• TFIDB EN
  • బాపు
    జననం : డిసెంబర్ 15 , 1933
    ప్రదేశం: నరసాపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా(ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో)
    బాపు తెలుగు సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గీత గీసినా, మాట రాసినా తెలుగు వారి సంస్కృతిలో భాగమయ్యాయి. ఆయన వేసిన బొమ్మలు, కార్టూనులు, పుస్తకాల ముఖ చిత్రాలు బోలెడు. చలన చిత్ర రంగంలో బాపు అసమాన ప్రతిభ చూపారు. సాక్షి(1967) చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సీతాకళ్యాణం, శ్రీరామరాజ్యం, రాంబంటు, సుందరకాండ, రాధా గోపాళం, మిష్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు వంటి క్లాసిక్ మూవీలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా (స్టోరీబోర్డు) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవాడు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవాడు. మిష్టర్ పెళ్లాం, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, శ్రీరామ రాజ్యం చిత్రాలకు నంది పురస్కారాలు లభించాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
    బాపు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే బాపు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree