
అనిల్ కపూర్
ప్రదేశం: బొంబాయి, బొంబాయి రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత మహారాష్ట్ర)
అనిల్ కపూర్ ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత, అతను టెలివిజన్ మరియు అంతర్జాతీయ చలనచిత్రాలు మరియు టెలివిజన్‌తో పాటు ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేస్తున్నాడు. నటుడిగా మరియు 2005 నుండి నిర్మాతగా 40 సంవత్సరాలకు పైగా కెరీర్‌లో కపూర్ కనిపించారు. 100 కంటే ఎక్కువ చిత్రాలలో. బహుళ దిగ్గజ, ప్రసిద్ధ మరియు కల్ట్ చిత్రాలకు గుర్తింపు పొందారు, అతను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు.
కథనాలు

Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
నటీనటులు : నిఖిల్, దివ్యాంన్ష కౌషిక్, సత్య, అజయ్, సాయిరామ్ రెడ్డి, రుక్మిణి వసంత్, హర్ష చెముడు తదితరులు
రచన, డైరెక్టర్ : సుధీర్ వర్మ
సంగీతం: కార్తిక్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్ బ్రేకప్ అవుతుంది. లవ్ ఫెయిల్ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్ డాన్ బద్రినారాయణ (జాన్ విజయ్) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review)
ఎవరెలా చేశారంటే
హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్, గ్లామర్ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్ సీక్వెన్స్ మరింత మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా ..
టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నిఖిల్ నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
పేలవమైన స్టోరీబోరింగ్ లవ్‌ట్రాక్స్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2/5
నవంబర్ 08 , 2024
Appudo Ippudo Eppudo OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న నిఖిల్ ప్లాప్ చిత్రం.. కారణం ఏంటంటే?
యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo OTT). సుధీర్ వర్మ (Sudhir Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిఖిల్ జోడీగా రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth), దివ్యాంశ కౌషిక్ (Divyansha Kaushik) నటించారు. నవంబర్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో 20 రోజుల వ్యవధిలోనే మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని ఈ చిత్రం ఓటీటీ మాత్రం అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సహా, అంతా షాకవుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్‌లో నిఖిల్ చిత్రం..
నిఖిల్ హీరోగా చేసిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' నవంబర్ 27న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోకపోవడంతో ఓటీటీ రిలీజ్‌కు ముందు పెద్దగా హడావిడి జరగలేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రానికి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ నిమిషాలు పెరుగుతున్నట్లు ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్‌లో దేశంలోనే తొలిస్థానంలో నిఖిల్ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా అమెజాన్ వర్గాలు ప్రకటించాయి. దీంతో మూవీ టీమ్‌తో నిఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/baraju_SuperHit/status/1862098192877437096
ఓటీటీలో ఆదరణ ఎందుకంటే
నిఖిల్ లేటెస్ట్ చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo OTT) యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే థియేటర్లలో రిలీజ్‌కు ముందు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. పైగా కరోనా కాలంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు పదే పదే చిత్ర బృందం చెప్పడం కూడా సినిమాను చూడాలన్న కోరికను సన్నగిల్లేలా చేసింది. దీంతో థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఎవరు ఆసక్తి కనబరచలేదు. ఓటీటీలోకి వచ్చాక చూడచ్చులే అని అంతా భావించారు. రీసెంట్‌గా ఓటీటీలోకి రావడంతో యూత్ అంతా ఈ సినిమా చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ‘లక్కీ భాస్కర్’, ‘క’ చిత్రాలను అల్రెడీ థియేటర్లలో చూసిన నేపథ్యంలో ఓటీటీలో తమ తొలి ప్రాధాన్యతను 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'కి ఇచ్చారు. దీంతో నిఖిల్ చిత్రం ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది.
సినిమా చూడొచ్చా!
దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్ స్టోరీ (Appudo Ippudo Eppudo OTT)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. కానీ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తన మార్క్ చూపించాడు. మూడో వ్యక్తి (కమెడియన్ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్స్ బోరింగ్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. హీరో పరిచయం, అతడి పసలేని లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్ పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్ సీక్వెన్స్ మరింత మైనస్‌గా మారాయి.
కథేంటి
హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్ బ్రేకప్ అవుతుంది. లవ్ ఫెయిల్ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్ డాన్ బద్రినారాయణ (జాన్ విజయ్) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది స్టోరీ.
నవంబర్ 29 , 2024
NTR 31: తారక్ - నీల్ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్? తెలిస్తే షాకే!
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR), దేవర (Devara) సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. గతేడాది ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. పెద్దగా అప్‌డేట్స్ సైతం ఈ మూవీ నుంచి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘NTR 31’కు సంబంధించి సాలిడ్ బజ్ ఒకటి బయటకొచ్చింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
సెట్స్‌పైకి ఎప్పుడంటే?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలోని ‘NTR 31’ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న షూటింగ్ ప్రారంభ తేదీ ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 16 నుంచి తారక్ కొత్త సినిమా షూట్ మెుదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళూరులో తొలి షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు టాక్. ఇదిలా ఉంటే 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనుంది.
https://twitter.com/MilagroMovies/status/1833886827347894449
‘వార్ 2’ ఫినిష్ కాకుండానే..
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ హీరోగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ చిత్రంలో తారక్ నటిస్తున్నారు. ఆ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన షూట్ ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ‘వార్ 2’లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పూర్తిగా ‘NTR 31’పై ఫోకస్ పెట్టాలని ఎన్టీఆర్ భావించారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ‘వార్ 2’ ఫినిష్ కాకుండానే నీల్‌తో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నాడు తారక్. అయితే మంగళూరులో జరిగే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో తారక్ పాల్గొనడని తెలుస్తోంది. అతడు వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం.
బిగ్ క్యాస్ట్ లాక్?
‘NTR 31’ చిత్రానికి ‘డ్రాగన్’ అనే సాలిడ్ టైటిల్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్‌కు తగ్గట్లే స్టార్ క్యాస్ట్‌ను సైతం ఆయన ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas)ను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు అదే ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు బీజు మీనన్ (Biju Meenon) సైతం ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ‘NTR 31’ అంచనాలు అమాంతం పెరగడం ఖాయమని చెప్పవచ్చు. కాగా, ఈ సినిమాలో తారక్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించనున్నట్లు గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/KonaseemaNTRFC/status/1876221038289354811
రూ.300 కోట్ల ఖర్చుతో..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. ఇక సినిమాలోని ఇతర నటీనటులు, షూటింగ్ వివరాలపై రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
జనవరి 06 , 2025
This Week Telugu Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఈ వారం చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వచ్చే వారం 'పుష్ప 2' (Pushpa 2) రిలీజ్ ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలేవి ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు. అటు ఓటీటీలో రీసెంట్ సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వెబ్‌సిరీస్‌లు సైతం అలరించేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. (This Week Telugu Movies)
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ వారమే రిలీజ్ కాబోతోంది. నవంబర్ 28న తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
మిస్ యూ (Miss You)
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (Siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా చేసిన తాజా తమిళ చిత్రం ‘మిస్ యూ’ (Miss You). ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ జానర్లలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.
భైరతి రణగల్ (Bhairathi Ranagal)
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Sivaraj Kumar) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరతి రణగల్’. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నవంబరు 29 (This Week Telugu Movies)న విడుదల కానుంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
క (Ka)
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం 'క' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం వారమే (This Week Telugu Movies) ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)
దుల్కర్ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ సైతం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్ నిలిచింది.
TitleCategoryLanguagePlatformRelease DateBloody BeggarMovieTelugu/TamilAmazonNov 29Sikandar Ka MuqaddarMovieHindiNetflixNov 29The TrunkMovieKoreanNetflixNov 29Our Little SecretMovieEnglishNetflixNov 27Find Me In ParisMovieEnglishNetflixNov 28The Snow SisterMovieEnglishNetflixNov 29The MadnessMovieEnglishNetflixNov 28ParachuteSeriesTelugu/TamilNetflixNov 29VikatakaviSeriesTeluguZee 5Nov 28Divorce Ke Liye Kuch Bhi KaregaSeriesHindiZee 5Nov 29Krishnam Pranaya SakhiMovieTelugu/ KannadaSunNXTNov 29
నవంబర్ 25 , 2024

క్రూ
29 మార్చి 2024 న విడుదలైంది

యానిమల్
01 డిసెంబర్ 2023 న విడుదలైంది

వంశ వృక్షం
20 నవంబర్ 1980 న విడుదలైంది
అనిల్ కపూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనిల్ కపూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.