• TFIDB EN
  • విక్రాంత్ రోనా
    UATelugu
    విక్రాంత్ రోనా ఒక పీరియాడికల్ డ్రామా. ఇది కర్ణాటకలోని కొమరట్టు అనే పురాతన గ్రామంలో జరుగుతుంది. ఒక పోలీసు హత్యకు గురవుతాడు.ఆ కేసును ఛేదించడానికి స్పెక్టర్ విక్రాంత్ రోనా (సుదీప్) వస్తాడు. దర్యాప్తులో, పదహారు మంది చిన్న పిల్లలు కూడా చంపబడ్డారని తెలుసుకుంటాడు. ఈ హత్యలకు అతని జీవితంతో సంబంధం ఉంటుంది. ఏంటా సంబంధం ? హంతకుడు ఎవరు? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అనూప్ భండారీ
    as Old Photographer (cameo)
    సుదీప
    నిరూప్ భండారీ
    జాక్వెలిన్ ఫెర్నాండెజ్
    రవిశంకర్ గౌడ్
    మధుసూధన్ రావు
    వాసుకి వైభవ్
    రామ్ బోగాడి
    చిట్కల బిరాదార్
    సంహిత
    రమేష్ కుక్కువల్లి
    వజ్రధీర్ జైన్
    దుష్యంత్ రాయ్
    కార్తీక్ రావు కోర్డలే
    రంజన్ శెట్టి
    విశ్వనాథ KC
    యోగీష్ శెట్టి
    అచింత్య పౌరాణిక్
    సిబ్బంది
    అనూప్ భండారీ
    దర్శకుడు
    షాలినీ మంజునాథ్నిర్మాత
    జాక్ మంజునాథ్నిర్మాత
    అలంకార్ పాండియన్నిర్మాత
    బి. అజనీష్ లోక్‌నాథ్
    సంగీతకారుడు
    విలియం డేవిడ్
    సినిమాటోగ్రాఫర్
    ఆశిక్ కుసుగొల్లిఎడిటర్ర్
    కథనాలు
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.  విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.  ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.   ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
    అక్టోబర్ 30 , 2023
    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : రజనీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, కపిల్‌ దేవ్‌, నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు దర్శకత్వం:  ఐశ్వర్య రజనీకాంత్‌ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి నిర్మాత: సుభాస్కరణ్‌ అల్లిరాజా విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024 సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ తిరు (విష్ణు విశాల్‌), మెుయిద్దీన్ భాయ్‌ (రజనీకాంత్‌) కొడుకు షంశుద్దిన్‌ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్‌ స్థాపించిన త్రీ స్టార్‌ క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్‌ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్‌ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్‌ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ అంటే అది ఇండియా - పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే? లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్‌ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ  వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్‌ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్‌ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌. ముస్లింలను రిప్రెజెంట్‌ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.  టెక్నికల్‌గా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్‌ పాత్రకు ఎలివేషన్స్‌ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరజనీకాంత్‌ నటనసంగీతం మైసన్‌ పాయింట్స్‌ స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating: 3/5
    ఫిబ్రవరి 09 , 2024
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘రజనీ.. గందరగోళం చేసేశారు’ సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మూడు చిత్రాలకు వర్క్‌! దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.  33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..! రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.  వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ! సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్‌ 3 రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.  దసరా బరిలో రజనీ చిత్రం రజనీ కాంత్‌ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.  ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కూలీ’లో స్టార్ క్యాస్ట్‌! ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్‌ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు. 
    అక్టోబర్ 07 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.  లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.  యాత్ర-2  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.  పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    <strong>Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్</strong>
    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్
    తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.&nbsp; ‘రజనీ కంటే షూటింగ్‌ ముఖ్యం కాదు’ రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్‌ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్‌ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్‌ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్‌ పోర్షన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్‌ కనగరాజ్‌ మండిపడ్డారు. అక్టోబర్‌ 15 తర్వాత రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.&nbsp; రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే? రజనీకాంత్‌ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; కూలీలో స్టార్ క్యాస్ట్‌! రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp; సైమన్‌ యాక్షన్‌ సీన్‌ లీక్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ పోషిస్తున్న సైమన్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ గతంలో రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌&nbsp; చేశారు..&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582 లోకేష్‌పై పవన్‌ ప్రశంసలు కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్‌ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్‌ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్‌ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్‌’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్‌ వంటి స్టార్‌ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/i/status/1841446808888758277 https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
    అక్టోబర్ 05 , 2024
    <strong>Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;</strong>
    Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;
    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.&nbsp; కారణం ఏంటంటే? సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విక్రామ్‌ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.&nbsp; విక్రాంత్‌ సినీ నేపథ్యం సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్‌ (Vikrant Massey) 1987 ఏప్రిల్‌ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్‌.డి. నేషనల్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్‌ మచావో ధూమ్‌' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్‌ వీర్‌ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్‌ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్‌ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్‌' సిరీస్‌ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్‌' మూవీ విక్రాంత్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్‌ 36' ఫిల్మ్‌ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్‌' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్‌ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్‌ కి గుస్తాఖియాన్‌' ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. కొడుకు కోసం స్పెషల్ టాటూ! విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్‌ నటి షీతల్‌ థాకూర్‌ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్‌ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్‌ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ హీరోయిన్‌కు బిగ్‌ ఫ్యాన్‌ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్‌ దేవగన్‌, కె.కె. మీనన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, పంకజ్‌ కపూర్‌ తన అభిమాన నటులని విక్రాంత్‌ చెబుతుంటాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్‌. అటు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999), ‘వాస్తవ్‌’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్‌ బాగా ఇష్టపడతాడు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; విక్రాంత్‌ ఆస్తుల విలువ ఎంతంటే? విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్‌’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్‌, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్‌ వర్త్‌ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్‌ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.&nbsp;
    డిసెంబర్ 02 , 2024
    2022లో మార్మోగిన పాటలు
    2022లో మార్మోగిన పాటలు
    ]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్‌ స్టార్‌ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌ నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని విడుదల తేదీ : జులై 5, 2024 ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్‌' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు&nbsp; ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; గత సీజన్లలో ఏం జరిగిందంటే? మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే&nbsp; ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే&nbsp; ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు&nbsp;గత సీజన్లతో&nbsp; పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating :3/5&nbsp;
    జూలై 05 , 2024
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం&nbsp; ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.&nbsp; ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.&nbsp; విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.&nbsp; హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.&nbsp; సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. &amp; Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self&nbsp;MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా&nbsp; సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా&nbsp; సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)&nbsp; మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.&nbsp; తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి&nbsp; ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),&nbsp; 'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
    ఆగస్టు 03 , 2023
    <strong>Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!</strong>
    Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!
    ప్రముఖ హీరోయిన్‌ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్‌ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్‌ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్‌ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; శోభితానా మజాకా..! ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్‌ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్‌ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), కాజోల్‌ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్‌ నటుడు లక్ష్య, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్‌ 14, దివ్య ఖోస్లా కుమార్‌ 18, ఫహాద్‌ ఫాజిల్‌ 25, విజయ్‌ 27, విక్రాంత్‌ మెస్సీ 35, త్రిష 37, జాన్‌ అబ్రహం 39, కమల్‌ హాసన్‌ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.&nbsp; View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) పాపులారిటీకి కారణమిదే! నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్‌మెంట్‌ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే! టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ చేశారు. వాస్తవానికి&nbsp; చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    ఆగస్టు 13 , 2024
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.&nbsp; బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ తుఫాన్‌! డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్‌ మూవీ ‘యానిమల్‌’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్‌ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. అదరగొట్టిన ‘12th ఫెయిల్‌’ ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్‌’ (12th Fail) చిత్రం కూడా యానిమల్‌ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్‌ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్‌ యాక్టర్స్‌గా భార్య భర్తలు ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగంలో విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌) రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.&nbsp; 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌ ఉత్తమ దర్శకుడు: &nbsp;విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌) ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌&nbsp; ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌) ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2) ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
    జనవరి 29 , 2024
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మేధా శంకర్‌ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.&nbsp; నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.&nbsp; మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.&nbsp; నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.&nbsp; ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.&nbsp; 2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.&nbsp; ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.&nbsp; ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.&nbsp; సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక '12th ఫెయిల్‌' సినిమాకు వస్తే.. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.&nbsp; ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.&nbsp; సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.&nbsp;
    జనవరి 20 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్‌ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు మంగళవారం ‘RX 100’ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మై నేమ్‌ ఈజ్‌ శృతి ప్రముఖ హీరోయిన్‌ హన్సిక నటించిన లేటేస్ట్‌ మూవీ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi)&nbsp;సినీ ప్రియులను థ్రిల్‌ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పార్క్‌ లైఫ్‌ విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. సప్త సాగరాలు దాటి సైడ్‌-B కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన&nbsp; (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్వేషి విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna&nbsp;MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 13 , 2023
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
    జనవరి 17 , 2024
    <strong>Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్‌? రాజాసాబ్‌ రిలీజ్‌ డౌటే!</strong>
    Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్‌? రాజాసాబ్‌ రిలీజ్‌ డౌటే!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ప్రభాస్‌ నుంచి రానున్న మూవీ కావడంతో ‘రాజాసాబ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన కాలుకు గాయమైనట్లు ప్రభాస్ సోమవారం (డిసెంబర్‌ 16) స్వయంగా ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి.  జర్మనీలో చికిత్స హీరో ప్రభాస్ (Rebel Star Prabhas) చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స అనంతరం కొంతకాలం పాటు ప్రభాస్‌ విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అయితే తొలుత ప్రభాస్‌ కాలు బెణికిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌ సైతం స్వల్పగాయమే అంటూ స్పెషల్‌ నోట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే గాయం తీవ్రత పెద్దదిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.  https://twitter.com/TeluguChitraalu/status/1868623178979024900 రాజాసాబ్‌ వాయిదా? ప్రభాస్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం వేగంగా షూటింగ్‌ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ కాలికి గాయం కావడం షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభాస్‌, కమెడియన్‌ సత్య మధ్య చాలా వరకూ సీన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ జనవరి చివరి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యే ఛాన్స్‌ ఉందంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌ సైతం పెండింగ్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్‌’ చెప్పిన టైమ్‌కు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గాయంపై ప్రభాస్‌ ఏమన్నారంటే? ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కాలికి గాయం కావడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు ప్రభాస్ ఓ పోస్టు రిలీజ్‌ చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా’ అని ప్రభాస్‌ పేర్కొన్న పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది. https://twitter.com/NishitShawHere/status/1868554693749960915 నయన్‌ స్పెషల్‌ సాంగ్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రంలో మాళవిక మోహన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం వీరితో పాటు నయనతార (Nayanthara) కూడా సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. నయన్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు లేడీ సూపర్‌ స్టార్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్‌ - నయనతార కలిసి ‘యోగి’ (Yogi) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వారిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. 
    డిసెంబర్ 17 , 2024
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్‌ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న  చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.  Courtesy Instagram: samantha ఆదే కారణమా? గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది.  ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది. సమంత రాబోయే సినిమాలు శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న  మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్‌ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. అభిమానుల అండ ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు  కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    జూలై 05 , 2023
    <strong>Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!</strong>
    Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!
    మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తండ్రి కొడుకులు మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌(Manchu Manoj)లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు సోమవారం రాత్రి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిద్దరి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన హైదరాబాద్‌ పహాడిషరీఫ్‌ పోలీసులు విడివిడిగా రెండు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్‌ ఈ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు.&nbsp; గేట్లు తోసుకెళ్లిన మనోజ్‌.. హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్‌, అతడి భార్య మౌనిక తిరిగి ఇంటికి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. వారి వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో మనోజ్‌ దంపతులు కారులోనే చాలా సేపు ఉండాల్సి వచ్చింది. వారి 7 నెలల పాప లోపలే ఉండటంతో కారు నుంచి బయటకు దిగిన మనోజ్‌ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఏం గొడవ జరుగుతుందా? అని స్థానికంగా ఆందోళన నెలకొంది. మనోజ్‌కు అల్టిమేటం.. మోహన్‌ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శంషాబాద్‌ జల్‌పల్లి నివాసం నుంచి మనోజ్‌ను పంపించేయాలని మోహన్‌ బాబు నిర్ణయించారు. తాజా ఘర్షణ నేపథ్యంలో మనోజ్‌ ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదని అల్టీమేటం జారిచేసినట్లు తెలుస్తోంది. అటు మనోజ్‌ సైతం వెళ్లి పోవాలని డిసైడ్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వాహనాలు తెప్పించి సామాన్లు తరలించేందుకు మనోజ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.&nbsp; గన్‌మెన్‌ల కోసం రిక్వెస్ట్‌ తన తండ్రి మోహన్‌బాబుతో వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సంబంధిత అధికారికి తెలియజేశారు. తమ ఇద్దరికీ గన్‌మెన్లను కేటాయించాలని మనోజ్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసు అధికారి అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.&nbsp; మంచు విష్ణు వార్నింగ్‌.. దుబాయి నుంచి వచ్చిన మంచు విష్ణు.. ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్‌ తరపున వచ్చిన బౌన్సర్లకు విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ బౌన్సర్‌కు వేలు చూపిస్తూ విష్ణు సీరియస్‌గా మాట్లాడటం గమనించవచ్చు.&nbsp; https://twitter.com/prime9news/status/1866426632845832420 ఫామ్‌ హౌస్ చుట్టే లొల్లి.. మోహన్‌ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్‌ సంస్థల ఆస్తుల పంపకాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ మెుదలైనట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ కూడా తనకు సంబంధంలేని జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉండటంతో మోహన్‌బాబు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. తమ కుమారుడు మనోజ్‌, కోడలు మౌనిక తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని హైదరాబాద్‌ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.&nbsp; ‘అమ్మ ఒంటరిగా ఉండటంతో’..&nbsp; ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడన్న మోహన్‌బాబు ఆరోపణలను మంచు మనోజ్‌ ఖండించారు. ఆ ఇంట్లో ఉంటున్నందుకు గల కారణాన్ని సోమవారం అర్ధరాత్రి పోస్టు చేసిన సుదీర్ఘ పోస్టులో వివరించారు. 'నా సోదరుడు (మంచు విష్ణు) కొన్ని కారణాల వల్ల దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. మా నాన్న, అతని స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇంట్లోకి వెళ్లా. ఏడాదిపైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్‌ ఫోన్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నా’ అని అన్నారు.&nbsp;&nbsp; డబ్బు వృథా చేస్తోంది నేనా? విష్ణునా? మనోజ్‌ కారణంగా తన విలువైన వస్తువులు, ఆస్తుల భద్రత విషయంలో భయపడుతున్నట్లు మోహన్‌బాబు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో మోహన్‌బాబు పేర్కొన్నారు. దీనిపైనా మంచు మనోజ్‌ తన ఎక్స్‌పోస్టులో స్పందించారు. 'నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రగా ఉంటూ కెరీర్‌ను నిర్మించుకున్నా. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశా. ఒక్కరూపాయి తీసుకోలేదు. నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. అడిగినట్టు నిరూపించండని సవాల్‌ చేస్తున్నా. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృథా చేస్తున్నారు.. నేనా? విష్ణునా?' అంటూ నిలదీశారు. నన్ను అణిచివేసేందుకే.. వివాదానికి కేంద్రమైన హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు (Mohan Babu) ఇంటి వద్ద నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘నేను చేస్తోంది ఆత్మగౌరవ పోరాటం. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన అంశం. ఒక మగాడిగా నాతో నేరుగా వచ్చి ఇదంతా చేసినా పర్వాలేదు. కానీ, నన్ను అణిచివేసేందుకు నా భార్యను బెదిరించడం, ఏడు నెలల తన పాపను వివాదంలోకి లాగుతున్నారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే నాపై దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదు’ అని చెప్పారు.&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1866385879117553785 పోలీసుల చర్యలపైనా.. ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంటి వద్ద మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్‌ తరపున భారీగా బౌన్సర్లు పోగయ్యారు. సోమవారమే మంచు విష్ణు తరపున 40 బౌన్సర్లు రాగా, మనోజ్‌ మరో 30 మందిని తన భద్రత కోసం పిలిపించారు. తాజాగా ఈ అంశంపై మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తనకు రక్షణగా తెప్పించుకున్న వ్యక్తులను బెదరగొట్టి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. తనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’ అని మనోజ్ అన్నారు.&nbsp; https://twitter.com/tv5newsnow/status/1866376337285636475 బౌన్సర్ల మధ్య ఘర్షణ మరోవైపు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద మంచు విష్ణు, మంచు మనోజ్‌ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్‌ తరపు బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు, సెక్యురిటీ సిబ్బంది బలవంతంగా బయటకి పంపించేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో వారు దౌర్జన్యంగా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుతున్నట్లు సమాచారం. ఒకరినొకరు తోసుకున్నారని వార్తలు వస్తున్నాయి.&nbsp; https://twitter.com/AadhanTelugu/status/1866381934546575621 సోమవారం రాత్రి హైడ్రామా సోమవారం రాత్రి పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్‌కు తన అనుచరులతో స్వయంగా వెళ్లిన మనోజ్‌ తనపై గుర్తు తెలియనివారు దాడి చేశారంటూ తొలుత ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు లేఖ రాశారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌, చిన్న కోడలు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని సీపీని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్‌, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్‌ కుట్ర చేస్తున్నారని సీపీకి తెలియజేశారు.&nbsp; https://twitter.com/jsuryareddy/status/1866227364629520738 పవన్‌ కల్యాణ్‌కు మనోజ్‌ రిక్వెస్ట్‌ తండ్రి మోహన్‌ బాబు రాసిన లేఖను సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్‌వేదికగా ఖండించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ సహా ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలకు ట్యాగ్‌ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తనపై తన భార్య మౌనకపై తన తండ్రి మోహన్‌ బాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తన పరువు మర్యాదాలను కావాలనే తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగేలా చేశారని రాసుకొచ్చారు. ఈ మేరకు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ మంచు మనోజ్‌ ఇచ్చారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. https://twitter.com/HeroManoj1/status/1866180910472974706
    డిసెంబర్ 10 , 2024
    <strong>Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌ను దారుణంగా మోసం చేసిన సుకుమార్‌.. ఎలాగంటే?&nbsp;</strong>
    Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌ను దారుణంగా మోసం చేసిన సుకుమార్‌.. ఎలాగంటే?&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం యావత్‌ దేశాన్ని షేక్‌ చేస్తోంది. థియేటర్లలో మాస్ జాతరను సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకూ థియేటర్లలో పుష్పగాడి రూలే నడుస్తోంది. హీరో అల్లు అర్జున్‌ మరోమారు అవార్డు విన్నింగ్‌ నటనతో ఆకట్టుకున్నాడని ఆడియన్స్‌ అంటున్నారు. అటు సుకుమార్‌ సైతం తన మార్క్‌ మేకింగ్‌తో మెస్మరైజ్‌ చేశాడని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ విషయంలో మాత్రం సుకుమార్‌ తమను మోసం చేశాడని ఆడియన్స్‌ ఫీలవుతున్నారు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ గ్లింప్స్‌ సీన్స్‌ మిస్సింగ్‌.. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్‌ సుకుమార్‌ మెుట్ట మెుదటగా ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ అంటూ ఒక గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. అందులో పుష్ప మిస్సింగ్‌ అంటూ ప్రజలు అల్లర్లకు దిగుతారు. స్మగ్లింగ్‌ చేసిన డబ్బుతో పుష్ప చేసిన మేలును చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు మీడియా ఛానల్స్ సైతం పుష్ప ఎక్కడ? అంటూ వార్తలు ప్రసారం చేస్తాయి. ఈ క్రమంలో అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. ఈ గ్లింప్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ‘పుష్ప 2’పై భారీగా అంచనా పెరగడానికి కారణమైంది. అయితే తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంలో గ్లింప్స్‌లోని ఒక్క సీన్‌ కూడా కనిపించలేదు. దీంతో సుకుమార్‌ తమను దారుణంగా మోసం చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2023 ఏడాదికి గాను బిగ్గెస్ట్‌ ప్రాంక్‌ వీడియో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/letscinema/status/1643488166421356547 https://twitter.com/SodiReddyUnOffl/status/1864529905733530018 నెక్ట్స్‌ పార్ట్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చా? ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ అంటూ వచ్చిన గ్లింప్స్‌లోని సన్నివేశాలు ‘పుష్ప 3’లో కనిపించే ఛాన్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఓ భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ను చూపించారు. అది కూడా పుష్ప అటెండ్‌ అయిన పెళ్లిలో జరుగుతుంది. పుష్పను టార్గెట్‌ చేసి శత్రువులు ఈ బ్లాస్ట్‌ చేయిస్తారు. ఈ ఘటన తర్వాత పుష్ప కనిపించకుండా పోయే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంచనా వేస్తారు. అతడు బతికున్నాడో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురై ఇలా అల్లర్లకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పార్ట్‌ 2 క్లైమాక్స్‌లో పుష్పకి కొత్త శత్రువులు యాడ్‌ అవ్వడం, ఇంటర్నేషనల్‌ స్థాయిలో స్మగ్లింగ్‌కు తెరలేపడంతో ‘పుష్ప 3’ (Pushpa 3) మరింత ఆసక్తికరంగా ఉండొచ్చని తెలుస్తోంది.&nbsp; పుష్ప 3 ఎప్పుడంటే? ‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం అందరి దృష్టి మూడో భాగంపై పడింది. ఈ మూవీ (Pushpa 3 Release Date) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా మెుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకుంటే పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. అటు సుకుమార్‌ సైతం రామ్‌ చరణ్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్‌ తెరకెక్కించనున్నాడు. ఐదేళ్ల కాలాన్ని పుష్పకు అంకితం చేయడంతో సుకుమార్‌ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ‘RC 17’పై ఫోకస్‌ పెట్టే ఛాన్స్ ఉంది. అటు బన్నీ, ఇటు సుకుమార్‌ తమ ప్రాజెక్ట్‌లను ఫినిష్‌ చేసుకున్న తర్వాతే ‘పుష్ప 3’ని పట్టాలెక్కించనున్నారు. దీనికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2028లో ఈ సినిమా (Pushpa 3) పట్టాలెక్కవచ్చని అంచనా వేస్తున్నాయి.&nbsp; బన్నీపై NHRCకి ఫిర్యాదు! మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్‌ (NHRC) వద్దకు చేరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది NHRCకి ఫిర్యాదు చేశారు. పోలీసు యాక్ట్‌ కింద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఘటనకు కారకులైన నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రాసుకొచ్చారు. కాగా, ఈ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమీషన్‌ స్వీకరించింది. త్వరలోనే నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. https://twitter.com/tupaki_official/status/1864948492453523637
    డిసెంబర్ 06 , 2024

    @2021 KTree