• TFIDB EN
  • అనిల్ రావిపూడి
    జననం : నవంబర్ 23 , 1982
    ప్రదేశం: ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    అనిల్ రావిపూడి ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు తెలుగు చిత్రసీమలో పనిచేసే స్క్రీన్ రైటర్.
    కథనాలు
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి! యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.  అసలేం జరిగిందంటే? దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్‌ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్‌ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.  https://twitter.com/i/status/1785936991726743773 మండిపడుతున్న ఫ్యాన్స్ అనిల్‌ రావిపూడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగానే బదులిస్తున్నారు.  అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్‌ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్‌ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు.  ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్‌ డేట్‌ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్‌ డే? జానర్‌? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1785935511531511969
    మే 02 , 2024
    పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ వచ్చినా… అది మాత్రం చేయను: ప్రియాంక జవాల్కర్]అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.
    ఫిబ్రవరి 13 , 2023
    Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్ విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బిమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతి వాతావరణాన్ని తెచ్చిన బ్లాక్‌బస్టర్ పొంగల్ ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ పాటలో పండుగ వాతావరణాన్ని పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పక్కా కుటుంబ వినోదాన్ని మేళవించి రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలో వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గ స్టెప్పులతో హోరెత్తించారు. ముఖ్యంగా బ్లాక్‌ బాస్టర్‌ సాంగ్‌కు వెంకటేష్ గాత్రం బాగా సెట్‌ అయిందని చెప్పొచ్చు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. భీమ్స్ సంగీతం పాటకు కొత్త జీవం పోసింది. వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విడుదలైన గంటలోనే 5 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. https://youtu.be/S8NDIJBbd3Q?si=5dVR3Nt755rxX_v9 వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినందున, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాల విజయాలతో అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకా సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పక్కా కుటుంబ కథ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా పండుగ సినిమా. ఈ చిత్రంలోని వినోదం, సంగీతం, కథ అన్నీ కుటుంబ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్ చేస్తున్న పాత్ర, ఆయన అల్లరి ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. పండుగ సీజన్‌లో కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
    డిసెంబర్ 30 , 2024
    Sankranthiki vasthunnam Trailer: పెరిగిన అంచనాలు… సంక్రాంతి విన్నర్ పక్కా! టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో, ఐశ్వర్య రాజేశ్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో మరింత వేగాన్ని చూపిస్తున్నారు. ట్రైలర్ అప్‌డేట్ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదల కానుందని తెలుస్తోంది. పక్కా వినోదాత్మకంగా ఉండే ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనుంది. అయితే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ట్రైలర్‌పై అంచనాలు పెరిగాయి. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో విన్నర్ అయ్యే అవకాశం ఉందని వెంకీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సినిమా విశేషాలు ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, వెంకటేశ్ స్వయంగా “బ్లాక్‌బస్టర్ పొంగల్” పాటను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అంతేకాకుండా, "గోదారి గట్టు మీద" మరియు "బావా" పాటలు ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రతి పాట ఒకదాన్ని మించిన హిట్‌గా నిలవడం ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ వెంకటేశ్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి తన గత సినిమాల విజయాలతో కుటుంబ కథా చిత్రాలను రూపొందించడంలో తాను ప్రత్యేకమైన దర్శకుడని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం కూడా ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. Blockbuster Pongal పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” పక్కా పండుగ కోసం రూపొందించిన సినిమా. వినోదం, కథ, సంగీతం అన్నీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలిచారు. వెంకటేశ్ చేస్తున్న పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలకానుంది.
    జనవరి 02 , 2025

    అనిల్ రావిపూడి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనిల్ రావిపూడి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree