• TFIDB EN
  • విదుతలై పార్ట్ 1
    UATelugu2h 30m
    పోలీస్‌ డ్రైవర్‌ కుమారేశన్‌కు ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్‌ ఇస్తారు. అక్కడ నక్సలైట్లు, పోలీసులకు మధ్య నిత్యం ఎన్‌కౌంటర్లు జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్‌ పెరుమాళ్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కుమారేశన్‌ ప్రేయసిని అరెస్టు చేస్తారు. చిత్ర హింసలు పెడతారు. అది చూడలేక కుమారేశన్‌ ఏం చేశాడు? పెరుమాళ్‌ ఆచూకిని ఎలా కనిపెట్టాడు? పెరుమాళ్‌ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Tamil, Malayalam, Kannada )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సూరి
    విజయ్ సేతుపతి
    భవానీ శ్రీ
    గౌతమ్ వాసుదేవ్ మీనన్
    రాజీవ్ మీనన్
    ఇళవరసు
    బాలాజీ శక్తివేల్
    శరవణ సుబ్బయ్య
    తమిస్హ్
    చేతన్
    ఆర్యన్
    మున్నార్ రమేష్
    పావెల్ నవగీతన్
    సర్దార్ సత్య
    మణిమేగలై
    బాల హాసన్
    S. చంద్రన్
    అసురన్ కృష్ణుడు
    సుందరేశ్వరన్ CVC
    ఆర్. గణేష్ గురుంగ్
    సిబ్బంది
    వెట్రిమారన్
    దర్శకుడు
    ఎల్రెడ్ కుమార్
    నిర్మాత
    బి. జయమోహన్
    రచయిత
    ఇళయరాజా
    సంగీతకారుడు
    ఆర్. వేల్‌రాజ్
    సినిమాటోగ్రాఫర్
    ఆర్. రామర్ఎడిటర్ర్
    కథనాలు
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్ రిలీజ్ మూవీస్ శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో అగ్రకథానాయిక సమంత చేసిన శాకుంతలం చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 14) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. శాకుంతలం మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, అల్లు అర్హ, ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌ బాబు, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. రుద్రుడు  రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కిన ‘రుద్రుడు’ చిత్రం కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కతరేశణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవాని కథానాయికగా చేసింది. ఈ సినిమాను అదే రోజున తమిళ్‌లోనూ రుద్రన్‌ పేరుతో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇవాళ (ఏప్రిల్‌ 10) హైదరాబాద్‌లోని  పార్క్‌ హయాత్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.  విడుతలై పార్ట్‌-1 తమిళ హాస్యనటుడు సూరి హీరోగా రూపొందిన ‘విడుతలై పార్ట్‌-1’ చిత్రం శనివారం (ఏప్రిల్‌ 15) తెలుగులో రిలీజ్‌ కానుంది. మార్చి 31న తమిళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తెలుగులోనూ ‘విడుదల’గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ఓ ప్రధానపాత్రలో కనిపిస్తారు. నక్సలైట్లకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.  చిప్‌కలి ఈ వారం బాలీవుడ్‌ నుంచి చిప్‌కలి సినిమా ఒక్కటే రిలీజ్‌ అవుతోంది. క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14 (శుక్రవారం)న రిలీజ్ చేస్తున్నారు. కౌషిక్ కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీ సినిమాలు దాస్‌ కా ధమ్కీ తెలుగులో ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న దాస్‌ కా ధమ్కీ చిత్రం ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. ఆహాలో ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది. విశ్వక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. విశ్వక్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాకు నిలిచింది. కాగా, ఈ సినిమాకు ఓటీటీ ప్రియులను కచ్చితంగా అలరిస్తుందని చెప్పొచ్చు.  అసలు రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అసలు చిత్రం గురువారం( ఏప్రిల్‌ 13)న ఓటీటీలో సందడి చేయనుంది. ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నటి పూర్ణ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది.  ఓ కల చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన ఓ కల చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఓ కల ట్రైలర్‌ ఆకట్టుకుంది.  ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  TitleCategoryLanguagePlatformRelease DateRennervations. Premiereseries EnglishDisney+ HotstarApril 12Ticket to Paradise (2022)MovieEnglishAmazon PrimeApril 11Alter Ego (2022)MovieenglishAmazon PrimeApril 12Big Bad Wolves (2014) movieenglishAmazon PrimeApril 12Herbie Hancock: Possibilities (2006)movieenglishAmazon PrimeApril 12Kill Me Three Times (2015)MovieEnglishAmazon PrimeApril 12Life Itself (2014)MovieEnglishAmazon PrimeApril 12The Quest of Alain Ducasse (2018) MovieEnglishAmazon PrimeApril 12Whose Streets?DocumentEnglishAmazon PrimeApril 12Greek Salad (2023)SeriesEnglishAmazon PrimeApril 14CoComelon: Season 8SeriesEnglishNetflixApril 10All American: Homecoming Season 2SeriesEnglishNetflixApril 11Leanne Morgan: I’m Every WomanSeriesEnglishNetflixApril 11American ManhuntSeriesEnglishNetflixApril 11Operation: NationMovieEnglishNetflixApril 11The Boss BabySeriesEnglishNetflixApril 12PhenomenaSeriesEnglishNetflixApril 12QueenmakerDramaEnglishNetflixApril 14The Best Man HolidayMovieEnglishNetflixApril 16
    ఏప్రిల్ 10 , 2023
    <strong>Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!</strong>
    Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్‌ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్‌ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ పార్ట్‌ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్‌ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు? భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్‌ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్‌ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్‌ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్‌ పార్ట్‌లో రానుంది.&nbsp; విజయ్‌కి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌! కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ పోషించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్‌ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర కూడా సెకండ్‌ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.&nbsp; కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp; 'కల్కి 2' రిలీజ్‌ ఎప్పుడంటే? ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.&nbsp; అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్​' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.&nbsp;
    జూలై 08 , 2024
    <strong>Ramayana: ‘రామాయణం’ టీమ్‌ నుంచి డబుల్‌ ట్రీట్‌.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!</strong>
    Ramayana: ‘రామాయణం’ టీమ్‌ నుంచి డబుల్‌ ట్రీట్‌.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
    రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూట్‌ మెుదలవ్వగా సెట్‌ నుంచి కొన్ని ఫోటోలు సైతం లీకయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి కళ్లు చెదిరే అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ అధికారికంగా అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రెండు పార్ట్స్‌గా..&nbsp; ‘రామాయణ’ (Ramayana) చిత్రం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మెుదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. ఇది గమనించిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీని రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేసింది.&nbsp; హనుమంతుడిగా సన్నీ డియోల్‌! ‘రామయణ’ (Ramayana) చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్‌ (Yash) రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడితో పాటు పలువురు స్టార్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ‌అలాగే హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సూర్పనక రోల్‌ చేస్తున్నట్లు తెలిసింది. హిందీ ‘రామాయణం’ సీరియల్‌లో రాముడిగా కనిపించి ఎంతో పాపులర్ అయిన సీనియర్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌ ఇందులో దశరథుడిగా కనిపించనున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్‌, మందరగా షీబా చద్దా చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు రామయణ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. https://twitter.com/seeuatthemovie/status/1854049562689740919 ఆస్కార్‌ విన్నర్లతో మ్యూజిక్‌ ‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించ‌డం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర‌్లు రంగంలోకి దిగారు. ఇందులో ఒక‌రు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కాగా ఇంకొక‌రు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్ద‌రూ క‌లిసి రామాయ‌ణం సినిమాకు సంగీతం అందించ‌నున్నారు. తొలుత ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్‌ను మాత్రమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. అయితే అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో మ్యూజిక్‌ ఉండాలన్న ఉద్దేశ్యంతో హన్స్‌ జిమ్మెర్‌ను సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యుడ్ని చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పనిచేసిన హన్స్‌కు ‘రామాయణ’ ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కానుంది. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ వంటి హాలీవుడ్‌ చిత్రాల‌తో హన్స్ జిమ్మెర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించాడు. గ్రాఫిక్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్‌ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణ’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్‌ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం హాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన 26 మంది ఎక్స్‌పర్ట్ గ్రాఫిక్స్‌ టీమ్‌ వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి వీఎఫ్‌ఎక్స్ విషయంలో మూవీ టీమ్‌ ఏమాత్రం రాజీ పడటం లేదని అర్థమవుతోంది.&nbsp; తెలుగు బాధ్యత త్రివిక్రమ్‌దే! రామాయణ (Ramayana) తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)కు మేకర్స్‌ అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా త్రివిక్రమ్ ఎక్కడా ఖండించలేదు. దీంతో ‘రామాయణ’ టీమ్‌లో మాటల మాంత్రికుడు సైతం భాగస్వామి అయినట్లు తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    <strong>Polimera 3: బాలీవుడ్‌ ప్రేక్షకులను టార్గెట్‌ చేయనున్న ‘పొలిమేర 3’.. మరో ‘కాంతార’ కానుందా?</strong>
    Polimera 3: బాలీవుడ్‌ ప్రేక్షకులను టార్గెట్‌ చేయనున్న ‘పొలిమేర 3’.. మరో ‘కాంతార’ కానుందా?
    ‘మా ఊరి పొలిమేర’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. చేతబడి (బ్లాక్‌ మ్యాజిక్‌) నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఆడియన్స్‌ ఎంతగానో ఆదరించారు. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ అయిన ‘పొలిమేర 2’ను మేకర్స్‌ థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. అది కూడా అంతే స్థాయిలో విజయం సాధించి ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో పొలిమేర డైరెక్టర్‌ డా. అనిల్‌ విశ్వనాథ్‌ బిగ్‌ ప్లాన్‌ వేశారు. మూడో భాగాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు.&nbsp; జాతీయ స్థాయిలో.. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాల్లో సత్యం రాజేష్‌ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), బాలదిత్య (Baladitya), గెటప్‌ శీను (Getup Srinu) ప్రధాన పాత్రలు పోషించారు. ‘పొలిమేర 2’ గతేడాది థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించి ఘన విజయం అందుకుంది. ఈ క్రమంలోనే 'పొలిమేర 3' (Polimera 3) రూపొందించబోతున్నట్లు మూవీ టీమ్‌ తాజాగా ప్రకటన చేసింది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్ రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ప్రకారం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ‘పొలిమేర 3’ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.&nbsp; డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ 'పొలిమేర 3' తో నిర్మాతగా మారుతున్నారు.&nbsp; 'పొలిమేర' సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది. https://twitter.com/i/status/1810894418091692096 త్వరలోనే షూటింగ్‌ 'పొలిమేర 3' చిత్రానికి సంబంధించి డైరెక్టర్‌ డా. అనీల్‌ విశ్వనాథ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నట్లు సమాచారం. వేగంగా ఆ పనులు కూడా ఫినిష్‌ చేసుకొని త్వరలోనే షూటింగ్‌ మెుదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పార్ట్ 3’ ఇంకా అదిరిపోతుందని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. గత చిత్రాలకు మించిన ట్విస్టులు, ఇంట్రస్టింగ్‌ స్టోరీతో ‘పొలిమేర 3’ రానున్నట్లు పేర్కొంటున్నాయి.&nbsp; ఆ పజిల్స్‌కు ‘పొలిమేర 3’లో ఆన్సర్లు! దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ ‘పొలిమేర 3’ కోసం ఎన్నో చిక్కుముడులను పార్ట్ 2లోనే వదిలి వెళ్లారు.&nbsp; ‘పొలిమేర 2’ క్లైమాక్స్‌ను పార్ట్‌-3కి ముడి పెడుతూ కొన్ని పజిల్స్‌ ఇచ్చారు. జాస్తిపల్లిలోని గుడి నేలమాళిగలో ఉన్న సంపదను క్షుద్రపూజ చేసి కొమురయ్య (సత్యం రాజేష్‌) కనుగొనడం క్లైమాక్స్‌లో చూపించారు. కట్‌ చేస్తే భార్యను కలవడానికి వెళ్లిన కొమురయ్యకు లక్ష్మీ ( కామాక్షి భాస్కర్ల) విషం పెడుతుంది. అతడు స్పృహా కోల్పోగానే అనూహ్యంగా నటుడు పృథ్వీ వచ్చి లక్ష్మీ నుదుటిపై కాల్చి చంపేస్తాడు. పృథ్వీ అలా ఎందుకు చేశాడు? నేలమాళిగలోని సంపదను కొమురయ్య ఏం చేశాడు? కొమురయ్య తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) అసలు దేనిని వెతుక్కుంటూ వెళ్లాడు? అన్నది మూడో భాగంలో చూపించనున్నారు.&nbsp; https://twitter.com/telugufilmnagar/status/1810936077869371440 మరో ‘కాంతారా’ కానుందా? కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ (Kantara) చిత్రం దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ‘కాంతార’ కూడా పొలిమేర తరహాలోనే ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ అయినప్పటికీ నేపథ్యం మాత్రం ఒకటే. కంటికి కనిపించని శక్తులతో ఈ రెండు చిత్రాలు రూపొందాయి. కాంతార దేవ శక్తి బ్యాక్‌డ్రాప్‌లో వస్తే పొలిమేర మాత్రం బ్లాక్‌ మ్యాజిక్‌తో తెరకెక్కింది. ప్రస్తుతం డిఫరెంట్‌ కంటెంట్‌తో వచ్చిన చిత్రాలకు నార్త్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ‘పొలిమేర 3’ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొలిమేర చిత్రం వారికి కొత్త అనుభూతిని పంచుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి ‘పొలిమేర 3’ పాన్‌ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.&nbsp;
    జూలై 10 , 2024
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు రచన, దర్శకత్వం: అభిమన్యు సంగీతం: ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా విడుదల తేదీ: 16-02-2024 ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్‌ పనితీరు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 16 , 2024
    Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
    Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
    గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్‌ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్‌ పార్ట్‌ ఆడియన్స్‌ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; మనీ మనీ మోర్‌ మనీ&nbsp; జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్‌ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.&nbsp; Money Money More Money Wallpapers శంకర్‌దాదా జిందాబాద్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ&nbsp; చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కిక్‌&nbsp; 2 రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ చిత్రాల్లో ‘కిక్‌’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్‌-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.&nbsp; సర్దార్ గబ్బర్ సింగ్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్‌ డిజాస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మన్మథుడు 2 అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.&nbsp; గాయం 2 1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్‌ చిత్రానికి ప్రవీణ్‌ శ్రీ దర్శకత్వం వహించారు.&nbsp; ఆర్య-2&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్‌ మాత్రమే తెచ్చుకుంది.&nbsp; చంద్రముఖి 2 &amp; నాగవల్లి తెలుగులో వచ్చిన టాప్‌-5 హారర్‌ చిత్రాల్లో రజనీకాంత్‌ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్‌ చేశాడు.&nbsp; రోబో 2 రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు.&nbsp; సత్య 2 రామ్‌గోపాల్‌ వర్మను బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు.&nbsp; వెన్నెల 1/2&nbsp; రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్‌ దర్శకత్వం వహించడం విశేషం. అవును 2 విభిన్నమైన హారర్‌ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2)&nbsp; మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది.&nbsp; మంత్ర 2 కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్‌ &amp; సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్‌ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.&nbsp;
    ఫిబ్రవరి 22 , 2024
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పుప్ప2. తొలి పార్ట్‌ సూపర్ హిట్ కావడంతో ఈచిత్రాన్ని  పాన్‌ ఇండియా రేంజ్‌లో  దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి వినిపిస్తున్న లెటెస్ట్ బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప  తరువాతే ఉన్నారని చెప్పవచ్చు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు కొనుగోలు అయితే.. దేవర 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప రూల్ ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. మరోవైపు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Rights) హక్కుల కొనుగోలుపై కూడా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. RRR రికార్డు బ్రేక్ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 ది రూల్ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫిక్స్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల కోసం రూ.275 కోట్ల భారీ డీల్‌ను మూవీ మేకర్స్‌తో కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఇండియాలోనే అత్యధికమైన డీల్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మరే చిత్రం ఈ స్థాయిలో అమ్ముడుపోలేదని చెబుతున్నారు. పుష్ప2కు ముందు.. RRR చిత్రం ఓటీటీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో అల్లు అర్జున్ RRR రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ కలిసి రూ.350 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఇందులో మెజార్టీ వాటను నెట్‌ ఫ్లిక్స్ చెల్లించింది. అయితే మొత్తం పుష్ప 2 డీల్ కంటే తక్కువ అని తెలిసింది. RRR చిత్రాన్ని కన్నడ మినహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ5 కన్నడ భాష ప్రసార హక్కులను దక్కించుకుంది. అయితే పుష్ప 2 ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని భాషాల్లో స్ట్రీమింగ్ చేయనుందో తెలియాల్సి ఉంది. RRR సినిమా మాదిరి మెజారిటీ భాషల్లో ప్రసారం చేస్తుందా? లేక అన్ని భాషల్లో ప్రసార హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? మరోవైపు పుష్ప 2 థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ కోసం దాదాపు రూ.200కోట్లకు బయ్యర్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్‌తో భారీ హైప్  పుష్ప 2 పై ఉన్న క్రేజ్ అభిమానుల్లో మాములు లెవల్లో అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని సర్వత్రా కలిగించింది. టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.  పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.&nbsp; స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, రావు రమేష్, ఫహద్ పాసిల్ అలాగే అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp; దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
    ఏప్రిల్ 18 , 2024
    <strong>Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?</strong>
    Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్‌’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) మూవీ షూటింగ్‌ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. కారణం ఏంటంటే? శివకార్తికేయన్‌ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్‌’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్‌ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్‌ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్‌ షూట్‌ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’ రాత్రి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy) షూటింగ్‌ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్‌ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్‌ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.&nbsp; దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్‌ రోల్స్‌ చేశాడు. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రిలీజ్‌ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్‌'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తొలి పార్ట్‌ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!</strong>
    Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!
    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్‌ చేశారంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్‌ పవర్‌ ఇచ్చే అప్‌డేట్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్‌ 'పుష్ప' చిత్రంలో నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్‌ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్‌ 'పుష్ప 2'లో తన పాత్ర గురించి చెబుతూనే 'పుష్ప 3' క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్‌ మాత్రమే షూట్‌ చేశారు. మిగిలిన డేట్స్‌ పుష్ప 2కి వాడుకుంటాం సర్‌ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్‌ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్‌ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో' అంటూ రావు రమేష్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. 'పుష్ప 3' పక్కాగా ఉంటుందని రావు రమేష్‌ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nasavnensasthaa/status/1828421405731697031? క్లైమాక్స్‌లో హింట్‌! ‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్‌ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్‌ రెండు మూడేళ్ల గ్యాప్‌ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. సుకుమార్‌ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్‌ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్‌, తమిళ స్టార్ డైరెక్టర్‌ అట్లీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.&nbsp; తొలి పార్ట్‌కి మించి..&nbsp; ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, ఫస్ట్‌, సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్‌ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్‌ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్‌ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్‌ ఆడే గేమ్‌, ఎమోషనల్‌ సీన్స్‌, పుష్ప రాజ్‌ vs భన్వర్‌సింగ్‌ షెకావత్‌ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.&nbsp; ‘కేజీఎఫ్‌’ ఫార్మూలా! డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్‌’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్‌ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్‌ 2’ను కూడా రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌ 3’ గ్యాప్‌ ఇచ్చి ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్‌ సైతం ‘టాక్సిక్‌’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్‌ - బన్నీ కూడా ప్రశాంత్‌ నీల్‌- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ ఫినిష్‌ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!
    HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!
    నేషనల్‌ క్రష్‌ రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కన్నడలో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ (Kirik Party)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కఠినమైన పాత్రలను కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన జీవితంలో సాధించిన ఘనతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. అలాగే ఆమె లేటెస్ట్‌ చిత్రాలు ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుండి విడుదలైన రష్మిక పోస్టర్లపైనా ఓ లుక్కేద్దాం.&nbsp; ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం ఈ ఏడాది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది. దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది. తొలి ఇండియన్‌గా గుర్తింపు తెలుగు, తమిళ, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన ‘ఒనిట్సుకా టైగర్‌ ఫ్యాషన్‌’ సంస్థకు ‘బ్రాండ్‌ అడ్వకేట్‌’గా ఎంపికైంది. ఆ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్‌ భారతీయురాలు తానేనని రష్మిక స్వయంగా వెల్లడించింది.&nbsp; ఏకైక నటి రష్మికనే రష్మిక తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘సెప్టిమిస్ అవార్డ్స్’ నామినేషన్స్‌లో రష్మిక నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో మన దేశం నుంచి రష్మిక మందన్న నిలవడం విశేషం. తొలి సెలబ్రెటీగా రికార్డు ఇటీవల టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్‌ అనిమే’ (Crunchyroll Anime)&nbsp; అవార్డులకు నేషనర్‌ క్రష్‌ రష్మిక హాజరైంది. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీగా రష్మిక రికార్డు సృష్టించింది. దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు. https://twitter.com/i/status/1763610574485647680 సోషల్‌మీడియాలోనూ రికార్డు యంగ్‌ బ్యూటీ రష్మిక మందన్న ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెకు గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్‌ దక్కించుకుంది. ఆతర్వాత సమంత 33 మిలియన్లు, పూజా హెగ్డె 26.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. శ్రీవల్లి.. మెస్మరైజ్‌ లుక్‌ అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న చిత్రం 'పుష్ప 2' (Pushpa 2). ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. కాగా, ఇవాళ రష్మిక బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ అదిరిపోయే పోస్టర్‌ను లాంచ్ చేసింది. శ్రీవల్లి పాత్రకు సంబంధించిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చీరలో దట్టంగా వేసిన నగలతో చాలా అందంగా కనిపించింది.&nbsp; కాలేజీ స్టూడెంట్‌గా అదుర్స్‌! రష్మిక నటిస్తున్న మరో లేటెస్ట్‌ మూవీ 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' (The Girlfriend). నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫస్ట్‌ పోస్టర్‌ కూడా ఇవాలే విడుదలై నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో రష్మిక పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లను దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ తన ఎక్స్ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో రష్మిక చాలా క్లాస్‌ లుక్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/23_rahulr/status/1776105100903432572
    ఏప్రిల్ 05 , 2024
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా డబుల్ గుడ్‌న్యూస్‌ ప్రకటించారు.  డబుల్‌ ధమాకా ఏంటంటే? ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్‌.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్‌ ప్రసారం అవుతుందని డైరెక్టర్‌ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ‌అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్‌ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది. https://twitter.com/PrasanthVarma/status/1766116151636140450 మరి తెలుగులో ఎప్పుడు? హనుమాన్‌ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్‌ భరించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.  తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు! హనుమాన్‌ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్‌ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్‌ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్‌ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్‌’ హౌస్‌ఫుల్‌ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1766064148956532944 సీక్వెల్‌లోనూ విలన్‌ అతడేనా? ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్‌ విలన్‌గా నటించిన 'వినయ్ రాయ్‌' (Vinay Roy) పార్ట్‌ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్‌ రాయ్‌కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పోస్టు చేశారు. వినయ్‌ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కు మాస్క్, బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్‌ సిబ్బందికి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు.. 'జై హనుమాన్‌'లోనూ వినయ్‌ విలన్‌గా కనిపిస్తాడా? అనే డౌట్‌ను రెయిజ్‌ చేస్తున్నారు. https://twitter.com/PrasanthVarma/status/1765336587184034177
    మార్చి 09 , 2024
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక &amp; హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌ రేటింగ్‌ : 3/5
    జనవరి 12 , 2024
    <strong>Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!</strong>
    Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!
    అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్‌ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్‌ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్‌’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్‌ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్‌ ‘దేవర’తో ‘పొట్టేల్‌’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ‘దేవర కన్నా చాలా బెటర్’ జూ.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్‌ వంటి టాప్ నాచ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్‌, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్‌ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్‌ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్‌ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్‌) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1849871631818293722 కంటెంట్‌కే ప్రాధాన్యత సినిమాలో కంటెంట్‌ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్‌ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్‌ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్‌ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్‌’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.&nbsp; పొట్టేల్ ఎలా ఉందంటే? దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేప‌థ్యాన్ని ‘పొట్టేల్‌’లో ఆవిష్క‌రిస్తూ ఆరంభంలోనే ప్రేక్ష‌కుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్‌ పార్ట్‌ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్ని విల‌న్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయ‌నే భావ‌న‌తో స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు కనిపిస్తుంది. స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.&nbsp; కథ ఇదే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్‌) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్‌ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్‌, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని ద‌క్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జ‌మ్మ (అనన్య నాగళ్ల) క‌థేంటి? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/pottel-movie-review-comparisons-with-rangasthalam-before-release-is-pottel-at-that-level.html
    అక్టోబర్ 26 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.&nbsp; విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.&nbsp; ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.&nbsp;&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
    అక్టోబర్ 30 , 2023
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్‌ బస్టర్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.&nbsp; ఏజెంట్‌ అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… హిపాప్‌ తమిజా సంగీతం అందించాడు. ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రంపై అంచానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.&nbsp; https://telugu.yousay.tv/sentiment-followed-for-agent-akhil.html పొన్నియన్ సెల్వన్ 2 పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది PS-2. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా కూడా 28న రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్‌తో పోటీ పడుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా.. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. పార్ట్‌ 2 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.&nbsp; https://telugu.yousay.tv/box-office-do-you-know-how-much-ps2-will-make.html రారా.. పెనిమిటి నందితా శ్వేత సింగిల్ క్యారెక్టర్‌లో రూపొందిన సినిమా రారా.. పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న విడుదలవుతుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త కోసం ఎదురుచూసే విరహ వేదనే ఈ చిత్రం. తెరపై ఒక్క పాత్రే కనిపించినా.. చాలా పాత్రలు వినిపిస్తాయి.&nbsp; హాలీవుడ్‌ ‘శిసు’ హిస్టారికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న హాలీవుడ్‌ మూవీ శిసు. జల్మరీ హెలెండర్ దర్శకత్వం వహించాడు. జొర్మా తొమ్మిలా, అక్సెల్‌ హెన్ని, జూన్ డూలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా వస్తుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు దసరా నాని హీరోగా వచ్చిన మాస్ పీరియాడికల్ చిత్రం దసరా. మార్చి 30న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.&nbsp; సిటాడెల్ అమెరికన్ స్పై థ్రిల్లర్‌ సిటాడెల్ వెబ్ సిరీస్‌ తెలుగులో రాబోతుంది. రిచర్డ్‌ మ్యాడన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మెుదట తొలి రెండు ఎపిసోడ్‌లను తీసుకువస్తారు. తర్వాత మేలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదల చేస్తారు. ఈ సిరీస్‌ హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. https://telugu.yousay.tv/this-is-why-i-left-bollywood-says-india-priyanka-chopra.html వ్యవస్థ జీ 5 వేదికగా వెబ్‌ సిరీస్‌లు అలరిస్తున్నాయి. మరో కొత్త వెబ్ సిరీస్‌ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. న్యాయవ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు ఆనంద్‌ రంగ్ దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచెరపాలెం, నారప్పతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్‌, సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరికొన్ని Title CategoryLanguagePlatformRelease DateCourt lady&nbsp;Series&nbsp;Hindi&nbsp;NetflixApril 26Novoland&nbsp;Series&nbsp;English&nbsp;Nerflix&nbsp;April 26The good bad mother&nbsp;Series&nbsp;EnglishNetflixApril 27Eka&nbsp;Series&nbsp;English&nbsp;NetflixApril 28Before life after deathMovieEnglish&nbsp;Netflix&nbsp;April 28Pathu thala&nbsp;MovieTamil&nbsp;Amazon primeApril 27U turnMovieHindi&nbsp;Zee5April 27Scream 6MovieEnglish&nbsp;Book my showApril 26thurumukhamMovie&nbsp;Malayalam&nbsp;Sony liv&nbsp;April 28Save the tigersSeries&nbsp;Telugu&nbsp;disney+hotstarApril 27Peter pan and vendiSeries&nbsp;English&nbsp;disney+hotstarApril 28
    ఏప్రిల్ 24 , 2023
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన&nbsp; చిత్రాలు ఇవే!
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన&nbsp; చిత్రాలు ఇవే!
    సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్‌ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్‌ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; యాత్ర (Yatra) దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.&nbsp; ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్‌.. ఎన్టీఆర్‌ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్‌ సాయంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్‌ తెరపై ఆవిష్కరించారు.&nbsp; లక్ష్మీస్ ఎన్టీఆర్‌ (Lakshmi's NTR) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు. అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu) 2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.&nbsp; జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana) తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.&nbsp; యాత్ర 2 (Yatra 2) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్‌ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.&nbsp; వ్యూహాం (Vyuham) వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.&nbsp; శపథం (Sapadam) 'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్‌ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.&nbsp; రజాకార్‌ (Razakar) సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.&nbsp; రాజధాని ఫైల్స్‌ (Rajadhani Files) గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్‌ పుష్పరాజ్‌, విశాల్‌ పతి, వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.&nbsp; లీడర్‌ (Leader) శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; భరత్‌ అనే నేను (Bharath Ane Nenu) మహేష్‌ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.&nbsp; నోటా (Nota) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్‌ చిత్రం ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్‌ (విజయ్‌).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్‌ చేసింది.&nbsp;
    మార్చి 13 , 2024
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ఆస్కార్‌ గెలిచిన చిత్రాలు ఓపెన్ హైమర్ (Oppenheimer) అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోపర్‌ నోలాన్‌ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. బార్బీ (Barbie) గ్రెటా గర్‌విగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక&nbsp; ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.&nbsp; పూర్‌ థింగ్స్‌ (Poor Things) ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్‌ బాక్స్‌టర్‌.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్‌స్టార్‌లో చూడవచ్చు.&nbsp; అమెరిన్‌ ఫిక్షన్‌ (American Fiction) అమెరికన్‌ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్‌ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్‌ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్‌.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.&nbsp; అనాటమి ఆఫ్‌ ఏ ఫాల్‌ (Anatomy of a Fall) ఈ సినిమా మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్‌, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్‌ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్‌ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌&nbsp; (The Zone of Interest) కమాండెంట్‌ రూడొల్ఫ్‌ హాస్‌ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్‌లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; ది హోల్డోవర్స్‌ (The Holdovers) టీచర్‌, స్టూడెంట్‌కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్‌ స్కూల్‌లో క్రాంకీ హిస్టరీ టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్‌కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్‌గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో చూడవచ్చు.&nbsp; మ్యాస్ట్రో (Maestro) ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్‌ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్‌ స్టెయిన్‌ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; కిల్లర్‌ ఆఫ్‌ ద ఫ్లవర్‌ మూన్‌ (Killers of the Flower Moon) లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్‌ నేషన్ ల్యాండ్‌ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?&nbsp;అన్నది ప్లాట్‌. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్‌ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం. పాస్ట్ లైవ్స్‌ (Past Lives) నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సొసైటీ ఆఫ్‌ ది స్నో (Society of the Snow) రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్‌ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; లో క్యాపిటనో (Lo Capitano) వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్‌ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్‌.&nbsp; పర్‌ఫెక్ట్‌ డేస్‌ (Perfect Days) ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్‌గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.&nbsp; ది టీచర్స్‌ లాంజ్‌ (The Teachers' Lounge) కర్నా నోవాక్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్‌లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp;
    మార్చి 11 , 2024
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
    పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. 1920 అవికా గోర్ లీడ్‌ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్‌ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన '1920' సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ధూమం (Dhoomam) పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మనుచరిత్ర మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి. భారీ తారా గణం యూత్‌ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం 'భారీ తారాగణం'. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంటింటి రామాయణం ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన 'ఇంటింటి రామాయణం' చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు.&nbsp; టీకూ వెడ్స్ షేరు ఫస్ట్‌ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్‌ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files) ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌ మలయాళంలో 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌' అనే కొత్త వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్‌ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్‌ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్‌, అజు వర్గీస్‌ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది.&nbsp; మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateTake Care of MayaMovieEnglishNetflixJune 19GlamorousWeb SeriesEnglishNetflixJune 21Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22Social CurrencyWeb SeriesHindiNetflixJune 22Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23Class of 09&nbsp;Web SeriesEnglishDisney + HotstarJune 19Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23World's Best&nbsp;MovieEnglishDisney + HotstarJune 23AgentMovieTeluguSony LivJune 23Lions Gate PlayMovieEnglishSony LivJune 23
    జూన్ 19 , 2023
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024

    @2021 KTree