• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    అక్కినేని నాగేశ్వరరావు
    ప్రదేశం: రామపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)

    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటసామ్రాట్‌గా చెరగని ముద్ర వేసిన లెజండరీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అభిమానులు ముద్దుగా ఆయన్ను ANRగా పిలుచుకుంటారు. సినీరంగానికి దాదాపు 70 ఏళ్లు ఆయన సేవలందించారు. ధర్మపత్ని(1941) చిత్రం ద్వారా ఆయన తెరంగేట్రం చేశారు. శ్రీసీతారామ జననం(1944) చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. ఆయన సినీ జీవితంలో 250కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటులుగా కీర్తి గడించారు. ఆయన రొమాంటిక్, నాటకీయ పాత్రల్లో నటనకు ప్రసిద్ధి చెందారు. "దేవదాసు" (1953), ఇందులో భగ్న ప్రేమికుడిగా, "మాయాబజార్" (1957) అభిమన్యుగా, "లైలా మజ్ను" (1949), మరియు "ప్రేమ్ నగర్" (1971) చిత్రాల్లో విషాధ జీవితాన్ని గడిపే ప్రేమికుడిగా అలరించారు. సంక్లిష్టతతో కూడిన పాత్రలను చేసేందుకు ఆయన ఎప్పుడు ముందుండేవారు. వాటిని ANR సవాలుగా తీసుకునే వారు. ఆయన నటించిన దేవదాసు చిత్రం.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన విషాధ ప్రేమకథ చిత్రాలకు ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. Read More


    @2021 KTree