రేటింగ్ లేదు
UATelugu
ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు.. అనుకోని సంఘటనల వల్ల శత్రువులుగా మారి తలపడుతారు. ఇదే ట్యాగ్ లైన్‌తో చిత్రం కథ రూపొందుతోందని రూమర్స్ ఉన్నాయి.వార్ 2 చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మితమవుతున్న చిత్రం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్య చోప్ర నిర్మిస్తున్నారు.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
How was the movie?
తారాగణం
ఎన్టీ రామారావు జూనియర్.
హృతిక్ రోషన్
కియారా అద్వానీ
జాన్ అబ్రహం
సిబ్బంది
అయాన్ ముఖర్జీదర్శకుడు
ఆదిత్య చోప్రా
నిర్మాతకథనాలు
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్.. పూర్తిగా లుక్ మార్చిన తారక్
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్రహ్మస్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖర్జీ.. ‘వార్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్, తారక్‌లకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
హృతిక్, తారక్ షూట్ ఎప్పుడంటే!
‘వార్ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.
గాయం నుంచి కోలుకున్న హృతిక్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్ 2’ షూట్ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.
https://twitter.com/i/status/1764908346640040382
‘వార్ 2’లో తారక్ గెటప్ అదేనా?
కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్.. లేటెస్ట్ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ‘వార్ 2’లోనూ తారక్ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘వార్ 2’ రిలీజ్ ఎప్పుడంటే?
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. అటు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ‘వార్ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది.
మార్చి 05 , 2024
జూ.ఎన్టీఆర్ కోసమే వార్ 2 క్యారెక్టర్ డిజైన్…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!
వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.
వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు రిజెక్ట్ చేసిన తర్వాతే వార్-2 ఎన్టీఆర్ వద్దకు చేరినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. వారు కాదనుకున్న కథ మా అన్న దగ్గరకు వచ్చిందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వార్-2 నిర్మాత ఇచ్చి క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. తమ హీరో వార్-2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ మూవీలో చేయనుండటం, అది కూడా దిగ్గజ నటుడు హృతిక్‌తో తెరను పంచుకోనుండటం ఎన్టీఆర్‌కు కలిసిరానుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రిలీజైన ‘వార్’ చిత్రం సూపర్ హిట్‌గాా నిలిచింది. తొలి పార్ట్‌లో హృతిక్‌తో పాటు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. డ్యాన్స్, ఫైట్లతో అదరగొట్టాడు. మరీ వార్-2లో ఎన్టీఆర్ ఎలా చేస్తాడన్న అంశం ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తారక్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే ఓ రెంజ్‌లో ఉంటుందని ఇప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్, ఎన్టీఆర్ నటన చూస్తే థియేటర్లలో ఎవరూ కుదురుగా కూర్చోలేరని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్స్ కూడా చెరిగిపోతాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
వార్-2లో ఎన్టీఆర్ పారితోషికానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రూ.100 కోట్లు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రూ.100 కోట్లు తీసుకుంటున్న టాప్ 5 సౌత్ స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ నిలవనున్నాడు. కాగా, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా కొరటాల శివతో చేస్తున్న NTR 30 సినిమా కోసం తారక్ రూ. 60 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5, 2024లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఏప్రిల్ 11 , 2023
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సిక్స్ ప్యాక్‌లో తారక్!
‘వార్ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘వార్ 2’లో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘వార్ 2’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్, తారక్ లాంటి టాప్ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు.
దేవర నుంచి ఫస్ట్ సింగిల్
ప్రస్తుతం తారక్ 'వార్ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
మే 18 , 2024
NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. హృతిక్ రోషన్‌తో తలపడనున్న తారక్..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.
అధికారిక ప్రకటన
తరణ్ ఆదర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.
ముందే తెలుసా?
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్ కపూర్, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.
బిజీబిజీగా జూ.NTR
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్ పూర్తైన వెంటనే వార్-2 సినిమాపై ఎన్టీఆర్ ఫోకస్ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
అతి పెద్ద సంస్థ
వార్-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సంస్థకు భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పఠాన్ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘వార్’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్ వర్సస్ పఠాన్’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 05 , 2023
Jr.NTR: తారక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. భీమ్ పాత్రలో తారక్ నటన చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2)లో తారక్ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తారక్ లుక్ పూర్తిగా మారిపోయింది. దీంతో తారక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? అన్న సందేహాలను సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
అసలేం జరిగిదంటే?
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' చిత్రం.. 2019లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్ 2’లో తారక్ నటిస్తుండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వార్ 2 షూటింగ్ కోసం ముంబయి వెళ్లిన తారక్‌తో ఈ బ్యూటీ ఓ సెల్ఫీ దిగింది. వీరిద్దరు జిమ్‌లో ఈ సెల్ఫీ దిగగా.. ఇందులో తారక్ చాలా యంగ్‌గా కనిపించాడు. ఈ ఫొటోలో తారక్ లుక్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తారక్.. ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఊర్వరి ఈ ఫోటోను ఫిల్టర్ చేసి పోస్టు చేసిందని తెలియడంతో అంతా నవ్వుకుని ఊరుకున్నారు. ఫిల్టర్ ద్వారా నీ అందం పెంచుకునేందుకు.. మా తారక్ అన్నను ఇలా మార్చేశావా? అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela)
తారక్ జోడీగా యానిమల్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri).. యానిమల్ చిత్రంలో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రే ఈ భామకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారంలో 'వార్ 2' కోసం దీప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే త్రిప్తిని తారక్‌కు జోడీగా తీసుకున్నారా? లేదా హృతిక్ రోషన్‌కి జంటగానా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైన నేపథ్యంలో త్రిప్తి దిమ్రీ తారక్‌కు జోడీగా నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పది రోజులు అక్కడే..
యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ 'వార్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తారక్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఇండియన్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం తారక్ రెండ్రోజుల క్రితం ముంబయిలో అడుగుపెట్టాడు. పది రోజుల పాటు అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. వార్ 2 కోసం తారక్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబయిలో తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 15 , 2024
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
ఈ జనరేషన్ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun), రామ్‌చరణ్ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్.. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
‘పుష్ప 2’ వాయిదా
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
రేసులో గేమ్ ఛేంజర్!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని దిల్‌రాజు ఫిక్స్ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్ బరిలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అల్లు vs మెగా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు ఆర్మీ సవాల్
ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్‌ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/madhavg_Indian/status/1801862004627366096
https://twitter.com/madhavg_Indian/status/1801824969023758738
https://twitter.com/DpAadhf/status/1785639853717082162
జూన్ 18 , 2024
JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.
హాలీవుడ్ ఫ్రాంఛైజీ జాన్ విక్ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.
2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.
లక్ష్యం
మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్ విక్ నుంచి ఇది నేర్చుకోవచ్చు.
నిబద్ధత
జాన్ విక్ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు.
కఠోర శ్రమ
లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.
అసలేంటిది?
నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.
హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం.
నమ్మకం
సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు.
మన పని
చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు.
తక్కువగా మాట్లాడు
సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు.
ప్లాన్ బి
చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా.
కుదరదు
ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.
మార్చి 21 , 2023
సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ
ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్‌లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.
ట్విటర్ వార్
గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ ఏదో విధంగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
హ్యాష్‌ట్యాగ్స్‌తో హల్‌చల్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.
https://twitter.com/i/status/1632680528578228224
అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన స్క్రీన్ షాట్లు తీసి తెగ షేర్ చేశారు.
(1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter
షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్‌లో ట్రెండ్ చేయగా.. వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20
యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1633007975412400132
టైటిల్‌పై రచ్చ
మరోవైపు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్‌లో RC15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్‌తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు
RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టైటిల్ ఇదేనా?
సినిమా టైటిల్ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1633351074508845058
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/i/status/1633737854919606273
ఫ్యాన్స్ నిరాశ
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్‌రాజు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
మార్చి 09 , 2023
This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం
స్కంద (Skanda movie)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
చంద్రముఖి 2 (chandramukhi 2)
రాఘవ లారెన్స్, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2. ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War)
కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
పెదకాపు-1 (Peddha Kapu 1)
ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1)
TitleCategoryLanguagePlatformRelease DateLittle Baby Bum: Music Time SeriesEnglishNetflixSept 25The Devil's Plan SeriesKoreanNetflixSept 26Forgotten LoveMoviePolishNetflixSept 27OverhaulMoviePortugueseNetflixSept 27Sweet Flow 2 MovieFrenchNetflixSept 27The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27Ice Cold: Murder, Coffee and Jessica Wangso MovieEnglishNetflixSept 28Love is in the AirMovieEnglishNetflixSept 28Fair Play MovieEnglishNetflixSept 29Choona SeriesHindiNetflixSept 29Nowhere MovieSpanishNetflixSept 29Reptile MovieEnglishNetflixSept 29Khushi MovieTeluguNetflixOct 01Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28Kumari SrimatiSeriesTelugu Amazon PrimeSept 28Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29El-PopSeriesSpanishHotstarSept 27The Worst of EvilSeriesEnglishHotstarSept 27King of KotaMovieTelugu Dubbed HotstarSept 28Launchpad Season 2SeriesEnglishHotstarSept 29Tum Se Na Ho Payega MovieHindiHotstarSept 29Papam Pasivadu SeriesTeluguAhaSept 29Dirty HariMovieTamilAhaSept 29Charlie ChopraSeriesHindiSony LivSept 27Bye! MovieTamilSony LivSept 29Agent MovieTeluguSony LivSept 29Angshuman MBA MovieBengaliZee5Sept 29Blue BeetleMovieEnglishBook My ShowSept 29
సెప్టెంబర్ 25 , 2023
Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో 'పుష్ప 2' తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్, అల్లు అర్జున్ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
సుకుమార్ - బన్నీ మధ్య కోల్డ్‌వార్?
'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గడ్డం తీసేసిన బన్నీ
సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.
https://twitter.com/i/status/1813405877908726058
'పుష్ప 2' మళ్లీ వాయిదా?
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం 'పుష్ప 2' అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం 'పుష్ప 2' రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘పుష్ప 2’కి విలన్ కష్టాలు!
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) 'పుష్ప 2'లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నో చెప్పిన జాన్వీ కపూర్
పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.
జూలై 17 , 2024
Allu Arjun: చిరంజీవికి ఎదురుపడలేకే బన్నీ రాలేదా?
'పుష్ప' (Pushpa: The Rise) సినిమా సక్సెస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్పరాజ్‌గా తన నటనతో మెస్మరైజ్ చేసిన బన్నీ, పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మరోమారు తెలుగు ఆడియన్స్‌తో పాటు దేశంలోని సినీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక 'పుష్ప 2' షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ నెక్ట్స్ సినిమా ఉండొచ్చని ప్రస్తుతం అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.
అట్లీ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన బన్నీ!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు కొద్ది నెలల క్రితం నుంచి ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. 'పుష్ప 2' షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ మెుదలవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ లాంటి బ్లాక్ బాస్టర్ తీసిన అట్లీతో బన్నీ సినిమా చేయనుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లెటేస్ట్ బజ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మనసు మార్చుకోవడం వల్లే ఈ సినిమా అటకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు త్వరలోనే తేలనుంది.
సల్మాన్‌తో అట్లీ సినిమా!
బన్నీతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారడంతో డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓ మూవీ కూడా ఓకే అయిందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో అట్లీ సినిమా ఫిక్స్ అయ్యిందంటూ బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అట్లీ చెప్పిన స్టోరీ సల్లూ భాయ్‌కి విపరీతంగా నచ్చిందని, అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. షారుక్ ఖాన్‌తో వర్క్ చేసిన అనుభవం అట్లీకి ఉండటంతో ప్రాజెక్ట్ ఓకే చేసేందుకు పెద్దగా సమయం కూడా తీసుకోలేదని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సల్మాన్‌తో పాటు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో అట్లీ ఉన్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/MovieTamil4/status/1830519679502459146
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ!
అట్లీ ప్రాజెక్ట్ సైడ్ అయిపోవడంతో బన్నీ నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే చేయనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కాన్సెప్ట్‌ను లాక్ చేసేందుకు బన్నీ-త్రివిక్రమ్ ఏడాదిన్నర సమయం తీసుకున్నట్లు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నడూ చూడని సరికొత్త జానర్‌లో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు తీసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్ జానర్‌ని టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ అండ్ టీం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
బాలయ్య ఫంక్షన్‌కు డుమ్మా!
మెగా-పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపిస్తారని అంతా భావించారు. వారిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్ వార్స్ కూడా కాస్త తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం (సెప్టెంబర్ 1) జరిగిన ఈ వేడుకకు అనూహ్యంగా బన్నీ హాజరు కాలేదు. నిజానికి బాలకృష్ణకు అల్లు అరవింద్, బన్నీ చాలా క్లోజ్. ‘ఆహా’లో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమాన్ని బాలయ్య రక్తికట్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే కార్యక్రమంలో బన్నీ-బాలయ్య సాన్నిహిత్యాన్ని కూడా అంతా చూశారు. అయినప్పటికీ బన్నీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ వస్తున్నారన్న సమాచారం నేపథ్యంలోనే బన్నీ కావాలనే హాజరు కాలేదన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 03 , 2024
Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్!
మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
నిర్మాత ఏమన్నారంటే!
జూ.ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆయ్' (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్ క్లౌడ్స్’ అని సమాధానం ఇచ్చారు.
వివాదానికి కేంద్ర బిందువు ఇదే!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.
అల్లు అర్జున్ vs రామ్‌చరణ్
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కూడా ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్ ఛేంజర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద ‘బన్నీ vs చరణ్’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సుకుమార్‌తో కోల్డ్‌వార్?
'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
https://twitter.com/i/status/1813405877908726058
జూలై 20 , 2024
War 2 Movie Story: సోషల్ మీడియాలో ‘వార్ 2’ స్టోరీ లీక్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కథ!
టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'వార్' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తారక్ షూట్ హైదరాబాద్‌లోనే!
'వార్ 2'లో హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్‌లో వీటిని ఫినిష్ చేశారు. ప్రస్తుతం తారక్ రోల్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ అతడే?
'వార్ 2' చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్‌లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్ రోషన్ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'వార్ 2'లో మరో స్టార్ హీరో!
ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
మార్చి 25 , 2024
War 2: బాలీవుడ్ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్ రెమ్యూనరేషన్.. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ సోలో చిత్రం!
'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న 'దేవర' (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్‌లో చేయబోతున్న 'వార్ 2' (War 2) చిత్రం. ముఖ్యంగా 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో ఈ సినిమా నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
60 రోజుల్లో షూటింగ్ పూర్తి!
'వార్ 2' చిత్రంలో తారక్, హృతిక్ రోషన్ పాత్రల షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న 'వార్ 2' చిత్ర షూటింగ్‌ను ఎక్కువ భాగం స్టూడియోస్‌లోనే తీయనున్నారట. హృతిక్ పార్ట్‌ను జూన్ కల్లా, తారక్ పార్ట్‌ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
‘రా ఏజెంట్’గా ఎన్టీఆర్!
యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న 'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్ ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తారక్ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్ 2’ టీమ్, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తారక్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
'వార్ 2' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్ రెమ్యూనరేషన్ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్ రోల్ కోసం తారక్ ఈ రేంజ్‌లో ఛార్జ్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
'వార్ 2' కోసం సరికొత్త టెక్నాలజీ!
'వార్ 2' సినిమా కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్ డోర్‌లో వచ్చే ఎన్టీఆర్, తారక్ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తిగా బాడీ డబుల్స్‌తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్, హృతిక్ ముఖాలను స్వాప్ చేస్తారట. గ్రాఫిక్స్ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్ చెబుతోంది.
మార్చి 13 , 2024
This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్ హైమర్’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
ఓం భీమ్ బుష్..
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్..’ (Om Bheem Bush). నో లాజిక్ ఓన్లీ మేజిక్ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనన్య
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హద్దులేదురా
ఆశిష్ గాంధీ, అశోక్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓపెన్ హైమర్
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.
సుందరం మాస్టార్
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ కీలకపాత్రలు పోషించారు.
అబ్రహాం ఓజ్లర్
జయరాం (Jayaram), అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘అబ్రహాం ఓజ్లర్’ (Abraham Ozler OTT). మిధున్ మేనుయేల్ థామస్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu ETV WinMarch 22
మార్చి 18 , 2024
War 2: బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్.. దీనికి అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ తారలు సైతం ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్ స్క్రీన్ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తారక్.. తనని తాను తగ్గించుకుంటున్నాడా?
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి చేయనున్న వార్ - 2 చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్‌చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమాలో హృతిక్ పాత్రే హైలైట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
రెమ్యూనరేషన్ తక్కువే!
ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే RRR చిత్రానికే ఎన్‌టీఆర్ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్-2 చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్‌ను అభిమాన హీరోను నెగిటివ్ రోల్‌లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్ రెమ్యూనరేషన్ ఎక్కువనే చెప్పాలి.
లాభాల్లో షేర్..
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ నేరుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా వార్-2 సినిమా లాభాల్లో షేర్ తీసుకునేలా డీల్ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా కోసం తారక్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించారని గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్ చేయడం వల్లే తారక్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను యాష్ రాజ్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్‌ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్ పెట్టినట్లైంది. ఇకపోతే వార్ 2 సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
శరవేగంగా NTR 30 షూటింగ్
ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్‌లో తారక్ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మే 10 , 2023
Jr NTR తీరులో మార్పు.. హిందీ స్టార్లతో కలిసి నైట్ డేట్!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్‌చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్‌లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్‌లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్లాడు. తారక్‌తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1784800640054784018
https://twitter.com/i/status/1784782516681073070
https://twitter.com/i/status/1784737249713619077
https://twitter.com/i/status/1784857172771279114
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్‌తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్‌ను బందించబోయారు. దీంతో తారక్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్‌ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్‌కు కోపం వచ్చింది.
https://twitter.com/i/status/1783491705049886808
ఏప్రిల్ 29 , 2024
Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.
‘జైలర్’ డైరెక్టర్‌తో పాన్ ఇండియా చిత్రం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్, జైలర్ హిట్స్‌తో నెల్సన్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
2026 వరకూ ఆగాల్సిందే!
తారక్ - నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్ 'వార్ 2' (War 2) పెండింగ్ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్ సైతం ‘జైలర్ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్ 2’ షూటింగ్ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.
మా స్ట్రెంత్ అతడే: తారక్
'దేవర' బ్లాక్ బాస్టర్ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్యాణ్ రామ్ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు.
బంగ్లాదేశ్ రైతుగా జూ.ఎన్టీఆర్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్ ఫిక్సయ్యిందా?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 05 , 2024
Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా!
జూ.ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్ అడిగిన ప్రశ్నలకు తారక్ తనదైన శైలిలో జవాబిచ్చారు.
ఫన్నీ చిట్‌చాట్..
యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో 'దేవర' టీమ్ చిట్ చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సందీప్ రెడ్డి వంగాతో పాటు తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్ మాట్లాడుతూ దేవర యాక్షన్ డ్రామా అని, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్ గురించి చెప్పారు. 35 రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. దానికి తారక్ యానిమల్ రన్ టైమ్ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.
https://twitter.com/i/status/1834829086482698288
'దేవర' ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు?
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 'దేవర'పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఈవెంట్
‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది.
సందీప్ మూవీలో తారక్!
ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో తారక్ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.
సెప్టెంబర్ 14 , 2024
Jr NTR : సౌమ్యుడైన తారక్‌కు కోపం తెప్పించారు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)కు మంచి నటుడిగానే కాదు.. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా ఎంతో పేరుంది. తారక్ అనవసరంగా ఏ వివాదాలలోకి తలదూర్చడు. పైగా ఆడియో ఫంక్షన్లలో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తుంటారు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు తారక్ ఎందుకు కోపడ్డాడు? కారణం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
తారక్‌కు కోపం వచ్చింది!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ కాంబోలో ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ తారక్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు వెళ్తున్న తారక్‌ను ఫొటో గ్రాఫర్స్ ఫాలో అవుతూ అతడి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయబోయారు. అది గమనించిన ఎన్టీఆర్‌కు కోపలు కట్టలు తెచ్చుకుంది. ఓయ్ అంటూ ఒక్కసారిగా కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు.
https://twitter.com/i/status/1783491705049886808
కోపానికి కారణం ఇదే!
‘వార్ 2’ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇందులో తారక్ పాత్ర చాలా కీలకం కావడంతో ఆయన లుక్స్ రివీల్ చేయడానికి చిత్ర యూనిట్ సంసిద్ధంగా లేదు. కానీ, ఇటీవల షూటింగ్‌లో తారక్ లుక్స్‌కు సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి. అవి జాతీయ స్థాయిలో వైరల్‌గా మారాయి. దీంతో ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని మేకర్స్ యూనిట్ మెుత్తానికి సూచించారట. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడం ఆయన కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందుకే అతడు ఫొటోగ్రాఫర్లను విసుక్కున్నాడని అంటున్నారు.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'వార్' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఇటీవల ఓ ప్లాట్ నెట్టింట వైరల్ అయ్యింది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. హృతిక్-తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏప్రిల్ 27 , 2024