• TFIDB EN
  • వెట్టయన్
    రేటింగ్ లేదు
    No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
    ఆసక్తి ఉంది
    UATelugu
    రజనీకాంత్ హీరోగా జై భీమ్‌ ఫేమ్‌ టి.జె జ్ఞానవేల్‌ రూపొందించిన చిత్రం 'వెట్టైయన్‌'. ఈ సినిమా రజనీ కెరీర్‌లో 170వ చిత్రంగా రానుంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. అక్టోబర్‌ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Prime| తేదీని ప్రకటించాలి
    2024 June 112 months ago
    సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టాయన్ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
    తారాగణం
    రజనీకాంత్
    అమితాబ్ బచ్చన్
    ఫహద్ ఫాసిల్
    రానా దగ్గుబాటి
    మంజు వారియర్
    రితికా సింగ్
    కిషోర్ కుమార్ జి
    రోహిణి
    రావు రమేష్
    షాజీ చెన్
    రమేష్ తిలక్
    రక్షణ
    జీఎం సుందర్
    సిబ్బంది
    ప్రసన్న ఎస్. కుమార్
    దర్శకుడు
    వసంత్ శంకర్నిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    SR కతీర్
    సినిమాటోగ్రాఫర్
    ఫిలోమిన్ రాజ్
    ఎడిటర్ర్
    కథనాలు
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.  రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.  భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.  గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.  రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు.  
    జూన్ 28 , 2024
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.  ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.  భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.  గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.  అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది. 
    జనవరి 17 , 2024
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్‌ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్‌ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్‌ చేశారో ఓ సారీ చూద్దాం. ఒకే ఒక్కడు దర్శకుడు శంకర్‌, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్‌ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.  భరత్‌ అనే నేను పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్‌ బాబు.. భరత్‌ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్‌ రోల్‌లో సూపర్‌ స్టార్‌ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.  లీడర్‌ దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.  నేనే రాజు నేనే మంత్రి విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు. నోటా  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.  కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.  యాత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్‌ రోల్‌ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది. 
    ఏప్రిల్ 20 , 2023

    @2021 KTree