ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్SonyLiv
Watch
స్ట్రీమింగ్ ఆన్Prime
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
టామ్ హార్డీ
మిచెల్ విలియమ్స్
రిజ్ అహ్మద్
స్కాట్ హేజ్
రీడ్ స్కాట్
సిబ్బంది
రూబెన్ ఫ్లీషర్
దర్శకుడుఅవి అరద్
నిర్మాతమాట్ టోల్మాచ్
నిర్మాతఅమీ పాస్కల్
నిర్మాతలుడ్విగ్ గోరాన్సన్సంగీతకారుడు
మాథ్యూ లిబాటిక్
సినిమాటోగ్రాఫర్కథనాలు
వెంకటేష్ (Venkatesh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన అరుదైన నటుల్లో వెంకటేష్ ఒకరు. ఆయన నటనతో ప్రేక్షకులకు కంటనీరు తెప్పించిన సందర్భాలెన్నో. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకుని ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు ఆయన సొంతం చేసుకున్నారు. ఇటు కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తూ తన తోటి నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల చేత్ వెంకీ మామాగా పిలిపించుకుంటున్న వెంకటేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వెంకటేష్ ఎవరు?
టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన వెంకటేష్ ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడి గారు రెండవ కుమారుడు.
వెంకటేష్ ముద్దు పేర్లు?
విక్టరీ వెంకటేష్, వెంకీ మామా
వెంకటేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 11 అంగుళాలు
వెంకటేష్ ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
వెంకటేష్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 డిసెంబర్ 13
వెంకటేష్ భార్య పేరు?
నీరజ
వెంకటేష్- నీరజ దంపతులకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు అమ్మాయిలు( ఆశ్రిత, భావన, హయవాహిని), ఒక అబ్బాయి( అర్జున్)
వెంకటేష్ అభిరుచులు?
క్రికెట్ ఆడటం, చూడటం
వెంకటేష్‌కు ఇష్టమైన ఆహారం?
కబాబ్స్ అండ్ హలీం
వెంకటేష్ అభిమాన నటుడు?
కమల్ హాసన్
వెంకటేష్ అభిమాన హీరోయిన్?
సౌందర్య
వెంకటేష్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?
ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, సూర్యవంశం, ఎఫ్2, నారప్ప
వెంకటేష్ ఇష్టమైన కలర్?
బ్లూ
వెంకటేష్ ఏం చదివాడు?
MBA
వెంకటేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 75 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=R3jZ-Nr_mhw
వెంకటేష్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నారు.
వెంకటేష్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
వెంకటేష్ మొత్తం 6 నంది అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు.
మార్చి 19 , 2024
Saindhav Movie Review: యాక్షన్ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: వెంకటేష్, శ్రద్ద శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
సైంధవ్ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్ నడుస్తుంటుంది. సైంధవ్ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సైంధవ్ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు.
ఎలా సాగిందంటే
గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్ కథను తీసుకున్నారు. 'సైంధవ్' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్. సన్నివేశాల మధ్య కనెక్షన్ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం శైలేష్ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్ పక్కన పెడితే సైంధవ్ మెప్పిస్తాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వెంకటేష్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్
రేటింగ్: 3/5
జనవరి 13 , 2024
Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్!
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.
ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో కార్తిక్.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్ - వెంకటేష్ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.
గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.
https://twitter.com/yousaytv/status/1717459822881509489
వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.
మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.
ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
మార్చి 16 , 2024
Venkatesh Dual role Movies: విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం.
కూలీ నంబర్ 1 (1991)
కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
??????????????????????????????????????????????????????????????
ముద్దుల ప్రియుడు(1994)
ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ.. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
పోకిరి రాజా(1995)
ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు.
సూర్య వంశం(1998)
ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
జయం మనదేరా(2000)
జయం మనదేరా సినిమా ఎన్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు.
దేవీ పుత్రుడు (2001)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు.
సుభాష్ చంద్ర బోస్ (2005)
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.
నాగవల్లి(2010)
ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు.
ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
నవంబర్ 10 , 2023
Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం?
సూపర్ పోలీస్ (1994)
విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
పవిత్ర బంధం (1996)
వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.
పెళ్లి చేసుకుందాం(1997)
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది.
రాజా (1999)
ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది.
జయం మనదేరా (2000)
ఎన్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు.
దేవీ పుత్రుడు(2001)
వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.
నవంబర్ 10 , 2023
Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడితో వివాహం జరగనుంది.
వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు. మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది.
అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం.
మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 26 , 2023
Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్ లెగ్ ట్యాగ్‌కు సల్మాన్ చెక్ పెట్టేనా?
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు.
అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్ లెగ్ ట్యాగ్ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.
‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తనపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
ఏప్రిల్ 10 , 2023
TARAKARATNA: నందమూరి ఫ్యామిలీని వెంటాడుతున్న నెంబర్ లాజిక్.. 9, 23 అస్సలు పడట్లేదు..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 19 , 2023
కె విశ్వనాథ్ సినీ ప్రస్థానం : వెండితెరపై కళాఖండాలు చిత్రీకరించిన కళాతపస్వి
]అవార్డులు1992లో పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 5 జాతీయ అవార్డులు, 5నంది అవార్డులు, 10 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు అందుకున్నారు.
ఫిబ్రవరి 11 , 2023
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్ ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.
‘ఓ పిల్ల’ సాంగ్ రిలీజ్
విష్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s
సాంగ్ ఎలా ఉందంటే?
రాఖీ (విష్వక్ సేన్), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్ అజీజ్ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్ ఎప్పటిలాగే తన క్లాసిక్ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
‘లైలా’గా విష్వక్
విష్వక్ మెకానిక్ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
https://twitter.com/HanuNews/status/1808353426721407104
పోలీసు ఆఫీసర్‌గా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్ చేశాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 18 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్‌లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్ చేశారో ఓ సారీ చూద్దాం.
ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.
భరత్ అనే నేను
పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్ బాబు.. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
లీడర్
దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
నేనే రాజు నేనే మంత్రి
విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు.
నోటా
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.
యాత్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.
ఏప్రిల్ 20 , 2023
HBD Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక 'ఈశ్వర్' ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్‌గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 23 , 2024
Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్ రద్దు వెనక పెద్ద స్కామ్? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?
హైదరాబాద్‌లో ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అకస్మాత్తుగా రద్దైన సంగతి తెలిసిందే. నొవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో గందరగోళం ఏర్పడి ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అటు తారక్ సైతం స్పెషల్ వీడియోను షేర్ చేసి మరి బాధపడ్డారు. అయితే కావాలనే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్ ప్రకారమే ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లాజికల్‌గా కొన్ని ప్రశ్నలు సైతం సంధిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఎక్కడ!
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు నొవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి పని చేసిన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క ఎయిర్‌పోర్ట్ విజువల్ కూడా బయటకి రాలేదు. అంతేకాదు దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందే సైఫ్ అలీఖాన్ తన ఫ్యామిలితో ముంబయి వీధుల్లో కనిపించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈవెంట్ రద్దు అనంతరం జాన్వీ పోస్టు చేసిన వీడియో కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. సదరు వీడియోలో తెలుగులో మాట్లాడిన జాన్వీ ఎక్కడా ఈవెంట్ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ముందుగానే ఈ వీడియోను సిద్ధం చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.
https://twitter.com/SaiTweetzz/status/1838199126569447796
తారక్ పైనా అనుమానాలు!
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తారక్ చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ను కలుసుకునే అవకాశం చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్న అదే రోజు రాత్రి 11 గంటలకు తారక్ అమెరికాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా అది రాత్రి 9:30 వరకు ఉండేదని నెటిజన్లు అంటున్నారు. అంటే హైదరాబాద్ ట్రాఫిక్‌ను దాటుకొని గంటన్నర వ్యవధిలో తారక్ ఎయిర్‌పోర్ట్‌లో వాలిపోవడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని అభిప్రాయపడుతున్నారు. ఈవెంట్ జరగదని ముందే తెలిసే తారక్ యూఎస్‌కు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్ టికెట్‌ను ఒక్కొటి రూ.1000-3000 మధ్య విక్రయించారని, వాటిని రిఫండ్ చేసిన దాఖలాలు కూడా లేవని పేర్కొంటున్నారు. టికెట్ల విషయంలోనూ పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు.
టికెట్ల రేటు పెంపు
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్లలో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
సెప్టెంబర్ 24 , 2024
Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
40 ఏళ్ల తర్వాత..
కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.
కమల్ లుక్ కష్టాలు..
‘కల్కి 2898 ఏడీ’ కమల్ హాసన్ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్ ఫైనల్ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే మేకప్ నిపుణులను కల్కి టీమ్ సంప్రదించట. అలా కమల్ హాసన్ ప్రస్తుత లుక్ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.
మేకప్‌కు కోసం 5 గంటలు
కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్ మేకప్ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
బుజ్జి కోసం రూ.4 కోట్లు
‘కల్కి’లో ప్రభాస్ రైడ్ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
700VFX షాట్స్
కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్ అనే మూడు ఫ్యూచరిక్ ప్రపంచాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించినట్లు సమాచారం.
హాలీవుడ్ యంత్రాంగం
‘కల్కి 2898 ఏడీ’ విజువల్ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్ వస్తోంది. హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్, ఇంటర్‌స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్ ‘కల్కి’ కోసం పనిచేసింది.
రికార్డు స్థాయి బడ్జెట్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట.
https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
జూన్ 27 , 2024
Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్, ప్రమోషన్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పుష్ప 2 వాయిదా..!
ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్ సైతం నిర్వహిస్తున్నారు. జూన్ ఎండింగ్ నాటికి షూటింగ్ ముగించాలని దర్శకుడు సుకుమార్ టార్గెట్ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్ కంప్లీట్ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్ వర్క్ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు.
సుకుమార్ అసంతృప్తి
పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్ శ్రీనివాస్ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్ నూలి వచ్చి ఫైనల్ కట్స్ చేశారు. అయితే ఆ ఫైనల్ ఔట్‌పుట్‌పై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
కలెక్షన్స్‌లో భారీ కోత!
పాన్ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్ దేవగన్, జాన్ అబ్రహం చిత్రాల రిలీజ్ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.
పవన్ అభిమానుల్లో ఆగ్రహం
ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్ 12) జరిగిన పవన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూన్ 13 , 2024
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.
అపర కుబేరుడికి రిక్వెస్ట్
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/nagashwin7/status/1795534761072693594
ట్వీట్ వెనక మాస్టర్ ప్లాన్
అపర కుభేరుడు ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ ట్వీట్ పెట్టడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్ మస్క్ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్ కూడా అశ్విన్ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్ వైడ్‌గా వచ్చేస్తుంది.
బుజ్జిని నడిపిన చైతూ
బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.
https://twitter.com/chay_akkineni/status/1794262966986215753
బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా?
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
కల్కి బడ్జెట్ తెలిస్తే షాకే!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మే 29 , 2024
Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్ నాచ్.. ‘వెనమ్ 3’ ఎలా ఉందంటే?
నటీనటులు : టామ్ హార్డీ, ఆండీ సెర్కిస్, చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు
దర్శకత్వం : కెల్లి మార్సెల్
సినిమాటోగ్రఫీ : ఫబియన్ వాగ్నర్
ఎడిటింగ్ : మార్క్ సంగర్
సంగీతం : డ్యాన్ డీకాన్
నిర్మాతలు : అవి అరద్, మ్యాట్ టాల్‌మచ్, కెల్లీ మార్సెల్, టాప్ హార్డీ
విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024
హాలీవుడ్ చిత్రాల్లో 'వెనమ్' సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ హీరో చిత్రాలను బాగా ఇష్టపడే వారిని 'వెనమ్' సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. తాజాగా వాటికి కొనసాగింపుగా 'వెనమ్ 3' థియేటర్లలోకి వచ్చింది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ (Venom: The Last Dance) పేరుతో అక్టోబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ టామ్ హార్డీ కథానాయకుడిగా చేశాడు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. మరి పార్ట్ 3 కూడా ప్రేక్షకులను మెప్పించిందా? అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో విజువల్ వండర్‌గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మూడో పార్ట్ మెుదలవుతుంది. వెనమ్‌తో విడిపోయిన తర్వాత ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి. లేదంటే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
వెనమ్ 3 మూవీలో టామ్ హార్డీ వన్ మ్యాన్ షో చేశాడు. ఎడ్డీ బ్రాక్ పాత్రలో మరోమారు చక్కగా ఒదిగిపోయాడు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. గత చిత్రాలలో లాగానే ఇందులోనూ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపాడు. ఎంతో సాహసోపేతంగా ఫైట్స్ చేసి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నల్ పాత్రలో ఆండీ సెర్కిస్ కూడా ఆకట్టుకున్నాడు. చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.
https://twitter.com/VenomMovie/status/1834215396595101934
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కెల్లి మార్సెల్ తొలి రెండు భాగాలు తరహాలోనే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రాన్ని కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించారు. ప్రారంభంలో ఫ్లైట్ యాక్షన్ సీన్‌తో సినిమాను మెుదలపెట్టిన దర్శకుడు ఆ జోరు చివరకూ కొనసాగించాడు. మూడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాటం అలరిస్తుంది. అయితే వెనమ్ సిరీస్‌లో ఈ మూవీనే లాస్ట్ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎడ్డీ, వెనమ్ బాండింగ్‌ను హైలెట్ చేస్తూ ఎమోషనల్ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా తప్పక అలరిస్తుంది.
https://twitter.com/VenomMovie/status/1846663977784562073
టెక్నికల్‌గా
సాంకేతిక విషయాలకు వస్తే వీఎఫ్‌ఎక్స్ టీమ్ అద్భుత పనితీరు కనబరిచిది. విజువల్ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టామ్ హార్డీ నటనయాక్షన్ సీక్వెన్స్‌వీఎఫ్‌ఎక్స్ వర్క్
మైనస్ పాయింట్స్
కొరవడిన ఎడ్డీ, వెనమ్ బాండింగ్‌కథలో డ్రామా లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసింది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్ దర్శకులకు తారక్ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్స్!
టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట జూ.ఎన్టీఆర్ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి దేవరతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్'తో సక్సెస్ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో సక్సెస్ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్ క్రియేట్ చేస్తున్నాడు.
ఒకే ఒక్క హీరోగా తారక్
హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న వాడే. అయితే తారక్ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’, సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్) వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.
23 ఏళ్ల ఫ్లాప్ రికార్డు బద్దలు
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమంట్‌ను బీట్ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్ వెంటనే ‘దేవర’తో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్ స్వయంగా తానే దీనిని బ్రేక్ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 04 , 2024
Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు
రచన, దర్శకత్వం: అర్జున్ వైకే
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్
నిర్మాత: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్
విడుదల తేదీ: 03-05-2024
సుహాస్ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.
కథేంటి
రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవసరమైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్ ఓకే అనిపించింది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అలవాటైన పాత్రలో సందడి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డిజార్డర్ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్ వైకే ఫేస్ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్ కీలక సమయాల్లో చోటు చేసుకునే మలుపులు, పతాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్‌లో డెప్త్ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు కథని నడిపించిన విధానం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
సుహాస్ నటనమలుపులుసెకండాఫ్
మైనస్ పాయింట్స్
ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
మే 03 , 2024