• TFIDB EN
  • అల్లు అర్జున్
    జననం : ఏప్రిల్ 08 , 1982
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    ఐకానిక్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ( బన్నీ) తనదైన స్టైల్ మ్యానరిజం, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా జేజేలు అందుకుంటున్నాడు. విలక్షణమైన నటనకు అల్లు అర్జున్ పెట్టింది పేరు. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి అల్లు అరవింద్ దేశంలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. ఆయన తాతాగారు అల్లు రామలింగయ్య తెలుగులో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించారు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా రాణిస్తుండగా.. ఆయన అన్న వెంకటేష్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్‌కు స్వయాన మేనత్త.
    Read More

    అల్లు అర్జున్ వయసు ఎంత?

    అల్లు అర్జున్‌కి 43 వయసు

    అల్లు అర్జున్ ముద్దు పేరు ఏంటి?

    అల్లు అర్జున్ ముద్దుపేరు బన్నీ, ఐకాన్ స్టార్

    అల్లు అర్జున్ అభిరుచులు ఏంటి?

    హాబీలు చదవడం, ఫోటోగ్రఫీ, డ్రాయింగ్, పురాతన వస్తువులను సేకరించడం

    అల్లు అర్జున్ ఏం చదువుకున్నారు?

    అల్లు తన పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ నుండి పూర్తి చేసాడు మరియు తరువాత తన BBA డిగ్రీని హైదరాబాద్ MSR కళాశాల నుండి అభ్యసించాడు.

    అల్లు అర్జున్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. హైదరాబాద్‌లో MSR కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు.

    అల్లు అర్జున్ In Sun Glasses

    Images

    Allu Arjun Pics

    Images

    Stylish Star Allu Arjun

    అల్లు అర్జున్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Allu Arjun

    త్రివిక్రమ్ హిట్ చిత్రాలుEditorial List
    త్రివిక్రమ్ హిట్ చిత్రాలు
    త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల జాబితా ఇదేEditorial List
    త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల జాబితా ఇదే
    క్రిష్ జాగర్లమూడి హిట్  సినిమాల జాబితాEditorial List
    క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా

    అల్లు అర్జున్ పెంపుడు కుక్క పేరు?

    అల్లు అర్జున్ పెంపుడు కుక్క పేరు కజోకు

    అల్లు అర్జున్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    అల్లు అర్జున్ తల్లిదండ్రులు అల్లు అరవింద్ మరియు నిర్మల మరియు అతని భార్య స్నేహారెడ్డి.అతని సోదరుడి పేరు అల్లు శిరీష్

    అల్లు అర్జున్ Family Pictures

    Images

    Allu Arjun's Son

    Images

    Allu Arjun with his daughter Allu Arha

    అల్లు అర్జున్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేశాడు.

    నటన కాకుండా అల్లు అర్జున్ కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    అల్లు అర్జున్ నిర్మాత కూడా. నిర్మాణ సంస్థ పేరు అల్లు స్టూడియో

    అల్లు అర్జున్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    అల్లు అర్జున్ ఇష్టమైన పర్యాటక ప్రదేశాలు ఉత్తరాఖండ్, లండన్, మాల్దీవులు, దుబాయ్

    అల్లు అర్జున్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అల్లు అర్జున్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అల్లు అర్జున్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree