• TFIDB EN
  • విధి
    UATelugu
    హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న యువకుడు సూర్య( రోహిత్ నంద)కు ఓ పెన్ దొరుకుతంది. ఆ పెన్ వచ్చాక అతని జీవితం మారుతుంది. ఆ పెన్‌ వల్ల అతను తెలుసుకున్న నిజం ఏమిటి? పెన్‌ వల్ల అతని జీవితంలో ఏం జరుగుతుంది అనేది మిగతా అనేది అసలు కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రోహిత్ నంద
    ఆనంది
    మహేష్ ఆచంట
    మీసం సురేష్
    గౌరీ శంకర్
    సిబ్బంది
    శ్రీకాంత్ రంగనాధన్దర్శకుడు
    రంజిత్ సిరిగిరినిర్మాత
    శ్రీకాంత్ రంగనాధన్రచయిత
    అనీష్ కొంతంసంగీతకారుడు
    శ్రీచరణ్ పాకాల
    సంగీతకారుడు
    శ్రీకాంత్ రంగనాధన్సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    <strong>Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!</strong>
    Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!
    ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్‌ 13) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు ‌అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ జారీ చేసింది. దీంతో శనివారం (డిసెంబర్‌ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun Release From Jail) విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు ప్రస్తుతం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య‌, రానా, వంశీపైడిప‌ల్లి, దిల్‌రాజు, కొర‌టాల శివ‌, హ‌రీష్ శంక‌ర్‌తో పాటు ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బన్నీ-రౌడీ భాయ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బన్నీని హత్తుకున్న విజయ్‌.. అల్లు అర్జున్‌ (Allu Arjun) జైలు నుంచి ఇంటికి చేరుకున్నారన్న వార్త వినగానే రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఆగమేఘాల మీద బన్నీ ఇంటికి వచ్చేశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బన్నీ ఫోన్‌లో మాట్లాడుతుండగా విజయ్‌కు నిర్మాత అల్లు అరవింద్ కరచలనంతో స్వాగతం పలికారు. అప్యాయంగా విజయ్‌ను కౌగిలించుకున్నారు. అటు అల్లుఅర్జున్‌ కూడా ఫోన్‌ కాల్‌ ఆపేసి విజయ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఆపై ఇద్దరు ఒకరినొకరు అప్యాయంగా హగ్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కష్టకాలంలో అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన రౌడీ భాయ్‌ను బన్నీ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.  https://twitter.com/ANI/status/1867791848879927789 కంటతడి పెట్టిన సుక్కు ‘పుష్ప 2’ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ కూడా బన్నీని పలకరించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. బన్నీని చూడగానే డైరెక్టర్‌ సుకుమార్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. కంటతడి పెట్టారు. దీంతో సుక్కును బాధపడవద్దని బన్నీ వారించారు. ప్రేమగా గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుకుమార్‌, బన్నీ బంధం ఎంత బలమైందో మరోమారు నిరూపితమైందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ తర్వాత బన్నీతో పాటు పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్న సుకుమార్‌, పుష్ప 2 నిర్మాతలు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తాము ‌అండగా ఉన్నామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.  https://twitter.com/Telugu_Cult/status/1867793674119393356 https://twitter.com/PTI_News/status/1867794765691203656 మెగా హీరోలు ఎక్కడ? శుక్రవారం (డిసెంబర్‌ 13) అల్లు అర్జున్‌ అరెస్టు వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసుకొని మరి బన్నీ ఇంటికి వెళ్లారు. భార్య సురేఖతో కలిసి వెళ్లి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత సోదరుడు నాగబాబు (Naga Babu) సైతం బన్నీ ఇంటికి వెళ్లిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే శనివారం బన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మెగా హీరో అతడ్ని పరామర్శించేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి భార్య సురేఖ (Surekha Konidela) ఒక్కరే బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లుఅర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌లలో ఎవరూ బన్నీని పలకరించడానికి వెళ్లలేదు. దీంతో మెగా వర్సెస్‌ అల్లు వివాదం మరోమారు సోషల్‌ మీడియాలో తెరపైకి వచ్చింది.  https://twitter.com/ANI/status/1867809564848177444 బన్నీకి ఎమోషనల్‌ స్వాగతం శనివారం (డిసెంబర్‌ 14) తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు బన్నీని విడుదల చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా తొలుత గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌ వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బన్నీకి కుటుంబల సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన కుమారుడు అయాన్‌ పరిగెత్తుకొచ్చి హగ్‌ చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. తర్వాత సతీమణి స్నేహాను అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహా బావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/ANI/status/1867768390590611610 https://twitter.com/GulteOfficial/status/1867779035968995415 https://twitter.com/ANI/status/1867770277155017094 ‘ఆ ఘటనలో నా ప్రమేయం లేదు’ ఇంటి వద్ద బన్నీ మీడియాతో మాట్లాడారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్‌ చెప్పారు. సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న ఘటన (Sandhya Theatre Incident) గురించి మాట్లాడుతూ ‘దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె (చనిపోయిన రేవతి) కుటుంబాన్ని కలుస్తా. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని అల్లు అర్జున్‌ అన్నారు. https://twitter.com/ANI/status/1867823379673432179
    డిసెంబర్ 14 , 2024
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Mohammed Shami)ని తాను పెళ్లిచేసుకుంటానని బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) చేసిన పోస్ట్‌ నెట్టింట్‌ వైరల్‌ అవుతోంది. షమీని తాను పెళ్లి చేసుకోవాలంటే ఓ షరతును కూడా పాయల్‌ ట్విటర్‌ వేదికగా విధించింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపరుచుకుంటే పెళ్లికి సై అంటూ వ్యాఖ్యానించింది.&nbsp; ఆ పోస్టు నెట్టింట ట్రెండ్‌ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రేమకు భాషతో పనేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.&nbsp; పాయల్‌ పెళ్లి ప్రపోజల్‌పై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలంటూ మరికొందరు నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.&nbsp; బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్‌ ఘోష్‌ తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆమె పలు టాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియన్స్‌కు దగ్గరైంది.&nbsp; తెలుగులో మంచు మనోజ్‌(Manchu Manoj) నటించిన ‘ప్రయాణం’ (Prayanam) సినిమాతో పాయల్‌&nbsp; వెండితెరకు పరిచయమైంది. అందులో హీరోయిన్‌గా చేసి అందర్ని మెప్పించింది.&nbsp; ఆ తర్వాత తారక్‌ (Jr.NTR) ‘ఊసరవెల్లి’ (Oosaravelli) సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. రామ్‌దాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.&nbsp; బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ గతంలో పాయల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్‌తో జరిగిన మూడో మీటింగ్‌లోనే అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.&nbsp; 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయల్‌ ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం షమీ వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు.&nbsp; వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ&nbsp; క్రమంలోనే పాయల్‌ ఘోష్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    నవంబర్ 10 , 2023
    <strong>Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు</strong>
    Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు
    టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్‌ ప్రసాద్‌ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ సైతం విధించింది.&nbsp; ఏం జరిగిందంటే? సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ (Prasad Behera Arrest)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ప్రసాద్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. షూటింగ్‌ టైమ్‌లో తన ప్రైవేటు భాగాలను తాకాడని ఆరోపించింది. ఈ క్రమంలో గట్టిగా నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత కూడా పదే పదే తప్పుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.&nbsp; https://twitter.com/Theteluguone/status/1869352505127407721 ‘తిడుతూ దాడి కూడా చేశాడు’ కొద్ది రోజుల తర్వాత మరో వెబ్‌సిరీస్‌లో కలిసి పనిచేసినప్పుడు కూడా మరోమారు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని ప్రశ్నించగా అందరిముందు దూషించాడని చెప్పింది. డిసెంబర్‌ 11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి కూడా చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌పై 75(2), 79, 351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.&nbsp; ప్రసాద్‌ ఎలా ఫేమస్‌ అంటే? ‘మా విడాకులు’, ‘పెళ్లి వారమండి’, ‘దిల్ పసంద్’, ‘వింధ్యా విహారి’ వంటి యూట్యూబ్‌ కామెడీ సిరీస్‌లతో ప్రసాద్ బెహరా మంచి గుర్తింపు సంపాదించాడు. అతడి కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో చిన్నగా సినిమా అవకాశాలు సైతం అతడ్ని వరించాయి. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) మూవీలో ప్రసాద్‌ మంచి రోల్‌ పోషించాడు. తనలో కమెడియన్‌తో పాటు మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు.&nbsp; కెరీర్‌ ముగిసినట్లేనా? కమిటీ కుర్రోళ్లు సక్సెస్‌తో ప్రసాద్‌ బెహారాకు టాలీవుడ్‌లో అవకాశాలు మెుదలయ్యాయి. ఈ క్రమంలో అతడు అరెస్టు కావడం ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి. అది కూడా యువతిని లైంగికంగా వేధించిన కేసులో జైలుకు వెళ్లడం తీవ్ర చర్చకు తావిస్తోంది. క్రమశిక్షణ, మంచి ప్రవర్తన లేని వ్యక్తులకు అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తుంటాం. తాజా అరెస్టు నేపథ్యంలో సినిమాల్లోకి ప్రసాద్‌ను తీసుకోవడం కష్టమేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా కేసులో దోషి అని తేలితే ఇండస్ట్రీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలక మానదని అంటున్నారు.&nbsp;
    డిసెంబర్ 18 , 2024
    <strong>Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్‌</strong>
    Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్‌
    ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టును ఖండిస్తూ టాలీవుడ్‌ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడు కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరోవైపు బన్నీ అరెస్టును భారాస కీలక నేత కేటీఆర్‌ సైతం ఖండించంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; బన్నీ నివాసానికి మెగా బ్రదర్స్‌ బన్నీ అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లారు. అటు సోదరుడు నాగబాబు కూడా చిరంజీవి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను తోడుగా ఉన్నామని మెగా బ్రదర్స్‌ అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. https://twitter.com/DailyCultureYT/status/1867498589523783717 https://twitter.com/SureshPRO_/status/1867498295825678422 నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం మేజిస్ట్రేట్‌ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి రిమాండ్‌ విధించే విషయమై కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.&nbsp; బన్నీ కోసం చిరంజీవి..&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను ఆయన ఉన్నపళంగా క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో మెగాస్టార్‌ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రనిర్మాత దిల్‌ రాజు, మరికొందరు డైరెక్టర్స్‌తో కలిసి ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు సోదరుడు అల్లు శిరీష్‌ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బన్నీని కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.&nbsp; https://twitter.com/Abhinaytweets06/status/1867492787072938070 బన్నీ అరెస్టుపై కేటీఆర్‌ ఫైర్‌..&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టుపై భారస నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫైర్‌ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయెుద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌ను కూాడా అరెస్టు చేయాలి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/KTRBRS/status/1867480142085578958 https://twitter.com/NAR_Handle/status/1867482837689282809 అరెస్టుపై సీఎం రియాక్షన్‌ ఇదే..&nbsp; అల్లు అర్జున్‌ అరెస్టు (Allu Arjun Arrest)పై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టంం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని రేవంత్‌ తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పకొచ్చారు.&nbsp; హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ అరెస్టు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ తరపున అతడి లాయర్లు న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌ కింద తమ పిటిషన్‌ స్వీకరించి బన్నీ అరెస్టును సోమవారం వరకూ వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు&nbsp; ధర్మాసనం విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను స్థానిక కోర్టులో&nbsp; చిక్కడపల్లి పోలీసులు హాజరు పరిచే అవకాశముంది. ఈలోపు హైకోర్టు ధర్మాసనం తీర్పు వస్తే దాని ప్రభావం పోలీసులపై పడొచ్చు.&nbsp;
    డిసెంబర్ 13 , 2024
    Malli Pelli Review: నరేష్‌- పవిత్ర రిలేషన్‌కి కొత్త ‌అర్థం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
    Malli Pelli Review: నరేష్‌- పవిత్ర రిలేషన్‌కి కొత్త ‌అర్థం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
    నటీనటులు :&nbsp; నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ డైరెక్టర్‌ : M.S. రాజు సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి నరేష్‌ - పవిత్ర లోకేష్‌ జంటగా చేసిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి పోస్టర్‌ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా వివాదస్పదంగా మారింది. నరేష్‌ వైవాహిక, వ్యక్తిగత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై నిషేధం విధించాలని నరేష్‌ మూడో భార్య కోర్టుకు కూడా వెళ్లింది. ఇన్ని వివాదాల మధ్య ఇవాళ (మే 26) మళ్లీ పెళ్లి సినిమా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందా? ఈ చిత్రం ద్వారా నరేష్‌ ఇచ్చిన సందేశం ఏంటీ? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ‘మళ్లీ పెళ్లి’ సినిమా కథ. ఈ చిత్రం స్టోరీని చెప్పడం కంటే థియేటర్‌లో వీక్షించడమే బెటర్. నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో సినిమా అంతా&nbsp; సాగింది. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించారు. నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఎక్కడ వచ్చాయి కూడా సినిమాలో తెరకెక్కించారు. నరేష్-పవిత్ర ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా కథలో ఇమిడి ఉన్నాయి. నరేష్‌ జీవితంలోని వివాదాల సుడిగుండం గురించి ఒక స్పష్టత కావాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్‌, పవిత్ర లోకేష్‌ నటన ఆకట్టుకుంది. రమ్య రఘుపతి పాత్ర పోషించిన వనిత కూడా మెప్పించింది. అన్ని యదార్థ సంఘటనలే కావడంతో నరేష్‌, పవిత్ర నటన కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ తమ పరిధి మేరకు నటించి అలరించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? మళ్లీ పెళ్లి సినిమాకు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చాలా చక్కగా తెరకెక్కించారు. తొలిభాగం కాస్త ల్యాగ్‌ అనిపించిన సెకాండాఫ్‌లో వచ్చే నరేష్‌ - పవిత్ర మధ్య లవ్‌ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌ ‌అని చెప్పొచ్చు. అయితే సినిమాలో పవిత్ర లోకేష్‌ క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. నరేష్‌ మూడో భార్యను పాజిటివ్‌గా చూపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది డైరెక్టర్, నరేష్‌కే తెలియాలి. అయితే, నరేష్ స్టోరీ తెలియని వారికి మాత్రం సినిమా అంతగా ఎక్కదు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నరేష్, పవిత్ర నటనక్లైమాక్స్లవ్ సీన్స్నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాప్సాగదీతఆసక్తి పెంచేలా కథ లేకపోవడం రేటింగ్‌ : 2.5/5
    మే 26 , 2023
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!
    మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం మరో 8 రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ వర్క్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు 165 నిమిషాల నిడివిని సెన్సార్ సభ్యులు ఫిక్స్‌ చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌కు సెన్సార్ బోర్టు (Central Board of Film Certification) చురకలు అంటించినట్లు తెలుస్తోంది.  ఇంగ్లీషు టైటిల్‌పై మండిపాటు! గతంతో పోలిస్తే ఇటీవల సినిమా టైటిల్స్‌ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తెలుగుకు బదులు పరభాష పదాలను తెలుగు టైటిల్స్‌గా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సైతం తెలుగుకి బదులు ఇంగ్లీషు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్‌ సభ్యులు (Central Board of Film Certification).. మూవీ టీమ్‌కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. సినిమా మెుదట్లో టైటిల్ కార్డ్‌ను సైతం తెలుగు పదాల్లో ఇంగ్లీషు భాషలో ‘Game Changer’ పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగులో కూడా పెట్టాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు ఇలా ఇంగ్లీషు టైటిల్‌తో రావడంపై ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటూ పెట్టేందుకు చిత్ర బృందం అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. బ్రహ్మీకి షాక్‌..! చరణ్‌ - శంకర్ కాంబోలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’లో దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ టైటిల్స్‌ సందర్భంగా ఆయన పేరును ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ అని టీమ్‌ ప్రెజెంట్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన సెన్సార్‌ సభ్యులు పద్మశ్రీ పదాన్ని పేరుకు ముందు తొలగించాలని సూచించింది. కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలను మూవీ టైటిల్స్‌ సందర్భంగా ప్రదర్శించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ‘దేనికైనా రెడీ’ సమయంలో బ్రహ్మీ పేరు ముందు పద్మశ్రీ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’ మూవీలో ఆ తప్పు రిపీట్‌ కాకుండా సెన్సార్ బోర్డు కత్తెర పెట్టింది.&nbsp; మరిన్ని కత్తెరలు.. తెలుగు టైటిల్‌, పద్మశ్రీ పదం తొలగింపుతో పాటు మరికొన్ని కత్తెరలు సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’కు సెన్సార్‌ బోర్డు (Censor Board) విధించింది. కొన్ని సీన్లలో లిక్కర్‌ బ్రాండ్లను నేరుగా చూపించడాన్ని తప్పుబట్టింది. ఆయా లేబుల్స్‌ను తొలగించాలని చెప్పింది. అలాగే సినిమాలో ఎక్కువ సార్లు ఉన్న ‘చట్ట ప్రకారం’ పదాన్ని ‘లెక్క ప్రకారం’గా ఛేంజ్‌ చేయాలని సూచించింది. దీంతో పాటు కేరళ అనే పదాన్ని కూడా తొలిగించాలని చెప్పింది. ఓ పేపర్‌ కట్టింగ్‌ ఉన్న ‘దుర్గ శక్తి నాగ్‌పాల్’ పేరును ‘సుచిత్ర పాండే’గా మార్చాలని మూవీ టీమ్‌కు స్పష్టం చేసింది. ఇవి మినహా సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/JohnWick_fb/status/1874672597172101375 మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్‌.. 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ను మరికొద్ది సేపట్లో మూవీ టీమ్‌ రిలీజ్‌ చేయబోతోంది. ఇవాళ (జనవరి 2) సాయంత్రం 5:04 గం.లకు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్‌ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్‌.జే. సూర్యతో పాటు సముద్రఖని, అంజలి, సునీల్‌, శ్రీకాంత్, నాజర్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
    జనవరి 02 , 2025
    Allu Arjun Arrest: హైకోర్టులో అల్లు అర్జున్‌కు బిగ్‌ రిలీఫ్‌.. మధ్యంతర బెయిల్‌ మంజూరు
    Allu Arjun Arrest: హైకోర్టులో అల్లు అర్జున్‌కు బిగ్‌ రిలీఫ్‌.. మధ్యంతర బెయిల్‌ మంజూరు
    ‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ (Allu Arjun)కు బిగ్‌ షాక్‌ తగిలింది. పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల ఆయన్ను అరెస్టు చేశారు. బన్నీ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి బన్నీపై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.&nbsp; బన్నీకి బెయిల్ ఇచ్చిన హైకోర్టు నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం బన్నీకి బెయిల్ ఇచ్చేందుకు మెుగ్గు చూపింది. ఈ కేసులో బన్నీపై పెట్టిన సెక్షన్లు అతడికి వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. యాక్టర్‌ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు లభించకుండా పోవని కోర్టు అభిప్రాయపడింది. అల్లు అర్జున్‌కు జీవించే హక్కు ఉందని స్పష్టం చేసింది. రేవతి కుటుంబంపై తమకూ సానుభూతి ఉందని అంతమాత్రాన నేరాన్ని వ్యక్తులపై రుద్దలేమని హైకోర్టు పేర్కొంది. https://twitter.com/TBO_Updates/status/1867542873534824666 బన్నీకి రిమాండ్‌ అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. అక్కడ గంటపాటు ఈ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్‌ విచారణ జరిపారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయమూర్తి బన్నీని రిమాండ్‌కు అనుమతిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశామని, విచారణ జరుగుతోందని బన్నీ తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.   https://twitter.com/Trends4TDP/status/1867522662463156244 చంచల్‌గూడా జైలుకి బన్నీ! నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్‌ గూడా జైలుకు తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంచల్‌ గూడా జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/PulseNewsTelugu/status/1867518404560925104 ‘కేసు వెనక్కి తీసుకుంటా’ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించే బన్నీని అరెస్టు చేశారు. దీనిపై రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ‘నా కుమారుడు సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 సినిమా చూస్తా అంటే తీసుకెళ్లా. అక్కడ అల్లు అర్జున్‌ వచ్చినందుకు ఆయన తప్పేమి లేదు. మేము ఏమన్నా ఉంటే కేసు విత్‌డ్రా చేసుకోవడానికి&nbsp; రెడీగా ఉన్నా. బన్నీని&nbsp; అరెస్టు చేస్తున్నట్లు పోలీసు వాళ్లు నాకు ఇన్‌ఫామ్‌ చేయలేదు. మెుబైల్‌లో చూసి తెలుసున్నా. అల్లు అర్జున్‌కైతే ఏమి సంబంధం లేదు' అని చెప్పుకొచ్చారు. కాగా, రేవతి కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. https://twitter.com/bhavishya_dangi/status/1867522686009717234 రిమాండ్‌ రిపోర్టు సిద్ధం అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest)ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించిన అధికారులు అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల నిర్వహించిన తర్వాత బన్నీని కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బన్నీ రిమాండ్‌ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బన్నీని రిమాండ్‌లోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు స్టేషన్‌లో అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం. https://twitter.com/SagarVanaparthi/status/1867479706540642440 బన్నీ అసహనం అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై&nbsp; అల్లు అర్జున్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నపళంగా రమ్మంటే ఎలా అని ఆయన పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా బన్నీ మండిపడ్డట్లు తెలుస్తోంది. తనను తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కానీ, తీసుకెళ్లిన విధానం మాత్రం బాలేదని బన్నీ కొప్పడినట్లు తెలుస్తోంది. కాగా, బన్నీ అరెస్టు నేపథ్యంలో చిక్కడపల్లి పోలుసు స్టేషన్‌కు తండ్రి అరవింద్‌తో పాటు, సోదరుడు శిరీష్‌ చేరుకున్నారు.&nbsp; https://twitter.com/utkarshs88/status/1867469975646044377 https://twitter.com/sairaaj44/status/1867470582776049839 కేసుకు కారణాలు ఇవే! సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్‌ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. https://twitter.com/jsuryareddy/status/1864416102232805676 https://twitter.com/media5zone/status/1864748218325557304 సెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి? అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118 (1) సెక్షన్స్‌ లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు. https://twitter.com/jsuryareddy/status/1864714252591993005 రూ.25 లక్షల సాయం ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్‌ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. https://twitter.com/alluarjun/status/1865063351451292062
    డిసెంబర్ 13 , 2024
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్‌ మీట్స్‌ నిర్వహించిన మంచు మనోజ్‌, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్‌ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.&nbsp; విష్ణు.. మాస్ వార్నింగ్‌ మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.&nbsp; https://twitter.com/Telugu360/status/1866749230423085437 మోహన్‌బాబుకు ఊరట మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. దాడి కేసులో ఒకరి అరెస్టు మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్‌ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ 'పీస్‌' (శాంతి) అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్‌ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్‌ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.&nbsp;
    డిసెంబర్ 11 , 2024
    <strong>Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!</strong>
    Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో 'పుష్ప 2'ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో త్వరలో అల్లు అర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేస్తారా? అన్న అనుమానం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో మెుదలైంది.&nbsp; కేసుకు కారణాలు ఇవే! సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్‌ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. https://twitter.com/jsuryareddy/status/1864416102232805676 https://twitter.com/media5zone/status/1864748218325557304 సెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి? అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118(1)r/w3(5) BNS సెక్షన్స్‌ లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు. https://twitter.com/CNBCTV18News/status/1864572311036473766 బన్నీ అరెస్టు తప్పదా? చిక్కడపల్లి పోలీసులు అల్లుఅర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేసే అవకాశం లేకపోలేదని నేర విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్‌ రాక నేపథ్యంలోనే సంధ్యా థియేటర్‌ వద్ద భారీ రద్దీ ఏర్పడింది. అయితే తన రాకకు సంబంధించి బన్నీ ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఈ కేసు నుంచి అతడు బయటపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్‌ వెళ్లినట్లైతే అతడికి చిక్కులు తప్పవని చెబుతున్నారు. బన్నీ ముందస్తు సమాచారం ఇచ్చాడా? లేదా? అన్నదానిపై పోలీసులు కూడా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం మాత్రమే తమకు ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వలేదని డీసీపీ ప్రకటించారు. థియేటర్ నిర్వాహకులకు బన్నీ చెప్పి ఉండి, వారు మాత్రం నిర్లక్ష్యం వహించి ఉంటే మాత్రం బన్నీ సేఫయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బన్నీకి లేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. మెుత్తం మీద ఈ కేసుపై చిక్కడపల్లి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నందున అరెస్టులకు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. రూ.25 లక్షల సాయం ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్‌ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. https://twitter.com/alluarjun/status/1865063351451292062
    డిసెంబర్ 07 , 2024
    <strong>Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే</strong>
    Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
    కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి. “ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!” “ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“ “హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.” “నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!” “విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!” “ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!” “ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.” “నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.” “లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.” “ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!” “మీరు మా అంటే సెల్‌లో వేస్తారు.. నేను డైరెక్ట్‌ హెల్‌కి పంపించా..” “మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”. “దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.” “రెస్పెక్ట్&nbsp; అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.” “మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
    అక్టోబర్ 26 , 2024
    <strong>Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలియా భట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వేదాంగ్‌ రైనా, అకాంక్ష రంజన్‌ కపూర్‌, మనోజ్‌ పహ్వా, యువరాజ్‌ విజయన్‌, జసన్ షా, ధీర్‌ హిరా, ఆదిత్య నంద తదితరులు దర్శకత్వం : వాసన్‌ బాల సంగీతం : అచింత్‌ థక్కర్‌ సినిమాటోగ్రఫీ : స్వప్నిల్‌ ఎస్‌. సోనావానే ఎడిటింగ్‌ : ప్రేర్నా సైగల్ నిర్మాతలు : కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, షాహీన్‌ భట్‌, అపూర్వ మెహతా విడుదల తేదీ : 11-10-2024 బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్‌ చేసిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్‌ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్‌ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్‌ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్‌ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వాసన్‌ బాలా జైల్‌ బ్రేక్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్‌ రిలేషన్‌ను ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్‌ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ మూవీని ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; &nbsp;ప్లస్‌ పాయింట్స్‌ అలియా భట్‌ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>SSMB 29: మహేష్‌ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్‌ ఫొటోలు!</strong>
    SSMB 29: మహేష్‌ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్‌ ఫొటోలు!
    రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా అంటే అంచనాలు కచ్చితంగా పీక్స్‌లో ఉంటాయి. ఇక సినిమా కోసం మహేష్‌ అదిరిపోయేలా మేకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే.&nbsp; పలు డిఫరెంట్‌ సందర్భాల్లో అతడి లుక్‌ బయటకూ కూడా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా లాంగ్‌ హెయిర్‌, బీయర్డ్‌తో తన లుక్‌ను అమాంతం మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్‌ లుక్‌తో మహేష్ దర్శనమిచ్చాడు. ఇందుసు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలను షేక్‌ చేస్తున్నాయి.&nbsp; మతిపోగొడుతున్న మహేష్‌ లుక్‌! మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో రానున్న 'SSMB 29' (వర్కింగ్‌ టైటిల్‌) ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం తన జుట్టు, గడ్డం, బాడీ పెంచి మహేష్‌ రెడీ అవుతున్నాడు. దీంతో మహేష్‌ ఈ మధ్య ఎక్కడ కనపడినా అతడి లుక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు లుక్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో అతడు స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. క్రీమ్‌ కలర్‌ హుడీ వేసుకొని బ్లాక్‌ గాగుల్స్‌, రెడ్‌ క్యాప్‌ పెట్టుకొని లాంగ్‌ హెయిర్‌, రఫ్‌ గడ్డంతో మహేష్‌ కనిపించాడు. అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని మహేష్‌ దంపతులు కలవగా దానికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. అప్పటి లుక్‌తో పోలిస్తే ప్రస్తుత లుక్‌లో హెయిర్‌, గడ్డం ఇంకాస్త గుబురుగా పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. https://twitter.com/GulteOfficial/status/1843123055985635398 కొడుకు దగ్గరకేనా? సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుటుంబంతో కలిసి రెగ్యులర్‌గా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోమారు విదేశీ టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వైరల్‌ అవుతున్న మహేష్‌ ఎయిర్‌ పోర్టు వీడియోలో అతడితో పాటు భార్య నమ్రత, కూతురు సితారా ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్న కుమారుడు గౌతమ్‌ కోసం ఫ్యామిలీతో కలిసి మహేష్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడా దసరా హాలీడేస్‌ను మహేష్‌ ఎంజాయ్‌ చేస్తారని సమాచారం. కాగా, కుటుంబానికి మహేష్ ఇచ్చే ఇంపార్టెన్స్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘SSMB 29’ ప్రాజెక్ట్‌ మెుదలయ్యే లోపు ఉన్న సమయాన్ని అంతా మహేష్‌ తన కుటుంబానికే కేటాయిస్తుండటాన్ని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1843173118166356044 మహేష్‌ లుక్‌ అసలైంది కాదా? సూపర్ స్టార్‌ మహేష్‌ లేటెస్ట్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'SSMB29' కోసం మహేష్‌ లుక్‌ దాదాపుగా సిద్ధమైనట్లేనని కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌ బజ్‌ ప్రకారం మహేష్‌ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. ఇంకాస్త గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపిస్తారని టాక్. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్‌ అని జక్కన్నకు ఫిక్స్ అవుతారో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్‌ అని భ్రమపడిన మహేష్‌ ఫ్యాన్స్‌ నాలుక కరుచుకుంటున్నారు.&nbsp; అందుకే మహేష్‌కు స్వేచ్ఛ! తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్‌ బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్‌ జరుగుతున్న కాలం లుక్‌ రివీల్‌ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల సమయంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, తారక్‌ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్‌ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్‌ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్‌ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్‌ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్‌ బయటకి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.&nbsp; డిసెంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రస్తుతం 'SSMB 29' ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వర్క్‌ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో చిత్ర సభ్యులంతా వర్క్‌ షాప్‌లో పాల్గొంటారని టాక్‌. డిసెంబర్‌ నుంచి పక్కాగా రెగ్యులర్‌ షూటింగ్‌ మెుదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్‌ను విదేశాల్లో మెుదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. విదేశాల్లోని అడవుల్లో భారీ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను జక్కన్న ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లోబల్‌ సినిమాకు గ్రాఫిక్స్‌ వర్క్‌ కీలకం కావడంతో ముందుగా వాటికి సంబంధించిన సీన్స్‌ను ఫినిష్‌ చేయాలని రాజమౌళి నిర్ణయించారట. వాటిని పూర్తి చేసి వీఎఫ్‌ఎక్స్‌ విభాగానికి అప్పగిస్తే షూటింగ్‌తో పాటు వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా ప్యార్లర్‌గా జరుగుతాయని రాజమౌళి భావిస్తున్నట్లు తెలిసింది.
    అక్టోబర్ 07 , 2024
    <strong>SSMB29: మహేష్‌ లుక్‌ వేరే ఉందట! జక్కన్న భలే బురిడి కొట్టించాడుగా!&nbsp;&nbsp;</strong>
    SSMB29: మహేష్‌ లుక్‌ వేరే ఉందట! జక్కన్న భలే బురిడి కొట్టించాడుగా!&nbsp;&nbsp;
    రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా తీయనుండటంతో యావత్‌ దేశం దృష్టి దానిపై నెలకొంది. దీంతో ఈ క్రేజీ కాంబో సెట్స్‌ పైకి వెళ్లే రోజు కోసం అంతా ఎదుచూస్తున్నారు. ఇక సినిమా కోసం మహేష్‌ అదిరిపోయేలా మేకోవర్‌ అవుతున్నాడు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని మహేష్‌ దంపతులు కలవగా అతడి లుక్స్‌ వైరల్‌ అయ్యాయి. లాంగ్‌ హెయిర్‌, బియర్డ్‌ లుక్‌తో మహేష్‌ పిక్స్‌ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో SSMB29లో మహేష్‌ లుక్ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ లుక్‌ అసలైంది కాదా? సూపర్ స్టార్‌ మహేష్‌ లేటెస్ట్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'SSMB29' కోసం బాబు లుక్‌ సిద్ధమైనట్లేనని కామెంట్స్‌ కూడా చేశారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మహేష్‌ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. మరింత గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపించనున్నారట. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్‌ అని జక్కన్నకు అనిపిస్తుందో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్‌ అని భ్రమపడిన మహేష్‌ ఫ్యాన్స్‌ అంతా నాలుక కరుచుకుంటున్నారు. జక్కన్న తమని భలే బురిడికొట్టించాడని అభిప్రాయపడుతున్నారు.&nbsp; అందుకే మహేష్‌కు స్వేచ్ఛ! తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్‌ బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్‌ జరుగుతున్న కాలం లుక్‌ రివీల్‌ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల సమయంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, తారక్‌ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్‌ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్‌ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్‌ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్‌ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్‌ బయటకి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.&nbsp; రాజమౌళి మాస్టర్ ప్లాన్! మహేష్‌ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్‌ షూట్‌ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్‌ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు, షూటింగ్‌ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్‌ చేయవచ్చని మాస్టర్‌ ప్లాన్‌ వేశారట. దీంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ఆ విమర్శలకు చెక్‌ దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్‌ చేసే వీలు పడుతుందని అంటున్నారు. 'SSMB 29' చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్‌ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?</strong>
    The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?
    నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్‌, అశుతోష్‌ రానా, పావని రెడ్డి, కేశవ్‌ దీపక్, సుధా, భానుచందర్‌ తదితరులు డైరెక్టర్‌: అనిష్‌ కురువిల్లా సినిమాటోగ్రఫీ : నవీన్‌ యాదవ్‌ సంగీతం : శక్తికాంత్‌ కార్తిక్‌ ఎడిటింగ్‌: ఉమైర్‌ హాసన్‌, ఫయాజ్‌ రాయ్‌ నిర్మాతలు: గోపిచంద్‌ ఆచంట, రామ్ ఆచంట ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్‌ అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్‌ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్‌ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్‌ సేన్‌ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్‌ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్‌ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్ట‌ర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్‌, నందు, అశుతోష్‌ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్ట‌రీ ఛేదించేందుకు తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడిగా నందు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. క‌న్నింగ్ సైంటిస్ట్ పాత్ర‌కు అశుతోష్‌ రానా వంద‌శాతం న్యాయం చేశాడు. తేజ‌స్వి మ‌దివాడ, అక్ష‌ర గౌడ నటనతో కంటే తమ గ్లామ‌ర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచంద‌ర్‌, సోనియా అగ‌ర్వాల్‌, అజ‌య్ క‌తుర్వార్‌, స‌త్య‌కృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అనిష్‌ కురువిల్లా ఐలాండ్‌ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్‌, క్లాస్ ఇలా విభిన్న నేప‌థ్యాల‌తో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్ వెనుక ఓ తెలియ‌ని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హ‌త్య‌లు చేస్తున్నారు? ఒక‌రిని మ‌రికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వ‌ర‌కు ఐలాండ్ గురించి అనేక ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్‌, బోల్డ్‌ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్‌ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్‌ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్‌ తప్పకుండా నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ వర్క్‌ బాగుంది. బీచ్‌ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్‌ సెటప్‌ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనఆసక్తికర కథనంట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ బోల్డ్‌ కంటెంట్‌లెక్కకు మించిన పాత్రలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 21 , 2024
    <strong>Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్‌..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?</strong>
    Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్‌..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా నటించిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరిగ్గా 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైగ్‌ ఆడియన్స్‌ను పలకరించనుంది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇందులో తారక్‌కు జోడీగా నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), బాబీ డియోల్‌ (Bobby Deol) వంటి హిందీ స్టార్‌ నటులు విలన్‌ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దేవర’ రన్‌టైమ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది చూసి తారక్ ఫ్యాన్స్‌ అందోళనకు గురవుతున్నారు.&nbsp; రన్‌ టైమ్ ఎంతంటే? తారక్‌, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన దేవర చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రన్‌ టైమ్‌ ఫైనల్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మెుత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను దేవర టీమ్‌ ఫైనల్‌ చేసినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఎడిటింగ్‌ వర్క్‌ మెుత్తం పూర్తైన అనంతరం ఈ మేరకు నిడివి వచ్చిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నిడివి ‘దేవర’ను ఇబ్బంది పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన చాలా వరకు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ నిడివే ‘దేవర’కు ఫైనల్‌ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే సెన్సార్‌ బోర్డు సమీక్షకు ఈ మూవీ వెళ్లాల్సి ఉంటుంది. బోర్డ్‌ సభ్యులు ఏదైన కత్తెరలు విధిస్తే నిడివి కాస్త తగ్గే అవకాశముంది.&nbsp; కొరటాల మ్యాజిక్‌ చేసేనా? సెన్సార్‌ ఎన్ని కత్తెరలు విధించిన ‘దేవర’ నిడివి 3 గంటల కంటే తగ్గే పరిస్థితులు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల స్క్రీన్‌ప్లే ప్రెజెన్స్‌పై సినిమా సక్సెస్‌ ఆధారపడనుంది. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్‌ అనే నేను’, ‘జనతా గ్యారేజ్‌’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్‌ స్కిల్స్‌ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్‌ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ కూడా దాదాపుగా 3 గంటల నిడివితో రిలీజైంది. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ డ్రామా, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌ స్కిల్స్‌, నాని - ఎస్‌.జే. సూర్య అద్భుతమైన నటనతో నిడివి పెద్దగా సమస్య కాలేదు.&nbsp; నిడివితో దెబ్బతిన్న చిత్రాలు! ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు&nbsp; 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.&nbsp; కొత్త పోస్టర్‌ రిలీజ్‌ దేవర చిత్రం నుంచి నేడు మూడో సాంగ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఫియ‌ర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్ట‌మ‌ల్లే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ రెండు పాట‌లు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి 'దావుడి' పేరుతో థర్డ్‌ సింగిల్‌ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తారక్‌, జాన్వీ కపూర్‌ ఇచ్చిన రొమాంటిక్ ఫోజు ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1831219654229913706 ‘దేవర’ స్టోరీ అదేనా? 'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.&nbsp;
    సెప్టెంబర్ 04 , 2024
    <strong>VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!</strong>
    VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; రెండు భాగాలుగా.. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. 'VD 12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్‌ తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్‌ చేసిన చిత్రాలన్నీ సింగిల్‌ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్‌ కెరీర్‌లోనూ సీక్వెల్స్‌ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తున్నారు. ఆకట్టుకున్న ఫస్ట్ లుక్‌! 'VD12' చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో విజయ్‌ మాస్‌ లుక్‌లో కనిపించాడు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు' అని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్‌ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.&nbsp; డ్యుయల్‌ రోల్‌లో..! ‘VD 12’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్‌ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్‌ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తే విజయ్‌ దేవరకొండ ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్‌ చూస్తే థియేటర్‌లో మాస్‌ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.&nbsp; విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.&nbsp;
    ఆగస్టు 05 , 2024
    <strong>Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;</strong>
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.&nbsp; విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!&nbsp; ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.&nbsp; https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.&nbsp;
    జూలై 27 , 2024
    <strong>Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;</strong>
    Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో సమంత (Samantha Ruth Prabhu) ఒకరు. అనారోగ్యం రిత్యా కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. తన గ్లామర్‌ పోస్టులతో తరచూ వారికి హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజర్‌ వాడకంపై ఆమె పెట్టిన పోస్టు.. వివాదానికి దారి తీసింది. దీనిపై వైద్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ డాక్టర్‌ ఏకంగా సమంతను జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సమంత కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ నెట్టింట రచ్చరేపుతున్న ఈ వివాదానికి గల కారణాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; సమంత హెల్త్‌టిప్‌ ఇదే! ప్రముఖ నటి సమంత.. మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. తాను తీసుకుంటున్న వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజేషన్‌ గురించి ఆమె పోస్టు పెట్టారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. ‘హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ట్ వాటర్ రెండూ కలిపి నెబులైజర్ చేయండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి’ అంటూ సమంత తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని తనకు సూచించిన మిత్ర బసు చిల్లర్ అనే వైద్యురాలిని కూడా పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టు నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; సమంతను జైల్లో పెట్టాలి: డాక్టర్‌ సమంత పెట్టిన పోస్టు వైరల్‌ కావడంతో.. ఇది చూసిన పలువురు డాక్టర్స్ మండిపడ్డారు. సమంతపై సోషల్‌ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తప్పు అని సూచించారు. ముఖ్యంగా డాక్టర్ అబీ ఫిలిప్స్ అనే డాక్టర్‌ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించారు.&nbsp;‘TheLiverDoc’ పేరుతో ఉన్న తన ఎక్స్‌ ఖాతాలో సమంతపై విరుచుకుపడ్డారు. సమంత చెప్పినట్లు చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమంతకు హెల్త్‌ గురించి, సైన్స్‌ గురించి తెలియదని నిరక్షరాస్యురాలంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకు ఆమెను జైలులో పెట్టాలని లేదా జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/theliverdr/status/1808804909783159003 సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌ తనను జైల్లో పెట్టాలంటూ డాక్టర్‌ ఇచ్చిన వార్నింగ్‌పై నటి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఒక ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. 5 ఏళ్లుగా డీఆర్డీవోకు సేవలందించిన, ఎండీ అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సను సూచించారు. ఒక పెద్దమనిషి నా పోస్టును, నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని సామ్‌ రాసుకొచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
    జూలై 05 , 2024
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్‌ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్‌ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్‌ బాయ్‌ పాత్రలే చేసిన వరుణ్‌ సందేశ్‌.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్‌ ఉద్యోగిగా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్‌ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్‌ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్‌ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ వరణ్‌ సందేశ్‌ నటననేపథ్య సంగీతంసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    జూన్ 21 , 2024

    @2021 KTree