రేటింగ్ లేదు
UATelugu
పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం "ఓజీ". డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రియాంక మోహన్ పవన్‌కు జోడీగా కనిపించనుంది.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
How was the movie?
తారాగణం
పవన్ కళ్యాణ్
"OG" ఇమ్రాన్ హష్మీ
ప్రియాంక మోహన్
అర్జున్ దాస్
ప్రకాష్ రాజ్
శ్రీయా రెడ్డి
హరీష్ ఉత్తమన్
as OG's assistantఅభిమన్యు సింగ్
అజయ్ ఘోష్
శుభలేఖ సుధాకర్
సిబ్బంది
సుజీత్
దర్శకుడుడివివి దానయ్య
నిర్మాతసుజీత్
రచయితతమన్ ఎస్
సంగీతకారుడురవి కె. చంద్రన్
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ర్కథనాలు
OG Movie Story: పవన్ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)?
ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ డేట్ అప్‌డేట్ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ సుజీత్ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.
సుజీత్ ‘డీపీ’ వైరల్
ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్ కల్యాణ్) కాగా, మరొకరు డైరెక్టర్ సుజీత్. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.
ఓజీపై శ్రియారెడ్డి హైప్
సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్ లైఫ్ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 17 , 2024
OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పవన్ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ముందే ‘ఓజీ’ రిలీజ్?
పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ మూవీని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
హరిహర వెనక్కి తగ్గాల్సిందే!
పవన్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. అయితే పవన్ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్ వచ్చినప్పటికీ క్రిష్ 60 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న దృష్ట్యా పవన్ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 11 , 2024
HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ డైరెక్టర్ సుజీత్ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్ రజా రన్’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్ ‘సాహో’ (Saaho)తో పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్
సుజీత్ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్ 26న జన్మించాడు. తొలుత చార్టెట్ అకౌంటెండ్ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్ ఫిల్మ్ & టీవీ అకాడమీలో ఫిల్మ్ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్ తెరకెక్కించాడు.
షార్ట్ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ
సాధారణంగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ సుజీత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘తొక్కలో లవ్ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్ డ్రామా’, ‘ఇండియన్ ఐడల్’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్ చేశాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట
తను డైరెక్టర్ అవుతానని సుజీత్ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.
పూరి జగన్నాథ్ సూచనతో
డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.
23 ఏళ్లకే డైరెక్టర్‌గా..
డైరెక్టర్ ఛాన్స్ కోసం సుజీత్ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్ రాజా రన్' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్‌నే సినిమా తీసి..
తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్‌నే తన ఫస్ట్ ఫిల్మ్‌గా సుజీత్ తెరకెక్కించడం విశేషం. షార్ట్ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
బాహుబలి కంటే ముందే
తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్ ప్లాన్ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్ కాలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్యాన్ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్ సింగ్ రిలీజ్ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి సుజీత్ ఎదగడం సాధారణ విషయం కాదు.
జపనీస్ సినిమాలంటే చాల ఇష్టం
డైరెక్టర్ సుజీత్‌కు జపనీస్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్
సుజీత్ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
క్రికెట్ అంటే పిచ్చి
సుజీత్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
భక్తి ఎక్కువే
సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ప్రేయసితో వివాహం
దర్శకుడు సుజీత్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.
https://twitter.com/Filmiparadise/status/1271319435127603205
ఉత్తమ డైరెక్టర్‌గా
తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు.
బర్త్‌డే స్పెషల్ వీడియో
నేడు దర్శకుడు సుజీత్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1850075370994925843
అక్టోబర్ 26 , 2024
Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన పవన్ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీగా మారిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే పవన్ తీరిక చేసుకొనిమరి పెండింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల హరిహర వీరమల్లును సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు కల్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ‘ఓజీ’ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లును రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తుండటంతో ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.
https://twitter.com/mogali_sat77717/status/1846452019868877252
ఓజీ షూటింగ్ రీస్టార్ట్
పవన్ కల్యాణ్ పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/DVVMovies/status/1846206901295763648
త్వరలోనే సెట్స్‌పైకి పవన్!
ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ఓజీ షూటింగ్‌ను తిరిగి పునఃప్రారంభించారు సుజీత్. ముందుగా పవన్ లేని సీన్స్‌ను డైరెక్టర్ సుజీత్ షూట్ చేయనున్నారు. కొద్ది రోజుల్లో పవన్ కూడా ఈ మూవీ షూటింగ్ పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓజీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ షూట్‌లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
హైప్ పెంచిన థమన్!
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ vs విజయ్ దేవరకొండ!
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అటు హరిహర వీరమల్లు టీమ్ కూడా అదే డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను విజయ్ దేరరకొండ ఢీకొట్టక తప్పదని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. కాబట్టి పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్టోబర్ 16 , 2024
Pawan Kalyan: ‘సలార్’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్!
టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్ కల్యాణ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘సలార్’.. పవన్ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అలాగే పవన్ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓజీ - సలార్ మధ్య పోలిక!
‘కేజీఎఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్ అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్ రెగ్యులర్ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.
హై రేంజ్‌లో ఎలివేషన్స్!
‘ఓజీ’ సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్ ఫ్యాన్స్ తమ కాలర్ ట్యూన్స్, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
సన్నగిల్లుతున్న అంచనాలు!
పవన్ కల్యాణ్ హీరోగా.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్ అప్‌డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్ కెరీర్‌లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.
చిరుకు పోటీగా పవన్ కల్యాణ్!
‘హరిహర వీరమల్లు’ షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్ అయినంతవరకూ పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్స్ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ డేట్స్ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.
మార్చి 07 , 2024
Pawan vs Jr NTR: పవన్ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్ ‘దేవర’.. ఎందుకంటే?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG), జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
క్లాష్ ఎలా వచ్చిందంటే?
పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న వస్తుండగా.. తారక్ దేవర మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283
గతంలోనూ ఇలాగే!
గతంలోనూ పవన్ కల్యాణ్, తారక్ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చినప్పటికీ పవన్ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
2 వారాలు సరిపోతాయా?
పవన్ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన సలార్ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
‘ఒకేసారి రిలీజ్ చేయండి’
దేవర, ఓజీ సినిమాల క్లాష్ అంశం (Pawan vs Jr NTR) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 17 , 2024
Akira Nandan: అఫీషియల్.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’తోనే అకీరా నందన్ ఎంట్రీ
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. జనసేన పార్టీ (Janasena Party)ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వారసుడిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ స్థానంలో అకీరా నందన్ (Akira Nandan)ను స్క్రీన్‌పై చూసుకొని సంతోషపడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ‘ఓజీ’ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇది నూటికి నూరశాతం నిజమేనని తాజా అప్‌డేట్‌ను బట్టి తెలుస్తోంది.
అకీరానందన్ ఎంట్రీ పక్కా..
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది పూర్తిగా నిజమేనని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అకీరా ఎంట్రీని నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు. ఇక అకీరా రోల్‌కు సంబంధించి మున్ముందు మరిన్ని లీక్స్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి కోసం ఫ్యాన్స్‌తో పాటు మనమూ వేచి చూద్దాం.
https://twitter.com/FilmyTwood/status/1859094576272953795
తండ్రి గురువు దగ్గర యాక్టింగ్ పాఠాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లోకి రాకముందు ప్రముఖ నట గురువు సత్యానంద్ (Acting guru Satyanand) దగ్గర యాక్టింగ్ పాఠాలు నేర్చుకున్నారు. వైజాగ్‌లోని సత్యానంద్ శిక్షణాలయంలో నటనలోని ఓనమాలు అభ్యసించారు. ఇప్పుడు పవన్ తనయుడు అకీరానందన్ (Akira Nandan) కూడా ఆయన దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. భావోద్వేగాలను ఎలా పలికించాలో అకీరా తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన శిక్షణ కూడా అకీరా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే పర్‌ఫెక్ట్ నటుడిగా మారేందుకు అకీరా బాగానే కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. మరి స్క్రీన్‌పై అకీరా ఏ విధంగా మెరుస్తాడో చూద్దాం.
అకిరా ఎంతో టాలెంటెడ్!
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మ్యూజిక్ కోర్సులు కూడా చేశాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/i/status/1747251367033577947
న్యూయర్‌కు బిగ్ ట్రీట్!
‘ఓజీ’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త (Akira Nandan) నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూయర్ కానుకగా 2025 జనవరి 1న ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం, పవన్ కూడా ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉంటడంతో సాంగ్‌ను వాయిదాా వేశారు. అయితే కొత్త ఏడాది మాత్రం ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక పవన్‌ను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో పవన్ పాత్ర ఓజాస్ గంభీర (Ojas Gambhira) కాగా దానిని షార్ట్‌కట్ చేస్తూ ‘ఓజీ’గా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
నవంబర్ 20 , 2024
OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్ పెంచిన థమన్.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్ పక్కా’!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థమన్ ఏమన్నారంటే?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
పాన్ ఇండియా స్థాయిలో
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్ సైతం ఓజీ హైప్ క్రియేట్ చేసింది.
https://twitter.com/tollymasti/status/1822184749072294337
అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్!
సంగీత దర్శకుడు థమన్ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్ డేట్‌ను సైతం కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్ మరింత ఇష్టుడిగా మారిపోయారు.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 05 , 2024
Pawan kalyan: పవన్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్ లోడింగ్.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ‘సాహో’ (Saaho) ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తవ్వగా.. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ బిజీగా ఉండటంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి సంగీత దర్శకుడు తమన్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది.
కొత్త పోస్టర్‌తో మరింత హైప్!
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) షేర్ చేసిన పోస్టర్‌లో.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతున్నట్లు ఈ పోస్టర్‌లో పవన్ ఉన్నాడు. దీనిని చూసిన పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ హీరో కటౌట్‌కు తగ్గ సినిమా ‘ఓజీ’ అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులను ‘ఓజీ’ కొల్లగొట్టడం ఖాయమని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అదిరిపోయే ట్రీట్ లోడింగ్!
ఓజీ తర్వాత ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బాస్టర్ హిట్ తర్వాత పవన్ - డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ పైన కూడా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ షూట్ కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది' అంటూ ఎక్స్‌లో మేకర్స్ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి గ్లింప్స్ వస్తుందని అంతా భావిస్తున్నారు. పవన్ పొలిటికల్ డైలాగ్‌తో కూడిన ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
https://twitter.com/MythriOfficial/status/1768870185656807451?
సన్నగిల్లుతున్న అంచనాలు!
పవన్ కల్యాణ్ హీరోగా.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఎటువంటి సాలిడ్ అప్‌డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో పవన్ కెరీర్‌లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'పై పవన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి తగ్గుతూ వస్తోంది.
మార్చి 16 , 2024
Akira Nandan: అకీరా నందన్ గురించి ఈ టాప్ - 10 సీక్రెట్స్ తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్ కల్యాణ్ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
అకీరానందన్ 2004 ఏప్రిల్ 8న పవన్ - రేణు దేశాయ్ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.
అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్, రానా, వరుణ్ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.
అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.
అకీరా నందన్ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదట. యంగ్ హీరో అడివి శేష్ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది.
ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు.
అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.
ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్ కల్యాణే చూసుకుంటున్నారు.
తన తల్లికి పవన్ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్ అకీరాలో రాకుండా రేణు దేశాయ్ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట.
అకీరానందన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.
ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.
అక్టోబర్ 21 , 2024
Hari Hara Veera Mallu: పవన్ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్.. టీజర్ కోసం సిద్ధంకండి!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్ వస్తూనే ఉంది. దీంతో పవన్ - క్రిష్ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి (ఏప్రిల్ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.
ఆందోళనలకు చెక్!
పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్ క్రిష్.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
ఏప్రిల్ 17 , 2024
HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్!
దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది.
ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.
ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.
రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది.
నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట.
ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది.
నాని 'గ్యాంగ్ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట.
పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.
చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది.
ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.
హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.
సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.
తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది.
పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.
View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial)
చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది.
ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది.
తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది.
తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో 'ఓజీ'లో నటిస్తోంది.
అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన 'డాక్టర్', 'డాన్'.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
నవంబర్ 20 , 2024
OG Release Date: ఒకే నెలలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల?
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్‌లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్‌బాస్టర్ పక్కా’
పవన్ - సుజిత్ కాంబోలోని 'ఓజీ' చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 23 , 2024
Vishwak Sen: పవన్ కల్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ సేన్ రొమాన్స్.. క్రేజీ కాంబో లోడింగ్!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ మాస్ కా దాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘VS14’లో హీరోయిన్ ఫిక్స్!
విష్వక్ సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహనన్ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు.
యాక్షన్ డ్రామా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
రెండోసారి ఖాకీ పాత్రలో..
విష్వక్ సేన్ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ : ది ఫస్ట్ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్ రోల్‌లో విష్వక్ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విష్వక్ బిజీ బిజీ..
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 24 , 2024
Pawan Kalyan Movies Update: పెండింగ్ మూవీస్‌పై పవన్ కల్యాణ్ ఫోకస్.. ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్ (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు)తో జనసేన సాధించిన సీట్లు.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే గత పదేళ్లుగా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన పవన్.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాత్ భగత్‌సింగ్’ చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఏపీ ఎన్నికలు ముగియడం, పవన్ ఉపముఖ్యమంత్రి కూడా కావడంతో.. పెండింగ్‌లో ఉన్న సినిమాలపై పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh), ‘ఓజీ’ (OG), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రాల షూటింగ్ చాలా వరకూ పూర్తయ్యింది. ఇక పవన్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాల కోసం పవన్.. తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్‌షీట్ల గురించే చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన మూడు చిత్రాల కోసం రెండు నెలల సమయాన్ని కేటాయించి.. ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్ యోచిస్తున్నట్లు సమాచారం.
‘పవన్.. గొడవలు పెట్టేవారు’
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన 'పరువు' (Paruvu) వెబ్‌సిరీస్.. జీ5 వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్యూలో సుస్మిత.. తన బాబాయ్ పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా చిన్నతనంలో నాకూ చరణ్‌కు గొడవలు వచ్చేవి. అందుకు కారణం మా పవన్ బాబాయ్. ఆయన ఇద్దరికీ గొడవలు పెట్టి సినిమా చూసినట్లు చూసేవారు. అది చాలా సరదాగా ఉండేది. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ కావడం మాకు సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి.. వారి కోసం ఏదైనా చేస్తారు' అని మెగా డాటర్ చెప్పుకొచ్చారు.
మామకు స్పెషల్ గిఫ్ట్
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'నాకు స్టార్‌వార్స్ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు శనివారం (జూన్ 15) రోజున తిరుమలకు కాలినడకన వెళ్లిన సాయిధరమ్ తేజ్.. తన మామయ్య విజయాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. కాగా, మామ - అల్లుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
జూన్ 17 , 2024
Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?
టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.
మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.
పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.
ఒకే పొజిషన్లలో..
ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.
మరో పాయింట్..
ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు.
భూమికతో హిట్..
జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.
https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
ఆగస్టు 16 , 2023
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
థమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.
థమన్ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది.
ఓ సారి థమన్ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్ డ్రమ్ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్ వాయించడం ప్రాక్టిస్ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట.
థమన్ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.
థమన్ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.
థమన్ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.
అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్ షోలు చేసి థమన్ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.
అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.
ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం.
ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర వర్క్ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్ ఇచ్చిందని థమన్ చెబుతుంటాడు.
ముఖ్యంగా మణిశర్మ టీమ్ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.
24 ఏళ్ల వయసులో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన థమన్.. తమిళ చిత్రం 'సింధనాయ్ సె' (2009) తొలిసారి వర్క్ చేశారు.
రవితేజ హీరోగా చేసిన ‘కిక్’ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో థమన్ పేరు మారుమోగింది.
ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.
తారక్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్ సంగీతం అందించారు.
‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్ సంగీతం అందించిన బాడీ గార్డ్ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.
థమన్ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు.
థమన్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.
ఏ.ఆర్. రెహమాన్ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు.
తాజాగా తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్, కాపీ గోట్ అంటూ మీమర్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.
ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్ చెప్పాడు.
నవంబర్ 16 , 2024
Pawan Kalyan: 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్?
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్‌లో నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ బ్యానర్‌పై రాబోయే చిత్రాల గురించి మాట్లాడారు.
నాగవంశీ చెప్పిన వివరాల ప్రకారం, 2018లో ఒక డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు తమకు మంచి విజయాలను అందించాయి. ఈ సక్సెస్ తరువాత త్రివిక్రమ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నాగవంశీ వెల్లడించారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని, ఈ చిత్రం 2029 ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో నేరుగా త్రివిక్రమ్ చేసిన లాస్ట్ చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన బీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు త్రివిక్రమ్ మార్గదర్శనంలో సాగాయి. దీంతో వీరి కలయికలో సాలిడ్ హిట్ కోసం ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు.
కథా నేపథ్యం
నాగవంశీ స్పీచ్ తర్వాత.. త్రివిక్రమ్ తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏవిధంగా చూపించబోతున్నాడు. ఆయన ఎలాంటి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు అనే ఆసక్తి పెరిగింది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్థానం, జనసేన పార్టీ ఆవిర్భవానికి గల కారణాలు వంటివి సినిమాలో ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఎపిసోడ్, జగన్ ప్రభుత్వ పాలన లోపాలు వంటివి చూపించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పెట్టుకున్న పొత్తు, చంద్రబాబు జైలు ఎపిసోడ్, వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సినిమాలో ప్రధాన భాగం కావొచ్చు.
ఇప్పటి వరకు ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ జనర్లకే పరిమితమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు.. పొలిటికల్ థ్రిల్లర్‌కు మారడం సర్వత్రా ఉత్కంట నెలకొంది. అయితే ఆయన తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నందున, ఈ కథకు ఆయన అనుకూలమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
షూటింగ్‌ల్లో పవన్ బిజీ బిజీ
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఓజీని వచ్చే ఏడాది అక్టోబర్ 25న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది.
నవంబర్ 02 , 2024
Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్ వాంటెడ్ టాప్-10 చిత్రాలు!
సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
రాజాసాబ్ (The Raja Saab)
ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వచ్చే ఏడాది ‘రాజాసాబ్’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్ తెగ ఎదురుచూస్తున్నాడు.
ఓజీ (OG)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ (Game changer)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత చరణ్ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 (War 2)
టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్ నటిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD 12
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love story) మంచి హిట్ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మిరాయ్ (Mirai)
‘హనుమాన్’ (Hanuman) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరా (Kubera)
క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జీ 2 (G2)
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
NANI 33
‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024
Anirudh Ravichander: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అనిరుధ్.. తగ్గిన దేవి శ్రీ, థమన్ హవా!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు మార్మోమోగుతోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ‘రఘువరన్ బీటెక్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలతో యమా క్రేజ్ సంపాదించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఉందంటే ఆ మూవీకి ఎనలేని క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా యూత్ అనిరుధ్ ఇచ్చే పాటలు, నేపథ్య సంగీతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా తారక్ నటించిన ‘దేవర’ చిత్రానికి సైతం అనిరుధ్ అదిరిపోయే సంగీతం ఇచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకూ కోలీవుడ్‌పైనే ఫోకస్ ఉంచిన అనిరుధ్ ప్రస్తుతం దానిని టాలీవుడ్‌పైకి మరల్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్లకు కష్టాలు తప్పవన్న చర్చ మెుదలైంది.
ఆ చిత్రాలతో తెలుగులో క్రేజ్!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నేరుగా ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘యూటర్న్’ వంటి చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అయినప్పటికీ అనిరుధ్ గురించి టాలీవుడ్‌లో పెద్దగా చర్చ జరగలేదు. అయితే రీసెంట్‌గా ‘విక్రమ్’, ‘జైలర్’, ‘జవాన్’ చిత్రాలతో అతడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా అతడిచ్చిన నేపథ్య సంగీతానికి యూత్ ఫిదా అయ్యారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో అనిరుధ్ మ్యూజిక్‌ను తెలుగు ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. రిపీట్ మోడ్‌లో అతడి పాటలు వింటూ సంగీతాన్ని అస్వాదించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ వల్లే అనిరుధ్ ‘దేవర’ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు కూడా మేకర్స్ ఇటీవల తెలియజేశారు.
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు!
‘దేవర’ సక్సెస్ తర్వాత టాలీవుడ్‌లో అనిరుధ్ పేరు బాగా వినిపిస్తోంది. మరోమారు థియేటర్లలో అతడి మ్యూజిక్ ఎంజాయ్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన తెలుగు దర్శక నిర్మాతలు అనిరుధ్‌తో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటు తెలుగులో వస్తోన్న ఆదరణ చూసి టాలీవుడ్‌లోనూ తన దూకుడు పెంచాలని అనిరుధ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతం తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాకు సైతం అనిరుధ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు డైరెక్టర్లు కూడా తమ మూవీ కోసం అనిరుధ్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్. రానున్న రోజుల్లో అరడజను ప్రాజెక్ట్స్ వరకూ తెలుగులో అనిరుధ్ చేయవచ్చని అంటున్నారు.
థమన్, దేవిశ్రీకి కష్టమేనా!
సంగీత దర్శకులు థమన్, దేవిశ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో రిలీజయ్యే 10 చిత్రాల్లో కనీసం 5-8 చిత్రాలకు వీరిద్దరే మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ల తొలి రెండు ప్రాధాన్యాలుగా వీరిద్దరే ఉంటూ వచ్చారు. అటువంటి థమన్, దేవిశ్రీకి అనిరుధ్ రాకతో గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న, మెున్నటి వరకూ టాలీవుడ్‌ను అంతగా ప్రాధాన్యత ఇవ్వని అనిరుధ్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం వారికి గట్టి ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. మరి అనిరుధ్ మ్యానియాను తట్టుకొని థమన్, దేవిశ్రీ ఏవిధంగా రాణిస్తారో చూడాలని పేర్కొంటున్నారు.
అవి క్లిక్ అయితే ఆపడం కష్టం!
రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి సైతం థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘హంగ్రీ చీతా’ రిలీజ్ చేసిన సాంగ్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా బాలయ్య-బోయపాటి నాలుగో చిత్రం ‘అఖండ 2’కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మరోవైపు దేవిశ్రీ చేతిలో ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టైటిల్ సాంగ్‌తోపాటు 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆయా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే థమన్, దేవిశ్రీకి తిరుగుండదని చెప్పవచ్చు.
అక్టోబర్ 22 , 2024