ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్SonyLivఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సత్య అక్కల
మహేష్ఆర్జవీ రాజ్
అనితశ్రీకాంత్ అయ్యంగార్
ర్ సుదర్శన్మహేష్ స్నేహితుడు
తుమ్మల నర్సింహారెడ్డిరాధాకృష్ణ సోదరుడు
సుబ్బరాయ శర్మ
సుబ్బరాయ శర్మహర్ష చెముడు
వరదరాజ్శివన్నారాయణ నారిపెద్ది
మధుమణి
నిత్య శ్రీ
కిరీటి దామరాజు
ధాయ
కల్ప లత
సందీప్ కిషన్
పొడిగించిన అతిధి పాత్రసిబ్బంది
రామ్ అబ్బరాజుదర్శకుడు
సందీప్ కిషన్
నిర్మాతకెఎస్ సినీష్నిర్మాత
అనివీసంగీతకారుడు
కథనాలు
సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.
సందీప్ కిషన్ మద్దు పేరు?
సండీ
సందీప్ కిషన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
సందీప్ కిషన్ తొలి సినిమా?
ప్రస్థానం సినిమాలో నెగిటివ్ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం
సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు?
చెన్నై
సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1987, మే 7
సందీప్ కిషన్‌కు వివాహం అయిందా?
ఇంకా జరగలేదు.
సందీప్ కిషన్‌కు లవర్ ఉందా?
సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్, విజయ్
సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా?
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి.
సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్?
బ్లూ, వైట్
సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు?
RK దుర్గా, P.R.P నాయుడు
సందీప్ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం?
అమెరికా
సందీప్ కిషన్ ఏం చదివాడు?
డిగ్రీ
సందీప్ కిషన్ అభిరుచులు?
ట్రావలింగ్, పార్టింగ్
సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.
సందీప్ కిషన్‌కు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
సందీప్ కిషన్ వ్యాపారాలు?
సందీప్ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది.
సందీప్ కిషన్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
మార్చి 21 , 2024
Comedian Satya: స్టార్ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్ కమెడియన్‌గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ కమెడియన్స్‌లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ అవ్వాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.
సత్య వన్ మ్యాన్ షో!
శుక్రవారం రిలీజైన 'మత్తు వదలరా 2' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అందరూ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు. మత్తువదలరాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా సత్య కామెడీ మాత్రం భలే వర్కవుట్ అయింది. తొలి సీన్ నుంచి చివరి వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్‌లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్‌ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్ కామెడియన్‌గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.
15 ఏళ్ల కృషి..
కమెడియన్‌గా దాదాపు దశాబ్దంన్నర కిందట్నుంచి సత్య ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్‌తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు. ఐతే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు. ‘మత్తు వదలరా’, ‘రంగబలి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజనంబు’లో నవ్వించడంతో పాటు కన్నీళ్లు సైతం పెట్టించాడు. గతంతో పోలిస్తే చాలా బిజీ అయినప్పటికీ తన టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మత్తువదలరా-2’ సత్యకు ఆ లోటును తీర్చిందనే చెప్పాలి.
సత్యపై డైరెక్టర్ల ఫోకస్!
ప్రతీ సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనూ సత్యకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఆ కమెడియన్లకు గట్టి పోటీ!
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, గెటప్ శ్రీను, సప్తగిరి, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ సైతం హీరోగా మానేసి కమెడియన్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్‌లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 14 , 2024
Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్, కామెడీ, అడ్వెంచర్ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివాహభోజనంబు
‘మాయాబజార్’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.
https://www.youtube.com/watch?v=dZejdBmYC3k
‘సుందరి నీవంటి’
సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్ చేస్తారు. కానీ ‘మాయాబజార్’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.
https://www.youtube.com/watch?v=ScasolQHzxs
'నిలువరా వాలు కనులవాడా'
జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.
https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA
'చెప్పమ్మా.. చెప్పమ్మా..'
‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్ కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్ అవుతుందో ఈ సాంగ్ కళ్లకు కడుతుంది.
https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI
'బుగ్గే బంగారమా..'
‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు.
https://www.youtube.com/watch?v=WABcMeOf0oM
‘అసలేం గుర్తుకు రాదు’
‘అంతపురం’లోని ఈ సాంగ్.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.
https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss
‘ఇంకి పింకి పాంకీ’
సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి.
https://www.youtube.com/watch?v=FusD0RVkKAk
‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’
తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.
https://www.youtube.com/watch?v=u_wB6byrl5k
‘ఐతే’
ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్ కళ్లకు కడుతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.
https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4
‘లైఫ్ ఆఫ్ రామ్’
ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=2a34XyiZO14
‘చెలియా చెలియా’
ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
మార్చి 02 , 2024
Shobhitha Shivanna: నటి శోభితా శివన్న సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే!
కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం శోభిత సూసైడ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో శోభిత శివన్న గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శోభిత శివన్న (Shobhitha Shivanna Suicide) వ్యక్తిగత వివరాలకు వస్తే ఆమె 1992 సెప్టెంబర్ 23న బెంగళూరులో జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.
బాల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో గ్రాడ్యుయేషన్ చేసింది.
కెరీర్ ప్రారంభంలో కన్నడ ఛానెల్ రాజ్ మ్యూజిక్‌లో వీజే (వీడియో జాకీ)గా పని చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సీరియల్స్, సినిమాల్లోకి అడుగుపెట్టింది.
2015లో వచ్చిన కన్నడ ఫిల్మ్ 'రంగితరంగ'తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ తర్వాత చేసిన 'ఎరదొండ్ల మూరు', 'ఏటీఎం', 'అటెంప్ట్ టూ మర్డర్', 'జాక్‌పాట్' చిత్రాలు కన్నడ ఇండస్ట్రీలో ఆమెకు గుర్తింపు తెచ్చాయి.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ ఆమె నటించింది. 'గాలిపట', 'మంగళ గౌరి', 'బ్రహ్మగంటు', ‘కృష్ణ రుక్మిణి’ సీరియల్స్‌లో శోభిత శివన్న నటించింది.
హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం శోభిత (Shobhitha Shivanna Suicide) కు ఘనంగా వివాహమైంది.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డిని మ్యాట్రిమోని పరిచయంతో శోభిత వివాహమాడింది.
వివాహం తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు శోభిత మకాం మార్చింది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో ఆమె భర్తతో కలిసి అద్దెకు ఉంటోంది.
శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆమె గదిలోకి వెళ్లి నిద్ర పోయింది. భర్త పక్క గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేళాడుతూ శోభిత కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఈ విషయం తెలిసిన సాధారణ ప్రజలు సైతం షాకయ్యారు.
పెళ్లైనప్పటి నుంచి శోభిత శివన్న (Shobhitha Shivanna) నటనకు దూరంగా ఉంటున్నారు. భర్తతోనే హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆమెకు ఏం వచ్చిందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఒక వేళ భర్త సుధీర్ రెడ్డితో ఏమైన గొడవలు జరిగాయా? కాపురంలో సమస్యలు ఉన్నాయా? లేదా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శోభిత పోస్టుమార్టం (Shobhitha Shivanna) నివేదిక సైతం బయటకు వచ్చింది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, అది ఆత్యహత్యేనని వైద్యులు తేల్చారు. శోభిత స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
డిసెంబర్ 02 , 2024
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
Happy Wedding Anniversary మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్
]మహేశ్-నమ్రత జంట ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ YouSay తరఫున జంటతారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఫిబ్రవరి 10 , 2023
Naga Chaitanya Wedding: నాగ చైతన్య - శోభిత మధ్య ప్రేమ ఎలా మెుదలైందో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), హీరోయిన్ శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) మరికొద్ది గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ మండపంలో బుధవారం (డిసెంబర్ 4) రాత్రి వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఎదురుగా ఈ పెళ్లి వేదికని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నవ జంటకు ఏఎన్నార్ ఆశీర్వాదాలు ఉండాలని ఇలా ఏర్పాటు చేశారు. అయితే శోభితను ఎంతో ఇష్టపడి నాగచైతన్య వివాహం (Naga Chaitanya Wedding) చేసుకోబోతున్నారు. ఒక్క సినిమా చేయనప్పటికీ వీరి ప్రేమకథ ఎలా మెుదలైందా? అని సినీ లవర్స్ చెవులు కొరికేసుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెుదటి పరిచయం ఎలాగంటే..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)ను 2017 అక్టోబర్‌లో నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్‌లో ఈ జంట విడిపోయింది. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు నాగచైతన్య ఒంటరిగా ఉన్నారు. ఈ క్రమంలో అడివి శేష్, శోభిత నటించిన ‘మేజర్’ (Major) ప్రమోషన్స్‌లో నాగ చైతన్య పాల్గొన్నాడు. ఆ వేదికపై తొలిసారి శోభితతో పరిచయం అయ్యింది.
బర్త్‌డే పార్టీతో ఫ్రెండ్‌షిప్..
‘మేజర్’ ప్రమోషన్స్ జరిగిన కొద్ది రోజులకే శోభిత బర్త్‌డే (మే 31) వచ్చింది. అప్పటికే ఏర్పడిన పరిచయంతో నాగచైతన్యను పుట్టిన రోజు వేడుకలకు శోభిత ఆహ్వానించింది. వాటికి హాజరైన నాగచైతన్య ఆమెకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. శోభిత బర్త్‌డే నుంచి వారి మధ్య స్నేహం ఏర్పడింది.
కొద్ది రోజులకే స్ట్రాంగ్ రిలేషన్..
చైతూ - శోభిత (Sobhita Dhulipala Wedding) స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇరువురి ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టా ఇష్టాలు కలవడంతో తక్కువ సమయంలోనే ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరిపట్ల ఒకరికి స్నేహానికి మించిన బంధం ఉందని అర్థం చేసుకున్నారు. తమ లవ్‌ను వ్యక్తం చేసుకొని ప్రేమికులుగా మారిపోయారు.
లవ్ గురించి ఎలా తెలిసిందంటే!
2022లోనే చైతూ - శోభిత (Naga Chaitanya And Sobhita Dhulipala Wedding) ప్రేమలో పడిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం ఈ జంట చాలా సీక్రెట్‌గా ఉంచింది. ఈ క్రమంలో 2023 మార్చిలో తొలిసారి వీరి లవ్ గురించి రూమర్లు వచ్చాయి. ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోనూ నాగచైతన్య పోస్టు చేయగా వెనక శోభిత ఉండటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారన్న అనుమానాలను కలిగించింది.
ఆ తర్వాత మరిన్ని సార్లు..
తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మెుదలైనా ఈ జంట ఎక్కడా స్పందించలేదు. దీంతో వీరి బంధాన్ని వెలికితీసేందుకు అభిమానులు క్లూస్ వెతకడం మెుదలుపెట్టారు. 2024 జూన్‌లో ‘వైన్ టేస్టింగ్ హాలీడే’లో వీరు పొల్గొన్న ఫొటో తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓ దేశంలోని వీధుల్లో శోభిత, చైతూ.. జంటగా తిరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పుడు వారి చేతుల్లో షాపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీంతో నిజంగానే వారు లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కన్ఫార్మ్ చేసుకున్నారు.
ఆగస్టులో నిశ్చితార్థం..
ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకొని అందరినీ చైతూ జంట (Naga Chaitanya Wedding) సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలియజేయడం విశేషం. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. నిశ్చితార్థపు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి పనులపై అప్‌డేట్స్
నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లికి సంబంధించి ఏ చిన్న కార్యం జరిగినా శోభితా (Sobhita Dhulipala) అభిమానులతో పంచుకుంటూనే ఉంది. పెళ్లి పనులు మెుదలు పెట్టడానికి చేసే పసుపు దంచే ఫొటోలను శోభిత స్వయంగా పంచుకుంది. మూడ్రోజుల క్రితం హల్దీ వేడుకులకు సంబంధించిన ఫొటోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అలాగే ‘పెళ్లి కూతురు’ క్యాప్షన్‌తో కాళ్లకు పసుపురాస్తున్న పిక్స్, మంగళహారతులు ఇస్తున్న ఫొటోలను సైతం పంచుకుంది.
పెళ్లికి అతిథులు ఎవరంటే
అతి కొద్ది మంది సమక్షంలోనే ఇవాళ (డిసెంబర్ 4) నాగ చైతన్య, శోభిత వివాహం (Naga Chaitanya And Sobhita Dhulipala Wedding) జరగనుంది. అక్కినేని, దూళిపాళ్ల, దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు పరిమిత సంఖ్యలో సన్నిహితులు, సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరుకానున్నారు. చిరంజీవి, ప్రభాస్, రామ్‌చరణ్, ఉపాసన, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే పీవీ సింధు, డైరెక్టర్ రాజమౌళి కూడా పెళ్లి హాజరయ్యే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ 04 , 2024
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో వివాహ బంధంలోకి స్నేహరెడ్డి అడుపెట్టి నేటికి 13 వసంతాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సెలబ్రెటీల చేత ఐకానిక్ జంటగా స్నేహ రెడ్డి- బన్నీ జంట గుర్తింపు పొందింది. కేవలం ఓ స్టార్ హీరో భార్యగా మాత్రమే కాకుండా స్నేహా రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్‌పై తనకున్న అభిరుచి ఇతర దృక్కొణాలు ఆమెను లేడీ ఐకానిక్ స్టార్‌గా నిలిపాయి. ఈక్రమంలో స్నేహా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఫాలోయింగ్‌లో తగ్గేదేలే
స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రాంలో స్నేహాకు ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
అందంలోనూ టాప్
ప్రస్తుతం స్నేహారెడ్డి వయసు 38. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తనది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ స్నేహా రెడ్డి ఫిట్‌గా ఉంటారు.
రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో రన్నింగ్ ఆమె డైలీ హ్యాబిట్
ఫ్యాషన్ ఐకాన్
ఏ సెలబ్రెటీతో పోల్చినా ఫ్యాషన్‌లో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఇటీవలే సిల్వర్ ఆకులతో ఎంబ్రాయిడరీ చేయించిన చీరను స్నేహా రెడ్డి ధరించింది.
దీని ధర సుమారు రూ.1.45కోట్లు ఉంటుందని అంచనా
ప్రతిరోజు యోగా చేయడం స్నేహ దినచర్య. యోగా మెళకువలు, ఫ్యాషన్ టిప్స్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది.
యాక్టివ్ రెస్పాన్స్
ఫుడ్, ట్రావెల్ అంటే స్నేహా రెడ్డికి మక్కువ. ఎప్పుడూ వీటికి సంబంధించిన అంశాలను తను షేర్ చేస్తూ ఉంటుంది.
ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటుంది.
సినిమాల్లోకి స్నేహరెడ్డి?
ఇంత అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్నేహా రెడ్డి త్వరలో మేకప్ వేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.
మలయాల సినిమాతో స్నేహా రెడ్డి ఎంట్రీ ఉంటుందట. ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు సమాచారం.
మలయాళంలో అల్లు అర్జున్‌కి క్రేజ్ ఎక్కువ. అందుకే తన డెబ్యూ సినిమాకు అక్కడ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
మార్చి 06 , 2024
Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.
వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్ చద్దా వివాహం జరగడం గమనార్హం.
ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది.
ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు.
తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్ వివాహ ఫొటోలను షేర్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు.
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు.
సెప్టెంబర్ 25 , 2023
Trisha: డేటింగ్‌లో విజయ్ - త్రిష? కీర్తి సురేష్ పెళ్లిలో రివీలైన బంధం!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు డేటింగ్ (Trisha Vijay Dating)లో ఉన్నట్లు కూడా నెట్టింట రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి ప్రయాణించినట్లు ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలతో వీరి సంబంధం గురించి సోషల్ మీడియాలో మరోమారు చర్చ మొదలైంది. వీరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారనేందుకు ఈ ఫొటోలు, వీడియోలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చెకింగ్ దగ్గర దొరికేసిన జంట..
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గురువారం (డిసెంబర్ 12) గోవాలో పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి అతి ముఖ్యులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్, త్రిష జంటగా ఈ పెళ్లికి హాజరయ్యారంటూ గురువారమే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్, త్రిష స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు చెకింగ్ సందర్భంగా విజయ్, త్రిష జంటగా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/TrollywoodX/status/1867249542149926983
త్రిష-విజయ్ లుక్స్ అదరహో..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో త్రిష సాధారణ వైట్ టీ-షర్ట్ ధరించగా, విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌తో చక్కగా కనిపించాడు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వారిద్దరిని చెక్ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాలో వారిని బంధించారు. చెకింగ్ అనంతరం త్రిష, విజయ్ తమ కారుల్లో ఎక్కి హడావిడీగా వెళ్లిపోయారు. కాగా, స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన వారి లిస్ట్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో త్రిష, విజయ్ పేర్లతో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు వివరాలు ఉన్నాయి.
https://twitter.com/rajubhai_DMK/status/1867463962440478816
నెటిజన్ల రియాక్షన్ ఇదే
విజయ్, త్రిష (Trisha Vijay Dating)కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ‘వెడ్డింగ్‌లో పాల్గొంటే తప్పేముంది?’ అని కొందరు విజయ్ జంటను సమర్థిస్తున్నారు. పెళ్లై పిల్లలను పెట్టుకొని విజయ్ ఇలా చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఏమాత్రం అమోదయోగ్యం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలోనూ విజయ్ హుందాగా ఉండాల్సిన అవసరముందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం త్రిష, విజయ్ వ్యవహారం కీర్తి సురేష్ పెళ్లి కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
విజయ్ జంటకు మంచి క్రేజ్
విజయ్ - త్రిష (Trisha Vijay Dating) జంటకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వారు ఇప్పటివరకూ 8 చిత్రాల్లో కలిసి నటించారు. గతేడాది వచ్చిన లియో సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాలోనూ త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో తళుక్కుముంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలం నుంచే వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు మెుదలయ్యాయి. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అతడి పొలిటికల్ ప్రత్యర్థులు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారన్న ప్రచారం కూడా తమిళనాడులో ఉంది. ఏది ఏమైనా తన రిలేషన్ గురించి విజయ్ - త్రిష క్లారిటీ ఇచ్చే వరకూ ఈ చర్చ ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
డిసెంబర్ 13 , 2024
Sobhita Dhulipala: పెళ్లి పీటలపై క్యూట్‌గా తలపడ్డ చైతూ-శోభిత.. వీడియో వైరల్!
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్ 4న అతికొద్ది మంది సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి అతి ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. దీంతో పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలుత చైతు-శోభిత పెళ్లి ఫొటోలు బయటకి రాగా ఆ తర్వాత తాళికట్టే వీడియో లీకయ్యింది. ఈ క్రమంలో రెండ్రోజుల తర్వాత వీరి పెళ్లికి సంబంధించి మరో ఆసక్తికర వీడియో బయటకొచ్చింది. అలాగే ఈ పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రామ్‌చరణ్ లుక్ కూడా తెగ ట్రెండింగ్ అవుతోంది. వాటిపై ఓ లుక్కేద్దాం.
చైతూ-శోభిత క్యూట్ ఫైట్!
అక్కినేని వారసుడు నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు, ఎస్.ఎస్ రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. అటు అభిమానులు, నెటిజన్లు సైతం విషేస్ చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లికి సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. అందులో చైతు-శోభితా జోడీ క్యూట్‌గా తలపడింది. ప్రతీ పెళ్లిలో జరిగినట్లుగానే ఈ జంట కూడా బిందెలో ఉంగరం తీసేందుకు పోటీ పడింది. చివరికీ ఉంగరం చైతూ చేతికి చిక్కడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఈ క్యూట్ వీడియోను చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. శోభితపై తమ హీరో పైచేయి సాధించాడంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/filmfare/status/1864911694167781514
శ్రీశైలంలో నవ వధువులు
కొత్త జంట నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala)కు సంబంధించి మరో వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోండి. పెళ్లి తర్వాత వారిద్దరూ తొలిసారి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూ, శోభితతో పాటు అక్కినేని నాగ చైతన్య కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లారు. చైతు, శోభిత పట్టు వస్త్రాల్లో దేవుడ్ని దర్శించుకున్నారు.
https://twitter.com/ArtistryBuzz/status/1864950617472675943
https://twitter.com/tupaki_official/status/1864953264120156388
ఛత్రపతి శివాజీలా రామ్‌చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబుతో ‘RC 16’ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. మల్లయోధుడి పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చరణ్ ఆ పాత్రకు తగ్గట్లు మేకోవర్ అయ్యాడు. లాంగ్ హెయిర్‌తో పాటు కండలు తిరిగిన దేహంతో దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలోనే చైతూ - శోభిత పెళ్లికి చరణ్ హాజరయ్యాడు. బ్లాక్ కలర్ డ్రెస్ బియర్డ్‌లో ఉన్న చరణ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చరణ్ లుక్‌ను ఛత్రపతి శివాజీతో నెటిజన్లు పోలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి.
https://twitter.com/Ramcharan_VKG/status/1864628251995590988
https://twitter.com/4sidestvTelugu/status/1864936598691049917
డిసెంబర్ 06 , 2024
Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్ హీరో సిద్ధార్థ్, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
[toc]
వైభవంగా సిద్ధార్థ్ వివాహం
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్ - అదితి జంట చెక్ పెట్టింది.
https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477
ఓవైపు పెళ్లిళ్లు..
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850
మరోవైపు విడాకులు
ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్ పెట్టి తన భార్య, సింగర్ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.
గతంలో విడాకులు తీసుకున్న పాపులర్ సెలబ్రిటీలు
నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.
పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.
సుమంత్ - కీర్తి రెడ్డి
నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావు
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్
అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్
కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సైఫ్ అలీఖాన్ - అమృతా
సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
సంజయ్ దత్ - రిచా శర్మ
1987లో నటి రిచా శర్మతో సంజయ్ దత్ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్‌ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.
సెప్టెంబర్ 16 , 2024
Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్!
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.
ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో కార్తిక్.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్ - వెంకటేష్ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.
గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.
https://twitter.com/yousaytv/status/1717459822881509489
వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.
మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.
ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
మార్చి 16 , 2024
Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.
హైదరాబాద్‌లోని ప్రైవేట్ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.
https://twitter.com/i/status/1332879102211096577
ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు.
ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్‌కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్ చెప్పాలని నిర్ణయించుకుందట.
కిరణ్-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్’ (Meter), ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే చిత్రం కిరణ్ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇక రహస్య గోరక్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.
అదే ఏడాది 'బాయ్స్ ఇన్ స్కూల్' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్' అనే తమిళ్ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది.
మార్చి 11 , 2024
Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్ గ్యాప్ ఉన్న సెలబ్రిటీ కపుల్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రణ్‌బీర్ కపూర్ - అలియా భట్
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్ (40) - అలియా భట్ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.
ఫహద్ - నజ్రియా
మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ (40) నటి నజ్రియా నజిన్ (28)ను 2014లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.
ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్
బాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి.
సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్
ప్రముఖ బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్ అలీఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్ వైఫ్ అమృతా సింగ్ సైఫ్ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఆర్య - సయేషా సైగల్
తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.
ప్రకాష్ రాజ్ - పోనీ వర్మ
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(58) కొరియోగ్రాఫర్ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్ రాజ్ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.
దిల్ రాజు - తేజస్విని
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.
అర్జున్ కపూర్ - మలైకా
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.
మే 16 , 2023
Naga Chaitanya Wedding Card: నాగ చైతన్య తల్లిదండ్రులుగా శరత్ విద్యారాఘవన్, లక్ష్మీ.. ఏం జరిగిందంటే?
అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోతో ఈ శుభకార్యం గురించి క్లారిటీ వచ్చింది. తాజాగా, పెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేయడం కూడా స్టార్ట్ అయింది. ఈ క్రమంలో అమ్మాయి తరఫు నుంచి పంపిన పెళ్లి ఆహ్వాన పత్రిక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరి ఆ పత్రికలో ఎలాంటి వివరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వైరల్ అవుతున్న పెళ్లి కార్డ్
పెళ్లి ఆహ్వాన పత్రికలో నాగచైతన్య-శోభితల వివాహం డిసెంబరు 4న జరగనుందని తెలిపారు. ఆహ్వానం అందించిన వాళ్లు ఈ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఈ పెళ్లి పత్రిక కేవలం సాధారణ కార్డ్ మాత్రమే కాదు. ఒక ప్రత్యేకమైన వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువులను ఉంచి వెడ్డింక్ కార్డు అందించడం ప్రత్యేకతగా నిలిచింది. ఇది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంప్రదాయానికి అక్కినేని కుటుంబం పెద్ద పీట వేసిందని కామెంట్ చేస్తున్నారు.
తల్లిదండ్రులుగా లక్ష్మీ, శరత్ విద్యారాఘవన్
మరోవైపు పెళ్లి ఆహ్వాన పత్రికలో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో నాగార్జున- అమలతో పాటు, శరత్ విద్యారాఘవన్, లక్ష్మీ పేర్లు కనిపించడం విశేషం. నాగ చైతన్య తల్లి లక్ష్మీ నాగార్జునతో విడిపోయాక శరత్ రాఘవన్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. శుభలేఖలో శరత్ విద్యారాఘవన్, లక్ష్మీ పేర్లు పెట్టడం పట్ల అభిమానులు నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వేదిక మాత్రం రహస్యమే
పెళ్లి పత్రికలో వివాహ తేదీగా డిసెంబరు 4ను పేర్కొన్నప్పటికీ, వేదిక గురించి మాత్రం ఎలాంటి వివరాలు అందించలేదు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ పెళ్లి అక్కినేని కుటుంబానికి సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుక కోసం సిద్ధమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తికానున్నాయి. ఇప్పటికే శుభలేఖలు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలతో పాటు.. రాజకీయ ప్రముఖులకు కూడా చేరినట్లు సమాచారం.
పెళ్లి పనుల్లో నడుమ నిమగ్నమైన కుటుంబాలు
అప్పుడే శోభిత తరఫు నుంచి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అబ్బాయి కుటుంబం నుంచి కూడా మరో రెండు మూడు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని సమాచారం. ఇద్దరు కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి.
అక్కినేని అభిమానుల్లో ఆనందం
ఈ శుభకార్యం అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించడంతో, పెళ్లికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది.
అక్కినేని నాగచైతన్య-శోభిత వివాహం పెళ్లి సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ వేడుక ఎలాంటి జ్ఞాపకాలను అందిస్తుందో చూడాలి!
నవంబర్ 18 , 2024
Samantha Second Marriage: రెండో పెళ్లిపై మనుసులో మాట బయటపెట్టిన సమంత!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో సమంత ఒకరు. నాగచైతన్య హీరోగా 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే చిత్రంతో సామ్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అండుగుపెట్టింది. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు చేసి టాలీవుడ్ నెం.1 హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం ఈ అమ్మడి జీవితాన్ని కుదిపిసేంది. అనారోగ్యం కారణంగా కొద్దికాలం పాటు సినిమాలకు సైతం బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్లతో రెండో పెళ్లికి రెడీ కావడంతో ఇక సామ్ (Samantha Second Marriage) కూడా మంచి తోడును వెతుక్కోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో నటి సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన రెండో పెళ్లి గురించి చెప్పకనే చెప్పింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తల్లి కావాలని ఉంది: సమంత
సమంత నటింటిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సిటడెల్: హనీ బన్నీ' అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో సమంత తల్లి పాత్ర పోషిస్తూనే స్పై ఏజెంట్‌గా అదరొట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాతృత్వం (Samantha Second Marriage) గురించి ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో సామ్ మాట్లాడుతూ తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటున్నట్లు చెప్పింది. తల్లిగా ఉండటాన్ని తాను ఇష్టపడతానని, ఆ అనుభూతి పొందాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటానని స్పష్టం చేసింది. ఆ సమయం కోసం వేచి చూస్తున్నట్లు సామ్ పేర్కొన్నారు. మాతృత్వం గురించి చెప్పగానే తన వయసు గురించి అందరూ మాట్లాడతారని, అదేమి పెద్ద అడ్డంకి కాదని సామ్ చెప్పుకొచ్చింది.
రెండో పెళ్లిపై హింట్ ఇచ్చినట్లేనా!
సామ్ మాజీ భర్త నాగచైతన్య నటి శోభితా దూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామ్ ఎందుకు సింగిల్‌గా ఉండాలని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తనకు తగిన వ్యక్తిని పెళ్లి (Samantha Second Marriage) చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్టులు వస్తున్నా సామ్ ఇంతవరకూ దానిపై స్పందించలేదు. అయితే లేటెస్ట్‌గా తాను తల్లి కావాలని కోరుకుంటున్నట్లు, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు సామ్ వ్యాఖ్యానించడం ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రెండో పెళ్లికి తాను సానుకూలమన్న సంకేతాన్ని సామ్ చెప్పకనే చెప్పిందని అభిప్రాయపడుతున్నారు. సినీ కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఆమె మంచి లైఫ్‌ను లీడ్ చేయాలని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
సరోగసిపై సామ్ దృష్టి?
వైద్య రంగంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సరోగసి, టెస్ట్‌ట్యూబ్ బేబీ వంటి ఆధునిక సంతాన సాఫల్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. తమిళ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సరోగసి విధానంలో ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. తెలుగు నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా అదే తరహా ఆడబిడ్డకు తల్లి అయ్యింది. ఇప్పుడు సామ్ (Samantha Second Marriage) కూడా సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం లేకపోలేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండో పెళ్లిపై ఇప్పటివరకూ ఆమె ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆమెకు సెకండ్ మ్యారేజ్ ఆలోచన లేకపోయి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. తల్లి కావాలన్న కోరిక బలంగా ఉన్న నేపథ్యంలో సామ్ కూడా సరోగసి విధానంలో తల్లయ్యే విధానాన్ని పరిశీలించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
చై - శోభిత వివాహ షెడ్యూల్!
టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.
నవంబర్ 12 , 2024
KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బ్లాక్‌బాస్టరే!
టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్.ఆర్. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.
ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘క’. తన్వీ రామ్ (Tanvi Ram) హీరోయిన్. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న దీనిని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘క ట్రైలర్’ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.
https://www.youtube.com/watch?v=n75xEs-9u1I
ఇవి గమనించారా?
ట్రైలర్ అసాంతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆరంభంలోనే చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిని చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఊరిలో చీకటిపడిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆ ఊరికి పోస్ట్ మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) సత్యభామతో ప్రేమతో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరించడం ట్రైలర్‌లో చూడవచ్చు. ఆ ఉత్తరంలో ఏముంది? వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికిని పెంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్‌ను చూపించడం ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు.
బ్లాక్ బాస్టర్ పక్కానా?
‘క’ ట్రైలర్‌పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘క’ పక్కాగా ఆకట్టుకుంటుందని సినీ లవర్స్ విశ్వసిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ట్రైలర్‌లో కనిపించాయని కామెంట్స్ చేస్తున్నారు. సరైన హిట్ లేక ఇంతకాలం ఇబ్బంది పడుతూ వస్తోన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోగా మారిపోవడం ఖాయమన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి రహాస్య గోరక్‌ను కిరణ్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కిరణ్‌కు కూడా బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్ నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు కిరణ్ అబ్బవరం సైతం ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌పైనే అతడి ఫిల్మ్ కెరీర్ ఆధారపడి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.
తొలి ఫిల్మ్ హీరోయిన్‌తోనే పెళ్లి
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) - రహస్య గోరక్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. తమపై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఈ హీరో- హీరోయిన్లు కొన్ని రోజుల క్రితం పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు.
https://twitter.com/vamsikaka/status/1826657731585147141
అక్టోబర్ 25 , 2024
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడిపోనున్నారా? నెట్టింట వైరల్
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) విశ్వ సుందరిగా గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో చాలా మందికి ఆమె కలల రాకుమారి. ఈ క్రమంలోనే సడెన్‌గా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)ను వివాహామాడి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఐశ్వర్య అందానికి అభిషేక్ తగడంటూ బహిరంగంగానే అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా ఈ జంట కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ఓ నటి కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
త్వరలో విడాకులు?
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉంటే ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికార్లు చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ (Nimrat Kaur)తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆమె కారణంగా వారి మధ్య దూరం కూడా పెరిగిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి త్వరలోనే నిమ్రత్‌ను పెళ్లి చేసుకోనే ఆలోచనలో అభిషేక్ ఉన్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలను ఖండిస్తూ ఐశ్వర్య-అభిషేక్ ఒక్క ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
https://twitter.com/VermaJi_1991/status/1849041394007970125
దూరం పెట్టిన ఐశ్వర్య!
గత కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కేవలం తన కూతురితోనే కనిపిస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు సైతం ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్ వారితో లేకపోవడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. రీసెంట్‌గా ఐశ్వర్య రాయ్ తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడిపారు. కూతురు ఆరాధ్యతో కలిసి కజిన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. ఈ ఫ్యామిలీ ఈవెంట్‌కు సైతం అభిషేక్ హాజరుకాలేదు. విడాకుల రూమర్స్ మెుదలైనప్పటి నుంచి ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ జంటగా కనిపించకపోవడంతో ఐశ్వర్య కూడా అభిషేక్‌ను దూరం పెడుతోందన్న వార్తలు బలపడుతున్నాయి.
View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)
ఏకీపారేస్తున్న నెటిజన్లు!
అభిషేక్‌తో విడాకుల అంశంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున ఐశ్వర్యరాయ్‌కు అండగా నిలుస్తున్నారు. అభిషేక్ తనకు కరెక్ట్ కాదని తొలి నుంచి తాము చెబుతూనే వస్తున్నామని గుర్తుచేస్తున్నారు. గోల్డ్ (నిమ్రత్ కౌర్)ను వెతుక్కునే ప్రయత్నంలో డైమండ్ (ఐశ్వర్యరాయ్)ను కోల్పోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ సైతం ఈ వ్యవహారంలో ఐశ్వర్యకు అండగా నిలుస్తున్నారు. గతంలో ఐశ్వర్య - సల్మాన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆమె సల్మాన్‌కు బ్రేకప్ చెప్పి అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాంగ్ ఛాయిస్ అంటూ సల్మాన్ ఫ్యాన్స్ ఐశ్వర్యను ట్రెండ్ చేస్తున్నారు. ఐశ్వర్య కంటే నిమ్రత్ పెద్ద గ్లామరస్ కూడా కాదమని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Aliaashiqk_/status/1848991129292709904
https://twitter.com/Shivamsaxenaspn/status/1849361527221936381
https://twitter.com/Mohit_patrkar/status/1849359255951827095
https://twitter.com/CRAZY6801/status/1849356496238493953
ఎవరీ నిమ్రత్ కౌర్?
నిమ్రత్ గౌర్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. హిందీలో 10 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటోంది. గతేడాది 'స్కూల్ ఆఫ్ లైస్' వెబ్‌సిరీస్‌లోనూ ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. అభిషేక్ నటించిన 'దస్వి' (2022) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఉండగా ఇటీవల అది ప్రేమగా మారి పెళ్లి వరకూ దారితీసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్‌తో ‘సెక్షన్ 84’ చిత్రం సైతం నిమ్రత్ కౌర్ చేస్తోంది. దీంతో అమితాబ్‌కు కూడా ఆమెపై పాజిటివ్ ఓపినియన్ ఏర్పడిందన్న అభిప్రాయం కూడా బాలీవుడ్ వర్గాల్లో ఉంది.
అక్టోబర్ 24 , 2024
Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ఈ జంట ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు సైతం ఎక్కనుంది. ఇక చైతూతో ఎంగేంజ్‌మెంట్ తర్వాత నుంచి శోభిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా, కామెంట్స్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత తన మెుదటి ఇంటర్యూ ఇచ్చింది. చైతూతో పెళ్లి, మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘నిశ్చితార్థం గురించి కలలు కనలేదు’
తను నటించిన లవ్, సితార చిత్రం ఓటీటీ ప్రమోషన్స్‌లో భాగంగా నటి శోభిత దూళిపాల తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘చైతూలో ఆ ప్రేమ చూశా’
నటుడు నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం సంబంధిత ఫొటోలను షేర్ చేస్తూ కవిత్వంతో కూడిన ఆసక్తికర పోస్టు శోభిత పెట్టారు. ఆ విధంగా పోస్టు పెట్టడానికి గల కారణాన్ని తాజా ఇంటర్యూలో శోభిత వెల్లడించారు. ‘సంగం సాహిత్యానికి (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది) నేను విపరీతమైన అభిమానిని. నా పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం గతంలో నేను చదివినది. అది ఎంతో కవితాత్మకం. సరళంగా ఉంటుంది. హృదయాలను హత్తుకునే సందేశం అందులో ఉంది. అందుకే అది నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. నేను ఎల్లప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామిలో అదే ప్రేమను చూశా’ అని శోభితా ధూళిపాళ్ల వివరించారు.
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రం నటించింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 26 , 2024