UATelugu2h 36m
ఇండియన్ ఇంటిలిజెన్స్ అధికారి అయిన కబీర్ (హృతిక్) తన టీంకి ద్రోహం చేసి.. దేశద్రోహిగా మారతాడు. అతడ్ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం అతడి బెస్ట్ స్టూడెంట్ అయిన ఖళీద్ (టైగర్ ష్రాఫ్)ను నియమిస్తుంది. ఈ గురుశిష్యుల యుద్ధంలో ఎవరు గెలిచారు? అసలు బెస్ట్ సోల్జర్ అయిన కబీర్ ఉన్నట్లుండి ద్రోహిగా ఎందుకు మారాడు? అనేది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
హృతిక్ రోషన్
టైగర్ ష్రాఫ్
వాణి కపూర్
అశుతోష్ రాణా
అనుప్రియా గోయెంకా
యశ్ రాజ్ సింగ్
దీపన్నిత శర్మ
సోనీ రజ్దాన్
ఆరిఫ్ జకారియా
సిబ్బంది
సిద్ధార్థ్ ఆనంద్
దర్శకుడుఆదిత్య చోప్రానిర్మాత
సంచిత్ బల్హరఅంకిత్ బల్హార
సంగీతకారుడువిశాల్-శేఖర్
సంగీతకారుడుఅబ్బాస్ టైరేవాలా
డైలాగ్ రైటర్కథనాలు
జూ.ఎన్టీఆర్ కోసమే వార్ 2 క్యారెక్టర్ డిజైన్…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!
వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.
వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు రిజెక్ట్ చేసిన తర్వాతే వార్-2 ఎన్టీఆర్ వద్దకు చేరినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. వారు కాదనుకున్న కథ మా అన్న దగ్గరకు వచ్చిందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వార్-2 నిర్మాత ఇచ్చి క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. తమ హీరో వార్-2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ మూవీలో చేయనుండటం, అది కూడా దిగ్గజ నటుడు హృతిక్‌తో తెరను పంచుకోనుండటం ఎన్టీఆర్‌కు కలిసిరానుంది. ఇప్పటికే బాలీవుడ్లో రిలీజైన ‘వార్’ చిత్రం సూపర్ హిట్‌గాా నిలిచింది. తొలి పార్ట్‌లో హృతిక్‌తో పాటు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. డ్యాన్స్, ఫైట్లతో అదరగొట్టాడు. మరీ వార్-2లో ఎన్టీఆర్ ఎలా చేస్తాడన్న అంశం ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తారక్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే ఓ రెంజ్లో ఉంటుందని ఇప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్, ఎన్టీఆర్ నటన చూస్తే థియేటర్లలో ఎవరూ కుదురుగా కూర్చోలేరని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దెబ్బకు ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ కూడా చెరిగిపోతాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
వార్-2లో ఎన్టీఆర్ పారితోషికానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రూ.100 కోట్లు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రూ.100 కోట్లు తీసుకుంటున్న టాప్ 5 సౌత్ స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ నిలవనున్నాడు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్గా కొరటాల శివతో చేస్తున్న NTR 30 సినిమా కోసం తారక్ రూ. 60 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5, 2024లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఏప్రిల్ 11 , 2023
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సిక్స్ ప్యాక్‌లో తారక్!
‘వార్ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్లో ఎన్టీఆర్‌కు గ్రాండ్ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘వార్ 2’లో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘వార్ 2’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్ను కత్రీనా కైఫ్ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్, తారక్ లాంటి టాప్ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు.
దేవర నుంచి ఫస్ట్ సింగిల్
ప్రస్తుతం తారక్ 'వార్ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
మే 18 , 2024
Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్, సాంగ్స్‌కు రీల్స్ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్లో హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున ఆడుతున్న సమయంలో ఎక్కువగా సినిమా రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్ షూట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
రాజమౌళిని ఫేవర్ కోరిన వార్నర్!
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం.. రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు.
https://twitter.com/CRED_club/status/1778703889715646779?
వార్నర్ రాక్స్.. రాజమౌళి షాక్స్!
ఒక వేళ తన సినిమాలో డేవిడ్ వార్నర్ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో అతడు నటిస్తే షూటింగ్ సెట్ ఎలా ఉంటుందోనని ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్.. ఇవన్నీ ఊహించుకొని దర్శకధీరుడు ఒక్కసారిగా భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’, ‘నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి’ అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు ఫేవర్స్ కూడా మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ లవర్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఏప్రిల్ 13 , 2024
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్డేట్.. పూర్తిగా లుక్ మార్చిన తారక్
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్రహ్మస్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖర్జీ.. ‘వార్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్, తారక్‌లకు సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
హృతిక్, తారక్ షూట్ ఎప్పుడంటే!
‘వార్ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్లో జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.
గాయం నుంచి కోలుకున్న హృతిక్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్ 2’ షూట్ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.
https://twitter.com/i/status/1764908346640040382
‘వార్ 2’లో తారక్ గెటప్ అదేనా?
కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్.. లేటెస్ట్ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ‘వార్ 2’లోనూ తారక్ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘వార్ 2’ రిలీజ్ ఎప్పుడంటే?
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. అటు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ‘వార్ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది.
మార్చి 05 , 2024
కల్పిక గణేశ్ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది!
]ఆమె కూడా సినిమాల్లో పాత్రలు వద్దు అది కాకుంటే వేరే పని చేసుకుంటానంటూ వివాదాస్పదంగా మాట్లాడారు.
ఫిబ్రవరి 13 , 2023
War 2: ‘వార్ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్ ఫొటో లీక్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడింది. ‘RRR’, 'దేవర' లాంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తారక్ సైతం షూటింగ్ జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్ నుంచి తారక్‌కు సంబంధించిన ఫొటో లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట హల్ చల్ చేస్తోంది.
స్టైలిష్ లుక్‌లో అదరహో
ప్రస్తుతం తారక్ ‘వార్ 2’ (War 2) షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్ స్పాట్ నుంచి తారక్ ఫొటో ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో తారక్ స్టైలిష్ లుక్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. లీకైన ఫొటోలో తారక్ సైడ్ లుక్ కనిపించింది. టీషర్ట్ మీద మిలటరీ తరహా గళ్ల చొక్క వేసి కనిపించాడు. అంతేకాదు షూటింగ్ కోసం వినియోగిస్తున్న గన్స్‌ను కూడా లీకైన ఫొటోల్లో గమనించవచ్చు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారింది. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలోనూ ‘వార్ 2’ షూటింగ్‌కి సంబంధించి తారక్ ఫొటోలు లీకయ్యాయి.
https://twitter.com/Brajm10/status/1849731080183513184
హాలీవుడ్ రేంజ్ ఎంట్రీ
'వార్ 2'లో తారక్ ఇంట్రడక్షన్ సీన్‌కు సంబంధించి బీ టౌన్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఇంట్రడక్షన్ సీన్‌ను దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సీన్లో యాక్షన్ డోస్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. తారక్ చేసే ఫైట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియన్స్ తప్పకుండా సర్ప్రైజ్ అవుతారని అంచనా వేస్తున్నాయి. అలాగే హృతిక్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు కూడా గూస్బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. యశ్‌రాజ్ సంస్థ ఇప్పటివరకూ నిర్మించిన స్పై యూనివర్స్‌లో 'వార్ 2' స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్.
షారుక్ స్పెషల్ రోల్?
‘వార్ 2’ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ వార్త కూడా బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ సినిమాలో స్పెషల్ క్యామియో ఇవ్వనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి షూట్ కూడా మెుదలైనట్లు చెబుతున్నారు. అంతేకాదు తారక్-షారుక్ మధ్య ఫేస్ టు ఫేస్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. హిందీలో ఫస్ట్ ఫిల్మ్‌తోనే హృతిక్, షారుక్ వంటి స్టాన్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ తారక్ రావడం నిజంగా గొప్ప విషయమే.
‘NTR 31’ లోడింగ్!
‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ నీల్ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్ రైతుగా తారక్ కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్ను కూడా ఈ మూవీ కోసం లాక్ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది.
అక్టోబర్ 25 , 2024
Tirumala Laddu : సినీ హీరోలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!
తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్‌కు వార్నింగ్!
తిరుమల లడ్డుపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన వివాదస్పద ట్వీట్‌పై పవన్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్‌కు సంబంధం ఏంటని నిలదీశారు. తిరుపతిలో మరోమారు అపవిత్రం జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఇస్లాంని నిందించానా? లేక క్రిస్టియానిటీని తప్పుబట్టానా? అంటూ పవన్ అన్నారు. హిందువుల దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? అంటూ ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏం జరిగింతో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు.
https://twitter.com/i/status/1838470602098913294
‘అపహాస్యం చేస్తే ఊరుకోను’
ప్రకాష్ రాజ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. ‘లడ్డు చాలా సెన్సిటివ్’ అంటూ జోకులు వేస్తున్నారని నటుడు కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. మరోమారు అలా అనొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండని సూచించారు.
https://twitter.com/i/status/1838465598713372823
‘నటుల కంటే సనాతన ధర్మమే గొప్పది’
టికెట్ల కోసం ఎన్నో ప్రయాశలు పడి సినిమా చూసే అభిమానులకు సైతం పవన్ చురకలు అంటించారు. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. వారు కూడా తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడాలని సూచించారు. సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడతారని, సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. హీరోల కంటే పైస్థాయిలో హిందూ ధర్మాన్ని చూడాలని, ఒక హీరోగా తానే ఈ విషయాన్ని చెబుతున్నానని సినీ లవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరన్న భావన సమాజంలో ఉందని పవన్ అన్నారు. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోవాలని అంతే కాని మమ్మల్ని ఏమి అనొద్దని, సెక్యులరిజం గురించి సూక్తులు చెప్పొద్దని పేర్కొన్నారు.
పవన్‌కు సారి చెప్పిన కార్తీ
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. తిరుమల వివాదం గురించి మాట్లాడమని కార్తీని కోరగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు.
https://twitter.com/CinemaniaIndia/status/1838484585325215936
వచ్చాక మీకు ఆన్సర్ ఇస్తా: ప్రకాష్ రాజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ట్వీట్ చేశారు. 'పవన్ కల్యాణ్ గారు ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.
https://twitter.com/prakashraaj/status/1838505132025168154
అంతకుముందు ఏం జరిగిందంటే?
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్ ఇటీవల శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ఎక్స్ వేదికగా స్పదించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్ చేస్తూ ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) #జస్ట్ ఆస్కింగ్’ అని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే నటుడు మంచు విష్ణు స్పందించారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు. మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ హెచ్చరించారు.
https://twitter.com/prakashraaj/status/1837104811419775430
సెప్టెంబర్ 24 , 2024
Arshad Warsi: అర్షద్ వార్సీ కామెంట్లపై స్పందించిన నాగ్ అశ్విన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్ పాత్రను జోకర్‌తో పోలుస్తూ అతడి చేసిన వ్యాఖ్యలను ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాణించడం చూసి తట్టుకోలేకనే బాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీల్లో టాలీవుడ్‌పై ఈర్ష్య, ద్వేషం, అసూయ మరోమారు బయటపడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
‘అర్షద్ హుందాగా మాట్లాడాల్సింది’
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు. కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్టు చేసిన నెటిజన్, ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మెుత్తంతో సమానమని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘నార్త్-సౌత్, టాలీవుడ్ వెర్సస్ బాలీవుడ్ ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్ హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తాం. కల్కి రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తాను’ అని రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నాగ్అశ్విన్ చెప్పారు. ప్రభాస్ కూడా ఇదే మాట అంటుంటారని ఆయన తెలిపారు.
https://twitter.com/Varun__Tweets/status/1827148108171768059
https://twitter.com/nagashwin7/status/1827177489455824930
అర్షద్‌కు నాని చురకలు
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రభాస్‌పై విమర్శలు చేయడం వల్ల అర్షద్ వార్సీకి గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ లభించిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. నాని వ్యాఖ్యలపై బాలీవుడ్ ఆడియన్స్, అర్షద్ వర్సీ ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం నాని ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అర్షద్‌పై తాను చేసిన కామెంట్స్‌కు చింతిస్తున్నట్లు తెలిపారు. ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యాడని నాని గుర్తుచేశారు. అలాగే నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా అవసరమని పరోక్షంగా చురకలు వేశారు.
'యాంటి ఇండియన్ అర్షద్'
సోషల్ మీడియా వేదికగా అర్షద్ వార్సీపై పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గతంలో అర్షద్ చేసిన వివాదస్పద పోస్టులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అర్షద్‌కు సంబంధించిన పాత కాంట్రవర్సీ పోస్టును బయటపెట్టాడు. 2012లో అర్షద్ చేసిన ట్వీట్ అది. 'నేను అఫ్గనిస్తాన్ ఓ మీటింగ్ కోసం వెళ్తున్నాను. కుదిరితే షిఫ్ట్ అయిపోతాను. ఇండియా కంటే అక్కడ సేఫ్' అంటూ అర్షద్ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును రిట్వీట్ చేసిన ఓ నెటిజన్ దానికి ఫన్నీగా బ్రహ్మీ టెర్రరిస్టు గెటప్‌లో ఉన్న ఫొటోను జత చేశాడు. దీంతో ఈ పోస్టును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 'యాంటి ఇండియన్ అర్షద్' అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/HailPrabhas007/status/1827033490950648044
తెలుగు హీరోల స్ట్రాంగ్ కౌంటర్
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవల తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. అటు యువ నటుడు ఆది సాయికుమార్ సైతం అర్షద్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అర్షద్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
https://twitter.com/isudheerbabu/status/1825746561495871657
https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360
ఆగస్టు 24 , 2024
Double Ismart: రామ్‌తో కోల్డ్ వార్? అందుకే ట్రైలర్ లాంచ్‌కు పూరీ రాలేదా!
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్, డైరెక్టర్ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ అసంతృప్తి!
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'లైగర్' వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్ షురూ చేయకపోవడంపై రామ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ ఈవెంట్లో ఏకాకిగా రామ్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
పూరి వివరణ!
'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ కోసం ముంబయిలో ఫైనల్ మిక్సింగ్ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్ లాంచ్ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్ వల్లే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
https://twitter.com/i/status/1820365775439552575
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదివారం రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‌తో, నాటు డైలాగ్‌లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‌లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‌గా బిగ్బుల్ పాత్రను చేశారు. బిగ్బుల్ బ్రెయిన్లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‌ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=ym0upoayqJg
మిస్టర్ బచ్చన్ దూకుడు!
డబుల్ ఇస్మార్ట్ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోరినా.. వెనక్కి తగ్గలేదా?
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.
ఆగస్టు 05 , 2024
War 2 Movie Story: సోషల్ మీడియాలో ‘వార్ 2’ స్టోరీ లీక్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కథ!
టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'వార్' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తారక్ షూట్ హైదరాబాద్‌లోనే!
'వార్ 2'లో హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్లో వీటిని ఫినిష్ చేశారు. ప్రస్తుతం తారక్ రోల్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ అతడే?
'వార్ 2' చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్ రోషన్ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
'వార్ 2'లో మరో స్టార్ హీరో!
ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
మార్చి 25 , 2024
Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.
https://twitter.com/SureshPRO_/status/1691450193684934656
సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464
అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.
https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037
చిన్మయి ఏమందంటే?
స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664
ఫ్యాన్స్ హ్యాపీ
చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు.
https://twitter.com/__GirDhar/status/1691518743820791809
విజయ్, సామ్ పర్ఫార్మెన్స్
మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
ఆగస్టు 16 , 2023
JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.
హాలీవుడ్ ఫ్రాంఛైజీ జాన్ విక్ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.
2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.
లక్ష్యం
మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్ విక్ నుంచి ఇది నేర్చుకోవచ్చు.
నిబద్ధత
జాన్ విక్ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు.
కఠోర శ్రమ
లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.
అసలేంటిది?
నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.
హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్విక్ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం.
నమ్మకం
సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్విక్ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు.
మన పని
చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు.
తక్కువగా మాట్లాడు
సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు.
ప్లాన్ బి
చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా.
కుదరదు
ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.
మార్చి 21 , 2023
JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మార్చి 21 , 2023
Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్ వార్నింగ్?
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్ చేసేస్తున్నారు. షూటింగ్లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
‘ఆ ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు’
సినిమాలు పోస్టు పోన్ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, వీఎఫ్ఎక్స్ ఆలస్యం, షూటింగ్లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్ చేస్తుండటంపై నాని హాట్ కామెంట్స్ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్ డేట్ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్?
నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్ చేయాలని షూటింగ్ ప్రారంభంలోనే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్ చేసుకోవడంతో సరిపోదా టీమ్ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్ 6 మారుస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ వెంటనే ‘డబుల్ ఇస్మార్ట్‘, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’, ‘ఆయ్’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
నాని సినిమాకు రన్ టైమ్ ఫిక్స్!
నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆగస్టు 24 , 2024
సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ
ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.
ట్విటర్ వార్
గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ ఏదో విధంగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
హ్యాష్‌ట్యాగ్స్‌తో హల్చల్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.
https://twitter.com/i/status/1632680528578228224
అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన స్క్రీన్ షాట్లు తీసి తెగ షేర్ చేశారు.
(1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter
షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్లో ట్రెండ్ చేయగా.. వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20
యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1633007975412400132
టైటిల్‌పై రచ్చ
మరోవైపు శంకర్ కాంబినేషన్లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్లో RC15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్‌తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండటంతో పాటు ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు
RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టైటిల్ ఇదేనా?
సినిమా టైటిల్ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1633351074508845058
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/i/status/1633737854919606273
ఫ్యాన్స్ నిరాశ
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్‌రాజు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్ప్రైజ్ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
మార్చి 09 , 2023
Jani Master: మరో వివాదంలో జానీ మాస్టర్.. వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని వార్నింగ్
కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వడం, జైలుకు వెళ్లడం తెలిసిందే. తాజాగా, డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను శాశ్వతంగా తొలగించారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై జానీ మాస్టర్ స్వయంగా స్పందించారు.
జానీ మాస్టర్ స్పందన
జానీ మాస్టర్ మాట్లాడుతూ, "ఈ రోజు ఉదయం నుంచి నన్ను డ్యాన్సర్స్ యూనియన్(Dancers Union) నుండి శాశ్వతంగా తొలగించారనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నేను ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే. నా కార్డ్‌ను ఎవరూ తీసివేయలేరు. నా పదవీ కాలం ఇంకా ఉంది. అనధికారికంగా ఎలక్షన్లు నిర్వహించి, తమకు నచ్చిన విధంగా హోదాలు పొందడాన్ని ఒప్పుకోను. చట్టపరంగా దీనిపై పోరాడతాను" అని అన్నారు.
అంతేకాకుండా, తన తాజా ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి కొరియోగ్రఫీ చేశానని, ఆ సినిమాలోని ఓ పాట త్వరలో విడుదలకానుందని చెప్పారు. ఈ సాంగ్ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
https://twitter.com/AlwaysJani/status/1866073580125196680
కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్
డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్(Joseph Prakash) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. గతంలోనూ ఆయన నాలుగు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నియామకంతో జానీ మాస్టర్ అధ్యక్ష పదవి నుంచి తప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ విషయంపై కూడా జానీ మాస్టర్ తాను అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నానని, ఎవరూ తనను హోదా నుంచి తొలగించే హక్కు లేదని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చినందునే తనను అసోసియేషన్ నుండి తప్పించారని వచ్చే కథనాలపై ఆయన విమర్శలు గుప్పించారు.
వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందన
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయమై గతంలో పెద్ద దుమారం రేగింది. ఆయన అసిస్టెంట్ ఓ లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతకాలం జైలులో ఉండిన జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ కేసు నేపథ్యంలోనే అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, జానీ మాస్టర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘నాపై చేసిన ఆరోపణలు నిర్ధారణ కానివి. అలాంటి ఆరోపణల ఆధారంగా నన్ను శాశ్వతంగా తొలగించారనే వార్తలు కేవలం ఫేక్ న్యూసే. నేను లీగల్‌గా పోరాడతాను. నాకు న్యాయం దక్కుతుందని నమ్ముతున్నాను,’’ అని తెలిపారు.
ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే
"కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి పరిశీలన చేయకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి. నన్ను అసోసియేషన్ నుండి తొలగించారన్నది అసత్యం. నాకు సంబంధించిన హక్కులను ఎవరూ హరించలేరు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరూపించబడాల్సినవి. నా పదవీ కాలం ఇంకా ఉంది. ఎవరైనా నాకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, నేను చట్టపరంగా పోరాడతాను’’ అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.
జానీ మాస్టర్ తన కెరీర్‌ను ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రారంభించి, కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఆయన చేసిన కొరియోగ్రఫీతో చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో చేసిన పాటలు అభిమానులకు తెగ నచ్చాయి. తాను టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఎదగడానికి డ్యాన్సర్స్ యూనియన్ ప్రధాన కారణమని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
తన వద్ద పనిచేసిన డ్యాన్సర్లు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్లుగా ఎదుగుతున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నా వద్ద పని చేసిన వాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదే నా నిజమైన గౌరవం’’ అని తెలిపారు.
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ఎన్నికవడంతో, జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. తన పదవీ కాలం ఇంకా ఉందని, ఎవరి ఒత్తిడి వల్లనో తనను తొలగించలేరని అన్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
డిసెంబర్ 09 , 2024
War 2: బాలీవుడ్ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్ రెమ్యూనరేషన్.. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ సోలో చిత్రం!
'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న 'దేవర' (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్లో చేయబోతున్న 'వార్ 2' (War 2) చిత్రం. ముఖ్యంగా 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో ఈ సినిమా నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
60 రోజుల్లో షూటింగ్ పూర్తి!
'వార్ 2' చిత్రంలో తారక్, హృతిక్ రోషన్ పాత్రల షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న 'వార్ 2' చిత్ర షూటింగ్‌ను ఎక్కువ భాగం స్టూడియోస్‌లోనే తీయనున్నారట. హృతిక్ పార్ట్‌ను జూన్ కల్లా, తారక్ పార్ట్‌ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
‘రా ఏజెంట్’గా ఎన్టీఆర్!
యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న 'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్ ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తారక్ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్ 2’ టీమ్, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తారక్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
'వార్ 2' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్ రెమ్యూనరేషన్ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్ రోల్ కోసం తారక్ ఈ రేంజ్లో ఛార్జ్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
'వార్ 2' కోసం సరికొత్త టెక్నాలజీ!
'వార్ 2' సినిమా కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్ డోర్లో వచ్చే ఎన్టీఆర్, తారక్ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తిగా బాడీ డబుల్స్‌తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్, హృతిక్ ముఖాలను స్వాప్ చేస్తారట. గ్రాఫిక్స్ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్ చెబుతోంది.
మార్చి 13 , 2024
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
ఈ జనరేషన్ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun), రామ్‌చరణ్ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్.. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
‘పుష్ప 2’ వాయిదా
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
రేసులో గేమ్ ఛేంజర్!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్లో ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్లో రిలీజ్ చేయాలని దిల్‌రాజు ఫిక్స్ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్ బరిలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అల్లు vs మెగా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు ఆర్మీ సవాల్
ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/madhavg_Indian/status/1801862004627366096
https://twitter.com/madhavg_Indian/status/1801824969023758738
https://twitter.com/DpAadhf/status/1785639853717082162
జూన్ 18 , 2024
2023లో రసవత్తరంగా దేశ రాజకీయం: 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
]
మరికొన్ని వార్తల కోసం
YouSay App
డౌన్లోడ్ చేయండి
Download now
ఫిబ్రవరి 13 , 2023
David Warner: తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. ఇదెక్కడి మాస్ ఎంట్రీరా సామి!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్, సాంగ్స్‌కు రీల్స్ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మెుదలుపెడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
'పుష్ప 2'లో కీ రోల్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2'. అయితే ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌లో వార్నర్ గన్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ ‘పుష్ప 2’ సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ‘పుష్ప 2’ మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ప్రచారం నిజం కావాలని వార్నర్ అభిమానులు కోరుకుంటున్నారు.
https://twitter.com/AuTelugu_Films/status/1837406285702074497
సుకుమార్ ప్లాన్ ఇదేనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' (Pushpa: The Rise)తో డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట గతంలో ఇండియా మెుత్తం సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు వార్నర్ రీల్స్ కూడా చేశాడు. అప్పట్లో అవి తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు మైదానంలో పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేనరిజాన్ని వార్నర్ అనుసరించాడు. తద్వారా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్ క్రేజ్‌ను 'పుష్ప 2’లో వినియోగించుకోవాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ‘పుష్ప 2’లో డేవిడ్ మామను తప్పకుండా చూసే ఛాన్స్ ఉంది.
https://twitter.com/i/status/1484806143595532289
https://twitter.com/AAAdmirersKL/status/1516976589069701121
ఐపీఎల్‌తో చేరువ
టీమిండియా ఆటగాళ్లతో సమానంగా వార్నర్‌ను తెలుగు క్రికెట్ అభిమానులు గౌరవిస్తుంటారు. వార్నర్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సైతం అందించాడు. దీంతో వార్నర్‌కి తెలుగు అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అటు వార్నర్ సైతం ఇందుకు ప్రతిగా తెలుగు సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ, సినిమా డైలాగ్స్ చెబుతూ రీల్స్ చేసేవాడు. ఇలా తెలుగువారికి వార్నర్ దగ్గరయ్యాడు. వార్నర్ పలు సందర్భాల్లో హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. హైదరాబాద్‌ను మిస్ అవుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.
రాజమౌళితో యాడ్ షూట్
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి గతంలో ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు. ఒక వేళ తన సినిమాలో డేవిడ్ వార్నర్ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో వార్నర్ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్ ఇవన్నీ ఊహించుకొని ఒక్కసారిగా భయపడతాడు. అప్పట్లో ఈ యాడ్ విపరీతంగా వైరల్ అయ్యింది. మళ్లీ ఓసారి చూసేయండి.
https://twitter.com/i/status/1778705794340720824
సెప్టెంబర్ 21 , 2024