

అనుష్క శెట్టి
జననం : నవంబర్ 07 , 1981
ప్రదేశం: మంగుళూరు, కర్ణాటక, భారతదేశం
అనుష్క శెట్టి ప్రముఖ తెలుగు సినిమా నటి. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసేది. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
అనుష్క శెట్టి వయసు ఎంత?
43 ఏళ్లు
అనుష్క శెట్టి ముద్దు పేరు ఏంటి?
స్వీటి
అనుష్క శెట్టి ఎత్తు ఎంత?
5' 9'' (175 cm)
అనుష్క శెట్టి అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, యోగా, గార్డెనింగ్
అనుష్క శెట్టి ఏం చదువుకున్నారు?
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
యోగా ట్రైనర్‌గా పనిచేసేది
అనుష్క శెట్టి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు
అనుష్క శెట్టి ఫిగర్ మెజర్‌మెంట్స్?
34-30-36
అనుష్క శెట్టి Hot Pics
అనుష్క శెట్టి In Saree
అనుష్క శెట్టి In Bikini
అనుష్క శెట్టి In Ethnic Dress
అనుష్క శెట్టి With Pet Dogs
అనుష్క శెట్టి అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్

Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు

ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
- Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్ - అనుష్క జోడి.. ఎందుకంటే?టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే వీరి పెళ్లికి సంబంధించి వార్తలు సైతం షికారు చేశాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. అటు స్వీటీ సైతం ‘ఘాటీ’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం (నవంబర్ 8) అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని ఘాటీ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చింది. అయితే ఈ రెండు పోస్టర్లు సిమిలర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నోటిలో సిగార్‌తో.. అనుష్క శెట్టి ఫీమేల్ లీడ్‌గా 'ఘాటి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో అనుష్క చాలా డిఫరెంట్‌గా కనిపించింది. ముఖంపై రక్తంతో సిగార్ తాగుతూ ఆ పొగ మధ్యలో కనిపించింది. ఇటీవల వచ్చిన రాజాసాబ్ పోస్టర్లోనూ ప్రభాస్ ఈ తరహా గెటప్‌లోనే కనిపించడం గమనార్హం. అనుష్క తరహాలోనే నోట్లో సిగార్ పెట్టుకొని కనిపించాడు. స్మోకీ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇద్దరూ సిగార్ తాగుతూ పోస్టర్లో కనిపించడంతో ఆ పోస్టర్లు పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ ట్యాగ్లు ఇస్తున్నారు అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/subhaashiniii/status/1854377730575397055 కసిగా తల తెంపిన అనుష్క గురువారం ఉదయం 'ఘాటి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అదే రోజు సాయంత్ర సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా చాలా వైలెంట్‌గా స్వీటిని చూపించారు. అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని, అది కూడా బస్ మిర్రర్లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా సిగార్ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. అది తాగే సమయంలో అనుష్క చేతుల నిండా రక్తం ఉంటుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది. https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls స్వీటీ ఆశలన్నీ 'ఘాటి' పైనే! ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది ఆమె స్థాయికి తగ్గ హిట్ మాత్రం కాదు. దీంతో ఇండస్ట్రీలో తిరిగి నిలదొక్కుకోవాలంటే 'ఘాటి' సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరోవైపు దర్శకుడు క్రిష్‌కు సైతం ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఇటీవల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ చేజారడంతో ఘాటీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. నవంబర్ 08 , 2024
- HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది. యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట. దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సి వచ్చిందట. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు. అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది. రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్ చేసింది. ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట. ‘సైజ్ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్ మిస్టేక్ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది. సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్ క్రష్ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది. సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది. 'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది. ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. వాస్తవానికి అరుంధతి ఆఫర్ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్స్‌తో ఓ బుక్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్ వెయిల్ లాస్ పిల్' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్ చేసింది. 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి. అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్ తాగుతూ కనిపించింది. సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు. https://www.youtube.com/watch?v=W5FkYULk3Lsనవంబర్ 07 , 2024
- Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా! టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లి టాపిక్ చాలా సార్లు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్ హీరోయిన్స్ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే? ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్ తర్వాత యావత్ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది. మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్ ప్రభాస్ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ‘ఫౌజీ’ షూట్లో ప్రభాస్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ తాజాగా ఈ మూవీ షూట్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్ మలయాల భామ నమిత ప్రమోద్ కూడా సెకండ్ ఫీమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది. పీరియాడికల్ లవ్ స్టోరీ! ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్‌తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. అక్టోబర్ 26 , 2024

అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అనుష్క శెట్టి తెలుగులో సూపర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అంచెలంచెలుగా ఎదిగి లెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసేది. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన అనుష్క శెట్టి(Some Lesser Known Facts Anushka shetty)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అనుష్క శెట్టి ముద్దు పేరు?
స్వీటి
అనుష్క శెట్టి వయస్సు ఎంత?
1981, నవంబర్ 7న జన్మించింది
అనుష్క శెట్టి బిరుదు?
లెడీ సూపర్ స్టార్
అనుష్క శెట్టి తెలుగులో నటించిన తొలి సినిమా?
సూపర్ (2005)
అనుష్క శెట్టి ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
అనుష్క శెట్టి ఎక్కడ పుట్టింది?
పుత్తూర్, కర్ణాటక
అనుష్క శెట్టి ఉండేది ఎక్కడ?
హైదరాబాద్
అనుష్క శెట్టి ఏం చదివింది?
డిగ్రీ
అనుష్క శెట్టి అభిరుచులు?
ట్రావెలింగ్, యోగా, గార్డెనింగ్
అనుష్క శెట్టికి ఇష్టమైన ఆహారం?
బిర్యాని, చికెన్ కర్రీ
అనుష్క శెట్టికి ఇష్టమైన కలర్ ?
బ్యాక్, వైట్
అనుష్క శెట్టికి ఇష్టమైన ప్రదేశం
లండన్
అనుష్క శెట్టికి ఇష్టమైన హీరో?
అక్కినేని నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు
అనుష్క శెట్టికి ఇష్టమైన హీరోయిన్?
జ్యోతిక
అనుష్క శెట్టి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
అనుష్క శెట్టి తల్లిదండ్రుల పేరు?
A.N విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి
అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
యోగా ట్రైనర్‌గా పనిచేసేది
అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/anushkashettyofficial/
అనుష్క శెట్టికి ఎన్ని అవార్డులు వచ్చాయి?
అరుంధతి, రుద్రమదేవి చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డును, సైజ్ జీరో, అరుంధతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. బాహుబలి-2 చిత్రానికి గాను బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అందుకుంది.
అనుష్క శెట్టి నికర ఆస్తుల విలువ?
రూ.100కోట్లు
https://www.youtube.com/watch?v=PuExPz-K09U
ఏప్రిల్ 29 , 2024
HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు.
అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది.
యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.
దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సి వచ్చిందట.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు.
అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది.
అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.
రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్ చేసింది.
ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట.
‘సైజ్ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్ మిస్టేక్ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.
సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్ క్రష్ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది.
'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.
ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
వాస్తవానికి అరుంధతి ఆఫర్ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు.
అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్స్‌తో ఓ బుక్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్ వెయిల్ లాస్ పిల్' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్ చేసింది. 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్ తాగుతూ కనిపించింది.
సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
నవంబర్ 07 , 2024
Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్
డైరెక్టర్ - పీ మహేష్ బాబు
నిర్మాత - ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి
బ్యానర్ - UV క్రియేషన్స్
సంగీతం - రధన్
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం..
కథేంటంటే..?
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్.
ఎలా ఉందంటే?
రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.
ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది. ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్’గా ఉన్నాయి.
ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు.
బలాలు
నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు
బలహీనతలు
సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు
టెక్నికల్ పరంగా..
ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి.
చివరగా..
రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది.
రేటింగ్
4/5
సెప్టెంబర్ 07 , 2023
Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!
టాలీవుడ్ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్ హీరో నవీన్‌కు జతగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
వైవిధ్యమైన ప్రేమ కథ
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.
అనుష్క.. గ్రేట్ కమ్‌బ్యాక్!
ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్ సైతం ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
ఆగస్టు 22 , 2023

విక్రమార్కుడు
యాక్షన్ , హాస్యం
07 సెప్టెంబర్ 2023 న విడుదలైంది
.jpeg)
డాన్
యాక్షన్
02 అక్టోబర్ 2020 న విడుదలైంది
.jpeg)
అరుంధతి
హారర్ , థ్రిల్లర్
02 అక్టోబర్ 2019 న విడుదలైంది

యముడు
యాక్షన్ , డ్రామా
26 జనవరి 2018 న విడుదలైంది
.jpeg)
వేదం
డ్రామా
28 ఏప్రిల్ 2017 న విడుదలైంది

బాహుబలి: ది బిగినింగ్
యాక్షన్ , డ్రామా , హిస్టరీ
10 ఫిబ్రవరి 2017 న విడుదలైంది

బాహుబలి 2: ది కన్‌క్లూజన్
యాక్షన్ , డ్రామా , ఫాంటసీ
09 ఫిబ్రవరి 2017 న విడుదలైంది
.jpeg)
మిర్చి
యాక్షన్
25 మార్చి 2016 న విడుదలైంది

భాగమతి
హారర్ , థ్రిల్లర్
27 నవంబర్ 2015 న విడుదలైంది

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
హాస్యం , రొమాన్స్
09 అక్టోబర్ 2015 న విడుదలైంది

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
07 సెప్టెంబర్ 2023 న విడుదలైంది

నిశ్శబ్దం
02 అక్టోబర్ 2020 న విడుదలైంది

సైరా నరసింహా రెడ్డి
02 అక్టోబర్ 2019 న విడుదలైంది

భాగమతి
26 జనవరి 2018 న విడుదలైంది

బాహుబలి 2: ది కన్‌క్లూజన్
28 ఏప్రిల్ 2017 న విడుదలైంది

ఓం నమో వేంకటేశాయ
10 ఫిబ్రవరి 2017 న విడుదలైంది
.jpeg)
యముడు 3
09 ఫిబ్రవరి 2017 న విడుదలైంది

ఊపిరి
25 మార్చి 2016 న విడుదలైంది
.jpeg)
సైజ్ జీరో
27 నవంబర్ 2015 న విడుదలైంది
.jpeg)
రుద్రమదేవి
09 అక్టోబర్ 2015 న విడుదలైంది

బాహుబలి: ది బిగినింగ్
10 జూలై 2015 న విడుదలైంది

ఎంతవాడు గాని
05 ఫిబ్రవరి 2015 న విడుదలైంది
అనుష్క శెట్టి పెంపుడు కుక్క పేరు?
మ్యాక్
అనుష్క శెట్టి తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
A.N విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి ,ఇద్దరు సోదరులు ఉన్నారు. వారి పేర్లు గుణరాజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి.
అనుష్క శెట్టి ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
అరుంధతిసినిమా
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో అనుష్క శెట్టి ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అనుష్క శెట్టి తొలి చిత్రం ఏది?
అనుష్క శెట్టి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బాహుబలిలో దేవసేన పాత్ర
అనుష్క శెట్టి బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Stage Performance
అనుష్క శెట్టి బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Dialogue
అనుష్క శెట్టి కు ఇష్టమైన ఆహారం ఏంటి?
బిర్యాని, చికెన్ కర్రీ
అనుష్క శెట్టి కు ఇష్టమైన నటుడు ఎవరు?
అనుష్క శెట్టి కు ఇష్టమైన నటి ఎవరు?
అనుష్క శెట్టి ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ
అనుష్క శెట్టి ఫేవరేట్ కలర్ ఏంటి?
నలుపు, తెలుపు
అనుష్క శెట్టి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
లండన్
అనుష్క శెట్టి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
BMW 6, Audi Q5, Audi A6, Toyota Corolla Altis
అనుష్క శెట్టి ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా
అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
68 లక్షలు
అనుష్క శెట్టి సోషల్ మీడియా లింక్స్
అనుష్క శెట్టి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
అరుంధతి, రుద్రమదేవి చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డును, సైజ్ జీరో, అరుంధతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. బాహుబలి-2 చిత్రానికి గాను బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అందుకుంది.
అనుష్క శెట్టిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
ప్రభాస్ - అనుష్క రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వినిపించాయి.
అనుష్క శెట్టి కు సంబంధించిన వివాదాలు?
2011లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు అనుష్క ఇంట్లో సోదాలు చేయడం వివాదాస్పదంగా మారింది.
అనుష్క శెట్టి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
హెడ్ & షోల్డర్ షాంపు, డాబర్ ఆమ్లా, కోల్‌గేట్ యాక్టివ్ సాల్ట్ ప్రకటనల్లో అనుష్క నటించింది.
అనుష్క శెట్టి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనుష్క శెట్టి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.