UATelugu2h 58m
వైజాగ్ లో సైతాన్ అనే బ్యాచ్ డ్రగ్స్ దందా, వరుస చైన్ స్నాచింగ్ లు, హత్యలు చేస్తూ ఉంటారు. వరుస దోపిడీలు దాడులతో వైజాగ్ ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో వైజాగ్‌కి పోలీస్ ఆఫీసర్ అర్జున్ వస్తాడు. ఇంతకీ అర్జున్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? అసలు ఈ సైతాన్ బ్యాచ్ వెనుక ఉన్న లీడర్ ఎవరు ? ఈ బ్యాచ్ కి నరేన్ (కార్తికేయ)కి ఉన్న సంబంధం ఏమిటి ? అన్నది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
అజిత్ కుమార్
జాక్ రాబిన్సన్
కార్తికేయ గుమ్మకొండ
హుమా ఖురేషి
బని జె
సుమిత్ర
ఉమా శంకరి
రాజ్ అయ్యప్ప
ధ్రువన్
అచ్యుత్ కుమార్
సునైనా బాదం
వైష్ణవి చైతన్య
షా ఎమ్తియాజ్
దినేష్ ప్రభాకర్
జీఎం సుందర్
పెర్లే మానే
చైత్ర రెడ్డి
సెల్వాః
పావెల్ నవగీతన్
పుగజ్
సిబ్బంది
హెచ్.వినోత్
దర్శకుడుబోనీ కపూర్
నిర్మాతజిబ్రాన్
సంగీతకారుడుయువన్ శంకర్ రాజా
సంగీతకారుడునీరవ్ షా
సినిమాటోగ్రాఫర్కథనాలు
#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ నుంచి ‘వేట్టయన్’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’
రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/thenaani29/status/1843888854568431666
https://twitter.com/Kadirodu/status/1843694483508211884
https://twitter.com/kannayyaX/status/1843899836732743696
https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639
ఆ సినిమాలు కూడా అంతే!
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు భాష వద్దా!
గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అక్టోబర్ 09 , 2024
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ (Tollywood), కోలివుడ్ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్ ఇండస్ట్రీస్ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్ వార్స్ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ vs కోలీవుడ్
గతంలో ఫ్యాన్ వార్ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ చేసిన చిత్రాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.
https://twitter.com/iammvengence/status/1758435868799377642
https://twitter.com/RAO_Offl/status/1759121949656318267
నష్టం ఏంటంటే?
కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోల్స్ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్ ట్రోల్స్ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్ కంటే కలెక్షన్స్ పరంగా వెనకబడిపోతున్నాయి.
ఆ సినిమాలకు దెబ్బ!
త్వరలో రిలీజ్ అయ్యేందుకు సౌత్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోగా కోలీవుడ్ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్స్ రచ్చకు చెక్ పెట్టాల్సిందే!
సౌత్‌లో బిగ్ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్’, ‘రాయన్’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.
పొలిటికల్ టర్న్
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.
https://twitter.com/i/status/1841876236840374698
పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్
టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17 , 2024
Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్’తో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, గెటప్ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ: 04-10-2024
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నగర్కర్ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్ లభించలేదు. రవి బాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్ తక్కువే అయినా మంచి రిచ్ ఔట్‌పుట్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్
కథశ్రీవిష్ణు నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్ బ్రేకులు వేయగలవా!
థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
స్వాగ్ (Swag)
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు.
చిట్టి పొట్టి (Chitti Potti)
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణ (Dakshina)
తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సాయిధన్సిక ఇందులో కనిపించనున్నారు.
కలి (Kali)
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ (Kali). ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
బహిర్భూమి (Bahirbhoomi)
నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లింక్'. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
సెప్టెంబర్ 30 , 2024
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా చూపించిన ఈ సిరీస్, రెండో సీజన్‌లో తన ఉద్యోగ జీవితంలో పైకి ఎలా ఎదిగాడు, పలు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆకర్షణీయంగా చూపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరు౦ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
సిరీస్ విశేషాలు
ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతీ ఎపిసోడ్ దాదాపు 25-30 నిమిషాల నిడివి కలిగి ఉంది. మొత్తం రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్‌ను చాలా సులభంగా వీక్షించవచ్చు. ఎపిసోడ్ల మధ్య ఎక్కడా బోర్ అనిపించకుండా స్టోరీ సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 4వ ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్‌గా సాగి, కొన్ని సందర్భాల్లో నాటకీయత ఎక్కువై అసలు కథకు అంతరాయం కలిగిస్తుంది. అయితే, 5వ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కుటుంబంతో కలసి చూడటం కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కపుల్స్ మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు.
నటీనటులు
తేజస్వి మదివాడ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ పాత్ర పోషించారు. ట్రైలర్‌లో బికినీ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె తన గ్లామర్ పాత్రతో అందరినీ ఆకర్షించింది. తేజస్వి గతంలో ఈ విధమైన పాత్ర చేయకపోయినా, ఈసారి తన రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించారు. అరుణ్ కుమార్ పాత్రలో నటించిన పవన్ సిద్ధు పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా తేజస్వితో ఉన్న సన్నివేశాల్లో సీన్లను బాగా మెప్పించాడు. అనన్య శర్మ తన క్యారెక్టర్‌కు అనుగుణంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆమె అరుణ్ కుమార్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించారు.
దర్శకత్వం
దర్శకుడు ఆదిత్య కేవీ మొదటి సీజన్‌లో అమెచ్యూర్ నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదురుకెళ్లే అరుణ్ కథను చక్కగా చూపించారు. రెండో సీజన్‌లో అతను ఉద్యోగంలో ఎదగడం, కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే, 4వ ఎపిసోడ్‌లో ఎక్కువగా కేవలం సంభాషణలే ఉండడంతో కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా ఈ సిరీస్ ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ రిచ్ లుక్‌ను కలిగి ఉండి, అజయ్ అరసాడా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరింత మెరుగ్గా ఆవిష్కరించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది.
చివరగా:
వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ సరైన ఎంపిక. పూర్తి వినోదాన్ని అందిస్తుంది.
రేటింగ్:
3/5
నవంబర్ 02 , 2024
Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్ పోస్టు!
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే?
‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
బాయ్‌కాట్ చేయాలని డిమాండ్
భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని ఓ నెటిజన్ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్ కానేకాదని మరో విధమైన క్రష్ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం 'అమరన్'ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు.
https://twitter.com/Bhav1212B/status/1850791387672801479
https://twitter.com/cinematicfreak0/status/1850791153928745098
https://twitter.com/devx_18k/status/1850791086458831193
https://twitter.com/Chhuparustam91/status/1850790246012653618
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/MissDD114/status/1850829733895737441
సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు
ఇదిలా ఉంటే అమరన్ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.
https://twitter.com/Sai_Pallavi92/status/1850571262755582363
కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
అక్టోబర్ 28 , 2024
Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్.. భయంతో అకౌంట్స్ క్లోజ్!
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి దీక్ష విరమించారు. అనంతరం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో డీఎంకే, ఉదయనిధి సోషల్ మీడియా వింగ్ పవన్‌ను టార్గెట్ చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి తెరలేపింది. ఇక పవన్ ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగి ఉదయనిధి ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు డీఎంకే సోషల్ మీడియా విభాగం పూర్తిగా వెనక్కి తగ్గింది. నిన్నటి వరకూ పవన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసిన పలు అకౌంట్లు ప్రస్తుతం క్లోజ్ అయ్యాయి.
చెన్నైలోని తమ హాస్టల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన సనాతన ధర్మం గురించే చర్చ జరుగుతోందంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. దీనంతటికీ కారణం పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే ఒక సీటుకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పాడు.
https://twitter.com/Deepika_JSP/status/1843293613029200362
పవన్‌పై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న నటుడు ప్రకాష్ రాజ్‌ను సైతం సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లూజర్ అయిన ప్రకాష్ రాజ్ ఆంధ్రాలో రెండో అతిపెద్ద పార్టీ అధినేత పవన్‌కు రాజకీయాలపై సలహాలు ఇవ్వడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ సైకియార్టిస్టును కలిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. అంతేకాదు 2019లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసి ప్రకాష్ రాజ్ ఏ విధమైన ఘోర ఓటమిని చవి చూశారో గుర్తుచేస్తున్నారు.
https://twitter.com/nrkaravindh/status/1843349508127916391
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం నినాదాన్ని ఖండిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తుల నిజ స్వరూపాలను సైతం ఫ్యాన్స్ బట్టబయలు చేస్తున్నారు. We Dravidians 2.0 అకౌంట్ నుంచి పవన్‌పై తీవ్ర అసభ్యకర పోస్టు వచ్చింది. అయితే ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తి వేరే మతస్తుడని, పైగా మలేసియా పౌరసత్వం తీసుకున్నాడని ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టారు. ద్రవిడియన్స్ ముసుగులో సనాతన ధర్మపై యుద్దం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
https://twitter.com/HPhobiaWatch/status/1843251985178657133
పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున We Dravidians 2.0 పేజీని టార్గెట్ చేయడంతో వారిని తట్టుకోలేక అడ్మిన్ తన పేజీను క్లోజ్ చేసుకున్నాడు. ఎగిరెగిరి పడ్డ సీఎంనే 11 సీట్లకు పరిమితం చేశాడని, అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/lyf_a_zindagii/status/1843309397952598086
https://twitter.com/Nanda_927/status/1843287653699211585
పవన్ కంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బాగా చదువుకున్నాడని చేస్తోన్న ట్రోల్స్‌కి ఫ్యాన్స్ గట్టిగానే బదులిస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన పవన్.. చెన్నై వరదల సమయంలో రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడని గుర్తు చేశారు. మరి బాగా చదువుకున్న ఉదయనిధి ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాది బిన్‌లాడెన్ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశాడని, కానీ ఎన్నో బిల్డింగులను బాంబులతో కూల్చి వేశాడని గుర్తు చేశారు.
https://twitter.com/parandhamdalit/status/1842842605828415846
ఉదయ నిధి స్టాలిన్ ఐటీ సెల్‌ను ధీటుగా ఎదుర్కొవడం ద్వారా సోషల్ మీడియాలో మరోమారు పవన్ కల్యాణ్ సత్తా ఏంటో నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ ఐకమత్యంగా ఏర్పడి పవన్ వ్యకతిరేక శక్తులను తిప్పికొట్టారని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/lordshivom/status/1843026533906059587
పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లాలంటే అతడి ఊర మాస్ ఫ్యాన్స్‌ను దాటుకొని వెళ్లాలంటూ ఓ అభిమాని పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
https://twitter.com/i/status/1843210460226867648
https://twitter.com/PK_Addicts/status/1843004204392088060
ఏపీలో ఒకప్పటి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని, మాజీ సీఎం జగన్‌ను పవన్ కల్యాణ్ ఏ విధంగా ఓడించాడో చూడంటూ పెట్టిన వీడియో సైతం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.
https://twitter.com/i/status/1843210675512086692
https://twitter.com/JSPGovtIn2024/status/1843221542920159417
ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూపై తమిళ యూట్యూబ్ ఛానెల్ రీసెంట్‌గా ఓ పోల్ నిర్వహించింది. ఈ వ్యవహారంలో పవన్‌కే ఏకంగా 89 శాతం మంది మద్దతు లభించింది.
https://twitter.com/_MSD_VK/status/1842860646544630155
అక్టోబర్ 08 , 2024
NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ - బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్ ఉంది. గతంలో బాలయ్య - బోయపాటి చేసిన హ్యాట్రిక్ చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇవాళ (జూన్ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.
బాలయ్య కుమార్తె సమర్పణలో..
ఇవాళ (జూన్ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది 'NBK 110' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - బోయపాటి అప్‌కమింగ్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. 'లెజెండ్' చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. 'NBK110' చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం.
షూటింగ్ ఎప్పుడంటే?
బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్ ప్రకారం.. 'NBK110' చిత్రం ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీతో కలిసి 'NBK109' చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు.
బోయపాటికే సాటి..
ఇండస్ట్రీకి హ్యాట్రిక్ విజయాలను అందించిన బాలకృష్ణ - బోయపాటి జర్నీ.. 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్ కావడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 10 , 2024
Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.
https://twitter.com/SureshPRO_/status/1691450193684934656
సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464
అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.
https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037
చిన్మయి ఏమందంటే?
స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664
ఫ్యాన్స్ హ్యాపీ
చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు.
https://twitter.com/__GirDhar/status/1691518743820791809
విజయ్, సామ్ పర్ఫార్మెన్స్
మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
ఆగస్టు 16 , 2023
PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈరోజు #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20
ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్ తన అకౌంట్‌కు జత చేశారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20
అందుకేనా ఇన్‌స్టా?
ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.
జులై 'బ్రో' నెల
మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది. చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.
అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
జూలై 04 , 2023
Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్, నెగిటివిటీ మెుదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆడియన్స్ ఏమంటున్నారు?
ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ యావరేజ్ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం.
https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234
https://twitter.com/i/status/1776636730034245707
https://twitter.com/plaasya/status/1777072948597428600
విజయ్‌కు ముందే తెలుసా?
‘ఫ్యామిలీ స్టార్’ గురించి ఇద్దరు యూట్యూబ్ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమాపై హేట్ లేదని చెప్పాడు. అయితే విజయ్ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా నిర్మాత దిల్ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/chanticomrade_/status/1776839226312753263
విజయ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మెుదటి నుంచి విజయ్ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. కారణం ఏదైనా విజయ్ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్, నెగిటివ్స్ బయటకు వస్తున్నాయి.
దిల్ రాజుపై నెగిటివిటీ
దిల్ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్ మెుదలయ్యాయి. తమిళ స్టార్ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్ రాజు రిలీజ్ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ విషయంలోనూ దిల్ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు డైరెక్టర్ పరుశురామ్.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్’పై పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఫేక్ రివ్యూస్
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది.
రిలీజ్‌కు ముందే ట్రోల్స్!
వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్ మెుదలయ్యాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్ కాస్ట్యూమ్స్ ధరిస్తాడని.. బ్రాండెండ్ షూస్ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్ రాజు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ అబ్బాయిని సూపర్ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్ రాజు బదులిచ్చారు.
‘గుడ్ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’
తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.
అయితే దిల్ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు.
https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
ఏప్రిల్ 08 , 2024
Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్ పాత్రలు ఇవే!
సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్ దర్శకులు హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్ లభించి సినిమా హిట్ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
భిక్షు యాదవ్ (Sye)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్ పాత్ర కంటే.. విలన్ బిక్షు యాదవ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్ రావత్ కెరీర్‌ను మలుపుతిప్పింది.
https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b
అలీభాయ్ (Pokiri)
పోకిరిలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన అలీభాయ్ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్ రాజ్ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్ రాజ్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV
భల్లాలదేవ (Baahubali)
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.
https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv
పశుపతి (Arundhati)
తెలుగులో అతి భయంకరమైన విలన్ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.
https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3
కాట్‌రాజ్ (Chatrapathi)
ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9
పండా (Gharshana)
ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.
https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml
మద్దాలి శివారెడ్డి (Race Gurram)
రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్. అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.
https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H
వైరం ధనుష్ (Sarrainodu)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.
https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw
భవాని (Siva)
శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్ (Raghuvaran) స్టార్ విలన్‌గా మారిపోయాడు.
https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT
బుక్కా రెడ్డి (Rakta Charitra)
రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.
https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0
అమ్రీష్ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari)
చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్ నటన మెప్పిస్తుంది.
https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc
రణదేవ్ బిల్లా (Magadheera)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్ రణదేవ్ బిల్లాకు స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. దేవ్ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.
https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN
మంగళం శ్రీను (Pushpa)
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో.. నటుడు సునీల్ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్, నటన ఎంతగానో ఆకట్టుకుంది.
https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
మార్చి 20 , 2024