• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    అల్లు అర్జున్
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం

    ఐకానిక్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ( బన్నీ) తనదైన స్టైల్ మ్యానరిజం, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా జేజేలు అందుకుంటున్నాడు. విలక్షణమైన నటనకు అల్లు అర్జున్ పెట్టింది పేరు. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి అల్లు అరవింద్ దేశంలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. ఆయన తాతాగారు అల్లు రామలింగయ్య తెలుగులో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించారు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా రాణిస్తుండగా.. ఆయన అన్న వెంకటేష్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్‌కు స్వయాన మేనత్త.Read More


    @2021 KTree