• TFIDB EN
  • వెపన్
    UATelugu
    పర్యావరణ వేత్త అగ్ని.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతూ సూపర్‌ హ్యూమన్‌ మిత్రన్‌ కోసం వెతుకుతుంటాడు. అయితే అతడి కోసం మరికొందరు సైతం అన్వేషిస్తుంటారు. ఇంతకి మిత్రన్‌ ఎవరు? అతనికి ఉన్న పవర్స్ ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సత్యరాజ్
    వసంత్ రవి
    రాజీవ్ మీనన్
    తాన్యా హోప్
    ఎకె మైదీన్
    రాజీవ్ గోవింద పిళ్లై
    సిబ్బంది
    గుహన్ సెన్నియప్పన్దర్శకుడు
    M. S. మంజూర్నిర్మాత
    జిబ్రాన్
    సంగీతకారుడు
    ప్రభు రాఘవసినిమాటోగ్రాఫర్
    గోపీ కృష్ణన్ఎడిటర్ర్
    కథనాలు
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.  తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.  యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.  ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.  సత్యభామ ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.  రక్షణ స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.  లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  వెపన్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
    జూన్ 03 , 2024
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు దర్శకుడు: టీజీ కీర్తి కుమార్ సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్ సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్ నిర్మాత: అదితి సోని వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్‌ కె. సింగ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్ప‌డూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే వెన్నెల కిషోర్‌ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్‌ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్‌ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్‌ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్‌ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్‌ లైన్‌ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్‌ అయ్యింది. ఏజెంట్‌ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్‌ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్‌ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌ను కూడా డైరెక్టర్‌ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్‌ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది. టెక్నికల్‌గా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేప‌థ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్ర‌ాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌రక్తి కట్టించే సీన్లు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 01 , 2024
    గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్
    గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్
    ]ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆర్టిస్ట్  వెన్నెల కిశోర్. 2022లో వివిధ సినిమాల్లో కనిపించాడు.50. వెన్నెల కిశోర్
    ఫిబ్రవరి 13 , 2023
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీ నటులు : అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్‌ : మల్లీ అంకం సినిమాటోగ్రాఫర్‌ : సూర్య సంగీతం : గోపి సుందర్‌ నిర్మాత : రాజీవ్‌ చిలక నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: 3 మే, 2024 అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి  అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే గణపతి పాత్రలో అల్లరి నరేష్‌ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్‌ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్‌ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్‌, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్‌ తీసుకొని డైరెక్టర్‌ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.  టెక్నికల్‌గా  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రాజ్‌ సుందర్‌ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్‌ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అల్లరి నరేష్‌ నటనకామెడీ మైనస్‌ పాయింట్స్ కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మే 03 , 2024
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే  తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.  టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్‌, రాజ్‌ అర్జున్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, క్రిష్ణ చైతన్య డైరెక్టర్‌ : ఉదయ్‌ బొమ్మిశెట్టి సంగీతం : చైతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్‌ నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్‌ సెలగంశెట్టి విడుదల తేదీ : 31-05-2024 విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిశోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్‌ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా అయినా సక్సెస్‌ కావాలని విజయ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా? కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అటు హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మరో కథానాయిక నయన్‌ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయెల్‌ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్‌ అర్జున్‌ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఉదయ్‌ బొమిశెట్టి రొటీన్‌ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్‌ & ఎంటర్‌టైనింగ్‌ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్‌ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్‌ - వెన్నెల కిషోర్‌ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్‌ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ట్విస్టులు, థ్లిల్లింగ్‌ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్‌ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ఆనంద్‌ దేవరకొండ నటనకామెడీట్విస్టులు మైనస్‌ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు Telugu.yousay.tv Rating : 3/5   పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉంది? గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ వీకెండ్‌ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్‌ చేరిందని కామెంట్‌ పెట్టాడు.  https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755 ‘గం గం గణేశా’ డీసెంట్‌ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు.  https://twitter.com/review_rowdies/status/1796384723033596372 స్టోరీలో కంటెంట్‌ మిస్‌ అయ్యిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఆనంద్‌ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్‌ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.  https://twitter.com/Mjcartels/status/1796394003979800864 ‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్‌ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. https://twitter.com/tcsblogs/status/1796341604845867293
    మే 31 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు  దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..  డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవిశంకర్, వైవా హర్ష, వడివక్కరసి తదితరులు దర్శకుడు: వీఐ ఆనంద్ కథ : భాను భోగవరపు సంగీతం: శేఖర్ చంద్ర  నిర్మాణ సంస్థ:  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్  నిర్మాత : అనిల్ సుంకర, బాలాజీ గుత్తా విడుదల తేదీ: 16-02-2024 సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ రూపొందించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరో సందీప్‌ కిషన్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.  కథ బసవ (సందీప్ కిషన్) (Ooru Peru Bhairavakona Review) ఓ స్టంట్‌ మ్యాన్‌. అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం తన గ్యాంగ్‌ జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భైరవకోన అనే ఊరిలోకి వెళ్తాడు. అయితే ఈ ఊరికి ఎవరైనా వెళ్లడం తప్ప.. అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన ఉండరు. మరి భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? భైరవకోన చరిత్ర ఏమిటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఆ ఊరికి సంబంధం ఏమిటి? బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే బసవ పాత్రకు సందీప్ కిషన్ (Ooru Peru Bhairavakona Review) న్యాయం చేశాడు. కెరీర్‌ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలో జీవిస్తూ భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ పర్వాలేదు. ఆమెకు రాసిన సీన్లలో బలం లేకపోవడంతో ఆమె ప్రభావం సినిమాలో తక్కువే. ఇక కావ్య థాపర్ ఉన్నంతలో అందంగా కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష కాంబోలో సీన్లు, వాళ్లిద్దరి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ సైతం నవ్వించారు. రవి శంకర్, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ఊరుని చూపించి భైరవకోనపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు దర్శకుడు. కథలో బలం ఉన్నప్పటికీ కథనంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. భైరవకోనలో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లాక ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్లిద్దరి బంధం కూడా సాదా సీదాగానే చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రగలించినా.. విశ్రాంతి తర్వాత దానిని మెయిన్‌టెన్‌ చేయడంలో విఫలమయ్యారు. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష, బ్రహ్మాజీ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి.  టెక్నికల్‌గా టెక్నికల్ బృందం (Ooru Peru Bhairavakona ) నుంచి దర్శకుడు వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథలో కొత్తదనంసందీప్‌ నటనట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్ ఆసక్తి లేని సన్నివేశాలుసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    ఫిబ్రవరి 16 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ  సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.  సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.  ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
    Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
    తారాగణం:  కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ డైరెక్టర్: రతినం కృష్ణ నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి సంగీతం: అమ్రీష్ సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్ టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్‌ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన  మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.  కథ మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్‌ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్‌ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది.  సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది. ఎవరెలా చేశారంటే? గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్‌నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది.  మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టెక్నికల్‌గా.. రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. బలాలు ఫస్టాప్ కామెడీ ట్రాక్ నెహా శెట్టి గ్లామర్ బలహీనతలు అనవసరమైన ఎలివేషన్స్ సెకండాఫ్ స్టోరీ చివరగా..  రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్ రేటింగ్: 2.5/5
    అక్టోబర్ 06 , 2023
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.  ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.  టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023
    Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్‌ సీన్స్‌ ఓకే.. కానీ!
    Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్‌ సీన్స్‌ ఓకే.. కానీ!
    నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్ డైరెక్టర్‌: B.V. నందిని రెడ్డి సంగీతం: మిక్కీ J. మేయర్ నిర్మాత : ప్రియాంక దత్‌ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్‌ కొట్టారా? లేదా? శోభన్‌ తన నటనతో ఆకట్టుకున్నాడా? వంటి అంశాలు ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.  కథ సినిమా కథ మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రారంభమవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పుట్టిన హీరో, హీరోయిన్లు (ఆర్య, రిషి) పొరపాటున మారిపోతారు. వైద్యులు ఒకరిబిడ్డను మరొకరికి అప్పగిస్తారు. అయితే నరేష్‌, రాజేంద్ర ప్రసాద్‌లకు వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. ఆర్య, రిషిలు పెరిగి పెద్దవారైనట్లే వారి ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఆ వివాదాన్ని వారు ఎలా పరిష్కరించుకున్నారు? పిల్లలు మారిపోయిన విషయాన్ని వారు ఎలా తెలుకున్నారు? అనేది మిగిలిన కథ.  ఎవరెలా చేశారంటే హీరో సంతోష్‌ శోభన్‌ తన కామెడీ టైమింగ్‌ అదరగొట్టాడని చెప్పొచ్చు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి పాత్రలో శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో శోభన్ చాలా మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్‌ మాళవిక సైతం తన పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. మాళవిక, శోభన్‌ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ జంట స్క్రీన్‌ ప్రజెన్స్‌ బాగుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఇతర తారాగణం అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్, నరేష్‌, గౌతమి, షావుకారు జానకి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో తమ నటన పాఠవాలను చాటుకున్నారు.  సాంకేతికంగా… ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాకు నందిని రెడ్డి పెట్టింది పేరు. అన్నీ మంచి శకునములే సినిమా ద్వారా సింపుల్‌ ఫ్యామిలీ డ్రామాను ప్రజెంట్‌ చేయాలని భావించి నందిని రెడ్డి తడబడింది.  అనుకున్న కథను తెరపై చూపించడంతో డైరెక్టర్ విఫలమయ్యారు. కొన్ని సీన్లు మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తాయి.  ఎమోషనల్‌, కామెడీ సీన్స్‌ మినహా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఇక మిక్కీ J. మేయర్ అందించిన పాటలు కూడా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్‌ రిచ్‌ లుక్‌లో కనిపిస్తుంది.  ప్లస్‌ పాయింట్స్‌ సంతోష్ శోభన్ నటనకామెడీఎమోషనల్‌ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీతబోరింగ్‌ సీన్స్‌పాటలునేపథ్య సంగీతం రేటింగ్‌: 2.5/5
    మే 18 , 2023
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    నటీనటులు: గోపిచంద్‌, డింపుల్‌ హయాతి, ఖుష్బు, నాజర్‌, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్‌ శ్రీను దర్శకత్వం: శ్రీవాస్‌ సంగీతం: మిక్కి జే. మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి నిర్మాతలు: T.G విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గోపిచంద్‌, శ్రీవాస్‌ కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి హిట్‌ సాధించడంతో ఈ రామబాణంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్‌ వంటి దిగ్గజ నటులతో పాటు, అలీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, గెటప్‌ శ్రీను వంటి కామెడీ స్టార్లు నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్లే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామబాణం చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో గోపిచంద్‌ హిట్‌ కొట్టినట్టేనా? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి: విలువలు, నియమాలతో కూడుకున్న అందమైన ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంపై కార్పొరేట్ మాఫియా కన్నుపడుతుంది. వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పవర్‌ ఉపయోగించుకొని కష్టాలు పెడుతుంది. ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో (గోపిచంద్‌) శత్రువుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఆ హీరో ఎదుర్కొనే అడ్డంకులు, చివరికి వారిని ఎలా కాపాడుతాడు అనేది అసలు కథ. ‌హీరో కుటుంబానికి కార్పోరేట్‌ మాఫియాకు వైరం ఎందుకు వస్తుంది?. జగపతి బాబు, గోపిచంద్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? తెలియాలంటే రామబాణం చూడాల్సిందే. ఎవరేలా చేశారంటే: ఎప్పటిలాగే రామబాణంలో కూడా గోపిచంద్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో గోపిచంద్‌ నటన సినిమాకే హైలెట్‌ అని చెప్పొచ్చు. అటు హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఎంతో గ్లామర్‌గా కనిపించింది. జగపతి బాబు పాత్ర కూడా సినిమాకు చాలా కీలకం. ఆ పాత్రను తన ‌అద్బుతమైన నటనతో జగపతిబాబు నిలబెట్టాడు. ఇక సప్తగిరి, వెన్నెల కిషోర్‌, అలీ, గెటప్‌ శ్రీను, సత్య కామెడీ బాగుంది.  సాంకేతికంగా: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీవాసు ఈ సినిమాకు మంచి కథే తీసుకున్నప్పటికీ..  సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడో చూసిన కథలా సినిమా అనిపిస్తుంది.  రామబాణం  ఫ్యామిలీ కథ అయినప్పటికీ కొత్తనం లేకపోవడం మైనస్. రోటీన్‌గా ముందుకు సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్టాఫ్ సీన్లు డీసెంట్‌గా ఉన్నప్పటికీ… సెకండాఫ్‌లో స్టోరీ నెమ్మదించింది.  అయితే  కామెడీ, యాక్షన్‌ డ్రామాలతో ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ చేశాడు. సెంటిమెంట్‌ సీన్లు బాగా పండాయి. ఇక మిక్కీ జే. మేయర్‌ అందించిన  BGM యాక్షన్‌  సీన్లను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. ప్లస్‌ పాయింట్స్‌ గోపీచంద్ నటనయాక్షన్, కామెడీ సీన్స్నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీత సీన్స్సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్ రేటింగ్‌: 2.75/5
    మే 05 , 2023
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
    మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గోపిచంద్‌ విశ్వరూపం చూపించాడని కథనాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత గోపిచంద్‌కు సాలిడ్‌ హిట్‌ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీమా తొలిరోజు కలెక్షన్స్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? ప్రీ బిజినెస్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.  భీమా తొలి రోజు కలెక్షన్స్‌.. భీమా చిత్రాన్ని మేకర్స్‌ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా కలిపి 600 స్కీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి తగ్గట్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించినట్లు తెలుస్తోంది. ట్రెడ్‌ లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35కోట్లు, ఓవర్‌సీస్‌ ఇతర ప్రాంతాలు కలిపి రూ.1.25 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్‌ టాక్‌ రావడం భీమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. లేదంటే ఈజీగానే రూ.5 కోట్ల మార్క్‌ను సాధించేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గోపిచంద్‌ గత చిత్రం ‘రామబాణం’.. తొలిరోజున రూ. 2.5 కోట్ల గ్రాస్‌ సాధిస్తే.. ‘భీమా’ అంతకు రెట్టింపు వసూలు చేయడం విశేషం.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ సినిమా వెబ్‌సైట్ సాక్నిక్‌ (Sacnilk) లెక్కల ప్రకారం.. భీమా చిత్రం తొలిరోజు రూ.3.50 కోట్ల నెట్‌ కలెక్షన్లను (Bhimaa Day1 Net Collections) వసూలు చేసింది. ఓవర్సీస్‌ లెక్కలను మాత్రం ఈ సైట్‌ ప్రస్తావించలేదు. ఇక తొలిరోజు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్‌ షోస్‌ 27.58%, మధ్యాహ్నం 33.55%, సాయంత్రం 27.70%, సెకండ్‌ షో 49.49% నమోదైంది. నేడు, రేపు వీకెండ్‌ కావడంతో ఆక్యుపెన్సీ శాతం మరింత పెరిగే అవకాశముంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయితే తనకు అచ్చొచ్చిన యాక్షన్‌ జానర్‌లో 'భీమా' చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ (Bhimaa Movie Pre Release Business)ను మంచిగానే చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థ్రియేటికల్‌ హక్కులు రూ.11.30 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలంగాణ (నైజాం) రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 4.50 కోట్లకు బిజినెస్‌ జరిగింది. మెుత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కాగా.. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.1.8 కోట్లు జరిగింది. 'భీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ.12 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  'భీమా'లో అదరగొట్టిన గోపిచంద్‌! భీమా చిత్రంలో గోపిచంద్‌.. రెండు కోణాల్లో క‌నిపించే పాత్ర‌ల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించేశాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  https://telugu.yousay.tv/gopichand-bheema-review-gopichand-sivathandavam-in-action-sequences-bheema-movie-hit-free.html
    మార్చి 09 , 2024
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్‌, రోహిణి, సచిన్‌ ఖేడేకర్‌, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ  సంగీతం: హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రఫీ: మురళి. G నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై హైప్‌ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.  కథ: ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే? విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్‌, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్‌, సామ్‌ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్‌ ఖేడేకర్‌, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. వెన్నెల కిషోర్‌, అలీ, రాహుల్‌ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్‌ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్‌ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్‌ బాగుంది.  టెక్నికల్‌గా  ఖుషి సినిమాకు టెక్నికల్‌ అంశాలు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్‌ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్‌ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్‌ అందాలను ఆయన తన కెమెరా  పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.   ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    సెప్టెంబర్ 01 , 2023
    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?
    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?
    అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్‌ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్‌ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్‌ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ క‌థ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నటీనటులు: నాగ చైతన్య, కృతిశెట్టి, ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్ దర్శకుడు: వెంకట్‌ ప్రభు సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సినిమాటోగ్రఫీ: S.R కతిర్‌, సుమేర్‌ వర్మ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి కథ:  శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మ‌రోవైపు రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చ‌యించార‌ని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. అసలు రాజన్నను ఎందుకు అరెస్టు చేశారు? చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.  ఎలా ఉందంటే సినిమా ఓ యాక్సిడెంట్‌తో మెుదలై కథలోకి వెళ్తోంది. దాదాపు 15 నిమిషాల పాత్రల పరిచయానికే సమయం పడుతుంది. ప్రియమణి, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంట్రో, ఫ్యామిలీ సన్నివేశాలతో స్లోగా సాగుతుంది. క్రూరమైన విలన్‌గా అరవింద్ స్వామి ఇంట్రోతో అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కథనంలో వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌ యాక్షన్ ఎపిసోడ్‌ అదిరిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్‌తో సెకాండాఫ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. సెకాండాఫ్‌ స్లోగా స్టార్ట్‌ అవ్వటంతో పాటు కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్‌ను కొట్టిస్తాయి. కొన్ని సీన్లు ఇప్పటికే చూసేశాం అన్నట్లుగా అనిపిస్తాయి. కృతి శెట్టితో లవ్ ట్రాక్‌ కూడా పెద్దగా ఆకట్టుకోదు.  యాక్షన్ ఎపిసోడ్‌లు, ట్విస్ట్‌లు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు తరహా స్క్రీన్‌ ప్లే కనిపిస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ మాత్రం యువన్ ఇరగదీశాడు. ఎవరెలా చేశారంటే? కస్డడీ సినిమాలో నాగచైతన్య అదరగొట్టాడు. శివ పాత్రలో పరకాయప్రవేశం చేసి అలరించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివ పాత్రనే కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్‌ చైతూ లుక్‌ సెట్‌ అవ్వలేదేమో అనిపించినా.. కథలో లీనమయ్యేకొద్ది శివపాత్రతో కనెక్ట్‌ అవ్వకుండా ఉండలేం. యాక్షన్‌ సీన్లలో చైతూ తనదైన మార్క్‌ చూపించాడు. హీరోయిన్‌ కృతి శెట్టి కూడా నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ షేర్‌ చేసుకుంది. కొన్ని సీన్లలో శృతి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది. అరవింద్ స్వామి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఆయన తన పాత్రని అద్భుతంగా పండించాడు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్‌ మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు. సాంకేతికంగా తమిళ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తన మార్క్ కథనంతో తెరకెక్కిస్తారు. మానాడు చిత్రం ఇందుకు ఉదాహరణ.చై విషయంలో మంచి కథనే ఎంచుకున్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డాడు.కథనం మరింత గ్రిప్పింగ్ రాసుంటే బాగుండేది. ఇళయ రాజా, యువన్ శంకర్ ఇద్దరు కలిసి పనిచేయడంతో మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పెద్ద అసెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లను BGM బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. బలాలు నాగ చైత‌న్య న‌ట‌న‌బ్యాక్ గ్రౌండ్ స్కోర్యాక్ష‌న్ సీన్స్ బలహీనతలు పాటలురొటీన్‌ కథసాగదీత సీన్లు రేటింగ్‌: 2.5/5
    మే 12 , 2023
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్‌, డ్యాన్స్‌ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్‌ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.  అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు పల్లెటూరి పాత్రల్లో తళ్లుక్కుముంటున్నారు. మట్టివాసన వెదజల్లే క్యారెక్టర్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. డీగ్లామర్‌ రోల్‌లో కనిపించి మెప్పించిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్‌ దసరా(Dasara) మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్‌ (keerthi suresh) అదరగొట్టింది. వెన్నెల పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో కీర్తి నటన సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. హీరో నానితో పోటీపడి మరీ నటించింది. దీంతో నానితో సమానంగా కీర్తి సురేష్‌ ప్రశంసలు అందుకుంటోంది.  సమంత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత(Samantha) ‘రంగస్థలం (Rangasthalam)’ చిత్రంలో డీగ్లామరస్‌గా కనిపించింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. రామలక్ష్మీ పాత్రలో సమంతను తప్ప మరొకరిని ఊపించుకోలేము. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌లోనూ సమంత గ్లామర్‌కు దూరంగా ఉన్న పాత్రనే చేసింది.  అనుష్క బాహుబలి(Bahubali) మెుదటి పార్ట్‌లో వృద్దురాలైన దేవసేనగా అనుష్క(Anushka Shetty) కనిపించింది. ఈ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భల్లాల దేవుడిపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న మహిళగా అనుష్క చాాాలా బాగా నటించింది.  తమన్నా బాహుబలి పార్ట్‌-1 లోనే తమన్నా(Thamanna)  కూడా అవంతిక పాత్రలో మెరిసింది. ఎలాంటి మేకప్‌ లేకుండా పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. గ్లామర్‌ పాత్రలే కాదు అందానికి ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకుంది.  ఐశ్వర్య రాజేష్‌ ‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya krishnamurthy), ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (world famous lover) లాంటి చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్‌ డీ గ్లామరస్‌ రోల్స్‌లో నటించారు. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి యువతిగా ఐశ్వర్య అద్భుతంగా నటించింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రితికా సింగ్ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో చేసిన గురు(Guru) సినిమా ద్వారా రితికా సింగ్‌ (Ritika Singh) తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలుత కూరగాయాలు అమ్ముకునే రాముడు పాత్రలో రితికా డీగ్లామరెస్‌గా కనిపించింది. ఆ తర్వాత బాక్సర్‌గా మారి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది.  అమ్రితా అయ్యర్‌ బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హీరోగా వచ్చి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో అమ్రితా అయ్యర్‌ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం పాట’ (Neeli Neeli Aakasam) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సంజనా బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంజనా (Sanjana).. దండుపాళ్యం-2 Dandupalyam-2)లో ఓ విభిన్నమైన పాత్ర పోషించి షాక్‌ ఇచ్చింది. హత్యలు చేసే గ్యాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదే సినిమాలో సంజన న్యూడ్‌గా నటించిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి. 
    ఏప్రిల్ 01 , 2023
    Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!
    Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!
    నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల  నిర్మాత: చెరుకూరి సుధాకర్ సంగీతం: సంతోష్ నారాయణ సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్  భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ కథ: వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్), అతని స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?. వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేశాడు? వంటివి తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. ఎవరెలా చేశారంటే: శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రంలో నాని తన నటనతో అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు మెుత్తం నానినే కనిపిస్తాడు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నాని నటన ఉంటుంది. ముఖ్యంగా నాని భాష, యాస, తన రూపురేఖలతో ఊరమాస్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్‌లో తన మార్క్‌ చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు నాని పాత్రకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ మూవీ నాని కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నానితో పాటుగా కీర్తి సురేష్ పోటీపడి నటించారు. ఆమె నటన సినిమాకు బాగా ప్లస్‌ అయిందనే చెప్పాలి. అటు దీక్షిత్ శెట్టి సైతం నానితో సమానంగా ఎక్కడ తగ్గకుండా నటించారు. ఈ ముగ్గురి నటన సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ కూడా విలన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. సముద్రఖని, సాయికుమార్ వారి పరిధిమేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. నానిలోని నటుడ్ని ఆయన పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో ఎలివేషన్లు బాగా చూపించాడు. కొన్ని సీన్స్‌లో డైరెక్టర్‌ గూస్ బంప్స్ తెప్పించారు. సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.  ‘చంకీలా అంగీలు వేసి’ పాట చిత్రానికే వన్నెతెచ్చింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్టు నాని నటనతో అదంతా కవర్ అయిపోతుంది. మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన కథఎమోషనల్ సన్నివేశాలుసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్: సూటిగా సాగే కథకథలో వేగం లోపించడం రేటింగ్‌: 4/5
    మార్చి 30 , 2023

    @2021 KTree