UATelugu
వివిధ వృత్తులకు చెందిన పది మంది రకరకాల కారణాలతో పాడుబడ్డ బంగ్లాకు వస్తారు. తమను ఎవరో ట్రాప్ చేసి రప్పించారని వారికి అర్థమవుతుంది. వారిలో ఇద్దరు తప్పించుకునేందుకు యత్నించి దారుణ హత్యకు గురవుతారు. ఆ టైమ్‌లోనే డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి (వరుణ్ సందేశ్) ఆ బంగ్లాలోకి వస్తాడు. ఆండి రాకతో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ బంగ్లాకు రప్పించింది ఎవరు? వారంతా క్షేమంగా బయటపడ్డారా? లేదా? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
వరుణ్ సందేశ్
రఘు కారుమంచి
ప్రమోధిని
బలగం జయరాం
వైవా రాఘవ్
రవితేజ నన్నిమల
సిబ్బంది
ఆద్యంత్ హర్షదర్శకుడు
మహేంద్ర నాథ్ కొండ్లనిర్మాత
ఆద్యంత్ హర్షరచయిత
జివి అజయ్ కుమార్సినిమాటోగ్రాఫర్
రామ్ తుముఎడిటర్ర్
కథనాలు
Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్ బ్రేకులు.. కానీ!
నటీనటులు: వి.కె.నరేశ్, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్ధన్ తదితరులు
రచన, దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల
సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్
ఛాయాగ్రహణం: సి.అంకుర్
నిర్మాతలు: బి.బాపినీడు, సుధీర్ ఈదర
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
విడుదల తేదీ: 14-08-2024
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ నటుడు నరేశ్ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్ మయూర్ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.
కథేంటి
రైల్వే ఉద్యోగి వీరాంజనేయులు (బ్రహ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజనేయులు మరణంతో ఇంటి బాధ్యత కుమారుడు నాగేశ్వరరావు (నరేశ్)పై పడుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె సరయు (ప్రియా వడ్లమాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వస్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మరి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వరరావు తనయుడు వీరు (రాగ్ మయూర్)కు, సరయు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
నాగేశ్వరరావు అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేశ్ తనదైన శైలిలో చక్కగా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. యున నటుడు రాగ్ మయూర్‌కు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక రవితేజ, రాకేశ్, హర్షవర్ధన్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్రమ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. అటు అంకుర్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నరేశ్, రాగ్ మయూర్ నటనభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీకొన్ని సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 14 , 2024
Annusriya Tripathi: ఆ హీరోకు వీరాభిమానిని.. ‘రజాకార్’ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం!
తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’ (Razakar). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా యంగ్ బ్యూటీ ‘అనుశ్రియా త్రిపాఠి’ (Annusriya Tripathi) మంచి గుర్తింపు పొందింది.
నిజాం భార్య అజ్మా ఉన్నీసా పాత్రలో నటించి ఆమె తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఆ పాత్రలో ఈ భామ అందం చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూపీలోని అయోధ్యలో 1999లో పుట్టిన ఈ భామ.. బెంగళూరు డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి పెంచుకుంది.
కాలేజీ పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ కావాలని అనుశ్రియ తండ్రి సూచించారు. దీంతో మూడేళ్ల పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయిన ఈ భామ.. నటి కావాలన్న కోరికతో ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.
కెరీర్ ప్రారంభంలో మెుదట మోడలింగ్‌గా అనుశ్రియా వర్క్ చేసింది. 2018లో చత్తీస్‌ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
‘రజాకార్’లో పాత్ర కోసం తానే స్వయంగా దర్శకుడు యాట సత్యనారాయణను సంప్రదించినట్లు అనుశ్రియా తెలిపింది. ఆడిషన్స్‌లో పాల్గొని యూనిట్ మెప్పించినట్లు పేర్కొంది.
నిజాం భార్య పాత్ర గురించి తొలుత సవాల్‌గా అనిపించిందట. కథలో ఉన్న గ్లామర్ రోల్ తనదే కావడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.
బలమైన కథా నేపథ్యం ఉన్న 'రజాకార్' చిత్రంతో తన సినీ కెరీర్ ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అనుశ్రియా చెప్పింది. ఆ పాత్రతో తన కెరీర్ మెుదలై తన కల నెరవేర్చిందని పేర్కొంది.
‘రజాకార్’ తనకో మంచి అవకాశమని అనుశ్రియా తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు, యాక్టింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నట్లు పేర్కొంది.
ఇక ఇష్టమైన హీరోల విషయానికి వస్తే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో ‘రణ్‌బీర్ కపూర్’ (Ranbir Kapoor).. టాలీవుడ్‌లో ‘రామ్‌చరణ్’ (Ramcharan) అంటే చాలా ఇష్టమట. వారి నటనకు వీరాభిమానినని అనుశ్రియా తెలిపింది.
హీరోయిన్స్‌లలో ‘అనుష్క శెట్టి’ (Anushka Shetty), కీర్తి సురేష్ (keerthi Suresh) అంటే చాలా ఇష్టమట. మహానటిలో కీర్తి నటన చూసి తాను ఫిదా అయినట్లు అనుశ్రియా తెలిపింది.
మంచి కథయితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ భామ చెప్పింది. ఫేవరేట్ నటీనటులతో కలిసి పనిచేస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని పేర్కొంది.
అటు ఈ బ్యూటీకి నగలు, చీరలతో ఫొటో షూటింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఫోటోలను ఇన్‌స్టాలోనూ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. గ్లామర్ ఫొటోలతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మార్చి 18 , 2024
KCR Movie Review: ‘కేసీఆర్’ వీరాభిమానిగా రాకింగ్ రాకేష్ హిట్ కొట్టినట్లే.. కానీ!
నటీనటులు: రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు
దర్శకత్వం: అంజి గరుడవేగ
సంగీతం: చరణ్ అర్జున్
ఎడిటర్: చింతాల మధు
నిర్మాత: రాకింగ్ రాకేష్
నిర్మాణ సంస్థ: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కేశవ చంద్ర రమావత్’ (Kesava Chandra Ramavat Movie) . షార్ట్ కట్‌లో ‘కేసీఆర్’ (కేసీఆర్)'. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్ హీరోయిన్‌గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్, రచ్చరవి, లోహిత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్ రాకేష్ మెప్పించాడా? కేసీఆర్ అభిమానిగా హిట్ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review)
కథేంటి
వరంగల్ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్ అలియాస్ కేసీఆర్ (రాకింగ్ రాకేష్) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్ నటుడు లోహిత్, మామ పాత్రలో మైమ్ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ఏవిధంగా డెవలప్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాకింగ్ రాకేష్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
పొలిటిషియన్‌ను హైలేట్ చేయడంకొన్ని సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 23 , 2024
Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు
డైరెక్టర్: సాయి రాజేశ్
నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్)
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు. తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే?
సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది. లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా..
తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథనం, డైలాగ్స్
నిర్మాణ విలువలు
యూత్ ఎలిమెంట్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
సాగతీత సన్నివేశాలు
క్లైమాక్స్
చివరగా.. యూత్ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’
రేటింగ్: 3/5
https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
జూలై 14 , 2023
HBD Rajinikanth: రజనీకాంత్ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్ స్టార్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నందమూరి తారకరామారావుతో..
టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్ రెంటో కథానాయకుడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా హీరోలుగా ‘ఖూన్ పసీనా’ పేరుతో రీమేక్ చేశారు.
శోభన్ బాబుతో..
నట భూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్ బాబు, రజనీకాంత్ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ కృష్ణతో..
ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్’ (1978), ‘రామ్ రాబర్ట్ రహీమ్’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.
https://twitter.com/atheisttindian/status/1212794102867083265
డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో..
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.
అక్కినేని నాగార్జునతో..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్ షూట్ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు.
జగపతి బాబుతో..
రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.
https://twitter.com/SolidLover123/status/1562791842898669568
డిసెంబర్ 12 , 2024
Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ తదితరులు
రచన, దర్శకత్వం: శౌర్యువ్
సంగీతం: హషీమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్.
నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల: 07-12-2023
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్, ట్రెండ్ అంటూ లెక్కలేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. విడుదలకి ముందే నాని - మృణాల్ జోడీ, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్ అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మహి తల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నాని (Hero Nani) మరోసారి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించాడు. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్రధానబలం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్దరూ చాలా బాగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. తన అభినయంతో కట్టిపడేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా కనిపిస్తూ కంటతడి పెట్టించింది. ప్రియదర్శి, అంగద్ బేది, జయరామ్, విరాజ్ అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్ కూడా కాస్త మైనస్ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి.
సాంకేతికంగా..
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కథకి తగ్గ సన్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేషమ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్, కూర్పు సరిగ్గా కుదిరాయి.
ప్లస్ పాయింట్స్
నాని, మృణాల్, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథసాగదీత సీన్లు
రేటింగ్: 3/5
డిసెంబర్ 07 , 2023
Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం.
జూ.ఎన్టీఆర్
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’ పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు.
https://youtu.be/b02ieSLiyRI?feature=shared
పవన్ కళ్యాణ్
ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు.
https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU
నాగార్జున
మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు.
సునీల్
విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు..
https://youtu.be/VhyejE23l4M?feature=shared
రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
బాలకృష్ణ
పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు.
https://youtu.be/wcJhLH_T6N0?feature=shared
శోభన్ బాబు:
వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు. బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు.
https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared
కాంతరావు
ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్
తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.
https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
సెప్టెంబర్ 06 , 2023
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024
OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
గతవారం రోజుల నుంచి సరైన హిట్ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన 'స్పై' డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం.
బేబీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది. ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
నాయకుడు
ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ్ హిట్ చిత్రం 'మామన్నన్'. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్ రోల్ చేశాడు.
మహావీరుడు
శివ కార్తికేయన్ లీడ్ రోల్‌లో మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ చిత్రం మహావీరుడు (Mahaveerudu). ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
భారతీయన్స్: ది న్యూ బ్లడ్
ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం 'భారతీయన్స్'. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్ చిత్రాలకు ధీన్ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రికరింగ్ పార్ట్ 1
మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning) క్రిస్టోఫర్, మెక్ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది.
ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు
TitleCategoryLanguagePlatformRelease DateBird Box BarcelonaMovieEnglishNetflixJuly 14KoharaWeb SeriesHindiNetflixJuly 15Transformers: Rise of the Beasts movieEnglishPrimeJuly 11Mayabazaar For Sale Web SeriesteluguZEE5July 14Janaki Johnny Web SeriesMalayalamDisney + HotstarJuly 11The Trial Web seriesHindiDisney + HotstarJuly 14Crime Patrol – 48 HoursMovieHindiSony LivJuly 10College Romance July 25Web seriesHindiSony LivJuly 25
జూలై 10 , 2023
Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్ చాలు’ వీడియో వైరల్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అటువంటి టాప్ హీరోలు ఒక సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకెంత అటెన్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ సైతం ఏపీ ఉపముఖ్యమంత్రి తన మూవీ షూటింగ్స్‌లోనే పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘డ్రింకర్ సాయి’ సినిమా యూనిట్ వారిచేత సరికొత్త ప్రమోషన్స్‌కు తెర లేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కటౌట్‌తో ప్రమోషన్స్
ధర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కల్యాణ్, ప్రభాస్ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. వారి సమక్షంలో తన సినిమా ఈవెంట్ జరగాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. హీరో ధర్మ.. ప్రభాస్‌కు అభిమాని కావడంతో డార్లింగ్ పోస్టర్‌ను సైతం వేదికపై పెట్టారు. ఇది చూసి ఈవెంట్‌కు వచ్చిన వారంతా చప్పట్లో వారిని అభినందించారు.
https://twitter.com/tollymasti/status/1866099251031450077
పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా?
ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్ వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రింకర్ సాయి టీమ్ కూడా స్టేజీపై పవన్, ప్రభాస్ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రభాస్, పవన్‌పై అభిమానంతోనే డైరెక్టర్, హీరో తమ హీరోల పోస్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయా హీరోల అభిమానులను తమ సినిమా చూసేలా ప్రేరేపించడం కోసమే వారు ఈ విధంగా చేసి ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ‘డ్రింకర్ సాయి’ టీమ్ ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు.
https://twitter.com/shreyasmedia/status/1866107400769433812
ఆ సినిమాలు కూడా అంతే..
ఇటీవల విడులైన 'మట్కా' (Matka) సినిమా కోసం హీరో వరుణ్ తేజ్ (Varun Tej) వినూత్నంగా ప్రమోషన్స్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు. తన గత చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని చేసిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) బామ్మర్ది సుధీర్ బాబు (Sudheer Babu) కూడా తన రీసెంట్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) సినిమాకు సరికొత్తగా ప్రమోషన్స్ చేశాడు. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ ప్రమోషన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి.
https://twitter.com/SkyPspk/status/1856617018276839798
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/isudheerbabu/status/1842084097621164229
డిసెంబర్ 10 , 2024
HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ డైరెక్టర్ సుజీత్ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్ రజా రన్’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్ ‘సాహో’ (Saaho)తో పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్
సుజీత్ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్ 26న జన్మించాడు. తొలుత చార్టెట్ అకౌంటెండ్ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్ ఫిల్మ్ & టీవీ అకాడమీలో ఫిల్మ్ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్ తెరకెక్కించాడు.
షార్ట్ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ
సాధారణంగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ సుజీత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘తొక్కలో లవ్ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్ డ్రామా’, ‘ఇండియన్ ఐడల్’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్ చేశాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట
తను డైరెక్టర్ అవుతానని సుజీత్ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.
పూరి జగన్నాథ్ సూచనతో
డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.
23 ఏళ్లకే డైరెక్టర్‌గా..
డైరెక్టర్ ఛాన్స్ కోసం సుజీత్ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్ రాజా రన్' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్‌నే సినిమా తీసి..
తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్‌నే తన ఫస్ట్ ఫిల్మ్‌గా సుజీత్ తెరకెక్కించడం విశేషం. షార్ట్ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
బాహుబలి కంటే ముందే
తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్ ప్లాన్ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్ కాలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్యాన్ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్ సింగ్ రిలీజ్ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి సుజీత్ ఎదగడం సాధారణ విషయం కాదు.
జపనీస్ సినిమాలంటే చాల ఇష్టం
డైరెక్టర్ సుజీత్‌కు జపనీస్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్
సుజీత్ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
క్రికెట్ అంటే పిచ్చి
సుజీత్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
భక్తి ఎక్కువే
సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ప్రేయసితో వివాహం
దర్శకుడు సుజీత్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.
https://twitter.com/Filmiparadise/status/1271319435127603205
ఉత్తమ డైరెక్టర్‌గా
తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు.
బర్త్‌డే స్పెషల్ వీడియో
నేడు దర్శకుడు సుజీత్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1850075370994925843
అక్టోబర్ 26 , 2024
Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!
టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు పైబడినా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ఫంక్షన్‌లో పాల్గొన‌్న చిరంజీవి తమ మల్టీస్టారర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కథ సిద్ధం చేయాలంటూ దర్శకుడు బోయపాటి శ్రీనుకు సవాలు సైతం విసిరారు. అయితే తాజాగా చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘కథ రాయకపోతే వేస్ట్’
చిరంజీవి - బాలయ్య మల్టీసారర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కథ రెడీ చేస్తే తాము చేయడానికి సిద్ధమంటూ ఇరువురు హీరోలు ఓపెన్ ఛాలెంచ్ చేసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే డైరెక్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బోయపాటి పేరు ప్రస్తావించడంతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఆయనే చేస్తారన్న అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా చిరు - బాలయ్య మల్టీస్టారర్‌పై దర్శకుడు బోయపాటి మాడ్లాడారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయనకు ఈ మల్టీస్టారర్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి బోయపాటి బదులిస్తూ 'చిరు, బాలయ్యను పెట్టుకొని వారికి కథ రాయకపోతే వేస్ట్. వారిద్దరే తన సినిమాకి టైటిల్' అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1847303422111801807
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
https://twitter.com/i/status/1830519890249421017
ఊరమాస్ స్టోరీ పక్కానా?
మాస్ ఆడియన్స్ పల్స్ ఏంటో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు. చిరు, బాలయ్యలకు సైతం మాస్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. చిరు హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ, ఇంద్ర వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. అటు బాలయ్య చేసిన ఫ్యాక్షనిస్ట్ చిత్రాలు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు కూడా C సెంటర్లలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అటువంటి హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇక కథ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య యాక్షన్‌కు సరిపోయే దీటైనా ఊరమాస్ కథను బోయపాటి సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ చూపించని విధంగా వీరిద్దరిని బోయపాటి చూపిస్తారని అంటున్నారు.
బోయపాటికి పోటీగా వై.వి.ఎస్ చౌదరి!
‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’ సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శకుడు వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆయన మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించి మరోమారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వైవీఎస్ చౌదరి భావిస్తున్నారట. మరి వీరిద్దరిలో చిరు-బాలయ్య ఎవరి కథను ఫైనల్ చేస్తారో చూడాలి.
‘అఖండ 2’ తర్వాతే..
టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Lezend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమైంది. ‘అఖండ 2’ అనే టైటిల్‌తో ఇటీవలై కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ కూడా చేశారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే చిరు బాలయ్య మల్టీస్టారర్‌కు బోయపాటిని ఫైనల్ చేసినా ‘అఖండ 2’ పూర్తయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156
అక్టోబర్ 19 , 2024
Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్.. దాని వెనక మాస్టర్ ప్లాన్ ఉందా?
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుర్ర హీరోలతో క్లోజ్‌గా..
కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చేరారు. యువ విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్ సక్సెస్ మీట్‌కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్ ఫొటోలు దిగి హల్‌చల్ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్, బాలయ్య అండగా నిలుస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్, సిద్ధులనే బాలకృష్ణ, తారక్ ఎంకరేజ్ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్, సిద్ధులను ఎంకరేజ్ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్ చేసేందుకు తారక్, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌కు పోటీగా..!
విజయ్ దేవరకొండ సోదరులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్ చాలా ఒత్తిడి ఫేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్ మద్దతుతో విష్వక్ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విష్వక్, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 25 , 2024
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్?
టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్యతో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో వైవీఎస్ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.
https://twitter.com/i/status/1830519890249421017
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
రంగంలోకి వై.వి.ఎస్..?
ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ మల్టీస్టారర్ రావడం పక్కా అని చెప్పవచ్చు.
ఫ్యాన్ వార్‌పై చిరు క్రేజీ కామెంట్స్
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ అన్నారు.
సెప్టెంబర్ 02 , 2024
Sharvari Wagh Hot: ఫిట్‌నెస్ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!
బాలీవుడ్ అందాల తార శార్వరీ వాఘ్ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది.
మెస్మరైజింగ్ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.
పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది.
ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.
అలా 2015లో 'ప్యార్ కా పంచ్‌నామా 2', బాజీరావ్ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసింది.
'ద ఫర్‌గాటెన్ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
తన తొలి చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.
ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రీసెంట్‌గా జాన్ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.
రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.
ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
ఆగస్టు 26 , 2024
Samantha Viral Post: నాగచైతన్య లేదా విరాట్ కోహ్లీ.. అసలు సమంత పోస్టు ఎవరి కోసం!
స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె సినిమాల నుంచి కొద్ది కాలం విరామం తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వారిని సామ్ అలరిస్తోంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. సమంత పోస్టు వెనకున్న అర్థం ఏంటో తెలియక ఫ్యాన్స్ తలలు బాదేసుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోస్టులో ఏముందంటే?
స్టార్ హీరోయిన్ సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెట్టిన లేటేస్ట్ పోస్టు.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను దానికోసమే ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ సమంత ఈ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఇది ఎవరి గెలుపును ఆకాంక్షిస్తూ పెట్టానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నాగచైతన్యను ఉద్దేశించి సమంత పెట్టిందంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైతే చాలా బాగుంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
అసలు కారణం ఇదే!
ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇవాళ (మే 22) సెకండ్ ప్లేఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు.. రాజస్థాన్ రాయల్స్ (RR)తో తలపడనుంది. అయితే సామ్ ఆర్సీబీ గెలుపును ఆకాంక్షిస్తూ ఈ పోస్టును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కప్ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని సమంత కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఆ జట్టును ఎంకరేజ్ చేసేందుకు సామ్ ఇలా పోస్టు పెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నేరుగా RCBని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదని అంటున్నారు.
విరాట్‌కు వీరాభిమాని
క్రికెట్‌ను అభిమానించే హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె పలు వేదికలపై తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అంతేకాదు క్రికెట్‌లో తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్ కావడం.. అతడికి ఈ మ్యాచ్ చావో రేవో కావడంతో సమంత ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఇది సమంత పర్సనల్ పోస్టు అని నమ్ముతున్నారు. దీంతో సమంత దీనిపై క్లారిటీ ఇస్తే తప్పా అర్థం తెలిసేలా లేదు.
సమంత సినిమాలు
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా గతేడాది విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’లో కనిపించింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక సామ్ నటించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్రస్తుతం సమంత నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
మే 22 , 2024
రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఎవరు?
రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
రష్మిక మందన్న దేనికి ఫేమస్?
రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రష్మిక మందన్న వయస్సు ఎంత?
రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు
రష్మిక మందన్న ముద్దు పేరు?
నేషనల్ క్రష్ రష్మిక
రష్మిక మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 3 అంగుళాలు
రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది?
విరాజ్ పేట, కర్ణాటక
రష్మిక మందన్నకు వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?
రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు.
రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు?
బ్లాక్
రష్మిక మందన్న అభిరుచులు?
ట్రావెలింగ్
రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం?
చికెన్, చాక్లెట్
రష్మిక మందన్న అభిమాన నటుడు?
అక్షయ్ కుమార్
రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్?
శ్రీదేవి
రష్మిక మందన్న తొలి సినిమా?
కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు)
రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
గీతాగోవిందం, పుష్ప
రష్మిక మందన్న ఏం చదివింది?
సైకాలజీలో డిగ్రీ చేసింది
రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత?
రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు?
సుమన్, మదన్ మందన్న
రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.
రష్మిక మందన్న సిస్టర్ పేరు?
సిమ్రాన్ మందన్న
రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా?
లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది.
రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్ లాక్ సీన్లలో నటించింది.
https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
ఏప్రిల్ 16 , 2024
SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్‌డేట్!
దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అప్‌డేట్ గురించి మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే వాటిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్‌లో కనీసం ఒక్క అప్‌డేట్ అయినా ఇస్తారా? లేదా? అంటూ మదన పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం సంభాషణలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో RRR చిత్రానికి మాటలు రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా కథ రాసుకున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ వీరాభిమానులం అని చెప్పుకొచ్చారు. ఆయన నవలల ఆధారంగానే స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు వెళ్లడించారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది.
మహేష్ లుక్‌పై జాగ్రత్తలు
SSMB 29లో మహేష్ లుక్(Mahesh look) ఎలా ఉండనుందన్న ఆసక్తి ప్రస్తుతం ఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుంది.
మహేష్ సరసన అలియా భట్?
'SSMB 29' సినిమాలో మహేష్‌కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
SSMB 29.. టైటిల్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఏప్రిల్ 01 , 2024
SSMB 29: మహేష్ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్' స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రాజమౌళి ఏమన్నారంటే?
రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం గ్లోబల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను' అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1769897700923990284
జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ!
జపాన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్ (తారక్)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాజమౌళికి అపురూప కానుక
బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్'తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు.
View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
మార్చి 19 , 2024
Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్ పని అయినట్లే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
9 పార్ట్‌లుగా కల్కీ!
‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్ తన ఫోకస్ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
https://twitter.com/MilagroMovies/status/1759613635327107364
‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్’
డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1759574622213947537
షమీ ఫేవరెట్ స్టార్లు వీరే
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్ ఫ్యాన్ అంటూ ప్రకటించాడు. సౌత్ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1759506059331338533
ఛత్రపతి శివాజీగా ప్రభాస్!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్ స్టార్ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1759409716114190363
ప్రభాస్‌కు హనుమాన్ ఎలివేషన్
ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ వీడియోను ఎడిట్ చేశారు.
https://twitter.com/i/status/1759832540071027104
మే 9న ఫ్యాన్స్‌కు పండగే
‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 20 , 2024