రేటింగ్ లేదు
No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
ఆసక్తి ఉంది
UATelugu
తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం ‘విడుదల పార్ట్-2’. ఇందులో విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇంగ్లీష్‌లో చదవండి
తారాగణం
విజయ్ సేతుపతి
భవానీ శ్రీ
చేతన్ చీను
గౌతమ్ వాసుదేవ్ మీనన్
రాజీవ్ మీనన్
ప్రకాష్ రాజ్
సూరి
మంజు వారియర్
సిబ్బంది
వెట్రిమారన్
దర్శకుడుఎల్రెడ్ కుమార్
నిర్మాతకథనాలు
Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్ చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్ పార్ట్ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.
అసలు కథ ‘పార్ట్ 2’లోనే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విలన్ సుప్రీమ్ యాష్కిన్‌గా కమల్ హాసన్ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్ సుప్రీమ్ యాష్కిన్ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్, విలన్ సుప్రీమ్ యాష్కిన్ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
కమల్ హాసన్ విశ్వరూపం
కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్ చేసుకొని సుప్రీమ్ యాష్కిన్ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్ హాసన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్ యాష్కిన్ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్ హాసన్ విశ్వరూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.
భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు?
భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్ పార్ట్‌లో రానుంది.
విజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్!
కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ పోషించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కల్కి పాత్రలో ఎవరు?
పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్ ఝలక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్ ఉంది. కలి అయిన సుప్రీమ్ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సాయం చేయవచ్చు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 08 , 2024
Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్.. రంగంలోకి మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అయితే పుష్పలో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ బ్యూటీని తెరపైకి తీసుకొచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
త్రిప్తి దిమ్రిపై అసంతృప్తి!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్ నుంచి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రితో ఆడిషన్ నిర్వహించిన పుష్ప టీమ్ దానిపై సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆమె ప్లేసులో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ఇద్దరు హీరోయిన్స్‌తో బన్నీ స్టెప్పులు!
'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీతో పాటు రష్మిక కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.
కీలకంగా 'పుష్ప 2' క్లైమాక్స్!
'పుష్ప 2' చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, విలన్ ఫహాద్ పాజిల్‌పై పతాక సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్ చేస్తారని సమాచారం. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ సుదీర్ఘంగా కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది.
సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి
‘పుష్ప 2’ టీమ్‌ను దర్శకధీరుడు రాజమౌళి సర్‌ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లినట్లు సమాచారం. సుకుమార్‌ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారట. ఈ క్రమంలో సుకుమార్ ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే జక్కన్న అంతే చూస్తూ ఉండిపోయారట. అదిరిపోయిందని మెచ్చుకున్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని సమాచారం. చిత్ర యూనిట్ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్ పరిచయం చేశారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్‌తో రాజమౌళి చర్చించారట. పుష్ప 2 సెట్ కి రాజమౌళి వచ్చిన సందర్భంగా తీసిన వీడియోను త్వరలోనే ఫ్యాన్స్ కోసం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 26 , 2024
LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
బడ్డీ
చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
శివం భజే
యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది.
ఉషా పరిణయం
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.
తిరగబడర సామి
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్, డ్యూన్ పార్ట్ 2, కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి.
PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
జూలై 29 , 2024
Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
భారీ అంచనాలతో విడుదలైన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా క్రేజీ డైరెక్టర్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలకు ఫ్యూచరిక్ అంశాలను ముడిపెడుతూ తీర్చిదిద్దిన ‘కల్కి’పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు మాత్రం.. నెట్టింట ‘కల్కి’ సినిమాను తప్పుబడుతున్నారు. పురణాలను నాగ్ అశ్విన్ వక్రీకరించారని పోస్టులు పెడుతున్నారు. కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడ్ని.. అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడాన్ని తీసుకోలేకపోతున్నారు. కాగా, దీనిపై నాగ్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించారు.
కల్కిపై నెటిజన్ల ప్రశ్నలు!
'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్‌లో కర్ణుడు పాత్రను హైలెట్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. కర్ణుడు మరలా తిరిగొచ్చినట్లు చూపించడం పురాణాలను వక్రీకరించినట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన తిరిగొచ్చినట్లు చూపించడంలో లాజిక్ ఉందని అంటున్నారు. కల్కి అవతార సమయంలో అశ్వత్థామ భగవంతుండికి అండగా ఉంటాడని పురణాలు సైతం చెప్పాయని పేర్కొంటున్నారు. మరి కర్ణుడు కూడా ఫ్యూచర్‌లో మళ్లీ తిరిగొస్తాడని పురణాల్లో ఎక్కడ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. అంతా ఓకే గానీ కర్ణుడు విషయంలో మాత్రం దర్శకుడు తన లెక్కతప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు పాత్రను తగ్గిస్తూ.. కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడుని హైలెట్ చేయడం బాగోలేదని అంటున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
‘కర్ణుడుని అందుకే హైలెట్ చేశా’
కల్కి సినిమాలో కర్ణుడు పాత్రపై వస్తున్న ప్రశ్నలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు. కర్ణుడుని ఎందుకు అంత గొప్పగా చూపించారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అతని క్యారెక్టర్‌ని హైలైట్ చేశా' అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ మాటలతో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. పురణాలు సైతం కర్ణుడుని ధీశాలిగా కీర్తించాయని గుర్తు చేస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, నాగ్ అశ్విన్ చూపించిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.
కర్ణుడు vs అర్జునుడు ఎవరు గొప్పా?
మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? అన్న ప్రశ్నను రిపోర్టర్లు నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. దీనిపై నాగ్ అశ్విన్ మరో వివరణ ఇచ్చారు. ‘ వారిద్దరిలో (అర్జునుడు, కర్ణుడు) ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే.. ధర్మం వైపు నిలిచిన అర్జునుడే గొప్ప అని చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టడమేనని మండిపడుతున్నారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 06 , 2024
Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు మోకళ్లపై దండం పెట్టిన సూర్య!
తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్ చురుగ్గా మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య & టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్
కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1853842396104020062
https://twitter.com/i/status/1853810428616597938
https://twitter.com/AnushanSfc/status/1854009930233123020
https://twitter.com/RamuNaiduEdit/status/1853848902769967531
ఫ్యాన్స్‌కు సూర్య అభివాదం
ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/ARMedia28524249/status/1853816589130293352
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.
నవంబర్ 06 , 2024
Ramayana: ‘రామాయణం’ టీమ్ నుంచి డబుల్ ట్రీట్.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూట్ మెుదలవ్వగా సెట్ నుంచి కొన్ని ఫోటోలు సైతం లీకయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి కళ్లు చెదిరే అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ అధికారికంగా అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రెండు పార్ట్స్‌గా..
‘రామాయణ’ (Ramayana) చిత్రం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మెుదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. ఇది గమనించిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీని రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
హనుమంతుడిగా సన్నీ డియోల్!
‘రామయణ’ (Ramayana) చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడితో పాటు పలువురు స్టార్ నటులు ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సూర్పనక రోల్ చేస్తున్నట్లు తెలిసింది. హిందీ ‘రామాయణం’ సీరియల్‌లో రాముడిగా కనిపించి ఎంతో పాపులర్ అయిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, మందరగా షీబా చద్దా చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు రామయణ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.
https://twitter.com/seeuatthemovie/status/1854049562689740919
ఆస్కార్ విన్నర్లతో మ్యూజిక్
‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర‌్లు రంగంలోకి దిగారు. ఇందులో ఒకరు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కాగా ఇంకొకరు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్దరూ కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించనున్నారు. తొలుత ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్‌ను మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. అయితే అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో మ్యూజిక్ ఉండాలన్న ఉద్దేశ్యంతో హన్స్ జిమ్మెర్‌ను సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యుడ్ని చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పనిచేసిన హన్స్‌కు ‘రామాయణ’ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ కానుంది. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ వంటి హాలీవుడ్ చిత్రాలతో హన్స్ జిమ్మెర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
గ్రాఫిక్స్‌పై స్పెషల్ ఫోకస్
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణ’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 26 మంది ఎక్స్‌పర్ట్ గ్రాఫిక్స్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి వీఎఫ్‌ఎక్స్ విషయంలో మూవీ టీమ్ ఏమాత్రం రాజీ పడటం లేదని అర్థమవుతోంది.
తెలుగు బాధ్యత త్రివిక్రమ్‌దే!
రామాయణ (Ramayana) తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా త్రివిక్రమ్ ఎక్కడా ఖండించలేదు. దీంతో ‘రామాయణ’ టీమ్‌లో మాటల మాంత్రికుడు సైతం భాగస్వామి అయినట్లు తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు.
నవంబర్ 06 , 2024
Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్‌కమింగ్ మూవీ 'కంగువా' (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సూర్య సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ!
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్ చేసిన సూర్య బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు.
https://twitter.com/ahavideoIN/status/1853655983760998850
కంటతడి పెట్టిన సూర్య
తాజా టీజర్ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నవంబర్ 05 , 2024
PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం.
సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం.
RRR
ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.
KGF
రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.
పఠాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది.
బ్రహ్మాస్త్ర
అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.
బీస్ట్
దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.
OG
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.
LEO
లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
మే 02 , 2023
Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్
ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమాపై ప్రముఖ ఫిల్మ్ క‌్రిటిక్ ఉమెర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా పైసా వసూల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. బన్నీ ఫ్యాన్స్‌ను జోష్‌లో ముంచేసింది.
పుష్ప ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ సీక్వెల్ లో తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.
అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. బన్నీ పుష్పలో తన మేనరిజంతో, మాస్ యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పుష్ప-2 పై ప్రేక్షకుల అంచనాలు
ఫస్ట్ పార్ట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా స్పందించడంతో, సీక్వెల్ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప-2’ కోసం నార్త్ ఆడియన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే పుష్ప హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ సీక్వెల్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రీమియర్ షోల హైప్– అల్లు అర్జున్ అటెండ్
డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. టిక్కెట్లు ముందుగానే హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని సుదర్శన్ 70MM థియేటర్‌లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని స్వయంగా అభిమానులతో కలిసి చూడనున్నారు.
ఉమేర్ సందు ఫస్ట్ రివ్యూ
ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకుడు ఉమేర్ సందు ‘పుష్ప-2’ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని “బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్”గా అభివర్ణించాడు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, అల్లు అర్జున్ మళ్లీ నేషనల్ అవార్డు గెలవడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
https://twitter.com/UmairSandu/status/1863865410421960724
అల్లు అర్జున్ మాస్ అవతార్
ఉమేర్ సందు ట్వీట్ చేస్తూ, “అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అతని మాస్ అవతారం ఈ సినిమా కీలక ఆకర్షణ. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు” అని అభినందించారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్లలో అల్లు అర్జున్ అదరగొట్టాడని పేర్కొన్నారు.
రష్మిక, ఫహాద్ ఫాజిల్ మెస్మరైజింగ్
రష్మిక మందన్నా సీక్వెల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ, అభిమానుల మన్ననలు పొందిందని ఉమేర్ పేర్కొన్నాడు. రష్మిక- అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తాడని పేర్కొన్నాడు. తన నటనతో ప్రత్యేకమైన ముద్రవేసాడని అభినందించారు.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2
ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను అధిగమించింది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Screengrab Twitter: #pushpa2therule
ప్రత్యేకమైన మసాలా మూవీగా గుర్తింపు
‘పుష్ప-2’ ని ఇండియన్ సినిమా చరిత్రలో విభిన్నమైన మసాలా మూవీగా ఉమేర్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు విందుగా ఉంటాయని తెలిపారు.
మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ భారీ విజయం సాధించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి. 'పుష్ప-2 ది రూల్'తో అల్లు అర్జున్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు.
మరి కాసేపట్లో పుష్ప 2 పూర్తి రివ్యూ రానుంది.. అప్‌డేట్స్ కోసం YouSay Telugu వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
డిసెంబర్ 04 , 2024
Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘పుష్ప 3’ ఇప్పట్లో లేనట్లే!
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప 2' (Pushpa 2: The Rule) ఒకటి. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 'పుష్ప' (Pushpa : The Rise) సెన్సేషనల్ హిట్ కావడంతో 'పుష్ప 2' పై భారీగా బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. రెండో పాటను నెలాఖరులో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’కు కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉండనున్నట్లు హీరో బన్నీ గతంలోనే హింట్ ఇచ్చాడు. తాజాగా థర్డ్ పార్ట్‌కు సంబంధించి ఓ బజ్ వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
కొంత కాలం ఆగాల్సిందేె!
‘పుష్ప 3’ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. మూడో పార్ట్‌కి కొంత కాలం పాటు బ్రేక్ ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో సుకుమార్ రెండు చిత్రాలు.. బన్నీ రెండు చిత్రాలు (విడివిడిగా) చేయాలని భావిస్తున్నారట. అటు నిర్మాణ సంస్థ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ‘పుష్ప 2’ విడుదలైన రెండు, మూడేళ్ల వరకూ ‘పుష్ప 3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు ఉండవని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేశంలో పుష్ప మేనియా ఉన్నప్పుడే మూడో పార్ట్ కూడా పట్టాలెక్కిస్తే బాగుటుందని సూచిస్తున్నారు.
రెండ్రోజుల్లో సెకండ్ సాంగ్
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ హీరోయిన్ రష్మిక ఈ పాటపై అంచనాలు పెంచేసింది. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో సెకండ్ సింగిల్ కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ దాదాపుగా పూర్తి
పుష్ప 2 సినిమా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరించడం బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అది కూడా ఐటెం సాంగ్ అని అంటున్నారు. ఈ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఆ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే!
భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
మే 27 , 2024
Pushpa 2 Dialogues: అల్లు అర్జున్ మాస్ డైలాగ్స్ వైరల్!
"పుష్ప 2" సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్
పుష్ప పార్ట్ 1లో "పుష్పరాజ్" పాత్రలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. "తగ్గేదే లే" అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, "పుష్ప 2"లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "పుష్ప-2" పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు.
రష్మిక మందన్న క్రేజ్
మొదటి భాగంలో "శ్రీవల్లి" పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. "పుష్ప" సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఫుల్ జోష్‌లో అభిమానులు
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 4 నుంచి యూఎస్‌లో లాంగ్ వీకెండ్ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్, వీడియోను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
నాన్ థియేట్రికల్ రికార్డు
పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్ థియేట్రికల్ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్ చేసిందని స్పష్టం చేశారు.
పుష్ప 2 ఐటెం సాంగ్ షూట్ నవంబర్ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు.
అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్
ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్.
పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్
ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు.
"జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్."
ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
"అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.
అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం." అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
. “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అనే ఈ డైలాగ్ అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
అక్టోబర్ 26 , 2024
Pushpa 2 Trailer: ‘పుష్ప 2’ ట్రైలర్ రన్‌టైమ్ లాక్.. మాస్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమేనా!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నవంబర్ 17న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌కు సంబంధించి మరో అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. మాస్ సెలబ్రేషన్స్‌కు సిద్ధంగా ఉండాలంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున అంచనాలు పెంచేసింది.
ట్రైలర్ రన్‌టైమ్ లాక్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) విలన్ పాత్ర పోషిస్తున్నాడు. జగపతిబాబు, సునీన్, రావు రమేష్, అనసూయ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 17 సా. 6:03కి బిహార్ రాజధాని పాట్నలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ ఫైనల్ కట్ 2 నిమిషాల 55 సెకన్లు వచ్చినట్లు పేర్కొంది. ప్యూర్ మ్యాడ్ సెలబ్రేషన్స్‌తో ఈ ట్రైలర్‌ను వీక్షించండంటూ రాసుకొచ్చింది. పాట్నాలోని గాంధీ మైదానంలో 5 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మెుదలవుతుందని స్ఫష్టం చేసింది.
https://twitter.com/MythriOfficial/status/1857099754955550816
పుష్ప జ్ఞాపకాల్లో రష్మిక
'పుష్ప' చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న ఎంత క్యూట్‌గా చేసిందో అందరికీ తెలిసిందే. మరో రెండ్రోజుల్లో 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో తొలి పార్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలను ఈ అమ్మడు గుర్తు చేసుకుంది. ‘పుష్ప 1’ సంబంధించి ఎలాంటి దృశ్యాలు ఇప్పటివరకూ పంచుకోలేదని అందుకే ఇప్పుడు పోస్టు చేస్తున్నా అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో శ్రీవల్లి పాత్ర లుక్ టెస్ట్ ఫొటో, రష్యాలో అల్లు అర్జున్‌తో కలిసి దిగిన స్టిల్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో కలిసి దిగిన ఫొటోలతో పాటు 'సామి' మేకింగ్ వీడియో ఉన్నాయి. శ్రీవల్లి క్యారెక్టర్ కోసం తిరుపతి వెళ్లి రీసెర్చ్ కూడా చేసినట్లు రష్మిక తెలిపింది.
View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
'పుష్ప 2' దెబ్బకు భయపడ్డ థమన్!
పుష్ప 2 టీమ్‌లో థమన్ భాగమైనట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై 'బాకు మహారాజ్' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో థమన్ స్పందించారు. ఈ సినిమాలో భాగమైన మాట నిజమేనని స్ఫష్టం చేశారు. అయితే ‘పుష్ప 2’ కోసం తాను మాత్రమే కాకుండా చాలా మంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. 'పుష్ప 2 చాలా పెద్ద సినిమా. బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం. కొన్ని విషయాలను ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చు కానీ అదే సమయంలో భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. నేను ఈ సినిమాకు ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. నేను చేసిన దానితో డైరెక్టర్, హీరో హ్యాపీగా ఉన్నారు' అని చెప్పుకొచ్చారు.
https://twitter.com/Dhoni_Varsh/status/1857299656650440918
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 15 , 2024
Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది.
కేజీఎఫ్‌తో సలార్ లింక్
సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చూపించారు. అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు.
అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
ఫ్యాన్స్ రచ్చ రచ్చ
మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
సలార్‌తో నడిచేది వీరే..
ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
జూలై 06 , 2023
Devara Movie Review: ఎర్ర సముద్రానికి ముచ్చెమటలు పట్టించిన ‘దేవర’.. తారక్ ఖాతాలో హిట్ పడినట్లేనా?
నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు
రచన, దర్శకత్వం: కొరటాల శివ
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్
విడుదల తేదీ: 27-09-2024
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇందులోనూ దేవర, వర అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకున్నాడు. అటు డ్యాన్స్‌లోనూ ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. తంగం పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. అయితే ఆమె పాత్ర కొద్దిసేపే ఉండటం గమనార్హం. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆకట్టుకున్నారు. తారక్‌ను ఢీ కొట్టే పాత్రలో అతడు గొప్ప ప్రభావం చూపించారు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, అజయ్, మురళీశర్మ, శ్రుతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. మిగిలిన నటులు సైతం తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కొరటాల శివ ఎర్రసముద్రం పేరుతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి తనదైన శైలిలో డ్రామా, భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధంలో ఎర్ర సముద్రం కథ, దేవర-భైర పాత్రలు, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, పోరాట ఘట్టాలు, పాటలు, దేవర చూపించే భయం దేనికవే సాటి అనేలా కొరటాల చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిప్పిన కొరటాల, సెకండాఫ్‌లో వర పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్‌ను బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ దేవర కథను కొరటాల ముంగించారు. అయితే ప్రథమార్థం స్థాయిలో సెకండ్ పార్ట్ లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్, సాగదీత సీన్స్, ఊహకందేలా కథనం, ఒక్కప్పటి సినిమాల్లోని కొరటాల మార్క్ మిస్ కావడం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాలేదు.
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్ నటనప్రథమార్థంసినిమాటోగ్రఫీసంగీతం
మైనస్ పాయింట్స్
సెకండ్ పార్ట్‌పేలవమైన లవ్‌ట్రాక్
Telugu.yousay.tv Rating : 3.5/5
‘దేవర’ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే? (Devara Public Talk)
దేవర చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తారక్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని నెగిటివ్ పోస్టులు సైతం దేవరపై దర్శనమిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
దేవరలో ఎన్టీఆర్ నటన ఔట్ స్టాండింగ్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దేవర నచ్చుతాడని పోస్టు పెట్టాడు.
https://twitter.com/vamsikaka/status/1839539465427263788
దేవర చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. 'అదేం కొట్టుడు రా బాబు' అంటూ అనిరుధ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
https://twitter.com/NaveenKRaju22/status/1839415238132924882?
దేవర దెబ్బకు థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఫస్టాఫ్ ఫెంటాస్టిక్.. సెకండాఫ్ సూపర్బ్.. బీజీఎం హై-వోల్టేజ్‌లో ఉందని కామెంట్ చేశాడు.
https://twitter.com/Keerthan0712/status/1839544841291825305
దేవర ఫస్ట్ పార్ట్ చాలా బాగుందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే సెకండ్ పార్ట్ మాత్రం చాలా ప్రిడక్టబుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఓవరాల్‌గా దేవర సంతృప్తి ఇస్తుందని రాసుకొచ్చాడు.
https://twitter.com/venkyreviews/status/1839437743883178036?
దేవర చిత్రం తనను తీవ్రంగా నిరాశ పరిచినట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు. అసలు జాన్వీని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Fukkard/status/1839446863818162549
సెప్టెంబర్ 27 , 2024
Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. సెట్స్‌పై సీక్వెల్ సినిమాలు.. లిస్ట్ చాలా పెద్దదే!
ఓ సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్ హిట్ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 2
అల్లుఅర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ - 2
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి.
డబల్ ఇస్మార్ట్
రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్ డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్ ఇస్మార్ట్’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
గూఢచారి 2
యంగ్ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్, ప్రీ లుక్ టీజర్ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్ పార్ట్ తిరగనుందని సమాచారం.
హిట్ 3
తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ చిత్రం హిట్ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. హిట్-2 (HIT 2)లో అడవిశేష్ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్ పార్ట్ ఎండింగ్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను హింట్ ఇచ్చేశారు. ఇందులో అర్జున్ అనే పోలీసు ఆఫీసర్ పాత్రను నాని పోషించనున్నాడు.
ప్రతినిధి-2
యంగ్ హీరో నారా రోహిత్ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్ 15న టిల్లు స్క్వేర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
బింబిసార 2
గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్ రామ్.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రాజెక్ట్ K
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆగస్టు 02 , 2023
OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!
క్రిస్మస్ (Christmas 2025)ను పురస్కరించుకొని ఈ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ మూడో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు..
బచ్చల మల్లి (Bachchala Malli)
అల్లరి నరేశ్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20న (Bachhala Malli Movie Release Date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
విడుదల పార్ట్ 2 (Vidudala Part 2)
గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి ఈ వారం థియేటర్లలో సీక్వెల్ రాబోతోంది. సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల పార్ట్ 2’ (Viduthalai Part 2) డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
కమెడియన్ ప్రియదర్శి (Priyadarsi) కథానాయకుడిగా చేసిన ‘సారంగపాణి జాతకం’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ 20 నుంచి థియేటర్లలో ఈ సినిమాను వీక్షింవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూప కొడువాయూర్ (Roopa Koduvayur) హీరోయిన్‌గా చేసింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్, టీజర్‌ను బట్టి చూస్తే ఫన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
యూఐ (UI)
కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్ కేపీ శ్రీకాంత్ నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా, సంగీతం పరంగా కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదల్లే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
లీలా వినోదం (Leela Vinodam)
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ 'లీలా వినోదం'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్'లో ఈ వీక్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. డిసెంబర్ 19 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. పవన్ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది.
జీబ్రా (Zebra)
సత్యదేవ్, ధనుంజయ్ హీరోలుగా నటించిన రీసెంట్ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్ హీరోయిన్. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
Telugu Movies OTT Release Dates 2024
TitleCategoryLanguagePlatformRelease DateZebraMovieTelugu AhaDec 20Leela VinodamSeriesTelugu ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu AmazonDec 13HarikathaSeriesTelugu Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu AhaDec 12Thangalaan MovieTelugu NetflixDec 10
OTT Releases This Week 2024
TitleCategoryLanguagePlatformRelease DateInigmaMovieEnglishNetflixDec 17Love to hate it juliasMovieEnglishNetflixDec 17Stepping StonesDocumentaryEnglishNetflixDec 18The Dragan PrinceSeriesEnglishNetflixDec 18Virgin River 6SeriesEnglishNetflixDec 19The Six Triple EightMovieEnglishNetflixDec 20Yo Yo HoneysinghDocumentaryHindiNetflixDec 21Girls Will Be GirlsMovieHindiAmazonDec 18Beast GamesMovieEnglishAmazonDec 18TwistersMovieEnglishJio CinemaDec 18Moon WalkMovieHindiJio CinemaDec 20TelmaMovieEnglishSonyLIVDec 21
డిసెంబర్ 16 , 2024
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరీ కృష్ణ
సంగీతం: జ్ఞాని
సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిదంటే
పొలిమేర పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్ 1లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్-1లో లాగే పార్ట్-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశారు.
ఎవరెలా చేశారంటే?
కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ అదరగొట్టాడు. పార్ట్ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంలాజిక్ లేని సీన్స్
చివరిగా: థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్ సీన్స్, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023
Pushpa 2: ‘పుష్ప 2’ పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్.. రంగంలోకి స్టార్ క్రికెటర్లు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ లీక్ అంటూ కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో జరిగే ‘పుష్ప 2’ ఈవెంట్స్‌కు స్టార్ క్రికెటర్లు హాజరవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్లేయర్లు, వారు పాల్గొనే ఈవెంట్ వేదికలు సైతం ఫిక్సయ్యాయని అంటున్నారు.
ప్రమోషన్స్‌కు టీమిండియా!
‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. పాట్నాలో జరిగే ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేయాలని రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు నార్త్ ఇండియాలో జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అర్షదీప్ సింగ్ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.
వేదికను బట్టి ఆహ్వానం!
నార్త్ ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ ప్రమోషన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం పంజాబ్‌లో జరిగే ఈవెంట్‌కు శిఖర్ ధావన్, గుజరాత్‌లోని గాంధీనగర్ ఈవెంట్‌కు హార్దిక్ పాండ్యా, ముంబయి ఈవెంట్‌కు అజింక్య రహానేను వస్తారని అంటున్నారు. అలాగే అమెరికాలోనూ ఓ ఈవెంట్‌ను పుష్ప టీమ్ ప్లాన్ చేస్తోందట. దానికి గెస్ట్‌గా వెస్టిండిస్ ప్లేయర్ క్రిస్‌గేల్‌ను ఆహ్వానించాలని అనుకుంటోందట. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్‌కు మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌లో ఈ స్టార్ క్రికెటర్లు సందడి చేస్తారని నెట్టింట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతో తెలీదు గానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు.
ట్రైలర్ అప్‌డేట్!
‘పుష్ప 2’ ట్రైలర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ కట్ 3 నిమిషాల 45 సెకన్లు ఉన్నట్లు లేటెస్ట్‌గా సమాచారం అందుతోంది. గూస్‌బంప్స్ వచ్చేలా ట్రైలర్‌ను కట్‌చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి ట్రైలర్ రిలీజైతే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరడం పక్కా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేయోచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పుష్ప ట్రైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పార్ట్ 1 ట్రైలర్ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. పార్ట్ 2 ట్రైలర్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌ను కూడా పుష్ప 2 కోసం సంప్రదించినట్లు సమాచారం. తొలి పార్ట్‌కు థమన్, సెకండాఫ్‌కు అజనీష్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారని అంటున్నారు. దేవిశ్రీ ఇచ్చిన బీజీఎం సరిగా లేకపోవడం, మూవీ విడుదలకు తక్కువ సమయమే ఉండటంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నవంబర్ 08 , 2024
War 2 Movie Story: సోషల్ మీడియాలో ‘వార్ 2’ స్టోరీ లీక్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కథ!
టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'వార్' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తారక్ షూట్ హైదరాబాద్‌లోనే!
'వార్ 2'లో హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్‌లో వీటిని ఫినిష్ చేశారు. ప్రస్తుతం తారక్ రోల్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ అతడే?
'వార్ 2' చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్‌లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్ రోషన్ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'వార్ 2'లో మరో స్టార్ హీరో!
ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
మార్చి 25 , 2024
Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్ బడా చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా మరికొన్ని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్ కల్యాణ్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్ వాటెండ్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.
హనుమాన్
ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్ విడుదల కానుంది.
భారతీయుడు 2
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు.
పుష్ప 2
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్‌సింగ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ
సలార్ సూపర్ హిట్ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్ 'స్పిరిట్' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్ స్టార్ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు.
డిసెంబర్ 30 , 2023