

అజిత్ కుమార్ వయసు ఎంత?
అజిత్ కుమార్ ముద్దు పేరు ఏంటి?
అజిత్ కుమార్ అభిరుచులు ఏంటి?
అజిత్ కుమార్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
అజిత్ కుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
అజిత్ కుమార్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
అజిత్ కుమార్ In Sun Glasses
అజిత్ కుమార్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Ajith Kumar Viral Video
Hero Ajith Kumar Viral Video
- Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు. దర్శకుడు : పవన్ సుంకర సంగీత దర్శకుడు : టి.ఆర్. కృష్ణ చేతన్ సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్ ఎడిటర్: నరేష్ అదుప నిర్మాత : సైర్ధర్ మారిస ఓటీటీ వేదిక: ఈటీవీ విన్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ ఫిల్మ్ 'లీలా వినోదం' (Leela Vinodham Review). పవన్ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్'లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి సినిమా కథ 2008లో జరుగుతుంటుంది. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. క్లాస్ మేట్ లీలా (అనగ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కాలేజీ అయిపోవడంతో ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకుంటారు. అలా సరదాగా రోజూ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రెండ్ రాజేష్ (మిర్చి శరణ్) హెల్ప్‌తో తన ప్రేమ విషయాన్ని లీలాకు చెబుతాడు ప్రసాద్. దీంతో లీలా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమె సైడ్ నుంచి ఒక్క మెసేజ్ గానీ, ఫోన్ కాల్ గానీ రాదు. లీలా ఎందుకు రిప్లే ఇవ్వలేదు? అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు? అతడి ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రసాద్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అతడు జీవించాడు. లవ్ సీన్స్‌లో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ను ఇంప్రెస్ చేస్తాయి. 2008 కాలంలో అబ్బాయిలు ప్రేమ విషయంలో ఎంత బిడియంగా ఉండేవారో తన నటనతో కళ్లకు కట్టాడు. హీరోయిన్ అనగ అజిత్ కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్ పాత్రలు చేసిన మిర్ఛి శరణ్, ప్రసాద్ బెహరా తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు పవన్ సుంకర స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిడ్ ఏజ్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా 30+ ఉన్న వారు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమ టీనేజ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో యువకులు ఎంత ఇబ్బంది పడతారో దర్శకుడు బాగా చూపించాడు. చాటింగ్ చేసుకునే సీన్స్‌ను కూడా చక్కగా తెరకెక్కించారు. మిర్ఛి శరణ్, ప్రసాద్ బెహరా పాత్రలతో కామెడీని రాబట్టాడు. అయితే రొటీన్ స్టోరి, ఆసక్తి లేని కథనం సినిమాకు మైనస్‌గా మారాయి. చాటా చోట్ల కథ నెమ్మదిగా, అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలిగింది. ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది. ఆమని, గోపరాజు రమణ, రూపలక్ష్మీ వంటి సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలకు ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా.. టెక్నికల్ విషయాలకు వస్తే (Leela Vinodham Review In Telugu) సినిమాటోగ్రఫీ బాగుంది. అనుష్ కుమార్ తన కెమెరా పనితనంతో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. టి.ఆర్. కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది. అతడు ఇచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు చాలా ప్లెజెంట్‌గా సాగిపోయాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ షణ్ముఖ్, అనగ అజిత్ నటనవింటేజ్ లవ్ సీన్స్‌కామెడీ మైనస్ పాయింట్స్ అసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలుఎడిటింగ్ Telugu.yousay.tv Rating : 2.5/5డిసెంబర్ 19 , 2024
- Kamal Haasan: కమల్ హాసన్ తరహాలో స్టార్ ట్యాగ్‌ను తిరస్కరించిన తెలుగు హీరో తెలుసా?దేశం గర్వంచతగ్గ నటుల్లో తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఒకరు. విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇండస్ట్రీలకు అతీతంగా దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాత ఏ నటుడికి అందనంత ఎత్తులో కమల్ హాసన్ నిలిచారు. ఇటీవలే నవంబర్ 7న తన 70వ పుట్టిన రోజు జరుపుకొని సెలబ్రిటీలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విషెస్ అందుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సెన్సేషనల్ లేఖను కమల్ హాసన్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారాయి. లేఖలో ఏమన్నారంటే.. యావత్ దేశం మెచ్చే నటుడు కావడంతో కమల్ హాసన్‌ను ఆయన అభిమానులు ప్రేమగా 'ఉలగనాయగన్' (Ulaga Nayagan) అనే బిరుదుతో పిలుస్తుంటారు. దాని అర్థం యూనివర్సల్ స్టార్. తెలుగులోనూ ఆర్థం వచ్చేలా కమల్‌ను విశ్వనాయకుడు, లోకనాయకుడు అనే టైటిల్స్‌తో ఫ్యాన్స్ సంభోదిస్తుంటారు. అయితే తనకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదని తాజాగా విడుదల చేసిన లేఖలో కమల్ అన్నారు. ఈ మేరకు స్పెషల్ లేఖను సైతం సోషల్ మీడియాలో ఇంగ్లీషు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. 'నా వర్క్‌కు మెచ్చి ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులు అందించినందుకు కృతజ్ఞుడిని. ఇతర కళల మాదిరే సినిమా కూడా అందరిది. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. స్టార్ ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నా. అభిమానులు, సినీ ప్రముఖులు, తోటి ఇండియన్స్ నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కె.హెచ్ అని పిలవాలని అభ్యర్థిస్తున్నా' అంటూ లేఖలో రాసుకొచ్చారు. https://twitter.com/ikamalhaasan/status/1855832318268567619 ‘నేను.. నిత్య విద్యార్థి’ బహిరంగ లేఖలో మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్. సినిమా అనేది ఏ వ్యక్తి ఊహాకు అందనిదని తెలిపారు. ఈ కళలో తాను నిత్య విద్యార్థినని స్పష్టం చేశారు. ఇందులో ఎన్నో విషయాలు నేర్చుకొని, మరింత ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇతర కళల మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందినదని పేర్కొన్నారు. అసంఖ్యాక కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సహకారం, విభిన్నైన గొప్ప కథలకు ప్రతిబింబమే సినిమా అంటూ కమల్ రాసుకొచ్చారు. తనలోని లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు నటుడిగా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నాని అన్నారు. నటుడిగా నా మూలాలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే బిరుదులను తిరస్కరిస్తున్నట్లు మరోమారు స్పష్టం కమల్ చేశారు. ఆ తెలుగు స్టార్ సైతం.. నటీనటులు స్టార్ ట్యాగ్స్‌ను దూరంపెట్టడం ఇది తొలిసారి కాదు. నటనలోని సహజత్వంతో నాని నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్లో 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ యంగ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేచురల్ స్టార్ నాని ట్యాగ్‌ను తీసేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇకపై తనను కేవలం నాని అని పిలిస్తే చాలని చెప్పారు. కానీ ఆయన అభిమానులు ఇప్పటికీ నేచురల్ స్టార్ అంటూ తమ హీరోను ముద్దుగా పిలుచుకుంటున్నారు. మరోవైపు కోలీవుడ్‌కు చెందిన అజిత్ సైతం తన ట్యాగ్స్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తన పేరుకు ముందు ‘తలా’ లేదా ఏ ఇతర స్టార్ ట్యాగ్స్ జోడించవద్దని కోరారు. కేవలం అజిత్ కుమార్ లేదా అజిత్, ఏకే అని పిలవమని అభిమానులకు సూచించారు.నవంబర్ 11 , 2024
- Prabhas New Projects: మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్.. సెట్స్‌పైకి ఒకేసారి మూడు చిత్రాలు!పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దేశంలో ఏ స్టార్ హీరోకు అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా కల్కితో రూ.1200 కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. అంతేకాదు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తూ ఫుల్ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించి ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ప్రభాస్ ఇచ్చిన మాట ఇదే! హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయాడు. అతడు ఏ సినిమా పట్టుకున్న అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా మారిపోతోంది. ఆదిపురుష్ (2023) ముందు వరకూ ప్రభాస్ ఒక్కో చిత్రానికి కనీసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2015 బాహుబలి నుంచి ఈ తంతు మెుదలైంది. బాహుబలి నుంచి బాహుబలి 2 మధ్య గ్యాప్ రెండేళ్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సాహో (2019), రాధే శ్యామ్ (2022) మధ్య ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది. దీంతో అప్పట్లో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా అంటూ డార్లింగ్‌పై సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చూస్తూ దూసుకెళ్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వ్యూహం! ప్రభాస్ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని స్వస్థి పలికి సూపర్ కృష్ణ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ ఏక కాలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఆయన తరహాలోనే ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ‘సలార్’ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లోనూ పాల్గొంటూ రెండు చిత్రాలను 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. దేశంలోనే నెం.1 హీరోగా ప్రభాస్ బాలీవుడ్‌కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వెనక్కినెట్టి ప్రభాస్ నెంబర్ వన్‌గా అవతరించాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.ఆగస్టు 31 , 2024







.jpeg)





అజిత్ కుమార్ పెంపుడు కుక్క పేరు?
అజిత్ కుమార్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
అజిత్ కుమార్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
అజిత్ కుమార్ పెళ్లి ఎప్పుడు అయింది?
అజిత్ కుమార్ కు పిల్లలు ఎంత మంది?
అజిత్ కుమార్ Family Pictures
అజిత్ కుమార్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
అజిత్ కుమార్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో అజిత్ కుమార్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అజిత్ కుమార్ తొలి చిత్రం ఏది?
అజిత్ కుమార్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అజిత్ కుమార్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Ajith Kumar best stage performance
Ajith Kumar stage performance
అజిత్ కుమార్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Ajith Kumar best dialogues
Ajith Kumar dialogues
Ajith Kumar best dialogues
నటన కాకుండా అజిత్ కుమార్ కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?
అజిత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంత?
అజిత్ కుమార్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
అజిత్ కుమార్ ఫేవరేట్ కలర్ ఏంటి?
అజిత్ కుమార్ ఫేవరేట్ క్రీడ ఏది?
అజిత్ కుమార్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
అజిత్ కుమార్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
అజిత్ కుమార్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
అజిత్ కుమార్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2000
వాలి (2000) - ఉత్తమ నటుడు
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2003
విలన్ (2003) - ఉత్తమ నటుడు
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2007
వరాలారు (2007) - ఉత్తమ నటుడు
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ - 2001
పూవెల్లం అన్ వాసం (2001) - స్పెషల్ ప్రైజ్
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ - 2007
వరాలారు (2007) - స్పెషల్ ప్రైజ్
విజయ్ అవార్డ్స్ - 2007
వరాలారు (2007) - ఉత్తమ నటుడు
విజయ్ అవార్డ్స్ - 2008
బిల్లా (2008) - ఉత్తమ నటుడు
విజయ్ అవార్డ్స్ - 2012
మన్‌కథ (2012) - ఉత్తమ విలన్