• TFIDB EN
  • చమ్మక్ చంద్ర
    ప్రదేశం: భారతదేశం
    చమ్మక్ చంద్ర భారతీయ హాస్యనటుడు మరియు నటుడు. జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించారు. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వెంకటాపూర్‌లో జన్మించారు. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘జై’తో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం హాస్యనటులు ధనరాజ్, వేణుతో కలిసి స్కిట్‌లు ప్రదర్శించారు. ఈ క్రమంలో మల్లెమాల నిర్మాత దృష్టిని ఆకర్షించి జబర్దస్త్ కామెడీ షోలో నటించే అవకాశాన్ని పొందారు. తమిళ చిత్రం సెయల్‌లో నటించి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.


    @2021 KTree