• TFIDB EN
 • విశ్వంభర
  రేటింగ్ లేదు
  No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
  ఆసక్తి
  U/ATelugu
  అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
  ఇంగ్లీష్‌లో చదవండి
  తారాగణం
  చిరంజీవి
  దొరబాబు
  సిబ్బంది
  మల్లిడి వసిష్టదర్శకుడు
  V. వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
  ప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
  విక్రమ్ రెడ్డినిర్మాత
  ఎంఎం కీరవాణి
  సంగీతకారుడు
  ఛోటా కె. నాయుడు
  సినిమాటోగ్రాఫర్
  కథనాలు
  Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
  Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
  మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  విశ్వంభరలో అలనాటి నటి! విశ్వంభరలో చిరుకి జోడీగా నటి త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్‌ విజయశాంతి (Vijayashanti) కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ ప్రకారం సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరును మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ఆమెను ఒప్పించే పనిలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే విశ్వంభరపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి - విజయశాంతి జోడీగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇన్నాళ తర్వాత మళ్లీ వీరిద్దరిని తెరపై చూడటమంటే అది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.  చిరు కెరీర్‌లోనే తొలిసారి! ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ కూడా చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 26 రోజులు షూటింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. షూట్‌లో చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్‌లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నిర్వహించారు. కాగా, ఈ సీక్వెన్స్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, మెగా బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు.. ఈ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్‌ను కలవడం గమనార్హం. మెగాస్టార్‌ స్పెషల్‌ పోస్టు మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు (ఏప్రిల్‌ 23) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరు తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు. దీనికి విశ్వంభ‌ర సెట్స్ నుంచి తీసిన హనుమంతుడి ఫొటోను జత చేయడంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/KChiruTweets/status/1782634604022673632?
  ఏప్రిల్ 23 , 2024
  Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
  Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
  గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  చిరు - త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్‌ నుంచి బయటకొచ్చి మెగాస్టార్‌ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్‌, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1754373323910533528 18 ఏళ్ల తర్వాత.. చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి  మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.  ఆచార్యకు నో చెప్పిన త్రిష! నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ చిరు లేటెస్ట్‌ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.  సెకండ్‌ హీరోయిన్‌ ఎవరో? ‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికేస్తున్నట్లు టాక్‌. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్‌, హానీ రోజ్‌, సంయుక్త మీనన్‌ పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.  13 భారీ సెట్‌లు..! చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది. 
  ఫిబ్రవరి 05 , 2024
  Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!
  Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!
  మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్‌ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్‌ స్పాట్‌ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్‌ లుక్‌ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్‌ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు తారక్‌ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  వెంటాడుతున్న లీకుల బెడద! ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్‌ షూటింగ్‌ స్పాట్ నుంచి హీరోయిన్‌ కియారా ఫొటోలు లీక్‌ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్‌ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.  https://twitter.com/i/status/1769462838765240477 https://twitter.com/i/status/1769381487143776301 దసరా, సంక్రాంతి పరిశీలన! గేమ్‌ ఛేంజర్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్‌. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్‌ ఛేంజర్‌'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్‌ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్‌ పనులు ప్లానింగ్‌ చేసుకొని డేట్‌ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.  చిరు - చరణ్‌ - తారక్.. బిగ్‌ ఫైట్‌! అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్‌’ ఫిక్స్‌ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్‌ ఫైట్‌ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కలిసి నటించిన తారక్‌తో రామ్‌ చరణ్‌ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.  చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్! ఇక గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్‌'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్‌ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
  మార్చి 18 , 2024
  Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
  Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
  మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
  ఫిబ్రవరి 26 , 2024
  Trisha Krishnan: టాలీవుడ్‌పై కన్నేసిన త్రిష.. ఆ విషయంలో యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీ!
  Trisha Krishnan: టాలీవుడ్‌పై కన్నేసిన త్రిష.. ఆ విషయంలో యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీ!
  స్టార్‌ నటి త్రిష (Actress Trisha).. నాలుగు పదుల వయసులోనూ యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల తమిళంలో విజయ్‌ (Vijay) సరసన ‘లియో’ (Leo)లో నటించిన త్రిష.. మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లోని కనిపించి మెప్పించింది. రీసెంట్‌గా తెలుగులో చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’లోనూ త్రిష హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా టాలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ త్రిషను వరించినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  ఆ స్టార్‌ పక్కనే నటించనుందా! టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh) కాంబోలో తెరకెక్కిన ‘F2’, ‘F3’ చిత్రాలు ఆడియన్స్‌ను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఆ చిత్రాల్లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మళ్లీ మంచి మెుదలైనట్లే. గత కొంత కాలంగా డబ్బింగ్‌ సినిమాలతోనే టాలీవుడ్‌కు పరిమితమైన త్రిష.. ‘విశ్వంభర’ ద్వారా నేరుగా తెలుగు సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. అయితే వెంకటేష్‌ - త్రిష కాంబోకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  సూపర్‌ హిట్‌ కాంబో..! వెంకటేష్‌ - త్రిష గతంలోనూ జంటగా నటించారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘నమో వెంకటేశ’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబినేషన్‌ చాలా బాగుందంటూ అప్పట్లో టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు ‘బాడీగార్డ్‌’ సినిమాతో మరోమారు జతకట్టారు. వీరి కెమెస్ట్రీకి మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆ చిత్రం విఫలమైంది. దీంతో అప్పటి నుంచి వెంకీ - త్రిష కాంబినేషన్‌లో మరో చిత్రం రాలేదు. తాజా ప్రచారం ప్రకారం వీరు మళ్లీ జోడి కడితే ఇది వారికి నాల్గో చిత్రం అవుతుంది. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చిత్రం కావడంతో ఈ జోడీ తెరపై ఎలాంటి సందడి చేస్తుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోయాయి.  త్రిష క్రేజీ ప్రాజెక్ట్స్‌ త్రిష అటు తెలుగుతో పాటు.. తమిళంలోనూ మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ అజిత్‌ (Ajith)తో కలిసి ‘విడా ముయరాచి’ (Vidaa Muyarchi) అనే సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life)లో కూడా త్రిష హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. అలాగే మలాయళ స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal)తో 'రామ్‌' (Ram) అనే సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించింది. దాంతోపాటు 'ఐడెంటిటీ' అనే మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తూ ఈ సుందరి బిజీ బిజీగా గడుపుతోంది.  పరువు నష్టం దావా ఇటీవల తమిళనాడు ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజు.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డాడు. త్రిష.. రూ.25 లక్షలు తీసుకుని ఓ రిసార్ట్ లో గడిపేందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా త్రిష న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. అంతకుముందు ఏవీ రాజు వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. 
  ఫిబ్రవరి 24 , 2024
  Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
  Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
  ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.  రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.  సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.  రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.  అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.  జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.  రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.  నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.  సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు. 
  ఫిబ్రవరి 23 , 2024
  Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
  Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
  టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఓజీ - సలార్‌ మధ్య పోలిక! ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.  హై రేంజ్‌లో ఎలివేషన్స్‌! ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.  సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.  చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌! ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.  
  మార్చి 07 , 2024
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.  ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.  అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.  ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది. 
  ఫిబ్రవరి 27 , 2024
  Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
  Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మ‌రో అత్యున్న‌త పౌర పుర‌స్కారం వ‌రించనున్నట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ద్మ‌విభూష‌ణ్ (Padma Vibhushan 2024) అవార్డుకు చిరంజీవి ఎంపికైన‌ట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో భారత రత్న(bharat ratna) తర్వాత పద్మవిభూషణ్‌ను రెండో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అయితే చిరంజీవికి అవార్డు గురించి  గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) అధికారిక ప్రకటన రానున్న‌ట్లు స‌మాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప‌ద్మ అవార్డ్స్ లిస్ట్‌లో ఇప్పటికే చిరంజీవి పేరు చేరిపోయినట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.  పురస్కారానికి కారణమిదే! సినీ రంగానికి చిరు చేసిన సేవలతో పాటు కొవిడ్‌ కాలంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌ను చిరంజీవి ఆదుకున్నారు. నిత్యావ‌స‌రాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. సామాన్య పౌరుల కోసం అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ స‌దుపాయాల‌ను ఉచితంగా క‌ల్పించి పలువురికి ప్రాణం పోశారు. వీటన్నింటిని గమనించిన కేంద్రం.. మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం (మెుదటిది భారతరత్న) ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.  అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా! కాగా, ఇప్ప‌టికే చిరంజీవి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అందుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో చిరు ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఇప్పుడు భాజపా ప్ర‌భుత్వం ఆయ‌న్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ సంబ‌రాల్లో మునిగిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవికి ఉన్న మానవత్వం, గొప్ప మనసుకు కేంద్రం ఇస్తున్న కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.  పొలిటికల్‌ వ్యూహాం ఉందా? చిరంజీవికి పద్మవిభూషణ్‌ ఇచ్చే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ మెుదలైంది. కేంద్రంలోని భాజపా కొన్ని ప్రయోజనాలను ఆశించే చిరుకు పద్మవిభూషణ్‌( Chiranjeevi Padma Vibhushan) ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చిరుకు పద్మవిభూషణ్‌ ప్రకటించి పొలిటికల్‌గా మరింత మైలేజ్‌ పెంచుకోవాలన్నది భాజపా వ్యూహామని అంటున్నారు. ఏపీలో చిరు సోదరుడు పవన్‌ ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. చిరుకి జాతీయ పురస్కారం ఇచ్చి తెలంగాణలోని మెగా ఫ్యాన్స్‌ను ఆకర్షించాలని భాజపా భావిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   చిరు బిజీ బిజీ.. ప్ర‌స్తుతం చిరంజీవి ‘విశ్వంభ‌ర’ మూవీతో బిజీగా ఉన్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రూ.100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. విశ్వంభ‌ర‌లో చిరంజీవికి జోడీగా త్రిష న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రిష‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో న‌టిస్తార‌ని అంటున్నారు. వారు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.
  జనవరి 19 , 2024
  Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
  Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
  ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య  తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం. నటీనటులు విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్. కథ సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ సినిమా ఎలా ఉందంటే? ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్‌ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది.  మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో  ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే?  హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది.  వైవిధ్యమైన పాత్రలో  కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది.  సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్‌ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.  టెక్నికల్‌గా సినిమా టెక్నికల్‌ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్‌ పనిచెబితే బాగుండేది. బలాలు కథనం ప్రీ క్రైమాక్స్ డైరెక్షన్ బలహీనతలు తొలి 20 నిమిషాలు బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్ Telugu.yousay.tv Rating: 3.5/5
  మార్చి 30 , 2024
  Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
  Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
  నటీనటులు : రవితేజ, కావ్య థాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌, మధు, వినయ్‌ రాయ్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, ప్రణీత పట్నాయక్‌, అజయ్‌ ఘోష్‌, నితిన్‌ మెహతా, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: దావ్‌జాంద్ సినిమాటోగ్రఫీ: కార్తీక్, కమిల్ ప్లాకి, కర్మ చావ్లా నిర్మాతలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. విడుదల తేది: 09-02-2024 రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా (Eagle Movie Review) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? అనుపమ, కావ్య తమ అందాలతో ప్రేక్షకులను అలరించారా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తలకోన అడవిలోని ఓ గిరిజన తండాలో జీవించే సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. అనుకోకుండా ఓ రోజు అతడు మిస్‌ అవుతాడు. ఓ విషయాన్ని అన్వేషిస్తూ ఆ తండాకు వచ్చిన క్రైమ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు నళిని రావు (అనుపమా పరమేశ్వరన్‌) దృష్టి అతడిపై పడుతుంది. అతడి అదృశ్యంపై ఓ ఆర్టికల్‌ రాయగా వెంటనే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? ఎక్కడికి వెళ్లాడు? అతని గురించి పేపర్లో చూసి సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సహదేవ్ భార్య రచన (కావ్య)కి ఏమైంది? అక్రమ ఆయుధాలతో హీరోకు ఉన్న సంబంధం ఏంటి? ఈ లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే మాస్‌ మహారాజ్‌ రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్‌ వర్మ పాత్రలో నటించాడు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినప్పటికీ స్టైలిష్‌ లుక్‌తో కళ్లతోనే తన హావభావాలను పలకించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి పాత్రే దక్కింది. నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ సినిమా మెుత్తం ఆమెనే కనిపిస్తుంది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ తమ కామెడీ ట్రాక్‌తో నవ్వించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. గన్‌ కల్చర్‌ను ప్రధానాంశంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించారు. రవితేజకు కేజీఎఫ్‌ స్థాయిలో ఎలివేషన్స్‌ ఇచ్చిన తీరు బాగుంది. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్‌లో చూపించి ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్‌. అయితే రవితేజ మార్క్‌ కామెడీని ఆశించే వారికి ఈ సినిమా నిరాశనే మిగిలిస్తుంది. సినిమా మెుత్తం మాస్‌ మాహారాజ్‌ సిరియస్‌ లుక్‌లోనే కనిపిస్తాడు. మరోవైపు సినిమాను చాప్టర్లుగా విడగొట్టి చూపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపించినా ఓవరాల్‌గా సినిమా మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలాగే ఉంటుంది. టెక్నికల్‌గా.. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు కూడా ‘ఆడు మచ్చ’, ‘గల్లంతు’ వంటివి వినడానికే కాదు విజువల్‌గా కూడా బాగున్నాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోవాల్సిందే. ప్లస్‌ పాయింట్స్ రవితేజ నటనహీరో ఎలివేషన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ సాగదీతలాజిక్‌కు అందని సీన్లు రేటింగ్‌: 3/5
  ఫిబ్రవరి 09 , 2024
  Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
  Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
  మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్‌ మరింత పెరిగింది.  ‘ఈగల్’ క్లైమాక్స్‌.. నెవర్‌ బిఫోర్‌! తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన 'ఈగల్' నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈగల్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.  టికెట్‌ రేట్లు సాధారణమే.. గత కొంతకాలంగా స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే టికెట్‌ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్‌’ (Eagle) చిత్రం మాత్రం టికెట్‌ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్‌ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ‘ఈగ‌ల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌! ఇక ఈగల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.21 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల‌కు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాలు కలిపి మ‌రో రూ.2 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్‌ రిలీజ్ అవుతోంది. తగ్గిన రవితేజ మార్కెట్‌! రవితేజ రీసెంట్‌ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’తో పోలిస్తే ‘ఈగల్‌’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్‌ నాగేశ్వరరావు థియేట్రిక‌ల్ హ‌క్కులు గతంలో రూ.37 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ర‌వితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగ‌ల్’ మాత్రం రూ.16 కోట్లు త‌క్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా చూస్తే మాత్రం ర‌వితేజ టాప్-5 చిత్రాల్లో ఒక‌టిగా ఈగ‌ల్ నిలిచింది. రావ‌ణాసుర‌, ఖిలాడి సినిమాల థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.22 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోగా.. వాటి త‌ర్వాత నాలుగో స్థానంలో ఈగ‌ల్ నిలిచింది. ఈగల్‌లో రవితేజ పాత్ర అదే! ఈగ‌ల్ సినిమాలో ర‌వితేజ రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాడే షూట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రైలర్‌, టీజర్‌ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్‌ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బ‌రిలో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌, హ‌నుమాన్ రిలీజ్ కావ‌డంతో ఈగ‌ల్ వాయిదాప‌డింది. అటు రవితేజ తన త‌ర్వాతి చిత్రాన్ని డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. 
  ఫిబ్రవరి 08 , 2024
  This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
  This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
  సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.  లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.  యాత్ర-2  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.  పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
  ఫిబ్రవరి 05 , 2024
  BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
  BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
  నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
  జూలై 28 , 2023
  Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
  Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
  నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. దర్శకుడు: పవన్ బాసంశెట్టి నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.  ఎవరెలా చేశారు? సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు. సాంకేతికంగా? ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.  https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk ప్లస్ పాయింట్స్ కామెడీ నటీనటులు మైనస్ పాయింట్స్ పేలవ కథ, కథనం క్లైమాక్స్ పాటలు రేటింగ్: 2.25/5 https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
  జూలై 07 , 2023
  UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
  UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
  కస్టడీ (మే 12) నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా  ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌ చేశారు భువన విజయం (మే 12) భువన విజయంలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో చేశారు. యలమంద చరణ్‌ దర్శకత్వం వహించారు. కథ వెనుక కథ (మే 12) సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్‌, విశ్వంత్‌ లీడ్ రోల్స్‌ చేశారు మ్యూజిక్ స్కూల్ (మే 12) ఈ సినిమాలో  శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు ఛత్రపతి (మే 12) ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్ ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)  క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు. ఫర్హానా (మే 12) ఐశ్వర్య రాజేశ్‌ కీ రోల్‌లో డైరెక్టర్‌ నెల్సన్‌ వెంకటేశన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’. అన్నీ మంచి శకునములే (మే 18) సంతోష్‌ శోభన్, మాళవిక నాయర్‌ జంటగా డైరెక్టర్‌ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం. సామజవరగమన (మే 18) శ్రీవిష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక బిచ్చగాడు 2 (మే 19) ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది. మళ్ళీ పెళ్లి (మే 26) న‌రేష్, పవిత్ర లోకేష్ జంట‌గా చేసిన చిత్రం మ‌ళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు. టక్కర్ (మే 26) సిదార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్‌'.  కార్తీక్‌.జి.క్రిష్‌ దర్శకత్వం వహించారు. మేమ్ ఫేమస్ (మే 26) మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు. అహింస (జూన్ 02) రాణా బ్రదర్‌ అభిరామ్‌ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది. విమానం (జూన్ 02) స‌ముద్రఖ‌ని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అన‌సూయ కీలక పాత్ర పోషించింది. ఆదిపురుష్ (జూన్ 16) రాముడి పాత్రలో ప్రభాస్‌ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్‌  డైరెక్షన్‌ చేశాడు. స్పై (జూన్ 29) హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
  మే 11 , 2023
  <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
  Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
  టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
  జూన్ 18 , 2024
  Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
  Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
  యంగ్‌ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. జయపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగానూ మారిపోయాడు. కెరీర్‌ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (SWAG) కోసం శ్రీ విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; 14 విభిన్న పాత్రల్లో.. యువ నటుడు శ్రీ విష్ణు.. ప్రస్తుతం 'స్వాగ్‌' (SWAG) అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'రాజ రాజ చోర' డైరెక్టర్ హసిత్‌ గోలి రూపొందిస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్‌పై మంచి హైప్‌ ఏర్పడింది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఈ మూవీలో శ్రీ విష్ణు 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ ఇండస్ట్రీలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇదే నిజమైతే ఏ హీరో చేయని సాహాసాన్ని శ్రీ విష్ణు చేస్తున్నట్లే చెప్పాలి. కాగా, ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్‌ టీజర్‌, హీరోయిన్‌ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.&nbsp; ఇండియాలోనే తొలిసారి! దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan).. ‘దశావతారం’ చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే యంగ్‌ హీరో శ్రీ విష్ణు.. ఈ రికార్డును బీట్‌ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్‌ను బట్టి తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హీరో 14 విభిన్న పాత్రలు పోషించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ విష్ణు ఈ డేరింగ్‌ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయమేనని చెబుతున్నారు. అయితే రోల్స్‌ సినిమాను ఏ మేరకు సక్సెస్‌ చేస్తాయో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.&nbsp; కీలక పాత్రలో మీరా జాస్మిన్‌ ‘స్వాగ్‌’ చిత్రంలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ 'మీరా జాస్మిన్‌' కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం ఇటీవల మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మీరా జాస్మిన్‌ భారీ ఆభరణాలతో డిజైనర్‌ వేర్‌ కాస్ట్యూమ్‌లో రాణిలాగా ముస్తాబై కనిపించింది. రిలీజ్ అనంతరం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, స్వాగ్‌ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు.&nbsp; https://twitter.com/movielovers1021/status/1797136038881837295 శ్రీవిష్ణు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ శ్రీ విష్ణు గత ఆరు చిత్రాలను పరిశీలిస్తే అందులో నాలుగు (రాజ రాజ చోర, అల్లూరి, సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌) మంచి హిట్‌ టాక్‌ సాధించాయి. మిగిలిన రెండు (భళా తందనాన, అర్జున పాల్గుణ) యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‌అతడి కెరీర్‌ హైప్‌లో ఉండటంతో నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘స్వాగ్‌’ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘SV18’, ‘SV19’ ప్రొడక్షన్ టైటిల్స్‌తో ప్రస్తుతం అవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కూడా సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో శ్రీ విష్ణుకు తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts)
  జూన్ 04 , 2024
  Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఛత్రపతి (హిందీ) ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్‌.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.   భువన విజయమ్‌&nbsp; సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో&nbsp; యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్‌ పృథ్వీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.&nbsp; ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. కళ్యాణమస్తు శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. మ్యూజిక్‌ స్కూల్‌&nbsp; శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ (Music School) చిత్రం మే 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్‌ నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. దహాద్‌ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్‌’ (Dahaad) వెబ్‌సిరీస్‌ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateThe Muppets Mayhemseries&nbsp;EnglishDisney+ HotstarMay 10Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12AirMovieenglishAmazon PrimeMay 12Justice LeagueSeriesEnglishNetflixMay 08Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09Black Knight&nbsp;SeriesEnglishNetflixMay 12Faithfully Yours&nbsp;MovieEnglishNetflixMay 17Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18SeriesHindiZee5May 12Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12Vikram vedaMovieHindiJio CinemaMay 12
  మే 08 , 2023

  @2021 KTree