• TFIDB EN
  • ఇస్మార్ట్ శంకర్ (2019)
    ATelugu2h 21m

    ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్‌ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ పోతినేనిశంకర్/అరుణ్
    నభా నటేష్చాందిని
    సాయాజీ షిండేసీబీఐ అధికారి
    ఆశిష్ విద్యార్థికేంద్ర మంత్రి
    తులసివిశ్వనాథ్ భార్య
    గెటప్ శ్రీనుశంకర్ స్నేహితుడు
    పునీత్ ఇస్సార్సీఎం కాశీ విశ్వనాథ్
    గంగవ్వమహిళ
    లేఖా ప్రజాపతిబోనాలు పాటలో
    సిబ్బంది
    ఛార్మీ కౌర్నిర్మాత
    పూరి జగన్నాధ్నిర్మాత
    మణి శర్మసంగీతకారుడు
    రాజ్ తోటసినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రామ్‌ పొత్తినేని ఒకడు. దేవదాసు, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు RAPO దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉస్తాద్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రామ్‌ పొత్తినేని గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్‌ పొత్తినేని ఎవరు? వ్యాపారవేత్త మురళి పొత్తినేని కుమారుడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోషోర్ స్వయానా మేనళ్లుడు. రామ్‌ పొత్తినేని ముద్దు పేర్లు? RAPO, ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు రామ్‌ పొత్తినేని ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ రామ్‌ పొత్తినేని పుట్టిన తేదీ ఎప్పుడు? 1988 మే 15 రామ్‌ పొత్తినేనికి వివాహం అయిందా? ఇంకా కాలేదు. రామ్‌ పొత్తినేనికి ఇష్టమైన రంగు? వైట్, బ్లూ రామ్‌ పొత్తినేని తల్లిపేరు పద్మ శ్రీ రామ్‌ పొత్తినేని అభిరుచులు? డ్యాన్స్ చేయడం, క్రికెట్ ఆడటం రామ్‌ పొత్తినేనికి  ఇష్టమైన ఆహారం? బిర్యాని రామ్‌ పొత్తినేని అభిమాన నటుడు? వెంకటేష్ రామ్‌ పొత్తినేనికి నచ్చిన సినిమా? కలిసుందాం రా రామ్‌ పొత్తినేని  స్టార్ డం అందించిన సినిమాలు? దేవదాసు, ఇస్మార్ట్ శంకర్, రెడీ రామ్‌ పొత్తినేని  ఏం చదివాడు? చెన్నై యూనివర్సిటీలో డిగ్రీ రామ్‌ పొత్తినేని ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=nqh6O2HFT-g రామ్‌ పొత్తినేని సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నాడు. రామ్‌ పొత్తినేని ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? దేవదాసు, రెడీ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.  ఇస్మార్ట్ శంకర్ తర్వాత  వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.  అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.  ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.  మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.  టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.  సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.  బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం  థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా:  మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. నాయికగా కెరీర్‌లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలంటే ఒకట్రెండు పెద్ద సినిమాల్లో నటించాల్సిందే. అప్పుడే రీచ్ పెరిగి హీరోయిన్లకు ఆదరణ మొదలవుతుంది. బడా ప్రాజెక్టులో నటిస్తున్నారంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ చూపు కూడా హీరోయిన్‌పై పడుతుంది. అలా అవకాశాలు మెరుగవుతాయి. అచ్చం ఇలాగే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఫీలయ్యింది. కానీ, బర్త్ డే(Nidhi Agarwal BirthDay) రోజున ఈ అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. కారణం ఏంటో చూద్దాం.  అదృష్టమేనా.. టాప్ హీరోతో బడా సినిమాలో ఛాన్స్ రావడం ఒక రకంగా అదృష్టమే. చాలా మంది ఎగిరి గంతేస్తారు. నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలాంటి ఫీలింగ్‌‌నే ఎక్స్‌ప్రెస్ చేసింది. ప్రస్తుతం నిధి చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ బ్యూటీ. చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా గొప్ప విషయమని ఇటీవల నిధి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. కల నిజమైందంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే కల కలగానే మిగిలి పోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం.. ‘హరిహర వీరమల్లు’ భవితవ్యమే.  https://twitter.com/AgerwalNidhhi/status/1680791420440023040?s=20 రెండేళ్లకు పైగా.. సాధారణంగా పెద్ద సినిమా చిత్రీకరణకు కాస్త సమయం పడుతుంది. ప్రారంభం నుంచి రిలీజ్ వరకు కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. కానీ, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వచ్చిన పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ 2021లో వచ్చింది. భారీ తారాగణంతో బిగ్ బడ్జెట్ చిత్రంగా దీనిని తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో మళ్లయోధుడి పాత్ర పోషిస్తున్నారు. నిధితో పాటు సోనాల్ చౌహాన్, బాబీ డియోల్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న ఆందోళన.. ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ పది కాలాల పాటు సాగాలంటే కచ్చితంగా చిత్రాలు విజయం సాధించాలి. అప్పుడే అవకాశాల ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. గ్లామర్ డోజ్ ఏ మాత్రం తగ్గకూడదు. వీటన్నిటితో పాటు సమయ పాలన తప్పనిసరి. ఎక్కడ చిన్న లోపం జరిగినా సినిమా అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే రిలీజైన సినిమాలు హిట్ కావాలి. నిధి అగర్వాల్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతా ప్రాజెక్టులు పెద్దగా ఆదరణను పొందలేక పోయాయి. కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ అవకాశంతో ఇక సెట్ అయిపోయినట్లేనని భావించింది. కానీ, చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్న కొద్దీ నిధిలో ఆందోళన పెరిగిపోతోందని టాక్. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు నిధిని భయపెట్టిస్తున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్. దీంతో ఈ సినిమానైనా త్వరగా వస్తుందేమో అన్న ఆశ అమ్మడిలో నెలకొంది.  వెయిట్ చేయాల్సిందే హరిహర వీరమల్లు, ప్రభాస్-మారుతిల సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు లేవు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలంటే నిధి మరో ఏడాది కాలం ఆగాల్సిందే. ఆ లోపు తనని మరచిపోకుండా ఉండటానికి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. నిధి మల్టీ టాలెంటెడ్. ఈ అమ్మడు డ్యాన్సర్ కూడా. జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేస్తుంది.  
    ఆగస్టు 17 , 2023
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా  తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.  ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.  ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా  నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.  విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.  బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.  ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.  భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ  వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్‌ ఏంజెల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి  ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్‌ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో  బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు. చిన్న సినిమాలతో మొదలై.. అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్‌ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్‌… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఫిదా లేడీ సూపర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్‌ మొదలుకుని టైటిల్‌ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్‌ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్‌ అనుకున్నారట. ఈ నగరానికి ఏమైంది? పెళ్లి చూపులు తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. డీజే టిల్లు 2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్‌ అదిరిపోయాయి. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా త్వరలోనే రాబోతోంది. మల్లేశం ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లవ్‌ స్టోరీ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్‌ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి  తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ పూరి జగన్నాథ్‌, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ పూరీకి కమ్‌బ్యాక్‌ మూవీ అయ్యింది. రామ్‌ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్‌ పిల్లగా హీరోయిన్‌ నభా నటేశ్‌ అమితంగా ఆకట్టుకుంది. విరాట పర్వం నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది. NBK108లోనూ.. నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు. ఆస్కార్‌ స్థాయికి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్‌ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్‌ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్‌ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్‌ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్‌ ఇప్పుడు టాప్‌ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
    ఏప్రిల్ 01 , 2023
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    మే 03 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    Double iSmart Movie: రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో అదిరే ట్విస్ట్‌.. పూరి మార్క్ ఫ్లాష్‌ బ్యాక్‌!
    Double iSmart Movie: రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో అదిరే ట్విస్ట్‌.. పూరి మార్క్ ఫ్లాష్‌ బ్యాక్‌!
    టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ (Ram Pothineni), స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్‌ హిట్‌గా నిలవడంతో పార్ట్‌ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; క్రేజీ ఫ్లాష్‌ బ్యాక్‌..! ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్‌ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్‌ - థ్రిల్లర్‌ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; కసితో ఉన్న పూరి..! డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్టర్‌ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్‌ మూవీ ‘లైగర్‌’ (Liger Movie) బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్‌ కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో పూరి తన ఫోకస్‌ మెుత్తం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’పై పెట్టారట. దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; పాన్‌ ఇండియా స్థాయిలో.. ఆ కారణంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)లో రిలీజ్‌ చేసిన పూరి.. సెకండ్‌ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హీరో రామ్‌కూ కీలకమే! ఇక హీరో రామ్‌ కూడా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్‌ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్‌ చేసిన ‘వారియర్‌’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.&nbsp; ఛలో థాయిలాండ్‌! ‘డబుల్‌ ఇస్మార్ట్’ ఫస్ట్‌ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబయిలో పూర్తి చేసిన డైరెక్టర్.. తర్వాతి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తారని సమాచారం. ఇందుకోసం త్వరలోనే చిత్ర యూనిట్‌ థాయిలాండ్‌లో వాలిపోతుందని అంటున్నారు.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. బిగ్‌ బుల్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ గతంలో సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆ రోజున రిలీజ్‌ కష్టమే!(Double Smart Release Date) ‘డబుల్‌ ఇస్మార్ట్’ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల (మార్చి) 8న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనుకున్నంత వేగంగా షూటింగ్‌ జరగడం లేదని సమాచారం. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిలీజ్ తేదీ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంటున్నాయి.&nbsp;
    ఫిబ్రవరి 05 , 2024
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో అనగానే ముందుగా రామ్‌ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్‌, యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా ప్రతీదానిలోనూ రామ్‌ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్‌ పోతినేని ఒకరు. తెరపై రామ్‌ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్‌’తోనే తానేంటో రామ్‌&nbsp; నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్‌ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీసిన పాటలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. బుల్లెట్ (వారియర్) రామ్‌ పోతినేని - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా వారియర్‌. దేవిశ్రీ ఇచ్చిన సంగీతానికి రామ్‌ స్టెప్పులు తోడు కావడంతో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ రిబ్బన్‌ పట్టుకొని వేసే హుక్‌ స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు హీరోయిన్‌ కృతి శెట్టి కూడా రామ్ ఎనర్జీని మ్యాచ్‌ చేస్తూ అదరగొట్టింది.&nbsp; https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 2. ఇస్మార్ట్ టైటిల్‌ సాంగ్ (ఇస్మార్ట్‌ శంకర్‌) ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోని ‘ఇస్మార్ట్‌’ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో రామ్‌ ఫుల్‌ ఎనర్జీతో డ్యాన్స్‌ చేశాడు. కొత్త కొత్త స్టెప్పులతో వీక్షకుల మతి పొగొట్టాడు. శరీరాన్ని స్పింగ్‌లా తిప్పుతూ అలరించాడు. ముఖ్యంగా చార్మినార్‌ ముందు మోకాళ్లపై చేసే స్టెప్పు ట్రెండ్‌ సెటర్‌గా నిలిచింది.&nbsp; రామ్ బెస్ట్‌ డ్యాన్సింగ్‌ వీడియోల్లో ‘ ఇస్మార్ట్‌’ పాట కచ్చితంగా టాప్‌-5లో ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Ox4ih-vJu7E 3. వాట్‌ అమ్మా (ఉన్నది ఒకటే జిందగీ) రామ్‌ డ్యాన్స్‌ అంటే స్పీడు స్టెప్పులకు పెట్టింది పేరు. అటువంటి రామ్‌ స్లో డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ‘వాట్‌ అమ్మా’ అనే పాటలో రామ్‌ డ్యాన్స్‌ అప్పటివరకూ చేసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా సాగే పాటకు తగ్గట్లు స్టెప్పులు వేసి రామ్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా చేశారు. https://www.youtube.com/watch?v=UbrbvbA3yD4 4. డిచుకు డిచుకు డంకా (రెడ్‌) రెడ్ సినిమాలోని &nbsp;డిచుకు డిచుకు డంకా ఐటెం సాంగ్‌లో రామ్‌ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఐటెం డాల్‌ హెబ్బపటేల్‌ను టీజ్‌ చేస్తూ సాగే ఈ పాటలో రామ్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఈ పాట యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. https://www.youtube.com/watch?v=2BxxwJiqI_w 5. కల్లోకి దిల్లోకి (మస్కా) రామ్‌ - హన్సిక జంటగా చేసిన మస్కా సినిమా తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని అన్ని పాటలు అప్పట్లో యమా క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా కల్లోకి దిల్లోకి పాట ప్రతీ ఫంక్షన్లలో వినిపించేది. ఇందులో రామ్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సాంగ్‌కు తగ్గట్లే ఫుల్‌ జోష్‌తో స్టెప్పులు వేశాడు. ఇందులో మోకాళ్ల మీద వేసే స్టెప్పులు.. ట్రైనింగ్‌ లేకుండా వేయవద్దని సాంగ్‌లో స్క్రోల్‌ కూడా వచ్చింది. https://www.youtube.com/watch?v=cKpNVmAs-b0
    మే 15 , 2023
    NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు
    NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు
    ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ఒక్కసారిగా ఇస్మార్ట్‌ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లిన అందాల తార నభా నటేశ్‌. కన్నడ సినిమాతో వెండతెరపైకి అడుగుపెట్టినా తన క్యూట్‌ లుక్స్‌తో టాలివుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది.&nbsp; సినిమాల్లో హాట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసే ఈ భామ సోషల్‌ మీడియాలోనూ తన సొగసులతో సెగలు పుట్టిస్తోంది. నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్‌ స్కర్ట్‌లో ఈ భామ పోస్ట్‌ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు మతులు పోగొట్టుకుంటున్నారు. నభా నటేశ్‌ తొలుత ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో 2015లో&nbsp; వెండితెరపైకి అడుగుపెట్టింది. అందులో పటాకా పార్వతిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఏడాది గ్యాప్‌ తర్వాత 2017లో మళ్లీ లీ, సాహెబా అనే రెండు కన్నడ సినిమాల్లో మెరిసింది. 2018లో తన తొలి తెలుగు సినిమా ‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్‌ అయింది. సినిమాల పిచ్చి ఉన్న మేఘన క్యారెక్టర్‌లో నభా అదరగొట్టింది. 2018లోనే రవిబాబు నటించిన కామెడీ సినిమా ‘అదుగో’లోనూ నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.&nbsp; పూరీ కమ్‌బ్యాక్‌ మూవీ ఇష్మార్ట్‌ శంకర్‌తో నభా నటేశ్ దశ తిరిగింది. అందులో వరంగల్‌ పిల్ల చాందినీగా నభాకు జనం ఫిదా అయ్యారని చెప్పొచ్చు.&nbsp; 2020లో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్‌, 2021లో అల్లుడు అదుర్స్‌, మేస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అంతగా అవకాశాల్లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
    మార్చి 28 , 2023
    <strong>నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిధి అగర్వాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. యూత్‌ మంతి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మరి నిధి అగర్వాల్‌కు(Some Lesser Known Facts about Nidhhi Agerwal)&nbsp; ఇంకా ఏమేమి ఇష్టమో ఈ కథనంలో చూద్దాం. నిధి అగర్వాల్ ముద్దు పేరు? నిధి నిధి అగర్వాల్ ఎప్పుడు పుట్టింది? 1993, ఆగస్టు 17న జన్మించింది నిధి అగర్వాల్ తొలి సినిమా? మున్నా మైఖెల్(2017) నిధి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా? మిస్టర్ మజ్ను(2018) నిధి అగర్వాల్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు&nbsp; నిధి అగర్వాల్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిధి అగర్వాల్&nbsp; ఏం చదివింది? BBA, క్రిష్ట్ యూనివర్సిటీ ( బెంగుళూరు) నిధి అగర్వాల్&nbsp; అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నిధి అగర్వాల్‌కు అఫైర్స్ ఉన్నాయా? బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నయి. నిధి అగర్వాల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్, బ్లాక్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నిధి అగర్వాల్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నిధి అగర్వాల్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nidhhiagerwal/?hl=en నిధి అగర్వాల్‌కు గుడి ఎక్కడ కట్టారు? చెన్నైలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆమెకు గుడి కట్టారు.
    ఏప్రిల్ 06 , 2024
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2024
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 2 అల్లుఅర్జున్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ - 2&nbsp; దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. డబల్‌ ఇస్మార్ట్‌ రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్‌ డైరెక్షన్‌‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్‌ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.&nbsp; గూఢచారి 2 యంగ్‌ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్‌, ప్రీ లుక్‌ టీజర్‌ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్‌ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్‌ పార్ట్‌ తిరగనుందని సమాచారం.&nbsp; హిట్‌ 3 తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ చిత్రం హిట్‌ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. హిట్‌-2 (HIT 2)లో అడవిశేష్‌ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్‌-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను హింట్‌ ఇచ్చేశారు. ఇందులో అర్జున్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రను నాని పోషించనున్నాడు.&nbsp; ప్రతినిధి-2 యంగ్‌ హీరో నారా రోహిత్‌ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్‌ 15న టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; బింబిసార 2 గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్‌.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.&nbsp; సలార్‌&nbsp; ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్‌ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్‌ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్‌ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ K ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
    ఆగస్టు 02 , 2023
    <strong>Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!</strong>
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్‌ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ&nbsp; పవర్‌ఫుల్‌ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; బాహుబలి (Baahubali) బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్‌ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్‌ చాలా అద్భుతంగా చేశాడు.&nbsp; https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN శివ (Siva) హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్‌ చైన్‌ తెంపే సీన్‌ ఇప్పటికీ చాలా ఫేమస్‌.&nbsp; https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g ఆర్ఆర్‌ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్‌ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్‌ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&amp;v=Y8rREdo1LqU&amp;feature=youtu.be సలార్‌ (Salaar) ఇందులో హీరో ప్రభాస్‌ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌, కాటేరమ్మ ఫైట్‌, క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ దుమ్మురేపాడు.&nbsp; https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID యానిమల్‌ (Animal) అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్‌ రీవెంజ్‌ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit సింహాద్రి (Simhadri) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్‌ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్‌ విజిల్స్ వేయిస్తాయి.&nbsp; https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS విక్రమార్కుడు (Vikramarkudu) స్టార్‌ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్‌ రాథోడ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ మాత్రం నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY కర్తవ్యం (Karthavyam) టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti)&nbsp; చేసిన రోల్‌ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.&nbsp; https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg అంకుశం (Ankusam) హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.&nbsp; https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_ గ్యాంగ్ లీడర్ (Gang Leader) మెగాస్టార్‌ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్‌ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది.  https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C అర్జున్ రెడ్డి (Arjun Reddy) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది.&nbsp; https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) టాలీవుడ్‌లోని క్లాసిక్‌ హీరోగా ‘రామ్‌ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్‌ తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం విశేషం.&nbsp; https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a పోకిరి (Pokiri) ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్‌ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.&nbsp; https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
    మార్చి 28 , 2024
    <strong>Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?</strong>
    Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో 'రాజమౌళి' (SS Rajamouli) ఒకరు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ (Ramcharan) నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) స్క్రీనింగ్‌ కోసం ఇటీవలే రాజమౌళి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని గురించి రాజమౌళి కుమారుడు కార్తికేయ (Karthikeya) స్వయంగా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; కార్తికేయ ఏమన్నారంటే? ప్రస్తుతం రాజమౌళి.. జపాన్‌లో ఫ్యామిలితో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న బిల్డింగ్‌ మెుత్తం ఒక్కసారిగా ఊగిపోయినట్లు రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ‘జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంత సేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌‌‌ను ఫోటోను కార్తికేయ ఈ పోస్టుకు జత చేశారు.&nbsp; https://twitter.com/ssk1122/status/1770613017081999768? ధైర్యం చెప్పిన జపనీయులు అయితే భూకంపం చూసి కాస్త ఆందోళన చెందిన రాజమౌళి ఫ్యామిలీ (SS Rajamouli Family)కి స్థానిక జపానీయులు&nbsp; ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమేనని పేర్కొన్నారట. వచ్చింది భారీ భూప్రకంపనలు కాదూ అంటూ వారిని కూల్‌ చేసే ప్రయత్నం చేశారట. అటు కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌‍గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3 రిక్టర్‌ స్కేల్‌పై నమోదైంద. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రాంతంలో గల ప్రిఫెక్చర్స్ ఏరియాలో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) రాజమౌళికి అదిరే ఆతిథ్యం ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపనీయులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపనీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చారు. ఒక పెద్దావిడ అయితే రాజమౌళి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా రాజమౌళి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఓ ఇండియన్ సినిమాకి జపాన్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌తో తాను తీయబోతున్న చిత్రం విశేషాలు కూడా వారితో పంచుకున్నారు. సినిమా రిలీజ్‌ సమయానికి మహేష్‌ను కూడా తీసుకొచ్చి ప్రమేషన్స్‌ చేస్తానని జపనీయులకు దర్శకధీరుడు మాట కూడా ఇచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
    మార్చి 21 , 2024

    @2021 KTree