• TFIDB EN
  • విరాట పర్వం
    UATelugu2h 30m
    వెన్నెల (సాయి పల్లవి) మావోయిస్ట్‌ దళ నాయకుడు రవన్న( రానా) గురించి పుస్తకాల్లో చదివి ఇష్టపడుతుంది. ఇంట్లోవారు ఇంకొకరితో పెళ్లి ఫిక్స్‌ చేయడంతో రవన్నను వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్నను చేరుకునే క్రమంలో వెన్నెల ఎన్ని ఇబ్బందులు పడింది? ఆమె ప్రేమను రవన్న ఒప్పుకున్నాడా? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Rana’s ‘Virata Parvam’ movie Review

    రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ ‘విరాట ప‌ర్వం’. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌రోనా కార‌ణంగా సినిమా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా వాయిదాప‌డు...read more

    How was the movie?

    తారాగణం
    సాయి పల్లవి
    వెన్నెల
    రానా దగ్గుబాటి
    డాక్టర్ రవిశంకర్ అకా కామ్రేడ్ రావన్న మరియు అరణ్య
    ప్రియమణి
    కామ్రేడ్ భరతక్క
    నందితా దాస్
    శకుంతల
    నవీన్ చంద్రన్
    కామ్రేడ్ రఘు
    జరీనా వహాబ్
    రవి తల్లి
    ఈశ్వరి రావు
    వెన్నెల తల్లి
    సాయి చంద్
    వెన్నెల తండ్రి
    రాహుల్ రామకృష్ణ
    వెన్నెల బంధువు
    నివేదా పేతురాజ్
    నక్సలైట్ (అతి అతిథి పాత్ర)
    సిబ్బంది
    వేణు ఊడుగులదర్శకుడు
    రానా దగ్గుబాటి
    నిర్మాత
    సుధాకర్ చెరుకూరినిర్మాత
    శ్రీకాంత్ చుండినిర్మాత
    సురేష్ బొబ్బిలిసంగీతకారుడు
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    కథనాలు
    <strong>Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!</strong>
    Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!
    మలయాళ బ్యూటీ సాయి పల్లవి (Actress Sai Pallavi) అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయిన్పపటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న ఈ కాలంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నటన, డ్యాన్స్‌తోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards South 2023) ప్రకటించగా అందులో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఏకైక హీరోయిన్‌గా ‘సాయిపల్లవి’ దక్షిణాది సినిమా పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2022, 2023 చిత్రాలను పరిగణలోకి తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో వచ్చిన 'గార్గీ' (Gargi) చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అటు తెలుగులో చేసిన 'విరాట పర్వం' (Virataparvam) సినిమాకు సైతం క్రిటిక్స్‌ విభాగంలో బెస్ట్‌ ఫీమేల్‌ యాక్టర్‌గా అవార్డు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాదిలో అవార్డు దక్కించిన ఏకైక హీరోయిన్‌గా సాయిపల్లవి చరిత్ర సృష్టించింది. దీంతో సాయిపల్లవిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.&nbsp; ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు తమిళ చిత్రం 'ప్రేమమ్' (Premam)తో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి (Sai Pallavi) యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' (Fidaa) చేసి భానుమతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ 19 చిత్రాలు చేసిన సాయిపల్లవి ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దక్కించుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ కాలంలో ఆ ఫీట్‌ సాధించిన హీరోయిన్‌గానూ సాయిపల్లవి నిలిచింది.&nbsp; సాయి ప‌ల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు ప్రేమ‌మ్ (2015) – ఉత్త‌మ న‌టి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్త‌మ న‌టిల‌వ్ స్టోరీ (2021) – ఉత్త‌మ న‌టిశ్యామ్​ సింగ‌రాయ్ (2021) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్త‌మ న‌టివిరాట‌ప‌ర్వం (2022) – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్) ప్రేమ చిత్రాలకు చిరునామా ‘ప్రేమమ్’ (Premam) తర్వాత నుంచి సాయిపల్లవి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్‌ షోకు పూర్తి వ్యతిరేకంగా, కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్‌’ సహా ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో సాయిపల్లవి ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్‌’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్‌’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే విజయ్‌ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి.&nbsp;
    జూలై 13 , 2024
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Anthahpuram</strong><strong>: </strong><strong>సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    Anthahpuram: సౌందర్యను రీప్లేస్‌ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్‌ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్‌ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్‌ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్‌ చేయగలదని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; కృష్ణవంశీ ఏమన్నారంటే? సౌందర్య, సాయికుమాార్‌, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్‌ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్‌ ఎంతో టాలెంటెడ్‌. తమ నటనతో మెస్మరైజ్‌ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్‌ బదులిస్తూ నివేతా థామస్‌, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్‌ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్‌ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.&nbsp; సౌందర్యను రీప్లేస్‌ చేయగలరా! స్టార్‌ హీరోయిన్ సమంతకు గ్లామర్‌ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్‌ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్‌’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్‌, ఫిదా, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్‌ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్‌ డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
    సెప్టెంబర్ 17 , 2024
    Vijay Deverakonda - Sai Pallavi: విజయ్‌ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్! 
    Vijay Deverakonda - Sai Pallavi: విజయ్‌ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్! 
    నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది.&nbsp; క్రేజీ లవ్‌స్టోరీ..&nbsp; రౌడీ భాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్‌ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌ తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్‌ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్‌’ సహా ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో సాయిపల్లవి ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్‌’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్‌’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా మెుదలైంది.&nbsp; పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్‌.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్‌ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్‌ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
    జూన్ 06 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.&nbsp; సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.&nbsp;
    మే 30 , 2024
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ&nbsp; వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్‌ ఏంజెల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి&nbsp; ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్‌ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో&nbsp; బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు. చిన్న సినిమాలతో మొదలై.. అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్‌ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్‌… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఫిదా లేడీ సూపర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్‌ మొదలుకుని టైటిల్‌ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్‌ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్‌ అనుకున్నారట. ఈ నగరానికి ఏమైంది? పెళ్లి చూపులు తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. డీజే టిల్లు 2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్‌ అదిరిపోయాయి. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా త్వరలోనే రాబోతోంది. మల్లేశం ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లవ్‌ స్టోరీ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్‌ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి&nbsp; తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ పూరి జగన్నాథ్‌, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ పూరీకి కమ్‌బ్యాక్‌ మూవీ అయ్యింది. రామ్‌ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్‌ పిల్లగా హీరోయిన్‌ నభా నటేశ్‌ అమితంగా ఆకట్టుకుంది. విరాట పర్వం నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు&nbsp;అందుకుంది. NBK108లోనూ.. నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు. ఆస్కార్‌ స్థాయికి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్‌ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్‌ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్‌ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్‌ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్‌ ఇప్పుడు టాప్‌ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
    ఏప్రిల్ 01 , 2023
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి Sobhita Dhulipala శోభితా ధూళిపాళ&nbsp; టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. Meenakshi Chaudhary మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్‌ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్‌ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది. Sreeleela శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది Samantha సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. Courtesy Instagram: samantha Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది . Sai Pallavi సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. Kiara Advani కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ .  ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. Rukshar Dhillon రుక్సర్‌ థిల్లాన్‌ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్‌ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది. Samyuktha Menon సంయుక్త మీనన్  తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. Keerthy Suresh కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.  Divyansha Kaushik దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది. Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. Mirnalini Ravi మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్‌' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది. Kethika Sharma కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. Chandini Chowdary చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Eesha Rebba ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్‌ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. Priyanka Jawalkar "ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రియాంక ఎన్‌.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. Courtesy Instagram: Dimple Hayathi Pujita Ponnada పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్‌' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది. Ananya Nagalla అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. Courtesy Instagram:Ananya Nagalla
    డిసెంబర్ 04 , 2024
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.&nbsp; అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.&nbsp; అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.&nbsp; కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.&nbsp; 1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.&nbsp; ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.&nbsp; వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.&nbsp; విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.&nbsp;
    మార్చి 22 , 2024
    సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది.&nbsp; ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.&nbsp; ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి&nbsp; ముద్దు పేరు? మలార్ సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు? సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు &nbsp;సాయి పల్లవి వయస్సు ఎంత? 1992, మే 9న జన్మించింది సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా? ఫిదా సాయి పల్లవి ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; సాయి పల్లవి ఎక్కడ పుట్టింది? కోటగిరి, తమిళనాడు సాయి పల్లవి&nbsp; ఏం చదివింది? MBBS సాయి పల్లవి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, సింగింగ్ సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం? చాకోలెట్స్, స్వీట్స్ పూజా హెగ్డేకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ సాయి పల్లవికి ఇష్టమైన హీరో? కమల్ హాసన్, మమ్మాటి సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్? జ్యోతిక, సిమ్రాన్ సాయి పల్లవి&nbsp; పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. సాయి పల్లవి&nbsp; తల్లిదండ్రుల పేరు? సెంతమార కన్నన్, రాధ కన్నన్&nbsp; సాయి పల్లవి రాకముందు ఏం చేసేది? సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది. సాయి పల్లవి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/saipallavi.senthamarai/ సాయి పల్లవి నికర ఆస్తుల విలువ? రూ.30కోట్లు https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
    ఏప్రిల్ 16 , 2024
    <strong>Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్‌ పోస్టు!</strong>
    Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్‌ పోస్టు!
    నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్‌’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.  అసలేం జరిగిదంటే? ‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.  https://twitter.com/ViralVidox/status/1850064411202932830 బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌ భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్‌ మీడియా వేదికగా క్యాంపైన్‌ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్‌ చేయాలని ఓ నెటిజన్‌ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా ‌అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్‌ కానేకాదని మరో విధమైన క్రష్‌ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం 'అమరన్‌'ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్‌ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్‌ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్‌ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు. https://twitter.com/Bhav1212B/status/1850791387672801479 https://twitter.com/cinematicfreak0/status/1850791153928745098 https://twitter.com/devx_18k/status/1850791086458831193 https://twitter.com/Chhuparustam91/status/1850790246012653618 https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924 https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924 https://twitter.com/MissDD114/status/1850829733895737441 సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు ఇదిలా ఉంటే అమరన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్‌ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.  https://twitter.com/Sai_Pallavi92/status/1850571262755582363 కావాలనే టార్గెట్‌ చేస్తున్నారా? 'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్‌ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు  తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్‌ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. https://twitter.com/bollywooddadi/status/1849561000456179910 అమర జవాన్‌ బయోగ్రఫీ శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
    అక్టోబర్ 28 , 2024
    <strong>68th Filmfare Awards South 2023: బెస్ట్‌ యాక్టర్స్‌గా రామ్‌చరణ్‌, తారక్‌.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!</strong>
    68th Filmfare Awards South 2023: బెస్ట్‌ యాక్టర్స్‌గా రామ్‌చరణ్‌, తారక్‌.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!
    దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్‌ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్‌ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; ఫిల్మ్‌ఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్క్‌ 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్‌చరణ్‌, తారక్‌), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ (ప్రేమ్‌ రక్షిత్‌), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (సాబు సిరిల్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ('కొమురం భూముడో' సాంగ్‌ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.&nbsp; ‘సీతారామం’కు అవార్డుల పంట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత టాలీవుడ్‌ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం&nbsp; చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రెండు అవార్డులు, పవన్‌ కల్యాణ్‌ నటించిన 'భీమ్లా నాయక్‌'కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp;&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డ్స్‌ ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్ ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్) ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్) ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్‌) - కాల భైరవ (కొమురం భీముడో పాటకు) సీతారామం అవార్డ్స్‌ ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్&nbsp; (సీతారామం) ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం) ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్‌) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..) ఇతర చిత్రాలు ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం) ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాటపర్వం) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
    జూలై 12 , 2024
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌ ద్వారా తనలోని బోల్డ్ యాంగిల్‌ను సమంత చూపించి అక్కడ క్లిక్ అయింది.&nbsp; పుష్ప క్రేజ్‌తో రష్మిక ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె సైన్ చేసింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది.&nbsp; టాలీవుడ్‌లో విరాటపర్వం తర్వాత సాయి పల్లవికి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. భోళాశంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అప్పట్లో బాహాటంగానే చెప్పింది. గ్లామర్ షోలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో జాగ్రత్తలు పాటింటే సాయి పల్లవి.. మరి బాలీవుడ్‌లో ఏలాంటి కంటెంట్‌కు ఓకే చెప్పిందో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ అంటేనే గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తుంది. మరి సాయి పల్లవి మడి కట్టుకోకుండా అందాల ఘాటు పెంచుతుందా? లేక దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.&nbsp; ఆమిర్ ఖాన్‌ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి చేసే సినిమా మంచి లవ్ స్టోరీగా సునీల్ పాండే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండటంతో&nbsp; సాయి పల్లవి కథ వినగానే ఓకే చెప్పిసిందని టాక్. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం జునైద్ ఖాన్ యాశ్ రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాణంలో వస్తున్న మహారాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే జునైద్‌ ఖాన్‌కు ఫస్ట్ సినిమా. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; తొలి సినిమా రిలీజ్‌ కాకముందే బాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా స్థిరపడేందుకు సాయి పల్లవితో మరో లవ్ స్టోరీకి జునైద్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.
    సెప్టెంబర్ 14 , 2023
    <strong>Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!</strong>
    Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్‌ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్‌ మీడియాలో ఊహించని షాక్‌ తగలింది. గతంలో ఇండియన్‌ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.&nbsp; అమర జవాన్‌ బయోగ్రఫీ శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584 సాయిపల్లవి వీడియో వైరల్‌ అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/ViralVidox/status/1850064411202932830 కశ్మీర్‌ హింసాకాండ పైనా.. ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్‌గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్‌ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్‌ చేస్తూ ఈ వీడియోను వైరల్‌ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.&nbsp; https://twitter.com/divya_gandotra/status/1784199470219251986 వాళ్లే టార్గెట్‌ చేస్తున్నారా? 'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్‌ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు&nbsp; తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్‌ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
    అక్టోబర్ 26 , 2024
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు దర్శకత్వం: రవికాంత్ పేరేపు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 29-12-2023 రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల కుమారుడు రోష‌న్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ర‌వికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఎవరెలా చేశారంటే హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. హర్షవర్ధన్‌, అనుహాసన్‌ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్‌ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్‌ ప్రజెంట్‌ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్‌ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రోషన్‌, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్‌, క్లైమాక్స్‌ మైసన్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సీన్స్ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 29 , 2023
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ దర్శకత్వం: గుణశేఖర్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌ నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్‌ ఇవాళ (ఏప్రిల్‌ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్‌ డైరెక్టర్‌ కావడం, దిల్‌ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్‌ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం. కథ: విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్‌ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి&nbsp; ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మైనస్‌ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్‌ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్‌ మోహన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్‌, అనన్య, మధుబాల, జిషు సేన్‌ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.&nbsp; టెక్నికల్‌గా: శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్‌ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ సమంత నటనమణిశర్మ సంగీతం&nbsp;విరామ, పతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 15 , 2023
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక &amp; హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌ రేటింగ్‌ : 3/5
    జనవరి 12 , 2024
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    న‌టీన‌టులు: వి.కె.న‌రేశ్‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాగ్ మ‌యూర్‌, శ్రీల‌క్ష్మి, ప్రియ‌ద‌ర్శిని, ర‌వితేజ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు రచన, ద‌ర్శ‌క‌త్వం: అనురాగ్ పాలుట్ల‌ సంగీతం: ఆర్‌.హెచ్‌.విక్ర‌మ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: సి.అంకుర్‌ నిర్మాత‌లు: బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌ విడుద‌ల తేదీ: 14-08-2024 ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్‌ మయూర్‌ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్‌ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; కథేంటి రైల్వే ఉద్యోగి వీరాంజ‌నేయులు (బ్ర‌హ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజ‌నేయులు మ‌ర‌ణంతో ఇంటి బాధ్య‌త కుమారుడు నాగేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)పై ప‌డుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె స‌రయు (ప్రియా వ‌డ్ల‌మాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వ‌స్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌స్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మ‌రి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వీరు (రాగ్ మ‌యూర్‌)కు, స‌ర‌యు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే నాగేశ్వ‌ర‌రావు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో న‌రేశ్ త‌న‌దైన శైలిలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్‌ నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. యున నటుడు రాగ్‌ మయూర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్‌ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక ర‌వితేజ‌, రాకేశ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్‌ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్ర‌మ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్‌ చేసింది. అటు అంకుర్‌ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్‌ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నరేశ్‌, రాగ్ మ‌యూర్‌ నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకొన్ని సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 14 , 2024
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం&nbsp; 'ఆపరేషన్ వాలంటైన్' (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్‌ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్‌ ఫిక్స్‌ కావడం విశేషం.&nbsp; నెల రోజుల్లో ఓటీటీలోకి! 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. కెరీర్‌ బెస్ట్‌ నటన మరోవైపు ఆపరేషన్‌ వాలెంటైన్‌లో వరుణ్‌ తేజ్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 01 , 2024
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘రజనీ.. గందరగోళం చేసేశారు’ సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మూడు చిత్రాలకు వర్క్‌! దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.&nbsp; 33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..! రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ! సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్‌ 3 రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; దసరా బరిలో రజనీ చిత్రం రజనీ కాంత్‌ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కూలీ’లో స్టార్ క్యాస్ట్‌! ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్‌ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp;
    అక్టోబర్ 07 , 2024
    <strong>Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?</strong>
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?
    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024

    @2021 KTree