• TFIDB EN
  • వ్యూహం
    UATelugu2h 7m
    వైఎస్‌ఆర్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే ‘వ్యూహాం’. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి సీఎం ఎలా అయ్యాడు? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

    టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది...read more

    How was the movie?

    తారాగణం
    అజ్మల్ అమీర్
    వైయస్ జగన్ మోహన్ రెడ్డి
    మానస రాధాకృష్ణన్
    Y. S. భారతి
    ధనుంజయ్ ప్రభునేఎన్.చంద్రబాబు నాయుడు
    వాసు ఇంటూరి
    కోట జయరామ్
    రేఖా ప్రకాష్
    సురభి ప్రభావతి
    ఎలెనా తుతేజా
    సిబ్బంది
    రామ్ గోపాల్ వర్మ
    దర్శకుడు
    దాసరి కిరణ్ కుమార్నిర్మాత
    బాలాజీసంగీతకారుడు
    రామ్ గోపాల్ వర్మ
    కథ
    సజీష్ రాజేంద్రన్సినిమాటోగ్రాఫర్
    మనీష్ ఠాకూర్ఎడిటర్ర్
    కథనాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి  ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు. భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana) శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చారీ 111 (Chaari 111) స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateAmbajipeta Marriage Band MovieTeluguAhaMarch 01Indigo MovieIndonesian CinemaNetflix Feb 27American Conspiracy: The Octopus MurdersSeries EnglishNetflix Feb 28Code 8 Part 2MovieEnglishNetflix Feb 28The Mire Season 3Series PolishNetflix Feb 28A Round of ApplauseSeriesTurkishNetflix Feb 29Man SooangMovieThaiNetflix Feb 29The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix Feb 29Furies SeriesFrenchNetflix Feb 29Mamla Legal HighSeriesHindiNetflix March 01My Name is Loh KiwonMovieKoreanNetflix March 01Shake, Rattle & Roll: ExtremeMovieTagalogNetflix March 01Somebody Feed Phil Season 7 SeriesEnglishNetflix March 01Space ManMovieEnglishNetflix March 01The Pig The Snake and the PigeonMovieMandarinNetflix March 01The Netflix SlamMovieEnglishNetflix March 03Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01Wedding Impossible SeriesKoreanAmazon PrimeFeb 26Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27Blue StarMovieTamilAmazon PrimeFeb 29Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29Iwaju SeriesEnglishDisney+hotstarFeb 28  ShogunSeriesEnglishDisney+hotstarFeb 28Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01Sunflower Season 2SeriesHindiZee 5March 01Five Nights at Freddy's MovieEnglishJio CinemaFeb 27
    ఫిబ్రవరి 26 , 2024
    మానస రాధాకృష్ణన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మానస రాధాకృష్ణన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మానస రాధాకృష్ణన్  భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2022లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం హైవే (2022)తో ఆమె తెలుగుతెరకు పరిచయం అయింది. ఆమెను తిరిగి రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం చిత్రంలో వైఎస్ భారతి పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఈ పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మానస రాధాకృష్ణన్ పుట్టిన తేదీ? సెప్టెంబర్ 29, 1998 మానస రాధాకృష్ణన్ ఎక్కడ పుట్టింది? ఎర్నాకుళం, కేరళ మానస రాధాకృష్ణన్ తెలుగులో నటించిన తొలి సినిమా? హైవే(2022) మానస రాధకృష్ణన్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా? వ్యూహం(2024). ఈ చిత్రంలో వైఎస్ భారతి క్యారెక్టర్‌లో నటించింది. మానస రాధాకృష్ణన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  మానస రాధాకృష్ణన్‌ తల్లిదండ్రుల పేర్లు? శ్రీకళ రాధాకృష్ణన్, VK రాధకృష్ణనన్ మానస రాధాకృష్ణన్ అభిరుచులు? క్లాసికల్ డ్యాన్సింగ్, కుకింగ్, గీటార్ వాయించడం మానస రాధాకృష్ణన్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ మానస రాధాకృష్ణన్‌కు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ మానస రాధాకృష్ణన్ ఏం చదివింది? కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ మానస రాధాకృష్ణన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. మానస రాధాకృష్ణన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/me.radhakrishnan/?hl= https://www.youtube.com/watch?v=KlyWpYN2XrY
    ఏప్రిల్ 29 , 2024
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : అజ్మల్‌ అమీర్‌, మానస రాధాక్రిష్ణన్‌, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్‌ ప్రభూనే, కోటా జయరామ్‌, ఎలెనా టుతేజా తదితరులు దర్శకుడు : రామ్‌గోపాల్‌ వర్మ సంగీతం : బాలాజీ సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్‌ ఎడిటింగ్‌ : మనీష్‌ థాకూర్‌ నిర్మాత : దాసరి కిరణ్‌ కుమార్‌ టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్‌ (ధనుంజయ్‌ ప్రభునే), పవన్‌ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్‌ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే వైఎస్‌ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్‌ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్‌ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్‌ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్‌ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్‌ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్‌ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ పాత్రకు పాత్రకు మైలేజ్‌ ఇస్తూ.. చంద్రబాబు, పవన్‌ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్‌ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది. టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్‌ రాజేంద్రన్‌ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్‌ అజ్మల్‌ అమీర్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంద్వితీయార్థంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 02 , 2024
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్‌ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్‌ అందుకున్న ప్రభాస్‌ బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ ఫుల్‌ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్‌ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే! హీరో ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్‌ (2023) ముందు వరకూ ప్రభాస్‌ ఒక్కో  చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్‌ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్‌ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్‌ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్‌ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్‌ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చూస్తూ దూసుకెళ్తున్నాడు.  సూపర్‌ స్టార్‌ కృష్ణ వ్యూహం! ప్రభాస్‌ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్‌ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్‌ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్‌’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ మారుతీతో 'రాజాసాబ్‌' అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్‌ కల్లా సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్‌'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.  దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్ బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి  ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
    ఆగస్టు 31 , 2024
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్‌ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. క‌థ వాస్తు (చైత‌న్య‌రావు), వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) తాత మనవళ్లు. లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్‌ వేస్తారు. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్‌ కార్పొరేట‌ర్ కావాల‌ని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tharun bhascker) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవ‌స‌రం పడటంతో నాయుడు, జీవన్‌ కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎలా సాగిందంటే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి వచ్చిన షార్ప్ షూట‌ర్స్‌ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి.  బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది.  ఎవరెలా చేశారంటే? ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ ఈ సినిమాలో న‌టుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీ టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హీరో చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్, గెటప్‌ శీను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా సినిమాలో న‌వ్విస్తాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌, సంగీతం, మాట‌ల‌ు, పాత్ర‌ల హావ‌భావాల‌తో ఆయన న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ ఆయన స‌న్నివేశాల్ని న‌డిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా ప్రేక్ష‌కుల్ని మాత్రం కడుపుబ్బా  నవ్వించడంలో తరుణ్ భాస్కర్‌ మరోమారు విజయం సాధించాడు.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ న‌టులు హాస్య సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్‌ ఊహకందే కథనంరొటిన్‌ స్టోరీ రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన  చిత్రాలు ఇవే!
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన  చిత్రాలు ఇవే!
    సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్‌ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్‌ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  యాత్ర (Yatra) దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.  ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్‌.. ఎన్టీఆర్‌ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్‌ సాయంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్‌ తెరపై ఆవిష్కరించారు.  లక్ష్మీస్ ఎన్టీఆర్‌ (Lakshmi's NTR) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు. అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu) 2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.  జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana) తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  యాత్ర 2 (Yatra 2) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్‌ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.  వ్యూహాం (Vyuham) వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.  శపథం (Sapadam) 'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్‌ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.  రజాకార్‌ (Razakar) సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.  రాజధాని ఫైల్స్‌ (Rajadhani Files) గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్‌ పుష్పరాజ్‌, విశాల్‌ పతి, వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.  లీడర్‌ (Leader) శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.  భరత్‌ అనే నేను (Bharath Ane Nenu) మహేష్‌ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.  నోటా (Nota) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్‌ చిత్రం ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్‌ (విజయ్‌).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్‌ చేసింది. 
    మార్చి 13 , 2024
    <strong>Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!</strong>
    Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్‌ మైథాలజీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్‌, హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్‌ ప్రభాస్‌ను మెగాస్టార్‌ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.&nbsp; ‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’! ప్రభాస్‌ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్‌ అని తెలియకుండా ఈ సెట్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్‌ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్‌ వేశారని టాక్‌. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్‌ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.&nbsp; కల్కి తర్వాత విశ్వంభరే టాప్‌! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్‌ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్‌ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను మెగాస్టార్‌ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.&nbsp; మెగాస్టార్ అసంతృప్తి లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'విశ్వంభర' సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్‌ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్‌ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్‌ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్‌ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. View this post on Instagram A post shared by Kunal Kapoor (@kunalkkapoor)
    ఆగస్టు 03 , 2024
    <strong>Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?</strong>
    Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్‌ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ - హరీష్‌ శంకర్‌ కాంబోలోని ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్‌ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఓ వైపు ప్రమోషన్స్‌.. మరోవైపు డిప్రెషన్‌! ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) టీమ్‌ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్‌ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్‌ &amp; కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్‌ మీట్‌ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్‌ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్‌ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్‌ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.&nbsp; వెనక్కి తగ్గని బచ్చన్‌ టీమ్‌! పంద్రాగస్టు రోజున ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్‌ కాకుండా ఉండేందుకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్‌ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్‌ టీమ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్‌’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీమ్‌ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.&nbsp; వ్యూహామా లేదా గందరగోళమా? పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్‌ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్‌ (ట్రైలర్‌, టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్‌ చేయాలని ఇస్మార్ట్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు&nbsp; తెలుస్తోంది. గతంలో ‘లైగర్‌’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ ఇచ్చి చేతులు కాల్చుకున్న ‌నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్‌ టీమ్‌ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్‌ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్‌ షురూ కాలేదని చెబుతున్నారు.&nbsp; ఆ ఇష్యూ వల్లే రిలీజ్‌ చేస్తున్నాం: హరీశ్‌ శంకర్‌ రీసెంట్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ప్రమోష‌న్స్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ హ‌రీశ్ శంక‌ర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుద‌ల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్ట‌ర్ అడుగ‌గా హరీశ్‌ శంకర్‌ సమాధానం ఇచ్చారు. 'పూరితో నేను పోల్చుకోలేను. ఆయ‌న ఒక దిగ్గజం. ఆయ‌న‌తో నా సినిమా వ‌స్తుండ‌టం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావ‌డం వెనుక ముఖ్య కార‌ణం ఓటీటీ ఇష్యూ ఉండ‌డం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి స‌ర్‌కి ఎలాంటి గొడ‌వ‌లు లేవు’ అంటూ హరీశ్ శంక‌ర్ చెప్పుకొచ్చారు.
    ఆగస్టు 01 , 2024
    Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
    Kalki 2898 AD: రామ్‌చరణ్‌ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్‌.. డైరెక్టర్‌ ప్లాన్‌ అదేనా?
    పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్‌.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్‌ వైడ్‌గా సినిమాపై అటెన్షన్‌ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్‌ షురూ చేశారు.&nbsp; క్లింకారకు స్పెషల్‌ గిఫ్ట్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్‌ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు&nbsp; గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.&nbsp; చిన్నారులపై ఫోకస్‌ సాధారణంగా ఏ సినిమా మేకర్స్‌ అయినా రిలీజ్‌ సందర్భంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్‌ చేస్తూ 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్‌ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్‌ గిఫ్ట్స్‌ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.&nbsp; కారణం ఇదేనా! ‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్‌, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్‌ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్‌ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్‌ సిరీస్‌ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్‌ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్‌, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.&nbsp; కల్కి రన్‌టైమ్‌ లాక్‌? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్‌ టైమ్‌ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్‌ సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp;
    జూన్ 03 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో&nbsp; పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987&nbsp; పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.&nbsp; పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.&nbsp; పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.&nbsp; పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ (Save The Tigers S1 &amp; S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.&nbsp; పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
    Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్‌?
    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మ‌రో అత్యున్న‌త పౌర పుర‌స్కారం వ‌రించనున్నట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ద్మ‌విభూష‌ణ్ (Padma Vibhushan 2024) అవార్డుకు చిరంజీవి ఎంపికైన‌ట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో భారత రత్న(bharat ratna) తర్వాత పద్మవిభూషణ్‌ను రెండో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అయితే చిరంజీవికి అవార్డు గురించి&nbsp; గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) అధికారిక ప్రకటన రానున్న‌ట్లు స‌మాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప‌ద్మ అవార్డ్స్ లిస్ట్‌లో ఇప్పటికే చిరంజీవి పేరు చేరిపోయినట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.&nbsp; పురస్కారానికి కారణమిదే! సినీ రంగానికి చిరు చేసిన సేవలతో పాటు కొవిడ్‌ కాలంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌ను చిరంజీవి ఆదుకున్నారు. నిత్యావ‌స‌రాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. సామాన్య పౌరుల కోసం అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ స‌దుపాయాల‌ను ఉచితంగా క‌ల్పించి పలువురికి ప్రాణం పోశారు. వీటన్నింటిని గమనించిన కేంద్రం.. మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం (మెుదటిది భారతరత్న) ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.&nbsp; అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా! కాగా, ఇప్ప‌టికే చిరంజీవి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అందుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో చిరు ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఇప్పుడు భాజపా ప్ర‌భుత్వం ఆయ‌న్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ సంబ‌రాల్లో మునిగిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవికి ఉన్న మానవత్వం, గొప్ప మనసుకు కేంద్రం ఇస్తున్న కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.&nbsp; పొలిటికల్‌ వ్యూహాం ఉందా? చిరంజీవికి పద్మవిభూషణ్‌ ఇచ్చే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ మెుదలైంది. కేంద్రంలోని భాజపా కొన్ని ప్రయోజనాలను ఆశించే చిరుకు పద్మవిభూషణ్‌( Chiranjeevi Padma Vibhushan) ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చిరుకు పద్మవిభూషణ్‌ ప్రకటించి పొలిటికల్‌గా మరింత మైలేజ్‌ పెంచుకోవాలన్నది భాజపా వ్యూహామని అంటున్నారు. ఏపీలో చిరు సోదరుడు పవన్‌ ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. చిరుకి జాతీయ పురస్కారం ఇచ్చి తెలంగాణలోని మెగా ఫ్యాన్స్‌ను ఆకర్షించాలని భాజపా భావిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp;&nbsp; చిరు బిజీ బిజీ.. ప్ర‌స్తుతం చిరంజీవి ‘విశ్వంభ‌ర’ మూవీతో బిజీగా ఉన్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రూ.100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. విశ్వంభ‌ర‌లో చిరంజీవికి జోడీగా త్రిష న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రిష‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో న‌టిస్తార‌ని అంటున్నారు. వారు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.
    జనవరి 19 , 2024
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్‌ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.&nbsp; ‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్‌. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; టీం సభ్యుల ప్రచారం.. సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.&nbsp; కెమెరా.. సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్‌ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.&nbsp; సరికొత్తగా ప్రభాస్.. సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.&nbsp; https://twitter.com/Attitudist/status/1671201399584227328 మ్యూజిక్ కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ&nbsp; https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
    జూన్ 21 , 2023
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్‌ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; సుహాస్‌ యువ నటుడు సుహాస్‌ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్‌.. తానొక హీరో మెటీరియల్ ‌అని నిరూపించుకున్నాడు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌’, ‘అంజాబీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ వంటి హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్‌ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్‌ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్‌ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్‌ స్టార్‌ అవుతాడని అంటున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’తో స్టార్‌ హీరోగా మారిన విజయ్‌.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్‌ సొంతం. ప్రస్తుతం సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్‌ మార్కెట్‌ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్‌ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్‌ హిట్‌ లభిస్తే విజయ్‌ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌ను రూల్‌ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో రూ.100 కోట్ల క్లబ్‌లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, రైటింగ్‌ స్కిల్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్‌ చేయడంలో యూత్‌ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్‌ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్‌’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్‌ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; నవీన్ పొలిశెట్టి ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్‌ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్‌లో కామెడీ స్టార్‌ అనగానే అందరికీ నవీన్‌ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్‌ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్‌ తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్‌ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్‌ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఒక సాలిడ్‌ హిట్‌ లభిస్తే నవీన్‌ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తేజ సజ్జ యంగ్‌ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్‌’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాందించిన ఈ యంగ్‌ హీరో.. టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్‌ యోధ’ చిత్రం కూడా&nbsp; సాహసోపేతమైన కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్‌ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.&nbsp; అడవి శేషు యువ హీరో అడవి శేషు.. యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్‌ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్‌ బాయ్‌, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్‌ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం&nbsp; కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్‌: సెకండ్‌ కేసు’, ‘మేజర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్‌లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్‌లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌గా మారే అవకాశముంది. ప్రియదర్శి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్‌లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులను ప్లాన్‌ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్‌ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp;
    ఏప్రిల్ 18 , 2024
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్‌, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లు, సక్సెస్‌ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్‌ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్‌ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ‌అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్‌ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; మంజూష (Manjusha) హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్‌ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.&nbsp; వర్షిణి (Varshini) అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో&nbsp; యాంకర్‌ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్‌’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్‌ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.&nbsp; విష్ణు ప్రియ (Vishnu Priya) తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్‌ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; అషూ రెడ్డి (Ashu reddy) ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్‌ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్‌ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.&nbsp; సౌమ్యరావు (Sowmya rao) జబర్దస్త్‌ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్‌ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.&nbsp; శ్యామల (Shyamala) అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది. దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu) కెరీర్‌ ప్రారంభంలో ఓ న్యూస్‌ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.&nbsp; అనసూయ (Anasuya) యాంకర్‌ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్‌ హిట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్‌ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్‌ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; రష్మి (Rashmi) జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మరో యాంకర్‌ రష్మి. జబర్దస్త్‌ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.&nbsp;&nbsp; శ్రీముఖి (Srimukhi) యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్‌ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్‌ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.&nbsp; వింధ్య (Vindhya) తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్‌ ఈమెనే. ఐపీఎల్‌ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.&nbsp; రచిత (Rachitha) ప్రముఖ సీరియల్‌ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్‌ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్‌ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.&nbsp; పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty) బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్‌ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్‌ మహిళా’, ‘క్యాష్‌’ వంటి టెలివిజన్‌ షోలలోనూ ఈమె పాల్గొంది. ప్రేమి విశ్వనాథ్‌ (Premi Viswanath) ‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్‌ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్‌ షోలలోను కనిపించి సందడి చేసింది.&nbsp; ప్రీతి అస్రాని (Preeti Asrani) గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్‌’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalakshmi Sarathkumar) ప్రముఖ స్టార్‌ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్‌ అరింధాల్‌' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్‌ తమిళ్‌ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్‌' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) కన్నడలో బాగా పాపులర్‌ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; దీపికా దాస్‌ (Deepika Das) కర్ణాటకకు చెందిన దీపికా దాస్‌.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్‌ గర్ల్‌' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.&nbsp;
    ఫిబ్రవరి 22 , 2024
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత
    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు సమంత ఇచ్చి క్రేజీ ఆన్సర్స్‌ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌: శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్‌. నా ప్రశ్న ఏంటంటే మనం కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నాం? సామ్‌: కాంగ్రాట్యూలేషన్స్‌.... ‘గుమ్రా’ బ్యూటిఫుల్‌ మృణాల్‌ ఠాకూర్‌. నీ ఆలోచన చాలా నచ్చింది. మనం చేద్దాం. https://twitter.com/Samanthaprabhu2/status/1645087094765932545 నెటిజన్‌: మీ నిజమైన అభిమాని కోసం ఒక్క మాటలో ఏం చెబుతారు?&nbsp; సామ్‌: నిన్నటి వరకు స్ట్రేంజర్.. ఇవాళ కుటుంబ సభ్యుడు https://twitter.com/Samanthaprabhu2/status/1645082714532642816 నెటిజన్: మీకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? ఎన్నో సమస్యలు ఉన్నా మీరు ఎలా మూవ్‌ ఆన్‌ అవుతున్నారు.&nbsp; సామ్: ఎందుకంటే నా కథ ఎలా ముగియాలో నేను నిర్ణయిస్తాను కాబట్టి. https://twitter.com/Samanthaprabhu2/status/1645082177414246401 నెటిజన్‌: మీరు శాకుంతలం రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ షో చూసేందుకు దేవి 70MM థియేటర్‌కు వస్తారా? సామ్: రావొచ్చేమో? రావాలా..! https://twitter.com/Samanthaprabhu2/status/1645080239582871552 నెటిజన్‌: శాకుంతలం, ఖుషి, బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో&nbsp; శామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాముల్గా ఉండదు సామ్‌: ఈ ఏడాది కూడా చాలా క్రేజీగా గడవబోతోంది. https://twitter.com/Samanthaprabhu2/status/1645080067968749568 నెటిజన్‌ : నువ్వు టీనేజ్ అమ్మాయిగా ఎంతో క్యూట్‌గా ఉన్నావు. ఈ లుక్‌ను ఇలాగే కొంత కాలం కొనసాగించాలని భావిస్తున్నారా? సామ్‌: గ్లాసెస్‌.. నా కొత్త బెస్ట్‌ ఫ్రెండ్‌ https://twitter.com/Samanthaprabhu2/status/1645079008026189828 నెటిజన్‌: మీ ఉద్దేశంలో ఆత్మగౌరవం, సెల్ఫ్‌ లవ్‌ అంటే ఏంటి? సామ్‌ : మీ గురించి తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడనప్పుడు..మీరు మీతోనే సంతోషంగా ఉండగలిగినప్పుడు.. https://twitter.com/Samanthaprabhu2/status/1645078774957088774 నెజిజన్‌: మీరు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో జయపజయాలను ఎలా తీసుకుంటారు. మీ హార్ట్‌ అండ్ మైండ్‌లో ఎమోషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సామ్‌: విజయాల కంటే అపజయాలే మీకు ఎక్కువ గుణపాఠాలు నేర్పుతాయి. ఓటములే మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయి. https://twitter.com/Samanthaprabhu2/status/1645075968133050369 నెటిజన్‌ : మీరు ఓ బేబి సినిమా అప్పుడు నాకు రిప్లై ఇచ్చారు. అది హిట్ అయింది. ఇప్పుడు కూడా ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్‌ బస్టర్ అవుద్ది. సామ్‌: వామ్మో... అలాంటప్పుడు నీతో గొడవ పెట్టుకోకూడదు(నవ్వుతూ) https://twitter.com/Samanthaprabhu2/status/1645074391871668230
    ఏప్రిల్ 10 , 2023
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్‌ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్‌ పెళ్లి చేసుకున్నాడు.&nbsp; 2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్‌ మోహన్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్‌ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ కంట్లో పడ్డ దేవ్‌ మోహన్‌ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.&nbsp; ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది? దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్‌ ఫిల్మ్‌ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా. ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్‌ గురించి మీకు అవగాహన ఉందా? దేవ్‌: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్‌ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్‌ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు. ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్‌ ? దేవ్‌: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్‌ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్‌ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.&nbsp; ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు? దేవ్‌: డైలాగ్స్‌ను డైరెక్టర్‌ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్‌ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు&nbsp; ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.&nbsp; పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..              https://youtu.be/TrcHf9vOscM అవార్డులు దాసోహం... అరంగేట్రం సినిమాలతోనే దేవ్‌ మోహన్‌ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్‌ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌లో బెస్ట్‌ డెబ్యూట్‌ మేల్‌ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.&nbsp; దేవ్‌ మోహన్‌, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్‌ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    <strong>Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్‌ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; హరోం హర (Harom Hara) సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్‌ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ. ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ మ్యూజిక్‌ షాప్‌ మూర్తి (Music Shop Murthy) అజయ్‌ ఘోష్‌ (Ajay ghosh) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్‌ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్‌ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ. బూమర్ అంకుల్‌ (Boomer Uncle) తమిళ స్టార్ కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్‌'. ఇందులో ఓవియా, రోబో శంకర్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్‌ ఎమ్‌.ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'నేసమ్‌ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్‌ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ. హాట్‌స్పాట్‌ (Hotspot) గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్‌'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్‌ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.&nbsp; నాగేంద్రన్స్‌ హనీమూన్‌ (Nagendran's Honeymoons) నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్‌ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.&nbsp; బహిష్కరణ (Bahishkarana) ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో&nbsp; అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.&nbsp; https://twitter.com/i/status/1802226071795896339 త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper) ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్‌ సిరీస్‌ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్‌ అకెంటెంట్‌ త్రిభువన్‌ (మానవ్‌ కౌల్‌) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్‌ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్‌ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్‌ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ. https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
    జూలై 18 , 2024
    <strong>Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!</strong>
    Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!
    టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్‌ (Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; తాజా ఫిర్యాదులో ఏముందంటే? లావణ్య ఇచ్చిన లేటెస్ట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్‌ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. అంతకుముందు లావణ్య తన ఫిర్యాదులో వారిపై మరిన్ని అభియోగాలు మోపారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. రాజ్‌తరుణ్‌ కుటుంబానికి తన ఫ్యామిలీ రూ.70 లక్షలు ఇచ్చిందని లావణ్య తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని రెండో నెలలోనే అతడు అబార్షన్‌ చేయించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. సర్జరీకి సంబంధించిన ఆసుపత్రి బిల్లులు రాజ్‌ చెల్లించినట్లు చెప్పారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్‌ తన నుంచి దూరమయ్యాడని పోలీసులకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నటి మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. https://twitter.com/i/status/1811302046747803956 కీలక ఆధారాలు అందజేత! రాజ్‌తరుణ్‌ను హెచ్చరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియో క్లిప్స్‌పై లావణ్య స్పందించారు. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వంగా ఆడియో రికార్డ్‌ చేశారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా, రాజ్‌తరుణ్‌ విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తమ బెదిరింపు, చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్, టెక్నికీల్‌ ఎవిడెన్స్‌ను నార్సింగి పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1811055519525679537 లావణ్యనే బెదిరించింది : మాల్వీ నటుడు రాజ్‌తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని 6 నెలలుగా తాము మాట్లాడుకుందే లేదని ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తాను లావణ్యను బెదిరించలేదని, కనీసం ఆమె ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు లావణ్యనే తనకు కాల్‌ చేసి వేధించిందని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని లావణ్య మెంటల్‌గా హేరాస్‌ చేసిందని చెప్పారు. తన నెంబర్ బ్లాక్‌ చేస్తే ఆమె నేరుగా తన తల్లిదండ్రులకు కాల్‌ చేసి వాళ్లని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తన పేరెంట్స్‌ నెంబర్‌ ఎవరితోనూ షేర్‌ చేసుకోలేదని అయినా ఆమె వద్దకు ఎలా వచ్చిందని మాల్వీ ప్రశ్నించారు. లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్‌ కేవలం తనకు సహచర నటుడు మాత్రమేనని మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని మాల్వీ స్పష్టం చేశారు. అంతకుమించి అతడిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటర్యూలో వెల్లడించారు. తన సోదరుడు గురించి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు.&nbsp; https://twitter.com/i/status/1809555802203607322 లావణ్యపై ఫిర్యాదు మరోవైపు నటి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిల్మ్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మాల్వీ మల్హోత్ర ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టోలిచౌకి అజీజ్‌బాగ్‌కాలనీలోని విక్టోరియం ఆదిత్య ఎంప్రెస్‌ టవర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సోదరుడికి లావణ్య వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతుందని మాల్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఫిల్మ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&nbsp;
    జూలై 11 , 2024
    <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
    టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024

    @2021 KTree