• TFIDB EN
  • బాబీ డియోల్
    ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
    బాబీ డియోల్‌ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు. 1969 జనవరి 27న బొంబాయిలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు చిన్న కుమారుడు. ధరమ్ వీర్ (1977)తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. బర్సాత్ (1995) సినిమాతో హీరోగా మారాడు. అప్నే (2007), యమ్లా పగ్లా దీవానా (2011), రేస్ 3 (2018), హౌస్‌ఫుల్ 4 (2019) వంటి కమర్షియల్‌ చిత్రాలతో స్టార్‌గా మారాడు. యానిమల్‌ (2024) చిత్రంలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

    బాబీ డియోల్ వయసు ఎంత?

    బాబీ డియోల్‌ 55 సంవత్సరాలు

    బాబీ డియోల్ ముద్దు పేరు ఏంటి?

    బాబీ

    బాబీ డియోల్ ఎత్తు ఎంత?

    5' 11'' (180 cm)

    బాబీ డియోల్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, జిమ్‌

    బాబీ డియోల్ ఏం చదువుకున్నారు?

    బీకాం

    బాబీ డియోల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    మిథిబాయ్‌ కాలేజ్‌, ముంబయి

    బాబీ డియోల్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బాలీవుడ్‌ హీరోయిన్స్‌ నీలం కొత్తారి, ప్రియ చత్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    బాబీ డియోల్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    బాబీ డియోల్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    బాబీ డియోల్ In Sun Glasses

    బాబీ డియోల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    బాబీ డియోల్ తల్లిదండ్రులు ఎవరు?

    ధర్మేంద్ర, ప్రకాష్‌ కౌర్‌ (మెుదటి భార్య) దంపతులకు 1969 జనవరి 27 బాబీ డియోల్‌ జన్మించాడు.

    బాబీ డియోల్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    బాబీ డియోల్‌ తండ్రి ధర్మేంద్ర బాలీవుడ్‌ దిగ్గజ నటుడు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు 'యాక్షన్ కింగ్', 'హీ మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ధర్మేంద్ర పనిచేశారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

    బాబీ డియోల్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌.. బాబీకి సోదరుడు అవుతాడు. అలాగే విజయత డియోల్‌, అజిత డియోల్‌ అనే ఇద్దరు సిస్టర్స్‌ కూడా ఉన్నారు. ఇషా డియల్‌, అహనా డియోల్‌ సవతి సిస్టర్స్ అవుతారు. బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ కజిన్‌ అవుతాడు.

    బాబీ డియోల్ పెళ్లి ఎప్పుడు అయింది?

    తన్యా అహుజాను 1996లో బాబీ డియోల్‌ వివాహం చేసుకున్నాడు.

    బాబీ డియోల్ కు పిల్లలు ఎంత మంది?

    ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఆర్యమన్‌ డియోల్‌, ధరమ్‌ డియోల్‌.

    బాబీ డియోల్ Family Pictures

    బాబీ డియోల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    యానిమల్‌(2024) చిత్రంలో విలన్‌గా నటించి తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు.

    బాబీ డియోల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నేరుగా ఏ సినిమా చేయలేదు. యానిమల్‌(2024)తో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. తెలుగులో హరిహర వీరమల్లు, NBK109 చిత్రాల్లో నటిస్తున్నాడు.

    తెలుగులో బాబీ డియోల్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    బర్సత్‌ (1995)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన బాబీ డియోల్ తొలి చిత్రం ఏది?

    బాబీ డియోల్‌ నటించిన 'యానిమల్‌', 'హౌస్‌ఫుల్‌ 4', 'టాంగో చార్లీ' చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

    బాబీ డియోల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    యానిమల్‌ చిత్రంలోని అబ్రార్‌ హక్‌ పాత్ర బాబీ డియోల్‌ కెరీర్‌లో అత్యుత్తమమైనది.

    బాబీ డియోల్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    బాబీ డియోల్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    బాబీ డియోల్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.4-5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    బాబీ డియోల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    బాబీ డియోల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    బాబీ డియోల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    బాబీ డియోల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    బాబీ డియోల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    బాబీ డియోల్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    సచిన్‌ టెండూల్కర్‌

    బాబీ డియోల్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Porsche Cayenne • Land Rover Freelander 2 • Lamborghini Murcielago LP640 • Porsche 911 • Carrera 4S

    బాబీ డియోల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    బాబీ డియోల్‌ ఆస్తుల విలువ రూ.66 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

    బాబీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    బాబీ డియోల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    బాబీ డియోల్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పొలిటికల్‌గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేదు. అయితే అతడి సవతి తల్లి హేమా మాలని భాజపా తరపున ఎంపీగా ఉన్నారు.
    బాబీ డియోల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే బాబీ డియోల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree