• TFIDB EN
  • ఆదిత్య ఓం
    ప్రదేశం: సుల్తాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
    ఆదిత్య ఓం ప్రముఖ నటుడు, డైరెక్టర్‌. 1980 అక్టోబర్‌ 5న యూపీలో జన్మించారు. కెరీర్‌ తొలినాళ్లలో స్టేజ్‌ నాటకాలు, హిందీ సీరియల్స్‌లో నటించారు. తెలుగు చిత్రం 'లాహిరి లాహిరి లాహిరిలో' (2002)తో వెండి తెరపై అడుగుపెట్టారు. 'ధనలక్ష్మి ఐ లవ్ యు', 'ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!', 'ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి' చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో 24 పైగా చిత్రాల్లో ఆదిత్య ఓం నటించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మరో ఆరు చిత్రాలు చేశారు. దర్శకుడిగానూ మారి 'మిస్టర్‌ లోన్లీ', 'బందూక్‌', హూ కిల్డ్‌ రాజీవ్‌?, 'మైలా', 'సాంట్‌ తుకారం' చిత్రాలను తెరకెక్కించారు. బిగ్‌బాస్‌ తెలుగు 8 సీజన్‌లో పాల్గొని మరోమారు తెలుగు ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించారు.

    ఆదిత్య ఓం వయసు ఎంత?

    ఆదిత్య ఓం వయసు 49 సంవత్సరాలు

    ఆదిత్య ఓం ఎత్తు ఎంత?

    5' 10'' (177 cm)

    ఆదిత్య ఓం అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, వాచింగ్‌ మూవీస్‌, క్రికెట్ ఆడటం

    ఆదిత్య ఓం ఏం చదువుకున్నారు?

    బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేశారు.

    ఆదిత్య ఓం సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు స్టేజ్‌ నాటకాలు వేశారు. పలు హిందీ సీరియల్స్‌లోనూ ఆదిత్య నటించారు.

    ఆదిత్య ఓం ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    భారతీ విద్యాపీఠ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ముంబయి

    ఆదిత్య ఓం‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 24 చిత్రాల్లో ఆదిత్య ఓం నటించాడు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మరో ఆరు చిత్రాలు చేశారు.

    ఆదిత్య ఓం In Sun Glasses

    ఆదిత్య ఓం అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    ఆదిత్య ఓం తల్లిదండ్రులు ఎవరు?

    ఆదిత్య తండ్రి పేరు రామేశ్వర్‌ సింగ్‌. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. తల్లి కూడా టీచర్‌గా పనిచేశారు.

    ఆదిత్య ఓం‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అనుపమ్‌ సింగ్‌ అనే సోదరుడు ఉన్నారు.

    ఆదిత్య ఓం ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి చిత్రాల ద్వారా తెలుగులో పాపులర్‌ అయ్యాడు.

    ఆదిత్య ఓం లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో సినీ జీవితంలో అడుగుపెట్టారు. 'ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!' సినిమాలో సోలో హీరోగా నటించి కథానాయకుడిగా మారారు.

    తెలుగులో ఆదిత్య ఓం ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    లాహిరి లాహిరి లాహిరిలో

    ఆదిత్య ఓం కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాలోని పాత్ర

    ఆదిత్య ఓం బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    నటన కాకుండా ఆదిత్య ఓం కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    ఆదిత్యకు నటనతో పాటు డైరెక్షన్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన ఐదు చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. 'మిస్టర్‌ లోన్లీ', 'బందూక్‌', హూ కిల్డ్‌ రాజీవ్‌?, 'మైలా', 'సాంట్‌ తుకారం' చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

    ఆదిత్య ఓం కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    ఆదిత్య ఓం కు ఇష్టమైన నటుడు ఎవరు?

    గోవిందా

    ఆదిత్య ఓం కు ఇష్టమైన నటి ఎవరు?

    వహీదా రెహమాన్‌

    ఆదిత్య ఓం ఫేవరేట్‌ క్రీడ ఏది?

    ఫుట్‌బాల్‌, క్రికెట్‌

    ఆదిత్య ఓం ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    లియోనెల్‌ మెస్సీ

    ఆదిత్య ఓం కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    పారిస్‌, స్విట్జర్లాండ్‌

    ఆదిత్య ఓం ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    ఆదిత్య ఓం ఆస్తుల విలువ రూ.30 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    ఆదిత్య ఓం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
    ఆదిత్య ఓం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆదిత్య ఓం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree