• TFIDB EN
  • ఓజీ
    రేటింగ్ లేదు
    No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
    ఆసక్తి ఉంది
    UATelugu
    పవన్ కళ్యాణ్, డైరెక్టర్‌ సుజిత్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం "ఓజీ". డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రియాంక మోహన్‌ పవన్‌కు జోడీగా కనిపించనుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    తారాగణం
    పవన్ కళ్యాణ్
    "OG"
    ఇమ్రాన్ హష్మీ
    ప్రియాంక మోహన్
    అర్జున్ దాస్
    ప్రకాష్ రాజ్
    శ్రీయా రెడ్డి
    హరీష్ ఉత్తమన్
    as OG's assistant
    అభిమన్యు సింగ్
    అజయ్ ఘోష్
    శుభలేఖ సుధాకర్
    సిబ్బంది
    సుజీత్
    దర్శకుడు
    డివివి దానయ్య
    నిర్మాత
    సుజీత్
    రచయిత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    రవి కె. చంద్రన్
    సినిమాటోగ్రాఫర్
    నవీన్ నూలి
    ఎడిటర్ర్
    కథనాలు
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    OG Movie Story: పవన్‌ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్‌.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్‌ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.  ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)? ఓజీ సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ డేట్ అప్‌డేట్‌ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్‌ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్‌ గ్రూప్స్‌ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్‌ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్‌ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్‌ గ్లింప్స్‌తోనే డైరెక్టర్‌ సుజీత్‌ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్‌ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.  సుజీత్‌ ‘డీపీ’ వైరల్‌ ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్‌ కల్యాణ్‌) కాగా, మరొకరు డైరెక్టర్‌ సుజీత్‌. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్‌’ (Sujeeth) అని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వైరల్‌ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్‌ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ సరిపోతుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.  విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్‌.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.  ఓజీపై శ్రియారెడ్డి హైప్‌ సలార్‌ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్‌ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్‌ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్‌ లైఫ్‌ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది. 
    ఫిబ్రవరి 17 , 2024
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఓజీ - సలార్‌ మధ్య పోలిక! ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.  హై రేంజ్‌లో ఎలివేషన్స్‌! ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.  సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.  చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌! ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.  
    మార్చి 07 , 2024
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీ పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్‌ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ (OG), జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  క్లాష్‌ ఎలా వచ్చిందంటే? పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్‌ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్‌ 27న వస్తుండగా.. తారక్‌ దేవర మూవీ అక్టోబర్‌ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.  https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283 గతంలోనూ ఇలాగే! గతంలోనూ పవన్‌ కల్యాణ్‌, తారక్‌ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్‌ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్‌ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్‌ ప్రింట్‌ బయటకు వచ్చినప్పటికీ పవన్‌ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్‌ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్‌.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.  2 వారాలు సరిపోతాయా? పవన్‌ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్‌ కానుకగా వచ్చిన సలార్‌ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్‌ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్‌ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.  ‘ఒకేసారి రిలీజ్‌ చేయండి’ దేవర, ఓజీ సినిమాల క్లాష్‌ అంశం (Pawan vs Jr NTR) సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్‌ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్‌, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్‌ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు. 
    ఫిబ్రవరి 17 , 2024
    Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు! 
    Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు! 
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). ‘సాహో’ (Saaho) ఫేమ్‌ సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ అభిమానుల్లో మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్‌ పూర్తవ్వగా.. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్‌ బిజీగా ఉండటంతో షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది.  కొత్త పోస్టర్‌తో మరింత హైప్‌! మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (SS Thaman) షేర్ చేసిన పోస్టర్‌లో.. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతున్న‌ట్లు ఈ పోస్టర్‌లో పవన్‌ ఉన్నాడు. దీనిని చూసిన పవన్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ హీరో కటౌట్‌కు తగ్గ సినిమా ‘ఓజీ’ అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులను ‘ఓజీ’ కొల్లగొట్టడం ఖాయమని కామెంట్స్‌ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌! ఓజీ తర్వాత ప్రస్తుతం పవన్‌ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' (Ustad Bhagat Singh). గబ్బర్‌ సింగ్‌ వంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ - డైరెక్టర్‌ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ పైన కూడా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ షూట్‌ కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. ఈ మేరకు 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది' అంటూ ఎక్స్‌లో మేకర్స్‌ ట్వీట్‌ పెట్టారు. దీంతో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు. పవన్‌ పొలిటికల్‌ డైలాగ్‌తో కూడిన ఓ వీడియోను రిలీజ్‌ చేయబోతున్నట్లు సమాచారం.  https://twitter.com/MythriOfficial/status/1768870185656807451? సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'పై పవన్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి తగ్గుతూ వస్తోంది. 
    మార్చి 16 , 2024
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్‌ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్‌ వస్తూనే ఉంది. దీంతో పవన్‌ - క్రిష్‌ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  శ్రీరామ నవమి (ఏప్రిల్‌ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్‌ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో! పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్‌ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్‌ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.   ఆందోళనలకు చెక్‌! పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్‌ క్రిష్‌.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్‌ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
    ఏప్రిల్ 17 , 2024
    Pawan Kalyan Movies Update: పెండింగ్‌ మూవీస్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌.. ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌! 
    Pawan Kalyan Movies Update: పెండింగ్‌ మూవీస్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌.. ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌! 
    ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్ట్రైక్‌ రేట్‌ (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు)తో జనసేన సాధించిన సీట్లు.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే గత పదేళ్లుగా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చిన పవన్‌.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాత్‌ భగత్‌సింగ్‌’ చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఏపీ ఎన్నికలు ముగియడం, పవన్‌ ఉపముఖ్యమంత్రి కూడా కావడంతో.. పెండింగ్‌లో ఉన్న సినిమాలపై పవన్ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.  త్వరలోనే షూటింగ్ ప్రారంభం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh), ‘ఓజీ’ (OG), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రాల షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది. ఇక పవన్‌ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాల కోసం పవన్‌.. తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్‌షీట్ల గురించే చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన మూడు చిత్రాల కోసం రెండు నెలల సమయాన్ని కేటాయించి.. ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ‘పవన్‌.. గొడవలు పెట్టేవారు’ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన 'పరువు' (Paruvu) వెబ్‌సిరీస్‌.. జీ5 వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్యూలో సుస్మిత.. తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా చిన్నతనంలో నాకూ చరణ్‌కు గొడవలు వచ్చేవి. అందుకు కారణం మా పవన్‌ బాబాయ్‌. ఆయన ఇద్దరికీ గొడవలు పెట్టి సినిమా చూసినట్లు చూసేవారు. అది చాలా సరదాగా ఉండేది. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్‌ కావడం మాకు సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి.. వారి కోసం ఏదైనా చేస్తారు' అని మెగా డాటర్‌ చెప్పుకొచ్చారు.  మామకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు శనివారం (జూన్‌ 15) రోజున తిరుమలకు కాలినడకన వెళ్లిన సాయిధరమ్‌ తేజ్‌.. తన మామయ్య విజయాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. కాగా, మామ - అల్లుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
    జూన్ 17 , 2024
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.  ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.  మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.  పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.  ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.  మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.   https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.  ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.  లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.  https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), మాస్‌ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.  బాలయ్య vs రవితేజ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్‌ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్‌ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్‌ త్వరగా షూట్‌ చేసి సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ - దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్‌ బచ్చన్‌' మూవీ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఫుల్‌ ఫోకస్‌ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని హరీష్‌ శంకర్‌ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్‌ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.  గతంలో బాలయ్యదే పైచేయి బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్‌ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  దేవర నుంచి గట్టిపోటీ తప్పదా? తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని కొరటాల టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.  'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్‌  గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.  https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 13 , 2024
    Devara Prepone: పవన్‌ ప్లేస్‌లో తారక్‌.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్‌!
    Devara Prepone: పవన్‌ ప్లేస్‌లో తారక్‌.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్‌!
    అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’ (Devara). పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కాగా, ఈ సినిమాను అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను మార్చాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ముందే రానుందట..! తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ రిలీజై మంచి ఆదరణ సంపాదించింది. ఇదిలా ఉంటే.. 'దేవర' చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలోకి రానున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌ 10 కంటే రెండు వారాలు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న మూవీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు కూడా మెుదలైనట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.  ప్రీ-పోన్‌కు కారణం ఇదే! వాస్తవానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదల కావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా పవన్‌.. ఏపీ రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించడం.. తాజాగా మంత్రిగానూ ప్రమాణం స్వీకారం చేయడంతో ఇప్పట్లో ఓజీ షూటింగ్‌లో పాల్గోనే అవకాశం లేదని అంటున్నారు. దీంతో 'ఓజీ' (OG) సినిమా.. ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో బలంగా టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఓజీకి లాక్‌ చేసిన తేదీనే 'దేవర'ను రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందని కొరటాల శివ టీమ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌ 27న ‘దేవర’తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  గోవాలో షూటింగ్‌.. ప్రస్తుతం.. 'దేవర' టీమ్‌ గోవాలో బిజీ బిజీగా గడుపుతోంది. తారక్‌, జాన్వీ కపూర్‌ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను గోవా చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్‌ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాక్‌ స్టార్‌ అనిరుధ్‌ రవి చందర్‌ అందించిన ఫస్ట్‌ సింగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. రెండో పాటను కూడా త్వరలో రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రొమాంటింక్‌ మెలోడీని రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.  భారీ ధరకు ఓటీటీ హక్కులు!  దేవర చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడు పోయాయి. ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌.. దాదాపు రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని వార్తలు వచ్చాయి. దేవర విడుదలైన 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. తెలుగు, హిందీతో పాటు మరిన్ని సౌత్‌ భాషలలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.  ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు టాక్‌. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
    జూన్ 12 , 2024
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.  థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.  హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.  https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  దేవర 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్‌ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, టామ్‌ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.  తండేల్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తండేల్‌’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్‌ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌ ప్రధాన పాత్రుల పోషించనున్నారు. మట్కా వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్‌ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్‌. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. KGF 3 ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్‌ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. RC16 మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్‌. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.  వాల్తేరు వీరయ్య గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఉప్పెన సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్‌ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్‌ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.  ఘాజీ 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.  మహా సముద్రం  అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది. 
    జనవరి 10 , 2024
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.  మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/sunny4u007/status/1633901586413154304 ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.  https://twitter.com/i/status/1633886352583565313 ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు  ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.  https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20 వరుస పెట్టి సినిమాలు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్‌ శంకర్‌ షూటింగ్‌ను మార్చి 28నుంచి  పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.  https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025 https://twitter.com/SupremePSPK/status/1630933852058423302 ఫటా ఫట్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి.   పవన్ క్యూ జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు వేళాయే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
    మార్చి 10 , 2023
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.  నాగ్ అశ్విన్‌ (Nag Ashwin)   ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.   టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.  https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.  https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.  ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.  స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.  ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..  ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.  ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.  కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.  సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి  సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.  బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు. 
    మే 24 , 2024
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.  https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.   https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.  https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.  https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.  https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.  https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.  https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.  https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.  https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.  https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.   https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.  https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.  https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.  https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.  నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.  https://twitter.com/i/status/1751124216349638941
    జనవరి 27 , 2024
    I Saw The Devil: ఓటీటీలో ఔట్‌ స్టాండింగ్‌ కొరియన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. పెద్దలకు మాత్రమే!
    I Saw The Devil: ఓటీటీలో ఔట్‌ స్టాండింగ్‌ కొరియన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. పెద్దలకు మాత్రమే!
    ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్‌  కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్‌ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్‌ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్‌ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్‌, థ్రిల్లర్‌, మర్డర్స్‌ జానర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఆ సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  ఆ మూవీ ఏదంటే? ఓటీటీలో తప్పకచూడాల్సిన కొరియన్‌ చిత్రాల్లో ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil) ముందు వరుసలో ఉంటుంది. 2010లో కొరియాలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లీ బైంగ్-హమ్ (Lee Byung-Hun) క‌థానాయ‌కుడిగా, చోయ్ మైనా-సిక్ (Choi Myna-Sik) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2 గం. 22 ని.ల నిడివితో డార్క్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ రివేంజ్‌ సినిమా.. అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.  పెద్దలకు మాత్రమే! ఒక సైకో కిల్లర్‌ మనస్తత్వం ఎలా ఉంటుందో దర్శకుడు కిమ్ జీ-వూన్ ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టాడు. పగలు సాధారణ మనుషుల్లాగే ఉంటూ రాత్రి అయితే ఎంత వైలెంట్‌గా మారతారో ఇందులో చూపించారు. ఆడవారిని కిల్లర్‌ హత్య చేయడాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించాడు దర్శకుడు. శరీర భాగాలను కట్‌ చేసి అందులో ఆనందాన్ని వెతుక్కోవడం వీక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. అటువంటి కిల్లర్‌ చేతిలో తనకు ప్రాణానికి ప్రాణమైన యువతి మరణిస్తే ఆ హీరో రియాక్షన్‌ ఇంకెంత వైలెంట్‌గా మారుతుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే ఇందులో బోల్డ్‌ కంటెంట్‌, క్రైమ్‌ సీన్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.  కథేంటి? ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ పగలు స్కూల్ వ్యాన్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ రాత్రిళ్లు ఒంట‌రిగా క‌నిపించే ఆడ వారిని కిడ్నాప్ చేస్తుంటాడు. వారిని వివస్త్రలను చేసిన విచ‌క్ష‌ణార‌హితంగా చంపుతుంటాడు. ఈ క్ర‌మంలో ఓ NIS (The National Intelligence Service) ఏజెంట్ భార్య ఒంట‌రిగా కారులో వెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. కిల్లర్‌ గ‌మ‌నించి ఆమెపై దాడి చేస్తాడు. ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఈ ఘ‌ట‌న‌తో బాగా డిస్ట‌ర్బ్ అయిన హీరో.. విల‌న్ ఆచూకీ తెలుసుకుని అత‌డ్ని ప‌ట్టుకుంటాడు. అయితే చంపకుండా చిత్రహింసలు పెట్టి వదిలేస్తాడు. కిల్లర్‌ కడుపులో జీపీఎస్ ట్రాకర్‌ అమర్చి.. అతడు ఎక్కడకు వెళ్తే అక్కడికి వెళ్లి నరకం చూపిస్తుంటాడు. తన బాడీలో జీపీఎస్‌ ఉందని గ్రహించిన కిల్లర్‌.. దాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కిల్లర్ ఆచూకీని హీరో కనిపెట్టాడా? లేదా? అన్నది కథ.  Telugu.yousay.tv Rating : 3/5 
    ఏప్రిల్ 27 , 2024
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.  1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్‌ గేమ్ ఓ థ్రిల్లర్‌ సర్వైవల్‌ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్‌ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి. https://www.youtube.com/watch?v=oqxAJKy0ii4 2. MY NAME మై నేమ్‌ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్‌ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్‌ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.  https://www.youtube.com/watch?v=ZOl7iOrD31Q 3. MR. SUNSHINE మిస్టర్‌ సన్‌ షైన్‌ లవ్‌ పొలిటికల్‌, హిస్టారికల్‌ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్‌ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్‌ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.  https://www.youtube.com/watch?v=rPJSo4fhtRU 4. CRASH LANDING ON YOU రొమాంటిక్‌ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్‌ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్‌ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్‌ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. https://www.youtube.com/watch?v=eXMjTXL2Vks 5. OUR BLUES  ఈ సిరీస్‌ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌. జెజూల్యాండ్‌ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్‌ ఇది.  https://www.youtube.com/watch?v=vSBIJQOLKoY 6. SIGNAL షెర్‌లాక్‌, బ్రాడ్‌ చర్చ్‌ ఫ్యాన్స్‌ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్‌ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.  https://www.youtube.com/watch?v=OonjouzGJKk 7. ALL OF US ARE DEAD జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్‌ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్‌ ఎక్సపర్‌మెంట్‌ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్‌ చేస్తుంది. https://www.youtube.com/watch?v=IN5TD4VRcSM
    ఏప్రిల్ 26 , 2023
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం.  127 హవర్స్ ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం. నిజ జీవితం ఆధారంగా.. 127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే... ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు.   ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం  జేమ్స్ ఫ్రాన్స్ కో  సాహసాలంటే మహా  ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి  మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన  బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో  ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు.  ఎలా బయటపడ్డాడంటే? లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.  డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ  మంజుమ్మేల్ బాయ్స్  చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో "127 హవర్స్" సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
    మే 15 , 2024

    @2021 KTree