• TFIDB EN
  • అజిత్ కుమార్
    ప్రదేశం: సికింద్రాబాద్, అవిభక్త ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    అజిత్‌ కుమార్‌.. తమిళ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరో. సికింద్రాబాద్‌లో పుట్టిన అజిత్‌.. పదోతరగతి వరకూ మాత్రమే చదువుకున్నారు. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్‌ షాలినిని 2000 సం.లో వివాహం చేసుకున్నారు. 'ఎన్‌ వీడు ఎన్‌ కనావర్‌' (1990)తో బాల నటుడిగా తెరంగేట్రం చేసిన అజిత్‌.. తెలుగు చిత్రం 'ప్రేమ పుస్తకం' (1993)తో హీరోగా మారారు. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లిన అజిత్‌.. 'వాలి' ఫిల్మ్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్‌ సంపాదించారు. బిల్లా, మన్‌కథ, వివేగం, వలిమై వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాలతో స్టార్‌ హీరోగా మారారు. అజిత్‌ తన కెరీర్‌లో 62 పైగా చిత్రాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్నారు.

    అజిత్ కుమార్ వయసు ఎంత?

    అజిత్‌ కుమార్‌ వయసు 53 సంవత్సరాలు

    అజిత్ కుమార్ ముద్దు పేరు ఏంటి?

    తలా

    అజిత్ కుమార్ అభిరుచులు ఏంటి?

    రేసింగ్, ఫొటోగ్రఫీ, రీడింగ్‌ బయోగ్రఫీస్‌

    అజిత్ కుమార్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    అసన్‌ మెమోరియల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌, చెన్నై

    అజిత్ కుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    వెట్రి దురైసామి, యాక్టర్‌ విజయ్‌

    అజిత్ కుమార్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    కెరీర్‌ తొలినాళ్లలో ప్రేమపుస్తకం(1993) అనే తెలుగులో ఫిల్మ్‌లో అజిత్‌ నటించారు. ఆ నేరుగా తెలుగు ఏ సినిమా చేయలేదు. కానీ, ఆయన నటించిన చాలా వరకూ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.

    అజిత్ కుమార్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    అజిత్ కుమార్ పెంపుడు కుక్క పేరు?

    ఏకే ప్రగదీష్‌

    అజిత్ కుమార్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    పరమేశ్వర్‌ సుబ్రమణియన్‌ (లేటు), మోహిని మణి దంపతులకు 1 మే, 1971లో అజిత్‌ కుమార్‌ జన్మించారు.

    అజిత్ కుమార్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అజిత్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. పేర్లు అనుప్‌ కుమార్‌ (స్టాక్‌ బ్రోకర్‌), అనిల్‌ కుమార్‌. అయితే అజిత్‌కు ఇద్దరు సిస్టర్లు ఉండేవారు. కానీ, వారు చిన్నప్పుడే చనిపోయారు.

    అజిత్ కుమార్ పెళ్లి ఎప్పుడు అయింది?

    ప్రముఖ నటి షాలినినిఅజిత్‌ 24 ఏప్రిల్‌, 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. షాలిని చైల్డ్ ఆర్టిస్టుగా 40కి పైగా చిత్రాల్లో చేశారు. హీరోయిన్‌గా 12 సినిమాల్లో నటించారు. ఆమె కథానాయికగా చేసిన 'సఖి' ఫిల్మ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

    అజిత్ కుమార్ కు పిల్లలు ఎంత మంది?

    అజిక్‌ ఒక పాప, బాబు ఉన్నారు. అబ్బాయి పేరు అద్విక్‌ అజిత్‌, అమ్మాయి పేరు అనౌష్క అజిత్‌.

    అజిత్ కుమార్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    1999లో వచ్చిన 'వాలి' సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ అజిత్‌ పాపులారిటీ సంపాదించారు.

    అజిత్ కుమార్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో అజిత్ కుమార్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    వాలి (1999)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అజిత్ కుమార్ తొలి చిత్రం ఏది?

    అజిత్‌ హీరోగా చేసిన వెలిమై(2022), నేర్కొండ పార్వై, విశ్వాసం, వివేగం, ఆరంభం, వీరం, తునివు, మన్‌కథ చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టాయి.

    అజిత్ కుమార్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    వాలి'లో సినిమాలో శివ/ దేవ, 'బిల్లా' మూవీలో డేవిడ్‌ బిల్లా, 'వీరం' సినిమాలో వీనాయగం, 'మన్‌కథ' సినిమాలో వినాయక్‌ మహాదేవ్‌ పాత్రలు అజిత్‌ చేసిన వాటిలో అత్యుత్తమమైనవి.

    అజిత్ కుమార్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Ajith Kumar best stage performance

    Watch on YouTube

    Ajith Kumar stage performance

    అజిత్ కుమార్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    View post on X

    Ajith Kumar best dialogues

    View post on X

    Ajith Kumar dialogues

    View post on X

    Ajith Kumar best dialogues

    నటన కాకుండా అజిత్ కుమార్ కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    రేసింగ్‌ అంటే అజిత్‌కు మహా ఇష్టం. ఖాళీ సమయాల్లో కారు, బైక్‌లపై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తుంటారు. గతంలో ఫార్ములా మారుతి ఇండియన్‌ ఛాంపియన్‌ షిప్‌ (2002), ఫార్ములా బీఎండబ్ల్యూ అసియా ఛాంపియన్‌ షిప్‌ (2003), FIA ఫార్ములా టూ ఛాంపియన్‌ షిప్‌ (2010) తదితర రేసుల్లో అజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

    అజిత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంత?

    అజిత్‌ ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్లు తీసుకుంటున్నారు.

    అజిత్ కుమార్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, హిందీ, ఇంగ్లీషు

    అజిత్ కుమార్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, గ్రే

    అజిత్ కుమార్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌, ఫుట్‌బాల్‌

    అజిత్ కుమార్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    సచిన్‌ టెండూల్కర్‌

    అజిత్ కుమార్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Car Collection BMW 740 Li Car Land Rover Discovery Mercedes Benz 350 GLS Volvo XC 90 Ferrari 458 Italia Bike Collections Kawasaki Ninja ZX 14R BMW K1300 S Aprilia Caponord 1200 BMW S1000RR

    అజిత్ కుమార్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    అజిత్‌ కుమార్‌.. ఆస్తుల విలువ రూ.196 కోట్లు ఉంటుందని సమాచారం.

    అజిత్ కుమార్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ - 2000

      వాలి (2000) - ఉత్తమ నటుడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ - 2003

      విలన్‌ (2003) - ఉత్తమ నటుడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ - 2007

      వరాలారు (2007) - ఉత్తమ నటుడు

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2001

      పూవెల్లం అన్ వాసం (2001) - స్పెషల్‌ ప్రైజ్‌

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2007

      వరాలారు (2007) - స్పెషల్‌ ప్రైజ్‌

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2007

      వరాలారు (2007) - ఉత్తమ నటుడు

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2008

      బిల్లా (2008) - ఉత్తమ నటుడు

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2012

      మన్‌కథ (2012) - ఉత్తమ విలన్‌

    అజిత్ కుమార్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ హీరా రాజగోపాల్‌కు అజిత్ ప్రపోజ్‌ చేయగా ఆమె తిరస్కరించినట్లు గతంలో రూమర్లు వచ్చాయి.

    అజిత్ కుమార్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    అజిత్‌.. చెన్నై కేంద్రంగా 'వేనూస్‌ మోటర్‌ సైకిల్స్‌' అనే స్టార్టప్‌ కంపెనీ స్టార్‌ చేశారు.

    అజిత్ కుమార్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    హవాయి చెప్పుల్స్‌, నెస్‌కేఫ్‌ కాఫీ పౌడర్‌ ప్రకటనల్లో అజిత్‌ నటించారు.

    అజిత్ కుమార్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పొలిటికల్‌గా ఏ పార్టీతో సంబంధాన్ని కలిగి లేరు.
    అజిత్ కుమార్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అజిత్ కుమార్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree