రివ్యూస్
How was the movie?
తారాగణం
ప్రభాస్
ఈశ్వర్ చంద్ర ప్రసాద్ అలియాస్ యోగినయనతార
యోగి ఆసక్తిని ప్రేమిస్తాడుకోట శ్రీనివాసరావు
ప్రధాన విలన్ప్రదీప్ రావత్
కోటయ్య వ్యతిరేకత (అతిథి పాత్ర)సుబ్బరాజు
నర్సింగ్ సోదరుడుఅలీ
యోగి స్నేహితుడుశారద
యోగి తల్లిచలపతి రావు
యోగి తండ్రిచంద్ర మోహన్
యోగి మద్దతుదారుఫిష్ వెంకటయ్య
యోగి హెంచ్మాన్దేవరాజ్
రాజన్ పి. దేవ్
వేణు మాధవ్
ఎంఎస్ నారాయణ
బండ్ల గణేష్
రఘు కారుమంచి
ప్రభాస్ శ్రీను
ఉత్తేజ్
తాగుబోతుశంకర్ మెల్కోటే
జర్నలిజం ప్రొఫెసర్సునీల్
రాము (అతి అతిధి పాత్ర)ముమైత్ ఖాన్
సిబ్బంది
వివి వినాయక్
దర్శకుడుపి.రవీంద్రనాథ్ రెడ్డినిర్మాత
రమణ గోగుల
సంగీతకారుడుగురుకిరణ్ శెట్టి
సంగీతకారుడుసమీర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
]రేటింగ్: 3.0/5విజయ్ నటన
యోగిబాబుతో వచ్చే కామెడీ ట్రాక్
కుటుంబ సన్నివేశాలు
పాటలుబలాలురొటీన్ కథ
కథను ముందే ఊహించే సీన్లు
ఫ్యాన్స్‌కు నచ్చే సీన్లకే ప్రాధాన్యంబలహీనతలు
ఫిబ్రవరి 13 , 2023
The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!
నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్ పచౌరి, ప్రణవ్ మిశ్రా, విజయ్ కృష్ణ
దర్శకత్వం: సుదీప్తోసేన్
సంగీతం: వీరేష్ శ్రీవాల్స
నిర్మాణ సంస్థ: సన్‌షైన్ పిక్చర్స్
‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్ ఉందా? ది కేరళ స్టోరీ హిట్ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటి:
షాలిని ఉన్ని క్రిష్ణన్ (ఆదాశర్మ) నర్స్ అవ్వాలన్న కోరికతో నర్సింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే:
‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
సాంకేతికంగా:
దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ఆదాశర్మ నటనడైరక్షన్ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హింసాత్మక సన్నివేశాలుబోల్డ్ సీన్స్
రేటింగ్: 3/5
మే 05 , 2023
Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?
నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్, కోవై సరళ, ఆనంద్‌రాజ్ తదితరులు..
దర్శకత్వం : శివ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: నిషాద్ యూసఫ్
నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్, వంశీ ప్రమోద్
విడుదల తేదీ: 14-11-2024
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం 'కంగువా' (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్య ఖాతాలో మరో విజయం పడినట్లేనా? ఇప్పుడు తెలుసుకుందాం. (Kanguva Movie Review)
కథేంటి
ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie Review) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తమిళ స్టార్ హీరో సూర్య (Kanguva Movie Review) ఎప్పటిలాగే ఈ సినిమాలోనే అదరగొట్టేశాడు. ఫ్రాన్సిస్, కంగువా అనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ముఖ్యంగా కంగువా పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో సూర్య తన విశ్వరూపం చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాల వ్యక్తీకరణ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటాడు. ఇక విలన్‌గా బాబీ డియోల్ దుమ్మురేపారు. సూర్యకు సమఉజ్జీగా, క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడు. హాట్ బ్యూటీ దిశా పటాని తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాన్సిస్ పాత్రతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కమెడియన్ యోగిబాబు అక్కడక్కడ నవ్వులు పూయించాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్‌లకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శివ సరికొత్త కథతో కంగువాను రూపొందించారు. ఫ్రాన్సిస్ పాత్రతో సినిమాను మెుదలుపెట్టిన దర్శకుడు కథలోకి వెళ్లేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. ఓ చిన్న పాప ఫ్రాన్సిస్ లైఫ్‌లోకి రావడం, ఆమె ద్వారా గత జన్మను లింకప్ చేసి కథలోకి తీసుకెళ్లాడు. కంగువా ఎంట్రీ నుంచి అసలు కథను ప్రారంభించారు డైరెక్టర్. 1000 ఏళ్ల కిందట తెగలు ఎలా ఉండేవి? వారి మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నది ఆసక్తిగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశారు డైరెక్టర్. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, యాక్షన్ సీక్వెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్ గూస్‌బంప్స్ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాలు, విలన్ పాత్ర కాస్త బలహీనంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Kanguva Movie Review)అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ డిపార్ట్‌మెంట్ సినిమాకు మంచి ఔట్‌పుట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా కలిసొచ్చాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.
ప్లస్ పాయింట్స్
సూర్య నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంకొరవడిన ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 14 , 2024
Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్ క్లాస్ ఎమోషన్స్!
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు.
దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
నిర్మాత: రాకేష్ వర్రే
నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేది: జులై 19, 2024
హీరోగా వినోద్ కిషన్ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?
కథేంటి
లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు. మూసీ నది ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడుతుంటాడు. మరోవైపు భార్య వరలక్ష్మీ కుటుంబ భారం మెుత్తం తానే మోస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి రియల్ ఎస్టేట్ కోసం వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్)తో లక్ష్మణ్‌కు పరిచయమవుతుంది. శ్వేతను ట్రాప్ చేసేందుకు తాను డబ్బున్న వ్యక్తినని లక్ష్మణ్ కటింగ్ ఇస్తాడు. భార్య పేరు వాడుకొని బస్తీ మెుత్తం అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మీ ఏం చేసింది? లక్ష్మణ్‌కు శ్వేత భర్త ఎలా గుణపాఠం చెప్పాడు? పేక మేడలు లాంటి హీరో కలలు నిజమయ్యాయా? లేదా? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తమిళ నటుడు వినోద్ కిషన్ తెలుగులో నేరుగా చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. లక్ష్మణ్ పాత్రలో అతడు చక్కగా ఒదిగిపోయాడు. గాల్లో మేడలు కడుతూ కాలక్షేపం చేసే భర్త పాత్రలో అద్భుతన నటన కనబరిచాడు. మరోవైపు కుటుంబ భారం మోసే మిడిల్ క్లాస్ వైఫ్ పాత్రలో అనూష క్రిష్ణ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్ కూడా మంచి నటన కనబరిచింది. సినిమా మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
హైదరాబాద్ బస్తీలో ఉండే నిరుపేదల జీవితాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు నీలగిరి మామిళ్ల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటుందనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు. బస్తీల్లో ఉండే పరిస్థితులు అక్కడి పిల్లలను ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే దానికి ఫన్ టచ్ ఇచ్చారు డైరెక్టర్. అంతేకాదు మహిళ సాధికారతను సైతం చూపించే ప్రయత్నం చేశారు. జీవితంలో కష్టపడందే ఏది సాధ్యం కాదన్న సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. ఫస్టాఫ్ మెుత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కమర్షియల్ హంగులు లేకపోవడం, రొటిన్ స్టోరీ, కొన్ని సన్నివేశాలు గతంలోనే చూసిన భావనను కలిగించడం వంటివి మూవీకి మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయాలకు వస్తే సంగీతం బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా చాలా రిచ్‌గా నిర్మించారు.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారగణం నటనకథనం, స్క్రీన్‌ప్లేసందేశం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 19 , 2024
Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
నటీనటులు : విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రామచంద్రరాజు, యోగి బాబు, మురళిశర్మ, హరీష్ పెరడి, మోహన్ రమన్, విజయ్ కుమార్ తదితరులు
కథ, దర్శకత్వం: హరి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్
ఎడిటింగ్ : టీ.ఎస్. జై
నిర్మాత : కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్
విడుదల తేదీ: 26 ఏప్రిల్, 2024
యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి ‘భరణి’, ‘పూజా’ ఘన విజయాలను సాధించాయి. దీంతో మూడోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో ‘రత్నం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశాల్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? రత్నం సినిమా అంచనాలు అందుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి?
రత్నం (విశాల్).. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో జీవిస్తుంటాడు. జననీ (ప్రియా భవానీ శంకర్) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హీరో విశాల్ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా భవానీ శంకర్ మెప్పించింది. విశాల్‌తో వచ్చే ఏమోషనల్ సీన్స్‌లో ఈ అమ్మడు పోటీపడి మరి నటించింది. కామెడియన్ యోగిబాబు మరోమారు తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. గౌతమ్ మీనన్, సముద్రఖని, మురళి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ హరి.. ఎప్పటిలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేశారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య వచ్చే ఏమోషన్ సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్‌లో డెప్త్ కంటే సినిమాటిక్ టోన్ ఎక్కువగా ఉంది. యోగిబాబు కామెడీ సీన్లు తమిళ నేటివిటితో ఉండటం.. తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. ఇక డైరెక్టర్ హరి గత చిత్రాలతో పోలిస్తే స్క్రీన్‌ప్లే కూడా చాలా పూర్‌గా ఉంది. అయితే విశాల్ అభిమానులు, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉండటం మూవీకి ప్లస్.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్‌లో దేవి ఇచ్చిన BGM.. ఆ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది. అటు ఎం. సుకుమార్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. టీ.ఎస్ జై ఎడిటింగ్ వర్క్స్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విశాల్ నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కంటెంట్ లేకపోవడంఆసక్తి పెంచని స్క్రీన్ ప్లే
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 26 , 2024
Martin Luther King Movie Review: లాజిక్ కాస్త మిస్ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!
హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్ రోల్‌లో మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం.
కథ
ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు.
ఇక సెకండాఫ్ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది.
ఎవరెలా చేశారంటే?
మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనిపించింది.
టెక్నికల్‌గా..
నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
బలాలు
సంపూర్ణేష్ బాబు నటన
ఫస్టాఫ్ కామెడీ
బలహీనతలు
సెకండాఫ్ సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్ కన్‌క్లూజన్
చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు.
రేటింగ్: 3/5
అక్టోబర్ 27 , 2023
Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్.. మరి సినిమా హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు.
డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20
ఎలా ఉంది?
కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.
https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20
ఎవరెలా చేశారు?
జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.
టెక్నికల్‌గా..
గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్ బాగున్నాయి.
https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20
పాజిటివ్ పాయింట్స్
రజినీ ఎలివేషన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
డార్క్ కామెడీ
నెగెటివ్ పాయింట్స్
బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 2.75/5
ఆగస్టు 11 , 2023
Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Pushpa 2 Full HD Movie Leaked)అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు తమ అద్భుత నటనతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటు సినీ విమర్శకులు, అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ఈక్రమంలో పుష్ప 2 చిత్రం పైరసీ బారిన పడటంతో పరిశ్రమలో కలకలం రేగింది.
పైరసీ బారిన పుష్ప 2
పుష్ప 2 చిత్రం థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మ, మూవీరూల్స్, తమిళ్ రాకర్స్, ఫిల్మిజిల్లా, తమిళ్ యోగి, బప్పమ్ టీవీ, మూవీస్‌డా వంటి పలు పైరసీ వెబ్‌సైట్లలో లీకైంది. ఇది 1080p నుంచి 240p వరకు అనేక ఫార్మాట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ లీక్ వల్ల సినిమాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి మరింత వీలైంది.
"పుష్ప 2 డౌన్‌లోడ్" కోసం ఆన్‌లైన్‌లో హడావుడి
సినిమా విడుదల తరువాత "Pushpa 2 The Rule Movie Download," "Pushpa 2 Tamilrockers," "Pushpa 2 Telegram Links", Pushpa 2 The Rule Movie Free Download వంటి పదాలు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ చిత్రాన్ని పైరసీలో చూసేందుకు వెతుకులాట ఎక్కువైంది. ఈ పెరుగుదల పైరసీని మరింతగా ప్రోత్సహించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమాపై అభిమానుల స్పందన
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చాలా రివ్యూ సంస్థలు మంచి రేటింగ్ అందించాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాకు ఏకంగా 5/5 రేటింగ్ ఇచ్చాయి. ప్రత్యేకంగా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, కథనం, పవర్ ఫుల్ డైలాగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పవచ్చు. చిత్తూరు నేపథ్యంలో పుష్పరాజ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు, అతని ఎర్రచందనం వ్యాపారాన్ని (Pushpa 2 Full HD Movie Leaked) అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాడన్నదే ఈ కథాంశం. అల్లు అర్జున్ నెమ్మదిగా నడిచే సన్నివేశాలు, ఆయన ప్రతిసారి స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకుల స్పందన సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఫహద్ ఫాజిల్- రష్మిక మందన్న పాత్రలు
ఫహద్ ఫాజిల్ SP శేఖావత్ పాత్రలో తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పాత్ర కథానాయకుడి ప్రయాణానికి కొత్త కోణాన్ని అందించింది. రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో, ఈసారి మరింత బలమైన పాత్రతో కనిపించి, శక్తివంతమైన డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది
మహమ్మారిలా పైరసీ
పుష్ప 2 సినిమాపై సానుకూల రివ్యూలు ఉన్నప్పటికీ, పైరసీ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పైరసీ ఒకటి కాదు, రెండు కాదు, సినీ పరిశ్రమ మొత్తానికి ఒక మహమ్మారిలా మారింది. పుష్ప 2: ది రూల్ చిత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈ సినిమాను థియేటర్లకు వెళ్లకుండా పైరసీ ద్వారా చూసే వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మనం సినిమా ప్రదర్శనను థియేటర్లలో ఆనందించడం ద్వారా చిత్రబృందానికి మద్దతు అందించాలి.
పుష్ప 2 సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డిసెంబర్ 05 , 2024
OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
LGM
భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్ గెట్ మ్యారీడ్’ అన్నది ఉపశీర్షిక. హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్ తెలిపారు.
రాజుగారి కోడిపులావ్
‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
విక్రమ్ రాథోడ్
విజయ్ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathode). ఎస్.కౌశల్య రాణి నిర్మాత. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.
మిస్టేక్
అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్’ (Mistake). భరత్ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్ అని చిత్ర బృందం చెబుతోంది.
మెగ్ 2
హాలీవుడ్ మూవీ 'మెగ్ 2' (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్ 2 థియేటర్స్‌లోకి రానుంది.
మరికొన్ని చిత్రాలు
అభివన్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘దిల్ సే’ కూడా ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డబ్బింగ్ సినిమాలు బ్లడ్ అంట్ చాకోలెట్, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
రంగబలి
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు.
TitleCategoryLanguagePlatformRelease DateChoonaWeb SeriesHindiNetflixAugust 3The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5PareshanMovieTeluguSonyLIVAugust 4DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
జూలై 31 , 2023
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.
పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023
Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్? రాజాసాబ్ రిలీజ్ డౌటే!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మూవీ కావడంతో ‘రాజాసాబ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన కాలుకు గాయమైనట్లు ప్రభాస్ సోమవారం (డిసెంబర్ 16) స్వయంగా ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి.
జర్మనీలో చికిత్స
హీరో ప్రభాస్ (Rebel Star Prabhas) చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స అనంతరం కొంతకాలం పాటు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అయితే తొలుత ప్రభాస్ కాలు బెణికిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ప్రభాస్ సైతం స్వల్పగాయమే అంటూ స్పెషల్ నోట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే గాయం తీవ్రత పెద్దదిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.
https://twitter.com/TeluguChitraalu/status/1868623178979024900
రాజాసాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం వేగంగా షూటింగ్ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కాలికి గాయం కావడం షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభాస్, కమెడియన్ సత్య మధ్య చాలా వరకూ సీన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ జనవరి చివరి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ సైతం పెండింగ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’ చెప్పిన టైమ్‌కు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గాయంపై ప్రభాస్ ఏమన్నారంటే?
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కాలికి గాయం కావడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు ప్రభాస్ ఓ పోస్టు రిలీజ్ చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా’ అని ప్రభాస్ పేర్కొన్న పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.
https://twitter.com/NishitShawHere/status/1868554693749960915
నయన్ స్పెషల్ సాంగ్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం వీరితో పాటు నయనతార (Nayanthara) కూడా సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. నయన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు లేడీ సూపర్ స్టార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ - నయనతార కలిసి ‘యోగి’ (Yogi) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వారిద్దరు సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు.
డిసెంబర్ 17 , 2024
OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!
గతవారం లాగే ఈ వీక్ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సి 202 (C 202)
మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె.ఏ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో ఒక్క డైలాగ్ లేకుండా తమ హావాభావాలతోనే నటీనటులు ఆకట్టుకున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.
పొట్టేల్ (Pottel)
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna) జంటగా చేసిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకుడు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana)
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ‘నరుడి బ్రతుకు నటన’ రూపొందింది. శ్రుతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. టి.జి.విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా.సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
లగ్గం (Laggam)
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’. ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అక్టోబరు 25న విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapda Romance)
సందీప్ సరోజ్, తరుణ్, హర్షా నర్రా, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్‌లుగా చేసిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ (Venom The Last Dance)
ఈ వారం హాలీవుడ్‌లో సూపర్ హీరో చిత్రం రాబోతోంది. బ్లాక్‌బాస్టర్ మూవీ సిరీస్ ‘వెనమ్’కు కొనసాగింపుగా పార్ట్ 3 రాబోతోంది. 'వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో అక్టోబర్ 24న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. 3డి వెర్షన్‌లోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. ఈ సిరీస్‌లో ఇదే తన చివరి చిత్రమని కథానాయకుడు టామ్ హార్డీ ఇప్పటికే ప్రకటించాడు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateFamily PackMovieEnglishNetflixOct 23The Comeback 2004 Boster Red SacksSeriesEnglishNetflixOct 23Beauty In BlackSeriesEnglishNetflixOct 24TerritorySeriesEnglishNetflixOct 24Do PattiMovieHindiNetflixOct 25Don't MoveMovieEnglishNetflixOct 25Hell Bound 2 MovieEnglish/KoreanNetflixOct 25Satyam SundaramMovieTelugu/TamilNetflixOct 25NautilusSeriesEnglishAmazon Oct 25JigawattMovieHindiAmazon Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon Nov 7The Bike RidersMovieEnglishJio CinemaOct 21Furiosa: A Mad Max SagaMovieTelugu Dub Jio CinemaOct 23The Miranda BrothersMovieHindiJio CinemaOct 25The Legend Of Hanuman 5SeriesTelugu DubHotstarOct 25Aindham VedhamMovieTamilZee 5Oct 25A Zindagi MovieHindiZee 5Oct 25Maa Nanna SuperheroMovieTelugu Zee 5Oct 31
అక్టోబర్ 21 , 2024
Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న మూవీ ప్రాజక్ట్స్‌ను ఫినిష్ చేసేందుకు పవన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అక్కడి స్టార్ డైరెక్టర్‌పై పవన్ ప్రశంసలు కురిపించారు. అతడి ఫిలిం మేకింగ్ బాగుంటుదంటూ ఆకాశానికి ఎత్తారు. దీంతో ఆ డైరెక్టర్‌తో సినిమా పడితే వేరే లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అటు పవన్ కామెంట్స్‌పై సదరు డైరెక్టర్ కూడా తాజాగా స్పందించడంతో వీరి కాంబోకు ఎక్కువ రోజులు పట్టదన్న చర్చ మెుదలైంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? పవన్ చేసిన కామెంట్స్ ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ మేకింగ్ ఇష్టం: పవన్
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. అలాగే తమిళ హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) కామెడీ అంటే తనకు బాగా నచ్చుతుందని పవన్ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌పై తమిళ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి భేషజాలం లేకుండా పక్క ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లను ఆకాశానికి ఎత్తడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1841446808888758277
పవన్‌కు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్
తన మేకింగ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఆయన తక్కువ టైమ్‌లోనే ఎంతో పాపులర్ అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి కలిగించారు. అటువంటి డైరెక్టర్ గురించి పవన్ మాట్లాడటంతో వీరిద్దరి కాంబోపై ఒక్కసారిగా చర్చమెుదలైంది. వీరి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే థియేటర్లు దద్దరిల్లిపోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను పవన్ అంగీకరిస్తారో లేదో చూడాలి మరి.
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
త్వరలో పట్టాలపైకి ‘ఉస్తాద్’, ‘ఓజీ’!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. ఇటీవల హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 03 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ.
ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ
మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy)
అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్ ఘోష్).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.
బూమర్ అంకుల్ (Boomer Uncle)
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్'. ఇందులో ఓవియా, రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'నేసమ్ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.
హాట్‌స్పాట్ (Hotspot)
గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
నాగేంద్రన్స్ హనీమూన్ (Nagendran's Honeymoons)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
బహిష్కరణ (Bahishkarana)
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.
https://twitter.com/i/status/1802226071795896339
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్ అకెంటెంట్ త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
జూలై 18 , 2024
Rajanikanth vs Suriya: స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. బాక్సాఫీస్ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
రజనీకాంత్ vs సూర్య
తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్ ఫిల్మ్ వేట్టయాన్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.
భారీ తారాగణం
సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్ డాల్ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతిబాబు, డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.
గిరిజన యోధుడిగా 'సూర్య'
కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
రజనీకాంత్- అమితాబ్
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన 'వేట్టయాన్' సినిమాకి 'జై భీమ్' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, రావు రమేష్ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్ అయిన పోలీసు ఆఫీసర్.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్ యాక్షన్ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అటు టాలీవుడ్‌లోనూ..
టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ vs రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్ మెుదటి వారంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు.
జూన్ 28 , 2024
Kajal Karthika OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
కాజల్ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’ (Karungaapiyam). ‘కాజల్ కార్తీక’ (Kajal Karthika) పేరుతో ఈ సినిమా గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
నలుగురు హీరోయిన్లు
‘కాజల్ కార్తీక’ సినిమాలో మెుత్తం నలుగురు హీరోయిన్లు నటించారు. కాజల్, రెజీనాతో పాటు రైజా విల్సన్, జనని కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు హీరోయిన్లు ఒకే తెరపై కనిపించనుండటం, అది కూడా హార్రర్ సినిమా కావడంతో తమిళంలో ‘కరుంగాపియం’పై అప్పట్లో మంచి హైప్ ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. దీంతో థియేటర్లలో సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఆహాలో సక్సెస్ అయ్యేనా?
ఆహా (Aha)లో విడుదలయిన తర్వాత ‘కాజల్ కార్తిక’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు. తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో కమెడియన్ యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది.
https://twitter.com/Telugu70mmweb/status/1675141362306646016
కథేంటంటే
ఈ సినిమాను లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక.. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. ఆమె పగ ఎలా తీరింది? ఆమె మరణానికి కారణం ఏంటి? కార్తీక (రెజీనా), కార్తీక (కాజల్)కు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన నాలుగు కథలు ఏవి? అన్నది కథ.
ఏప్రిల్ 02 , 2024
WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం.
సీతారామం
సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2024
Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
సృష్టిలో ప్రతీ ప్రాణికీ మూల కారణం 'అమ్మ'. అటువంటి తల్లి గురించి చెప్పాలంటే భాష చాలదు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 'అమ్మ' పాత్ర.. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ చిరస్మరణీయం. అందుకే అమ్మ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మనసుకు హత్తుకునే కథలతో చక్కటి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas Mother Sentiment Movies) కు కూడా అమ్మ సెంటిమెంట్‌తో ఉన్న చిత్రాలు తీశారు. అతడి కెరీర్‌లో ఘన విజయాలు సాధించిన చిత్రాలన్ని దాదాపుగా తల్లి సెంటిమెంట్‌తో వచ్చినవే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సలార్
‘కేజీఎఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). ఇందులో ప్రభాస్ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అదే సమయంలో తల్లి మాటను జవదాటని కొడుకు గాను మెప్పించాడు. తల్లి-కొడుకుల సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో పాటు.. ప్రభాస్ మార్క్ యాక్షన్‌తో సలార్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించాడు.
బాహుబలి
ప్రభాస్ హీరోగా రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali), బాహుబలి 2 (Baahubali 2) చిత్రాలలోనూ తల్లి-కొడుకుల సెంటిమెంట్ దాగుంది. ప్రభాస్, రమ్యకృష్ణ పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కాగా, ఇందులో రానా (Rana Daggubati).. ప్రభాస్‌కు సోదరుడిగా నటించాడు. అనుష్క (Anushka Shetty) హీరోయిన్‌గా చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన డార్లింగ్ ఫేమ్.. అన్ని ఇండస్ట్రీలకు పాకింది.
ఛత్రపతి
ప్రభాస్ కెరీర్‌లో వచ్చిన మరో మదర్ సెంటిమెంట్ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘ఛత్రపతి’ (Chatrapathi). దీనిని కూడా దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించారు. ఈ సినిమా ప్రధానంగా యాక్షన్ చుట్టూ తిరిగినా.. కథలో తల్లి సెంటిమెంట్ అంతర్లీనమై ఉంటుంది. ఇందులో ప్రభాస్ తల్లిగా భానుప్రియ (Bhanu Priya) నటించారు. వారిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకుల కళ్లు చెమడ్చేలా చేస్తాయి. కాగా, ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటి శ్రియా (Shriya Saran) చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది.
యోగి
ప్రభాస్ కెరీర్‌లో వచ్చిన తొలి మదర్ సెంటిమెంట్ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘యోగి’ (Yogi Movie). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం సాధించనప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. టెలివిజన్‌లో కొన్ని వందలసార్లు అత్యధిక TRP రేటింగ్‌తో ఈ చిత్రం ప్రసారమైంది. ఇందులో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి శారద (Actress Sarada) నటించారు. హీరోయిన్‌గా నయనతార (Nayanthara) చేసింది. వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల, గురు కిరణ్ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, ముమైత్ ఖాన్, వేణు మాధవ్, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఫిబ్రవరి 05 , 2024