• TFIDB EN
  • యాత్ర
    UTelugu2h 6m
    దివంగత Y. S. రాజశేఖర రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యే ముందు రాష్ట్ర ప్రజల పరిస్థితిని అర్థం చేసుకునేందుకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర నేపథ్యంలో చిత్రం రూపొందింది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మమ్ముట్టి
    వైఎస్ రాజశేఖర రెడ్డి
    సుహాసిని మణిరత్నం
    సబితా ఇంద్రారెడ్డి
    జగపతి బాబు
    వైఎస్ రాజా రెడ్డి
    రావు రమేష్
    కెవిపి రామచంద్రరావు
    అనసూయ భరద్వాజ్
    గౌరు చరిత రెడ్డి
    సచిన్ ఖేడేకర్
    గులాం నబీ ఆజాద్
    పోసాని కృష్ణ మురళి
    వై వెంకటరావు
    పృధ్వీ రాజ్
    సుజయ కృష్ణ రంగారావు
    విజయచందర్
    మండిపల్లి నారాయణ రెడ్డి
    తలైవాసల్ విజయ్
    తుళ్ల దేవేందర్ గౌడ్
    జీవా
    వినోద్ కుమార్ అల్వా
    కె. చెన్నకేశవ రెడ్డి
    నాగినీడు
    తేలపల్లి రాఘవయ్య
    నాసర్
    టీచర్ వెంకటప్ప
    సూర్య
    డాక్టర్
    దిల్ రమేష్వీరప్ప
    మహేష్ ఆచంటఓబులేష్
    సంజయ్ స్వరూప్ DCP
    రవి కాలే
    హెంచ్మాన్
    చత్రపతి శేఖర్
    రైతు
    కావేరి
    వర్కర్
    సిబ్బంది
    మహి వి రాఘవ్
    దర్శకుడు
    విజయ్ చిల్లానిర్మాత
    శశి దేవి రెడ్డినిర్మాత
    సత్యన్ సూర్యన్ ISC
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్ర్
    కథనాలు
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 
    న‌టీన‌టులు: వి.కె.న‌రేశ్‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాగ్ మ‌యూర్‌, శ్రీల‌క్ష్మి, ప్రియ‌ద‌ర్శిని, ర‌వితేజ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు రచన, ద‌ర్శ‌క‌త్వం: అనురాగ్ పాలుట్ల‌ సంగీతం: ఆర్‌.హెచ్‌.విక్ర‌మ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: సి.అంకుర్‌ నిర్మాత‌లు: బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌ విడుద‌ల తేదీ: 14-08-2024 ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్‌ మయూర్‌ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్‌ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.  కథేంటి రైల్వే ఉద్యోగి వీరాంజ‌నేయులు (బ్ర‌హ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజ‌నేయులు మ‌ర‌ణంతో ఇంటి బాధ్య‌త కుమారుడు నాగేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)పై ప‌డుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె స‌రయు (ప్రియా వ‌డ్ల‌మాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వ‌స్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌స్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మ‌రి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వీరు (రాగ్ మ‌యూర్‌)కు, స‌ర‌యు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే నాగేశ్వ‌ర‌రావు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో న‌రేశ్ త‌న‌దైన శైలిలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్‌ నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. యున నటుడు రాగ్‌ మయూర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్‌ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక ర‌వితేజ‌, రాకేశ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్‌ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్ర‌మ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్‌ చేసింది. అటు అంకుర్‌ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్‌ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నరేశ్‌, రాగ్ మ‌యూర్‌ నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకొన్ని సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    ఆగస్టు 14 , 2024
    Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే? 
    Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే? 
    నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు  రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ  సినిమాటోగ్రఫి: మధీ మ్యూజిక్: సంతోష్ నారాయణ్  ఎడిటర్: శ్రవణ్ బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్  నిర్మాత: మేక శివ  రిలీజ్ డేట్: 08-02-2024 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) వచ్చింది. యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్‌గా రాగా.. యాత్ర 2 ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి తీశారు. ఈ సీక్వెల్‌ మూవీ ఇవాళ గ్రాండ్‌గా థియేటర్స్ రిలీజయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సినిమాలో జగన్‌కు సంబంధించి ఏం చూపించారు? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ ఈ కథ మనందరికీ తెలిసిందే (Yatra 2 Movie Review). వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడతాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతాడు. వైఎస్సార్‌ అకస్మిక మరణంతో జగన్‌ ఓదార్పు యాత్రను చేపడతాడు. అధికార పార్టీ ఆదేశాలను దిక్కరించి ప్రజల్లోకి వెళ్తాడు. యాత్ర చేపట్టిన జగన్‌కు అధికార పార్టీ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎలాంటి పరిస్థితుల్లో జగన్‌ పార్టీ పెట్టాల్సి వచ్చింది? అరెస్టు తర్వాత జగన్‌ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదిరించి జగన్ సీఎం అయ్యారు? అన్నది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే వైఎస్సార్‌గా మమ్ముటి (Mammootty) తొలి 10 నిమిషాలే కనిపించినా తన మార్క్ నటనతో మెప్పించారు. ఇక వైఎస్ జగన్ పాత్రలో నటుడు జీవా (Jeeva) పరకాయ ప్రవేశం చేశారు. జగన్‌ హావభావాలు, రోల్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌ను జీవా పక్కాగా దించేశాడనే చెప్పాలి. ఎలాంటి తడబాటు, సందేహాలు లేకుండా జీవా తనకు లభించిన పాత్రలో దూరిపోయాడు. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్.. మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘యాత్ర’ సినిమాతో అందర్నీ మెప్పించిన దర్శకుడు మహి రాఘవ్.. ‘యాత్ర 2’ లోనూ తన మార్క్‌ చూపించారు. పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్‌గా కథను నడిపి మరోమారు సక్సెస్ అయ్యారు. 2009-2019 మధ్య జరిగిన ముఖ్య రాజకీయ ఘట్టాలను తీసుకొని జగన్‌కు ఎలివేషన్స్ ఇస్తూ కథ నడిపించారు. ఫస్టాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సెకండాఫ్‌లో రెగ్యులర్ పొలిటికల్ స్టఫ్ ఉండటంతో రొటీన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్‌ వస్తుంది. వైఎస్సార్‌, జగన్‌కు సంబంధించిన కొన్ని ఒరిజినల్‌ విజువల్స్‌ సినిమాలో వాడటం ప్లస్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాను, జగన్‌ను ఫాలో అయిన వారికి ఈ సినిమా అంత ఎక్సైటింగ్ అనిపించదు. అలాగే కొన్ని సీన్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తాయి.   టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మధీ అందించిన సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్‌లో, జగన్ పాత్రకి ఎలివేషన్స్ సమయంలో సంతోష్ నారాయణ్ ఇచ్చిన BGM హైలెట్‌గా నిలుస్తుంది. శ్రవణ్‌ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ జీవా నటనభావోద్వేగ సన్నివేశాలునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5 CLICK HERE FOR ENGLISH REVIEW
    ఫిబ్రవరి 08 , 2024
    <strong>Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?</strong>
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; [toc] నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) &nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.&nbsp;&nbsp; టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.&nbsp; https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.&nbsp; ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.&nbsp; స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.&nbsp; ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..&nbsp; ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.&nbsp; ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.&nbsp; ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.&nbsp; కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.&nbsp; సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి&nbsp; సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    Anasuya Bharadwaj Hot: భర్త, పిల్లల ముందే బికినీలో అనసూయ!
    Anasuya Bharadwaj Hot: భర్త, పిల్లల ముందే బికినీలో అనసూయ!
    ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ షేర్‌ చేసిన ఫొటోలు.. సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి.&nbsp; ప్రస్తుతం ఫ్యామిలీ విహార యాత్రలు చేస్తున్న అనసూయ.. వాటర్‌ ఫాల్స్‌ దగ్గర బికినీతో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.&nbsp; బ్లాక్‌ అండ్‌ పింక్‌ కాంబినేషన్‌లోని ఈ వాటర్‌ సూట్‌లో తన తడి అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది.&nbsp; ఎద, థైస్‌ అందాలను చూపిస్తూ.. చల్లటి నీటిలో జలకాలు ఆడింది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.&nbsp; అనసూయ లేటెస్ట్‌ గ్లామర్‌ షోను చూసిన నెటిజన్లు.. ఆమె ఒంపుసొంపులకు ఫిదా అవుతున్నారు. అందంలో రంగమ్మత్తకు పోటీ ఎవరూ రాలేరని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; జబర్దస్త్‌ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.&nbsp; 2012 - 2022 మధ్య&nbsp; బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.&nbsp; యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. Anchor Anasuya Hot 🔥 pic.twitter.com/N7ByHQl57v— Viji Tamil Channel ❤️ (@vijiandco6) June 30, 2023 రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.&nbsp; సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Peddha Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది.&nbsp; ఇందులో తెలంగాణ మాండలికం ఓన్‌ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; రీసెంట్‌గా ‘రజాకార్‌’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది.&nbsp; ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.&nbsp; అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది. గతంలో పుష్పలో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; పుష్ప 2తో పాటు ' ఫ్లాష్‌బాక్‌' (Flashback) అనే తమిళ చిత్రంలోనూ అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp;
    మే 24 , 2024
    James Cameron: ‘RRR’ కిక్కు ఇంకా దిగలేదన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌.. రాజమౌళిపై ప్రశంసలు!
    James Cameron: ‘RRR’ కిక్కు ఇంకా దిగలేదన్న హాలీవుడ్‌ డైరెక్టర్‌.. రాజమౌళిపై ప్రశంసలు!
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron).. మరోమారు మన దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; జేమ్స్‌ కామెరాన్‌ ఏమన్నారంటే? తాజాగా సాటర్న్‌ అవార్డుల కార్యక్రమంలో జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron on SS Rajamouli) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి అడిగారు. గతంలో రాజమౌళిని,&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దాని గురించి కాస్త చెబుతారా అంటూ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. దీంతో కామెరాన్‌ స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే నేను అతనితో చాలా నిజాయతీగా నాకు అనిపించిన విషయాన్ని చెప్పాను. అది (ఆర్‌ఆర్‌ఆర్‌) చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై ఆదిరిస్తూ ఇలాంటి స్థాయికి చేరడం గొప్పగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ టీమ్‌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్‌ చేయడంతో విషయం బయటకొచ్చింది.&nbsp; https://twitter.com/i/status/1755090067708842276 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రియాక్షన్‌ ఇదే! హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌.. రాజమౌళిని (James Cameron on SS Rajamouli)&nbsp; మరోమారు మెచ్చుకోవడంపై ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ స్పందించింది. కామెరాన్ వీడియోను షేర్‌ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు జత చేసింది. ‘జేమ్స్ కామెరాన్.. మీ అమూల్యమైన మాటలు మాలో స్ఫూర్తి నింపుతాయి. మరింత బాగా పని చేసేలా ప్రేరేపిస్తాయి. ఇండియన్ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆర్ఆర్ఆర్(RRR) మూవీ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడింది. మరోవైపు ఈ ట్వీట్‌ను నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. రాజమౌళి పనితనాన్ని మెచ్చుకుంటూ తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; గతంలోనూ ఇలాగే..! జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది ‘గోల్డెన్ గ్లోబ్స్’ తో పాటు ‘ఆస్కార్’ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి కింద ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆస్కార్‌ అవార్డ్‌ కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరాన్‌ను అప్పట్లో రాజమౌళి కలిశారు. తాను కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశానని.. అదోక అద్భుతం అంటూ ఆ సందర్భంగా రాజమౌళితో కామెరూన్‌ వ్యాఖ్యానించారు. తన భార్యకు కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ చూడాలని సూచించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ప్రశంసించడంతో ఆ వార్త యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది.&nbsp; https://twitter.com/i/status/1616676262118064132 రాజమౌళి బిజీ బిజీ..! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. బాలీవుడ్‌ స్టార్ దీపికా పదుకోనే (Deepika Padukone)ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తారని సమాచారం.&nbsp; జర్మనీలో చెమటోడ్చిన మహేష్‌! సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లారు. రాజమౌళి సినిమా కోసమని అక్కడ మూడు వారాల పాటు వ్యాయామంలో శిక్షణ కూడా తీసుకున్నారని టాక్‌. ఇటీవల మహేష్‌ హైదరాబాద్‌కు తిరిగి రాగా ఎయిర్‌పోర్టులో అతడి లుక్ చూసి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. లాంగ్‌ హెయిర్‌తో తలపైన టోపి పెట్టుకుని అచ్చం హాలీవుడ్‌ హీరోలాగా మహేష్‌ కనిపించాడు. దీంతో రాజమౌళి సినిమాలో ‌అతడి లుక్‌ ఇలాగే ఉండొచ్చని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సమాచారం బయట పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, సినిమా నటీనటులు ఎంపిక, షూటింగ్ త్వరలోనే జరుగుతుందని అన్నారు.&nbsp; https://twitter.com/i/status/1754172589659017328
    ఫిబ్రవరి 07 , 2024
    <strong>Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!</strong>
    Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!
    సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చిన ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్‌ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] రాజాసాబ్‌ (The Raja Saab) ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్‌ బాక్సాఫీస్‌ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌ వచ్చే ఏడాది ‘రాజాసాబ్‌’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్‌ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్‌ తెగ ఎదురుచూస్తున్నాడు.&nbsp; ఓజీ (OG) పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్‌ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్‌ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్‌ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.&nbsp; గేమ్‌ ఛేంజర్‌ (Game changer) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత చరణ్‌ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; వార్‌ 2 (War 2) టాలీవుడ్‌ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ‘వార్‌ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్‌ నటిస్తున్నారన్న టాక్‌ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్‌ తర్వాత తారక్‌ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్‌ 2’ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; VD 12 విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్‌ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్‌ లుక్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్‌ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్‌ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; తండేల్‌ (Thandel) నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్‌’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (Love story) మంచి హిట్‌ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.&nbsp; మిరాయ్‌ (Mirai) ‘హనుమాన్‌’ (Hanuman) వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తర్వాత యంగ్‌ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్‌’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్‌ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్‌ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; కుబేరా (Kubera) క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్‌ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్‌ చేస్తున్నట్లు టాక్‌. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్‌ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు.&nbsp; జీ 2 (G2) అడివి శేష్‌ (Adivi Sesh) హీరోగా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్‌ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; NANI 33 ‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్‌ బాస్టర్‌ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!</strong>
    Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!
    యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.&nbsp; భాగ్యశ్రీ ప్రేమలో పడిందా? ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 రౌడీ బాయ్‌తోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన&nbsp; చిత్రాలు ఇవే!
    Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన&nbsp; చిత్రాలు ఇవే!
    సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్‌ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్‌ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; యాత్ర (Yatra) దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.&nbsp; ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్‌.. ఎన్టీఆర్‌ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్‌ సాయంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్‌ తెరపై ఆవిష్కరించారు.&nbsp; లక్ష్మీస్ ఎన్టీఆర్‌ (Lakshmi's NTR) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు. అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu) 2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.&nbsp; జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana) తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.&nbsp; యాత్ర 2 (Yatra 2) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్‌ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.&nbsp; వ్యూహాం (Vyuham) వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.&nbsp; శపథం (Sapadam) 'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్‌ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.&nbsp; రజాకార్‌ (Razakar) సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.&nbsp; రాజధాని ఫైల్స్‌ (Rajadhani Files) గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్‌ పుష్పరాజ్‌, విశాల్‌ పతి, వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.&nbsp; లీడర్‌ (Leader) శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; భరత్‌ అనే నేను (Bharath Ane Nenu) మహేష్‌ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.&nbsp; నోటా (Nota) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్‌ చిత్రం ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్‌ (విజయ్‌).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్‌ చేసింది.&nbsp;
    మార్చి 13 , 2024
    Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్‌ షోలో తగ్గేదేలే..!
    Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్‌ షోలో తగ్గేదేలే..!
    Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్‌ షోలో తగ్గేదేలే..!బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ మరోమారు చిట్టి పొట్టి డ్రెస్‌లో తళుక్కుమంది.గ్లామర్‌ ఫోజుల్లో కనిపించి అందాల జాతర చేసింది. కొంటెగా చూస్తూ కవ్వించింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉన్నావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.హిందీలో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోతగ్గ బ్రేక్ రాలేదు.దీంతో దక్షిణాదిలో తన ‌అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జాన్వీ చూస్తోంది.ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.మరోవైపు కోలీవుడ్‌లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి.శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ.. ‘ధడక్‌’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు అవకాశాలు సైతం క్యూ కట్టాయి.రీసెంట్‌గా ‘మిలి’ సినిమాతో జాన్వీ ఆడియన్స్‌ పలకరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ జాన్వీ యమా యాక్టివ్‌గా ఉంటోంది.తన ఫొటో షూట్‌, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తోంది.ప్రస్తుతం జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 21.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూలై 19 , 2023
    <strong>Jr NTR Sons: టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై కర్చీఫ్‌ వేసిన తారక్‌ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్‌ అయినట్లేనా!</strong>
    Jr NTR Sons: టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై కర్చీఫ్‌ వేసిన తారక్‌ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్‌ అయినట్లేనా!
    దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్‌ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్‌ సైతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్‌ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్‌ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్‌ ఏంజలిస్‌ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్‌, భార్గవ్‌ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.&nbsp; బిడ్డల సినీ ఎంట్రీపై తారక్‌ ఏమన్నారంటే! టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్‌ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్‌ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్‌ హింట్‌ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్‌, భార్గవ్‌ సినిమా ఎంట్రీని ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; తారక్‌.. నందమూరి వారసుడు కాదా? ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్‌ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్‌ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.&nbsp; హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం! నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ స్టేటస్‌ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్‌, కల్యాణ్‌ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్‌ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.&nbsp; 'దేవర 2'.. తారక్‌ ఏం చెప్పారంటే? కలెక్షన్స్‌ పరంగా దేవర సాలిడ్‌ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర 2'పై తారక్‌ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్‌2లో కొన్ని సన్నివేశాలు షూట్‌ చేశాం. ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్‌ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్‌ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్‌ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్‌ అన్నారు.
    అక్టోబర్ 07 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో&nbsp; పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987&nbsp; పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.&nbsp; పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.&nbsp; పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.&nbsp; పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ (Save The Tigers S1 &amp; S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.&nbsp; పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;
    Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;
    'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.&nbsp; దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్‌, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్‌ మీరాస్‌ కాలేజీ (St. Mira's College)లో ఆమె చదువుకుంది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.&nbsp; అలా మరాఠీ సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్‌ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.&nbsp; 2008లో వచ్చిన 'సనాయ్‌ చౌగదే' (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.&nbsp; ఆ తర్వాత 'ఇందిరా విఝా' (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.&nbsp; 2016లో వచ్చిన&nbsp; బుధియా సింగ్‌ - బొర్న్‌ టూ రన్‌' (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడాది 'వెడ్డింగ్‌ యానివర్సరీ'తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 'బార్డ్ ఆఫ్‌ బ్లడ్‌' (Bard Of Blood) వెబ్‌సిరీస్‌లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్‌లో 'దేవర'నే మెుదటి సినిమా. శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్‌ ఘట్నేకర్‌ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.&nbsp; విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుందట.&nbsp; ఈ సోషల్‌ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.&nbsp; శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్‌ ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది.
    మార్చి 27 , 2024
    విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విశ్వక్ సేన్ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న  నటుడిగా గుర్తింపు పొందాడు. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. అయితే విశ్వక్ సేన్ గురించి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. విశ్వక్ సేన్ అసలు పేరు? దినేష్ నాయుడు. జాతకం దృష్ట్యా తన పేరును విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడు. విశ్వక్ సేన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు విశ్వక్ సేన్ తొలి సినిమా? &nbsp;హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'వెళ్లిపోమాకే'. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. విశ్వక్ సేన్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ విశ్వక్ సేన్ పుట్టిన తేదీ ఎప్పుడు? మార్చి 29, 1995 విశ్వక్‌కు వివాహం అయిందా? లేదు ఇంకా కాలేదు విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు? విద్య, విశ్వక్ 8వ తరగతి చదువుతున్నప్పుడు పదోతరగతి యువతి విద్య సోషల్ టీచర్‌గా రెడీ అయినప్పుడు తనను ఎంతో ఇష్టపడినట్లు పేర్కొన్నాడు. విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన సినిమా? జూ.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి విశ్వక్‌ సేన్ ఇష్టమైన హీరో? జూ.ఎన్టీఆర్. కాలేజీ చదువుతున్నప్పుడు అంతా అతని స్నేహితులు జూ. ఎన్టీఆర్&nbsp;డూప్‌లా ఉన్నావని అనేవారంట. విశ్వక్ సేన్ తొలి హిట్ సినిమా? ఈ నగరానికి ఏమైంది చిత్రం విశ్వక్‌ సేన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే దాస్‌ కా ధమ్కి, అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి హిట్లుగా నిలిచాయి. విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు, బ్లాక్ విశ్వక్ సేన్ తల్లిదండ్రుల పేర్లు? పార్వతి, శేఖర్ నాయుడు విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన ప్రదేశం? విశ్వక్‌కు తీర్థ యాత్రలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతాడు.&nbsp; విశ్వక్‌ సేన్ ఏం చదివాడు? జర్నలిజంలో డిగ్రీ చేశాడు. విశ్వక్‌ సేన్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఈ నగరానికి ఏమైంది చిత్రానికి గాను సంతోషం సినిమా అవార్డ్స్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. విశ్వక్ సేన్ పెంపుడు కుక్కల పేర్లు?&nbsp; Max, Baachi, and Ustaad. విశ్వక్ సేన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? విశ్వక్ 2024 వరకు 10 సినిమాల్లో నటించాడు.&nbsp; విశ్వక్‌ సేన్‌ ఇష్టమైన ఆహారం? బిర్యాని విశ్వక్ సేన్ వ్యాపారాలు? విశ్వక్ సేన్‌ తండ్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి.&nbsp; https://www.youtube.com/watch?v=oZzP3Xs7eHA విశ్వక్ సేన్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు విశ్వక్ సేన్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? విశ్వక్ సేన్ ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు .
    మార్చి 21 , 2024
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.&nbsp; డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? గామి సినిమా మొదటి రోజే (Gaami Day 1 Collections) రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా తొలి రోజు 2.50 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 1 మిలియన్‌ డాలర్స్‌ దిశగా ‘గామి’ పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. విష్వక్‌ సేన్‌ ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే అత్యధిక డే వన్‌ కలెక్షన్స్‌ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.&nbsp; View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) సాక్నిక్‌ లెక్కల ప్రకారం గామి చిత్రం తొలిరోజు కలెక్షన్స్‌ను ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) కూడా ప్రకటించింది. ఈ సినిమా తొలి రోజు రూ. 4.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Gaami Day1 Net Collections)ను వసూలు చేసినట్లు తన సైట్‌లో పేర్కొంది. అయితే వరల్డ్‌ వైడ్‌గా ఎంత వసూళ్లను రాబట్టిందోనన్న విషయాన్ని మాత్రం సాక్నిక్‌ తన సైట్‌లో ప్రస్తావించలేదు. అటు ‘గామి’ ఫస్ట్‌డే రోజున చెప్పుకోతగ్గ స్థాయిలో థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్నిక్‌ తెలిపింది. మార్కింగ్‌ షోకు 45.58%, మధ్యాహ్నం 56.47%, సాయంత్రం 49.88%, సెకండ్ షో 71.69% ఆక్యుపెన్సీ రేట్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఈ వీకెండ్‌లో ఆక్యుపెన్సీతో పాటు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషించింది.&nbsp; ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. అంటే గామి హిట్ అవ్వాలంటే రూ. 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. తొలిరోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ మూవీ ఈజీగానే లాభాల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; విష్వక్‌ నటనపై ప్రశంసలు అఘోరా శంకర్‌ పాత్రలో విశ్వక్‌ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. శంకర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అతడు నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో. యాక్ష విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
    మార్చి 09 , 2024
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’&nbsp; ఎలా ఉందంటే?
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’&nbsp; ఎలా ఉందంటే?
    నటీనటులు: విష్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, అభినయ, రమ్య పసుపులేటి, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, మయాంక్‌ పరాక్‌, రాజీవ్‌ కుమార్‌,&nbsp; దర్శకుడు: విద్యాధర్‌ కాగిత సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ సినిమాటోగ్రాఫర్‌: &nbsp;విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ నందీగాం నిర్మాత: కార్తిక్‌ శబరీష్‌, శ్వేత మోరవనేని విడుదల తేదీ: 8 మార్చి, 2024 విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఇందులో విష్వక్ తొలిసారి అఘోరా గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్‌ ట్రీట్‌ చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కాగా, భారీ అంచనాల నడుమ గామి చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అఘోరా గెటప్‌లో విష్వక్‌ మెప్పించాడా? అందరి అంచనాలను ఈ సినిమా నిలబెట్టిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్‌ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడికి చాందిని చౌదరి చేసిన సాయం ఏంటి? దేవదాసిని తరిమేసిన గ్రామస్తులే తిరిగి ఆమెకోసం ఎందుకు వెతకాల్సి వచ్చింది? హ్యుమన్‌ ట్రైల్స్‌ ఎందుకు చేస్తున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరేలా చేశారంటే&nbsp; ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. అఘోరా శంకర్‌ పాత్రలో అతడు విశ్వరూపం చూపించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్‌, ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు విద్యాధర్ కాగిత.. ‘గామి’ చిత్రాన్ని సరికొత్త కథతో తెరకెక్కించారు. ఇప్పటివరకూ రాని యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి.. అరంగేట్రంలోని మంచి ఇంప్రెషన్‌ సంపాదించాడు. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన దర్శకుడు.. శంకర్‌ పాత్రలో ప్రేక్షకులు త్వరగా లీనమయ్యేలా చేశారు. ఓ వైపు శంకర్‌ పాత్రను నడిపిస్తూనే సమాంతరంగా మరో రెండు విభిన్న స్టోరీలను తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచింది. చివర్లో ఆ మూడు కథలను లింకప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే లయన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ విజువల్‌ ట్రీట్‌గా అనిపిస్తుంది. అయితే సబ్‌ప్లాట్ స్టోరీలైన దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ ఎపిసోడ్‌ను సమర్థవంతంగా చూపించడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అటు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరీ సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ విద్యాధర్ ఇచ్చిన ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి. టెక్నికల్‌గా&nbsp; ఈ సినిమాకు సాంకేతిక విభాగం చాలా బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ విభాగం తమ పనికి 100 శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీల కెమెరా పనితనం మెప్పిస్తుంది. స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథ, కథనంవిష్వన్‌ నటనటెక్నికల్‌ టీమ్‌ మైనస్‌ పాయింట్స్‌ సబ్‌ప్లాట్ స్టోరీలుసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    Gaami Movie: ‘గామి’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాక్.. ఇక ఇలాంటివి చేయను: విశ్వక్ సేన్
    టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). దర్శకుడు విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌ ట్రీట్ ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపైకి మళ్లింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని పంచుతుందని మేకర్స్‌ చాలా ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్టు షాకిచ్చింది.  సెన్సార్‌ పూర్తి.. కానీ! ప్రామిసింగ్‌ కంటెంట్‌తో వస్తోన్న 'గామి' చిత్రం.. సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్‌ లభించినట్లు వారు ప్రకటించారు. ‘గామి’ట్రైలర్‌లోని విజువల్స్‌ బట్టి చూస్తే డెఫినెట్‌గా ఈ మూవీకి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్‌ బోర్డు.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ చిత్రంలో పెద్దలు మాత్రమే చూసే కంటెంట్‌ ఉండబోతున్నట్లు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశాలు ఏంటా అని తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.&nbsp; ‘నా కెరీర్‌లో గామి చివరిది’ ‘గామి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ గామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి సినిమా నాకే కాదు ఆడియన్స్ కి కూడా చాలా ప్రత్యేకం. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. నా కెరీర్‌లో నేను చేస్తున్న చివరి ప్రయోగాత్మక చిత్రం కూడా ఇదే. ఇక నుండి నేను చేసే సినిమాలు వేరే లెవల్లో ఉంటాయి. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తా’ అని అన్నాడు. ‘ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి (Chandini Chowdary) ‘గామి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్‌ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్‌లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఐమ్యాక్స్‌ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్‌ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి' అని చాందిని తెలిపింది.&nbsp; విశ్వక్‌ పారితోషికం ఏంతంటే? హీరో విష్వక్‌ సేన్ గత ఆరేళ్లుగా 'గామి' సినిమా కోసం పని చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు అతడి రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉండవచ్చని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా కోసం విశ్వక్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సినిమా ప్రారంభం కాగా.. అప్పటికీ విష్వక్‌కు ఈ స్థాయిలో ఫేమ్‌ లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమాను కంప్లీట్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలకు తగ్గట్లు విష్వక్‌కు భారీ మెుత్తమే ముట్టే అవకాశముంది.
    మార్చి 05 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.&nbsp; లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.&nbsp; యాత్ర-2&nbsp; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day&nbsp;MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
    హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్‌ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.&nbsp; ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి. ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటోంది. అఖండ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. తనను తాను నిరూపించుకోవడం కోసం సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ కొంటెది పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ తృప్తిపడుతోంది. ప్రగ్యా పర్సనల్ విషయానికొస్తే.. 1991 జనవరి 12న జన్మించింది. తెలుగులో 2015లో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది. &nbsp; హిందీలోనూ టిటూ MBA సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో కంచె తర్వాత నక్షత్రం (2017),&nbsp; మంచు విష్ణుతో చేసిన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు విజయం సాధించలేకపోయాయి.&nbsp; &nbsp;చాలా రోజుల తర్వాత అఖండతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. బ్లాక్‌ బాస్టర్ హిట్లు సాధించినా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
    ఆగస్టు 20 , 2023
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023

    @2021 KTree