• TFIDB EN
  • చాందిని చౌదరి
    ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    పదహారనాళ్ల తెలుగు అందం చాందిని చౌదరి. నటనపై మక్కువతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మధురం సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ కుందనపు బొమ్మ.. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


    @2021 KTree