర్డర్స్‌కు ఫారెస్ట్‌ మ్యాన్‌ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? పార్థతో అతడికి ఉన్న విభేదాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతి బాబు ఆకట్టుకున్నారు. ఓ వైపు చక్కటి హావా భావాలను పలికిస్తూనే యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టారు. ఇక టీచర్‌ అక్షిక పాత్రలో అనసూయ తనదైన నటనతో మెప్పించింది. ఏమాత్రం తడబాటు లేకుండా తనకిచ్చిన పాత్రలో జీవించింది. అటు దివి, మాగంటి శ్రీనాథ్‌, వశిష్ఠ సింహా పాత్రలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విశిష్ఠ సింహా నటన మెప్పిస్తుంది. సీనియర్‌ నటీమణులు గౌతమి, కస్తూరి ద్వితీయార్థంలో సందడి చేశారు. ప్రతినాయకుడిగా నటించిన కబీర్‌ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మురళి మనోహర్‌ క్రైమ్‌ &amp; ఇన్వెస్టిగేటివ్‌ స్టోరీకి పర్యావరణ అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనసూయ పాత్ర పరిచయం, దివి-మాగంటి శ్రీనాథ్‌ లవ్‌ ట్రాక్‌, రెండు హత్యల తాలుకూ సంఘటనలతో తొలి భాగాన్ని ఆసక్తిగా నడిపించారు డైరెక్టర్‌. అయితే ఈ మధ్యలో వచ్చే పోలీసు ఇన్వెస్టిగేషన్‌ రొటిన్‌గా అనిపిస్తుంది. అసలు లాజికల్‌గా ఉండదు. ఇక సెకండాఫ్‌లో ఫారెస్ట్‌ మ్యాన్‌గా జగపతిబాటు ఎంట్రీ, చెట్లని రక్షించడం, చెట్లను ప్రేమించడం వంటి సందేశంతో వచ్చే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. కానీ, హృదయాలను హత్తుకునే సంభాషణలు లేకపోవడంతో దర్శకుడు ఇచ్చిన సందేశం ఆడియన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. బయోలాజికల్‌ మెమెురీ కాన్సెప్ట్‌ మాత్రం సినిమాలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఎపిసోడ్‌ను ఇంకాస్త బెటర్‌గా ప్రెజంట్‌ చేసి ఉంటే బాగుండేది. మూవీ కాన్పెప్ట్‌ బాగున్నా సమర్థవంతంగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లడంతో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే కృష్ణ సౌరభ్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కృష్ణప్రసాద్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్‌ జగపతిబాబు, అనసూయ నటనసందేశంద్వితియార్థం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 09 , 2024
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. మరోమారు హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.&nbsp; టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం రకుల్‌ షేర్ చేసిన నావెల్‌ షో పిక్స్‌.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.&nbsp; టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.&nbsp; ‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; https://twitter.com/i/status/1672013355924738048 అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్‌ G’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; ఈ ఏడాది ‘అయాలన్‌’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంతో రకూల్‌ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ప్రస్తుతం రకుల్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.&nbsp; అలాగే ప్రస్తుతం రకుల్‌ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్‌, దే దే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.&nbsp; ఇక రకుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.&nbsp; రకూల్‌ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను వరుసగా షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 08 , 2024
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.  https://twitter.com/i/status/1755616891970949447 రకుల్‌-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; బీటౌన్‌ నిర్మాత&nbsp; జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్‌ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.&nbsp; https://twitter.com/i/status/1757012094317396389 ఇక రకుల్‌-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్‌ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.&nbsp; అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్‌ చేసుకున్నారని టాక్‌.&nbsp; కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.&nbsp; చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రకుల్‌ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా&nbsp; ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.&nbsp; 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా రకుల్‌ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://twitter.com/i/status/1662932748166889473 ‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్‌ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్‌ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్‌ హిట్ కావడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టింది.&nbsp; అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.&nbsp; ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్‌ G’ (Doctor G), ‘థ్యాంక్‌ గాడ్‌’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్‌' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రకుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్‌ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.&nbsp; అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్‌' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్‌ కపూర్‌ హీరోగా చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ రకుల్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 12 , 2024
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.&nbsp; భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.&nbsp; వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.&nbsp; రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
    Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
    మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం సాగించారు. ఆ తర్వాత ఇక కలిసి ఉండలేమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోయారు.  విడాకులకు అసలు కారణం ఇదేనా? నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత నిహారిక చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఒకసారి ఓ పబ్‌ పార్టీలో నిహారిక పేరు వినిపించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓసారి అపార్ట్‌మెంట్‌ వాళ్లతో గొడవతో నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో చైతన్య- నిహారికల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసినట్లు సమాచారం. పెళ్లికి ముందు గారాల పట్టిగా పెరిగిన నిహారిక వివాహా అనంతరం కాస్త ఫ్రీడమ్‌ను కోల్పోయినట్లు తెలిసింది. https://twitter.com/Ferrari_Monk/status/1676291467445440512?s=20 విడాకులపై నిహారిక స్పందన చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంపై మెగా డాటర్‌ నిహారిక తొలిసారి స్పందించింది. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అభిమానులు సంయమనం పాటించాలని కోరింది.&nbsp; కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో తాము ప్రైవసీని కోరుకుంటున్నట్లు పోస్టులో తెలిపింది. దీనిని అందరూ గౌరవించి&nbsp; సహకరించాలని నిహారిక కోరింది. ఇంత కాలం తనకు అండగా ఉన్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్టును నిహారిక ముగించింది. https://twitter.com/SureshPRO_/status/1676474938033840128?s=20 చైతన్య ఎమన్నారంటే? నిహారికతో విడాకుల నేపథ్యంలో చైతన్య జొన్నలగడ్డ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటా. 10 రోజులుగా నా జీవితంలో వచ్చిన 'విపాసన' ప్రక్రియ అద్భుతం. మనం ఒక ప్రాంతానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుత జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం చైతన్య మానసిక ప్రశాంతత పొందేందుకు ముంబైలోని విపాసన మెడిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలిసింది. అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? టాలీవుడ్‌లో సమంత- నాగచైతన్య (Samantha- Nagachithanya) విడాకులు పొందిన తీరును కొంతమంది.. నిహారిక- చైతన్య డైవర్స్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు జంటలు సొంత ప్రాంతంలో కాకుండా బయటి ప్రదేశంలో (డెస్టినేషన్ వెడ్డింగ్) వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిహారిక- చైతన్య..  2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding) చేసుకున్నారు. అలా చేసుకున్న రెండేళ్లకే ఈ జంట విడిపోయింది.  అంతకు ముందు 2017 అక్టోబర్ 6న గోవాలో నాగచైతన్య- సమంత ఇదే తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట కాపురం కూడా కొద్ది కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ టాలీవుడ్ సెలబ్రెటీలకు డెస్టినేషన్ మ్యారెజెస్ కలిసి రావడం లేదని వాదిస్తున్నారు. వరుణ్ తేజ్‌- లావణ్య త్రిపాఠి అయినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.
    జూలై 05 , 2023
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్‌గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి ‌అడుగుపెట్టారు.&nbsp; ‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్‌ ఎటాక్‌ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.&nbsp; ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫ్లాప్‌ అయినా ఆదాశర్మకు మాత్రం ‌అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.&nbsp; తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అటు బాలీవుడ్‌లోనూ ఛాన్సెస్‌ రాకపోవడంతో ఆమె వెబ్‌సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.&nbsp; హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్‌ షార్ట్ ఫిల్మ్‌లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.&nbsp; ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్‌ మాత్రం షరతులు విధిస్తున్నాయి.&nbsp; ఇక సోషల్‌ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్‌స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp; https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
    మే 11 , 2023
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.&nbsp; https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.&nbsp; గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.&nbsp; https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.&nbsp; వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
    మే 08 , 2023
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
    చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం… రంగస్థలం రామ లక్ష్మి రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్‌ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; మజిలీ శ్రావణి నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్‌ నటన నెక్స్ట్‌ లెవల్‌. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.  ఓ బేబీ సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్‌ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ. యశోద అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి. శకుంతల కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్‌ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.&nbsp; పుష్ప ది రైజ్‌ పుష్ప చిత్రంలో ఐటెమ్‌ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫ్యామిలీ మెన్ రాజీ మనోజ్ బాజ్‌పేయ్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్‌ పార్ట్‌ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్‌ అంటే నక్సలైట్‌ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్‌ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్‌ సీన్‌లో నటించి షాకిచ్చింది. సిటాడెల్ హాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సిటాడెల్‌ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌, సమంత లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్‌ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్‌ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.&nbsp;
    ఏప్రిల్ 27 , 2023
    <strong>Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?</strong>
    Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
    భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.&nbsp; [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.&nbsp; సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.&nbsp; మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.&nbsp;
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!</strong>
    Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!
    అల్లు అర్జున్‌, మెగా (Allu vs Mega) కుటుంబాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరినట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ (Allu Arjun) లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)ను బాయ్‌కాట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నెట్టింట పిలుపు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ - సుకుమార్‌ కాంబోలోని పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజైంది. అయితే ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్స్‌ మెగా ఫ్యామిలీ టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్‌ మద్దతు ఇవ్వడం వల్లే ఈ స్థాయి మనస్పర్థలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. కానీ, ఆ ఘటన కంటే ముందే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు చెడిందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఖైదీ నెంబర్‌ 150 సమయంలో..&nbsp; మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లో పెద్దగా కలిసి రాకపోవడంతో ‘ఖైదీ నెంబర్‌ 150’ (Khaidi No. 150) సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ తండ్రి, గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఎంతగానో ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా రామ్‌ చరణ్‌ తెరపైకి వచ్చి తాను నిర్మిస్తానని పట్టుబట్టాడు. ఈ విషయంలో చిరు కూడా కొడుకు పక్షాన నిలబడ్డాడు. దీంతో రామ్‌చరణ్‌ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేసి ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రాన్ని నిర్మించారు. ఈ విషయంలో అల్లు అరవింద్‌ బాగా హర్ట్ అయినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. ఆ తర్వాత అయినా చిరుతో చేయవచ్చని అల్లు అరవింద్ భావించారు. ఆ కోరిక ఇప్పటివరకూ నెరవేరలేదు. ‘ఖైదీ నెంబర్‌ 150’ తర్వాత చిరు వరుసగా ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాలను రామ్‌చరణ్‌ బ్యానర్‌లోనే చేయడం గమనార్హం. గీతా ఆర్ట్స్‌ను దూరం పెట్టిన మెగా హీరోలు? ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం నుంచే మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం మెుదలైందన్న వాదనలు ఉన్నాయి. 2017లో ఆ చిత్రం రిలీజవ్వగా అప్పటినుంచి ఒక్క మెగా హీరో కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించలేదు. 2016లో రామ్‌ చరణ్‌తో చేసిన ‘ధ్రువ’ చిత్రం మెగా హీరోలతో అల్లు అరవింద్‌ చేసిన ఆఖరి మూవీ. అంతకుముందు రామ్‌ చరణ్‌తో 'మగధీర', సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్ల నువ్వు లేని జీవితం’, చిరంజీవితో లెక్కలేనన్ని సినిమాలను అల్లు అరవింద్‌ ప్రొడ్యూస్ చేశారు. వాస్తవానికి గీతా ఆర్ట్స్‌లో వచ్చిన మెజారిటీ హిట్‌ చిత్రాలు చిరంజీవి నటించినవే. అప్పట్లో&nbsp; క్రమం తప్పకుండా చిరుతో అల్లు అరవింద్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే రామ్‌చరణ్‌ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ స్టార్ట్‌ చేశారో ఆ తర్వాత చిరు ఒక్క మూవీ కూడా అల్లు అరవింద్ బ్యానర్‌లో చేయలేదు. మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ కూడా ఆ బ్యానర్‌లో నటించలేదు. దీంతో అల్లు అరవింద్‌ను సినిమాల పరంగా దూరం పెట్టారా అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.&nbsp; అల్లు బ్రాండ్‌ కోసమేనా ఇదంతా? నిన్న, మెున్నటి వరకూ అల్లు, మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ వర్గాలు, ఆడియన్స్‌ ఒకటిగానే చూశారు. ఆ రెండు కుటుంబాలకు చిరంజీవినే పెద్ద తలగా భావించారు. చిరు తర్వాతనే అల్లు అరవింద్‌ అయినా అన్న భావన చాలా మందిలో ఉండేది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి, స్టార్ ప్రొడ్యుసర్‌గా వెలుగొందుతున్న తన తండ్రికి మెగా కాంపౌండ్‌లో ఉండటం వల్ల సరైన గుర్తింపు రాలేదని అల్లు అర్జున్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2021లో వచ్చిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడం కూడా బన్నీ ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు టాక్ ఉంది. చిరంజీవి అంటే మెగా అనే బ్రాండ్‌ ఎలా ఉందో, తన పేరు మీద అల్లు అన్న బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలని బన్నీ భావించినట్లు టాక్‌. తద్వారా తన తండ్రికి చిరుకు మించిన గుర్తింపు తీసుకురావాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్‌ను దాటి బన్నీ బయటకు వచ్చేశారని తెలుస్తోంది. అందుకే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం, అంతకముందు పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అని వ్యాఖ్యానించడం ఈ క్రమంలో జరిగినవేనని అంటున్నారు.&nbsp; చిరు కూడా దూరం పెట్టాడా? మెగాస్టార్‌ చిరంజీవి ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తుంటారు. మెగా హీరోలతో పాటు కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వారిని సైతం స్వయంగా ఈవెంట్స్‌కు వెళ్లి మద్దతిస్తున్నారు. వారి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసి తనవంతుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల ‘మట్కా’ సినిమా పోస్టర్‌ను సైతం షేర్‌ చేసి నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌కి అల్‌ ది బెస్ట్ చెప్పారు. అలాగే కూతురు నిర్మించిన ‘పరువు’ సిరీస్‌ను సైతం ప్రచారం చేశారు. అటువంటి చిరు తన మేనల్లుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ గురించి ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం చర్చకు తావిస్తోంది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ గురించి కనీసం ప్రస్తావించకపోవడం అల్లు - మెగా కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిరు కూడా అల్లు అర్జున్‌ను దూరం పెట్టారా? అన్న భావను కలిగిస్తున్నాయి. అటు అల్లు అర్జున్‌ సైతం ఇటీవల బాలయ్య షోలో పాల్గొని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను తోటి యాక్టర్లుగా మాత్రమే ట్రీట్‌ చేశాడు. మామయ్య అంటూ ఎక్కడా మాట్లాడలేదు.&nbsp; ‘పుష్ప 2’తో ముదిరిన వివాదం అల్లు, మెగా కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా వారంతా ఒకటే ఫ్యామిలీ అని న్యూట్రల్‌ ఆడియన్స్‌ ఇప్పటివరకూ అభిప్రాయపడుతూ వచ్చారు. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శ చేసుకోనప్పుడు ఎందుకు అనవసరంగా రూమర్లు స్ప్రెడ్‌ చేస్తారని ఫిల్మ్‌ వర్గాలు సైతం మండిపడుతూ వచ్చాయి. అయితే ‘పుష్ప 2’ లాంటి పాన్‌ ఇండియా చిత్రంలో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్లు వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇది కావాలని చేసి ఉంటే మాత్రం కచ్చితంగా అది రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుందని అంటున్నారు. సందర్భానుసారం వచ్చిన డైలాగ్స్‌ మాత్రమే అని బన్నీ ఫ్యాన్స్‌ చెబుతున్నప్పటికీ మెగా ఫ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదు. తమ అభిమాన కుటుంబాన్ని కించపరిచేందుకే బన్నీ కావాలని టార్గెట్‌ చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్ముందు ఈ వివాదం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.&nbsp;
    డిసెంబర్ 05 , 2024
    <strong>Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్</strong>
    Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్
    తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుస చిత్రాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా బికినీపై ఆమె చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. రీసెంట్‌గా ఆమె చేసిన 'అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌' సీజన్‌ 2 ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో బికినీలో కనిపించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.&nbsp; ఆ బికినీకి సంబంధించిన ఫొటోలను సైతం తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి. బికినీలో ఆమె లుక్‌ పర్పెక్ట్‌గా ఉందంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రతీ యాక్టర్‌కు అందంగా, ఫిట్‌గా ఉండటం అవసరమని తేజస్వి స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోనే తాను తొలిసారి బికినీ వేశానని గుర్తుచేసింది. దీనిని గొప్ప అవకాశంలా భావించాని చెప్పింది. ఓటీటీ సిరీస్‌కు బికిని అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తానేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్లమీద తిరగట్లేదని, సన్నివేశం కోసం మాత్రమే అలా చేశానని చెప్పింది.&nbsp; https://www.youtube.com/watch?v=tZHrZBu_TAY&amp;t=82s ఇక తేజస్వి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో జర్నలిజం చదివింది. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించింది. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్‌ అటాక్‌’ వంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.&nbsp; 2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది.&nbsp; 'కేరింత' చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ లభించలేదు.&nbsp; దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన తేజస్వి మదివాడ అక్కడ పలు షోలలో హల్‌చల్‌ చేసింది. 2018లో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది.&nbsp; తర్వాత స్టార్‌మాలో 'ది గ్రేటర్‌ తెలుగు లాఫర్‌ ఛాలెంజ్‌' సీజన్‌ 1లో కనిపించి సందడి చేసింది. 2022లో 'బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌ 1'లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది.&nbsp; ఇటీవల 'హైడ్‌ ఎన్‌ సీక్‌' (Hide N Seek) మూవీలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌ 2’ సిరీస్‌లో చాలా ఆశలు పెట్టుకుంది.&nbsp; మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకునే పనిలో తేజస్వి ఉంది. ఇందుకోసం తన హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తేజస్వి ఏ ఫొటో షేర్‌ చేసినా దానిని వెంటనే షేర్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?</strong>
    HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?
    హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్‌ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్‌ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్‌ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్‌ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్‌.&nbsp; భాగల్‌పూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది. భాగల్‌పుర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు చేసింది.&nbsp; నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.&nbsp; నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.&nbsp; సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్‌, సల్సా, మరెంగ్యూ, జివ్‌, జాజ్‌ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.&nbsp; లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్‌&nbsp; డ్యాన్స్ స్టూడియోస్‌' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్‌ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.&nbsp; నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్‌ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్‌ చెబుతారు.&nbsp; నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్‌ యాక్టర్‌ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట. హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్‌ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్‌ కాగా, మరొకరు మధుబాల. నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్‌.&nbsp; నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్‌ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్‌. నాని నటించిన రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్‌ కాలేదు.&nbsp; హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్‌ జంటగా నటించిన 'బ్యాడ్‌ న్యూస్‌' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్‌ అనే పాత్రలో కనువిందు చేసింది.&nbsp; రీసెంట్‌గా '36 డేస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్‌ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది.&nbsp;
    నవంబర్ 21 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
    తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.&nbsp; తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్‌ రోల్‌లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు. శైలేష్ కొలను హిట్ యూనివర్స్‌తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్‌లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు సానా కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. కేవీ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్‌ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’&nbsp; సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.&nbsp; వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
    జూన్ 14 , 2023

    @2021 KTree