UATelugu
హైదరాబాదులో కేంద్రమంత్రి హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. మరోవైపు ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమెను రక్షిస్తుంటాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడుతున్నాడు? గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా?
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసా...read more
How was the movie?
తారాగణం
గోపీచంద్
కావ్య థాపర్
జిషు సేన్‌గుప్తా
షామ్
నరేష్
ప్రకాష్ రాజ్
ప్రగతి మహావాది
వీటీవీ గణేష్
రాధాకృష్ణన్ పార్థిబన్
వెన్నెల కిషోర్
శ్రీకాంత్ అయ్యంగార్
రాహుల్ రామకృష్ణ
శుభలేఖ సుధాకర్
పృధ్వీ రాజ్
నాగినీడు
ముఖేష్ రిషి
రఘు కారుమంచి
అజయ్ ఘోష్
చమ్మక్ చంద్ర
షకలక శంకర్
శ్రీనివాస రెడ్డి
ప్రవీణ్
మాస్టర్ భరత్
గుండు సుదర్శన్
గౌతమ్ రాజు
రఘు బాబు
రెడిన్ కింగ్స్లీ
సిబ్బంది
శ్రీను వైట్ల
దర్శకుడుటీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
గోపీ మోహన్రచయిత
చైతన్ భరద్వాజ్
సంగీతకారుడుKV గుహన్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్ మైథాలజీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్, హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను మెగాస్టార్ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’!
ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్ అని తెలియకుండా ఈ సెట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్ వేశారని టాక్. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.
కల్కి తర్వాత విశ్వంభరే టాప్!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను మెగాస్టార్ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.
మెగాస్టార్ అసంతృప్తి
లేటెస్ట్ బజ్ ప్రకారం 'విశ్వంభర' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.
విలన్‌గా బాలీవుడ్ నటుడు
‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
View this post on Instagram A post shared by Kunal Kapoor (@kunalkkapoor)
ఆగస్టు 03 , 2024
Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్ హీరోయిన్? ఆ సీన్ సినిమాకే హైలెట్ అట!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
విశ్వంభరలో అలనాటి నటి!
విశ్వంభరలో చిరుకి జోడీగా నటి త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti) కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ ప్రకారం సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఆమెను ఒప్పించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే విశ్వంభరపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి - విజయశాంతి జోడీగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇన్నాళ తర్వాత మళ్లీ వీరిద్దరిని తెరపై చూడటమంటే అది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.
చిరు కెరీర్‌లోనే తొలిసారి!
‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్ కూడా చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం 26 రోజులు షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. షూట్‌లో చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్‌లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నిర్వహించారు. కాగా, ఈ సీక్వెన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్‌ను కలవడం గమనార్హం.
మెగాస్టార్ స్పెషల్ పోస్టు
మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి విశ్వంభర సెట్స్ నుంచి తీసిన హనుమంతుడి ఫొటోను జత చేయడంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/KChiruTweets/status/1782634604022673632?
ఏప్రిల్ 23 , 2024
Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా?
నటీనటులు : గోపిచంద్, కావ్యా థాపర్, నరేష్, ముఖేష్ రిషి, జిషూ సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సునీల్, శ్యామ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వీ తదితరులు
దర్శకత్వం : శ్రీను వైట్ల
సంగీతం : చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : కె. వి. గుహన్
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి. విశ్వ ప్రసాద్
విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్ల, యాక్షన్ హీరో గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న (Viswam Movie Review) విడుదలైన ‘విశ్వం’ వారికి విజయాజాన్ని అందించిందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమె పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే గోపిరెడ్డి ఆ కుటుంబానికి పరిచయం కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇటలీలో కలిసిన సమైరా (కావ్య థాపర్)కు గోపిరెడ్డి ఎందుకు దూరమయ్యాడు? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నటుడు గోపిచంద్ ఎప్పటిలాగే తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని విశ్వంతో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే గత చిత్రాలతో పోలిస్తే గోపిచంద్ పాత్రలో పెద్దగా వైవిధ్యం లేదు. రొటీన్ పాత్రనే చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కావ్యా థాపర్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. అయితే గ్లామర్‌గా మాత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, రాహుల్ రామకృష్ణ పాత్రలు సినిమాలో బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్‌లో వారి పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఆనందం’, ‘సొంతం, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు తీసిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో కాస్త ట్రాక్ తప్పారు. అయితే తన బలాబలాలు గుర్తించి ‘విశ్వం’తో మళ్లీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఔట్‌డేటేడ్ స్టోరీని ఎంచుకోవడం మైనస్‌గా చెప్పవచ్చు. పంచ్‌లు, కామెడీ ట్రాక్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, పృథ్వీ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటలీ ట్రాక్‌లో కొత్త దనం కనిపించదు. విలన్ పాత్ర కూడా బలహీనంగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా విశ్వం పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం డీసెంట్‌గా అనిపిస్తుంది. రెండు, మూడు సాంగ్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కె.వి గుహన్ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. అమర్ రెడ్డి కుడుముల తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టే ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్‌గా కనిపించింది.
ప్లస్ పాయింట్స్
గోపిచంద్ నటనకామెడీ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఔట్‌డేటెడ్ స్టోరీ సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'విశ్వంభర'. ఇందులో చిరు సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటు చిరంజీవి కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత చిత్రం ‘భోళా శంకర్’ డిజాస్టర్ నుంచి ఈ మూవీ సక్సెస్‌తో బయటపడాలని చిరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో ఆ రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని విశ్వంభర టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
గ్రాండ్ ట్రీట్ లోడింగ్..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేను మెగా అభిమానులు ఏ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్లెక్సీలు కట్టించి కేక్ కటింగ్స్ చేయడంతో పాటు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హంగామా చేస్తారు. చిరు గొప్పతనం గురించి గుర్తుచేసుకుంటారు. ఆ రోజున ఫుల్ జోష్‌లో ఉండే మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ‘విశ్వంభర’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్క్ కూడా మెుదలైపోయినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్/టీజర్ తాలుకూ ఫైనల్ వర్క్ జరుగుతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘ఇంద్ర’ మూవీ 4K వెర్షన్ రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను ప్రసారం చేయాలని విశ్వంభర టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
https://twitter.com/CinemaBrainiac/status/1825454972777197590
‘ఇంద్ర’ రీ-రిలీజ్ రికార్డులు
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను ఈసారి మరింత స్పెషల్ కాబోతోంది. చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ను ఆగస్టు 22న రీరిలీజ్ చేయబోతున్నారు. 4K వెర్షన్‌లో రానున్న ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ను శనివారం (ఆగస్టు 17) ప్రారంభించారు. అయితే రిలీజ్ చేసిన అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయినట్లు థియేటర్ వర్గాలు ప్రకటించాయి. అదనపు షోలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. అయితే ఇంద్ర రిలీజై ఇప్పటికీ 22 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత ఈ సూపర్ హిట్ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ‘ఇంద్ర’తో పాటు మరో బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ను సైతం రీరిలీజ్ చేయబోతున్నారు.
విశ్వంభరలో సిస్టర్ సెంటిమెంట్!
విశ్వంభర సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యువ నటి రమ్య పసుపులేటి క్లారిటీ ఇచ్చింది. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ హీరోయిన్‌గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇపుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెళ్లుగా చేస్తునారు’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
https://twitter.com/PraveeGv/status/1825121103187964326
ఆగస్టు 20 , 2024
Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్.. ‘హైడ్ అండ్ సీక్’ మెప్పించిందా?
నటీనటులు : విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్ వెరేళ్ల తదితరులు
రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా
సంగీతం : లిజో కె. జోస్
ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల
నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
విడుదల తేదీ: 20-09-2024
‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కర్నూల్ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్ వార్ ఫేర్‌ను కర్నూల్ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్ ఇంకాస్త బాగా ఎలివేట్ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వాంత్ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 20 , 2024
Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్
కావ్య థాపర్ హీరోయిన్‌గా రూపొందిన 'విశ్వం' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1844650013252825352
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్ పాడిన ఈ పాటకు గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.
https://twitter.com/actressspecial/status/1844644160881426905
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
అక్టోబర్ 11 , 2024
Vishwambhara: జపాన్ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చిరుకి జోడీగా నటిస్తోంది. ‘అమిగోస్’ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషతో చిరు రొమాంటిక్ సాంగ్!
‘విశ్వంభర’ (Viswambhara) టీమ్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్!
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది.
https://twitter.com/i/status/1849101610762522837
2025 సమ్మర్ బరిలో..
చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 20 , 2024
Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. విజేత ఎవరంటే?
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్ హీరో’, ‘జిగ్రా’ మూవీస్ దసరా కానుకగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ హీరోగా టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.
https://twitter.com/Filmy_Track/status/1845727131768082555
విశ్వం (Viswam)
మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం.
https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627
https://twitter.com/Colliderreview/status/1845720361499083121
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్ 11న తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్ విద్యా కా వోహ్ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 14 , 2024
Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చిరు - త్రిష ఆలింగనం
చిరు షేర్ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్ నుంచి బయటకొచ్చి మెగాస్టార్ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1754373323910533528
18 ఏళ్ల తర్వాత..
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.
ఆచార్యకు నో చెప్పిన త్రిష!
నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ చిరు లేటెస్ట్ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.
సెకండ్ హీరోయిన్ ఎవరో?
‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్ తెగ వెతికేస్తున్నట్లు టాక్. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్, హానీ రోజ్, సంయుక్త మీనన్ పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్ హీరోయిన్‌గా త్రిష ఫైనల్ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
13 భారీ సెట్‌లు..!
చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది.
ఫిబ్రవరి 05 , 2024
Kavya Thapar Hot Navel: చీర పక్కకు జరిపి నాభి అందాలతో మతి పోగొడుతున్న కావ్యా థాపర్
గ్లామరస్ డాల్ కావ్యా థాపర్ మరో సారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తన హాట్ ఫొటో షూట్ షేర్ చేసి మతులు పోగొడుతోంది.
రెడ్ శారీలో నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతోంది. ఇంపైన ఎద ఎత్తులతో అట్రాక్ట్ చేస్తోంది.
బ్యాక్ స్లీవ్ లెస్ జాకెట్‌లో కావ్యా థాపర్ అందాలను అప్పనంగా ప్రదర్శించింది. ఆమె బ్యాక్ కర్వ్స్ హీట్ పెంచేలా ఉన్నాయి.
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు "లవ్లీ", "సో హాట్" లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్ చేస్తున్నాయి.
మతి పొగొట్టే ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక కావ్యా థాపర్ కెరీర్ టాలీవుడ్‌లో ఆశించినంతగా సాగడం లేదు. “అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని” అనే సామెత మాదిరి ఆమె కెరీర్ సాగుతోంది.
అవకాశాలు దండిగా వస్తున్నా.. సరైన హిట్ మాత్రం ఈ గ్లామర్ డాల్‌కు పడటం లేదు.
ఇటీవల కావ్య థాపర్ హీరోయిన్‌గా వచ్చిన 'విశ్వం' యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో అమ్మడి అందాల ఆరబోతను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అంతకుముందు డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోనూ కావ్య థాపర్ అందాల దాడి చేసింది. అందాల ప్రదర్శన మీదనే ఫొకస్ పెట్టింది.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపింది.
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా రెచ్చిపోయి నటించింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
నవంబర్ 18 , 2024
Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!
మెగా తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులోకి ‘తండేల్’!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
చరణ్ వర్సెస్ చైతూ
టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బాలయ్య నుంచి గట్టిపోటీ!
గేమ్ ఛేంజర్, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 15 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు తప్పదా?
రామ్‌చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game changer). 'ఆర్ఆర్‌ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్ బరిలో నిలిచిన చిరుకు చరణ్ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
క్రిస్మస్ నుంచి సంక్రాంతికి లాక్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్ చిత్రం 'విశ్వంభర'ను పొంగల్ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ లేటెస్ట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'ను సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్ నాటికి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరు-రామ్‌చరణ్ మధ్య బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా?
గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని క్రిస్మస్ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్ పీరియడ్ కలెక్షన్స్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే 'గేమ్ ఛేంజర్' సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
చిరు వెనక్కి తగ్గేనా!
తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్ క్రిస్మస్ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్ అయితే ‘గేమ్ ఛేంజర్’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుబడితే మెగాస్టార్ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రీషూట్‌కు నో చెప్పిన చరణ్!
‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్ ఛేంజర్’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్ సంసిద్ధంగా లేరని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది.
చరణ్- నీల్ కాంబో లోడింగ్!
రామ్ చరణ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో 'NTR 31'తో పాటు సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్-నీల్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
అక్టోబర్ 09 , 2024
Viswam Movie: గోపిచంద్ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హవా నడుస్తోంది. డార్లింగ్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ పేరు దేశంలో మారుమోగుతోంది. ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకూ ప్రభాస్ నామస్మరణలతో ఇండస్ట్రీలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. తన మిత్రుడు గోపిచంద్ కోసం ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్‌తో ఎలివేషన్స్!
మ్యాచోస్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ (Prabhas) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమా భాగస్వామ్యం అవ్వడం నిజమేనని తెలుస్తోంది. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా ప్రభాస్ ఈ మూవీలో పాలుపంచుకుంటాడని టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ ఇంట్రడక్షన్ సీన్‌కు ప్రభాస్ తన వాయిస్‌తో ఎలివేషన్ ఇస్తాడని అంటున్నారు. ప్రభాస్ ఇప్పటివరకూ ఓ సినిమాలో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. స్నేహితుడైన గోపిచంద్ కోసమే ప్రభాస్ ఇందుకు ఓకే చెప్పినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్, గోపిచంద్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!
హీరో గోపిచంద్ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన గత చిత్రాలు ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు భీమా, రామబాణం, పక్కా కమర్షియల్, ఆరడుగుల బుల్లెట్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో గోపిచంద్‌కు సక్సెస్ తప్పనిసరిగా మారింది. అటు దర్శకుడు శ్రీను వైట్ల సైతం ఒకప్పటిలా బ్లాక్‌బాస్టర్స్ ఇవ్వలేకపోతున్నాడు. 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకూ శ్రీను వైట్లకు రాలేదు. దీంతో అతడు కూడా 'విశ్వం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌ను సినిమాలో భాగం చేయడం ద్వారా 'విశ్వం'పై హైప్ తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను సంప్రదించి అతడి ద్వారా హీరోకు ఎలివేషన్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో? లేదో? చూడాలి.
ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్
ప్రభాస్ గోపిచంద్ ఎంత మంచి మిత్రులో ఇండస్ట్రీ మెుత్తం తెలుసు. ‘వర్షం’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు తొలిసారి కలిసి నటించారు. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపిచంద్ విలన్‌గా అలరించారు. అప్పటి నుంచి వీరి స్నేహం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆహా వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్ షోలో వీరిద్దరు పాల్గొని హోస్ట్ బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరిద్దరిని తొలిసారి ఒక షోలో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు. ప్రభాస్, గోపిచంద్ మంచి ఫ్రెండ్స్ అని తెలుసుగానీ, మరి ఈ స్థాయి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఈ ఎపిసోడ్ తర్వాతనే తెలిసిందని చాలా మంది నెటిజన్లు పోస్టులు సైతం పెట్టారు.
https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA
‘విశ్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
గోపిచంద్, శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న 'విశ్వం' చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్ (Kavya Thapar) నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో రంజాన్ కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
https://www.youtube.com/watch?v=1LoKTtrxjmM
జూలై 16 , 2024
Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం.
నటీనటులు
విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్.
కథ
సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది. మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారంటే?
హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది. వైవిధ్యమైన పాత్రలో కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది. సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా
సినిమా టెక్నికల్ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్ పనిచెబితే బాగుండేది.
బలాలు
కథనం
ప్రీ క్రైమాక్స్
డైరెక్షన్
బలహీనతలు
తొలి 20 నిమిషాలు
బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్
Telugu.yousay.tv Rating: 3.5/5
మార్చి 30 , 2024
Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్ చరణ్ బిగ్ ఫైట్.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్ స్పాట్ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్ లుక్ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్ ఛేంజర్’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న లీకుల బెడద!
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ కియారా ఫొటోలు లీక్ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.
https://twitter.com/i/status/1769462838765240477
https://twitter.com/i/status/1769381487143776301
దసరా, సంక్రాంతి పరిశీలన!
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్ ఛేంజర్'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్ పనులు ప్లానింగ్ చేసుకొని డేట్ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.
చిరు - చరణ్ - తారక్.. బిగ్ ఫైట్!
అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్’ ఫిక్స్ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్ ఫైట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కలిసి నటించిన తారక్‌తో రామ్ చరణ్ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్!
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి 18 , 2024
Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం.
విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం.
మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 26 , 2024
Trisha Krishnan: టాలీవుడ్‌పై కన్నేసిన త్రిష.. ఆ విషయంలో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ!
స్టార్ నటి త్రిష (Actress Trisha).. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల తమిళంలో విజయ్ (Vijay) సరసన ‘లియో’ (Leo)లో నటించిన త్రిష.. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోని కనిపించి మెప్పించింది. రీసెంట్‌గా తెలుగులో చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’లోనూ త్రిష హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ త్రిషను వరించినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ స్టార్ పక్కనే నటించనుందా!
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh) కాంబోలో తెరకెక్కిన ‘F2’, ‘F3’ చిత్రాలు ఆడియన్స్‌ను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఆ చిత్రాల్లో మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మళ్లీ మంచి మెుదలైనట్లే. గత కొంత కాలంగా డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్‌కు పరిమితమైన త్రిష.. ‘విశ్వంభర’ ద్వారా నేరుగా తెలుగు సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. అయితే వెంకటేష్ - త్రిష కాంబోకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సూపర్ హిట్ కాంబో..!
వెంకటేష్ - త్రిష గతంలోనూ జంటగా నటించారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘నమో వెంకటేశ’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబినేషన్ చాలా బాగుందంటూ అప్పట్లో టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు ‘బాడీగార్డ్’ సినిమాతో మరోమారు జతకట్టారు. వీరి కెమెస్ట్రీకి మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ చిత్రం విఫలమైంది. దీంతో అప్పటి నుంచి వెంకీ - త్రిష కాంబినేషన్‌లో మరో చిత్రం రాలేదు. తాజా ప్రచారం ప్రకారం వీరు మళ్లీ జోడి కడితే ఇది వారికి నాల్గో చిత్రం అవుతుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రం కావడంతో ఈ జోడీ తెరపై ఎలాంటి సందడి చేస్తుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోయాయి.
త్రిష క్రేజీ ప్రాజెక్ట్స్
త్రిష అటు తెలుగుతో పాటు.. తమిళంలోనూ మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ అజిత్ (Ajith)తో కలిసి ‘విడా ముయరాచి’ (Vidaa Muyarchi) అనే సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life)లో కూడా త్రిష హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. అలాగే మలాయళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal)తో 'రామ్' (Ram) అనే సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించింది. దాంతోపాటు 'ఐడెంటిటీ' అనే మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తూ ఈ సుందరి బిజీ బిజీగా గడుపుతోంది.
పరువు నష్టం దావా
ఇటీవల తమిళనాడు ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజు.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డాడు. త్రిష.. రూ.25 లక్షలు తీసుకుని ఓ రిసార్ట్ లో గడిపేందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా త్రిష న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. అంతకుముందు ఏవీ రాజు వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 24 , 2024
Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
https://twitter.com/i/status/1752914245170364419
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.
ఫిబ్రవరి 23 , 2024
Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.
ఎవరెలా చేశారు?
సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా?
ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk
ప్లస్ పాయింట్స్
కామెడీ
నటీనటులు
మైనస్ పాయింట్స్
పేలవ కథ, కథనం
క్లైమాక్స్
పాటలు
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
జూలై 07 , 2023
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
కస్టడీ (మే 12)
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్ చేశారు
భువన విజయం (మే 12)
భువన విజయంలో సునీల్ లీడ్ రోల్‌లో చేశారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించారు.
కథ వెనుక కథ (మే 12)
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్, విశ్వంత్ లీడ్ రోల్స్ చేశారు
మ్యూజిక్ స్కూల్ (మే 12)
ఈ సినిమాలో శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు
ఛత్రపతి (మే 12)
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు.
ఫర్హానా (మే 12)
ఐశ్వర్య రాజేశ్ కీ రోల్‌లో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’.
అన్నీ మంచి శకునములే (మే 18)
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం.
సామజవరగమన (మే 18)
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక
బిచ్చగాడు 2 (మే 19)
ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది.
మళ్ళీ పెళ్లి (మే 26)
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం మళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు.
టక్కర్ (మే 26)
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహించారు.
మేమ్ ఫేమస్ (మే 26)
మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు.
అహింస (జూన్ 02)
రాణా బ్రదర్ అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది.
విమానం (జూన్ 02)
సముద్రఖని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అనసూయ కీలక పాత్ర పోషించింది.
ఆదిపురుష్ (జూన్ 16)
రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ డైరెక్షన్ చేశాడు.
స్పై (జూన్ 29)
హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
మే 11 , 2023