రివ్యూస్
How was the movie?
తారాగణం
సుమంత్
శివభూమికా చావ్లా
శివ ప్రేమ ఆసక్తిజయసుధ కపూర్
శివ తల్లిఅలీ
శివ స్నేహితుడువేణు మాధవ్
సతీష్కోట శ్రీనివాసరావు
ఆర్టీసీ అధికారిసూర్య
పోలీస్ ఆఫీసర్తనీష్
సిబ్బంది
ఎ.కరుణాకరన్
దర్శకుడునాగార్జున
నిర్మాతఎన్.సుధాకర్ రెడ్డినిర్మాత
మణి శర్మ
సంగీతకారుడుబాలసుబ్రహ్మణ్యం
సినిమాటోగ్రాఫర్మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్కథనాలు
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా చూపించిన ఈ సిరీస్, రెండో సీజన్‌లో తన ఉద్యోగ జీవితంలో పైకి ఎలా ఎదిగాడు, పలు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆకర్షణీయంగా చూపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరు౦ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
సిరీస్ విశేషాలు
ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతీ ఎపిసోడ్ దాదాపు 25-30 నిమిషాల నిడివి కలిగి ఉంది. మొత్తం రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్‌ను చాలా సులభంగా వీక్షించవచ్చు. ఎపిసోడ్ల మధ్య ఎక్కడా బోర్ అనిపించకుండా స్టోరీ సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 4వ ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్‌గా సాగి, కొన్ని సందర్భాల్లో నాటకీయత ఎక్కువై అసలు కథకు అంతరాయం కలిగిస్తుంది. అయితే, 5వ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కుటుంబంతో కలసి చూడటం కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కపుల్స్ మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు.
నటీనటులు
తేజస్వి మదివాడ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ పాత్ర పోషించారు. ట్రైలర్‌లో బికినీ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె తన గ్లామర్ పాత్రతో అందరినీ ఆకర్షించింది. తేజస్వి గతంలో ఈ విధమైన పాత్ర చేయకపోయినా, ఈసారి తన రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించారు. అరుణ్ కుమార్ పాత్రలో నటించిన పవన్ సిద్ధు పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా తేజస్వితో ఉన్న సన్నివేశాల్లో సీన్లను బాగా మెప్పించాడు. అనన్య శర్మ తన క్యారెక్టర్‌కు అనుగుణంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆమె అరుణ్ కుమార్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించారు.
దర్శకత్వం
దర్శకుడు ఆదిత్య కేవీ మొదటి సీజన్‌లో అమెచ్యూర్ నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదురుకెళ్లే అరుణ్ కథను చక్కగా చూపించారు. రెండో సీజన్‌లో అతను ఉద్యోగంలో ఎదగడం, కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే, 4వ ఎపిసోడ్‌లో ఎక్కువగా కేవలం సంభాషణలే ఉండడంతో కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా ఈ సిరీస్ ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ రిచ్ లుక్‌ను కలిగి ఉండి, అజయ్ అరసాడా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరింత మెరుగ్గా ఆవిష్కరించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది.
చివరగా:
వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ సరైన ఎంపిక. పూర్తి వినోదాన్ని అందిస్తుంది.
రేటింగ్:
3/5
నవంబర్ 02 , 2024
KA Movie Review: ‘ క’ సినిమాను హిట్ చేసిన టాప్ 5 అంశాలు
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్
టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్.ఆర్. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్ పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చివరగా
మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రేటింగ్ : 3.5/5
నవంబర్ 01 , 2024
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
[toc]
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
అక్టోబర్ 22 , 2024
Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్ నుంచి తొలగింపు!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసింది. ఆమె చేసిన ఒక్కడు, ఖుషీ, సింహాద్రి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అటువంటి భూమికకు హిందీలో ఘోర అవమానం జరిగింది. కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఈ విషయాన్ని భూమిక తాజాగా పంచుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ నుంచి ఆమెను అర్ధాంతరంగా తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏడాది వెయిట్ చేసినా.. తప్పించారు!
సుమంత్ హీరోగా రూపొందిన యువకుడు (2000) చిత్రంతో నటి భూమిక చావ్లా హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఖుషి, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. సింహాద్రి తర్వాత హిందీలో చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'తేరే నామ్' కూడా సక్సెస్ కావడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మున్నాభాయ్ ఎంబీబీఎస్ కాగా, మరొకటి 'జబ్ వీ మెట్'. షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా చేసిన 'జబ్ వీ మెట్' తొలుత తనను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు భూమిక తాజాగా వెల్లడించారు. ఆ మూవీ కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూసినట్లు చెప్పారు. డేట్స్ ఇష్యూ రాకుండా వేరే సినిమాలేవి ఒప్పుకోలేదని తెలిపారు. అయితే జబ్ వీ మెట్ సినిమాకు తొలుత బాబీ డియోల్‌ను హీరోగా అన్నుకున్నారని, ఆ తర్వాత అతడ్ని కాదని షాహీద్ కపూర్‌ను తెరపైకి తీసుకొచ్చారని భూమిక అన్నారు. ఆ తర్వాత తనను కూడా సైడ్ చేసి కరీనా కపూర్‌ను ఫైనల్ చేశారని వాపోయారు. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని పేర్కొన్నారు.
https://twitter.com/theBuzZBasket/status/1846077009803297009
ఆ మూవీస్ సక్సెస్ సంతోషాన్నిచ్చింది: భూమిక
హిందీలో తెరకెక్కిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ విషయంలోనూ భూమిక చావ్లాకు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోనూ తొలుత భూమికను హీరోయిన్‌గా అనుకున్నారు. అనివార్య కారణాలతో ఆమెను తప్పించి విద్యాబాలన్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమా హిందీలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో మెగాస్టార్ రీమేక్ చేసి ఘన విజయం అందుకున్నారు. అయితే ఆ రెండు ఆఫర్లు కోల్పోయినప్పటికీ తెలుగులో తాను చేసిన ఖుషీ, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు బాగా ఆడాయని భూమిక గుర్తు చేశారు. ఇటీవల రీరిలీజ్ కూడా అయ్యి మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందని కామెంట్ చేశారు.
గర్ల్‌ఫ్రెండ్ కోసమే తప్పించారా?
‘జబ్ వి మెట్’ సినిమా నుంచి భూమికను తప్పించడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ మూవీ సమయంలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌తో షాహిద్ కపూర్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భూమికను తప్పించి తన ప్రియురాలుకు షాహిద్ కపూర్ ఛాన్స్ ఇప్పించారని విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత వారిద్దరు విడిపోవడం ఆపై సైఫ్ అలీఖాన్‌ను కరీనా ఇష్టపడటం జరిగింది. కొద్ది కాలం తర్వాత సైఫ్ అలీఖాన్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. అయితే షాహిద్ పక్కన భూమిక కన్నా కరీనా అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివరి క్షణంలో ఆమెను తప్పించినట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్ తర్వాత భూమిక హిందీలో పలు చిత్రాలు చేసినప్పటికీ అవి పెద్దగా కలిసిరాలేదు.
21 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం భూమిక తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. కీలకమైన సహాయక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి), సవ్యసాచి, రూలర్, పాగల్, సీటిమార్, సీతారామం, బటర్‌ఫ్లై వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న యుఫోరియా చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కడు వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత గుణశేఖర్ నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 21 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. కొత్త జర్నీ మెుదలైందంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)
అక్టోబర్ 16 , 2024
NTR 31: జూ.ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్.. బంగ్లాదేశ్ రైతుగా తారక్?
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో తారక్ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి!
తారక్ బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్‌కు డేట్స్ అడ్డస్ట్ చేయవచ్చని తారక్ అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయాలపై క్లారిటీ
దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
అక్టోబర్ 01 , 2024
Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ.
ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ
మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy)
అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్ ఘోష్).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.
బూమర్ అంకుల్ (Boomer Uncle)
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్'. ఇందులో ఓవియా, రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'నేసమ్ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.
హాట్‌స్పాట్ (Hotspot)
గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
నాగేంద్రన్స్ హనీమూన్ (Nagendran's Honeymoons)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
బహిష్కరణ (Bahishkarana)
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.
https://twitter.com/i/status/1802226071795896339
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్ అకెంటెంట్ త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
జూలై 18 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే?
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
ది గోట్‌లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్’. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్ తెలిపింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్
మరో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. ఆడమ్ విన్‌గార్డ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.
కలియుగం పట్టణంలో
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సుందరం మాస్టర్
వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
ఏం చేస్తున్నావ్?
విజయ్ రాజ్‌కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’ (Em chesthunnav OTT Release). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.
ట్రూ లవర్
జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ లవర్’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
మార్చి 25 , 2024
Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?
ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
కంగువా కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంగువా' (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 14) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి కంగువాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.
‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే!
దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్రణవకోన, కపాల కోన, సాగర కోన, అరణ్యకోన, హిమ కోన అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఏ కోనతోనూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.
మట్కా ఓపెనింగ్స్ మరీ దారుణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూసి ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు కరుణ కుమార్ చాలా రొటీన్ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్ తేజ్ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఒక్క పాయింట్ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.
‘జైలర్’ డైరెక్టర్‌తో పాన్ ఇండియా చిత్రం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్, జైలర్ హిట్స్‌తో నెల్సన్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
2026 వరకూ ఆగాల్సిందే!
తారక్ - నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్ 'వార్ 2' (War 2) పెండింగ్ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్ సైతం ‘జైలర్ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్ 2’ షూటింగ్ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.
మా స్ట్రెంత్ అతడే: తారక్
'దేవర' బ్లాక్ బాస్టర్ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్యాణ్ రామ్ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు.
బంగ్లాదేశ్ రైతుగా జూ.ఎన్టీఆర్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్ ఫిక్సయ్యిందా?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 05 , 2024
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసింది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్ దర్శకులకు తారక్ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్స్!
టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట జూ.ఎన్టీఆర్ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి దేవరతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్'తో సక్సెస్ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో సక్సెస్ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్ క్రియేట్ చేస్తున్నాడు.
ఒకే ఒక్క హీరోగా తారక్
హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న వాడే. అయితే తారక్ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’, సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్) వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.
23 ఏళ్ల ఫ్లాప్ రికార్డు బద్దలు
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమంట్‌ను బీట్ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్ వెంటనే ‘దేవర’తో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్ స్వయంగా తానే దీనిని బ్రేక్ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 04 , 2024
Devara Run Time Fear: దేవర సెన్సార్ వర్క్ కంప్లీట్.. తెలిసి కూడా తప్పు చేస్తున్నారా?
ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను 'దేవర' (Devara: Part 1) పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను కూడా సెన్సార్ సభ్యులు ఫిక్స్ చేశారు. సుదీర్ఘమైన ఈ సినిమా నిడివిని చూసి అభిమానుల్లో కొత్త టెన్షన్ మెుదలైంది. తెలిసి కూడా దేవర టీమ్ రిస్క్ చేస్తున్నారా? అన్న కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెన్సార్ క్లియర్
జూ.ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన దేవర చిత్రం సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నిడివిని 2 గంటల 57 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే దాదాపుగా మూడు గంటల నిడివితో దేవర థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. సాధారణంగా మూడు గంటలు అంటే పెద్ద నిడివే అని చెప్పవచ్చు. అయితే, దేవర మూవీలో యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఉండడం, కథను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండటంతో ఎక్కువ నిడివికే మేకర్స్ నిర్ణయించుకున్నారు.
తెలిసే రిస్క్ చేస్తున్నారా?
దేవర చిత్రాన్ని దాదాపు మూడు గంటల నిడివితో తీసుకొస్తుండటం పెద్ద రిస్కే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు గంటల పాటు ప్రేక్షకులను సీట్‌లో కూర్చోపెట్టడం అంటే మాములు విషయం కాదని అంటున్నారు. కథ ఏమాత్రం ల్యాగ్ అనిపించినా, అనసవర సన్నివేశాలు వచ్చినా అది సినిమాపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని తేల్చి చెబుతున్నారు. గతంలో వచ్చిన పలు చిత్రాల విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. కథ ఎంత బాగున్నప్పటికీ నిడివి కారణంగా ఆ సినిమాలు దెబ్బతిన్నాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి ‘దేవర’ విషయంలో ఏమాత్రం అంచనాలు మిస్ అయినా భారీ ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. అటు కొందరు తారక్ ఫ్యాన్స్ సైతం నిడివి విషయంలో నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!
ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.
కొరటాల పైనే భారం!
గత చిత్రాల్లో లాగా కొరటాల శివ మ్యాజిక్ చేయగలిగితే నిడివి పెద్ద సమస్య కాదని చెప్పవచ్చు. తారక్ యాక్టింగ్‌తో పాటు కథ, కథనం, మేకింగ్‌తో కొరటాల కట్టిపడేస్తే 'దేవర' రన్‌టైమ్ బిగ్ ప్లస్‌గా మారే అవకాశం లేకపోలేదు. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్ సక్సెస్ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’తో పాటు అంతకుముందు వచ్చిన 'కల్కి 2898 ఏడీ', యానిమల్ 'సలార్', యానిమల్ చిత్రాలు కూడా మూడు గంటల నిడివితో వచ్చే సక్సెస్ అయ్యాయి. కొరటాల శివ గతంలో మాదిరి దేవర విషయంలోనూ మ్యాజిక్ చేయగలిగితే ఈ సినిమా సకెస్స్‌ను ఎవరూ అడ్డుకోలేరు.
రాజమౌళి ఫ్లాప్ భయం!
‘దేవర’ చిత్రాన్ని మరో భయం కూడా వెంటాడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో పనిచేసిన హీరోలు తమ తర్వాతి చిత్రాల్లో భారీ ఫ్లాప్స్‌ను అందుకున్నారు. రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్ విషయాల్లో ఇదే రుజువైంది. అంతేందుకు రాజమౌళితో చేసిన ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ వంటి హిట్ చిత్రాల తర్వాత తారక్ చేసిన మూవీస్ డిజాస్టర్లుగా నిలిచాయి. సుబ్బు, ఆంధ్రావాలా అతడి కెరీర్‌లో మాయని మచ్చలా మారిపోయాయి. తారక్ గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన నేపథ్యంలో ‘దేవర’పై ఆందోళన వ్యక్తంమవుతోంది. దేవర విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ‘దేవర’తో ఈ సెంటిమెంట్‌ను బద్దలు కొడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 12 , 2024
Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరిగ్గా 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైగ్ ఆడియన్స్‌ను పలకరించనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో తారక్‌కు జోడీగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), బాబీ డియోల్ (Bobby Deol) వంటి హిందీ స్టార్ నటులు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దేవర’ రన్‌టైమ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది చూసి తారక్ ఫ్యాన్స్ అందోళనకు గురవుతున్నారు.
రన్ టైమ్ ఎంతంటే?
తారక్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన దేవర చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రన్ టైమ్ ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మెుత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను దేవర టీమ్ ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఎడిటింగ్ వర్క్ మెుత్తం పూర్తైన అనంతరం ఈ మేరకు నిడివి వచ్చిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నిడివి ‘దేవర’ను ఇబ్బంది పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన చాలా వరకు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ నిడివే ‘దేవర’కు ఫైనల్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే సెన్సార్ బోర్డు సమీక్షకు ఈ మూవీ వెళ్లాల్సి ఉంటుంది. బోర్డ్ సభ్యులు ఏదైన కత్తెరలు విధిస్తే నిడివి కాస్త తగ్గే అవకాశముంది.
కొరటాల మ్యాజిక్ చేసేనా?
సెన్సార్ ఎన్ని కత్తెరలు విధించిన ‘దేవర’ నిడివి 3 గంటల కంటే తగ్గే పరిస్థితులు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల స్క్రీన్‌ప్లే ప్రెజెన్స్‌పై సినిమా సక్సెస్ ఆధారపడనుంది. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్ సక్సెస్ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ కూడా దాదాపుగా 3 గంటల నిడివితో రిలీజైంది. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ డ్రామా, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ స్కిల్స్, నాని - ఎస్.జే. సూర్య అద్భుతమైన నటనతో నిడివి పెద్దగా సమస్య కాలేదు.
నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!
ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.
కొత్త పోస్టర్ రిలీజ్
దేవర చిత్రం నుంచి నేడు మూడో సాంగ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాటలను విడుదల చేయగా.. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి 'దావుడి' పేరుతో థర్డ్ సింగిల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తారక్, జాన్వీ కపూర్ ఇచ్చిన రొమాంటిక్ ఫోజు ఆకట్టుకుంటోంది.
https://twitter.com/DevaraMovie/status/1831219654229913706
‘దేవర’ స్టోరీ అదేనా?
'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సెప్టెంబర్ 04 , 2024
Demonte Colony 2 Movie Review: హారర్ థ్రిల్లర్ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?
నటీ నటులు : అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జనో ఖలీద్, అర్చన చందోక్ తదితరులు
దర్శకత్వం : ఆర్. జ్ఞానముత్తు
సంగీతం : శ్యామ్ సీ. ఎస్
నిర్మాత : బాబీ బాలచంద్రన్
విడుదల తేదీ : 23-08-2024
అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. అజయ్ ఆర్.జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్‌కుమార్ నిర్మాతలు. తమిళంలో ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 23న తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను కూడా అలరించిందా? గతంలో వచ్చిన డిమోంటి కాలనీ తరహాలోనే విజయం సాధించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. క్యాన్సర్ వంటి మహమ్మారిని జయించిన అతడు ఇలా సుసైడ్ చేసుకోవడాన్ని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేకపోతుంది. భర్త ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడం కోసం అతడి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓ లైబ్రరీలోని పుస్తకం కారణంగా తాను చనిపోవాల్సి వచ్చిందని శ్యామ్ ఆత్మ చెబుతుంది. అయితే ఆ పుస్తకం చదివిన చాలా మంది ఇలాగే చనిపోయినట్లు డెబీ కనుగొంటుంది. రీసెంట్‌గా శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) కూడా ఈ పుస్తకాన్ని చదివారని డెబీ తెలుసుకుంటుంది. వారి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని గ్రహిస్తుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి? దాని వెనకున్న దుష్ట శక్తి రహాస్యం ఏంటి? ఆ కవల సోదరులను రక్షించేందుకు తన మామయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి డెబీ ఏం చేసింది? వాళ్ల ప్రయత్నాలకు బౌద్ద సన్యాసులు ఎలాంటి సాయం చేశారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
హీరో అరుళ్ నిధి ఇందులో కవలలుగా ద్విపాత్రాభినయం చేశాడు. రెండు క్యారెక్టర్ల మధ్య లుక్స్, నటన పరంగా చక్కటి వేరియేషన్స్ చూపించాడు. మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో ప్రియా భవాని శంకర్ అదరగొట్టింది. గత చిత్రాల్లో గ్లామర్ పాత్రలో అలరించిన ఆమె ఈసారి నటన స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది. హెయిర్ స్టయిల్ మార్చడం వల్ల ఆమె లుక్ కొత్తగా కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించిందని చెప్పవచ్చు. ప్రియా భవానీ మామ పాత్రలో చేసిన అరుణ్ పాండియన్ పర్వాలేదనిపించారు. నటి అర్చనా రవిచంద్రన్ కనిపించేది కాసేపే అయినా నవ్వించారు. ముత్తు కుమార్, సర్జనో ఖాలిద్ తదితరులు చక్కగా చేశారు. ముఖ్యంగా బౌద్ధ బిక్షువులుగా కనిపించిన వాళ్ళు ఆకట్టుకునేలా నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
గతంలో వచ్చిన 'డిమోంటి కాలనీ' కథకు ముడిపెడుతూ దర్శకుడు ఆర్. జ్ఞానముత్తు పార్ట్ 2ను రూపొందించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ అరగంటకు ట్విస్ట్ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని రగిలించారు. మొదటి భాగంలో లేని ఒక కుటుంబాన్ని రెండో భాగంలోకి తీసుకొచ్చి రెండు కథలను మిక్స్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ ప్రారంభంలోనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, భర్త ఆత్మతో మాట్లాడాలని భార్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కేవలం హారర్ మాత్రమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు వంటివి తీసుకొచ్చి కాస్తంతా వినోదాన్ని కూడా పంచారు. కవల సోదరులను కాపాడం కోసం డెబీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో వచ్చే హారర్ ఎలిమెంట్స్ థ్లిల్లింగ్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌తో పాటు మూడో భాగానికి లింకప్ చేసే సీన్స్ సర్‌ప్రైజ్ చేస్తాయి. అయితే పేలవమైన గ్రాఫిక్స్, కొన్ని సాగదీత సీన్స్, క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్స్ మైనస్‌లుగా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. రెగ్యులర్ హారర్ చిత్రాల లాగా డార్క్ మోడ్‌లో కాకుండా కలర్‌ఫుల్‌గా చూపించి ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్స్ విభాగం ఇంకాస్త బెటర్‌గా వర్క్ చేసి ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం బాగుంది. సన్నివేశాలపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్
కథ, స్క్రీన్‌ప్లేఅరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ నటనహారర్ అంశాలు, మలుపులు
మైసన్ పాయింట్
పేలవమైన గ్రాఫిక్స్‌కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 23 , 2024
Dhoomam OTT Review: సిగరేట్ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘ధూమం’ ఎలా ఉందంటే?
నటీనటులు : ఫహద్ ఫాజిల్, అపర్ణ బాలమురళి, రోషన్ మ్యాథ్యూ, వినీత్, అను మోహన్, అచ్యుత్ కుమార్, విజయ్ మీనన్ తదితరులు
రచన, దర్శకత్వం : పవన్ కుమార్
సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్
ఎడిటింగ్ : సురేష్ అరుముగన్
నిర్మాతలు : విజయ్ కిరగందూర్, విజయ్ సుబ్రహ్మణియన్
విలక్షణ నటుడిగా దక్షిణ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు నటుడు 'ఫహద్ ఫాజిల్'. హీరో, విలన్ అనే భేదాలు లేకుండా తన అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంలో అతడు నటించిన 'ధూమం' (Dhoomam) చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తాజాగా ఈ సినిమాను తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహా వేదికగా జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఫహద్ ఫాజిల్ మరోమారు తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడా? అసలు 'ధూమం' కాన్సెప్ట్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అవినాష్ (ఫహాద్ ఫాజిల్) ఓ సిగరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. సేల్స్ హెడ్‌గా తన తెలివితేటలతో అమ్మకాలను అమాంతం పెంచేస్తాడు. కంపెనీ ఎండీ సిధ్ (రోషన్ మ్యాథ్యు)తో ఓ రోజు అవినాష్‌కు గొడవ జరుగుతుంది. దీంతో జాబ్‌కి రిజైన్ చేస్తాడు. ఒక రోజు భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడిపై ఓ ముసుగు వ్యక్తి అటాక్ చేస్తాడు. భార్యను ఎత్తుకెళ్లి తను చెప్పింది చేస్తే విడిచిపెడతానని వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అవినాష్ ఓ మర్డర్ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ముసుగు వ్యక్తికి కంపెనీ ఎండీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ట్రాప్ నుండి అవినాష్ ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
'ధూమం' సినిమాలో ఫహద్ ఫాజిల్ వన్‌మ్యాన్ షో చేశాడు. అవినాష్ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. భార్యను కాపాడుకునే భర్తగా, తప్పును సరిద్దుకునే వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ఇక దియా పాత్రలో అపర్ణ బాలమురళి ఆకట్టుకుంది. సహజమైన నటనతో మెప్పించింది. అటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రోషన్ మ్యాథ్యూ కనిపించాడు. అతడితో పాటు ప్రవీణ్‌గా చేసిన వినీత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చక్కటి నటన కనబరిచాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సిగరేటు, పొగాకు ఉత్పుత్తుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో డైరెక్టర్ పవన్ కుమార్ ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. లాభాల కోసం సిగరేట్ కంపెనీలు వేసే ఎత్తులను కళ్లకు కట్టాడు. ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువకుడు తన భార్యను కాపాడునేందుకు చేసిన పోరాటాన్ని థ్లిల్లింగ్‌గా చూపించాడు. హీరో హీరోయిన్ల ప్రజెంట్, పాస్ట్‌ను సమాంతరంగా నడిపిస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విరామ సమయానికి ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన క్లైమాక్స్‌తో ముగించిన తీరు మెప్పిస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, తక్కువ పాత్రలే ఉండటం, సెకండాఫ్ మరి నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ పనితీరు ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ఫహద్ ఫాజిల్ నటనసందేశంవిభిన్నమైన క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 11 , 2024
Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అహం రీబూట్ (Aham Reboot)
సుమంత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం అహం రీబూట్'. జూన్ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్ ఏంటంటే.. ఆర్జే నిలయ్ (సుమంత్) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్ అని భావించిన నిలయ్.. ఆమె మాటలకు కన్విన్స్ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
105 మినిట్స్ (105 Minuttess)
‘అహం రీబూట్’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్ చిత్రం వచ్చింది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే.. జాను (హన్సిక) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శక్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? దాని బారి నుంచి జాను ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ఆరంభం (Aarambham)
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్ నాగ్ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, లక్ష్మణ్ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్ అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
లవ్ మీ (Love Me)
ఆశిష్ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ప్రాజెక్ట్ జెడ్ (Project Z)
సందీప్ కిషన్ (Sundeep Kishan), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్ కిల్లర్ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్ కుమార్ (సందీప్ కిషన్) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
ప్రసన్న వదనం (Prasanna Vadanam)
సుహాస్ (Suhas) రీసెంట్ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్‌నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.
భ్రమయుగం (Bramayugam)
మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది. డిజిటల్ యుగంలోనూ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : సోనీ లివ్
జూలై 03 , 2024
This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
రాజు యాదవ్
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju yadav). అంకిత కారాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
లవ్ మీ
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ మీ’ (Love Me). అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్ యూ డేర్’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
డర్టీ ఫెలో
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్ డ్రామా చిత్రమని మూవీ యూనిట్ తెలిపింది.
ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్, క్రిస్ హేమ్స్‌వర్త్ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్ మ్యాక్స్’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man MovieEnglishLions Gate PlayMay 24
మే 20 , 2024
This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
ఆ ఒక్కటీ అడక్కు
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రసన్న వదనం
సుహాస్ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా తప్పించుకొన్నాడు? అసలు హంతకుడ్ని చట్టానికి ఎలా అప్పగించాడు? అనేదే కథ.
శబరి
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగులో వరలక్ష్మీ చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ఇదేనని పేర్కొంది.
బాక్
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాక్’ (Baak). తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది.
జితేందర్‌రెడ్డి
యువ నటుడు రాకేశ్‌వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. దర్శకుడు విరించి వర్మ.. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ప్రణయ విలాసం
ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం (Pranaya Vilasam) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్ రోల్‌లో నటించాడు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateThe Idea Of YouMovieEnglishAmazon PrimeMay 2The WheelSeries EnglishDisney + HotstarApril 30DeArMovieTelugu/TamilNetflixApril 28Boiling Point - 1SeriesEnglishNetflixApril 29Heera MandiSeriesHindiNetflixMay 1Sithan MovieHindiNetflixMay 3The A Typical FamilySeriesKorean/English NetflixMay 4Hacks 3SeriesEnglishJio CinemaMay 3VonkaMovieEnglishJio CinemaMay 3The Tattooist of AuschwitzSeriesEnglishJio CinemaMay 3Migration MovieEnglishJio CinemaMay 1Acapulco S3SeriesEnglishApple Plus TVMay 1
ఏప్రిల్ 29 , 2024
Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్ బాయ్స్’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు మరో మలయాళ బ్లాక్ బాస్టర్ చిత్రం సిద్ధమవుతోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లేటెస్ట్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Release) తెలుగులోనూ విడుదల కాబోతోంది. గత నెల ఫిబ్రవరిలో కేరళలో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మలయాళ సినిమాలపై ఆసక్తి కనబరిచే టాలీవుడ్ ఆడియన్స్.. ఈ చిత్రం ఎప్పుడు తెలుగులో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది.
తెలుగులో వచ్చేది ఆ రోజే!
‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ‘మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది.
‘ప్రేమలు’ రికార్డ్‌ను బద్దలుకొట్టేనా?
మలయాళం సూపర్ హిట్ సినిమా ‘ప్రేమలు’ (Premalu).. మార్చి 8న తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తద్వారా తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును ‘మంజమ్మల్ బాయ్స్’ బీట్ చేస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో వస్తుడంటంతో తెలుగులోనూ మంచి పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి.
రూ.200 కోట్లకు పైగా గ్రాస్
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా దీనిని తెరకక్కించాడు. రిలీజ్ అనంతరం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. మలయాళంలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అటు తమిళంలోనూ ఇటీవల ఈ చిత్రం రిలీజ్ కాగా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా, ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు. అటు
ఈ సినిమా కథేంటి?
‘మంజుమ్మెల్ బాయ్స్’ కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
మార్చి 27 , 2024
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్!
మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్ బాయ్స్' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.
మార్చి 29న తెలుగులోకి..!
శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.
కలెక్షన్స్‌లో టాప్- 5 ఇవే
'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.
ఈ సినిమా కథేంటి?
2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
మార్చి 19 , 2024