• TFIDB EN
  • వినయ విధేయ రామ
    UATelugu2h 24m
    ఒక క్రిమినల్ తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు.. రామ్ అనే యువకుడు అతని నేర సామ్రజ్యాన్ని ధ్వంసం చేసేందుకు పూనుకుంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్
    వివేక్ ఒబెరాయ్
    రాజా భాయ్ మున్నా
    ప్రశాంత్
    కొణిదెల భువన్ కుమార్
    స్నేహ
    రామ్ పెద్ద కోడలు
    ఆర్యన్ రాజేష్
    2వ సోదరుడు
    మధుమిత
    రామ్ 2వ కోడలు
    రవి వర్మ
    3వ సోదరుడు
    హిమజ
    రామ్ 3వ కోడలు
    మధునందన్
    రామ్ నాల్గవ సోదరుడు
    మాస్టర్ చరణ్ రామ్కొణిదెల భువన్ కుమార్ జూనియర్ (ప్రశాంత్ చిన్ననాటి పాత్ర)
    ముఖేష్ రిషి
    పాండ్యం పరశురామ్
    హరీష్ ఉత్తమన్
    పరశురామ్ బావమరిది
    మహేష్ మంజ్రేకర్
    ప్రభునాథ్
    చలపతి రావు
    కొణిదెల సుబ్రహ్మణ్యం; భువన్ కుమార్ మరియు రామ్ సహా ఐదుగురు సోదరుల పెంపుడు తండ్రి
    జయప్రకాష్
    ఏపీ గవర్నర్
    సలీం బేగ్
    రాజా భాయ్ అనుచరులు
    హేమ
    సీత తల్లి
    పృధ్వీ రాజ్
    సీత తండ్రి
    ప్రియదర్శిని రామ్
    ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్
    ఈషా గుప్తా
    శరణ్య (ఏక్ బార్ పాటలో ప్రత్యేక పాత్ర మరియు పొడిగించిన అతిధి పాత్ర)
    సిబ్బంది
    బోయపాటి శ్రీను
    దర్శకుడు
    డివివి దానయ్యనిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    కథనాలు
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RRRతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్‌ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్‌ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం కుమారుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్‌ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు  మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20 మంచు ఫ్యామిలీలో ట్రోల్స్‌కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్‌. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్‌ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ మిత్రమా రియల్లీ సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే అంటూ రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/HeroManoj1/status/1640258933918171136?s=20 బాలివుడ్‌ అందగాడు వివేక్‌ ఒబెరాయ్‌ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్‌ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు. https://twitter.com/vivekoberoi/status/1640253518471913472?s=20 విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/Ganta_Srinivasa/status/1640229869257887744?s=20 మెగా ఫ్యామిలీలో హాలివుడ్‌ కటౌట్‌ ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌. చిన్నప్పటి నుంచి చరణ్‌తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/IAmVarunTej/status/1640261128071835648?s=20 RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది.  ‘బ్రదర్‌ ఫ్రం అనదర్‌ మదర్‌’ అంటూ కార్తికేయ RRR సెట్‌లోని ఫోటో షేర్ చేశారు. https://twitter.com/ssk1122/status/1640258402285924354?s=20 రామ్‌ చరణ్‌తో రచ్చ సినిమా చేసిన సంపత్‌ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. https://twitter.com/IamSampathNandi/status/1640230847315087361?s=20 యంగ్‌ సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్‌’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  https://twitter.com/PrasanthVarma/status/1640193538393804801?s=20 కియారా అద్వానీ, శంకర్‌ సహా ‘గేమ్ చేంజర్‌’ టీం రామ్‌ చరణ్‌కు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. https://twitter.com/NP_App/status/1640266153653317632?s=20
    మార్చి 28 , 2023
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.  https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.  https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.  https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)  కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.  https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.  https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.  https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.  https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.  ప్రకాష్‌ రాజ్‌  ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్‌ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్‌.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈ సీన్‌లో నటించమని ప్రకాష్‌ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్‌ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్‌ తెగ ఆలోచిస్తుంటారు.  https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp మహేష్‌ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన స్పైడర్‌ (Spyder) సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్‌ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్‌ కెరీర్‌లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.  మోహన్‌ బాబు 2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్‌ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్‌ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్‌ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.  https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X వెంకటేష్‌  టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్‌ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్‌.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.  రామ్‌ చరణ్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్‌ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్‌ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. అసలు చరణ్‌.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.  https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db ప్రభాస్‌ ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్‌’.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్‌ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ను డైరెక్టర్‌ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.  https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
    ఏప్రిల్ 30 , 2024
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  భోళాశంకర్‌ (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం.  ఆదిపురుష్‌ (Aadi Purush) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. షాడో (Shadow) వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.  స్కంద (Skanda) హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.  లైగర్‌ (Liger) విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది. రాధే శ్యామ్‌ (Radheshyam)  బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.  వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.  సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India) మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. 
    మార్చి 16 , 2024
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. స్టార్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకొని నేటితో సంవత్సరం పూర్తవడమే ఇందుకు కారణం.  https://twitter.com/i/status/1755075870287696051 ప్రస్తుతం #KiaraAdvani, #SidKiara హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ జంటకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/narmadakrystle/status/1755107606824440246 గతేడాది ఈ రోజునే (07 ఫిబ్రవరి, 2024) ఈ బాలీవుడ్‌ స్టార్‌ జంట పెళ్లి జరిగింది. రాజస్థాన్‌ జైసల్మేరులోని ప్యాలెస్‌లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది.  https://twitter.com/i/status/1754935624178778242 నటి కియారా అద్వానీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. ఆమె తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతో నటించింది.  View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) 2018లో మహేష్‌తో చేసిన 'భరత్‌ అనే నేను' (Bharat Ane Nenu) సినిమా ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.   View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) మరుసటి ఏడాది రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ చరణ్‌తో పాటు కియారా కూడా మంచి నటనే కనబరిచి ప్రశంసలు అందుకుంది.  ఆ సినిమా ఫ్లాప్‌తో కియారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమై అక్కడ పలు హిట్‌ సినిమాల్లో నటించింది.  ఇక కియారా (Kiara Advani) చేసిన ప్రముఖ బాలీవుడ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తొలుత ‘ఫుగ్లీ’ (Fugly) చిత్రం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది.  తన రెండో చిత్రం ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni: The Untold Story) ద్వారా కియారా పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇందులో సాక్షి రావత్‌ పాత్రలో ఆమె జీవించింది.  ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories) సిరీస్‌లో మేఘా ఉపాధ్యాయ్‌ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచింది. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయి పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్‌లో శృంగారం హద్దులు దాటిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. https://twitter.com/i/status/1755140256859615281 ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’, ‘షేర్‌షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ (Kiara Advani)గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.  షేర్‌షా సినిమాలో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ కియారా జోడీగా నటించింది. అయితే సినిమాకు ముందు నుంచే వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020లోనే వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఆ వార్తలపై స్పందించకుండా సస్పెన్స్ మెయింటెన్‌ చేసిన ఈ జంట.. చివరికీ పెళ్లి బంధంతో ఒక్కటై ఆ వార్తలను నిజం చేసింది. ప్రస్తుతం కియారా (Kiara Advani).. చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అటు తారక్‌ - హృతిక్‌ రోషన్‌ కాంబోలో రానున్న వార్‌-2 సినిమాలోనూ కియారా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తూ కియారా బిజీ బిజీగా గడుపుతోంది.  ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూన్నే సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీ (Kiara Advani) చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 
    ఫిబ్రవరి 07 , 2024
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.  మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.  https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.  https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s నాగార్జున భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.  https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s రామ్‌చరణ్ తేజ్ రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.  అఖిల్, వరుణ్ తేజ్ రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.  https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
    ఆగస్టు 08 , 2023
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.  శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.   రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.  బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.  లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌  రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.  సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి. 
    మే 04 , 2024
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు దర్శకుడు: అభిషేక్‌ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్ ఎడిటర్: తమ్మిరాజు నిర్మాత: అభిషేక్‌ నామా విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023 నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా అభిషేక్‌ నామా రూపొందించిన చిత్రం  ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయికగా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో తొలిసారి గూఢచారిగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే బోస్ ఇండియాలో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ హత్య ఎందుకు జరిగింది? ఏజెంట్‌ డెవిల్‌ గతం ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రిటిష్‌ ఏజెంట్‌గా తన లుక్స్‌లో, యాక్షన్‌లో ఫ్రెష్ నెస్ చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఫైటింగ్‌ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. అటు మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపించడంతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న 1945 నాటి కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. కథ రాసుకున్న తీరు, దీనికి క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను యాడ్‌ చేసి ఒక్కో పాయింట్‌ను రివీల్‌ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నట్లు అనిపించినా సస్పెన్స్‌గా మాత్రం అనిపించదు. ద్వితీయార్థాన్ని కాస్త ఎమోషనల్‌గా నడుపుదామని డైరెక్టర్‌ యత్నించినప్పటికీ అది పెద్దగా వర్కౌట్‌ అయినట్లు కనిపించదు. కొన్ని సీన్లు లాజిక్స్‌కు దూరంగా ఉంటాయి. అయితే  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను డైరెక్టర్‌ చాలా బాగా తెరకెక్కించారు.  సాంకేతికంగా టెక్నికల్‌ అంశాలకు వస్తే.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని చోట్ల కథకు స్పీడు బ్రేకుల్లా అడ్డుపడినట్లు అనిపిస్తాయి. అయితే హర్షవర్ధన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌ అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. సినిమా సెటప్‌, ఆర్ట్‌ వర్క్‌, కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ కళ్యాణ్‌రామ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్‌ టీమ్‌ పనితనం మైనస్‌ పాయింట్స్‌ పాటలుస్క్రీన్‌ ప్లే రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 29 , 2023
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ పడిందని అంతా భావిస్తున్నారు. సామ్‌ ప్రాజెక్టులు సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.  మయోసైటిస్‌ సమస్యలు మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్‌ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. అందం తగ్గిపోయిందా? సమంత లుక్‌ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.  సమంత పనైపోయింది నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్‌ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఏం మాయ చేశావే నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.  ఫ్యాన్‌ బేస్‌ సమంత ఫ్యాన్ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్‌ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 17 , 2023
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. కిరాయి రౌడీలు(1981) ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది. న్యాయం కావాలి(1981) డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇది పెళ్లంటారా( 1982) విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు. పట్నం వచ్చిన పతివ్రతలు(1982) చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు. బిల్లా రంగా(1982) కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది.  ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు. యమకింకరుడు(1982) రాజ్‌ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. పులి బెబ్బులి(1983) చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ప్రేమ పిచ్చోలు (1983) ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది. పల్లెటూరి మొనగాడు(1983) చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. అభిలాష(1983) ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది. గూడచారి నెం.1 (1983) చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హీరో (1984) విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది. జ్వాలా(1985) చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. దొంగ మొగుడు(1987) చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఆరాధన(1987) భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు. రాజా విక్రమార్క(1990) చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.
    నవంబర్ 09 , 2023
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.  రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది. ఉగ్రం నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది. విరూపాక్ష(మళయాలం) తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.  అరంగేట్రం కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.    యాద్గిరి అండ్ సన్స్ వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.  OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4MeterMovieTeluguNetflix May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
    మే 02 , 2023
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    టాలివుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, బాలయ్య, మహేశ్‌ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన రామ్‌ చరణ్ ‘ఆరెంజ్‌’ కూడా ఇటీవల  విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  దేశముదురు అల్లు అర్జున్‌ను మాస్‌ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా  ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్‌ స్టార్‌ మేనియాను క్యాష్‌ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.   ఆది RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్‌ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వివి వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సింహాద్రి రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.  మోసగాళ్లకు మోసగాడు భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్‌ ఫిల్మ్‌ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్‌ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా  మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్‌ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్‌ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్‌ ఉండదు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం సోషల్‌ మీడియాలో నిత్యం తరుణ్‌ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్‌ భాస్కర్‌ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే  రీ రిలీజ్‌ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. రజినీకాంత్‌ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని  మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో  ఫ్లాప్‌ అయినా టీవీలో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్‌ చేస్తున్నారు. మీరు ఏ సినిమా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 01 , 2023
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.  పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.  https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.  రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.  శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.  https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.  విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
    Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
    అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్‌కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.  అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్‌బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు. https://twitter.com/fizzie_girl/status/1635114184982814721?s=20 https://twitter.com/HoneyRoseOffl_/status/1635120372013203456?s=20 ఎగిరి గంతేశారు.. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.  https://twitter.com/AndhraBoxOffice/status/1635114810651328513?s=20 ‘నాటు నాటు’తోనే మొదలు.. ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్‌తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్‌గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్‌ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది. https://twitter.com/THR/status/1635094319139893248?s=20 గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో.. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్‌గా కనిపించింది.  ‘నాటు నాటు’కు ప్రాణం..  ‘నాటు నాటు’ సాంగ్‌ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్‌ని ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.  https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
    మార్చి 13 , 2023
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్‌ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా. 1.Apoorva Sahodarulu (1986) బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు. 2. Ramudu Bheemudu (1988) రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు. 3. Brahmarshi Viswamitra (1991) నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 4. Aditya 369 (1991) ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు. 5. Maatho Pettukoku (1995) ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు. 6. Sri Krishnarjuna Vijayam (1996) సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు. 7. Peddannayya (1997) బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు. 8. Sultan  (1999) శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్‌ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్‌ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు. 9. Chennakesava Reddy (2002) మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు. 10. Allari Pidugu (2005) జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు. 11. Okka Magadu  (2005) బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు. 12. Pandurangadu  (2008) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు. 13.Simha  (2010) మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది. 14. Parama Veera Chakra  (2011) దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు. 15. Adhinayakudu  (2012) పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు. 16. Legend  (2014) బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు. Balakrishna's Legend Movie First Look Posters 17. Akhanda (2021) బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది. 18. Veera Simha Reddy  (2023) గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్  అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
    నవంబర్ 09 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    వాలెంటైన్స్‌ డే స్పెషల్‌:  సినిమాతో పరిచయమై ప్రేమ ప్రయాణం చేసి పెళ్లితో ఒక్కటైన జంటలు
    వాలెంటైన్స్‌ డే స్పెషల్‌: సినిమాతో పరిచయమై ప్రేమ ప్రయాణం చేసి పెళ్లితో ఒక్కటైన జంటలు
    ]మణిరత్నం- సుహాసిని, వంశీ రమ్య కృష్ణ,  కృష్ణ- విజయ నిర్మల, శరత్‌ బాబు-రమాప్రభ ఇలా రీల్‌ టు రియల్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన జంటలు చాలానే ఉన్నాయి.
    ఫిబ్రవరి 14 , 2023
    కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన  టాప్ 10 చిత్రాలు
    కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన టాప్ 10 చిత్రాలు
    ]10.శుభసంకల్పంశుభసంకల్పం కుటుంబ కథా చిత్రంగా వచ్చి మంచి విజయం సాధించింది. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
    ఫిబ్రవరి 11 , 2023
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: సుహాస్‌, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్‌, నితిన్‌ ప్రసన్న, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం: దుష్యంత్‌ సంగీతం: శేఖర్‌ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌ ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, బన్నీవాస్‌, వెంకటేశ్‌ మహా (సమర్పణ) విడుదల: 02-02-2024 క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్‌ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘క‌ల‌ర్‌ఫొటో’, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్‌ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగ‌స్వామి కావడంతో పాటు ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మ‌ల్లి (సుహాస్‌) ఓ స‌భ్యుడు. చిర‌త‌పల్లిలో త‌న కుటుంబంతో నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ పుకారు మొద‌ల‌వుతుంది. ఓ కారణం చేత వెంక‌ట్‌బాబు - మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మ‌లుపు తీసుకుంది? తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మ‌ల్లి పాత్ర‌లో సుహాస్ అదరగొట్టాడు. ప్ర‌థ‌మార్ధంలో అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌తో న‌వ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో క‌నిపిస్తూ ఎంతో స‌హ‌జంగా న‌టించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. ఇక హీరోయిన్‌ శివానీ నాగారం.. ల‌క్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్‌ ‌అక్కగా చేసిన శ‌ర‌ణ్య ప్ర‌దీప్ సినిమాకి మ‌రో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌. నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే? డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్‌ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్‌ దుష్యంత్‌ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్‌, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మ‌ధ్య అంత‌రాల్ని,  ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ ప్రేక్షకులను క‌థ‌కు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్‌ డ్రామాను ఆవిష్కరించారు. క‌థ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా.. బ‌ల‌మైన స‌న్నివేశాల‌ు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్‌ దుష్యంత్‌ పనితనం మెప్పిస్తుంది.  సాంకేతికంగా.. సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. శేఖ‌ర్ చంద్ర పాట‌లు, నేప‌థ్య సంగీతం, వాజిద్ బేగ్ త‌న కెమెరాతో చిర‌త‌ప‌ల్లిని ఆవిష్క‌రించిన తీరు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఎడిటింగ్‌, బ‌ల‌మైన ర‌చ‌న సినిమా గ‌మ‌నాన్నే మార్చేశాయి. మేకింగ్ ప‌రంగానూ ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ సుహాస్‌, శరణ్య నటనకథ, నేపథ్యంభావోద్వేగ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్ అక్కడక్కడ బోరింగ్ సీన్లు రేటింగ్‌: 3.5/5 ఓటీటీ వేదిక లాక్‌! ఇక ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్‌ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్‌ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్‌ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
    ఫిబ్రవరి 02 , 2024

    @2021 KTree