UATelugu2h 12m
యశోద(సమంత) పేద ఒక పేద యువతి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె తల్లి కావడానికి ఒప్పుకుంటుంది. ఆమెను మధు(వరలక్ష్మి శరత్ కుమార్)కి చెందిన ఎవా అనే సరోగసీ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ యశోద అద్దె గర్భం మాటున జరగుతున్న ఘోరాలు తెలుస్తాయి. సరోగసి మాఫియాతో సమంత ఎలా పోరాడింది? ఆ మాఫియా కోరల్లోంచి సమంత బయటపడిందా? అనేది కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సమంత రూత్ ప్రభు
యశోదఉన్ని ముకుందన్
డా. గౌతమ్వరలక్ష్మి శరత్‌కుమార్
మధుబాలరావు రమేష్
కేంద్ర మంత్రి గిరిధర్మురళీ శర్మ
పోలీస్ కమిషనర్ బలరామ్సంపత్ రాజ్
వాసుదేవ IPSరాజీవ్ కుమార్ అనేజా విదేశీ వ్యవహారాల మంత్రి
శత్రు
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిషి IPSమధురిమకేర్ టేకర్ సుధమ్మ
దివ్య శ్రీపాదలీల
కల్పికా గణేష్
తేజుప్రియాంక శర్మ కాజల్
ప్రీతి అస్రానీ
బృందాసిబ్బంది
హరి మరియు హరీష్
దర్శకుడుశివలెంక కృష్ణ ప్రసాద్
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడుఎం. సుకుమార్
సినిమాటోగ్రాఫర్మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
సమంత నటించిన ‘యశోద’ మూవీ రివ్యూ
]ఫైనల్‌గా ఫస్టాఫ్‌లో కొంత భాగాన్ని భరించగలిగితే, మిగతా సినిమా అంతా ఇంటరెస్టింగ్‌గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ చాలా బాగుటుంది. థ్రిల్లర్స్ ఇష్టపడేవారు, సమంత ఫ్యాన్స్ తప్పక చూడొచ్చు.ఒక్క మాటలోDownload Our App
ఫిబ్రవరి 11 , 2023
అనారోగ్యం , యశోద సినిమాపై మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సమంత
]ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికత వల్ల జరిగిన ఓ విషాదకరమైన అనుభవంDownload Our App
ఫిబ్రవరి 11 , 2023
2022లో తెలుగు బాక్సాఫీస్ హిట్లు
]మయోసైటిస్‌తో బాధపడుతూ డబ్బింగ్ చెప్పిన సమంత ‘యశోద’ హిట్ సాధించింది. బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ నటించిన గాలోడు బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసింది. మసూద, లవ్ టుడే వంటి చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.చివర్లో చిన్నసినిమాలు
ఫిబ్రవరి 13 , 2023
సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
సమంత ఎవరు?
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సమంత దేనికి ఫేమస్?
సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
సమంత వయస్సు ఎంత?
సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
సమంత ముద్దు పేరు?
సామ్
సమంత ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
సమంత ఎక్కడ పుట్టింది?
చెన్నై
సమంతకు వివాహం అయిందా?
2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది.
సమంత అభిరుచులు?
పాటలు పాడటం, షాపింగ్, జిమ్ చేయడం
సమంత ఇష్టమైన ఆహారం?
స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ
సమంత అభిమాన నటుడు?
ధనుష్, సూర్య, రజనీకాంత్
సమంత తొలి సినిమా?
ఏమాయ చేసావే
సమంత ఏం చదివింది?
కామర్స్‌లో డిగ్రీ చేసింది
సమంత పారితోషికం ఎంత?
సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సమంత తల్లిదండ్రుల పేర్లు?
జోసెఫ్ ప్రభు, నైనిటీ
సమంతకు అఫైర్స్ ఉన్నాయా?
సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది
సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.
సమంత ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en
సమంత సిగరేట్ తాగుతుందా?
కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది
సమంత మద్యం తాగుతుందా?
తెలియదు
సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
చిన్మయి, రానా, అక్కినేని అఖిల్
సమంతకు టాటూలు అంటే ఇష్టమా?
అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది.
సమంతకు వచ్చి వ్యాధి పేరు?
ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.
సమంత గుడి ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు.
https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
ఏప్రిల్ 27 , 2024
SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఇక కష్టమే
సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడిందని అంతా భావిస్తున్నారు.
సామ్ ప్రాజెక్టులు
సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.
మయోసైటిస్ సమస్యలు
మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం.
అందం తగ్గిపోయిందా?
సమంత లుక్ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.
సమంత పనైపోయింది
నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఏం మాయ చేశావే
నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.
ఫ్యాన్ బేస్
సమంత ఫ్యాన్ బేస్ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి.
ఏప్రిల్ 17 , 2023
Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?
నటినటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్, గౌతమి, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఇవాళ (ఏప్రిల్ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్ డైరెక్టర్ కావడం, దిల్ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం.
కథ:
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్ మోహన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.
టెక్నికల్‌గా:
శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్ గుణశేఖర్ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
సమంత నటనమణిశర్మ సంగీతం విరామ, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
Anthahpuram: సౌందర్యను రీప్లేస్ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్ చేయగలదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
కృష్ణవంశీ ఏమన్నారంటే?
సౌందర్య, సాయికుమాార్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్ ఎంతో టాలెంటెడ్. తమ నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్ బదులిస్తూ నివేతా థామస్, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
సౌందర్యను రీప్లేస్ చేయగలరా!
స్టార్ హీరోయిన్ సమంతకు గ్లామర్ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.
డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్
డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్‌సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
HBD SAMANTHA: ఆ ఒక్కటి సమంతకే చెల్లింది.. బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్తమాన హీరోయిన్స్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం…
రంగస్థలం రామ లక్ష్మి
రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మజిలీ శ్రావణి
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్ నటన నెక్స్ట్ లెవల్. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఓ బేబీ
సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ.
యశోద
అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి.
శకుంతల
కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.
పుష్ప ది రైజ్
పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఫ్యామిలీ మెన్ రాజీ
మనోజ్ బాజ్‌పేయ్ లీడ్ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పార్ట్ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్ అంటే నక్సలైట్ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్ సీన్‌లో నటించి షాకిచ్చింది.
సిటాడెల్
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.
ఏప్రిల్ 27 , 2023
Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్ చేసింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
మార్చి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఏప్రిల్
2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది.
జూన్
ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
జులై
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్ పాన్ ఇండియా స్థాయికి తెలిసింది.
ఆగస్టు
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్
గత నెల సెప్టెంబర్ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.
డిసెంబర్
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది.
అక్టోబర్ 17 , 2024
Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం..
సుహాసిని
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్ సక్సెస్ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.
ప్రీతి అస్రాని
బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్, మిన్నాలే 9 ఆవర్స్ వంటి ప్రముఖ షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నవ్య స్వామి
నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.
ఐశ్వర్య పిస్సే
33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.
శోభా శెట్టి
కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ప్రియాంక జైన్
నటి ప్రియాంక జైన్ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటించింది.
ఏప్రిల్ 13 , 2023
Raju Yadav Review : 'రాజు యాదవ్'గా గెటప్ శ్రీను మెప్పించాడా? ఈ రివ్యూలో తెలుసుకోండి!
నటీనటులు : గెటప్ శ్రీను, అంకితా కరాట్, హేమంత్, ఆనంద్ చక్రపాణి, నమని ప్రశాంత్ తదితరులు
డైరెక్టర్ : కృష్ణమాచారి. కె
సినిమాటోగ్రాఫర్ : సాయిరాం ఉదయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, స్వాతి పసుపులేటి
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). అంకిత కరాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటన సినిమాపై అంచనాలను పెంచింది. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?
కథేంటి
ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఊరిలో చాలా సరదాగా ఉండే అబ్బాయి. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా అతడికి ప్రమాదం జరుగుతుంది. దీంతో ఓ వైద్యుడ్ని సంప్రదిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి రాని చికిత్స చేయడంతో రాజు స్మైలింగ్ డిజార్డర్ అనే వ్యాధి బారిన పడతాడు. అప్పటి నుంచి రాజు నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా స్విటీ (అంకితా)తో ప్రేమలో పడినప్పుడు అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ప్రేమకు అతడి నవ్వు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? రాజు-స్విటీ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హాస్య నటుడు గెటప్ శ్రీను.. రాజు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడు. అటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ తాను అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేయసి పాత్రలో అంకితా కరాట్ పర్వాలేదనిపింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చక్కటి నటన కనిబరిచాడు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణమాచారి.. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఫన్, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించారు. స్మైలింగ్ డిజార్జర్ అనే సమస్యతో హాస్యాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అదే సమయంలో ఆ డిజార్డర్ చుట్టే భావోద్వేగ సన్నివేశాలను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలకు సినిమా హత్తుకునేలా చేశారు. ముఖ్యంగా గెటప్ శ్రీను, ఆనంద్ చక్రపాఠి మధ్య వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది. కొన్ని సీన్లు సాగదీతలా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
గెటప్ శ్రీను నటనకామెడీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 24 , 2024
RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు.
ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయని వాటిలో 90% ఫెయిలవుతున్నట్లు ఆర్జీవీ చెప్పాడు. చిత్ర నిర్మాతలు ఎంచుకున్న కథ, తారాగణం, సృజనాత్మక అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోని 90% నిర్మాతలకు ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియదని ఈ లెక్కలు రుజువు చేస్తున్నట్లు చెప్పాడు.
సినిమా తీయగల టాలెంట్ ఉన్న ఆడియన్స్‌కు మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కలిసి కట్టుగా నిర్మూలిద్దామంటూ వారికి పిలుపునిచ్చాడు. ఇండస్ట్రీలోని స్టార్ల వారసులని కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా కృషి చేద్దామని ఆర్జీవీ అన్నాడు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. అవి మీ సమయాన్ని, డబ్బుని వృథా చేస్తాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి వాటిని కూడా నిర్మూలించేందుకు చేతులు కలపాలని సినీ అభిమానులకు పిలుపునిచ్చాడు.
చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఆర్జీవీ డెన్ ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ టిక్కెట్ కొనుగోలు చేసే ప్రేక్షకులు మాత్రమే సినిమాను నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. లీడ్ యాక్టర్స్, డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరికిస్ట్స్, డైలాగ్ రైటర్స్‌ను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర టెక్నికల్ సిబ్బందిని పరిశ్రమలోని నిపుణుల నుండి ఎంపిక చేసిన దర్శకుడు సెలక్ట్ చేస్తారని స్పష్టం చేశాడు.
అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందామని ఔత్సాహికులకు ఆర్జీవీ పిలుపునిచ్చాడు. వారందర్ని ఆర్జీవీ డెన్‌కి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. మరి మీలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.comకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్‌ని తెలుసుకోవాలని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సూచించారు.
ఔత్సాహికులు ఏ విధంగా అప్లై చేయాలి? వచ్చిన ఆప్లికేషన్ల నుంచి నటీనటులను ఫైనల్ చేసే విధానాన్ని కూడా ఆర్జీవీ తన వెబ్‌సైట్‌లో వివరంగా పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
పేరు వయసుఎత్తు (అడుగులలో)చర్మ రంగుకంటి రంగుసింగిల్ బస్ట్ సైజ్ ఫొటోసింగిల్ ఫుల్ ఫిగర్ ఫొటో
హీరో, హీరోయిన్ ఎంపిక ప్రక్రియ
ఆసక్తిగల వారు 15 రోజుల్లో పై వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 30 మందిని ఆర్జీవీ డెన్ సిబ్బంది లుక్స్‌ను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన 30 మంది వివరాలను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వారిలో ఎవర్ని ఎంచుకోవాలో పబ్లిక్ పోల్ నిర్వహిస్తారు. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్ 15 యువతీ, యువకులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని ఏదైన డైలాగ్ ఇచ్చి 30 సెకన్ల ఆడిషన్స్ వీడియో పంపాలని ఆర్జీవ్ డెన్ టీమ్ కోరుతుంది. మళ్లీ ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్టు చేసి మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ దఫా ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఏడుగురు యువతీ, యువకులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి నటనకు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్స్ పెట్టి వారిలో బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చిన వారిని తిరిగి పోల్‌లోకి తీసుకొస్తారు. అందులో టాప్‌లో నిలిచిన యువతీ యువకులను ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వారిని RGVDEN తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్‌గా అవకాశం ఇస్తారు.
మిగతా విభాాగాలు..
ఇదే విధంగా డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్, సినిమాటోగ్రాఫర్స్, లిరికిస్ట్స్ వారి విభాగాలకు తగ్గట్లు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.
https://rgvden.com/
ఏప్రిల్ 06 , 2024
Yoga Day: యోగాసనాల్లో హీరోయిన్ల అందాల విందు!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూన్ 21 , 2023
Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..!
రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు.
చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించాడు. సీతాపహరణం నుంచి రావణ సంహారం వరకు కథాంశంగా తీసుకుని ఆదిపురుష్‌ని తెరకెక్కించారు. అయితే, నితేశ్ తివారి తీయబోయే రామాయణం విజువల్ వండర్‌గా ఉండనుందట. స్టోరీ లైన్‌పై స్పష్టత లేనప్పటికీ రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించాలన్న సంకల్పంతో డైరెక్టర్ ఉన్నాడు. ఇందుకు అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు.
తారాగణం..
రామాయణం కథ అందరికీ తెలిసిందే. కానీ, దానిని చూపించడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే. అందుకే ప్రతి చిన్న విషయంలో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం ప్రధానంగా తారాగణంపై ఫోకస్ పెట్టింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీతగా అలియాను ఎంచుకున్నారు. దీపావళికి దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఉండనుంది.
రావణుడిగా యశ్..
కీలకమైన రావణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురితో డైరెక్టర్ చర్చించాడు. లేటెస్ట్‌గా కేజీఎఫ్ స్టార్ యశ్‌ని ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే, జనవరిలోనే మేకర్లు యశ్‌ని కలిశారట. అప్పటినుంచి స్క్రిప్ట్ చర్చల్లోనే వీరున్నారట. విలన్ రోల్ చేయడానికి యశ్ దాదాపుగా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో యశ్ రోల్‌ని కన్ఫర్మ్ చేయనుంది. వాస్తవానికి తొలుత హృతిక్ రోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి పరిశీలించి చూశారు. అయితే, విక్రమ్‌వేదలో నెగెటివ్ రోల్ దెబ్బకొట్టడంతో హృతిక్ రామాయణం ప్రాజెక్టుకు నో చెప్పాడు.
లుక్ టెస్ట్..
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లుక్ టెస్ట్ నడుస్తోంది. రాముడి పాత్రకు తగ్గట్టు రణ్‌బీర్ తనను తాను మలుచుకోనున్నాడు. పైగా, వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇటీవల వీరిద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర హిట్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్‌లో షూట్..
డిసెంబరు నుంచి ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. అన్నీ కుదిరితే 2025 దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను మధు మంతెన వర్మ, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీనిని తీసుకు రానున్నారు.
జూన్ 08 , 2023
Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!
మెగా తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులోకి ‘తండేల్’!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
చరణ్ వర్సెస్ చైతూ
టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బాలయ్య నుంచి గట్టిపోటీ!
గేమ్ ఛేంజర్, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 15 , 2024
Trivikram Birthday Special: త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ డైలాగ్స్
]యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు.- అరవింద సమేత వీర రాఘవ
ఫిబ్రవరి 11 , 2023
Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్‌లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.
ఎపూరు సోమన్న
అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి రగలాల్సిందే.
https://www.youtube.com/watch?v=JigfoYaKt5Y&t=33s
గోరేటి వెంకన్న
గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=kU344_l7S-U&t=4s
రసమయి బాలకిషన్
గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.
Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs
ఆర్.నారాయణమూర్తి
సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.
https://www.youtube.com/watch?v=pwV92lAeq_w&t=1119s
విమలక్క
భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.
https://www.youtube.com/watch?v=e33k9zFzk18&t=5s
బెళ్లి లలిత
‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు. సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=wLsc-0JvUf4
పయిలం సంతోష్
తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్‌గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.
https://www.youtube.com/watch?v=XXQTnLMJP6g&t=3s
సాయిచంద్
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
https://www.youtube.com/watch?v=KHtwovGCU9g&t=2s
ఆగస్టు 10 , 2023
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం : అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ : రాజు ఎడురోలు
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : నిహారిక కొణిదెల
విడుదల: 09-08-2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యదు వంశీ 90'sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంగోదావరి స్టైల్ కామెడీజాతర సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంద్వితియార్థం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 09 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024