• TFIDB EN
  • వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
    UTelugu
    హీరో (సందీప్) అన్న అయిన బ్రహ్మాజీ పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం అందరూ హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరుతారు. ఆ ట్రైన్‌లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అసలు ప్రార్థన ఎవరు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సందీప్ కిషన్
    సందీప్
    రకుల్ ప్రీత్ సింగ్
    ప్రార్థన
    బ్రహ్మాజీ
    సందీప్ సోదరుడు
    తాగుబోతు రమేష్
    ఆడి AKA ఆణిముత్యం
    సప్తగిరి
    దస్తగిరి
    ఎంఎస్ నారాయణ
    టాక్సీ డ్రైవర్
    నాగినీడు
    సందీప్ తండ్రి
    నర్సింగ్ యాదవ్
    పోలీసు అధికారి
    పృధ్వీ రాజ్
    సందీప్ మామయ్య
    నామాల మూర్తిరైల్వే క్యాంటీన్ మనిషి
    ప్రవీణ్
    జయ ప్రకాష్ రెడ్డి
    శివన్నారాయణ నారిపెద్ది
    రైలు కండక్టర్
    సత్య అక్కల
    హాకర్
    సిబ్బంది
    మేర్లపాక గాంధీ
    దర్శకుడు
    జెమినీ కిరణ్నిర్మాత
    రమణ గోగుల
    సంగీతకారుడు
    ఛోటా కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ కిషన్ మద్దు పేరు? సండీ సందీప్ కిషన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సందీప్ కిషన్ తొలి సినిమా? ప్రస్థానం సినిమాలో నెగిటివ్‌ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు? చెన్నై సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 7 సందీప్ కిషన్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. సందీప్ కిషన్‌కు లవర్ ఉందా? సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్? బ్లూ, వైట్ సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు? RK దుర్గా, P.R.P నాయుడు సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా సందీప్ కిషన్ ఏం చదివాడు? డిగ్రీ సందీప్ కిషన్ అభిరుచులు? ట్రావలింగ్, పార్టింగ్ సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.  సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని సందీప్ కిషన్ వ్యాపారాలు? సందీప్‌ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది. సందీప్ కిషన్‌ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
    మార్చి 21 , 2024
    <strong>Rakul Preet Singh: రకూల్ ప్రీత్‌ సింగ్‌ ఉంటే సీక్వెల్స్‌ ఫట్టేనా? నెట్టింట ఆసక్తికర చర్చ!</strong>
    Rakul Preet Singh: రకూల్ ప్రీత్‌ సింగ్‌ ఉంటే సీక్వెల్స్‌ ఫట్టేనా? నెట్టింట ఆసక్తికర చర్చ!
    తక్కువ సినిమాలతో ఎక్కువ స్టార్‌డమ్‌ను సంపాదించిన హీరోయిన్లలో ‘రకుల్‌ ప్రీత్‌ సింగ్’ (Rakul Preet Singh) ఒకరు. ‘కెరటం’ (Keratam) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రకూల్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఇచ్చిన సక్సెస్‌తో కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రవితేజ, మహేష్‌ బాబు, నాగార్జున ఇలా తెలుగులోని టాప్‌ హీరోల సరసన చకా చకా సినిమాలు చేసేసింది. ఓ దశలో అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. అటువంటి రకూల్‌ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఈ అమ్మడికి వచ్చింది. ఈ క్రమంలోనే రకూల్‌పై ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రకూల్‌ ఉంటే సీక్వెల్ ఫట్టే? 2021లో వచ్చిన 'కొండపొలం' (Kondapolam) చిత్రం తర్వాత రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ నేరుగా తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. రీసెంట్‌గా 'భారతీయుడు 2'తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ఓ ఆసక్తికర చర్చ నెట్టింట మెుదలైంది. ఈ అమ్మడు సీక్వెల్స్‌లో నటిస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు సైతం ఇస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన 'కిక్‌ 2', 'మన్మథుడు 2' పరాజయాలను గుర్తు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదలయ్యాయి. కానీ, ఊహించని స్థాయిలో అవి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన 'భారతీయుడు 2' కూడా వాటి తరహాలోనే ఒకప్పటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రానికి సీక్వెల్‌. ఈ మూడు దారుణంగా ఫెయిల్‌ కావడం, ఆ చిత్రాల్లో రకూల్‌ హీరోయిన్‌గా చేయడాన్ని నెటిజన్లు లింక్‌ చేస్తున్నారు. సీక్వెల్స్‌లో ఈ అమ్మడు నటిస్తే ప్లాఫ్ తథ్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; గతంలోనూ ఇలాగే! రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తరహాలోనే గతంలోనూ చాలా మంది హీరోయిన్స్‌పై ఈ తరహా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డేపై పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వచ్చాయి. ఈ అమ్మడిది ఐరెన్‌ లెగ్‌ అని, ఆమె చేసిన సినిమాలు కచ్చితంగా ఫ్లాప్ అవుతాయంటూ ప్రచారం చేశారు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయితే అందుకు కారణాన్ని హీరోయిన్స్‌కు అంటగట్టడం ఇటీవల కామన్‌గా మారిపోయింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఈ తరహా ఫ్లాప్‌ సెంటిమెంట్స్ వెంటాడాయి. ఆయనతో సినిమా చేసిన హీరోకు నెక్స్ట్‌ ఫిల్మ్‌లో ఫ్లాప్‌ తప్పనిసరి అంటూ సోషల్‌ మీడియా ఉవ్వెత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికీ అడపాదడపా ఈ తరహా కామెంట్స్‌ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.&nbsp; రాబోయేవి సీక్వెల్స్‌ చిత్రాలే! ప్రస్తుతం బాలీవుడ్‌లో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 'మేరి పత్నికా రీమేక్‌' ( Meri Patni Ka Remake), 'దే దే ప్యార్‌ దే 2' (De De Pyaar De 2), 'ఇండియన్‌ 3' (Indian 3) ప్రాజెక్ట్స్‌లో రకూల్‌ ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇందులో రెండు చిత్రాలు మళ్లీ సీక్వెల్స్‌ కావడం ఈ అమ్మడిని మరింత ఒత్తిడికి గురిచేసే అవకాశముంది. అటు ఓటీటీ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. రీసెంట్‌గా ‘బూ’ (Boo) అనే హార్రర్ థ్రిల్లర్‌లో రకూల్‌ నటించింది. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇక బాలీవుడ్‌ నిర్మాత జాకీ&nbsp; భగ్నానీ ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం రకూల్‌ జీవితాన్ని సరదాగా గడుపుతోంది.
    జూలై 20 , 2024
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.&nbsp; https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.&nbsp; గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.&nbsp; https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.&nbsp; వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
    మే 08 , 2023
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. మరోమారు హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.&nbsp; టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం రకుల్‌ షేర్ చేసిన నావెల్‌ షో పిక్స్‌.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.&nbsp; టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.&nbsp; ‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; https://twitter.com/i/status/1672013355924738048 అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్‌ G’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; ఈ ఏడాది ‘అయాలన్‌’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంతో రకూల్‌ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ప్రస్తుతం రకుల్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.&nbsp; అలాగే ప్రస్తుతం రకుల్‌ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్‌, దే దే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.&nbsp; ఇక రకుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.&nbsp; రకూల్‌ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను వరుసగా షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 08 , 2024
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.  https://twitter.com/i/status/1755616891970949447 రకుల్‌-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; బీటౌన్‌ నిర్మాత&nbsp; జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్‌ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.&nbsp; https://twitter.com/i/status/1757012094317396389 ఇక రకుల్‌-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్‌ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.&nbsp; అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్‌ చేసుకున్నారని టాక్‌.&nbsp; కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.&nbsp; చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రకుల్‌ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా&nbsp; ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.&nbsp; 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా రకుల్‌ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://twitter.com/i/status/1662932748166889473 ‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్‌ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్‌ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్‌ హిట్ కావడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టింది.&nbsp; అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.&nbsp; ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్‌ G’ (Doctor G), ‘థ్యాంక్‌ గాడ్‌’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్‌' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రకుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్‌ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.&nbsp; అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్‌' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్‌ కపూర్‌ హీరోగా చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ రకుల్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 12 , 2024
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.&nbsp; బ్రహ్మానందం టాలీవుడ్‌ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.&nbsp; ఆలీ టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్‌ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.&nbsp; వెన్నెల కిషోర్‌ వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్‌ ఆ సినిమాతోనే స్టార్‌ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్‌ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్‌ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది.&nbsp; సునీల్‌ టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్స్‌లో సునీల్‌ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్‌ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా సునీల్‌ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్‌ కనిపిస్తున్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.&nbsp; పృథ్వీ థర్టీ ఇయర్స్‌ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్‌ చేస్తూ ఆయన చేసి కామెడీ&nbsp;థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.&nbsp; ప్రియదర్శి పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.&nbsp; సప్తగిరి పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్‌ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.&nbsp; సత్య అక్కల టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా&nbsp; సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.&nbsp; శ్రీనివాస రెడ్డి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్‌ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.&nbsp; షకలక శంకర్‌ జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ఆరంభించిన షకలక శంకర్‌ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్‌ ఆకట్టుకున్నాడు.&nbsp;
    ఏప్రిల్ 07 , 2023

    @2021 KTree