• TFIDB EN
  • అదా శర్మ
    జననం : మే 11 , 1992
    ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
    ఆదా శర్మ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది.2008 హిందీలో విడుదలైన '1920' సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.చిత్రంలో ఆమె పోషించిన స్త్రీ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది . రొమాంటిక్ కామెడీ చిత్రం హసీ తో ఫేసీ (2014) విడుదలైన తర్వాత, ఆమె దక్షిణ భారత చలనచిత్రంలోకి ప్రవేశించింది. అక్కడ తెలుగులో హార్ట్ అటాక్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత గరం, క్షణం, మీట్ క్యూట్ వంటి హాస్య ప్రధాన సినిమాల్లో నటించింది.

    అదా శర్మ వయసు ఎంత?

    అదా శర్మ వయసు 33 సంవత్సరాలు

    అదా శర్మ ముద్దు పేరు ఏంటి?

    అద్స్‌, రజ్ని స్పైడర్‌

    అదా శర్మ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    అదా శర్మ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, మ్యూజిక్‌ వినటం

    అదా శర్మ ఏం చదువుకున్నారు?

    అదా శర్మ.. 10వ తరగతి వరకే చదువుకుంది.

    అదా శర్మ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఆక్సిలియం కాన్వెంట్‌ హైస్కూల్‌, ముంబయి

    అదా శర్మ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బాలీవుడ్‌ హీరో విద్యుత్ జమ్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి.

    అదా శర్మ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    అదా శర్మ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో హార్ట్ ఎటాక్‌, S/O సత్యమూర్తి, గరం, క్షణం, కల్కి (2019) చిత్రాల్లో అదా శర్మ నటించింది.

    అదా శర్మ‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ఏడు వెబ్‌సిరీస్‌లలో నటించింది.

    అదా శర్మ Hot Pics

    Images

    Actress Adah Sharma Latest Hot Pics

    Images

    Adah Sharma Hot Images

    అదా శర్మ In Bikini

    Images

    Adah Sharma Hot in Bikini

    Images

    Adah Sharma Bikini Images

    అదా శర్మ In Saree

    Images

    Adah Sharma Hot Waist Show in Saree

    Images

    Actress Adah Sharma

    అదా శర్మ In Ethnic Dress

    Images

    Adah Sharma

    Images

    Adah Sharma Hot in Ethnic Wear

    అదా శర్మ With Pet Dogs

    Images

    Adah Sharma With Pet Dog

    అదా శర్మ In Half Saree

    Images

    Adah Sharma Images in Half Saree

    అదా శర్మ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Adah Sharma

    Images

    Adah Sharma

    Viral Videos

    View post on X

    Adah Sharma Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Adah Sharma Hot Insta Reel

    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా? 'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.  కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.  సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.  సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. 
    మే 03 , 2023
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది రామ్ పొత్తినేని(RAPO) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానే వచ్చింది. నేడు  (మే 15) సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్  ఆసాంతం పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. టీజర్‌లో రామ్ లుక్స్, స్ట్రైల్, స్వాగ్ వెటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూరి జగన్నాథ్.. రామ్‌పై(Ram Pothineni) సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసినట్లు టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్‌లో అలీ భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. మరోసారి పూరి- అలీ కామెడీ మ్యాజిక్ అవిష్కృతం కానుంది.  Double ismart Dialogues ఇక ఈ చిత్రంలో మేయిన్ విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్‌ను కూడా టీజర్‌లో క్రూరంగా చూపించారు. ఇక టీజర్‌లో రామ్‌ పొత్తినేని చెప్పే లాస్ట్ డైలాగ్ ఊర మాస్‌గా ఉంటుంది. “నాకు తెల్వకుండా నాపైనా సినిమా ప్లాన్ చేస్తే..నా గుడ్డులో మండుతది” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మాస్‌ డైలాగ్‌లు డబుల్ ఇస్మార్ట్‌లో అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాదిరి గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా BGM సూపర్బ్‌గా ఉంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/TheAakashavaani/status/1790604878475301304 సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌(Double ismart Teaser) ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలోనూ సినిమా టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. https://twitter.com/warriorkrishnaa/status/1790606705455497645 యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ అంటూ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. చివర్లో సూపర్బ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ టీజర్ బాగుందంటూ శ్రీహర్ష అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రామ్ ఎనర్జీ ఎప్పటిలాగే అదిరిపోయిందని, బీజీఎం, సాంగ్ ర్యాపో అంచనాలు అందుకుందని చెప్పుకొచ్చాడు.  https://twitter.com/NameisSrii/status/1790603578266321121 డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ రివీల్ ఇక ఈ సినిమా హీరోయిన్‌ గురించి ఎక్కడా ఇంతవరకు అధికారికంగా(Double ismart heroine) ప్రకటించనప్పటికీ.. సినిమా టీజర్‌లో హీరోయిన్ ఎవరో రివీల్ అయింది. టీజర్‌లో వచ్చే ''ఇస్మార్ట్ ఇంకర్‌కా స్టైల్ క్యా మాలూమ్..కిర్రాక్ పోరొస్తే సైట్ మార్..కతర్నాక్ బీట్ వస్తే.. స్టెపా మార్" అంటూ చెప్పే డైలాగ్‌లో కావ్యా థాపర్(Kavya Thapar) కనిపిస్తుంది. ఏక్‌ మినీ కథ, ఈగల్ సినిమాలో నటించిన కావ్యా థాపర్‌.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్‌ పొత్తినేనితో రొమాన్స్ చేయనుంది. ఈ గ్లామర్ డాల్ టీజర్‌లో కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ.. స్మైలింగ్ లుక్‌, ఆకట్టుకునే అందంలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే మరోసారి అందాల విందు తప్పదని అర్ధమవుతోంది.  పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ క్యారెక్టర్లను పూరి డిజైన్ చేస్తుంటాడు. గతంలో వచ్చిన నభా నటేష్,ఆసిన్, అనుష్క,  నిధి అగర్వాల్,  హన్సిక, అదా శర్మ పూరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.  తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ ద్వారా కావ్యథాపర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి  ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమాలో కావ్యా థాపర్‌(Kavya Thapar)తో రామ్ పొత్తినేనికి మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 'ఏక్ మినీ కథ' చిత్రంతో గుర్తింపు పొందిన  కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. క్యూట్‌గా కనిపిస్తూనే  హాట్ ట్రీట్ ఇవ్వగలదని ఇప్పటికే ఈగల్ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఈక్రమంలోనే కావ్య థాపర్‌ను డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. నార్త్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.  తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథా, రవితేజతో కలిసి ఈగల్ చిత్రంలో నటించింది అటు సాండిల్ వుడ్‌లో బిచ్చగాడు 2లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది మే 19న ఈ సినిమా విడుదలైంది.  అప్పట్లో ఈమె ప్రమోషన్లలో పాల్గొన్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది. హాటో ఫొటో షూట్‌లతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.
    మే 15 , 2024
    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి! ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు భ్రమయుగం మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని ఫైల్స్‌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.  ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సైరెన్‌ జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నాసామి రంగ ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  ది కేరళ స్టోరీ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
    ఫిబ్రవరి 12 , 2024
    HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా? హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్‌ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్‌ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్‌ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్‌ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్‌.  భాగల్‌పూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది. భాగల్‌పుర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు చేసింది.  నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.  నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.  డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.  సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్‌, సల్సా, మరెంగ్యూ, జివ్‌, జాజ్‌ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.  లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్‌  డ్యాన్స్ స్టూడియోస్‌' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్‌ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.  నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్‌ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్‌ చెబుతారు.  నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్‌ యాక్టర్‌ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట. హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్‌ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్‌ కాగా, మరొకరు మధుబాల. నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్‌.  నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్‌ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్‌. నాని నటించిన రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్‌ కాలేదు.  హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్‌ జంటగా నటించిన 'బ్యాడ్‌ న్యూస్‌' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్‌ అనే పాత్రలో కనువిందు చేసింది.  రీసెంట్‌గా '36 డేస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్‌ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది. 
    నవంబర్ 21 , 2024

    అదా శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    ఎస్‌.ఎల్‌. శర్మ, షీలా శర్మ

    అదా శర్మ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    అదా శర్మ తండ్రి ఎస్‌.ఎల్‌ ఇండియన్ మర్చంట్‌ నావీలో పనిచేశారు. 2014లో చనిపోయారు. తల్లి షీలా శర్మ.. క్లాసిక్‌ డ్యాన్సర్‌ & యోగా ట్రైనర్‌.

    అదా శర్మ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    తోబుట్టువులు లేరు.

    అదా శర్మ Family Pictures

    Images

    Adah Sharma Family Images

    Images

    Adah Sharma Family

    అదా శర్మ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' (2014) సినిమాతో అదా శర్మ ఫేమస్‌ అయ్యింది.

    అదా శర్మ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    1920 (హిందీ).. అదా శర్మ కెరీర్‌లో ఫస్ట్‌ ఫిల్మ్‌ కాగా.. తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' ఆమె మెుదటి సినిమా.

    తెలుగులో అదా శర్మ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    S/o సత్యమూర్తి (2015)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అదా శర్మ తొలి చిత్రం ఏది?

    అదాశర్మ లీడ్‌ రోల్‌లో చేసిన 'ది కేరళ స్టోరీ'.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    అదా శర్మ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ది కేరళ స్టోరీ'లో షాలిని ఉన్నిక్రిష్ణన్‌ / ఫాతిమా పాత్ర

    అదా శర్మ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    అదా శర్మ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ. కోటి వరకూ తీసుకుంటోంది.

    అదా శర్మ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజ్జా, ఇడ్లీ, దోశ

    అదా శర్మ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రణ్‌వీర్‌ సింగ్‌, హృతిక్‌ రోషన్‌

    అదా శర్మ కు ఇష్టమైన నటి ఎవరు?

    మాధురి దీక్షిత్, వైజయంతి మాల

    అదా శర్మ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    అదా శర్మ ఫెవరెట్ సినిమా ఏది?

    కింగ్‌ కాంగ్‌ (2005)

    అదా శర్మ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, పింక్‌

    అదా శర్మ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అదా శర్మ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    దుబాయి, అమెరికా

    అదా శర్మ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi A6 BMW X5 Audi A4C

    అదా శర్మ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    అదా శర్మ ఆస్తుల విలువ రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    9.6 మిలియన్లు

    అదా శర్మ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు - 2009

      '1920' (హిందీ) చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకుంది.

    • సైమా, సంతోషం అవార్డ్స్‌ - 2015

      'హార్ట్ ఎటాక్‌' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా సైమా, సంతోషం అవార్డ్స్‌ గెలుపొందింది.

    అదా శర్మపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ'.. జాతీయ స్థాయిలో వివాదానికి కారణమైంది. అదా శర్మను విమర్శిస్తూ నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

    అదా శర్మ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    నెస్‌కేఫ్‌ కాఫీ, స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌, స్మైటెన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో ఆదా శర్మ నటించింది.
    అదా శర్మ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అదా శర్మ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree